snatch
-
ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంతపని చేశారు?
చెన్నై: మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తామని పిలిచి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఝలక్ ఇచ్చారు. ఆ ఫోన్ వ్యక్తిని పిలిపించి ఫోన్ లాక్కొని పారిపోయారు. చివరకు పోలీసులు వారిని వెంబడించి అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రంజిత్ కుమార్ అనే వ్యక్తి రూ.40 వేలు విలువ చేసే తన స్యామ్సంగ్ ఎస్7 ఎడ్జ్ ఫోన్‌ను ఆన్లైన్ పోర్టల్‌లో అమ్మకానికి పెట్టాడు. అయితే, మనోజ్(అలియాస్ ప్రెడెరిక్), మోతిస్వరణ్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఆ ఫోన్‌ను కొంటామని చెప్పారు. రంజిత్‌ను మాధవరం అనే ప్రాంతంలోని ఓ పార్క్ వద్దకు రమ్మని కోరారు. అతడు అక్కడికి వచ్చి వారికోసం ఎదురుచూస్తుండగా దగ్గరకు వచ్చి ఫోన్ వివరాలు అడుగుతున్నట్లుగా నటించి అనూహ్యంగా ఫోన్ లాక్కోని బైక్ పరారయ్యారు. దీంతో అవాక్కయిన రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని చివరకు అరెస్టు చేశారు. -
పావనికి మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ కేవీఎల్ పావని కుమారి మూడు పతకాలను సాధించింది. పట్నాలో జరుగుతున్న ఈ పోటీల్లో పావని 44 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. స్నాచ్ (53 కేజీలు), ఓవరాల్ (116 కేజీలు) విభాగాల్లో రజతాలు నెగ్గిన పావని... జెర్క్ (63 కేజీలు)లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
మహిళా ఏఎస్ఐ గొలుసునే తెంపేశారు
కోల్‌కతా: గొలుసు దొంగల ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. ఈ చైన్ స్నాచర్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. మమతా బెనర్జీ లాంటి ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రులున్న కోల్‌కతాలో కూడా రెచ్చిపోతున్నారు. సామాన్య మహిళలతో పాటూ, మహిళా పోలీసులను టార్గెట్ చేశారు. ఏకంగా ఓ మహిళా ఏఎస్ఐ గొలుసునే తెంపుకెళ్లిపోయారు. కోల్‌కతాలోని తిల్జాలా పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా ఏఎస్ఐ నిర్మలారాయ్ విధులు నిర్వర్తించుకుని ఇంటికి తిరిగెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. పిక్నిక్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కచ్చితంగా ఎవరో స్థానికులే చేసి ఉంటారని నిర్మల తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. లాల్ బజార్ నేర పరిశోధక విభాగం దీనిపై దృష్టి పెట్టింది. పాత నేరస్తుల వివరాలను సేకరిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదిస్తామని తెలిపారు. బైక్ వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.