నెల్లూరు : స్థానిక వెంకటేశ్వరపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రంపై శనివారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో కౌన్సెలింగ్కు వచ్చిన విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. దాంతో కౌన్సెలింగ్ను అధికారులు నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాతోపాటు పక్క జిల్లాల నుంచి కూడా ఈ కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాలిటెక్నిక్ కళాశాలకు తరలి వచ్చారు. అయితే తేనెటీగల దాడితో విద్యార్థులంతా కౌన్సెలింగ్ కేంద్రం నుంచి దూరంగా పరుగులు తీశారు.