మందకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన రావెల | ravela kishore babu condemns manda krishna comments | Sakshi
Sakshi News home page

మందకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన రావెల

Published Fri, Jan 16 2015 4:09 PM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM

మందకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన రావెల - Sakshi

మందకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన రావెల

మాదిగలను రాజకీయంగా అణగదొక్కింది  సీఎం చంద్రబాబేనని మందకృష్ణ మాదిగ ఆరోపించడాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ఖండించారు. నిజానికి మాదిగలను రాజకీయంగా అభివృద్థి చేసింది టీడీపీయేనన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని ఉషామెహ్రా కమిషన్ గతంలోనే స్పష్టంచేసిందని గుర్తు చేశారు.

దళిత వారోత్సవాల పేరుతో వారం రోజులపాటు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అప్పుడే ప్రభుత్వం దళితులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వెల్లడిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement