'ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టులో ఇంప్లీడ్'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌పై రేపు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 4న తీర్పుఅ నుకూలంగా వస్తే యథావిధిగా కౌన్సెలింగ్ కొనసాగిస్తామని చెప్పారు. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిపై 5న సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఉన్నత విద్యామండలి ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.