eamcet counselling
-
వందొస్తే టాప్ కాలేజీల్లో సీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు మరో 20 రోజుల్లో వెలువడే అవకాశముంది. ఇప్పటికే కీ విడుదల చేశారు. దీన్ని బట్టి ఎన్ని మార్కులు వస్తాయనేది విద్యార్థులకు ఓ అంచనా ఉంది. ఈ మార్కుల ఆధారంగా ఏయే ర్యాంకులు వస్తాయి? ఆ ర్యాంకుకు అనుకున్న కాలేజీలో సీటు వస్తుందా? అనే ఉత్కంఠ విద్యార్థుల్లో కన్పిస్తోంది. అయితే ఇంజనీరింగ్ ప్రశ్నపత్రం కష్టంగా లేదని, ఎక్కువ మంది అర్హత సాధించే వీలుందని నిపుణులు అంటున్నా రు. సాధారణ విద్యార్థి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ సబ్జెక్టుల నుంచి 40 ప్రశ్నలకు జవాబులు ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. 160 ప్రశ్నల్లో ఎక్కువ మంది 50 శాతానికి పైగానే కరెక్టు సమాధానాలు రాయవచ్చని అంచనా వేస్తున్నారు. 100 మార్కులొస్తే టాప్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చే అవకాశముందని నిపుణులు విశ్షిస్తున్నారు. సీఎస్సీ సీటు ఈజీనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 80 వేల వరకూ సీట్లు అందుబాటులో ఉండే వీలుంది. ఇందులో 58% కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్సు సీట్లు ఉంటాయి. గత ఏడాది సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్ బ్రాంచిల్లోని సీట్లు కాలేజీలు రద్దు చేసుకోవడం, కొత్తగా పెరిగిన సీట్ల వల్ల కంప్యూటర్ కోర్సుల సీట్లు అదనంగా 14 వేలు పెరిగాయి. కాబట్టి ఈసారి కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పొందడం తేలికేనని నిపుణులు అంటున్నారు. గత ఏడాది ఆఖరి దశ కౌన్సెలింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటే టాప్ కాలేజీల్లో సీఎస్సీ సీటు 4 వేల ర్యాంకు వరకూ వచ్చింది. ఈ ఏడాది కూడా ఇంచుమించు ఇదే ర్యాంకు వరకూ ఉండే వీలుందని తెలుస్తోంది. అయితే కాలేజీతో పనిలేదు కంప్యూటర్ సైన్స్ బ్రాంచిలో సీటే ప్రధానం అనుకుంటే 35 వేల ర్యాంకు వరకూ ఆ సీటు వచ్చే వీలుంది. 50 వేల ర్యాంకు దాటితే మాత్రం సీఎస్సీ సీటును ఆశించలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెట్లో కనీసం 40 నుంచి 50 మార్కులు తెచ్చుకుంటే ఆ విద్యారి్థకి 35 నుంచి 50 వేల ర్యాంకు వచ్చే వీలుందని చెబుతున్నారు. అదే 90 నుంచి 100 మార్కులు వస్తే 1500 నుంచి 3600 ర్యాంకు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. ముందే అంచనా వేయాలిగత కొన్నేళ్ళుగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించాలి. ఎన్ని మార్కులకు ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో ఏయే బ్రాంచిల్లో సీట్లు వస్తున్నాయి? అనేది ముందుగానే అంచనా వేసుకోవాలి. మొదటి దశ కౌన్సెలింగ్‌లో పక్కాగా సీటు వచ్చే కాలేజీని ఎంపిక చేసుకునేందుకు కొంత కసరత్తు చేసి ఆప్షన్లు ఇచ్చుకుంటే కోరుకున్న బ్రాంచిలో సీటు అవకాశం ఉంది. – ఎంఎన్ రావు (గణితశాస్త్ర సీనియర్ అధ్యాపకుడు) ఎన్ని మార్కులొస్తే.. ఎంత ర్యాంకు? మార్కులు ర్యాంకు 140పైన 100 130పైన 200 120పైన 300 110–120 800–300 100–110 1500–800 90–100 3600–1500 80–90 6000–3600 70–80 12000–6000 60–70 20000–12000 50–60 35000 – 20000 40–50 50000 – 35000 -
ఆ సీట్లు ఏమైనట్టు?
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది సివిల్, మెకానికల్ సీట్లు భారీగా తగ్గే అవకాశం కన్పిస్తోంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో చేర్చిన సీట్ల వివరాలే దీనికి నిదర్శనం. ఇప్పటివరకూ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చిన సీట్లలో ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఏఐఎంఎల్, ఇతర కంప్యూటర్ కోర్సులవే ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు తక్కువగా కన్పిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ విభాగాల్లో సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోకి మారబోతున్నాయా? లేదా కాలేజీలు రద్దు చేసుకుంటాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే వంద కాలేజీల వరకూ సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించాలని, కంప్యూటర్ సైన్స్, ఇతర కోర్సుల్లో సీట్లు పెంచాలని దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కారణంగానే దాదాపు 40 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో పెట్టలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆప్షన్లన్నీ సీఎస్ఈ వైపే... ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఇప్పటివరకు 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడత సీట్లు కేటాయించే నాటికి ఈ సంఖ్య 80 వేలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 1,56,879 మంది అర్హత సాధించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది కంప్యూటర్ కోర్సులకే ఆప్షన్లు ఇస్తున్నారు. ఇందులో ఎంసెట్, జేఈఈ ర్యాంకర్లు కూడా ఉన్నారు. తొలిరోజు దాదాపు 6 వేల మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 5 వేలు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులవే ఉన్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో కూడా 62,079 సీట్లు చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా, ఇందులో సివిల్ 3087, మెకానికల్ 2667, ఎలక్ట్రికల్ 3854 సీట్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 30 శాతం తగ్గాయి. ప్రైవేటు కాలేజీలు కోరినట్టు బ్రాంచీల్లో సీట్ల మార్పు జరిగితే కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే గత ఏడాది సివిల్‌లో 36.38, మెకానికల్‌లో 31.92, ఈఈఈలో 56.49 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆ సీట్లపై ప్రైవేటు కాలేజీల గురి కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఈ ఏడాది భారీగా సీట్లున్నాయి. అయినప్పటికీ విద్యార్థుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రైవేటు కాలేజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. జేఈఈ, ఎంసెట్‌లో 3 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల చేత మొదటి కౌన్సెలింగ్‌లోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి. వీళ్లకు కంప్యూటర్ కోర్సుల్లో తొలి దశలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంది. ముందు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పటికీ, ఆఖరి కౌన్సెలింగ్ వరకూ వీళ్లు కాలేజీల్లో చేరరు. జేఈఈ ర్యాంకు ఉండటంతో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరతారు. రాష్ట్రంలో అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో తొలి విడతలో వచ్చిన సీటును వదులుకుంటున్నారు. అప్పుడు ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లో ఇష్టమొచ్చిన వాళ్లకు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే, దీన్ని కట్టడి చేయడం ఎవరి వల్లా కావడం లేదని సాక్షాత్తు అధికార వర్గాలు చెబుతుండటం కొసమెరుపు. -
ఎంసెట్ కౌన్సెలింగ్.. గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలవనుంది. ఎంసెట్ అర్హులు ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 28 నుంచి అభ్యర్థులు అవసరమైన ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఉన్నత విద్యామండలి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకూ కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీలు, ఉండే సీట్ల వివరాలు మాత్రం ఎంసెట్ కౌన్సెలింగ్ విభాగానికి అందలేదు. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో దాదాపు 145 కాలేజీలు పాల్గొంటాయి. వాటికి సంబంధించిన జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు పంపాల్సి ఉంటుంది. వాటిల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఏయే బ్రాంచీల్లో సీట్లు ఉన్నాయి? అనే వివరాలు అందించాలి. దీని ఆధారంగా కౌన్సెలింగ్ చేపడతారు. సకాలంలో అప్షన్లు ఇస్తే తప్ప వచ్చే నెల మొదటి వారంలో తొలిదశ సీట్లు వెల్లడించడం సాధ్యం కాదు. ఆప్షన్లు ఇవ్వడానికి అన్ని కాలేజీలు, సీట్ల వివరాలు పొందుపర్చకపోతే ఎలా సాధ్యమని అధికారులే అంటున్నారు. కొన్ని కాలేజీల్లో ఇప్పటికీ విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వలేదు. ఈ ఏడాది ఎంసెట్‌కు 1,95,275 మంది హాజరైతే 1,56,879 మంది అర్హత సాధించారు. వారంతా ఇప్పుడు కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ బ్రాంచిలో ఎన్ని సీట్లు ఉంటాయో? అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చాలా కాలేజీలు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్ ఉన్న కోర్సుల్లో పెంచుకొనేందుకు అనుమతి కోరుతున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకొని, సీఎస్సీ, సీఎస్సీ సైబర్ సెక్యూరిటీ, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి బ్రాంచీల్లో సీట్లు పెంచాలని దరఖాస్తులు పెట్టుకున్నాయి. గతేడాది 95 శాతం కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో కనీసం 50 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. అయితే ఒకేసారి సంప్రదాయ కోర్సులను ఎత్తేస్తే ఇబ్బంది ఉంటుందని విశ్వవిద్యాలయాలు అనుమతులు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా దాదాపు 100 కాలేజీలు బ్రాంచీల మార్పు కోసం ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు సంబంధిత కాలేజీలకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. మౌలికవసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకే అనుబంధ గుర్తింపుతోపాటు సీట్ల మారి్పడిని పరిశీలిస్తామని చెప్పారు. దీంతో ఏయే కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది. స్పష్టత లేకుండా ముందుకెళ్లడం ఎలా? రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. తొలిదశలో సాధారణంగా 75 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో ఉంచుతారు. కొన్ని కాలేజీల్లో అఫిలియేషన్ పూర్తవ్వకపోవడం, మౌలికవసతులు, ఫ్యాకల్టీ సమకూర్చుకొనేందుకు ఆయా కాలేజీలకు మరికొంత అవకాశం ఇవ్వడంతో మొదటి విడత కౌన్సెలింగ్‌లో కొన్ని కాలేజీలను చేర్చరు. అయితే ఈసారి పెద్ద మొత్తంలో కాలేజీల జాబితా అందలేదని అధికారులు చెబుతున్నారు. వాటిని రెండో విడతలో చేర్చడం వల్ల కొందరు విద్యార్థులకు నష్టం జరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. సాధారణంగా తొలి విడతలో కొంతమంది ఆప్షన్లు ఇవ్వరు. దీనివల్ల తక్కువ ర్యాంకు ఉన్న వాళ్లకు కూడా మంచి కాలేజీ, మంచి బ్రాంచీల్లో సీట్లు వచ్చే వీలుంది. ఇప్పుడు అన్ని కాలేజీలు, సీట్లు అందుబాటులో లేకపోతే అలాంటి వాళ్లకు ఇబ్బంది కలిగే వీలుంది. ఆప్షన్లు ఇచ్చే సమయానికైనా అన్ని సీట్లు, కాలేజీల వివరాలు పంపాలని ఉన్నత విద్యామండలి అన్ని యూనివర్సిటీలపై ఒత్తిడి తెస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. లేనిపక్షంలో ఆప్షన్లు ఇచ్చే గడువు పొడిగింపుపై ఆలోచించక తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. -
మలి విడతలో మరో 9,240 సీట్లు
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 11 నుంచి జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్ నాటికి మరో 9,240 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 6,200 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండే వీలుంది. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులే. వీటన్నింటికీ ఇటీవల అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. తాజాగా రాష్ట్ర సాంకేతిక విద్య విభాగం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల నుంచి డిమాండ్ లేని కోర్సుల స్థానంలో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ అనుమతించింది. ఇందుకు అనుగుణంగా 89 కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నాయి. దీంతో 6 వేలకుపైగా ఈ సీట్లు తగ్గుతున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్ నాటికి 71,286 సీట్లు అందుబాటులో ఉండగా, కొత్త సీట్లతో కలిపి ఈ ఏడాది కనీ్వనర్ కోటాలో 77,486 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త సీట్లపై కోటి ఆశలు తొలి దశలో సీట్లు పొందినా... మంచి కాలేజీ, మంచి బ్రాంచ్ కోసం మరో దఫా కౌన్సె లింగ్‌కు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది కంప్యూటర్ కోర్సు లపైనే దృష్టి పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో సీట్లు లభించని విద్యార్థులు రెండో విడతలో మరోసారి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశాలున్నాయి. కొత్తగా 6,200 సీట్లు అందుబాటులోకి వచ్చి న నేపథ్యంలో మరింత మందికి ఈ బ్రాంచీల్లో సీట్లు లభించే అవకాశం ఉంది. కంప్యూటర్ సైన్స్‌పైనే గురి ఎంసెట్ మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుబంధ బ్రాంచీలకే విద్యార్థులు అత్యధికంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కంప్యూటర్ సై¯న్స్, ఐటీ అనుబంధ బ్రాంచీల్లో 99.91 శాతం సీట్లు కేటాయించగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 99.76 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే డేటాసైన్స్‌లో 99.64 శాతం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 99.59 శాతం సీట్లు కేటాయించారు. సివిల్, మెకానికల్, అలైడ్ ఇంజనీరింగ్ బ్రాంచీలపై విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు. ఈ కోర్సుల అనుబంధ బ్రాంచీల్లో 36.75 శాతం సీట్లకు కేటాయింపులు జరగ్గా, 50 శాతానికి పైగా సీట్లు ఖాళీగా మిగిలాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 36.38 శాతం సీట్లు భర్తీ కాగా, మెకానికల్‌లో 31.92 శాతం, ప్లానింగ్‌లో 24.44 శాతం సీట్లు కేటాయించారు. అలాగే మైనింగ్, కెమికల్, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ తదితర కోర్సుల్లో 84.45 శాతం సీట్లు కేటాయించారు. -
TS EAMCET Counselling Dates 2022: 21 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. కాగా అగ్రికల్చర్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను వ్యవసాయ వర్సిటీ తర్వాత ప్రకటిస్తుంది. చదవండి: ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్లో బాలికలు -
ఎంసెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో 72 వేలకు పైగా సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్–2020 తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా 72,867 మందికి సీట్లు కేటాయించారు. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఆదివారం సాయంత్రం అభ్యర్థులకు సీట్లు కేటాయింపు పూర్తి చేయించారు. ఈసారి ఎంసెట్‌లో ఆన్లైన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన గతేడాది అక్టోబర్ 23 నుంచి ప్రారంభం అయినా ఫీజులు, కాలేజీల అఫ్లియేషన్ జాప్యంతో వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం ఎంసెట్‌లో 1,29,714 మంది అర్హత సాధించగా 90,076 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 89,078 మంది ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకున్నారు. 83,014 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్రంలోని 380 ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లోని మొత్తం సీట్లలో కన్వీనర్ కోటా కింద 1,03,766 సీట్లు ఉండగా వాటిలో 72,867 మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. ఇంకా 30,899 సీట్లు మిగిలి ఉన్నాయి. యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు 5,649, ఫార్మసీ సీట్లు 77 భర్తీ చేశారు. ప్రయివేటు కాలేజీల్లోని ఇంజనీరింగ్ సీట్లు 66,900, ఫార్మసీ సీట్లు 241 భర్తీ అయ్యాయి. ఇంకా స్పోర్ట్స్ కేటగిరీలోని 465 మందికి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన నివేదికలు శాప్ నుంచి అందనందున వారికి మొదటి విడతలో సీట్లు కేటాయించలేదు. వారికి తదుపరి సీట్లు కేటాయించనున్నట్లు కన్వీనర్ నాయక్ వివరించారు. ఈసారి జీవో అలాట్మెంట్ కాలేజీ ఒక్కటే కాలేజీల్లో ప్రమాణాలు, ఇతర సదుపాయాల విషయంలో ప్రభుత్వం ఈసారి పగడ్బందీ చర్యలు తీసుకోవడంతో దాని ప్రభావం కౌన్సెలింగ్‌లో స్పష్టంగా కనిపించింది. గతంలో జీరో అలాట్‌మెంటు కాలేజీల నుంచి 20 సీట్లు కూడా భర్తీ కాని కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఈసారి ప్రభుత్వమే సరైన ప్రమాణాలు, నిర్ణీత నిబంధనల ప్రకారం సదుపాయాలు, సిబ్బంది లేని కాలేజీలను జీవో అడ్మిషన్ల కేటగిరీలో చేర్చి వాటికి సీట్ల కేటాయింపును నిలిపివేసింది. ఇంజనీరింగ్‌లో 48, బీ ఫార్మసీలో 5 కాలేజీలకు అడ్మిషన్ల జాబితా నుంచి తప్పించింది. 54 కాలేజీల్లో 100 శాతం సీట్ల భర్తీ ఈసారి పూర్తి స్థాయిలో వంద శాతం సీట్లు భర్తీ అయిన కాలేజీల సంఖ్య గతంలో కన్నా పెరిగింది. 2019 ఎంసెట్‌లో తొలివిడత కౌన్సెలింగ్‌లో 44 కాలేజీల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాగా ఈసారి వాటి సంఖ్య 54కు పెరిగింది. కంప్యూటర్ సైన్స్‌దే అగ్రస్థానం ఏపీ ఎంసెట్–2020 తొలివిడత సీట్ల కేటాయింపులో అత్యధిక సీట్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలోనే భర్తీ అయ్యాయి. గతంలో మాదిరిగానే ఆ విభాగం అగ్రస్థానంలో ఉంది. ఐటీ, ఈసీఈ విభాగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ – 2020 కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్య ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ శుక్రవారం బీఈ, బీటెక్, ఫార్మసీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు (ఎంపీసీ స్ట్రీమ్) ఈ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ ద్వారా ఈనెల 23 నుంచి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు. ► ఆన్లైన్ ఫీజు చెల్లించాక ప్రింటవుట్ తీసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో సాంకేతిక కారణాల వల్ల ఫెయిల్యూర్ అని వస్తే మరోసారి చెల్లించి ప్రింటవుట్ తీసుకోవాలి. తొలుత చెల్లించిన డబ్బులు వారి ఖాతాకు జమ అవుతాయి. ► ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు అనంతరం ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులో పేర్కొన్న మొబైల్ నంబర్‌కు రిజిస్ట్రేషన్ నంబర్, లాగిన్ ఐడీ నంబర్ వివరాలు ఎస్సెమ్మెస్ ద్వారా అందుతాయి. ఇలా సమాచారం వస్తే సర్టిఫికెట్ల డేటా పరిశీలన పూర్తయినట్లు. అసమగ్రంగా ఉంటే హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయించాలనే సందేశం వస్తుంది. ► వెరిఫికేషన్ పూర్తయ్యాక లాగిన్ ఐడీ ద్వారా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని తదుపరి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ► ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలనకు మాత్రమే షెడ్యూల్ విడుదల చేశారు. ► ఈనెల 23 నుంచి 27 వరకు ర్యాంకుల వారీగా ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ► వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను తదుపరి ప్రకటిస్తారు. ► దివ్యాంగులు, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తారు. సీఏపీ (చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్) అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లవచ్చు. -
ఆ విషయంలో రాజీ పడబోం : మంత్రి సురేష్
సాక్షి, అమరావతి : విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పించడం పట్ల రాజీపడబోమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. లాభాల వ్యాపారంగా నడుస్తున్న విద్యావ్యవస్థకు ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. టీచర్ల నియామకంలోని సమస్యలను సమీక్షించామని, వాటిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. 2018 డీఎస్సీ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. సర్టిఫికేట్ల పరిశీలన తర్వాత నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే ఖాళీలను భర్తీ చేసే చర్యలు చేపడతామన్నారు. ఫీజుల నియంత్రణపై రూపొందించిన చట్టానికి కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై సీఎం జగన్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎంసెట్–2019 కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 6 వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. తర్వాత విద్యార్థులు 3 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లలో పొరపాట్లు సరిచేసుకోవడానికి వీలుగా 9న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఇస్తారు. 11న సీట్లను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ఓసీ, బీసీలు రూ.1,200, ఎస్సీ, ఎస్టీలు రూ.600 ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంసెట్ దరఖాస్తులో పేర్కొన్న వివరాలతో దాదాపు లక్ష మంది వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన వెబ్ సర్వీసింగ్ ద్వారా పూర్తయింది. ఇప్పటికే ఆయా విద్యార్థుల మొబైల్ నెంబర్లకు ఈ సమాచారం అందించారు. ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ ద్వారా తమ ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందో, లేదో విద్యార్థులు తెలుసుకోవచ్చు. పరిశీలన పూర్తికానివారు, ఇతరులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరుకావాల్సి ఉంటుంది. దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లలు, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ కేటగిరీల విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతుంది. జూలై 1 నుంచి 4 వరకు వీరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరెవరికి ఏయే తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందో తెలిపే షెడ్యూల్‌ను ఎంసెట్ కమిటీ.. వెబ్సైట్లో పొందుపరిచింది. వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ పొడిగింపు! ఫీజులు, ఈడబ్ల్యూఎస్ కోటా విషయం తేలకుంటే కౌన్సెలింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తూనే ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేయనున్నారు. వెబ్ ఆప్షన్ల నమోదును రెండు రోజులు వాయిదా వేయాలని యోచిస్తున్నారు. వెబ్ ఆప్షన్లను ఈ నెల 3 నుంచి కాకుండా 5 లేదా 6వ తేదీ నుంచి నమోదు చేసుకొనేలా షెడ్యూల్ ప్రకటించనున్నారు. వెబ్ ఆప్షన్ల గడువును పొడిగిస్తే ఆప్షన్ల మార్పు, సీట్ల కేటాయింపు తేదీలు కూడా రెండు, మూడు రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉందని అధికారవర్గాలు వివరించాయి. విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు.. - ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు - ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్ - ఇంటర్మీడియెట్/తత్సమాన మార్కుల మెమోలు - పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం (ఎస్ఎస్సీ/తత్సమాన మెమో) - ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ - ప్రైవేటుగా చదివినవారు ఏడేళ్లకు సంబంధించిన నివాస ధ్రువీకరణ పత్రం - ఇతర ప్రాంతాల్లో ఉండి ఏపీకి వచ్చిన ఉద్యోగుల పిల్లలు ఏపీ రెసిడెన్స్ సర్టిఫికెట్ - ఆధార్ కార్డు - ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ (బీసీ, ఎస్సీ, ఎస్టీ) - తెల్లరేషన్ కార్డు/ఇతరులు ఆదాయ ధ్రువీకరణ పత్రం - అవసరమైనవారికి లోకల్ స్టేటస్ ధ్రువపత్రం - ఎన్సీసీ, స్పోర్ట్స్, దివ్యాంగులు, ఆర్మ్డ్ ఫోర్సెస్ చిల్డ్రన్స్.. వారికి సంబంధించిన ధ్రువపత్రాలు -
ప్చ్.. ఇంజినీరింగ్
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే చందంగా మారింది. ఎంసెట్‌లో ఆశించిన విధంగానే విద్యార్థులు అర్హత సాధించినా ఆ స్థాయిలో విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరలేదు. దీంతో యాజమాన్యాలు కలవరం చెందుతున్నాయి. నెల్లూరు(టౌన్): జిల్లాలో తొలి విడత ఎంసెట్ కౌన్సెలింగ్ మంగళవారంతో ముగిసింది. జిల్లాలో ఆయా కళాశాలల సీట్లు భర్తీని ఒకసారి పరిశీలిస్తే కేవలం మూడు కళాశాలల్లో 80శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. మరో నాలుగు కళాశాలల్లో 10 శాతం సీట్లు కూడా భర్తీ కాకపోవడంపై చర్చనీయాంశమైంది. జిల్లా వ్యాప్తంగా ఆయా ఇంజినీరింగ్ కళాశాలల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లో 55.60 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ దశలో సీట్లు భర్తీకాని కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నెల్లూరు నారాయణ కళాశాల్లో 87.57శాతం, గీతాంజలి కళాశాల్లో 83.60 శాతం, .వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో 83.33 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మరో నాలుగు కళాశాలల్లో వరుసగా 9.52శాతం, 6.67శాతం, 6.35 శాతం, 2.72శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 50 శాతానికి పైగా ఏడు ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, 10కి పైగా 50 శాతానికి లోపు సీట్ల భర్తీ అయిన ఎనిమిది కళాశాలలు ఉన్నాయి. దీంతో ఈ కళాశాలల పరిస్థితి దయనీయంగా మారింది. సీఎస్‌ఈకే డిమాండ్ జిల్లాలో 22 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, ఎంఈసీఎచ్, ఐటీ తదితర కోర్సులు ఉన్నాయి. అయితే ఎక్కువగా సీఎస్ఈ కోర్సునే విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు. జిల్లాలో ఆయా కళాశాలల్లో సీఎస్ఈ 1,617 సీట్లు ఉండగా 1,133 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌లో 997కు గాను 389, ఈసీఈ 1,900 సీట్లకు 1,182, ఈఈఈలో 839కి 332 సీట్లు, ఎంఈసీఎచ్‌లో 808కి 392 సీట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులో 84 సీట్లకు 44 సీట్లు భర్తీ అయ్యాయి. అదే శాతంతో పోలిస్తే సీఎస్ఈలో 70.01శాతం, సివిల్ 39శాతం, ఈసీఈ 62.2 శాతం, ఈఈఈలో 39.6శాతం, ఎంఈసీఎచ్‌లో 48.5శాతం, ఐటీలో 52.4శాతం మంది విద్యార్థులు చేరారు. జిల్లాలోని ఆయా ఇంజినీరింగ్ కళాశాలల్లో 6,245 సీట్లు ఉండగా, తొలి విడత కౌన్సెలింగ్‌లో 3,472 మంది విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరారు. రెండో విడతపైనే ఆశలు జిల్లాలోని ఎక్కువ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు రెండో విడత కౌన్సిలింగ్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్ జిల్లాలో మెజార్టీ కళాశాలల యాజమాన్యాలను నిరాశపెట్టాయి. రెండో విడత ఎంసెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం తేదీని ప్రకటించలేదు. రెండో విడతలో కూడా సీట్లు భర్తీ కాకపోతే పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో ఆయా కళాశాలల యాజమాన్యలు ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరకుండా ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ సరైన సౌకర్యాలు, నిష్ణాతులైన అధ్యాపకులు, సరిపడా కంప్యూటర్ ల్యాబ్‌లు తదితరవి లేక పోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. జిల్లా నుంచి ప్రతి ఏటా 14 వేల మందికి పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ చదివేందుకు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని తెలిసింది. ఇక్కడ ఎక్కువ కళాశాలల్లోనే బీటెక్ పూర్తి చేసిన వారితోనే బోధన సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎంటెక్, పీహెచ్డీ చేసిన వారితో బోధన చెల్లించాలంటే లక్షల్లో వేతనం చెల్లించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బీటెక్ పూర్తి చేసిన వారితోనే పబ్బం గడుపుతున్నారనే విమర్శలున్నాయి. దీంతో పాటు జిల్లాలోని కళాశాలల్లో చదివితే ప్లేస్మెంట్ ఉండదని ఎక్కువ మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. -
12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 12వ తేదీ నుంచి ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఈనెల 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనుంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శనివారం మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎంసెట్–2017 ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాంకేతిక విద్యా కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ వాణిప్రసాద్, క్యాంపు ఆఫీసర్ బి.శ్రీనివాస్, జేఎన్టీయూహెచ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవేశాల షెడ్యూలును ఖరారు చేశారు. జేఎన్టీయూహెచ్ అధికారులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపును ఈనెల 10వ తేదీలోగా ఇస్తామని వెల్లడించారు. దీంతో షెడ్యూలును ప్రకటించారు. ఈనెల 12వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 16వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ వెరిఫికేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరి.. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు ఈసారి ఆధార్, బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేశారు. వెరిఫికేషన్ సమయంలో అవి తప్పనిసరి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఆధార్‌కార్డు, ఎస్ఎస్సీ మార్కుల మెమో, ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఈ ఏడాది జనవరి 1న, ఆ తరువాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, వికలాంగులు, స్పెషల్ కేటగిరీ వారు ఆయా సర్టిఫికెట్లు, నాన్ లోకల్ వారైతే వారి తల్లిదండ్రులు తెలంగాణలో గతంలో 10 ఏళ్ల పాటు నివసించినట్లు ఉన్న ధ్రువీకరణ పత్రం, రెగ్యులర్ స్టడీ లేని వారు ఏడేళ్లపాటు ఇక్కడ నివసించి ఉన్నట్లు నివాస ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. స్పెషల్ కేటగిరీ వారికి విద్యాభవన్లోనే ఆర్మ్డ్ ఫోర్సెస్‌కు సంబంధించిన వారు, ఎన్సీసీ, స్పోర్ట్స్, వికలాంగులు వంటి స్పెషల్ కేటగిరీకి చెందిన వారికి మాసబ్ ట్యాంకు సాంకేతిక విద్యా భవన్‌లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యార్థులు తమ ర్యాంకుల ప్రకారం స్వయంగా నిర్ణీత తేదీల్లో హాజరు కావాలి. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అప్పుడే మంచి కాలేజీల్లో సీటు లభించే అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి కాలేజీలో చేరే సమయంలో ట్రాన్స్ సర్టిఫికెట్ (టీసీ) అందజేయాలి. వెబ్సైట్లో గతేడాది కేటాయింపుల వివరాలు.. గత ఏడాది ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ భాగంగా ఏ ర్యాంకుల వారీకి ఏ కాలేజీలో సీట్లు లభించాయన్న వివరాలను ్టట్ఛ్చఝఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. కాలేజీ వారీగా, కేటగిరీ వారీగా, జెండర్ వారీగా 2016లో ఏయే ర్యాంకుల వారీకి ఏయే బ్రాంచీల్లో సీట్లు లభించాయన్న వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వాటి ఆధారంగా ప్రవేశాల విషయంలో ఓ అంచనాకు వచ్చే వీలుందని పేర్కొన్నారు. అయితే ఈసారి అందుబాటులోకి వచ్చే కాలేజీలు, సీట్లను బట్టే కేటాయింపులు ఉంటాయని వివరించారు. ఎంసెట్ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు. ఇదీ ప్రవేశాల షెడ్యూలు.. 12–6–2017 నుంచి 21–6–2017 వరకు: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 16–6–2017 నుంచి 22–6–2017 వరకు: వెబ్ ఆప్షన్లు 22–6–2017, 23–6–2017: వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం 28–6–2017: మొదటి దశ సీట్లు కేటాయింపు 3–7–2017లోగా: కాలేజీల్లో చేరడం. ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు.. తేదీ ర్యాంకు 12–6–2017 1 నుంచి 6 వేలు 13–6–2017 6001 నుంచి 16 వేలు 14–6–2017 16,001 నుంచి 26 వేలు 15–6–2017 26,001 నుంచి 36 వేలు 16–6–2017 36,001 నుంచి 46 వేలు 17–6–2017 46,001 నుంచి 56 వేలు 18–6–2017 56,001 నుంచి 68 వేలు 19–6–2017 68001 నుంచి 80 వేలు 20–6–2017 80001 నుంచి 92 వేలు 21–6–2017 92001 నుంచి చివరి ర్యాంకు వరకు. ర్యాంకుల వారీగా వెబ్ ఆప్షన్ తేదీలు.. తేదీలు ర్యాంకు 16–6–2017, 17–6–2017 1 నుంచి 36 వేలు 18–6–2017, 19–6–2017 36001 నుంచి 56 వేలు 20–6–2017, 21–6–2017 56001 నుంచి 80 వేలు 21–6–2017, 22–6–2017 80001 నుంచి చివరి ర్యాంకు వరకు 22–6–2017, 23–6–2017 వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం 28–6–2017 సీట్లు కేటాయింపు, వెబ్సైట్లో వివరాలు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హెల్ప్‌లైన్ కేంద్రాలు.. ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 21 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ వివరాలు.. ► హైదరాబాద్‌లో: జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతాపూర్, – గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ, ఈస్ట్ మారేడ్‌పల్లి, ►క్యూ క్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్, జూ పార్కు ఎదురుగా. – సాంకేతిక విద్యా భవన్, మాసబ్ ట్యాంకు – జేఎన్టీయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి ► ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కరీంనగర్ ►డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ జీఎంఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్ కరీంనగర్. ► ఎస్ ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, ఖమ్మం ►వనపర్తి, మహబూబ్‌నగర్, బెల్లంపల్లి (ఆదిలాబాద్), కొత్తగూడెం, రాజగోపాల్పేట్ (సిద్ధిపేట్), నల్గొండ, వరంగల్, నిజమాబాద్, మెదక్ (వుమెన్) గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లలో. ► నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నల్గొండ. ►గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పీజీ బ్లాక్, నిజమాబాద్ ► యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సుబేదారి హన్మకొండ. – కాకతీయ యూనివర్సిటీ వరంగల్. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు గడువు కోరిన తెలంగాణ
న్యూఢిల్లీ: తెలంగాణలో ఎంసెట్ పరీక్ష నిర్వహణ ఆలస్యమవడం వల్ల అడ్మిషన్ల ప్రక్రియకు మరో నెల రోజుల పాటు గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. సెప్టెంబరు 30 నాటికి కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తికావాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరికొంత గడువు కోరింది. తెలంగాణలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైతే తమపై ప్రభావం చూపుతుందని, తమకూ కొంత సమయం అవసరం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎన్టీయార్ హెల్త్‌వర్శిటీ, ప్రయివేటు కళాశాలలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఏపీలో ఇదివరకే అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఒకవేళ తెలంగాణలో సీటొస్తే అక్కడికి వెళ్లిపోతారని, తద్వారా ఏపీలో సీట్లు ఖాళీగా ఉంటాయని పిటిషన్లలో పేర్కొన్నారు. బుధవారం ఈ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
ఆప్షన్ల మార్పునకు అవకాశం
- ఇంజినీరింగ్ కళాశాల, బ్రాంచ్‌లు మార్చుకునేందుకు వీలు - ఎంసెట్ కౌన్సెలింగ్‌లో చివరి అవకాశం ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ చివరి దశకు చేరుకుంది. ఆది, సోమవారాల్లో ఆప్షన్లు మార్పునకు మరో అవకాశం ఉంది. గతంలో ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు సైతం మళ్లీ అదనపు సమాచారం ఉంటే మార్చుకోవచ్చు. 22న ఎలాట్మెంట్ల ప్రకటన ఉంటుంది. విద్యార్థుల పూర్వపు పాస్వర్డ్, లాగిన్ ఐడీతో ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చు. దాదాపుగా విద్యార్థులు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చు కున్నారు. ఈనెల 6 నుంచి 15 వరకు ఎంసెట్-2016 కౌన్సెలింగ్ శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రలో జరగ్గా, 2,825 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 1 నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ శనివారంతో ముగిసింది. షెడ్యూల్ మేరకు ఉన్నత విద్యామండలి విద్యార్థులు కళాశాలలు, ఆప్షన్లు మార్పునకు మరో అవకాశం కల్పించింది. విద్యార్థుల పునరాలోచనకు అవకాశం గతంలో అవగాహనతో విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకుంటే మార్పులు అవసరం లేకున్నా, గతంలో అవగాహన లేకుండా కళాశాల, బ్రాంచ్‌లు ఎంచుకుంటే మాత్రం విద్యార్థులు మార్పులు చేయడం మంచిది. ప్రస్తుతం కొత్తగా కొన్ని ప్రభుత్వ కళాశాలలు సైతం కౌన్సెలింగ్ జాబితాలో చేరాయి. ప్రభుత్వ కళాశాలలకు ర్యాంకు బట్టి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. 10వేల లోపు ర్యాంకు విద్యార్థులు ఎటువంటి కళాశాలు ఎంచుకున్నా రీయింబర్స్మెంట్ వర్తించే విద్యార్థులకు సమస్య ఉండదు. కామన్ ఫీజు దాటిన కళాశాలలు ఎంచుకునే విద్యార్థులు ఆర్థిక స్థోమత పరిగణలోకి తీసుకొని కళాశాల ఎంపిక చేసుకుంటే మంచిది. ప్రస్తుతం విద్యార్థులు ట్రెండ్ బట్టి సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ట్రిఫుల్ఈ, సివిల్ బ్రాంచ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుం ఉన్న ట్రెండ్ విద్యార్థి రిలీవ్ అయిన నాలుగేళ్ల తరువాత కొనసాగుతుందని చెప్పలేం. మార్పులు ఉంటాయి. ఎంచుకున్న బ్రాంచ్‌లో నిష్ణాతులైన విద్యార్థులు మాత్రమే మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. కళాశాల మార్పులు చేసుకునే విద్యార్థులు గత ప్రవేశాలు, పూర్వపు విద్యార్థుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటే నష్టపోయో అవకాశాలు తక్కువ. ఆప్షన్లు మార్పునకు అవకాశం విద్యార్థులు ఆది, సోమవారాల్లో ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చు. అవసరం లేదంటే మార్పునకు అవసరం లేదు. గతంలో ఇచ్చిన ఆప్షన్లు సరిచూసుకోవచ్చు. ఆప్షన్ల మార్పునకు ఇది చివరి అవకాశం. - మేజర్ కె.శివకుమార్, సహాయ కేంద్రం ఇన్చార్జి. -
ఆ ప్రభావం ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌పై పడుతుందా?
- ఏపీకి వెళ్లేవారికి స్థానికతపై రాష్ట్రపతి ఆమోదం - ఎంసెట్‌లో వారిని ఎలా పరిగణించాలన్న దానిపై అయోమయం హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఆ రాష్ట్ర స్థానికతను వర్తింపచేసేలా శుక్రవారం రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆప్రభావం ప్రస్తుతం జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌పై పడుతుందా? ఏపీ ఎంసెట్ రాసి కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న తెలంగాణ ప్రాంత అభ్యర్థులు ఏపీకి వెళ్తే కనుక అక్కడి స్థానికత ఆధారంగా వారికి లోకల్ కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారవర్గాల్లోనూ తర్జనభర్జన సాగుతోంది. గతనెలలో జరిగిన ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ (ఓయూ రీజియన్) నుంచి దాదాపు 42,482 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 18,892 మంది ఇంజనీరింగ్ విభాగంలో, 23,594 మంది మెడికల్ విభాగంలో ఉన్నారు. ఇంజనీరింగ్‌లో 17,548 మంది, మెడికల్ విభాగంలో 22,591 మంది పరీక్ష రాశారు. వీరిలో అత్యధిక శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. టాప్‌ర్యాంకుల్లో అధికం వీరికే వచ్చాయి. ఇంజనీరింగ్‌లో దాదాపు 1.60 లక్షల సీట్లుండగా, మెడికల్‌లో ఎంబీబీఎస్‌లో 3900 సీట్లు, డెంటల్ కోర్సులో 1300 సీట్లు ఉన్నాయి. వీటిలో 371 డీ ప్రకారం ఆయా రీజియన్ల పరిధిలోని సీట్లలో 85 శాతం స్థానికులకు కేటాయించాలి. 15 శాతం సీట్లు మెరిట్లో ఓపెన్టు ఆల్ ప్రాతిపదికన భర్తీచేయాలి. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి 371 డీ ప్రకారం ఏపీలోని ఆంధ్రాయూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తెలంగాణలోని ఉస్మానియా వర్సిటీల రీజియన్లుగా ఉన్నాయి. ఈ లెక్కన హైదరాబాద్‌లో, తెలంగాణలో ఇంటర్మీడియెట్ వరకు చదివి ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఏపీలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో 15 శాతం కోటా మాత్రమే వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఉస్మానియా పరిధినుంచి ఉత్తీర్ణులైన వారిని ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు అదే విధంగా పరిగణించి 15 శాతం ఓపెన్ కోటాకు మాత్రమే వారిని అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ సీట్ల కేటాయింపులో ఆమేరకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కౌన్సెలింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 35 వేల ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆప్షన్లు నమోదు పూర్తిచేశారు. వీరిలో అత్యధిక శాతం మంది తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులున్నారు. ఈ తరుణంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి స్థానికతను వర్తింపచేసే ఫైలుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కౌన్సెలింగ్‌పై దాని ప్రభావం పడుతోంది. ప్రస్తుతం ఏపీ ఎంసెట్ రాసి అర్హత సాధించిన ఓయూ రీజియన్ అభ్యర్థుల్లో అనేక మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. అలా అయితే వారికి ఏపీ స్థానికత వర్తిస్తుంది. అపుడు ఎంసెట్‌లో వారిని 85 శాతం స్థానిక కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేక ఇంటర్మీడియెట్ హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో చదివినందున 15 శాతం స్థానికేతర కోటాలో సీట్లు కేటాయిస్తారా? అన్నది సందిగ్ధంగా మారింది. ఏపీకి వెళ్లే ఈ విద్యార్థులకు ఏ రీజియన్ పరిధిలో స్థానికత వర్తిస్తుందన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఏపీలోని ఏయూ, ఎస్వీయూలు రెండు రీజియన్లుగా ఉన్నాయి. ఏయూ పరిధిలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో ఎస్వీయూ పరిధిలో స్థానికత ఉన్నవారికి 15 శాతం ఓపెన్కోటాలో మాత్రమే కేటాయింపులు చేస్తారు. అలాగే ఎస్వీయూ పరిధిలోని సీట్లలో ఏయూ పరిధి స్థానికత ఉన్నవారిని 15 శాతం సీట్లలో మాత్రమే అనుమతిస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలి. ఆ తరువాత తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఏ రీజియన్‌కు సంబంధించిన స్థానికత వర్తిస్తుందో తేలాలి. అప్పటికి గానీ ఆయా అభ్యర్థుల స్థానికతపై ఒక స్పష్టత రాదు. ఇందుకు చాలా సమయం పట్టనుంది. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఈనెల 22న మొదటివిడత కౌన్సెలింగ్ సీట్ల అలాట్‌మెంటు పూర్తవుతుంది. ఆలోగా ఈ వ్యవహారమంతా తేలదు. ఈ నేపథ్యంలో దీనిపై ఏంచేయాలా? అని అధికారులు ఆలోచనల్లో పడుతున్నారు. ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు దీనిపై స్పందిస్తూ దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ముందుకు వెళ్తాం. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళ్తాం అని వివరించారు. ఉన్నత స్థాయిలో చర్చించాకనే దీనిపై ఒక స్పష్టత వస్తుంది అని పేర్కొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ రాష్ట్రపతి ఉత్తర్వులు రాకముందే ప్రారంభమైనందున ఆ ఉత్తర్వులు ఈ కౌన్సెలింగ్‌కు అమలు చేయాలా? లేదా అన్నది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉందని వివరించారు. -
శ్రీకాకుళంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అవాంతరాలు
ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి జిల్లాలో సోమవారం ప్రారంభం కావాల్సిన వెబ్ కౌన్సెలింగ్‌కు అవాంతరాలు ఎదురయ్యాయి. ఉదయం 9.30 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా... సర్వర్లు అనుసంధానం కాకపోవటంతో కౌన్సెలింగ్ నిలిచి పోయింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో కౌన్సెలింగ్ ఉదయం ప్రారంభించారు. అయితే సర్వర్లు నిలిపోయూయి. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పారంభమవుతాయని అధికారులు చెప్పారు. విద్యార్థులు నిరీక్షించినప్పటికీ... సాయంత్రం వరకు సర్వర్లు పని చేయలేదు. రాత్రి సమయంలో సిబ్బందిని పెంచి కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి హెల్ప్ లైన్ సెంటర్ల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 5000 ర్యాంకు లోపు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు సోమవారం పరిశీలించాల్సి ఉండగా, 148 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ మరింత ఆలస్యం
-
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 81,808 ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆప్షన్లలో మార్పు చివరి గడువు మంగళవారంతో ముగిసింది. ఎంసెట్‌లో అర్హత సాధించి ధ్రువపత్రాలు పరిశీలింపచేసుకున్న 81,972 మందిలో 81,808 మంది ఎంసెట్ కోర్సులకు ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. బుధవారం ఉదయం పది గంటలవరకు ఆప్షన్లు మార్చుకొనే అవకాశమున్నందున మొత్తం ధ్రువపత్రాలు సమర్పించుకున్న వారంతా ఆప్షన్లు ఇచ్చుకొనే అవకాశముంది. గతంతో పోలిస్తే ఈసారి ఆప్షన్లు ఇచ్చుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. నేటినుంచి పాలిసెట్ వెబ్ ఆప్షన్లు ఇలా ఉండగా పాలిసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు రావలసిన 25వేల మందికి గాను 15వేల మంది హాజరయ్యారని అధికారవర్గాలు వివరించాయి. ఈనెల 28వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఆ పై వెబ్ ఆప్షన్ల నమోదు, ఆప్షన్ల మార్పుల అనంతరం జులై 3వ తేదీన సీట్ల అలాట్‌మెంటు జరుగుతుందని పాలిసెట్ చీఫ్ క్యాంప్ ఆఫీసర్ రఘునాధ్ తెలిపారు. -
విద్యార్థులపై తేనెటీగల దాడి
నెల్లూరు : స్థానిక వెంకటేశ్వరపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రంపై శనివారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. దాంతో కౌన్సెలింగ్‌ను అధికారులు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాతోపాటు పక్క జిల్లాల నుంచి కూడా ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాలిటెక్నిక్ కళాశాలకు తరలి వచ్చారు. అయితే తేనెటీగల దాడితో విద్యార్థులంతా కౌన్సెలింగ్ కేంద్రం నుంచి దూరంగా పరుగులు తీశారు. -
వచ్చేనెల 6కు టీ ఎంసెట్ కౌన్సిలింగ్ వాయిదా
హైదరాబాద్:ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ వచ్చేనెలకు వాయిదా పడింది. ఈ మేరకు శుక్రవారం విచారించిన హైకోర్టు ఎంసెట్ కౌన్సిలింగ్ ను వచ్చే నెల ఆరవ తేదీకి వాయిదా వేసింది. జూలై 6 వ తేదీన కౌన్సిలింగ్ మొదలుపెట్టి 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో పాటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వెలుగుచూసిన లోపాలను సవరించుకోవాలంటూ 24 గంటలు గడువు ఇచ్చిన జేఎన్టీయూ నోటీసుల అంశంపై దాఖలైన పిటిషన్ ను కూడా హైకోర్టు విచారించింది. ఈ నెల 20వ తేదీ వరకూ ఆ కాలేజీ యజమాన్యులకు హైకోర్టు గడువు ఇచ్చింది. -
'టీఎస్ మంత్రి హామీ ఇప్పటివరకూ అమలు కాలేదు'
హైదరాబాద్: ఉన్నత విద్యామండలి రికార్డులు అప్పగిస్తామని తెలంగాణ మంత్రి ఇచ్చిన హామీ ఇప్పటివరకూ అమలు కాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రికార్డులు ఇవ్వకపోయినా ఎంసెట్ కౌన్సిలింగ్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు గంటా తెలిపారు. ఈ నెల 12 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. డీఎస్సీ పోస్టింగ్ ల ప్రక్రియను ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. డీఎస్సీపై కొంతమంది కోర్టుకు వెళ్లారని.. ఆ విచారణ ఈనెల 10కి వాయిదా పడిందన్నారు. ప్రభుత్వం కూడా డీఎస్సీకి సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. దళారులను నమ్మొద్దని చెప్పినా.. కొందరు అమాయకులు మోసపోయారన్నారు. ఈనెల 15న పాఠశాలలు పునఃప్రారంభిస్తామన్నారు. కొత్తగా మంజూరైన నిట్ కు 480 సీట్లను కేంద్ర కేటాయించిందని.. కర్నూలు ఐఐటీ, ఎన్ఐటీ తరగతులను ఈ ఏడాదిలోనే ఆరంభిస్తున్నట్లు గంటా తెలిపారు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీకి, విజయనగరంలో గిరిజన యూనివర్శిటీకి కేంద్రం స్థలాలు ఖరారు చేసిందన్నారు. నిబంధనలు పాటించని ఇంజనీరింగ్ కాలేజల సీట్లను తగ్గిస్తామని గంటా హెచ్చరించారు. -
కొన్నింటిపై వివక్ష ఏల?
* ఇంజనీరింగ్ కాలేజీలపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం సూటి ప్రశ్న * అందరికీ సమానావకాశం కోసమే ఎంసెట్ గడువు పెంచాం * ఆ దిశగా ఏం చేశారో చెప్పండి? * కాలేజీల విన్నపంపైనా కౌంటర్ దాఖలు చేయండి * జేఎన్టీయూహెచ్ను, సర్కారును ఆదేశించిన ధర్మాసనం * విచారణ 27కు వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని కాలేజీలపై ఎందుకు వివక్ష చూపుతున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అందరికీ సమాన అవకాశాలు దక్కాలనే గతంలో కౌన్సెలింగ్ గడువును పొడిగించినట్టు గుర్తుచేసింది. అందరికీ అవకాశాలు కల్పించడంలో భాగంగా కౌన్సెలింగ్ ప్రక్రియను ఏ విధంగా నిర్వహించారో తెలియజేస్తూ ఈ నెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు తమకు అవకాశం ఇవ్వలేదంటూ పలు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు, మలివిడత కౌన్సెలింగ్ కోరుతూ కొందరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. జస్టిస్ సుధాంశు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం ఎదుట వాదోపవాదాలు జరిగాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల కోసం ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రమాణాలు లేని కారణంగా 174 ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుమతులు లభించని సంగతి తెలిసిందే. దీనిపై దాదాపు 32 కాలేజీలు సుప్రీంని ఆశ్రయించాయి. తాజాగా జరిగిన విచారణలో తొలుత పిటిషనర్ల తరఫున న్యాయవాది గోపాల సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. 20 ఏళ్లుగా యూనివర్సిటీ, ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న కాలేజీలను కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనకుండా చేశారని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ముఖోపాధ్యాయ జోక్యం చేసుకుని.. చట్ట ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించాలని చెప్పామని పేర్కొన్నారు. ‘కొన్ని కాలేజీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? మేం కౌన్సెలింగ్ గడువును ఆగస్టు 31 వరకు ఎందుకు పొడిగించాం. అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే కదా గడువు పెంచాం. దానర్థం కొన్ని కళాశాలలపై వివక్ష చూపాలని కాదే’ అంటూ తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా జేఏన్టీయూహెచ్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించబోతుండగా న్యాయమూర్తి మరోసారి కల్పించుకుని... ‘తొలుత అఫిడవిట్ దాఖలు చేయనివ్వండి.. ఎందుకు అవకాశం కల్పించలేదో చెప్పనివ్వండి’ అని పేర్కొన్నారు. అందరికీ అవకాశం కల్పించడంలో భాగంగా యూనివర్సిటీ, తెలంగాణ ప్రభుత్వం రెండూ ఏం చేశాయో అఫిడవిట్ దాఖలు చేయాలని, అలాగే కాలేజీల ప్రస్తుత విన్నపంపైనా ఈ నెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను 27వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. -
మళ్లీ సుప్రీం‘కోర్టు’లో కౌన్సెలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: అనుమతుల ఆలస్యం కారణం గా ఎంసెట్ కౌన్సెలింగ్‌లో అవకాశం కోల్పోయామని, మరోసారి కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోరుతూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ జేఎన్టీయూహెచ్, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యా మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై విచారణను బెంచ్‌కు అప్పగిస్తామని.. వచ్చే నెల 10 వీటిపై విచారణ జరుగుతుందని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా లేవం టూ గత నెలలో 174 ఇంజనీరింగ్ కళాశాలలకు గుర్తింపును జేఎన్టీయూహెచ్ నిరాకరించిన విషయం తెలిసిందే. దానిపై కళాశాలల యాజ మాన్యాలు హైకోర్టును ఆశ్రయించడంతో... ఏఐసీటీఈ ప్రమాణాల మేరకు వసతులు సమకూర్చుతామంటూ అఫిడవిట్ తీసుకుని కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుమారు 130 కాలేజీలు యూనివర్సిటీకి అఫిడవిట్ ఇచ్చాయి. కానీ అప్పటికే సమయం మించిపోయిందంటూ.. ప్రభుత్వం ఆయా కళాశాలలను కౌన్సెలింగ్‌లో చేర్చలేదు. దాంతోపాటు రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతివ్వాలంటూ ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించినా... అంతకుముందే గడువు పెంచామని, మళ్లీ అనుమతివ్వబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అనుమతుల ఆలస్యం కారణంగా తాము నష్టపోయామంటూ 25 ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అనుమతించాలని, లేదంటే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించాయి. దీనిని శుక్రవారం జస్టిస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ అనిల్ దవేలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ముందుగానే చేపట్టాల్సిన తనిఖీలను చివరివరకూ చేపట్టలేదని.. చిన్న చిన్న కారణాలను చూపుతూ అఫిలియేషన్‌ను నిరాకరించడం సరి కాదంటూ కాలేజీల యాజమాన్యాల తరఫున న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్, జీఎన్ రెడ్డి, తెలంగాణ అడ్వొకేట్ ఆన్ రికార్ట్స్ ఉదయ్‌కుమార్ సాగర్ వాదనలు విని పించారు. అనుమతుల విషయంలో జాప్యం జరగడంతో.. కళాశాలలు నష్టపోయాయని కోర్టుకు తెలిపారు. ఈ కాలేజీలను కౌన్సెలింగ్‌కు అనుమతించాలని హైకోర్టు ఆదేశించినా.. అప్పటికే ఆలస్యమైందంటూ జాబితాలో చేర్చలేదని విన్నవించారు. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో కౌన్సెలింగ్ గడువును జూలై31 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించారని కోర్టుకు తెలిపారు. అప్పటికీ కౌన్సెలింగ్ పూర్తికాకపోవడంతో రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని ఇంతకుముందే సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చిందని వివరించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మా సనం పిటిషన్లను విచారణకు స్వీకరించింది. ఈ విచారణను సంబంధిత ధర్మాసనానికి బదిలీ చేస్తామని పేర్కొంటూ.. విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూలకు నోటీసులు జారీ చేసింది. మాకు న్యాయం చేయండి రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. న్యాయస్థానం దీనిపై విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది. జేఎన్టీయూహెచ్కు, తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కళాశాలల తనిఖీకి, నివేదిక ఇచ్చేందుకు... కౌన్సెలింగ్ తేదీకి మధ్య వ్యవధి తక్కువగా ఉన్నం దున హడావుడి నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొన్ని కాలేజీల వాళ్లు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎక్కడో సమాచార లోపంతోనే ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం, జేఎన్టీయూహెచ్ సహృదయంతో ఆలోచించి విద్యార్థులకు, కళాశాలల యాజమాన్యాలకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలి - నీల సత్యనారాయణ, చైర్మన్, కోదాడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ -
వైజాగ్‌లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పై సాక్షి సదస్సు
-
రివ్యూ పిటిషన్‌తోనే విద్యార్థులకు న్యాయం
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ‘సాక్షి’ చర్చావేదికలో నిపుణులు భేషజాలకు పోకుండా విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి ఇరు ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో ఈ ఏడాది ఎన్నడూ లేనంత అయోమయం నెలకొంది. రాష్ట్ర విభజన విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. సాఫీగా సాగాల్సిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆరంభం నుంచీ వివాదాస్పదమే. ఇరు ప్రభుత్వాల సమన్వయ లోపమే సమస్యకు ప్రధాన కారణంగా నిలిచింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. వందల కళాశాలల్లో సీట్లు మిగిలిపోయినా.. అర్హత ఉన్నవారు సైతం చేరలేని దుస్థితి. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లడమే ఇందుకు కారణం. అక్కడ కూడా సరిగా వ్యవహరించక పోవడంతో రెండో విడత ఈ కౌన్సెలింగ్‌కూ అవకాశం లేకుండా పోయింది. లక్షలాదిమంది తల్లిదండ్రులు, విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్న జటిలమైన ఈ సమస్యపై ‘సాక్షి’ మీడియా అక్షరయజ్ఞం ప్రారంభించింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో తలెత్తిన సమస్యపై ‘తప్పెవరిది? శిక్షెవరికి?’ పేరిట ఇరు రాష్ట్రాల్లో నాలుగు ప్రాంతాల్లో చర్చావేదికలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని పొ ట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తొలిచర్చా కార్యక్రమం నిర్వహించింది. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ చర్చావేదికలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ తిరుపతిరావు, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు భేషజాలు వీడి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, రెండో విడత కౌన్సెలింగ్‌కు ఆస్కారం కలిగే విధంగా ఇరు ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు ముందుకు రావాలని చర్చావేదికలో పాల్గొన్న విద్యావేత్తలు సూచించారు. కళాశాలలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం ముందే చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ప్రస్తుత అనుభవాలను ఓ గుణపాఠంగా భావించి సమస్య పునరావృతమవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కోసం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఓ ఫోరం ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. వర్సిటీలే కౌన్సెలింగ్ బాధ్యత చేపట్టాలిః చుక్కా రామమ్య విద్యార్థుల్ని అయోమయానికి గురిచేస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారంపై తప్పిదమంతా ఇరు రాష్ట్ర ప్రభుత్వ పాలకులదే. దీనివల్ల శిక్ష అనుభవిస్తున్నది మాత్రం విద్యార్థులు. కౌన్సెలింగ్ నిర్వహణకు ఉన్నత విద్యామండలికి ఎలాంటి అధికారం లేదనేది సుస్పష్టం. యూనివర్సిటీలే స్వయంగా తీర్మానం చేసి తమకున్న అధికారాన్ని విద్యామండలికి కట్టబెట్టాయి. ఫలితంగా అకడమిక్ స్వేచ్ఛను కోల్పోయాయి. ప్రస్తుతం యూనివర్సిటీలు అకడమిక్ ఫ్రీడమ్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కౌన్సెలింగ్ నిర్వహణ బాధ్యతలు కూడా యూనివర్సిటీలే చేపట్టాలి. ముందుగా మేల్కొంటే సమస్య తలెత్తేది కాదుః ప్రొఫెసర్ తిరుపతిరావు, ఓయూ విశ్రాంత ఉపకులపతి కౌన్సెలింగ్ సమస్యకు అందరూ భావిస్తున్నట్లు రాష్ట్ర విభజన కారణం కాకపోవచ్చు. కేవలం ఇదొక సాకు మాత్రమే. విభజన నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలకు నిర్దిష్టమైన నిబంధనలు తెలియజేశారు. ఇరు ప్రభుత్వాలు వుుందుగా మేల్కొంటే సవుస్య తలెత్తేది కాదు. రెండు రాష్ట్రాలు సవున్వయుంతో వ్యవహరించి, సవుస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉన్నా సుప్రీంకోర్టు వరకూ వెళ్లారుు. న్యాయస్థానం జోక్యం చేసుకుని సెప్టెంబరు మొదటి తారీఖుకల్లా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయమని ఆదేశించటంతో ప్రక్రియను వేగవంతంగా ముగించారు. ఫలితంగా విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది. సామరస్య ధోరణితోనే పరిష్కారంః మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి సయోధ్య ఉందనేది చెప్పేందుకు ‘ఏ భాషలో చెబితే మీకు అర్థమవుతుంది’ అంటూ ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానం ఒక్కటి చాలు. సామరస్య ధోరణిలో చర్చించుకోవాల్సిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం వరకూ తీసుకెళ్లటం పెద్ద తప్పు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఇంతటి గందరగోళ పరిస్థితులకు ఇరు ప్రభుత్వాలదే బాధ్యత. -
సీట్లు ఖాళీ ఉంటే అది మీ తప్పే: సుప్రీం
న్యూఢిల్లీ: ఎంసెట్ మలివిడత కౌన్సిలింగ్ గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎంసెట్‌పై గతంలో తామిచ్చిన సూచనలకే కట్టుబడి ఉండాలని సుప్రీం స్ఫష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఎంసెట్ మలివిడత గడువు పెంచాలని సుప్రీంలో వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులు మొదలైనందున గడవు పొడగించలేమని తెలిపింది. పదేపదే గడువు పొడిగించమని కోరడం సమంజసం కాదని సుప్రీం అభిప్రాయపడింది. ఓ వేళ ఇప్పుడు పొడిగిస్తే... మళ్లీ పొడిగించమని కోరరనే గ్యారెంటీ ఏంటని ప్రశ్నించింది. రాష్ట్రంలో 65 వేల ఇంజినీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయని ఈ సందర్బంగా విద్యామండలి సుప్రీంకు తెలిపింది. దీనిపై సుప్రీం స్పందిస్తూ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఖాళీ సీట్లు ఉండనివ్వండి... అలా ఉన్నాయంటే తప్పు మీదే అని వెల్లడించింది. -
సుప్రీం అనుమతిస్తేనే రెండో విడత కౌన్సెలింగ్
-
ప్రవేశాలు ఖరారు చేయొద్దు
* ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్‌పై సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించిన హైకోర్టు ధర్మాసనం * లోపాలు సరిదిద్దుకోని కాలేజీలనూ వెబ్‌కౌన్సెలింగ్ జాబితాలో చేర్చండి * ఈ కళాశాలల్లో ప్రవేశాలను మాత్రం ఖరారు చేయవద్దు * కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని విద్యార్థులకు చెప్పండి * జేఎన్టీయూకు ధర్మాసనం ఆదేశం * కాలేజీల పిటిషన్లపై 12 నుంచి తుది విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జికి సూచన సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అన్ని కాలేజీలను చేర్చాలంటూ సింగిల్ జడ్జి గతవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం సవరించింది. లోపాలను సరిదిద్దుకోలేదని చెబుతున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలను సైతం ప్రాథమిక కౌన్సెలింగ్‌లో చేర్చాలని, అయితే వీటి విషయంలో సింగిల్ జడ్జి తిరిగి నిర్ణయం వెలువరించే వరకు ప్రవేశాలను మాత్రం ఖరారు చేయవద్దని హైదరాబాద్ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఈ కాలేజీల్లో ప్రవేశాలన్నీ సింగిల్ జడ్జి ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని కౌన్సెలింగ్ సమయంలోనే విద్యార్థులందరికీ తెలియచేయాలని వర్సిటీకి స్పష్టం చేసింది. ఈ కాలేజీలకు రెండు రోజుల్లో తిరిగి నోటీసులు జారీ చేయాలని జేఎన్టీయూను ఆదేశించింది. కాలేజీల్లో కంప్యూటర్ల వివరాలు, విద్యార్థులు, బోధనా సిబ్బంది సంఖ్యతోపాటు విద్యార్థి, అధ్యాపకులు నిష్పత్తి తదితర అంశాలపై నిర్దిష్ట సమాచారాన్ని కోరుతూ నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. కాలేజీలు ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నుంచి తుది విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్ జడ్జికి స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. హైకోర్టును ఆశ్రయించిన అన్ని కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జేఎన్టీయూ సోమవారం అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. జేఎన్టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించగా, కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదించారు. తొలుత రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ మొత్తం 272 ఇంజనీరింగ్ కాలేజీలు, 90 ఫార్మసీ కాలేజీలు ఉండగా.. 145 ఇంజనీరింగ్, 50 ఫార్మసీ కాలేజీల్లోనే నిబంధనల మేర బోధనా సిబ్బందితో సహా ఇతర సౌకర్యాలున్నాయని తెలిపారు. వాటిని మాత్రమే పీజీ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని కోర్టుకు నివేదించారు. హామీలివ్వడం మామూలే ‘కౌన్సెలింగ్‌లో ఎవరికి స్థానం కల్పించాలన్న దానిపై మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పినా కూడా సింగిల్ జడ్జి పట్టించుకోకుండా అన్ని కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. 272 ఇంజనీరింగ్ కాలేజీల్లో 266 కాలేజీలు సమాచారం వెల్లడించగా ఇందులో 145 కాలేజీలు మాత్రమే పూర్తి సంతృప్తికరమైన సమాచారం ఇచ్చాయి. 90 ఫార్మసీ కాలేజీలకు గాను 50 కాలేజీలే సంతృప్తికరంగా స్పందించాయి. పూర్తి సమాచారాన్ని పరిశీలించిన తరువాతనే అన్ని సౌకర్యాలున్న కాలేజీలనే కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని నిర్ణయిం చాం. లోపాలున్నాయని మేం చెప్పడం, సవరించుకుంటామని కాలేజీలు లిఖితపూర్వక హామీలివ్వడం ఏటా పరిపాటిగా మారిపోయింది. అందుకనే సౌకర్యాలు లేని కాలేజీలకు కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించలేదు’ - కె.రామకృష్ణారెడ్డి (ఏజీ) కోర్టు ఉత్తర్వులంటే జేఎన్టీయూకు గౌరవం లేదు ‘కాలేజీల్లో సౌకర్యాల గురించి మే, జూన్ నెలల్లోనే జేఎన్టీయూ తనిఖీలు నిర్వహించి నివేదిక తయారు చేసింది. లోపాలే ప్రధాన సమస్య అయితే వాటి గురించి అప్పుడే కాలేజీలకు చెప్పి ఉండాల్సింది. అప్పుడు మౌనంగా ఉండి తీరా కౌన్సెలింగ్ సమయంలో లోపాలు ఉన్నాయంటూ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చకపోవడం దారుణం. ప్రతి విషయంలోనూ జేఎన్టీయూ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. వారి నిబంధనలను వారే పట్టించుకోవడం లేదు. 174 కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని సింగిల్ జడ్జి గత నెల 25న ఉత్తర్వులిస్తే యూనివర్సిటీ ఏ మాత్రం పట్టించుకోలేదు. కోర్టు ఉత్తర్వులంటే వారికి ఏ మాత్రం గౌరవం లేదు. అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది’ - డి.ప్రకాశ్‌రెడ్డి (కాలేజీల తరపు న్యాయవాది) -
సుప్రీం అనుమతిస్తేనే రెండో విడత కౌన్సెలింగ్
* ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై నేడు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు బుధవారం స్పష్టతనివ్వనుంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ వ్యవహారాన్ని కూడా కోర్టు తేల్చనుంది. ఈ నేపథ్యంలో ఇందుకు విధించిన గడువును ఏపీ ఉన్నత విద్యా మండలి మరో వారం పొడిగించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఈ నెల 15లోగా పూర్తి చేయాలని మొదట్లో భావించినప్పటికీ.. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ గడువును 23కు పొడిగించింది. నిజానికి మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి కాగానే.. రెండో విడతకు ఏపీ మండలి సిద్ధమైంది. అయితే ఆగస్టు 31 తర్వాత కౌన్సెలింగ్ చేపడితే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లవుతుందని, మళ్లీ కౌన్సెలింగ్ చేపట్టాలంటే కోర్టు అనుమతి తప్పనిసరన్న టీ సర్కార్ వాదనతో ఏపీ మండలి గందరగోళంలో పడింది. చివరకు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలోనూ ఇదే చిక్కు వచ్చిపడింది. దీంతో చేసేదేమీ లేక మూడు రోజుల కిందటే ఏపీ మండలి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతినివ్వాలంటూ అఫిడివిట్ దాఖలు చేసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలనాపర ఇబ్బందులున్నాయని, తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్) పథకానికి మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని, ఇందుకు అక్టోబరు 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టును గతంలో కోరిన సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి ప్రవేశాలు అయినందున ఏపీ సర్కారు అభిప్రాయం మేరకు ఆగస్టు 31లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని కోర్టు గతంలో ఆదేశించింది. కానీ, ఈ గడువులోగా తొలి విడత కౌన్సెలింగే పూర్తయింది. రెండో దశతోపాటు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఇంకా చర్యలు చేపట్టాలి. ఈ నేపథ్యంలో తాము మరింత గడువు అడిగితే.. ఆగస్టు 31లోగా మొత్తం కౌన్సెలింగ్ పూర్తి చేస్తామన్న ఏపీ కౌన్సిల్ ఇప్పుడు కోర్టు అనుమతి లేకుండా రెండో విడతను ఎలా చేపడతుందని టీ సర్కారు ప్రశ్నించింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం కూడా తీసుకుంది. కోర్టు తీర్పు ప్రకారం గడువు ముగిసినందున మళ్లీ ఏం చేయాలన్నా కోర్టు అనుమతి అవసరమని ఏజీ పేర్కొనడంతో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ టీ సాంకేతిక విద్యా కమిషనర్ ఇటీవలే ఏపీ మండలికి లేఖ రాశారు. దీంతో ఈ విషయంలో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. బుధవారం వచ్చే తీర్పు మేరకు అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. మేనేజ్మెంట్ కోటాకు 30 వేల దరఖాస్తులు ఇంజనీరింగ్(బీటెక్) మేనేజ్మెంట్ కోటాలో సీట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం వరకు 30 వేలు దాటినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మంగళవారం మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యా మండలి మార్చింది. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పాత షెడ్యూలు ప్రకారం ఈ నెల 3వ తేదీతో ఆ ప్రక్రియ ముగిసింది. అయితే సీట్ల భర్తీకి తాజాగా సుప్రీంకోర్టు అనుమతి కోరిన నేపథ్యంలో షెడ్యూలును ఏపీ మండలి మార్చింది. ఈ నెల 12 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రకారం 14 నాటికి కాలేజీలకు మెరిట్ జాబితాలను అందజేయనుంది. విద్యార్థులకు 21లోగా ఇంటర్వ్యూలు నిర్వహించాలని, సీట్లు కేటాయించిన వారి వివరాలను 23లోగా పంపిం చాలని ఏపీ మండలి వర్గాలు పేర్కొన్నాయి. -
తెలంగాణలో రెండో విడత కౌన్సెలింగ్ ఉండదు
హైదరాబాద్ : తెలంగాణలో రెండో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండదని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ ఏర్పాటు చేసినా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదన్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల విషయంలో ఏపీ ఉన్నత విద్యామండలి జోక్యం అవసరం లేదన్నారు. తెలంగాణలో సీట్లు తామే భర్తీ చేసుకుంటామని పాపిరెడ్డి తెలిపారు. ప్రవేశాల ముఖ్య అధికారి రఘునాథ్ పదవి పొడిగింపుపై సంబంధం లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినే ఇన్‌ఛార్జ్‌గా నియమించుకుంటామన్నారు. -
'కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు కాదు'
హైదరాబాద్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఇంజనీరింగ్ లో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్ అనేది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించినంత మాత్రానా కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు కాదన్నారు. మేనేజ్మెంట్ సీట్ల కోటా భర్తీ ఏపీ ఉన్నత విద్యా మండలి పరిరక్షణలో జరుగుతుందన్నారు. షెడ్యూల్ ప్రకారం అన్ని కౌన్సెలింగులు తామే నిర్వహిస్తామని ఆయన తెలిపారు -
ఇంజనీరింగ్ మొదటి కౌన్సెలింగ్ పూర్తి
హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసిందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డితెలిపారు. ఈనెల 30 సీట్లు కేటాయిస్తామని చెప్పారు. గుర్తింపు రద్దయిన 130 కాలేజీల లిస్టు 12 గంటలలోపు వచ్చివుంటే కౌన్సెలింగ్ లో వాటి పేర్లను చే్చే అవకాశముండేదన్నారు. గుర్తింపు కోల్పోయిన కాలేజీలను జేఎన్టీయూ సర్టిఫై చేస్తే ఆయా కాలేజీల పేర్లను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. -
విశేషాధికారాలపై వైఖరి మారదు: తెలంగాణ కేబినెట్
* గవర్నర్‌కు అధికారాలపై రాష్ర్ట కేబినెట్ ఆందోళన * కేంద్రం సూచనలకు సమ్మతించరాదని నిర్ణయం * తదుపరి కార్యాచరణకు మరోసారి భేటీకి యోచన * రుణమాఫీ, రెగ్యులరైజేషన్, కేసుల ఎత్తివేత, అమరుల కుటుంబాలకు సాయం, టీ ఇంక్రిమెంట్‌కు ఆమోదం * పంద్రాగస్టున ప్రకటించనున్న సీఎం కేసీఆర్ * రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బకాయిల విడుదలకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గవర్నర్ విశేషాధికారాలకు సంబంధించి కేంద్రం పంపిన లేఖపై తెలంగాణ కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతించబోమన్న వైఖరికే కట్టుబడి ఉండాలని నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన దాదాపు నాలుగు గంటల పాటు రాష్ర్ట మంత్రి వర్గం సమావేశమైంది. గవర్నర్ విశేషాధికారాలపై పార్లమెంటులో ఎంపీలు స్పందించిన తీరును ఈ సందర్భంగా కేబినెట్ ప్రశంసించింది. ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందనే అంశాన్ని సమర్థంగా వెల్లడించగలిగామని మంత్రులు అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై మరింత ఆచితూచి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉందని, ఇందుకు మరోసారి భేటీ కావాలని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ భేటీలో ప్రధానంగా ఆరు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రైతులకు రుణ మాఫీ, చేనేత కార్మికులకు రుణ మాఫీ, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్, అమరవీరుల కుటుంబాలకు చేయూత, తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్‌కు సంబంధించిన పలు అంశాలను మంత్రివర్గం విశ్లేషించింది. ఈ వివరాలను స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, పంద్రాగస్టు వేడుకల్లోనే దళితులకు భూ పంపిణీ పథకాన్ని అమలు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఐదేళ్లుగాా పెండింగ్‌లో ఉన్న రైతుల ఇన్పుట్ సబ్సిడీ(రూ. 480.42 కోట్లు)ని విడుదల చేయడానికి ఆమోదముద్ర వేసింది. ఇక చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించడంపై కేసీఆర్‌ను మంత్రివర్గం ప్రత్యేకంగా అభినందించింది. ఎంసెట్ కోసం ఉమ్మడి కమిటీ సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. కౌన్సిలింగ్ నిర్వహణకు ఉమ్మడిగా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తమ ఆధ్వర్యంలోనే ప్రవేశాలను చేపట్టేందుకు సిద్ధపడిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జేఎన్టీయూహెచ్ తెలంగాణలోనే ఉన్నందున తామే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, ఇందుకు రెండు రాష్ట్రాల అధికారులతో కూడిన ఉమ్మడి కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని కేబినెట్లో తీర్మానించింది. జేఎన్టీయూ వీసీ జాయింట్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరేసి చొప్పున అధికారులు సభ్యులుగా ఉండాలని నిర్ణయించారు. కౌన్సిలింగ్ నిర్వహణ కోసం మంగళవారమే నోటిఫికేషన్ జారీ చేసి, వీలైతే 13 లేదా 14 నుంచే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) కింద నిబంధనల ప్రకారమే ఫీజులను చెల్లించే అంశంపై కూడా సమావేశంలో మంత్రులు చర్చించారు. 1956 స్థానికతకు కట్టుబడి ఉండాలని, ఫీజు బకాయిలపై తక్షణమే లెక్కలు తీయాలని నిర్ణయించారు. జెండాలు ఎగరేసేది వీరే.. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. మంత్రులు లేని మహబూబ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్, ఖమ్మంలో మంత్రి పద్మారావులు పతాకాలను ఆవిష్కరిస్తారు. ఆదిలాబాద్‌లో జోగు రామన్న, నిజామాబాద్‌లో పోచారం శ్రీనివాసరెడ్డి, కరీంనగర్లో ఈటెల రాజేందర్, వరంగల్‌లో రాజయ్య, మెదక్‌లో హరీష్‌రావు, రంగారెడ్డిలో మహేందర్‌రెడ్డి, నల్గొండలో జగదీశ్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దసరాకే కల్లు డిపోలు హైదరాబాద్‌లో గతంలో మూతపడ్డ 103 కల్లుడిపోలతో పాటు రంగారెడ్డిలో 17 కల్లు డిపోలను దసరా రోజున తిరిగి ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ బాధ్యతను ఎక్సైజ్ మంత్రి పద్మారావుకు అప్పగించింది. వీలైనంతవరకు పాతవారికే వాటిని అప్పగించాలని కొందరు మంత్రులు సూచించారు. రుణాలమాఫీపై మరోసారి ఆర్బీఐ వద్దకు .... ఇదిలా ఉండగా, రైతుల రుణాల రీషెడ్యూల్ విషయంలో మరోసారి రిజర్వ్ బ్యాంకు తలుపుతట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది, ఈ అంశాన్ని తెలంగాణ మంత్రిమండలి సోమవారం సుధీర్ఘంగా చర్చించింది. కరువు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన 415 మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ చేయాలని ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం ఆర్బీఐని కోరిన సంగతి తెలిసిందే. అయితే పంటల దిగుబడిని పరిగణలోకి తీసుకుని ఆర్బీఐ కేవలం మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని వంద మండలాల్లోనే రుణాల రీ షెడ్యూల్‌కు అంగీకరించి, వాటి చెల్లింపులకు కూడా అనేక షరతులు విధించిన సంగతి తెలిసిందే. రుణాల రీ షెడ్యూల్‌ను మరిన్ని మండలాలకు వర్తింప చేయాలని కోరుతూ ఆర్బీఐని కోరాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. రైతుల రుణాల మాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే భారీమొత్తంలో నిధులు సమీకరణపై ఈ సమావేశంలో చర్చించినప్పటికీ, ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదు. ఒకేసారి నిధుల సేకరణ ఎలా అన్న అంశం ఇబ్బందికరంగా మారుతుందని, అయితే,దీనిపై వచ్చే సమావేశంలో చర్చిద్దామని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం ఆర్బీఐ చేసిన ప్రతిపాదన ప్రకారమైతే.. తెలంగాణ ప్రభుత్వం దాదాపు 16 వేల కోట్ల మేరకు సమీకరించుకోవాల్సి ఉంటుంది. -
ఎంసెట్ అడ్మిషన్లపై మధ్యాహ్నం విచారణ
న్యూఢిల్లీ : ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్లపై సోమవారం మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నఈ వివాదంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవటంతో ఆ ప్రభుత్వం పాస్ ఓవర్ కోరింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తరపున ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కాగా ఎంసెట్ అడ్మిషన్లకు అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ వాదనను ఈ నెల 4న సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ.. ఆగస్టు 31 లోగా అడ్మిషన్లను పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంపై సోమవారం ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత సుప్రీం తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. -
సుప్రీం కోర్టు తీర్పు తర్వాతే కౌన్సెలింగ్ షెడ్యూల్!
* కౌన్సెలింగ్‌పై తెలంగాణ ఉన్నత విద్యా మండలి తొలి భేటీలో నిర్ణయం * ఎల్లుండి కోర్టు ఆదేశాలను బట్టి చర్యలకు యోచన సాక్షి, హైదరాబాద్: సొంతంగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకే సిద్ధమైన రాష్ర్ట ప్రభుత్వం.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణకు వేరుగా షెడ్యూల్ ప్రకటిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కౌన్సెలింగ్‌కు గడువు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 11న సుప్రీంలో తుది విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజున సుప్రీం నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఈ నేపథ్యంలో తీర్పు వచ్చిన తర్వాత సమావేశమై ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలపై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తొలి పాలకవర్గ సమావేశం శుక్రవారం సచివాయంలో జరిగింది. పలు దపాలుగా జరిగిన భేటీలో మండలి చైర్మన్ పాపిరెడ్డితోపాటు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యర్, మండలి వైస్ చైర్మన్, కార్యదర్శితో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. కాలేజీల టాస్క్‌ఫోర్స్ తనిఖీలకు ఇంకా ఎంత సమయం పడుతుందనే విషయాన్ని పరిశీలించారు. కోర్టు తీర్పు రానున్నందున ముందుగానే షెడ్యూలు ప్రకటించడం ఎందుకనే దిశగా చర్చ జరిగినట్లు తెలిసింది. పైగా తెలంగాణ ప్రభుత్వం ఇంకా వాదనలు వినిపించాల్సి ఉన్నందున కూడా ప్రస్తుతానికి షెడ్యూల్‌ను ప్రకటించకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాలని నిర్ణయించారు. ఇందుకోసం సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఆయనను కలవలేకపోయారు. దీంతో కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాతే ఈ విషయంలో స్పందించాలని నిర్ణయించారు. కాగా, ఈ సమావేశానికి ముందే విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోనూ అధికారులు చర్చించారు. విధుల్లో చేరిక సమావేశానికి ముందే తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశం, కార్యదర్శి శ్రీనివాసరావు తమ బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు ఇతర సభ్యులూ చైర్మన్ పాపిరెడ్డికి రిపోర్టు చేశారు. మరో వైస్ చైర్మన్ వెంకటాచలం కూడా చైర్మన్‌ను కలిసినప్పటికీ విధుల్లో చేరలేదు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. -
వేరుగా నోటిఫికేషన్
* ఎంసెట్ కౌన్సెలింగ్‌పై టీ ఉన్నత విద్యామండలి చైర్మన్ * ధ్రువపత్రాల పరిశీలనకు వీలైతే రేపే నోటిఫికేషన్ * ‘సుప్రీం’ తీర్పును బట్టి 12 నుంచి ప్రక్రియ * వెబ్ ఆప్షన్లు మాత్రం ఉమ్మడిగా చేపట్టే అవకాశం * విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని సూచన * నేడు టీ ఉన్నత విద్యామండలి సమావేశం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల తనిఖీకి తెలంగాణలో వేరుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. వీలయితే ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేసి.. 12 నుంచి వెరిఫికేషన్ చేపట్టే అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్లను మాత్రం రెండు రాష్ట్రాలకు కలిపి ఒకేసారి చే పట్టే అవకాశం ఉంది. మండలి చైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సర్టిఫికెట్ల తనిఖీ, వెబ్ ఆప్షన్లు, ఇతర అంశాలపై తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో గురువారం సాయంత్రం 4 గంటలకు పాపిరెడ్డి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయం రెండో అంతస్తులోని ప్రస్తుత కార్యదర్శి చాంబర్‌ను కేటాయించారు. అనంతరం పాపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సమావేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తామని.. ఇందులో ఎంసెట్‌కు సంబంధించిన అన్ని అంశాలను చర్చిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణకు వేరుగా ధ్రువపత్రాల తనిఖీ షెడ్యూలును ప్రకటిస్తామని.. ఏపీ మండలి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు, రాష్ట్ర విభజన చ ట్టంలోని నిబంధనలకు లోబడే ఈ ప్రక్రియ చేపడతామని.. ఆ మేరకే ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రవేశాల ప్రక్రియ అనుకున్నంత త్వరగా పూర్తి కాకపోవచ్చని, అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాపిరెడ్డి భరోసా ఇచ్చారు. ప్రవేశాల ప్రక్రియ గతంలోనూ ఆలస్యం అయిందని, ప్రస్తుతం విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని చెప్పారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ హెల్ప్‌లైన్ కేంద్రాలకు సంబంధించి ఇంకా అన్ని ఏర్పాట్లు పూర్తి కాలేదన్నారు. సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పాపిరెడ్డి చెప్పారు. తాము చేపట్టబోయే ప్రక్రియ కామన్ అడ్మిషన్ విధానం ప్రకారమే ఉంటుందని, కోటా విషయంలో ఏపీ విద్యార్థులకు ఏ నష్టమూ ఉండదన్నారు. కాగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా పాపిరెడ్డి వెంట విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు తదితరులు వెంట ఉన్నారు. అనంతరం ఏపీ మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, కాసేపు చర్చించారు. పాపిరెడ్డి అంతకుముందు గవర్నర్ నరసింహన్‌ను కూడా కలిసి వచ్చారు. టీ మండలికి ఇద్దరు వైస్ చైర్మన్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలికి పూర్తిస్థాయి పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలమూరు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఎస్.వెంకటాచలం, ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.మల్లేశంలను వైస్ చైర్మన్లుగా నియమించారు. టీ మండలికి సంబంధించి గత ఉత్తర్వుల్లో ఒక వైస్ చైర్మన్ అని మాత్రమే పేర్కొనగా... ఆ ఉత్తర్వులను సవరిస్తూ ఇద్దరు వైస్ చైర్మన్లు అని చేర్చారు. ఇక కార్యదర్శిగా శ్రీనివాసరావు పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై మండలి చైర్మన్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న మండలి కార్యదర్శి సతీష్‌రెడ్డి ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా కొనసాగుతారు. మండలిలో ఎక్స్అఫీషియో సభ్యులుగా తెలంగాణలోని వివిధ వర్సిటీల వైస్ చాన్సలర్లను... సభ్యులుగా పలువురు విద్యా రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలను నియమిం చారు. సభ్యుల కేటగిరీలో ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల్లో పనిచేసిన ప్రొఫెసర్లు పీవీ రమణారావు, ధనావత్ సూర్య, ఎ.సదానందం, సి.వెంకటయ్యతో పాటు పారిశ్రామికవేత్తలైన సాల్గుటీ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ నామినే టెడ్ కేటగిరీలో ఇందూ అరణ్యకు చెందిన ఒ.నర్సింహారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ జి.పాపయ్య, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణను (టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌గా) నియమించారు. వీరంతా మూడేళ్లు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఏపీలో వెరిఫికేషన్ ప్రారంభం ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలోని విద్యార్థుల సర్టిఫికెట్ల తనిఖీని ప్రారంభించారు. దీనికి ఒకటి నుంచి 5 వేల ర్యాంకులోపు విద్యార్థులు 2,716 మంది గురువారం హాజరు కావాల్సి ఉండగా... సాయంత్రం 6 గంటల వరకు 725 మంది మాత్రమే వచ్చారు. ఇక ఎన్సీసీ, వికలాంగులు, స్పోర్ట్స్ తదితర ప్రత్యేక విభాగాల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు హైదరాబాద్‌లోని సాంకేతిక భవన్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. నిర్ణయాధికారం మాదే: ఏపీ మండలి చైర్మన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహణలో నిర్ణయాధికారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికే ఉంటుందని మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని విద్యా మండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం ఉమ్మడి ప్రవేశాలు, కౌన్సెలింగ్‌లపై అధికారం తమదేనని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక ఉన్నత విద్యా మండలి ఏర్పాటైనందున.. ఆ మండలి చైర్మన్ పాపిరెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రవేశాల కమిటీల్లో చేర్చుతామని... ఈ మేరకు కమిటీల సమావేశాలకు ఆయనను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. వృత్తి విద్యా కోర్సులపైనా దృష్టి ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో.. ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలపై అధికారులు దృష్టి సారించారు. లాసెట్, ఎడ్‌సెట్, పాలిసెట్, ఈసెట్ ద్వారా చేపట్టాల్సిన వృత్తి విద్య సీట్ల భర్తీకి ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా ఆయా సెట్ల ప్రవేశాల కమిటీలను సమావేశపర్చి.. ధ్రువపత్రాల తనిఖీ, కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు తేదీలను ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కౌన్సెలింగ్‌కు వేళాయె!
సాక్షి, అనంతపురం : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమయం రానే వచ్చింది. సుప్రీం కోర్టు జోక్యంతో వారం రోజుల క్రితం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుంది. మేలో ఎంసెట్ రాసి.. ఇప్పటి వరకు కౌన్సెలింగ్ కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అనంతపురం జేఎన్టీయూ పరిధిలో 122 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. గత ఏడాది అడ్మిషన్లు లేని కారణంగా ఐదు మూతపడ్డాయి. ప్రస్తుతం 117 నడుస్తున్నాయి. వీటిలో సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ తదితర బ్రాంచీలతో కలుపుకుని 50,600 సీట్లు ఉన్నాయి. జేఎన్టీయూ(ఏ) రీజియన్ పరిధిలో లక్ష మంది విద్యార్థుల వరకు ఎంసెట్ రాశారు. దాదాపు 75 వేల మంది అర్హత సాధించారు. అనంతపురం జిల్లాలో జేఎన్టీయూ, ఎస్కేయూ కళాశాలలతో కలుపుకుని 19 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 6,900 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 4,830 (70 శాతం), మేనేజ్మెంటు కోటా కింద 2,070(30 శాతం) సీట్లు భర్తీ చేయనున్నారు. జిల్లాలో 10,800 మంది విద్యార్థులు ఎంసెట్ రాశారు. 7,500 మంది వరకు అర్హత సాధించారు. కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి విద్యార్థులకు నేటి (గురువారం) నుంచి ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. ఇందుకోసం జిల్లాలోని ఎస్కేయూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లొచ్చు. మొదటిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదు వేల ర్యాంకు వరకు విద్యార్థులను పిలుస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో 400 -500 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రానికి ప్రొఫెసర్ జే.శ్రీరాములు, పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ కేంద్రానికి ఆ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు. తరగతుల నిర్వహణ వేళ... గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం జూలై నాటికి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియను ముగించి.. ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభించాలి. అయితే.. అందుకు విరుద్ధంగా కౌన్సెలింగ్ చేపడుతున్నారు. తరగతులు జరగాల్సిన సమయంలో కౌన్సెలింగ్ చేపడుతుండడం గమనార్హం. ఆగస్టు 7 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, నెలాఖరుకు సీట్ల కేటాయింపు పూర్తవుతాయి. రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రయివేటు యాజమాన్యాల్లో టెన్షన్ ఫీజు రీయింబర్స్‌మెంటుపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొనడంతో ఒకానొక సందర్భంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఇప్పట్లో ఉంటుందా అన్న సందిగ్ధత విద్యార్థుల్లో నెలకొని ఉండింది. ఈ క్రమంలో వందలాది మంది జిల్లాకు చెందిన విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిపోయారు. అక్కడ తరగతులు కూడా ప్రారంభ మయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న సీట్ల కన్నా.. తక్కువ సంఖ్యలో విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అవకాశముంది. బయటి జిల్లాల నుంచైనా వస్తారా అంటే.. ఆ పరిస్థితి కూడా కన్పించడం లేదు. జిల్లాలో ఒకట్రెండు ప్రయివేటు కళాశాలల్లో మినహా ఏ కాలేజీలోనూ పెద్దగా మౌలిక వసతులు లేవు. అర్హత కల్గిన బోధన సిబ్బంది, ల్యాబ్‌లు సరిగా లేని కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో పొరుగు జిల్లాల విద్యార్థులు ఇక్కడ చేరే పరిస్థితులు తక్కువే. ఈ క్రమంలో కొన్ని కళాశాలల్లో సీట్లు మిగిలిపోయే అవకాశముంది. ఇదే జరిగితే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న రెండు..మూడు కళాశాలలు మూత దిశగా పయనించవచ్చు. -
ఎవరి దారి వారిదే!
* సొంతంగా కౌన్సెలింగ్‌కు తెలంగాణ సర్కారు మొగ్గు * ఉన్నత విద్యా మండలి చైర్మన్ నియామకం * అధికారులతో విద్యా మంత్రి చర్చ * నేడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష * విధాన నిర్ణయం తీసుకునే అవకాశం * ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంపై సందిగ్ధం సాక్షి, హైదరాబాద్: ఎవరి కౌన్సెలింగ్ వారిదేనా? ఎంసెట్‌పై కరీంనగర్లో సీఎం కేసీఆర్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ కసరత్తును చూస్తే ప్రస్తుతం ఇదే అనుమానం కలుగుతోంది. సొంత కౌన్సెలింగ్వైపే రాష్ర్ట ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది! తాజా పరిణామాలను బట్టి రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి కౌన్సెలింగ్ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కాలేజీలకు అఫిలియేషన్ల(అనుమతులు) ప్రక్రియ ఆరంభించిన రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసి మంగళవారం గెజిట్ నోటిఫై కూడా చేసింది. మండలి చైర్మన్‌గా పాపిరెడ్డిని నియమించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు, విద్యా శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యార్, న్యాయ శాఖ అధికారులతోపాటు పాపిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై 5 గంటలకుపైగా చర్చించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. న్యాయపరమైన అంశాల్లో ఎలా ముందుకు సాగాలనే విషయంతో పాటు ఈ నెల 11న జరిగే తదుపరి విచారణలో ఏయే అంశాలను సుప్రీంకోర్టుకు వివరించాలనే అంశంపై లోతుగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ర్టంలో తెలంగాణ విద్యార్థులకే ప్రయోజనాలు కల్పించడం, వారి హక్కులను కాపాడే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి లోబడి, సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి సొంత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని కోణాల్లో చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ఈనెల 7 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏపీ ఉన్నత విద్యా మండలి జారీ చేసిన నోటిఫికేషన్‌పై చర్చించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఎంసెట్ ప్రవేశాల కమిటీ వాయిదా వేసింది. తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యే వీలు లేకపోవడంతో.. దీన్ని బుధవారం నిర్వహించాలని ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అయితే ఇందులో తెలంగాణ అధికారులు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ పాల్గొన్నా.. రాష్ట్రంలో విద్యార్థులకు ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు లేనందున ఏపీ కౌన్సిల్ నిర్వహించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనబోరనే అంశాన్ని తేల్చి చెప్పే అవకాశం ఉంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా పాపిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఎలాగూ తెలంగాణ కౌన్సిల్ ఏర్పాటైనందున రాష్ర్ట విద్యార్థులకు కౌన్సెలింగ్ కోసం తేదీలను వేరుగా ప్రకటిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం యోచి స్తోంది. మంగళవారం సచివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందకుండా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఏపీ కౌన్సిల్ ఎలా చేపడుతుందని, ఏ సర్టిఫికెట్లు వెరిఫై చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా కౌన్సెలింగ్ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ అంశాలన్నింటిపై బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే సమావేశం అనంతరం కౌన్సెలింగ్‌పై తెలంగాణ సర్కారు విధాన ప్రకటన వెలువడే అవకాశముంది. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అడ్మిషన్లలోపే స్పష్టత ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లోపే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశం తేల్చకపోతే అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులెవ్వరూ సాహసించరని, దీనిపై గవర్నర్ తక్షణం స్పందించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. మంగళవారం ఇందిర భవన్లో పీసీసీ నేతలు సి.రామచంద్రయ్య, రుద్రరాజు పద్మరాజు, బొత్స సత్యనారాయణ, అహ్మదుల్లా, కన్నా లక్ష్మీనారాయణ, సుధాకర్ తదితరులతో కలసి విలేకరుల సమావేశంలో రఘువీరా మాట్లాడారు. కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఫీజులు ఎవరు భరిస్తారనేది పేద కుటుంబాల్లోని విద్యార్థులకు శేష ప్రశ్నగా మిగిలిందన్నారు. 95వ సెక్షన్‌లోని 371 డి ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ విద్యార్థులు పదేళ్లపాటు తెలంగాణలో కూడా అడ్మిషన్లు పొందేవిధంగా కేంద్రం చట్టం చేసిందన్నారు. దీనిపై జోక్యాన్ని కోరుతూ గవర్నర్‌కు త్వరలోనే లేఖ ఇస్తామని తెలిపారు. గవర్నర్ సమక్షంలో భుజాలు తట్టుకొని మాట్లాడుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు, ఆ సమయంలో విద్యార్థుల సమస్యలపై ఒక క్షణం మాట్లాడలేకపోయారా అని ప్రశ్నించారు. హామీ మేరకు షరతుల్లేకుండా అన్ని రకాల రుణాలు రద్దు చేయాలని చంద్రబాబును రఘువీరా డిమాండ్ చేశారు. -
రాజకీయం చేయొద్దు
-
సుప్రీం ఉత్తర్వుల కాపీ చూసి స్పందిస్తాం: వినోద్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని చూసిన తర్వాతే దానిపై స్పందిస్తామని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ఈ నెల 31వ తేదీలోగా కౌన్సెలింగ్‌ను పూర్తిచేయాలని న్యాయమూర్తి మౌఖిక వ్యాఖ్యలు చేసినట్టు తమ న్యాయవాది తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. వచ్చేనెల చివరి వరకు కూడా కౌన్సెలింగ్ నిర్వహణకు సమయముందని భావిస్తున్నామన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ వాదన నెగ్గిందనే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. ఈ విషయంలో తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని, విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. -
ఉభయ రాష్ట్రాల విద్యార్థులకు ఊరట
* సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ మంత్రి హర్షం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్, అడ్మిషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉభయ రాష్ట్రాల విద్యార్థులకు ఊరట కల్గించే అంశమని.. కోర్టు నిర్ణయాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, నాయకత్వానికి ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సహకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. సెప్టెంబర్ 1 నుంచి కళాశాలలు: పరకాల ఈ నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగుస్తుందని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వృత్తి విద్యా కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. -
ఇరు రాష్ట్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన
* 7 నుంచి 23 వరకూ నిర్వహిస్తాం: ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం గురువారం (7వ తేదీ) నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను 31 నాటికి పూర్తి చేసి, వచ్చే నెల మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ముందుకు సాగుతామని చెప్పారు. ఈ నెల 7 నుంచి 23వ తేదీ వరకూ రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని వెల్లడించారు. విద్యార్థులు ర్యాంకుల వారీగా ఏయే తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలో జూలై 30న జారీ చేసిన నోటిఫికేషన్లో వివరంగా ప్రకటించామని, ఆ షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే.. ఈ నెల 11న సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పును బట్టి తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. నేడు ఎంసెట్ ప్రవేశాల కమిటీ భేటీ? సుప్రీంకోర్టు తీర్పు పరిస్థితులపై చర్చించేందుకు అవసరమైతే మంగళవారం (5వ తేదీన) ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామని వేణుగోపాలరెడ్డి తెలిపారు. అయితే.. ధ్రువపత్రాల పరిశీలనకు తెలంగాణలో 23, ఆంధ్రప్రదేశ్‌లో 34 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కానీ కౌన్సెలింగ్ ప్రక్రియకు సహకరించబోమని తెలంగాణలో పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సహాయక కేంద్రాల ఏర్పాటు, ధ్రువపత్రాల పరిశీలనపై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం కావాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. -
విద్యార్థులతో చెలగాటమొద్దు
* తీరు మారకుంటే ఉద్యమిస్తాం: ఆంజనేయగౌడ్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ జాప్యం చేయడం ద్వారా తెలుగు విద్యార్ధులకు తీరని నష్టం చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుట్రలు చేస్తున్నారని తెలుగునాడు విద్యార్థి సంఘం జాతీయాధ్యక్షుడు ఆంజనేయగౌడ్ విమర్శించారు. 1956 నిబంధన విధించడం బీసీ విద్యార్థుల గొంతు కోయడానికేనని దుయ్యబట్టారు. ఈనెల 8న కలెక్టర్లకు వినతిపత్రాలు, 11న ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం, 13న రౌండ్‌టేబుల్ సమావేశాలు, 18న కలెక్టరేట్ల ముట్టడి చేయాలన్నారు. సోమవారం టీఎన్ఎస్ఎఫ్ జాతీయకమిటీ సమావేశమై ఈ అంశాలపై చర్చించింది. సమావేశంలో ఇరు రాష్ట్రాల అధ్యక్షులు బ్రహ్మం చౌదరి, మధుసూదన్‌రెడ్డితో పాటు రాజేష్, రవినాయుడు, సురేష్‌నాయక్, రమేష్ ముదిరాజ్, శ్యామ్‌సుందర్ శేషు తదితరులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో టీడీపీ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడానికి ఈ నెల 21న నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మేధోమథన సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆంజనేయగౌడ్ తెలిపారు. -
ఫీజులే ప్రధాన సమస్య
* అడ్మిషన్ల వివాదం తొలగినా.. రీయింబర్స్మెంట్ ఎలా? * 1956కు ముందు తెలంగాణ వారికే ఫీజులు ఇస్తామన్న టీ-సర్కారు * అక్కడ నివసిస్తూ చదువుకుంటున్న ఏపీ విద్యార్థులపై మల్లగుల్లాలు * 11న సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టత వస్తుందని ఏపీ సర్కారు నిరీక్షణ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంత ఊరట లభించినప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మాత్రం కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ నెల ఏడో తేదీ నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన జరుపుకోవచ్చని, ఆగస్టు నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టంచేసింది. అడ్మిషన్ల వరకు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం పరిష్కారమైనా.. అసలు సమస్య ఇపుడే ప్రారంభమవుతోంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, దానితో ముడిపడి ఉన్న స్థానికత అంశంపై ఏం చేయాలన్న దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటివరకు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దుచేసి కొత్తగా ‘ఫాస్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సాయమందించే ఈ పథకాన్ని తెలంగాణ స్థానికులకే అందిస్తామని ఆ ప్రభుత్వం స్పష్టంచేసింది. 1956కు ముందు తెలంగాణలో నివసిస్తున్న వారే స్థానికులని ఆ రాష్ట్ర సర్కారు చెప్పడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. ఈ నిబంధన వల్ల తెలంగాణలో స్థిరపడి ఉన్న లక్షలాది మంది సీమాంధ్ర విద్యార్థులకు ఆర్థికసాయం అందకుండా పోయే పరిస్థితి తలెత్తుతోంది. ఈ నెల ఏడో తేదీ నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. విద్యార్థులు తమ స్థానికతతో పాటు తమ వార్షిక ఆదాయాన్ని తెలిపే ధ్రువపత్రాలను పరిశీలన సమయంలోనే అధికారులకు అప్పగిస్తారు. సంబంధిత విద్యార్థి లేదా విద్యార్థిని ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హుడా లేదా అని అపుడే నిర్థారించి రికార్డుల్లో పొందుపరుస్తారు. ఆ రికార్డుల ఆధారంగా సీటు కేటాయించిన తరువాత కళాశాలల్లో చేర్చుకుంటారు. హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర విద్యార్థులు 1956 నుంచి ఉన్నట్లు నిరూపించుకుంటేనే అక్కడ స్థానిక ధ్రువపత్రాలు అందుతాయి. లేనిపక్షంలో స్థానికేతరులుగా మిగిలిపోతారు. దీనివల్ల తెలంగాణ ప్రాంతంలోని కళాశాలల్లో ఉమ్మడి ప్రవేశంలో సీట్లు సంపాదించినప్పటికీ స్థానికేతరులుగా ఆర్థిక సాయం అందుకోలేరు. అదే సమయంలో వీరు ఆంధ్రప్రదేశ్ వారా? తెలంగాణ ప్రాంతం వారా? అనే స్పష్టత ధ్రువపత్రాల్లో ఉండదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తానని చెప్పిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కూడా అర్హులు కాకుండాపోయే ప్రమాదముంది. అయితే ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టు తుది తీర్పులో దీనిపైన కూడా స్పష్టత వస్తుందని, ఆ తీర్పు తర్వాత తదుపరి చర్యలపై సమీక్షించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలపై చంద్రబాబు హర్షం ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సర్టిఫికెట్లను పరిశీలించటంతో పాటు అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం పట్ల చంద్రబాబు సోమవారం సామాజిక వెబ్సైట్ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ప్రవేశాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కౌన్సెలింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. -
రాజకీయం చేయొద్దు
* విద్యార్థులు నష్టపోకూడదు - 31లోగా అడ్మిషన్లు ముగించండి * ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్య * తెలంగాణ సర్కారు గడువు కోరటం వెనుక ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది * కౌన్సెలింగ్ నుంచి ఏపీ విద్యార్థులను తప్పించాలని చూస్తున్నట్లుగా ఉంది 371డీ ప్రకారమే అడ్మిషన్లు జరిగితే ఇక రెండు రాష్ట్రాల ప్రస్తావనెందుకు?.. తెలంగాణలో వచ్చి సెటిల్ అయిన వారిని లోకల్ కాదంటే ఎలా? * తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్నలు * ‘ఫాస్ట్’ నిబంధనల రూపకల్పనకు గడువు కావాలని వినతి * రాష్ట్రం విడిపోయాక ఏపీ విద్యార్థులకు ఫీజులు ఎలా చెల్లిస్తామని ప్రశ్న * ఫీజుల పథకం జోలికి వెళ్లని ధర్మాసనం.. కౌన్సెలింగ్‌కు పచ్చజెండా * ఈ నెల 11వ తేదీన సమగ్ర ఉత్తర్వులు వెలువరిస్తామని వెల్లడి * అక్టోబర్ 31 వరకూ గడువు కోరిన టీ-సర్కారు పిటిషన్‌పై విచారణ సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహణకు అక్టోబర్ 31 వరకు గడువు కోరుతూ వేసిన పిటిషన్ వెనక వేరే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అడ్మిషన్ల వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని పేర్కొంటూ.. అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టు 31 వరకూ నిర్వహించుకునేందుకు గడువిచ్చింది. గడువు పొడిగింపు కోరుతూ వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ సుదాంశు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణకు రాగానే తొలుత జస్టిస్ ముఖోపాధ్యాయ ‘అడ్మిషన్ కౌన్సెలింగ్‌కు షెడ్యూలు ఉంది కదా.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన కౌన్సెలింగే కదా.. ఇప్పుడు విడిపోయారు.. ఈ ప్రక్రియను ఎలా చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎ.కె.గంగూలీ వివరిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది..’ అని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఒక నెల గడువు ఇస్తే సరిపోతుంది..’ అని పేర్కొన్నారు. స్థానికతను ఎలా నిర్వచిస్తారు? దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది హరీష్‌సాల్వే తన వాదనలు వినిపిస్తూ ‘మా సమస్య ఏంటంటే.. ఒకసారి ప్రక్రియ మొత్తం చూడండి. అడ్మిషన్లు 70:30 నిష్పత్తి ప్రకారం జరుగుతాయి. 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో జరుగుతాయి. మిగిలినవి మేనేజ్మెంట్ కోటా సీట్లు. కన్వీనర్ కోటాలో తొలుత 15 శాతం ఓపెన్ మెరిట్ కోటాలో రాష్ట్రవ్యాప్త విద్యార్థులెవరైనా సరే పోటీపడొచ్చు. అలా భర్తీ అయ్యాక మిగిలిన 85 శాతం లోకల్ కేటగిరీకి రిజర్వ్ అయి ఉంటాయి. ఇవి స్థానికులతో భర్తీ చేస్తారు..’ అని వివరించారు. విద్యార్థుల స్థానికతను, పూర్వాపరాలను పరిశీలించేందుకు తమ వద్ద తగినంత మంది సిబ్బంది లేరని.. కాబట్టి కౌన్సెలింగ్ ప్రక్రియకు మరింత గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ జోక్యం చేసుకుంటూ ‘స్థానికతను ఎలా నిర్వచిస్తారు..?’ అని ప్రశ్నించగా.. ‘అది 371డీ చట్టం ప్రకారమే జరుగుతుంది. గతంలో ఉన్న ప్రకారమే..’ అని హరీష్‌సాల్వే వివరించబోయారు. సెటిలయిన వారిని నాన్‌లోకల్ అంటే ఎలా? తిరిగి న్యాయమూర్తి కల్పించుకుని ‘మీ ప్రధాన ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి ఎలిమినేట్ (తప్పించడం) చేయాలని చూస్తున్నట్టుగా ఉంది. అదే మీ ఉద్దేశంగా కనిపిస్తోంది.. వాస్తవానికి విద్యార్థులకు రాష్ట్ర విభజనతో ఏ రకంగానూ సంబంధం లేదు. దీనిని రాజకీయం చేయకూడదు.. విద్యార్థులకు సమాన అవకాశాలు ఉండాలి.. అది అటువారైనా ఇటువారైనా సరే.. విభజనకు ముందు ఎలా ఉందో అలాగే జరగాలి..’ అని పేర్కొన్నారు. దీనిపై హరీష్‌సాల్వే మాట్లాడుతూ.. ‘అందులో నుంచి మేం ఏమాత్రం పక్కకు పోవడం లేదు. 371డీ ప్రకారమే వెళుతున్నాం..’ అని పేర్కొన్నారు. వెంటనే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘తెలంగాణలో వచ్చి సెటిల్ అయిన వారిని లోకల్ కాదంటే ఎలా?’ అని ప్రశ్నించారు. అప్పుడు తెలంగాణ న్యాయవాది మాట్లాడుతూ ‘2011 నోటిఫికేషన్ చూడండి.. అందులో ఉన్న నిబంధనల ప్రకారమే మేం ముందుకు వెళుతున్నాం.. మేం అడ్మిషన్ల విషయంలో కొత్త నిబంధనలు రూపొందించడం లేదు..’ అని పేర్కొన్నారు. దీంతో జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే జోక్యం చేసుకుంటూ ‘మీరు విద్యార్థులకు పరిమితులు విధిస్తున్నట్టుగా ఉంది.. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధనల ప్రకారం చేయండి..’ అని పేర్కొన్నారు. అడ్మిషన్ల ప్రక్రియలో రాజకీయం వద్దు హరీష్‌సాల్వే వాదనలు వినిపిస్తూ ‘విభజనకు ముందు ఉన్నట్టుగానే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 371డీ ప్రకారం ఓయూ రీజియన్ పరిధిలో 10 తెలంగాణ జిల్లాలు, ఏయూ రీజియన్ పరిధిలో 9 జిల్లాలు, ఎస్వీయూ రీజియన్ పరిధిలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. ఏ రీజియన్ వారు ఆ రీజియన్‌లో దరఖాస్తు చేసుకుంటే లోకల్ అవుతారు. ఒక రీజియన్ విద్యార్థి మరోచోట నాన్ లోకల్ అవుతారు. ఇందులో గందరగోళం ఏమీలేదు. పాత విధానం ప్రకారం నడుచుకుంటాం. కానీ మా సమస్య అది కాదు.. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు చదువుకునేందుకు ఆర్థిక సాయం చేయాలనుకుంటోంది. అందుకు ఫాస్ట్ పేరుతో ఒక స్కీమ్ రూపొం దించింది. దానికి నిబంధనలు రూపొందించుకునేందుకు కొంత సమయం కావాలి.. అదీ మా సమస్య..’ అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ స్పందిస్తూ ‘మీరు అడ్మిషన్లను 371డీ ప్రకారం ఓయూ, ఎస్వీయూ, ఏయూ రీజియన్ల పద్ధతిలో భర్తీ చేస్తే.. ఇక తెలంగాణ, నాన్ తెలంగాణ అన్న అంశం ఎక్కడ వస్తోంది? ఏ విద్యార్థి ఎక్కడైనా అడ్మిషను పొందవచ్చు కదా? అడ్మిషన్ల ప్రక్రియలో రాజకీయం ఉండకూడదు...’ అని వ్యాఖ్యానించారు. విద్యార్థులు నష్టపోకూడదు.. హరీష్ సాల్వే కోర్టుకు తన వాదన వినిపిస్తూ ‘ఫాస్ట్ స్కీమ్ మా విద్యార్థుల కోసం రూపొందించుకుంటున్నాం. రాష్ట్రం విడిపోయాక ఏపీ విద్యార్థులకు మేమెలా భరిస్తాం..?’ అని అన్నారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ స్పందిస్తూ ‘మేం దాంట్లోకి వెళ్లడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అడ్మిషన్ నిబంధనలు పాటించండి..’ అని పేర్కొన్నారు. జస్టిస్ ఎస్.ఎ.బాబ్దే కూడా ఇంతకుముందు ఉన నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంలో సాల్వే మాట్లాడుతూ ‘ఫాస్ట్ స్కీమ్‌కు సంబంధించి హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.. ఒకవేళ అవసరమైతే దానిపై మేం మిమ్మల్ని ఆశ్రయిస్తాం..’ అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ మాట్లాడుతూ ‘ఈ ప్రతిష్టంబన ఇలాగే కొనసాగుతుందా..? నేను ఏ రాష్ట్రానికి చెందుతానో నాకే తెలియని పరిస్థితి. నేను బీహార్‌కు వెళితే మీరు జార్ఖండ్‌కు చెందినవారు అంటారు.. జార్ఖండ్‌కు వెళితే మీరు బీహార్‌కు చెందిన వారు అంటారు! విద్యార్థులు నష్టపోకూడదు. ఆగస్టు 31 కల్లా అడ్మిషన్ల ప్రక్రియ ముగించండి. ఈ కేసులో తదుపరి సమగ్ర ఉత్తర్వులు ఆగస్టు 11న జారీచేస్తాం. అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించవచ్చు’ అని పేర్కొన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన హరీష్‌సాల్వే అంగీ కరించారు. ఈ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీలంసహానీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. అడ్మిషన్లకు తెలంగాణ సర్కారు మరింత గడువు కోరటం తదితర అంశాలపై ఈ నెల 11వ తేదీన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
నేడు సుప్రీంకోర్టు ముందుకు ఎంసెట్ వివాదం
-
ఎం‘సెట్’ అయ్యేనా?
* నేడు సుప్రీంకోర్టు ముందుకు ఎంసెట్ వివాదం * గట్టి వాదనలకు సిద్ధమైన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు * కోర్టు దృష్టికి కాలేజీల తనిఖీలు, అనుమతుల ప్రక్రియ * అవి పూర్తికాకుండా ప్రవేశాలు కష్టమని వివరించనున్న టీ సర్కారు * కొత్త రాష్ర్టంలో అధికారుల కొరతతోనూ కౌన్సెలింగ్‌లో జాప్యం * మరింత గడువు కోసం పట్టుబట్టనున్న తెలంగాణ ప్రభుత్వం * విభజన చట్టం మేరకు ఉమ్మడి ప్రవేశాలు జరగాలని వాదించనున్న ఏపీ * కౌన్సెలింగ్‌కు సిద్ధమేనని తెలపనున్న ఏపీ ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారం సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తరుణంలో సుప్రీం నిర్ణయమే కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తన వాదన బలంగా వినిపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీలు పూర్తి చేసి, అఫిలియేషన్లు (అనుమతులు) ఇవ్వకుండా ప్రవేశాలు చేపట్టడం కష్టమేనని కోర్టుకు స్పష్టం చేయనుంది. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అక్టోబర్ 31లోగా పూర్తి చేస్తామని, అప్పటివరకు గడువు ఇవ్వాలని కోరుతూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం చేపట్టిన ‘ఫాస్ట్’ పథకం అమలుకు మరింత సమయం కావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ మేరకు కోర్టు అనుమతి పొందేందుకు పకడ్బందీగా వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన అంశాలపై విద్యా శాఖ, న్యాయ శాఖ వర్గాలు ఇప్పటికే పలుమార్లు కేసీఆర్‌తో పాటు విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో చర్చలు జరిపారు. తాము వినిపించబోయే వాదనలను ఆదివారం కూడా ముఖ్యమంత్రి దృష్టికి సంబంధిత వర్గాలు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏపీ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తెలంగాణ సర్కారు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కోర్టు పరిధిలో ఉన్న అంశంలో నిర్ణయం తీసుకోవద్దని కోరినా పట్టించుకోకపోవడం, తెలంగాణ అధికారులు హాజరుకాకున్నా నిర్ణయం తీసుకోవడం వంటి విషయాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒత్తిడి మేరకే కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టినట్లు తెలంగాణ సర్కారు కోర్టుకు తెలపనుంది. కాగా, ఆదివారం రాత్రికే విద్యా శాఖ, న్యాయ శాఖ అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. వీరు తెలంగాణ పక్షాన ప్రధానంగా మూడు అంశాలపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నట్లు సమాచారం. * తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే ఫాస్ట్ పథకం గురించి వివరిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించే ఈ పథకానికి మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉందని, ఇందుకు కొంత సమయం పట్టనుందని తెలియజేస్తారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో ఐఏఎస్ అధికారుల కొరత ఉందన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తేనున్నారు. దీంతో ఫాస్ట్ మార్గదర్శకాల రూపకల్పనలో కొంత ఆలస్యమవుతోందని, అయినా అందుబాటులో ఉన్న అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశామని వివరించనున్నారు. అయితే అధికారులకు పనిభారం వల్ల మార్గదర్శకాల జారీకి మరికొంత సమయం పడుతుందని, ప్రధానంగా ‘స్థానికత’ నిర్ధారణ అంశంపై కసరత్తు జరుగుతన్నట్లు కోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. ఆ తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీకి సమయం పడుతుందని తెలపనున్నారు. * కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా మొదట చేపట్టే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో విద్యార్థుల ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు కీలకమని, అవి లేకుండా వెరిఫికేషన్ కుదరదని వివరించనున్నారు. ఇందుకోసమే రెవెన్యూ శాఖను సిద్ధం చేస్తున్నామని, మార్గదర్శకాలు జారీ చేశాక, వేగంగా సర్టిఫికెట్ల జారీకి సన్నాహాలు చేయాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలియజేయనున్నారు. కౌన్సెలింగ్‌కు వీలుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించనున్నారు. * దాదాపు 446 వృత్తి విద్యా కాలేజీల తనిఖీలు(వీటిలో 330కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు) కొనసాగుతున్నాయని, అవి పూర్తి చేసేందుకు మరో మూడు వారాల సమయం పడుతుందనే విషయాన్ని కోర్టుకు చెప్పనున్నారు. తనిఖీలు పూర్తయ్యాకే కాలేజీలకు అనుమతులు(అఫిలియేషన్లు) ఇస్తామని జేఎన్టీయూ పేర్కొన్న విషయాన్ని కూడా ప్రస్తావించనున్నారు. ఏయే కాలేజీల్లో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే విషయాలను కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులకు తెలియజేయాల్సి ఉంటుందని, అప్పుడే వారు ఆప్షన్లు ఇచ్చుకునే వీలు ఏర్పడుతుందని వివరించనున్నారు. ఇవన్నీ పూర్తి చేసేందుకు గడువు కావాలని విజ్ఞప్తి చేయనున్నారు. వాదనలకు ఏపీ సర్కారూ సిద్ధం ఈ అంశంపై బలమైన వాదనలు వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలను విభజన చట్టంలో పేర్కొన్న మేరకే నిర్వహించాలని ఏపీ ఉన్నత విద్యామండలి, ఆ రాష్ర్ట ప్రభుత్వం వాదించే అవకాశముంది. విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలికి అధికారాలు కల్పించిన విషయాన్ని కోర్టు దృష్టికి తేనున్నాయి. ఉమ్మడి ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుని ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయవచ్చని వివరించనున్నాయి. ఇరు రాష్ట్రాలకు ఏకాభిప్రాయం కుదరని అంశాలను కేంద్రమే పరిష్కరించాలని విభజన చట్టంలోని సెక్షన్ 75లో స్పష్టంగా పేర్కొన్నట్లు కోర్టు దృష్టికి తేనున్నట్లు సమాచారం. కౌన్సిలింగ్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేశామని ఏపీ ఉన్నత విద్యా మండలి తన వాదన వినిపించనుంది. తాము రెండు రాష్ట్రాలకు లేఖలు రాశామని, వారిని సంప్రదించి, లోతుగా అలోచించాకే నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకు చెప్పబోతోంది. తీవ్ర జాప్యంపై విద్యార్థుల్లో ఆందోళన నె లకొందన్న విషయాన్ని పేర్కొంటూ.. కోర్టు తీర్పు ఆధారంగానే నడుచుకుంటామని తెలియజేయనుంది. కాగా, ఇంజనీరింగ్ కోర్సుల్లో 180 రోజుల పనిదినాలు తప్పనిసరిగా ఉండాలని, దేశవ్యాప్తంగా ఒకే క్యాలెండర్‌ను అమలు పరచాల్సి ఉన్నందున తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏఐసీటీఈ కూడా కోర్టుకు వివరించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశాలను రెండు నెలలు ఆలస్యం చేయడం వల్ల ఒక సెమిస్టర్ పరీక్షలకు ఇబ్బంది వస్తుందని ఏఐసీటీఈ వాదించవ చ్చని చెబుతున్నారు. తమదీ అదే వాదన కనుక అనుకూలంగానే తీర్పు రావచ్చునని ఆ రాష్ర్ట వర్గాలు ఆశిస్తున్నాయి. -
9న పోలవరం వ్యతిరేక దినం : కోదండరామ్
హైదరాబాద్: ఈ నెల 9న పోలవరం వ్యతిరేక దినంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు టి.జేఏసీ కన్వీనర్ కోదండరామ్ వెల్లడించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఉన్నత విద్యామండలి తన పరిధిని దాటి వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నేపథ్యంలో ఏర్పడిన గందరగోళానికి ఉన్నత విద్యామండలే కారణమని ఆయన విమర్శించారు. రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పకడ్బందీగా వాదనలు వినిపించండి
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు ఎలాగైనా గడువు పొందాల్సిందే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలను అక్టోబరు 31వ తేదీలోగా పూర్తి చేస్తామని, అప్పటివరకు గడువు కావాలని సుప్రీంకోర్టులో వేసిన కేసు ఈ నెల 4న విచారణకు రానుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గడువు కోరుతుందో పకడ్బందీగా, స్పష్టంగా కోర్టుకు వివరించాలని న్యాయశాఖ, విద్యాశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. శుక్రవారం సీఎం అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యాశాఖ, న్యాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు ఎలాంటి సమస్యలు వస్తాయో సవివరంగా తెలియజేయాలని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను సుప్రీంకోర్టుకు వివరించాలని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం, అందుకవసరమైన మార్గదర్శకాల రూపకల్పనకు కావాల్సిన యంత్రాంగం, స్థానికతను నిర్ధరించడంలో రాష్ట్ర స్థాయి అధికారుల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులను వివరించాలని సూచించినట్లు సమాచారం. అలాంటి యంత్రాంగం లేని పరిస్థితుల్లో సకాలంలో చేయలేకపోతున్నామని, అందుకే గడువును కోరుతున్నామనే అంశాన్ని స్పష్టంగా వినిపించాలని ఆదేశించినట్లు తెలి సింది. ఫాస్ట్‌లో స్థానికత ఆధారాలు, ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు రూపకల్పనకు పట్టనున్న సమయం, ఆ తరువాత విద్యార్థుల ఆ సర్టిఫికెట్లు పొందేందుకు పట్టే సమయం తదితర వివరాలన్నింటితో వాదన చేయాలని, వాటితో కోర్టు ఏకీభవించేలా ఉండాలని చెప్పినట్లు సమాచారం. కాలేజీలను తనిఖీ చేసి అనుమతులు ఇవ్వాల్సి ఉందని, దానికీ సమయం పడుతుందనే విషయాన్ని కోర్టు దృష్టికి తేవాలని సీఎం చెప్పారు. ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఏ వాదన చేసినా వాటికి సమర్థంగా జవాబు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సహకరించం: తెలంగాణ జీసీజీటీఏ ఏపీ ఉన్నతవిద్యామండలి నిర్వహించనున్న ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్లు సహకరించకూడదని తెలంగాణ జీసీజీటీఏ నిర్ణయించింది. తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో పాల్గొన వద్దని తమ సభ్యులను కోరింది. ప్రభుత్వ నిర్ణయాల అమలుకు లెక్చరర్లు సహకరించాలని సంఘం అసోసియేట్ అధ్యక్షుడు హరినాథ్‌శర్మ కోరారు. టీ విద్యార్థులు హాజరు కావొద్దు: శ్రీనివాస్‌గౌడ్ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు తెలంగాణ విద్యార్థులు హాజరుకావొద్దని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో)నేత, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటే తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదన సరైనది కాదని అన్నారు. -
'ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పనిచేయం'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో తమ ఉద్యోగులు ఏవరూ పనిచేయరని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టంచేశారు. ఎంసెట్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్ ను పట్టించుకోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేసింది. తమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ కౌన్సెలింగ్ జరగనీయబోమని ఓయూ జేఏసీ హెచ్చరించింది. -
హమ్మయ్య..! ఇప్పటికైనా కరుణించారు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ సైతం కన్వీనర్ జారీ చేశారు. మేలో ఎంసెట్ ఫలితాలు ప్రకటించగా ,ఆగస్టు 1 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభంకావాలి.అయితే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం, 1956ను స్థానికతకు తెలంగాణ ప్రామాణికంగా తీసుకోవటం వలన తీవ్ర జాప్యం అవుతూ వచ్చింది. ఈ నేపధ్యంలో వివాదాలు కొనసాగుతున్నా అకడమిక్ ఏడాదిలో జాప్యం, ఎంసెట్ రాసిన విద్యార్థులు ఇతర రాష్ట్రాకు వలస వెళ్లిపోవటం, విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి దిగొచ్చింది. ఈ ఏడాది కూడా కౌన్సెలింగ్ వెబ్ పద్దతిలోనే నిర్వహించనున్నారు. జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ పురుషుల కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటు చేయగా, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో లెక్చరర్లు విధులు బహిష్కరించడంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో నిర్వహించారు. మళ్లీ ఇక్కడ విద్యార్థి జేఏసీ నాయకులు, విద్యార్థులు ఉద్యమంలో భాగంగా అడ్డుకోవటంతో పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో వర్సిటీ సిబ్బంది వచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. గత ఏడాది చివరకు 3950 మంది విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. గత ఏడాది ఆందోళనలు నేపధ్యంలో విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి సైతం విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీం 4850 మంది రాశారు. మూడు వేలకు తక్కువ లేకుండా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలో 34 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు.అయితే జిల్లాలో రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు గతంలో అధికారులు తెలిపారు.అయితే ఈ ఏడాది కూడా ఒకే సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. గతంలో విద్యార్థులు సహాయ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయ్యాక ఇంటర్నెట్ సెంటర్లలలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేవారు. పవేట్ కళాశాలల వత్తిడి, పాస్వర్డ్ హ్యాకింగ్, స్క్రాచ్కార్డ్పై సీక్రేట్ పాస్వర్డ్ ప్రవేట్ యాజమాన్యాలకు తెలిసి పోవటం, మరో పక్క ప్రవేట్ యూజమాన్యాలే నెట్ సెంటర్లు పెట్టి విద్యార్థులకు ఆప్షన్లు ఇవ్వటం వంటి సంఘటనలు జరిగేవి. ఈ నేపథ్యంలో సహాయ కేంద్రాల్లోనే ధ్రువీకరణ పత్రాల పరిశీలనలు తరువాత కళాశాలలు, బ్రాంచ్‌ల ఆప్షన్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఎటువంటి విధానాన్ని అమలు చేస్తారో వేచి చూడాల్సిందే. జిల్లాలో 10 ప్రవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, ప్రస్తుతం ఎనిమిది కళాశాలలు కౌన్సెలింగ్ రేసులో ఉన్నాయి .రెండు కళాశాలలు గత ఏడాది కౌన్సెలింగ్ దూరంగా ఉన్నాయి. జిల్లా కళాశాలల్లో 3132 సీట్లు ఉండగా 2012లో 1605, 2013లో 1590 మంది విద్యార్థులు చేరారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరైన వారిలో 50 శాతం లోపు వారు జిల్లా కళాశాలల్లో చేరుతుండగా మిగతా వారు ప్రభుత్వ, ఇతర పెద్ద కళాశాలల్లో చేరుతున్నారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ర్యాంకుల వారీగా తేదీలు ఇలా... 7వ తేదీ 1 నుంచి 5 వేలు, 8వ తేదీ 5001 నుంచి 10,000, 9వ తేదీ 10001 నుంచి 15 వేలు, 10వ తేదీ 15001 నంచి 20 వేలు, 11వ తేదీ 20001 నుంచి 38 వేలు, 12వ తేదీ 38001 నుంచి 56 వేలు, 13 వ తేదీ 56001 నుంచి 75 వేలు, 14వ తేదీ 75001 నుంచి 90 వేలు, 16వ తేదీ 90001 నుంచి 105000, 17వ తేదీ 105001 నుంచి 1.20 లక్షలు, 18వ తేదీ 120001 నుంచి 1.35 లక్షలు, 19 వ తేదీ 135001 నుంచి 1.50 లక్షలు, 20 వ తేదీ 150001 నుంచి 1.65 లక్షలు, 21వ తేదీ 165001 నుంచి 1.80 లక్షలు, 22 వ తేదీ1001 నుంచి 1.95 లక్షలు, 23వ తేదీ 195001 నుంచి చివరి వరకు అవసరమైన ధ్రువపత్రాలు ఇవే... ఎన్సీసీ, స్పోర్ట్స్ తదితరత కేటట గిరిల వారు హైదరాబాద్‌లో సాంకేతిక విద్యా భవన్‌కు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఒరిజనల్, మూడు సెట్ల జిరాక్సులతో హాజరుకావాలి ర్యాంక్ కార్డు, హాల్‌టిక్కెట్, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, పదో తరగతి మార్కుల మెమో, 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ, ఆరు నెలల లోపు ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలి. ఓసీ, బీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.300 కౌన్సెలింగ్ ఫీజుగా నిర్ణయించారు. అలాట్మెంట్ల వివరాలు, ట్యూషన్ ఫీజుల వివరాలు తరువాత తెలియజేస్తారు. -
'ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టులో ఇంప్లీడ్'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌పై రేపు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 4న తీర్పుఅ నుకూలంగా వస్తే యథావిధిగా కౌన్సెలింగ్ కొనసాగిస్తామని చెప్పారు. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిపై 5న సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఉన్నత విద్యామండలి ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. -
'ఎంసెట్ కౌన్సెలింగ్ జరగనివ్వం'
హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేయడానికి ఉన్నత విద్యా మండలి కంకణం కట్టుకుందని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు పిడమర్తి రవి, బాలరాజు ఆరోపించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ పై సుప్రీంకోర్టు తీర్పు రాకముందే నోటిఫికేషన్ ఎలా ముందుకు వెళ్తారని వారు ఉన్నత విద్యా మండలి ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఆంధ్రా మేధావుల ఫోరం వ్యక్తిగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో జరిగే కౌన్సెలింగ్‌లో తెలంగాణ కాలేజీల ఎంపిక విషయంలో ఆలోచించుకోవాలని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు తెలంగాణ విద్యార్థులకు సూచించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ నిలుపివేయాలని జేఏసీ నేతలకు అంతకుముందు ఉన్నత విద్యామండలి కార్యదర్శి సతీష్ రెడ్డికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై అందరికీ ఆందోళన
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ విద్యార్థులను కౌన్సెలింగ్‌లో పాల్గొనవద్దన్న మంత్రి జగదీశ్ రెడ్డి, వారికి కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కౌన్సెలింగ్‌లో మెరిట్ సీట్లన్నీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వెళ్లిపోతే తెలంగాణ విద్యార్థులు నష్టపోరా అని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించడం తొందరపాటు చర్యేనన్నారు. పాకిస్తాన్, ఇండియా దేశాధినేతలే కలిసి కూర్చొని సమస్యలు పరిష్కరించుకుంటున్నారని, అలాంటప్పుడు కేసీఆర్, చంద్రబాబు ఉమ్మడి సమస్యలపై ఎందుకు చర్చించుకోరని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. విద్యార్థులు, ప్రజల బాధలు చూసైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుని ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
-
ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: గత మూడు నెలలుగా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎంసెట్ విద్యార్థులకు ఊరట కలిగింది. ఉన్నత విద్యామండలి బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 7 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొదటి రోజు 1 నుంచి 5 వేల ర్యాంక్ వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. కౌన్సెలింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లో 34, తెలంగాణలో 23 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 2,15,336 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కు హాజరుకానున్నారు. -
కౌన్సెలింగ్‌పై నిర్ణయాధికారం మండలిదే
ఆలస్యంపై కారణాలను సుప్రీంకోర్టుకు చెబుతాం: చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ముందుకే సాగాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈనెల 30న నోటిఫికేషన్ జారీ చేసి, 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేందుకు సిద్ధమైంది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో అనంతరం ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశం తర్వాత ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడి ్డ విలేకరులతో మాట్లాడారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌పై నిర్ణయాధికారం ఉన్నత విద్యామండలికే ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆగస్టు 1 నాటికి తరగతులు ప్రారంభించాల్సి ఉందని, ఆగస్టు 15 తరువాత ఎలాంటి ప్రవేశాలు చేపట్టవద్దని పేర్కొందని వివరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు కౌన్సెలింగ్ త్వరగా చేపట్టాలని కోరుతున్నారని చెప్పారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాల్సిన ఈసెట్ విద్యార్థులు నష్టపోతున్నారని వివరించారు. సుప్రీంకోర్టు కౌన్సెలింగ్‌ను ఆపాలని చెప్పలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహణ, ప్రవేశాల అధికారం పదేళ్లపాటు ఉన్నత విద్యా మండలికే ఉందన్నారు. మేమూ ఇంప్లీడ్ అవుతాం... 4వ తేదీలోగా సుప్రీంకోర్టులో తామూ ఇంప్లీడ్ అవుతామని చైర్మన్ వివరించారు. ప్రవేశాల ఆలస్యానికి కారణాలను కోర్టుకు తె లియజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రవేశాల కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని విలేకరులు ప్రశ్నించగా, వేణుగోపాల్‌రెడ్డి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. కాగా, సోమవారం జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలోనూ ఎక్కువమంది సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు ఆలస్యంగా తెలిసింది. ఎంసెట్ కమిటీలో మొత్తం 12 మంది ఉండగా, సమావేశానికి 9 మందే హాజరయ్యారు. వారిలో ఐదుగురు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్ణయాన్ని, నోటిఫికేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు తెలిసింది. అయినా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా, మండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డితో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ ఫోన్లో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. -
జానారెడ్డి అలా మాట్లాడం సిగ్గుచేటు
నల్గొండ : ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయానికి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కౌన్సెలింగ్ విషయంలో విద్యార్థులకు అన్యాయం చేయమని అన్నారు. రైతు ఆత్మహత్యలు, విద్యార్థులపై కేసుల గురించి జానారెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే విద్యార్థులపై కేసులు ఉన్నాయని, మంత్రిగా ఆయన ఏనాడూ జిల్లాను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. -
'రేపే ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ. ఎల్.వేణుగోపాల్‌రెడ్డి వెలడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆగస్టు 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. ఈలోగా విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దృష్టి పెట్టాలని తెలిపారు. ఆప్షన్ల ఎంపిక తర్వాత చేపడతామన్నారు. ఇప్పటికే ఈ ఇరురాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్లు ప్రొ.ఎల్. వేణుగోపాల్ రెడ్డి వివరించారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై కేసీఆర్ ఆగ్రహం
-
వెరిఫికేషన్ మాత్రమే!
