సీమాంధ్ర జిల్లాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్కు సమైక్య సెగ తగిలింది. సీమాంధ్రలో ఎంసెట్ కౌన్సిలింగ్ చాలాచోట్ల ఇంకా ప్రారంభం కాలేదు.
హైదరాబాద్ : సీమాంధ్ర జిల్లాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్కు సమైక్య సెగ తగిలింది. సీమాంధ్రలో ఎంసెట్ కౌన్సిలింగ్ చాలాచోట్ల ఇంకా ప్రారంభం కాలేదు. విశాఖలో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ విధులను అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది బహిష్కరించారు. విశాఖలో ఎంసెట్ కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎంసెట్ -2013 కౌన్సెలింగ్‌లో భాగంగా ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నేటి నుంచి మొదలు అవుతోంది.
కాగా విజయవాడలోని పాలిటెక్నిక్ కేంద్రంలో ఎంసెట్ కౌన్సిలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కడపలోనూ ఎంసెట్ కౌన్సిలింగ్ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహణకు అధ్యాపకులు గౌర్హాజరు కావటంతో కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. గుంటూరు అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖల్లో ఇంకా కౌన్సిలింగ్ ఆరంభం కాలేదు. ఎంసెట్ కౌన్సిలింగ్ను సమైక్యవాదులు అడ్డుకోవటంతో కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక హైదరాబాద్లో ఆరు కేంద్రాల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 56 కేంద్రాల్లో కౌన్సిలింగ్ జరగనుంది.