Ravela Kishore
-
జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు..
-
కేంద్రంలో గద్దెనెక్కితే.. వెలుగు జిలుగులే
సాక్షి, హైదరాబాద్: ‘‘సువిశాల భారతదేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రజల ఆలోచనా సరళిని మార్చాలి. ఇందుకోసం ఆలోచనాపరులను ఏకం చేస్తాం. దేశంలో ఒక మూల కోసమో, రాష్ట్రం కోసమో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని ఏర్పాటు చేయలేదు. మహోజ్వల భారతదేశ నిర్మాణం కోసం బీఆర్ఎస్ ఏర్పాటైంది. లక్ష కిలోమీటర్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్‌ను సృష్టిస్తాం’’ అని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఐఆర్ఎస్ మాజీ అధికారి చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్ తదితరులు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్కు రాజకీయం క్రీడ కాదు. ఒక టాస్క్. ఒక లక్ష్యం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా ఏటా రూ.1.45 లక్షల కోట్లు ఖర్చు చేసి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాం. ఏటా రూ. 2.5 లక్షల కోట్లతో 25 లక్షల దళిత కుటుంబాలకు ‘దళిత బంధు’ అమలు చేస్తాం. ప్రధాని మోదీ విధానం ప్రైవేటీకరణ అయితే.. మా విధానం జాతీయీకరణ. వారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసినా మేం అధికారంలోకి వస్తే వెనక్కి తీసుకుని జాతీయీకరణ చేస్తాం. లక్షల కోట్ల రూపాయల విలువౌన రైల్వే, విమాన, నౌకాశ్రయాలు, టెలిఫోన్ సంస్థలను మోదీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలకు అమ్ముతోంది. మేం అధికారంలోకి వస్తే అవన్నీ వాపస్ తీసుకుని ప్రభుత్వ రంగంలో చేర్చుతాం. అన్ని వనరులు ఉన్నా అభివృద్ధి లేదు.. స్వాతంత్య్రం తర్వాత నెహ్రూ, అంబేద్కర్ తదితరుల మార్గదర్శకత్వంలో చక్కటి ప్రయాణం మొదలై దేశాన్ని ముందుకు నడిపే ప్రయత్నాలు సాగాయి. కానీ తర్వాతి కాలంలో రాజకీయాలు, ప్రజాజీవితంలో జరిగిన మార్పులతో దేశం గమ్యాన్ని చేరుకోలేదు. అమెరికా, చైనాతో పోలిస్తే దేశ విస్తీర్ణంలో సగానికిపైగా అంటే 40కోట్ల ఎకరాల సాగుయోగ్య భూమి, ఆపిల్స్ మొదలుకుని మామిడి పండ్లు దాకా పండే పర్యావరణ మండలాలు, 40వేల టీఎంసీల నీరు, పనిచేసే మానవ వనరులు అందుబాటులో ఉన్నా అనుకున్న రీతిలో అభివృద్ధి జరగలేదు. కేంద్ర విధానాలు సరిగా లేకపోవడం వల్లే 13 నెలల పాటు ఢిల్లీ శివారులో రైతులు ఆందోళన చేశారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 4 లక్షల మెగావాట్లు ఉన్నా ఏనాడూ 2.10లక్షల మెగావాట్లకు వినియోగం మించడం లేదు. ఈ దుస్థితిని నివారించేందుకు ప్రజాజీవితంలో ఉన్న ప్రతివ్యక్తి ఆలోచించాలి. లక్ష్యశుద్ధి, సంకల్ప శుద్ధితో సాధించలేనిది ఏమీ ఉండదు. ఇది గతంలో అనేకసార్లు రుజువైంది. రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణం ఇదేనా? సువిశాల భారతదేశానికి సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా లక్షల అబద్ధాలు, కోట్లకొద్దీ డబ్బు కుమ్మరిస్తున్నారు. మత కల్లోలాలు రేపుతున్నారు. పదవులు రాగానే నేతలు నేల విడిచి సాము చేస్తూ అసహజంగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణం ఇదేనా? మనం సింగపూర్, చైనా తరహాలో పురోగతి ఎందుకు సాధించలేకపోయాం? జింబాబ్వే, రష్యా, చైనా, అమెరికా తదితర దేశాల తరహాలో భారత్‌లో భారీ జలాశయాలు ఎందుకు లేవు? కేంద్ర ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకపోవడం, పార్టీలు ప్రజలను వంచించడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. ప్రజలు గెలవాల్సిన చోట పార్టీలు, నాయకులు గెలుస్తున్నందునే ప్రజల ఆకాంక్షలు కనుమరుగవుతున్నాయి. భారత్ బుద్ధూ దేశం కాదు.. బుద్ధిమంతుల దేశం. ప్రతి గుండెను చేరగలిగితే భారత్ స్పందిస్తుందని గతంలో జయప్రకాశ్ నారాయణ్ నిరూపించారు. ఉజ్వల భారత్ నిర్మాణం వైపు అందరినీ సిద్ధం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం. బీఆర్ఎస్ ఒక ప్రాంతం, భాష, వ్యక్తికి పరిమితం కాదు. ఏ గొప్ప పని ప్రారంభించినా అవహేళనలు ఎదురవుతాయి. మొదట కొంచెం హేళన చేయడం ప్రారంభిస్తారు. తర్వాత మన మీద దాడి చేస్తారు. చివరికి మనకు విజయం చేకూరుతుంది. ఇదొక యజ్ఞం.. కష్టాలు, నష్టాలు వస్తాయి. సంక్రాంతి తర్వాత దూకుడే.. భవిష్యత్తులో పార్టీ కేడర్‌కు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. బీఆర్ఎస్లో చేరేవారికి స్వాతంత్య్ర సమరయోధుల తరహాలో గుర్తింపు దక్కుతుంది. దేశవ్యాప్తంగా 6.64 లక్షల గ్రామాల్లో బీఆర్ఎస్ కమిటీల ఏర్పాటుతో కార్యాచరణ మొదలవుతుంది. 4,123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడుగుపెడతాం. విద్యార్థి, మహిళా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం. ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, ఒడిషా వంటి ఏడెనిమిది రాష్ట్రాల్లో సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ కార్యక్రమాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. తూర్పు కనుమల నుంచి పశ్చిమ కనుమల వరకు పార్టీని విస్తరిస్తాం. ప్రజల సమస్యలే ఇతివృత్తం, పరిష్కారమే బీఆర్ఎస్ లక్ష్యం. ఏపీ ప్రజలూ కలిసిరావాలి భారత్‌ను ఉజ్వలంగా తయారుచేసే మహాయజ్ఞంలో ఏపీ ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. బీఆర్ఎస్లో చేరిక కోసం తట్టుకోలేనంత ఒత్తిడి వస్తోంది. త్వరలోనే ఆశ్చర్యపరిచే రీతిలో చేరికలు ఉంటాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేస్తున్నారు. మీరు సిట్టింగ్ కదా అని అడిగితే.. తాము అక్కడ ఫిట్టింగ్‌గా లేమని అంటున్నారు..’’ అని కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన తాడివాక రమేశ్‌నాయుడు (కాపునాడు జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్‌నాయుడు (కాపునాడు ప్రధాన కార్యదర్శి), రామారావు (ఏపీ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు), భారతి (మంగళగిరి) తదితరులకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఏపీశాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్టు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితుల సమస్యల పట్ల అవగాహన కలిగిన మాజీ మంత్రి రావెల కిషోర్సేవలను జాతీయస్థాయిలో వినియోగించుకుంటామని చెప్పారు. ‘‘ఇవాళ మాకు మంచి వజ్రాలు దొరికాయి. తోట చంద్రశేఖర్ పనితీరుపై సంపూర్ణ విశ్వాసంతో పాటు విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది. అధికారిగా అనుభవమున్న ఆయనకు అవకాశం కలిగింది. ఇక తడాఖా చూపడమే తరువాయి’’ అని కేసీఆర్ అన్నారు. -
హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!
అమ్మాయిని బస్సులో ముట్టుకుంటేనే భయంతో ఆ అమ్మాయి మళ్లీ బస్సెక్కడానికి కొన్ని రోజులు పడుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని మనమే ఒక మాట అనం. ఈ దరిద్రులు.. ఆమె ప్రయాణిస్తున్న ప్రతిచోటా వెంబడిస్తూనే ఉన్నారు! ఛేజ్ చేస్తూనే ఉన్నారు! బస్సు కొంత నయం... నలుగురూ ఉంటారు. ఒంటరిగా టూ వీలర్ మీదో, కారులోనో వెళుతూ అమ్మాయి కనిపిస్తే ఇక ఈ నీచులకు అడ్డూ ఆపూ ఉంటుందా? ‘ఇది తప్పురా’ అని.. ఇంట్లో వాళ్ల అమ్మ చెప్పదా? లేక.. ‘ఆంబోతులా తిరుగురా’ అని వాళ్ల నాన్న చెప్పాడా? కొవ్వుతో కలిగిన బలుపుతో కలిసిన ఈ మదాంధుల్ని చెప్పుతో కొడితే లాభం లేదు. చట్టమే వీళ్లను తన చెప్పుచేతల్లోకి తీసుకుని కొత్త మార్గంలో నడిపించేలా చేయాలి. సినిమాలు చూసో.. వాళ్ల నాయన పలుకుబడిని చూసో.. హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!! వీరేందర్ సింగ్ కుందు, ఐ.ఎ.ఎస్. రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి టూరిజం డిపార్ట్మెంట్ – హర్యానా ఐ.ఎ.ఎస్.లు ఎవరూ సాధారణంగా ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖలు రాయరు. కానీ వీరేందర్ సింగ్ కుందు 2017 ఆగస్టు 6 ఆదివారం ఫేస్బుక్లో ఒక లేఖను పోస్ట్ చేశారు! అయితే ఆ లేఖను ఆయన ఒక ఐ.ఎ.ఎస్. అధికారిగా రాయలేదు. ఒక సగటు ఆడపిల్ల తండ్రిగా రాశారు. ‘నిన్న అర్ధరాత్రి నా కూతురు వర్ణికకు ఒక భయానకమైన అనుభవం ఎదురైంది. డ్యూటీ ముగించుకుని ఆమె తన కారులో ఇంటికి వస్తుండగా, ఇద్దరు గూండాలు టాటా సఫారీలో ఆమెను వెంబడించారు. నా కూతురు గుండె నిబ్బరంతో వారి నుంచి వేగంగా తప్పించుకుని, కారును వేగంగా డ్రైవ్ చూస్తూనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తర్వాత కూడా వాళ్లు ఆమె దారిని పదే పదే అడ్డగించారు. కొన్ని కిలోమీటర్ల్ల దూరం వరకు అలా చేశారు. ఒకచోటైతే వాళ్లలో ఒకడు టాటా సఫారీలోంచి దూకేసి, నా కూతురి కారులోకి దూరే ప్రయత్నం చేశాడు. ఈ లోపు పోలీస్‌లు రావడంతో వారు పారిపోయారు. మా అమ్మాయి ధైర్యంగా అయితే తప్పించుకోగలిగింది కానీ, ఆ భయం నుంచి ఇంకా తేరుకోలేదు. అందుకు ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. ఇద్దరు కూతుళ్ల తండ్రిగా నేనీ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. ఇదంతా మీకు చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి : ఇదీ వాస్తవంగా జరిగింది అని చెప్పడం. రెండు.. ఒకవేళ అవసరమైతే మద్దతు కూడగట్టుకోవడం కోసం. ఈ పోరాటాన్ని నేను ఆపదలచుకోలేదు. దోషులకు శిక్ష పడకపోతే ఇంకా ఎంతోమంది కూతుళ్లకు ఈ దుస్థితి రావచ్చు. వాళ్లందరూ నా కూతురంత అదృష్టవంతులు కాకపోవచ్చు. అలాంటి వారి కోసం ఎవరో ఒకరు నిలబడాలి. నేను నిలబడుతున్నాను. నిలబడగలిగినంత కాలం నిలబడతాను.’ ఇదీ వీరేందర్ సింగ్ కుందు రాసిన లేఖ. సోషల్ మీడియాలో ఈ లేఖ చదివిన వాళ్లంతా ఆ గూండాలపై విరుచుకు పడ్డారు. కానీ రణవీర్ భట్టీ అనే వ్యక్తి మాత్రం వీరేందర్ సింగ్ మీద విరుచుకు పడ్డాడు! రణవీర్ భట్టి హర్యానా బీజేపీ ఉపాధ్యక్షుడు! ‘‘అసలు అంత రాత్రప్పుడు ఆ పిల్లకు రోడ్ల మీద ఏం పని?’’ అన్నది రణవీర్ భట్టీ ప్రశ్న. ఆయన ప్రశ్నకు సమాధానం కాదు కానీ.. వర్ణిక.. డిస్క్ జాకీ. ఆ వేళప్పుడే ఆమె డ్యూటీ అయిపోతుంది. రోజూ ఆ వేళప్పుడే ఆమె తన కారులో ఇంటికి బయల్దేరుతుంది. ఆమె రోజూ వెళ్లొచ్చే రోడ్డు ఒకటే. కానీ ఆ గూండాల కారణంగా ఆ రోజు రాత్రి ఆమె రోడ్లన్నిటి మీదా పరుగులు తీయాల్సి వచ్చింది.. వాళ్ల నుంచి ఎస్కేప్ అవడానికి. ఆ రోజు వర్ణికను కిడ్నాప్ చేసేందుకు వేట కుక్కల్లా వెంటపడిన ఆ ఇద్దరు ఆగంతకులలో ఒకడు వికాస్ బరాలా. హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కొడుకు. ఇంకొడు వికాస్ స్నేహితుడు అశీష్ కుమార్. మొదట వికాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వి.ఐ.పి. కొడుకని తెలిసి వదిలేశారు. తర్వాత వర్ణిక, ఆమె తండ్రి ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం, మీడియా ఒత్తిడి తేవడంతో వికాస్‌ను అరెస్ట్ చేశారు. ఆ వెంటనే వికాస్ తండ్రి పార్టీలో తన పదవికి రాజీనామా చేశాడు. ప్రస్తుతం వర్ణిక కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా.. గతంలో విఐపీ పుత్రరత్నాలు చేసిన కొన్ని ఘనకార్యాలను ఒకసారి చూద్దాం. మార్చి 2016 సుశీల్ కుమార్ సన్నాఫ్ రావెల కిషోర్ సుశీల్ మంత్రిగారి అబ్బాయి. నాన్నగారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. బంజారా హిల్స్‌లో నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళా టీచర్‌ను సుశీల్ కారులో వెంబడించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో నలుగురూ గుమికూడారు. పోలీసులు బాధితురాలి కంప్లైంట్ తీసుకున్నారు. సుశీల్‌పై ఐ.పి.సి. సెక్షన్ 354 మోలెస్టేషన్ కేసును నమోదు చేశారు. జూన్ 2015 రితురాజ్ సన్నాఫ్ ప్రణతి ఫుకాన్ ప్రణతి ఫుకాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. చేనేత, జౌళి ఉత్పతులు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి. ఆమె ఉండడం అస్సాంలో. తనయుడు రితురాజ్ ఉండడం బెంగళూరులో. ఫ్రెండ్స్‌తో కలిసి ఏదో బిజినెస్ చేస్తున్నాడు. పదేళ్ల బాలికను రేప్ చేసి, ఆ చిన్నారి మరణానికి కారణం అయ్యాడన్న ఫిర్యాదుపై సంజయ్ నగర్ పోలీసులు రితురాజ్పై కేసు ఫైల్ చేశారు. బాలిక తల్లి వీళ్ల దగ్గరే ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తుంటుంది. అయితే విషయాన్ని పై అధికారులు బైటకు పొక్కనీయలేదు. మంత్రి గారి కొడుకును, అతడి స్నేహితులను తప్పించే ప్రయత్నాలు జరిగాయి. జూలై 2014 సురేశ్ బదానా సన్నాఫ్ హేమ్‌సింగ్ బదానా హేమ్‌సింగ్ రాజస్థాన్ పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయన సుపుత్రుడు సురేశ్ అల్వార్‌లోని షాలిమార్ కాలనీలోకి.. కోళ్ల గంపలోకి దూరిన పిల్లిలా.. దూరాడు. ఒక యువతిని అసభ్యంగా కామెంట్ చేశాడు. నలుగురూ పట్టుకుని తన్నబోతే కాలనీలోని 308 క్వార్టర్లోకి దూరి తలుపేసుకున్నాడు. అది నాన్నగారికి ప్రభుత్వం కేటాయించిన క్వార్టరే. ఎవరొచ్చి తలుపు తట్టినా తియ్యలేదు. అర్ధరాత్రెప్పుడో బాల్కనీ లోంచి గోడ దూకి తప్పించుకున్నాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. జూన్ 2013 ఆదర్శ్ సన్నాఫ్ జోస్ తెట్టాయిల్ అప్పటికి లె ట్టాయిల్ కేరళ అపోజిషన్ లీడర్. ఎల్.డి.ఎఫ్. పార్టీ నాయకుడు. అంతకు ముందు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి. ఆయన నియోజకవర్గం అంగమల్లి. అక్కడి ఓ యువతి ఈ తండ్రీ కొడుకులిద్దరూ తనను లైంగికంగా వేధించారని కేసు పెట్టింది. ‘అబ్బే.. అలాంటిదేమీ లేదు. నా వెనుక పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోంది’ అని తప్పించుకోబోయాడు. విశేషం ఏంటంటే.. ఈ కేసులో తండ్రే ప్రధాన నిందితుడు. కొడుకు రెండో నిందితుడు. జూలై 2011 రోహిత్ సన్నాఫ్ అటనేషియో మాన్సెరెట్ మాన్సెరెట్ గోవా విద్యాశాఖ మంత్రి. గోవాలో ఉంటున్న ఒక జర్మన్ మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో 2008 నవంబరులో రోహిత్‌ను అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయికి అసభ్యకరమైన మెజేస్‌లు కూడా అతడు పంపించినట్లు రూడీ అయింది. అయితే మాన్సెరెట్ తన పలుకుబడితో కొడుక్కి శిక్ష పడకుండా కాపాడుకుంటూ వచ్చాడు. కేసు నాలుగేళ్లు నడిచింది. చివరికి కోర్టు రోహిత్‌ను నిర్దోషిగా వదిలిపెట్టింది. జనవరి 2008 తేజస్వీ, తేజ్ ప్రతాప్.. సన్స్ ఆఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన ఇద్దరు కుమారులు కన్నూమిన్నూ కానకుండా అమ్మాయిల్నీ వేధించారు. గుర్తు తెలియని యువకులు వారికి దేహశుద్ధి చేశారు. ఈ తోపులాటలో తేజస్వి, తేజ్ ప్రతాప్‌ల గన్‌మెన్ తుపాకీని ఎవరో లాక్కున్నారు. దానిపై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు వీళ్ల భాగోతం అంతా బయటపడింది. ముందు అశోకా హోటల్ దగ్గర కొందరు ఆడపిల్లల్ని ఏడిపించారు. తర్వాత కన్నాట్ ప్లేస్‌లో టీజ్ చేశారు. ఢిల్లీ–హర్యానా బార్డర్‌లోని ఛతార్పూర్లో పార్టీ ఉంటే, అక్కడికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మెహ్రాలీ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అమ్మాయిల మీద చెయ్యి వేశారు. అదిగో అప్పుడే ఇద్దర్నీ పట్టుకుని లోకల్ హీరోలు కొట్టేశారు. ముఖాలు వాచిపోయాయి. ప్రథమ చికిత్స కోసం అన్నదమ్ముల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీళ్లమీద కేసు మాత్రం నమోదు కాలేదు! ఏడుగురు అక్కచెల్లెళ్లు ఉన్న ఈ ఇద్దరు ప్రబుద్ధులు అమ్మాయిల్ని ఏడిపించడం ఏమిటో! డిసెంబర్ 2007 మిస్టర్ ‘హూ?’ గ్రాండ్ సన్ ఆఫ్ ఎ సీనియర్ లీడర్ దేశంలోని మిగతా కేసుల్లోనైనా ప్రబుద్ధులెవరో, వారి సుపుత్రులెవరో పేర్లు తెలిశాయి కానీ, పదేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన ఆయేషా హత్య కేసులో దోషులెవరో ఇంతవరకు తేల్లేదు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ కి ఇవ్వాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆయేషా హత్యను చేసింది ఓ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మనవడు అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే సత్యంబాబు అనే యువకుడిని హంతకుడిగా నిర్థారించి, పదేళ్ల జైలు శిక్ష తర్వాత నిర్దోషిగా ఈ ఏడాదే విడుదల చేశారు. ఇన్నేళ్లలోనూ అసలు నేరస్థుడు దొరకలేదంటే.. వెనుక వీఐపీల ప్రెజర్ ఉన్నట్లేనని అనుకోవాల్సి వస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వి.ఐ.పి.ల పుత్రరత్నాలు తమ తండ్రుల పలుకుబడితో కేసుల నుండి, శిక్షల నుండి తప్పించుకుంటున్నారు. ఈ ధోరణి వల్ల సగటు బాధితురాలు న్యాయం కోసం పోరాడే మానసిక స్థయిర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. -
ఒంగోలు టీడీపీ బాహాబాహీ
-
రావెల సుశీల్ కారు సీజ్
బంజారాహిల్స్: ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు రావెల సుశీల్(24) పోలీసు కస్టడీ గురువారం కూడా కొనసాగింది. ఆయనను బంజారాహిల్స్ పోలీసులు రెండో రోజైన గురువారం కూడా ఘటన వివరాలపై విచారించారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రావెల కిశోర్ తన కారులో వెళ్తూ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఫాతిమా బేగం అనే యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు జైలులో ఉన్న ఆయనతో పాటు డ్రైవర్ రమేష్‌ను తమ కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ రోజు వీరు ప్రయాణించిన కారు(ఏపీ 07 సీకే 1777)ను సీజ్ చేశారు. ఈ కారు నారాయణ స్వామి అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయి ఉందని పోలీసులు విచారణలో తెలిసింది. కొద్ది రోజులు వాడుకోవడానికి తన బంధువైన నారాయణ స్వామి నుంచి కారును తీసుకున్నట్లు సుశీల్ దర్యాప్తులో వెల్లడించారు. కాగా, ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. -
'కన్నా' తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేవారు
హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు గురివింద గింజ తరహాలో ఉన్నాయని మంత్రి రావెల కిషోర్‌బాబు విమర్శించారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు చేస్తున్న విమర్శలను వారి వ్యక్తిగతమైనవిగానే చూస్తాము తప్ప బీజేపీ అభిప్రాయంగా చూడలేమన్నారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేవారని, సైకిల్ దుకాణానికి యజమాని కొడుకు ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి, సంక్షేమాల దిశగా దూసుకుపోతుంటే పనిలేని పార్టీలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులోనూ రాష్ట్రంలో సింగిల్ పార్టీ.. అదీ సింగపూర్ తరహా పాలన కొనసాగుతుందని మంత్రి జోస్యం చెప్పారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై ప్రశ్నించగా ప్రజల అభీష్టం మేరకే ఏపనైనా చేస్తామని.. బాక్సైట్ తవ్వకాల విషయంలో కూడా గిరిజనులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టబోమని మంత్రి అన్నారు. -
'ఆయన భాష, వేషాలు...బాబును మెప్పించటానికే'
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్ష గురించి మాట్లాడే నైతిక హక్కు మంత్రి రావెల కిషోర్‌కు లేదని ఆ పార్టీ నేత మేరుగ నాగార్జున అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ రావెల భాష, వేషాలు చంద్రబాబును మెప్పించడానికే తప్ప... ప్రజలకు ఉపయోగం లేదన్నారు.దీక్ష అంటే అర్థం తెలియకుండానే జగన్ చేసేది దొంగ దీక్ష అనటం సిగ్గుచేటు అని మేరుగ నాగార్జున మండిపడ్డారు. దళితులకు రావాల్సిన నిధులను మంత్రి రావెల పక్కదారి పట్టిస్తున్నారని, అధికారం అడ్డం పెట్టుకుని అడ్డంకులు సృష్టిస్తే జనం సహించరని ఆయన ధ్వజమెత్తారు. -
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు రావెల కౌంటర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూములను బలవంతంగా లాక్కుంటే ధర్నా చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రావెల కిశోర్ బాబు స్పందించారు. రాజధాని భూముల విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి..పవన్ కల్యాణ్‌ను తప్పుపట్టారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణకు అవసరమైతే రైతులకు నచ్చజెప్పి ఒప్పించాలని పవన్‌కు సూచించారు. భూములు ఇవ్వకుండా పవన్ అడ్డుకోవడం సరికాదని రావెల అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని రావెల హెచ్చరించారు.ఈ రోజు రాజధాని ప్రాంతంలో పవన్ కల్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మంత్రులపై విమర్శలు చేశారు. -
మందకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన రావెల
మాదిగలను రాజకీయంగా అణగదొక్కింది సీఎం చంద్రబాబేనని మందకృష్ణ మాదిగ ఆరోపించడాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ఖండించారు. నిజానికి మాదిగలను రాజకీయంగా అభివృద్థి చేసింది టీడీపీయేనన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని ఉషామెహ్రా కమిషన్ గతంలోనే స్పష్టంచేసిందని గుర్తు చేశారు. దళిత వారోత్సవాల పేరుతో వారం రోజులపాటు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అప్పుడే ప్రభుత్వం దళితులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వెల్లడిస్తామన్నారు. -
రావెల, గల్లా జయదేవ్‌ను అడ్డుకున్న రైతులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌లకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం గుంటూరు జిల్లా కాకుమానులో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రావెల, జయదేవ్‌లను రైతులు అడ్డుకున్నారు. రైతుల రుణమాఫీని ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ రైతులు వారిని నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. -
‘చిక్కరు... దొరకరు... కనపడరు’
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు పార్లమెంటు సభ్యుడు, ఇద్దరు మంత్రులు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారారు. వారి గురించి ‘చిక్కరూ, దొరకరు, కనపడరని’ ఆ పార్టీ కార్యకర్తలే సరదా కామెంట్లు విసురుతున్నారు. పార్లమె ంటు సమావేశాలు ముగిసి పది రోజులు దాటినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. రాష్ట్ర మంత్రుల్లో ప్రత్తిపాటి పుల్లారావు అడపాదడపా వస్తున్నా, రావెల కిషోర్ దొరకడం లేదు. నిత్యం అందుబాటులో ఉంటామని, సమస్యలు పరిష్కరిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని, పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన ఈ నేతలు వాటిని పూర్తిగా విస్మరించారు. కనీసం ఫోన్‌కాల్స్‌కు కూడా స్పందించడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. * ప్రత్తిపాటి పుల్లారావుకు జిల్లాలో కేరాఫ్ అడ్రస్ అంటూ ఒకటి ఉందని, రావెల కిషోర్, గల్లా జయదేవ్‌లకు కేరాఫ్ అడ్రస్‌లు లేకపోవడంతో ఎక్కడ కలుసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు, కార్యకర్తలు వాపోతున్నారు. * ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరుపై నిఘా ఉందని, దాని ఆధారంగా మార్కులు ఉంటాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ టీమ్ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడమే కాని ఆ పరిస్థితులేవీ జిల్లాలో కనపడటం లేదు. * ఇటీవల నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి పలు మార్లు మంత్రి రావెలకు ఫోన్ చేసినా స్పందించ లేదు. చిన్నపాటి బదిలీలు, సమస్యలు పరిష్కరించు కోలేని దుస్థితిలో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అందుబాటులో ఉన్నా స్థానిక నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోన రగిలిపోతున్నారు. * ఎంపీ గల్లా జయదేవ్ పరిస్థితి మరీ విచిత్రం. ఆయనకు గుంటూరులో స్థిర నివాసం లేదు. కుటుంబ సభ్యులూ ఇక్కడ ఉండరు. దాంతో ఆయన రాకపోకల సమాచారం పార్టీ ముఖ్యనేతలకీ తెలియడం లేదు. * సామాన్య ప్రజలకు ఆయన కార్యాలయ గడప తొక్కే పరిస్థితే లేదు. ఖరీదైన కారుల్లో వచ్చే వారికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటోంది. * సాగునీటి సమస్య ఎదుర్కొంటున్న రైతులు ఎంపీ జయదేవ్ అందుబాటులో లేకపోవడంతో ఎంపీటీసీ, జెడ్సీటీసీ సభ్యులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. * ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం, జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చిన గల్లా చివరకు గుంటూరులో ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోలేదని, ఇక