ఎంసెట్ కౌన్సిలింగ్ కు సహకరించాలి: రావెల
ఎంసెట్ కౌన్సిలింగ్ కు సహకరించాలి: రావెల
Published Mon, Aug 4 2014 6:08 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
హైదరాబాద్: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సహకరించాలని ఏపీ మంత్రి రావెల కిశోర్, సమాచార సలహాదారుడు పరకాల విజ్క్షప్తి చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు నిర్ణయాన్ని పాటించాలని వారన్నారు.
స్ధానికత 371-D ప్రకారం ఉండాలని సుప్రీం స్పష్టం చేసిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా రాజ్యాంగానికి లోబడి కౌన్సెలింగ్‌కు సహకరించాలన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకోవద్దని ఏపీ మంత్రి రావెల, సమాచార సలహాదారుడు పరకాల సూచించారు.
Advertisement