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు ఈనెల 30న నోటిఫికేషన్ జారీ చేయాలని ఎంసెట్ కన్వీనర్‌కు సూచించినట్లు చెప్పారు. సోమవారం ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పాలీసెట్ ప్రవేశాల కమిటీలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు ప్రభుత్వాల నుంచి స్పష్టత వస్తుందని ఇన్నా ళ్లూ వేచి చూశామని, అయినా రాకపోవడంతో ఉన్నత విద్యా మండలి తన బాధ్యతగా ఈ భేటీలను నిర్వహించిందన్నారు. ఎంసెట్ ప్రవేశాలకు ఆప్షన్ల ప్రక్రియను మాత్రం ప్రస్తుతానికి ప్రారంభించడం లేదన్నారు. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నందున, వారి ప్రయోజనాల దృష్ట్యా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి 15 నుంచి 18 రోజులు పడుతుందని చెప్పారు. ఆలోగా అవసరమైన అన్ని ఉత్తర్వులు జారీ చేసేలా రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తామని, ఈ మేరకు లేఖలు కూడా రాస్తామని ఆయన తెలియజేశారు. దీనిపై తల్లిదండ్రులు ప్రశ్నించే అవకాశం ఉన్నందున ఇరు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యలు చేపడతున్నట్లు చెప్పారు. రెండు ప్రభుత్వాల అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఇది కోర్టు ధిక్కరణ కాదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మాత్రమే చేపడతామని, 4న సుప్రీం తీర్పును బట్టి మళ్లీ 5వ తేదీన సమావేశమై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయంలో కౌన్సిల్‌పై ఎవరి ఒత్తిడి లేదన్నారు. ఒకవేళ ఎంసెట్ మరీ ఆలస్యమైతే ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఎన్ఆర్ఐ కోటా ఉత్తర్వులు వచ్చాకే మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి వేరుగా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కాగా ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో పాటు ఏపీ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్ జైన్, ప్రవేశాల క్యాంప్ అధికారి రఘునాథ్‌తో పాటు 9 మంది యూనివర్సిటీ ల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే కమీటీలో సభ్యులైన తెలంగాణ అధికారులు వికాస్‌రాజ్, శైలజా రామయ్యార్, మరో యూనివర్సిటీ ప్రతినిధి మాత్రం హాజరుకాలేదు. -
ఎంసెట్ చిచ్చు!
30న నోటిఫికేషన్, 7 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రవేశాల కమిటీ తో ఉన్నత విద్యా మండలి భేటీలో నిర్ణయం ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కారు ఒత్తిడితోనే నిర్ణయం తీసుకున్నారని మండిపాటు సుప్రీం పరిధిలో ఉన్న అంశాన్ని ఎలా పరిశీలిస్తారని ప్రశ్న ‘ఫాస్ట్’ పథకం అమలుకు గడువు కావాలన్నా వినుపించుకోరా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంధ్రా సర్కారు వైఖరేంటి? ఏదీ తేల్చకుండానే కౌన్సెలింగ్ చేపట్టడం తగదని వ్యాఖ్య రాష్ట్రాన్ని ఇరకాటంలో పెట్టే చర్యగా భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు 4న సుప్రీం తీర్పును బట్టే తుది నిర్ణయం: ఉన్నత విద్యామండలి సాక్షి, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరో వివాదం రాజుకుంది. ఇప్పటికే విద్యుత్, నీటి వాటాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య మంటలు రేగగా.. తాజాగా ఎంసెట్ ప్రవేశాల అంశం తోడై అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగానే.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ప్రవేశాల కమిటీ సిద్ధమవడం తెలంగాణ సర్కారుకు తీవ్ర ఆగ్రహం తెప్పిం చింది. సోమవారం వివిధ సెట్ల ప్రవేశాల కమిటీలతో సమావేశమైన ఉన్నత విద్యా మండలి అధికారులు.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 30న నోటిఫికేషన్ జారీ చేయాలని, వచ్చే నెల 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో టీ-సర్కారు పెద్దలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే ‘ఫాస్ట్’ పథకానికి సంబంధించిన నిబంధనల రూపకల్పనకు కొంత గడువు అవసరమని చెప్పినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కేవలం రాష్ర్ట ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేం దుకేనని వారు మండిపడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు ఉద్దేశపూర్వకంగానే అడ్మిషన్ల కమిటీ అధికారులపై ఒత్తిడి చేసి ఈ నిర్ణ యం తీసుకునేలా చేశాయని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సుప్రీంకోర్టు పరిశీల నలో ఉన్న అంశంపై నిర్ణయం తీసుకోవడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని లేఖ రాసినా.. అడ్మిషన్ల కమిటీ దాన్ని పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ అంశం వచ్చే నెల 4న సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఇన్నాళ్లు లేని అడ్మిషన్ల తొందర ఇప్పుడే ఎందుకు వచ్చిందని రాష్ర్ట అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే వివిధ ‘సెట్స్’ కమిటీల సమావేశం ఏర్పాటు చేసి, నిర్ణయాలు తీసుకున్నారని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తున్నట్లా? లేదా? అన్నది తేల్చకుండానే ఆ రాష్ర్ట ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగిందని విమర్శిస్తున్నాయి. ఒకవేళ పథకాన్ని కొనసాగిస్తే పాత ఉత్తర్వులను అన్వయించుకుంటూ తాజా ఉత్తర్వులు ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి. ఫీజు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, తమ ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి గతంలోనే ఆరోపించారు. తాము ఫాస్ట్ అమలు కోసం చర్యలు చేపట్టామని, ఏపీ ప్రభుత్వం ఏమీ చేయకుండానే పరిస్థితిని సమస్యాత్మకం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడుతున్నారు. తెలంగాణ సర్కారు రుసరుస! ఈ విషయంపై తెలంగాణ సర్కారు తన అసంతృప్తిని వ్యక్తీకరిస్తూ ఉన్నత విద్యా మండలికిఓ లేఖ రాసింది. విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ రాసిన ఈ లేఖలో.. ‘‘వివిధ కారణాలతో కౌన్సెలింగ్ నిర్వహణకు గడువు పెంచాలని సుప్రీంకోర్టును కోరాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. పైగా వాటిని కౌన్సెలింగ్ కంటే ముందుగానే జారీ చేయాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అధికారుల కొరత ఉన్నందున అర్హులైన విద్యార్థుల గుర్తింపునకు వీలుగా మార్గదర్శకాల రూపకల్పనకు కొంత సమయం పడుతుంది. దీనిపై సుప్రీంకోర్టు జూలై 21న విచారిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అఖిల భారత సాంకేతిక విద్యామండలికి తెలియజేసింది. అనుబంధ అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణలో తగిన ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలోకి వస్తుంది. ఈ విషయాలన్నీ మీకు తెలిసినా.. కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు. మీరు ముందుకు వెళ్తున్న ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95కి విరుద్ధం. ఆ సెక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాలు పరస్పరం సంప్రదించుకుని కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. దీన్ని పక్కనబెట్టండి’’ అని పేర్కొన్నారు. ఇదే అంశాలతో సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యార్ కూడా లేఖ రాసినట్లు తెలిసింది. -
కేసీఆర్ సీరియస్!
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఏకపక్ష నిర్ణయమంటూ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 7 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఉన్నత విద్యా మండలి తీసుకున్న నిర్ణయంపై రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీరియస్ అయినట్లు తెలిసింది. సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై రాష్ర్ట విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం రాత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతకంటే ముందుగా విద్యా శాఖ ఉన్నతాధికారులతోనూ మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించారు. కౌనె ్సలింగ్ వ్యవహారంలో విద్యా మండలి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో రాష్ర్ట ప్రభుత్వానికి తెలుసునని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెత్తనం ఏంటన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. తెలంగాణ విద్యార్థుల సంక్షేమానికి ఏం చేయాలో అదే చేద్దామని మంత్రి అన్నారు. ఎంసెట్ ప్రవేశాల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయొద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగదని పేర్కొన్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే(వచ్చే నెల 4న) సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండగా, హడావుడిగా అదికూడా తెలంగాణ అధికారులు లేకుండానే ఉన్నత విద్యా మండలి ఎలా నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు చెప్పినట్లు నడుచుకుంటామని, తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులతో అన్నట్లు సమాచారం. -
ఎంసెట్‌పై ఢిల్లీ బయల్దేరిన అఖిలపక్షం
హైదరాబాద్ : అఖిలపక్ష నేతలు బుధవారం ఢిల్లీ బయల్దేరారు. ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించటంపై కేంద్రం జోక్యం కోరుతూ ఈ బందృం హస్తినకు పయనం అయ్యింది. అఖిలపక్ష నేతలతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ కూడా ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. -
'మనం పోరాడిందే మన హక్కుల కోసం!'
-
'చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఎంసెట్ కౌన్సిలింగ్‌పై చంద్రబాబు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగదీష్ రెడ్డి మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులను మోసం చేస్తున్న చరిత్ర చంద్రబాబుది అన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యానికి బాబే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలని జగదీష్ రెడ్డి సూచించారు. రుణమాఫీ సాధ్యం కాదని ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు చెప్పినా... తాను ఆర్థిక నిపుణుడని చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలపై ఆ రాష్ట్ర జనాలు నిలదీస్తారనే భయంతోనే బాబు తెలంగాణపై అకారణంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తారో లేదో ముందు చంద్రబాబు తేల్చాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల స్థానికతను చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలో స్థానికతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరమేంటని అడిగారు. తాము ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించడం లేదనిచ ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని జగదీష్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. పేద విద్యార్థులను ఎలా ఆదుకోవాలో తమకు స్పష్టత ఉందన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు తమ ప్రభుత్వం ఏ పోరాటానికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. తమ హక్కులు, భూములు, ఉద్యోగ అవకాశాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని జగదీష్ రెడ్డి అన్నారు. తమ హక్కుల పరిరక్షణ ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు. -
'సెప్టెంబర్ 5న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్ పై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రితో మాట్లాడానని తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా కేసీఆర్‌కు లేఖ రాశారని చెప్పారు. అయినా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తక్షణం తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్రాన్ని ఆశ్రయించడమా, కోర్టును ఆశ్రయించడమా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సెప్టెంబర్ 5న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు గంటా శ్రీనివాసరావు తెలిపారు. 10 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. టెట్ రద్దు చేసేందుకు న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వచ్చే ఏడాది నుంచి టెట్ రద్దు చేసే అవకాశముందన్నారు. రేషనలైజేషన్ కింద 10 వేల మంది ఉద్యోగులను బదిలీ చేస్తామని చెప్పారు. ఈ ఉదయం టెన్త్ అడ్వాన్స్ డ్ ఫలితాలను ఆదివారం ఆయన విడుదల చేశారు. ఏపీ టెన్త్ అడ్వాన్స్ డ్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జ్వరాలకూ ఆరోగ్యశ్రీ: రాజయ్య
పీహెచ్‌సీల్లోనే సాధారణ ఆపరేషన్లు మన ఆస్పత్రి-మన ప్రణాళిక రూపకల్పనకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: జ్వరాలకూ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య అన్నారు. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ జాబితాలో మరిన్ని వ్యాధులను పొందుపరుస్తామన్నారు. ఇకపై చిన్న చిన్న ఆపరేషన్లన్నింటినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సచివాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ‘మన ఆస్పత్రి-మన ప్రణాళిక’ పేరిట ప్రతి పీహెచ్సీ, ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రులూ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించినట్లు చెప్పారు. దీంతో గడప గడపకూ సర్కారీ మందులను అందించడమే తమ లక్ష్యమన్నారు. ముఖ్యాంశాలిలా ఉన్నాయి.. త్వరలోనే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాదిరిగానే ఎంబీబీఎస్ ఫీజులను ఈ ఏడాది పెంచే ప్రసక్తే లేదు. నిమ్స్ సహకారంతో ఖమ్మం లేదా కరీంనగర్ జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. ఇందుకోసం సింగరేణి సంస్థ రూ. 200 కోట్లు వెచ్చించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధికి రూ. 200 కోట్లు మంజూరైనా ప్రస్తుతమున్న భవనానికి సాంస్కృతిక వారసత్వ హోదా ఉండటంతో మరమ్మతులకు సాధ్యం కావడం లేదు. చంచల్‌గూడ జైలు స్థలాన్ని ఆస్పత్రి కోసం వినియోగించే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతాం. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మెదడు, గుండె, కిడ్నీ వంటి సూపర్ స్పెషలైజేషన్ శస్త్ర చికిత్సలు మాత్రమే కార్పొరేట్ ఆస్పత్రుల్లో నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటాం. మిగిలిన సాధారణ ఆపరేషన్లన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం. దళితుల సంక్షేమానికి లక్ష కోట్లు.... తెలంగాణ రాష్ట్రంలోనే దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష కోట్ల బడ్జెట్‌ను కేటాయించి వారి అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. వాల్మీకి సమాజ్ ప్రగతి సంఘ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సుల్తాన్షాయి గంగపుత్ర సంఘంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాముని వద్ద హనుమంతుడు ఎలా ఉంటాడో... కేసీఆర్‌కు హనుమంతుడిలా వెన్నంటి ఉండి ప్రజల కోసం పని చేస్తామన్నారు. అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ దళితులకు మూడెకరాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం వాటిని అమలు పరిచేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి పనులను ప్రారంభిస్తుందన్నారు. పీహెచ్‌సీల్లో సెమీ ఆటో అనలైజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)కు వచ్చే రోగులందరికీ అక్కడే వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా పీహెచ్‌సీలకు అవసరమైన పరికరాలను అందించాలని నిర్ణయించింది. తొలుత రక్త పరీక్షలు నిర్వహించే సెమీ ఆటో అనలైజర్లను ప్రతి పీహెచ్‌సీకి అందజేయనుంది. ఒక్కో సెమీ ఆటో అనలైజర్ కొనాలంటే సుమారు రూ.20 వేలు ఖర్చవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. దాదాపు రూ.3.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని పీహెచ్‌సీలన్నింటికీ వాటిని సమకూర్చాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి(ఏపీఎంఎస్ఐడీసీ) సంస్థ పనితీరుపై జరిగిన సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
స్థానికతపై స్పష్టత వచ్చాకే.. ఎంసెట్ కౌన్సెలింగ్
నాలుగు రోజుల్లోగా సుప్రీంకోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించిన స్థానికత అంశంపై స్పష్టత వచ్చాకే ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఆలోచన చేసే అవకాశం ఉందని తెలం గాణ విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కౌన్సెలింగ్ విషయంలో అంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకునే పరి స్థితి లేదని పేర్కొన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ అం శం తేలాకే దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుం టామని వెల్లడించాయి. మరోవైపు ఎంసెట్ ప్రవేశాలు పూర్తి చేయడం, తరగతులను ప్రారంభించే అంశంపై గడువు కోరుతూ నాలుగు రోజుల్లోగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చే యనున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ పిటిషన్‌పై న్యాయశాఖ పరిశీలన జరుపుతోందన్నారు. అది పూర్తి కాగానే కోర్టులో దాఖలు చేస్తామన్నారు. వీలైతే శుక్రవారం, లేదంటే సోమ, మంగళవారాల్లో ఈ పిటిషన్‌ను వేయనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కౌన్సెలింగ్, ప్రవేశాల ప్రక్రియ అంతా ఈనెల 29వ తేదీలోగా పూర్తి చేయాలి. ఆగస్టు 1వ తేదీనుంచి తరగతులను ప్రారంభించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా లేదు. పైగా ఇతర అనేక సమస్యలున్నందున ప్రవేశాల పూర్తికి గడువును కోరుతూ పిటిషన్‌ను దాఖలు చేయనున్నట్లు తెలిపారు. -
నేటినుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ అజయ్‌జైన్ వెల్లడించారు. ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులెవరైనా 24 నుంచి 27వ తేదీ వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేయవచ్చు. ఇంతకు ముందు కౌన్సెలింగ్‌లో సీటు రానివారు, సీటు పొందినా ఆ కళాశాలలో చేరనివారు, ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొని, వెబ్ఆప్షన్లు ఇవ్వనివారు, సీటు దక్కి, కళాశాలలో రిపోర్ట్ చేసినప్పటికీ ఇతర మంచి అవకాశం కోసం ఎదురుచూసేవారు, తొలి విడతలో వచ్చిన సీటును రద్దు చేసుకున్నవారు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఇప్పటివరకు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోనివారు 24 నుంచి 27వ తేదీ వరకు సహాయక కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. తరువాత వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అయితే, ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్థులు తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొంటే... తుదివిడతలో వచ్చే సీటును మాత్రమే పొందుతారు. అందువల్ల మంచి సీటు కావాలనుకునేవారు పరిమితమైన ఆప్షన్లతో తొలివిడత కంటే మెరుగైన సీట్లను మాత్రమే ఎంచుకుంటే మేలు. -
నేటినుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
-
నేటినుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: జిల్లాకేంద్రంలోని ఫూల్‌బాగ్‌లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సోమవారం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. మూడో తేదీనుంచి 12వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది అభ్యర్థులు ర్యాంకుల వారీగా ఆప్షన్లను పొందుపర్చుకోవచ్చని పరీక్షల సమన్వయాధికారులు టీఆర్ఎస్.లక్ష్మి, భాస్కరరావులు తెలిపారు. వెబ్ ఆప్షన్ల వివరాలు కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులు వెబ్‌లో ఆప్షన్లను ఈనెల 3నుంచి ఎంచుకోవచ్చు. ఒకటో ర్యాంకు నుంచి 40వేల ర్యాంకు వరకు 3,4 తేదీల్లోనూ, 40వేల ఒకటి నుంచి 80 వేల ర్యాంకు వరకు 5,6 తేదీల్లోనూ, 80వేల ఒకటి నుంచి లక్షా 20వేలవరకు 7,8 తేదీల్లోనూ, లక్షా 20వేల ఒకటి నుంచి లక్షా 60 వేల వరకు 9, 10 తేదీల్లోనూ, లక్షా 60వేల ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు 11, 12 తేదీల్లోనూ అభ్యర్థులు ఆప్షన్లను ఎంచుకోవచ్చని అధికారులు తెలిపారు. -
అన్ని కేంద్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్
కాకినాడ రూరల్/భానుగుడి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో జిల్లాలో వాయిదా పడిన ఎంసెట్ కౌన్సెలింగ్‌ను బుధవారం పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. కాకినాడలోని ఆంధ్రా పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో, మోహన్ కాన్వెంట్లో, బొమ్మూరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఉదయం నుంచి, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మధ్యాహ్నం నుంచి ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన ర్యాంకుల సీరిస్ 1,60,000 నుండి 1,80,000 ర్యాంకుల సీరిస్‌కు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా, అధికారులు మాత్రం విద్యార్థుల సౌకర్యార్థం లక్షా ఎనభైవేల లోపు ర్యాంకులు గల విద్యార్ధుంలందరికీ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. కాకినాడ ఏపీటీలో నిర్వహిం చిన కౌన్సెలింగ్‌లో 95 మంది తమ సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకొన్నారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రం 35మంది మాత్రమే పరిశీలన చేయించుకొన్నారు. పోలీసు రక్షణలో కౌన్సెలింగ్ జరుగుతున్న మోహన్ కాన్వెంట్లో 600 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్విరామంగా జరిగింది. ఇదిలాఉండగా వెబ్ ఆప్షన్ల ఎంపికకు ప్రభుత్వం ఎటువంటి తేదీలను ఖరారు చేయకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంసెట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వీవీ సుబ్బారావును వివరణ కోరగా వెబ్ఆప్షన్లకు సంబంధించి ప్రభుత్వం త్వరలో తేదీలను ప్రకటిస్తుందని ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. వచ్చే నెల 2నుంచి వెబ్ఆప్షన్లు ప్రారంభం కావచ్చన్నారు. బొమ్మూరు పాలిటెక్నిక్‌లో... రాజమండ్రిరూరల్: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బొమ్మూరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు విధులకు హాజరుకావడంతో బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో కళాశాల లెక్చరర్లు విధులను బహిష్కరించడంతో ఈనెల 19వ తేదీన ఎంసెట్ కౌన్సెలింగ్ మొదటిరోజున కాంట్రాక్టు లెక్చరర్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. కాంట్రాక్టు లెక్చరర్లతో కౌన్సెలింగ్ నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంసెట్ కన్వీనర్ ఆదేశించడంతో ఈనెల 20వతేదీ నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావడంతో బుధవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 63 మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేయించుకుని సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్నారు. గురువారం ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు గల విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావచ్చని కళాశాల ప్రిన్సిపాల్ ఎ. విలియం క్యారీ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దక్షిణమండలం డీఎస్పీ శ్రీదేవీరావు, ధవళేశ్వరం ఇన్స్పెక్టర్ ప్రసాద్‌కుమార్, పోలీసుసిబ్బంది పర్యవేక్షించారు. -
సర్టిఫికెట్ల పరిశీలనకు తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా కుంటి నడక నడుస్తున్న సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ నేటి నుంచి సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 19న సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభమవగా.. సీమాంధ్ర ప్రాంతంలో 34 కేంద్రాలకు గాను 19 కేంద్రాలు పనిచేయలేదు. ఈ సహాయక కేంద్రాలన్నీ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉండడం, ఆ కళాశాలల అధ్యాపక సిబ్బంది ఎంసెట్ విధుల బహిష్కరణకు పిలుపునివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో మరో నాలుగు అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ తనిఖీ ప్రక్రియ షెడ్యూలు ప్రకారం పూర్తిస్థాయిలో సాగడం లేదు. ఈ నేపథ్యంలో సాంకేతిక విద్య కమిషనర్, ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ అయిన అజయ్ జైన్, జాయింట్ డెరైక్టర్ యూవీఎస్ఎన్ మూర్తి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్(పాలా) ఛైర్మన్, ప్రతినిధి బృందంతో మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. బుధవారం నుంచి విధుల్లో చేరేందుకు ‘పాలా’ ప్రతినిధులు అంగీకరించారు. ఈ మేరకు అజయ్‌జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాలిటెక్నిక్ అధ్యాపకులు విధుల్లో చేరేందుకు అంగీకరించినందున ఎంసెట్ సహాయక కేంద్రాలన్నీ బుధవారం నుంచి సజావుగా పనిచేస్తాయని తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆయా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉన్న కేంద్రాల్లో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అయితే ఇప్పటివరకు పనిచేయని కేంద్రాల్లో 1 నుంచి 1,60,000 లోపు ర్యాంకర్లు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాలేకపోయిన వారందరికీ కొత్తగా షెడ్యూలు జారీ చేస్తామని తెలిపారు. అతి త్వరలోనే ఈ షెడ్యూలు వెలువడుతుందన్నారు. 30న నిర్ణయం..: మరోవైపు మంగళవారం సాయంత్రం ఉన్నత విద్యామండలిలో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియపై మండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్ జైన్ సమీక్ష జరిపారు. సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ సజావుగా సాగే పక్షంలో ఈ నెల 30న మరోసారి సమీక్ష జరిపి, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ షెడ్యూలు జారీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాని విద్యార్థులు వెంటనే ఈ ప్రక్రియలో పాల్గొనాలని సూచిస్తూ విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఎస్.ఎం.ఎస్. పంపించాలని నిర్ణయించారు. సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియకు 9వ రోజు మొత్తం 11,512 మంది హాజరయ్యారు. సీమాంధ్రలో 38 కేంద్రాలకు గాను 19 కేంద్రాలు పనిచేయగా వీటిలో 6,051 మంది హాజరై ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 5,461 మంది హాజరయ్యారు. బీ-కేటగిరీపై ప్రభుత్వానికి నివేదన: ఇంజనీరింగ్ బీ-కేటగిరీ సీట్ల భర్తీపై ఈనెల 13న నోటిఫికేషన్ వెలువడిన తరువాత హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పునకు అనుగుణంగా తిరిగి నోటిఫికేషన్ జారీచేయాలా? లేక 13 నాటి నోటిఫికేషన్‌ను కొనసాగించాలా? కొత్త నోటిఫికేషన్ జారీచేస్తే 13 నాటి నోటిఫికేషన్‌కు అనుగుణంగా భర్తీ అయిన ప్రవేశాల పరిస్థితి ఏంటి? తదితర విషయాలపై న్యాయ సలహా తీసుకొని స్పష్టత ఇవ్వాల్సిందిగా ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం ఇచ్చే స్పష్టత ఆధారంగా బీ-కేటగిరీ సీట్లపై నిర్ణయం తీసుకుంటామని మండలి ైచైర్మన్ జయప్రకాశ్‌రావు తెలిపారు. -
సర్టిఫికెట్ల పరిశీలనకు అధిక సంఖ్యలో హాజరు
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఏఎన్‌యూ ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో ఆదివారం జరిగిన ఎంసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వర్సిటీ అధ్యాపకులు శనివారం సామూహిక సెలవు ప్రకటంచడంతో సర్టిఫికెట్ల పరిశీలన నిలిపివేయడం, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ గుంటూరులోని గుజ్జనగుండ్ల కేంద్రం వారు నిరవధికంగా విధులు బహిష్కరించడంతో.. అక్కడి విద్యార్థులకు కూడా ఏఎన్‌యూలో పరిశీలన జరపాలని నిర్ణయించారు. దీంతో ఆదివారం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రంతో పాటు క్యాంటిన్ ప్రాంగణం నిండిపోయింది. ఇంజినీరింగ్ కళాశాలల వారితో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆలస్యం.. వర్సిటీ కేంద్రంలో విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావడంతోపాటు బయటి ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చి విద్యార్థులను తమ కళాశాలకు ఆప్షన్ ఎంచుకోవాలని కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే ప్రాంతంలో కళాశాలల ప్రతినిధులు విద్యార్థులను పిలిచి సమూహాలుగా మీటింగ్‌లు పెట్టడం వల్ల గందరగోళ పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల నిర్వాహకులు ఏ ర్యాంకు వారిని రిజిస్ట్రేషన్ కు పిలిచారనేది విద్యార్థులు గ్రహించడంలో అసౌకర్యం తలెత్తుతోంది. ఇంజినీరింగ్ కళాశాలల వారు కౌన్సెలింగ్ కేంద్రం ప్రాంగణంలోకి రాకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వారు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ వద్దకే వచ్చి హడావుడి చేయడం గమనార్హం! యూనివర్సిటీలో సరైన భోజన వసతి లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నానాఅవస్థలు పడుతున్నారు. ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు నుంచి ఇదే పరిస్థితి ఉన్నా.. ఆదివారం అధిక సంఖ్యలో తరలిరావడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్సిటీలో క్యాంటిన్ ఉన్నా టీ, అరకొర అల్పాహారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వాహకులు, వర్సిటీ అధికారులు భోజన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మూడో రోజూ అవే కష్టాలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మూడో రోజు కూడా జరగలేదు. పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు బుధవారం విధులకు గైర్హాజరు కావడంతో ప్రక్రియకు ఆటంకం తప్పలేదు. ఏపీ ఎన్జీజీవోల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు నగరంలో సభ నిర్వహించడంతో సమైక్యవాదులంతా తరలి వెళ్లారు. కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద సమైక్యవాదుల తాకిడి స్వల్పంగా ఉండడంతో అభ్యర్థులు, తల్లిదండ్రులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కంచరపాలెం ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల సిబ్బంది వీరికి అడ్డుపడ్డారు. పోలీసులు లోపలికి వెళ్లడానికి నిరాకరించడంతో తల్లిదండ్రులు ఎదురు తిరిగారు. ఎన్నాళ్లీ ఉద్యమాలు అంటూ మండిపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తారా! అని ఎదురుదాడికి దిగారు. సీమాంధ్ర ఉద్యోగులంతా ఉద్యమంలో పాల్గొంటే ఇతర జిల్లాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. లోపలికి అనుమతిస్తే కళాశాల ప్రతినిధులతో మాట్లాడతామని కోరడంతో కొంత మందిని పంపించారు. తల్లిదండ్రుల ఆవేదన తనకు తెలుసునని, ఉద్యోగులు విధుల్లో లేకపోవడంతో తానేమి చేయలేనని ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బి.దేముడు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రక్రియ జరగదని స్పష్టం చేశారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కెమికల్ విభాగాధిపతి పి.ప్రకాశరావు బయటకువచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున ప్రక్రియ జరపలేమన్నారు. పత్రికా ప్రకటన ద్వారా సమాచారం తెలియజేస్తామని, అంత వరకూ కేంద్రాల వద్దకు రావద్దని సూచించారు. ఎంసెట్ అభ్యర్థులకు ఎటువంటి నష్టం జరగనివ్వబోమని పాలా రాష్ట్ర చైర్మన్ ఎన్.చంద్రశేఖర్ ప్రకటించారు. ప్రభుత్వం కౌన్సెలింగ్ ప్రక్రియ గడువును పెంచే ఆలోచనలో ఉన్నట్టు సంకేతాలు అందాయన్నారు. చివరకు కౌన్సెలింగ్‌ను నిలిపివేసినట్టు బయట బోర్డును ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు, తల్లిదండ్రులు వెనుతిరిగారు. విజయనగరం, శ్రీకాకుళంలో కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని తెలిసి కొంత మంది అటు ప్రయాణమయ్యారు. అక్కడ కూడా నిలిపివేశారని తెలిసి నిరాశతో వెనుతిరిగారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు హైదరాబాద్, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల్లోని హెల్ప్ సెంటర్లకు వెళ్లినట్టు తెలుస్తోంది. సీమాంధ్రలో రవాణా సదుపాయం లేకున్నా రైలు, టాక్సీల సహాయంతో అభ్యర్థులు జిల్లా నుంచి వెలుతున్నట్టు తెలిసింది. జిల్లాలో మూడో రోజు కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల తాకిడి సైతం తగ్గింది. నర్సీపట్నంలో.... నర్సీపట్నం : ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మూడో రోజూ జరగలేదు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు బుధవారం ఉదయమే స్థానిక పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకున్నారు. గత రెండు రోజుల మాదిరిగానే టీచింగ్ స్టాప్, నాలుగో తరగతి సిబ్బంది కౌన్సెలింగ్‌ను బహిష్కరించారు. దీంతో మూడో రోజూ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. మూడో రోజూ ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహోదగ్రులయ్యారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తుందో అర్థం కావడం లేదని వాపోయారు. కౌన్సెలింగ్ ఉంటుందని భావించి రవాణా సదుపాయం లేకపోయినా దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చామని ఆవేదన చెందారు. దీనిపై కౌన్సెలింగ్ కో-ఆర్డినేటర్ కిషోర్ మాట్లాడుతూ ఉద్యోగుల సహకారం లేకపోవడం వల్లే నిర్వహించలేకపోతున్నామన్నారు. -
ఉద్రిక్తత నడుమ ఎంసెట్ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం చేపట్టిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన.. తీవ్ర ఉద్రిక్తత నడుమ ఎట్టకేలకు ప్రారంభమైంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలోని హెల్ప్‌లైన్ కేంద్రం వద్ద విద్యార్థి జేఏసీ నేతలు, సభ్యులు ఆందోళనకు దిగటంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ పరిసరాల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి బయటనుంచి ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ర్యాంకర్తోపాటు ఒక్కరినే పంపారు. ఫలితంగా పరిస్థితి కొంత అదుపులో ఉన్నా విద్యార్థి జేఏసీ ఆందోళన కారణంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన సాగలేదు. వీసీ హెచ్.లజపతిరాయ్, ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డీఎస్పీ శ్రీని వాసరావు చర్చలు జరిపి నచ్చచెప్పటంతో జేఏసీ నాయకులు శాంతిం చారు. దీంతో మధ్యాహ్నం ర్యాం కర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంటన్నర వరకు కొనసాగింది. ఇదీ జరిగింది.. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పాలిటె క్నిక్ కళాశాల అధ్యాపకులు విధులు బహిష్కరించటంతో శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్ సెంటర్లో 19, 20 తేదీల్లో కౌన్సెలింగ్ జరగలేదు. దీంతో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని అంబేద్కర్ యూనివర్శిటీకి తరలించారు. అయితే వర్శిటీ విద్యార్థి జేఏసీ నాయకులు ఉదయం 8 గంటలకే హెల్ప్‌లైన్ కేంద్రానికి చేరుకున్నారు. ఐదేళ్లుగా వర్శిటీలో సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో ఇక్కడ కౌన్సెలింగ్ నిర్వహించటం ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమని తేల్చి చెప్పారు. కౌన్సెలింగ్ కేంద్రం తెరిస్తే సహించేది లేదంటూ బైఠాయించారు. వీసీ, ఏజేసీ, డీఎస్పీ చర్చలు.. విషయం తెలిసి ఏజేసీ రాజ్‌కుమార్, డీఎస్పీ శ్రీనివాసరావు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.ఎస్.దత్‌లు వర్సిటీకి చేరుకున్నారు. వైస్‌చాన్సలర్ లజపతిరాయ్, రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ మిర్యాల చంద్రయ్య, సీడీసీ డీన్ గుంట తులసీరావులతో చర్చిం చారు. విద్యార్థులను చెదరగొడతామని పోలీసు లు కోరినా వీసీ, అధికారులు అంగీకరించలేదు. విద్యార్థి జేఏసీ నాయకులు బడే రామారావు, కె.ధనరాజ్, పి.ప్రసాద్, బి.చక్రవర్తి తదితరులతో ఏజేసీ, వీసీ చర్చలు జరిపినా తొలుత అంగీకరించలేదు. ఎంతమంది పోలీసులు వచ్చినా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్కరోజు కౌన్సెలింగ్‌కు అవకాశం ఇవ్వాలని, గురువారం హెల్ప్‌లైన్ సెంటర్‌ను మారుస్తామని అధికారులు చెప్పారు. ప్రొఫెసర్లు కూడా సర్ది చెప్పటంతో విద్యార్థులు అంగీకరించారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమైంది. నెట్‌తో పాట్లు.. అర్ధరాత్రి వరకు ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం బుధవారం 30,001 నుంచి 45 వేల ర్యాంకులలోపు విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకావాలి. కానీ తొలి రెండు రోజులు ప్రక్రియ జరగకపోవటంతో 1 నుంచి 30 వేలలోపు ర్యాంకర్లు కూడా హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు ప్రారంభం కాకపోవటంతో టోకెన్లు తీసుకున్న 495 మంది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. వర్సిటీలో నెట్ నెమ్మదిగా ఉండటంతో రాత్రి 12 గంటల సమయానికి 290 మంది ధ్రువీకరణ పత్రాలనే పరిశీలించగలిగారు. దీంతో వీసీ లజపతిరాయ్ సూచన మేరకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర వరకు ఈ ప్రక్రియను కొనసాగించారు. నేటి నుంచి శ్రీకాకుళం పాలిటెక్నిక్‌లోనే.. గురువారం నుంచి శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రంలోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తొలుత హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఎక్కడికి మార్చాలనేదానిపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. కలెక్టర్ కార్యాలయం, అంబేద్కర్ ఆడిటోరియాలను పరిశీలించారు. అయితే ఇంటర్నెట్ వసతి, ట్రాఫిక్ వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్ కళాశాలలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని కలెక్టర్ సౌరభ్ గౌర్ సూచించారు. వాస్తవానికి వర్సిటీలో 2 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వ్యవస్థ ఉండటంతో కౌన్సెలింగ్ మందకొడిగా సాగింది. పాలిటెక్నిక్ కళాశాలలో 20 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వ్యవస్థ ఉంది. దీంతోపాటు హెల్ప్‌లైన్ సెంటర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. అందువల్ల అక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. పాలిటెక్నిక్ సిబ్బంది విధుల బహిష్కరణలో ఉండటంతో గురువారం కూడా యూనివర్సిటీ సిబ్బందే విధులు నిర్వహించనున్నారు. -
ఉద్రిక్తత నడుమ ఎంసెట్ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం చేపట్టిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన.. తీవ్ర ఉద్రిక్తత నడుమ ఎట్టకేలకు ప్రారంభమైంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలోని హెల్ప్‌లైన్ కేంద్రం వద్ద విద్యార్థి జేఏసీ నేతలు, సభ్యులు ఆందోళనకు దిగటంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ పరిసరాల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి బయటనుంచి ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ర్యాంకర్తోపాటు ఒక్కరినే పంపారు. ఫలితంగా పరిస్థితి కొంత అదుపులో ఉన్నా విద్యార్థి జేఏసీ ఆందోళన కారణంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన సాగలేదు. వీసీ హెచ్.లజపతిరాయ్, ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డీఎస్పీ శ్రీని వాసరావు చర్చలు జరిపి నచ్చచెప్పటంతో జేఏసీ నాయకులు శాంతిం చారు. దీంతో మధ్యాహ్నం ర్యాం కర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంటన్నర వరకు కొనసాగింది. ఇదీ జరిగింది.. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పాలిటె క్నిక్ కళాశాల అధ్యాపకులు విధులు బహిష్కరించటంతో శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్ సెంటర్లో 19, 20 తేదీల్లో కౌన్సెలింగ్ జరగలేదు. దీంతో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని అంబేద్కర్ యూనివర్శిటీకి తరలించారు. అయితే వర్శిటీ విద్యార్థి జేఏసీ నాయకులు ఉదయం 8 గంటలకే హెల్ప్‌లైన్ కేంద్రానికి చేరుకున్నారు. ఐదేళ్లుగా వర్శిటీలో సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో ఇక్కడ కౌన్సెలింగ్ నిర్వహించటం ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమని తేల్చి చెప్పారు. కౌన్సెలింగ్ కేంద్రం తెరిస్తే సహించేది లేదంటూ బైఠాయించారు. వీసీ, ఏజేసీ, డీఎస్పీ చర్చలు.. విషయం తెలిసి ఏజేసీ రాజ్‌కుమార్, డీఎస్పీ శ్రీనివాసరావు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.ఎస్.దత్‌లు వర్సిటీకి చేరుకున్నారు. వైస్‌చాన్సలర్ లజపతిరాయ్, రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ మిర్యాల చంద్రయ్య, సీడీసీ డీన్ గుంట తులసీరావులతో చర్చిం చారు. విద్యార్థులను చెదరగొడతామని పోలీసు లు కోరినా వీసీ, అధికారులు అంగీకరించలేదు. విద్యార్థి జేఏసీ నాయకులు బడే రామారావు, కె.ధనరాజ్, పి.ప్రసాద్, బి.చక్రవర్తి తదితరులతో ఏజేసీ, వీసీ చర్చలు జరిపినా తొలుత అంగీకరించలేదు. ఎంతమంది పోలీసులు వచ్చినా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్కరోజు కౌన్సెలింగ్‌కు అవకాశం ఇవ్వాలని, గురువారం హెల్ప్‌లైన్ సెంటర్‌ను మారుస్తామని అధికారులు చెప్పారు. ప్రొఫెసర్లు కూడా సర్ది చెప్పటంతో విద్యార్థులు అంగీకరించారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమైంది. నెట్‌తో పాట్లు.. అర్ధరాత్రి వరకు ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం బుధవారం 30,001 నుంచి 45 వేల ర్యాంకులలోపు విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకావాలి. కానీ తొలి రెండు రోజులు ప్రక్రియ జరగకపోవటంతో 1 నుంచి 30 వేలలోపు ర్యాంకర్లు కూడా హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు ప్రారంభం కాకపోవటంతో టోకెన్లు తీసుకున్న 495 మంది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. వర్సిటీలో నెట్ నెమ్మదిగా ఉండటంతో రాత్రి 12 గంటల సమయానికి 290 మంది ధ్రువీకరణ పత్రాలనే పరిశీలించగలిగారు. దీంతో వీసీ లజపతిరాయ్ సూచన మేరకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర వరకు ఈ ప్రక్రియను కొనసాగించారు. నేటి నుంచి శ్రీకాకుళం పాలిటెక్నిక్‌లోనే.. గురువారం నుంచి శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రంలోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తొలుత హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఎక్కడికి మార్చాలనేదానిపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. కలెక్టర్ కార్యాలయం, అంబేద్కర్ ఆడిటోరియాలను పరిశీలించారు. అయితే ఇంటర్నెట్ వసతి, ట్రాఫిక్ వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్ కళాశాలలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని కలెక్టర్ సౌరభ్ గౌర్ సూచించారు. వాస్తవానికి వర్సిటీలో 2 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వ్యవస్థ ఉండటంతో కౌన్సెలింగ్ మందకొడిగా సాగింది. పాలిటెక్నిక్ కళాశాలలో 20 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వ్యవస్థ ఉంది. దీంతోపాటు హెల్ప్‌లైన్ సెంటర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. అందువల్ల అక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. పాలిటెక్నిక్ సిబ్బంది విధుల బహిష్కరణలో ఉండటంతో గురువారం కూడా యూనివర్సిటీ సిబ్బందే విధులు నిర్వహించనున్నారు. -
రెండో రోజూ ఎంసెట్ కౌన్సెలింగ్ బంద్
జేఎన్టీయూ, న్యూస్‌లైన్ : అనంతపురంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు రెండో రోజు మంగళవారం కూడా అడ్డుకున్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రాలకు సమైక్యవాదులు ఉదయం ఆరు గంటలకే చేరుకుని కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులను వెనక్కు పంపించేశారు. మొదటి రోజు జరగనందున కనీసం రెండో రోజైనా జరుగుతుందనే ఆశతో కౌన్సెలింగ్ వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. పాలిటెక్నిక్ కళాశాల టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది సమ్మెలో ఉండటంతో కౌన్సెలింగ్‌కు ప్రిన్సిపాల్ మాత్రమే హాజరయ్యారు. ఎస్కేయూలో కౌన్సెలింగ్ కేంద్రానికి తాళం వేసి.. విద్యార్థులను వెనక్కు పంపారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాల టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది సమ్మెలో ఉన్నారని.. ఒక్కడితో కౌన్సెలింగ్ నిర్వహించడం సాధ్యం కాదన్నారు. కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకుంటున్నారన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామని, అక్కడి నుంచి నిర్ణయం రాగానే మొదలు పెడతామన్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు కౌన్సెలింగ్ తేదీలు పత్రికల్లో ప్రకటించే వరకు కౌన్సెలింగ్‌కు రావద్దన్నారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: ఎంసెట్‌కు సమైక్యాంధ్ర ఆందోళన సెగ తగిలింది. ఉద్యమకారుల నిరసనలు, అధ్యాపకులు సహాయనిరాకరణతో ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రవాణా సౌకర్యాలు లేకపోయినా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి విజయనగరం పట్టణంలోని పూల్‌బాగ్ పాలిటెక్నికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రానికి ఉదయానికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే కౌన్సెలింగ్ నిర్వహించవలసిన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సమ్మెలో ఉండడంతో పాటు సమైక్యాంధ్రులు కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కౌన్సెలింగ్ వాయిదా పడింది. దీంతో ఉదయం నుంచే జోరువానలోనూ వేచి ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెనుతిరగవలసి వచ్చింది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలు గుర్తున్నా.. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కౌన్సెలింగ్ ప్రారంభించాలని మొండిగా ఆదేశించడంతో విద్యార్థులు ఇక్కట్లకు గురికావలసి వచ్చింది. కౌన్సెలింగ్‌కు హాజరైన వేయి మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్‌ను సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పాలిటెక్నిక్ అధ్యాపకుల జేఏసీ తీర్మానం మేరకు బహిష్కరించారు. దీనికి తోడు ఉదయం 8 గంటలకే కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్న సమైక్య వాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ కౌన్సెలింగ్ నిర్వహించకూడదని పట్టుపట్టారు. ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోఆర్డినేటర్లను కోరారు. అలాగే అక్కడకు వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉద్యమం గూర్చి అవగాహనకల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వై.కృష్ణకిషోర్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులను బయటకు పంపించివేశారు. పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు, సిబ్బంది అంతా సమ్మెలో పాల్గొనడంతో కౌన్సెలింగ్ సాధ్యం కాదని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ టి.ఆర్.ఎస్.లక్ష్మి తెలిపారు. చేసేది లేక అభ్యర్థులు వెనుదిరిగారు. కౌన్సెలింగ్ సమైక్యవాదులను రావడంతో వారిని ఎస్ఐ వై.కృష్ణకిషోర్ అదుపుచేశారు. కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారన్నదీ తెలియరాలేదు.