ఈయనేం అభివృద్ధి చేస్తారని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. * మంత్రి పుల్లారావు జిల్లాకు వచ్చినప్పుడు కలిసేందుకు వెళ్లిన సామాన్య ప్రజలు, కార్యకర్తలను సెక్యూరిటీ సిబ్బంది బయటకు నెట్టివేస్తున్నారు. కనీసం మంత్రి బయటకు వచ్చినప్పుడైనా తమవైపు చూడకపోతారా అని వేచి చూసే కార్యకర్తలకు నిరాశే మిగులుతోంది. * చివరకు హైదరాబాద్‌లో కలుద్దామని వెళ్లినా అక్కడా చుక్కెదురవుతో ంది. కేవలం నిమిషం సమయం కేటాయించి ఇక్కడి వరకు రావాలా...నియోజవర్గంలోనే కలుద్దాం అంటూ మంత్రి వారిని సున్నితంగా తిప్పి పంపుతున్నారు. * ఓట్లు వేసి గెలిపించుకున్న తమ నాయకుడు మంత్రి అయ్యారనీ, తమ కూ మేలు చేస్తారని కలలు కంటున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో అంతర్మథనం ఆరంభమైంది. -
ఉభయ రాష్ట్రాల విద్యార్థులకు ఊరట
* సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ మంత్రి హర్షం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్, అడ్మిషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉభయ రాష్ట్రాల విద్యార్థులకు ఊరట కల్గించే అంశమని.. కోర్టు నిర్ణయాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, నాయకత్వానికి ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సహకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. సెప్టెంబర్ 1 నుంచి కళాశాలలు: పరకాల ఈ నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగుస్తుందని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వృత్తి విద్యా కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. -
ఎంసెట్ కౌన్సిలింగ్ కు సహకరించాలి: రావెల
హైదరాబాద్: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సహకరించాలని ఏపీ మంత్రి రావెల కిశోర్, సమాచార సలహాదారుడు పరకాల విజ్క్షప్తి చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు నిర్ణయాన్ని పాటించాలని వారన్నారు. స్ధానికత 371-D ప్రకారం ఉండాలని సుప్రీం స్పష్టం చేసిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా రాజ్యాంగానికి లోబడి కౌన్సెలింగ్‌కు సహకరించాలన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకోవద్దని ఏపీ మంత్రి రావెల, సమాచార సలహాదారుడు పరకాల సూచించారు. -
రాష్ట్రపతి దృష్టికి స్థానికత అంశం: రావెల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చిస్తారని ఏపీ సాంఘీకశాఖమంత్రి రావెల కిషోర్‌బాబు మీడియాకు తెలిపారు. శనివారం రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి 1956 వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని రావెల అన్నారు. ఈ వివాదంపై త్వరలో ప్రధాని మోడీకి లేఖ రాస్తారన్నారు. స్థానికతపై కోర్టును కూడా ఆశ్రయిస్తామని రావెల కిషోర్ బాబు తెలిపారు. -
ఫీజు రీయింబర్స్ మెంట్ పై గవర్నర్ ను కలుస్తాం: రావెల
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన స్ధానికత సక్రమంగా లేదని ఆంధ్రప్రదేశ్ గిరిజన, సాంఘీక సంక్షేమశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు అన్యాయం కలిగించే రీతిలో ఉందని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు న్యాయం చేసేందుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుస్తామని ఆయన అన్నారు. విభజన బిల్లు ఆధారంగా విద్యార్ధులకు న్యాయం చేయాలని రావెల సూచించారు.