ఎంసెట్ కౌన్సెలింగ్పై అందరికీ ఆందోళన | students and parents worrying on eamcet counselling, says shabbir ali | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సెలింగ్పై అందరికీ ఆందోళన

Published Thu, Jul 31 2014 12:53 PM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

ఎంసెట్ కౌన్సెలింగ్పై అందరికీ ఆందోళన

ఎంసెట్ కౌన్సెలింగ్పై అందరికీ ఆందోళన

ఎంసెట్ కౌన్సెలింగ్‌పై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు  ఆందోళనలో ఉన్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ విద్యార్థులను కౌన్సెలింగ్లో పాల్గొనవద్దన్న మంత్రి జగదీశ్‌ రెడ్డి, వారికి కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కౌన్సెలింగ్‌లో మెరిట్ సీట్లన్నీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వెళ్లిపోతే తెలంగాణ విద్యార్థులు నష్టపోరా అని ఆయన అన్నారు.

దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించడం తొందరపాటు చర్యేనన్నారు. పాకిస్తాన్, ఇండియా దేశాధినేతలే కలిసి కూర్చొని సమస్యలు పరిష్కరించుకుంటున్నారని, అలాంటప్పుడు కేసీఆర్, చంద్రబాబు ఉమ్మడి సమస్యలపై ఎందుకు చర్చించుకోరని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. విద్యార్థులు, ప్రజల బాధలు చూసైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుని ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement