ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంతపని చేశారు?
చెన్నై: మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తామని పిలిచి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఝలక్ ఇచ్చారు. ఆ ఫోన్ వ్యక్తిని పిలిపించి ఫోన్ లాక్కొని పారిపోయారు. చివరకు పోలీసులు వారిని వెంబడించి అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రంజిత్ కుమార్ అనే వ్యక్తి రూ.40 వేలు విలువ చేసే తన స్యామ్‌సంగ్ ఎస్7 ఎడ్జ్ ఫోన్‌ను ఆన్‌లైన్ పోర్టల్‌లో అమ్మకానికి పెట్టాడు.
అయితే, మనోజ్(అలియాస్ ప్రెడెరిక్), మోతిస్వరణ్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఆ ఫోన్‌ను కొంటామని చెప్పారు. రంజిత్‌ను మాధవరం అనే ప్రాంతంలోని ఓ పార్క్ వద్దకు రమ్మని కోరారు. అతడు అక్కడికి వచ్చి వారికోసం ఎదురుచూస్తుండగా దగ్గరకు వచ్చి ఫోన్ వివరాలు అడుగుతున్నట్లుగా నటించి అనూహ్యంగా ఫోన్ లాక్కోని బైక్ పరారయ్యారు. దీంతో అవాక్కయిన రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని చివరకు అరెస్టు చేశారు.