ఉభయ రాష్ట్రాల విద్యార్థులకు ఊరట
* సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ మంత్రి హర్షం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్, అడ్మిషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉభయ రాష్ట్రాల విద్యార్థులకు ఊరట కల్గించే అంశమని.. కోర్టు నిర్ణయాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, నాయకత్వానికి ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సహకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి కళాశాలలు: పరకాల
ఈ నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగుస్తుందని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వృత్తి విద్యా కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు.