emcet
-
టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ తొలగింపు
సాక్షి, అమరావతి/బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)లో ఇంటర్మీడియెట్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్‌లో ఇంటర్ గ్రూపు సబ్జెక్టుల మార్కులకు 25% వెయిటేజీ ఇస్తూ విద్యార్థులకు ర్యాంకులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంసెట్ మార్కులకు 75%, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీతో మార్కులను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చేవారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో వెయిటేజీకి స్వస్తి పలికారు. టెన్త్, ఇతర తరగతుల అంతర్గత మార్కుల ఆధారంగా ఇంటర్ బోర్డు మార్కులు కేటాయించింది. పరీక్షలు జరగకుండా ఇచ్చిన ఈ మార్కులు విద్యార్థుల వాస్తవ ప్రతిభను ప్రతిబింబించకపోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్, తదితర కోర్సుల్లో ప్రవేశాల్లో ఈ ఏడాది వరకు ఇంటర్ మార్కులకు ఇచ్చే వెయిటేజీని తొలగించాలని నిర్ణయించామన్నారు. ప్రవేశ పరీక్ష మార్కులకే 100% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఏపీ ఎంసెట్ పేరు ఏపీ ఈఏపీసెట్‌గా మార్పు ఇప్పటివరకు ఇంజనీరింగ్, తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఏపీ ఎంసెట్‌ను నిర్వహిస్తోంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో ఆ కోర్సులను తొలగించారు. ఏపీ ఎంసెట్ పేరును ఏపీ ఈఏపీసెట్‌గా మార్చారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశాలకే ఈ పరీక్ష జరుగుతుంది. ఆ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు.. కరోనాతో ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దవడంతో ఏపీ ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడతాం. సెట్లో వచ్చిన మార్కులకు అడ్మిషన్లలో 100 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 19 నుంచి 25 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తాం. – రామలింగరాజు, ఏపీ ఈఏపీసెట్ చైర్మన్ -
ఎంసెట్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం.. ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి. అయితే ప్రభుత్వం మాత్రం పాస్ మార్కులతో పరీక్షలు లేకుండానే ఫలితాలు విడుదల చేసింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించాలని కోరారు. పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని జేఎన్టీయూని ఆదేశించింది. ఈ క్రమంలోనే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించిన సర్కార్.. ఎంసెట్ నిబంధనలను సవరిస్తూ గురవారం జీవో జారీచేసింది. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ తెలంగాణ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు లబ్ధిపొందనున్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎవరైనా ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విధంగా విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ,బైపీసీ విద్యార్థులు 2,83,631 మంది ఉన్నారు. ఇందులో 1.75లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఎంసెట్‌కు కావాల్సిన 45శాతం కనీస మార్కులు పొందనివారికి... అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రూపంలో మరో అవకాశం ఉండేది. అందులో స్కోర్ పెంచుకుంటే ఆ తర్వాత ఎంసెట్‌కు అర్హత సాధించేవారు. కానీ ఈసారి ప్రభుత్వం కనీస మార్కులు 35తో ఫెయిలైనవారిని పాస్ చేయడంతో చాలామంది ఎంసెట్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రేపటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్
సాక్షి, అమరావతి : రేపటి నుంచి ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆన్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో వెబ్ కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేయగా, గిరిజన విద్యార్ధుల కోసం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. రేపు (అక్టోబర్ 23)న ఒకటో ర్యాంక్ నుంచి 20వేల వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనుండగా, 24న 20,001 ర్యాంక్ నుంచి 50వేల వరకు 25న 50,001 ర్యాంక్ నుంచి 80వేల వరకు 26న 80,001 ర్యాంక్ నుంచి 1.10లక్షల వరకు 27న 1,10,001 నుంచి చివరి ర్యాంక్ వరకు వెబ్ కౌన్సిలింగ్ జరగనుంది. -
జేఎన్టీయూహెచ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు రాని అభ్యర్థులు జేఎన్టీయూహెచ్ దగ్గర క్యూ కట్టారు. రేపటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుండటంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళలో ఉన్నారు. టీఎస్ ఎంసెట్ కార్యాలయంలో విద్యార్థులు తమ ఫోటో కాపీలు సమర్పిస్తున్నారు. కౌన్సిలింగ్ ఉన్న నేపథ్యంలో రేపటి లోగా ర్యాంకు కేటాయించక పోతే ఎలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అక్నాలెడ్జ్మెంట్ కాపీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుండటంతో జేఎన్టీయూహెచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 1,43,330 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1,19,187 మంది (83.16 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ తరువాత రెండు మూడుల్లో వారి ఫలితాలను విడుదల చేయనుంది. ఇక గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలను కూడా వచ్చే వారంలో విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. -
ఈనెల 28, 29న ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థతోపాటు అనేక ఎంట్రన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్డౌన్ సడలింపులతో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 28, 29 తేదిల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. (తెలంగాణ వచ్చాకే అన్నీ మెరుగయ్యాయి) ఆన్లైన్ ద్వారా జేఎన్టీయూ ఈ పరీక్ష నిర్వహించనుంది. మొత్తం 84 పరీక్ష కేంద్రాల్లో 67 తెలంగాణ, 17 ఏపీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 7,970 మంది పరీక్షకు హాజరు కానున్నారు. రెండు రోజులపాటు రెండు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఆ నెల 25 వరకు వెబ్సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. -
ఎంసెట్ షెడ్యూల్ విడుదల!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కి సోమవారం జేఎన్టీయూ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్లైన్ ద్వారా పరీక్షను నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 102 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణలో 79, ఏపీ 23 కేంద్రాలలో పరీక్షను నిర్వహించన్నారు. మొత్తం 1,43,165 అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. గురువారం నుంచి సెప్టెంబర్ 7 వ తేదీ వరకు www.eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని జేఎన్టీయూ కన్వీనర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం తప్పనిసరిగా పాటిస్తూ శానిటైజర్ వాడాలని ఆయన సూచించారు. చదవండి: 16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.. -
నో బయోమెట్రిక్.. ఓన్లీ హాల్‌టికెట్!!
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్ తదితర ఉమ్మడి ప్రవే శ పరీక్షల్లో(సెట్స్) బయోమెట్రిక్ హాజరు విధానం లేకుండానే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి ఇప్పటివరకు సేకరిస్తున్న బయోమెట్రిక్ (థంబ్ ఇంప్రెషన్) విధానాన్ని తొలగించాల ని నిర్ణయించింది. పరీక్షకు వచ్చే విద్యార్థుల్లో ఎవరి కైనా కరోనా ఉంటే థంబ్ ఇంప్రెషన్(వేలి ముద్రల సేకరణ)తో వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉన్నందున ఈసారి థంబ్ ఇంప్రెషన్‌ను తొలగించాలని నిర్ణయించింది. విద్యార్థుల హాల్‌టికెట్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. దీంతో ఒకరికి బదులు మరొక రు పరీక్ష రాసే అవకాశం ఉండదు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌ను రద్దు చేస్తున్నందున హాల్‌టికెట్ల ఆధారంగా విద్యార్థుల పరిశీలనను జాగ్రత్తగా చేపట్టాలని నిర్ణయించింది. జూలై 1 నుంచి నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్‌ను తొలగించనుంది. జాతీయ స్థాయిలోనూ జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్ వంటి ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్‌ను తొలగించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పరీక్ష హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు బయోమెట్రిక్ వల్ల కరోనా వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. జూలై 18 నుంచి 23 వరకు జరిగే జేఈఈ మెయిన్, ఆగస్టులో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ బయోమెట్రిక్ లేకుండానే పరీక్షలు నిర్వహించనున్నారు.ఇక జాతీయ స్థాయి పరీక్షల్లో హాల్లో సీసీ కెమెరాలతోపాటు విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలు రాసే సమయంలో విద్యార్థి ఎదురుగా ఉండే మానిటర్‌పై కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ కెమెరాలు ప్రతి ఐదు నిమిషాలకోసారి విద్యార్థి ఫొటోను ఆటోమెటిక్‌గా తీస్తాయి. -
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈనెల 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రివైజ్డ్ షెడ్యూలును ప్రవేశాల కమిటీ జారీ చేసింది. విద్యార్థులు ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం 54,836 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోగా, అందులో 53,795 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారంతా శుక్రవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు మిగతా కార్యాలయం అధికారి బి.శ్రీనివాస్ వివరించారు. అలాగే కాలేజీల వారీగా సీట్ల వివరాలను వెల్లడించారు. ఫీజుల ఖరారు.. లేదంటే షరతులతో ముందుకు! రాష్ట్రంలోని 189 ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు ఫీజుల ఖరారు కోసం కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీలతో ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) హియరింగ్ నిర్వహించి ఫీజులను ఖరారు చేసింది. మిగతా 108 కాలేజీల ఫీజల ఖరారు ప్రక్రియను గురువారం చేపట్టింది. అర్ధరాత్రి వరకు కొనసాగించింది. మరోవైపు శుక్రవారం ఉదయం నుంచే ఆయా కాలేజీలతో హియరింగ్ నిర్వహించి ఫీజులను ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటికే 81 కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులపై ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఫైలును ప్రభుత్వానికి పంపించింది. గురువారం సాయంత్రమే ఆ ఫైలును సీఎం ఆమోదం కోసం విద్యాశాఖ పంపించింది. దీంతో శుక్రవారం ఆయా కాలేజీల ఫీజులపై ఉత్తర్వులు జారీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఏఎఫ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ స్వరూప్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం సమావేశమై 4గంటల పాటు చర్చించారు. శుక్రవారం సాయంత్రం వరకు మిగతా కాలేజీలకు సంబంధించిన ఫీజుల ఫైలును కూడా పంపించాలన్న ఆలోచనల్లో ఉన్నారు. సీఎం ఆమోదం ఆలస్యమైతే! ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించిన ఫైలుకు ఆమోదం లభించడంలో ఆలస్యమైతే.. ఎలా ముందుకెళ్లాలన్న కార్యాచరణపైనా ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ఎలాగూ కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి రూ.50వేల లోపు ఫీజున్న కాలేజీలకు 20%, రూ.50వేలకు పైగా ఫీజు ఉన్న కాలేజీలకు 15% పెంపునకు ప్రతిపాదించడం.. దీనికి మెజారిటీ కాలేజీలు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను ఆలస్యం చేయవద్దని, యాజమాన్యాలకు ఏఎఫ్ఆర్సీ చేసిన ఫీజు పెంపు ప్రతిపాదనల అమలుతో ముందుకు సాగాలని నిర్ణయించారు. సీఎం కనుక శుక్రవారం ఓకే చేస్తే ఎలాంటి సమస్యా ఉండదన్న భావనకు వచ్చారు. అది జరక్కపోతే మాత్రం కండిషనల్‌గా 15%, 20% పెంపును వర్తింపజేయాలని నిర్ణయించారు. పూర్తిస్థాయి ఫీజులపై ఉత్తర్వులు వచ్చాక వాటిని అమలు చేస్తామని, ఈ అంశాలన్నింటిని తెలియజేస్తూ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఫీజుల పెంపుపై స్పష్టత! తల్లిదండ్రుల్లో ఇప్పటికే ఫీజుల పెంపుపై ఓ స్పష్టత వచ్చిందన్న అభిప్రాయానికి అధికారుల వచ్చారు. ఏఎఫ్ఆర్సీ హియరింగ్ సీబీఐటీకి రూ.1.34 లక్షలు వార్షిక ఫీజుగా ఖరారు చేసినట్లు తెలిసింది. అలాగే శ్రీనిధి, వాసవి కాలే జీలకు రూ.1.30 లక్షలుగా, ఎంజీఐటీకి రూ.1.08 లక్షలుగా ఫీజును ఖరారు చేసినట్లు సమాచారం.దీంతో టాప్ కాలేజీల్లో గరిష్టంగా ఫీజు ఎంత ఉండొచ్చన్న అంచనా ఉంది. దీంతో ఇంజనీరింగ్ కాలేజీల్లో రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకు ఫీజు పెంపు ఉండనుంది. ఈ నేపథ్యంలో ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఈ ఫీజులకు శుక్రవారం ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోతే షరతులతో ముందుకు సాగనున్నారు. కన్వీనర్ కోటాలో 64,709 సీట్లు ఇప్పటివరకు అన్ని సరిగ్గా ఉన్న 183 కాలేజీల్లో మొత్తంగా 91,270 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల కమిటీ ప్రకటించింది. అందులో 169 ప్రైవేటు కాలేజీల్లో 88,199 సీట్లు అందుబాటులో ఉండగా, 14 యూనివర్సిటీ/ప్రభుత్వ కాలేజీల్లో 3,071 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో 70% సీట్లను (64,709) కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తంగా 26,561 సీట్లు మేనేజ్మెంట్, ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో కాలేజీలు భర్తీ చేసుకునే అవకాశం ఉంది. శనివారం నాటికి మరిన్ని కాలేజీలు, సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. యూనివర్సిటీల వారీగా ప్రభుత్వ కాలేజీలు, సీట్లు యూనివర్సిటీ కాలేజీలు సీట్లు ఉస్మానియా 2 420 జేఎన్టీయూ–హెచ్ 4 1,410 కాకతీయ 3 825 మహత్మాగాంధీ 1 180 జేఎన్ఏఎఫ్ఏయూ 1 160 అగ్రికల్చర్ యూనివర్సిటీ 2 54 వెటర్నరీ యూనివర్సిటీ 1 22 మొత్తం 14 3,071 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్ల వివరాలు.. యూనివర్సిటీ ఆమోదం లభించిన మొత్తం కన్వీనర్ కోటాలో సీట్లు కాలేజీలు సీట్లు కాలేజీలు సీట్లు ఉస్మానియా 13 7,760 13 5,411 జేఎన్టీయూ–హెచ్ 151 78,729 151 55,030 కాకతీయ 5 1,710 5 1,197 మొత్తం 169 88,199 169 61,638 యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో 14 3,071 మొత్తంగా కన్వీనర్ కోటాలో... 183 64,709 కన్వీనర్ కోటాలో కోర్సుల వారీగా సీట్ల వివరాలు.. కోర్సు యూనివర్సిటీ ప్రైవేటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 27 – ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ – 84 ఏరోనాటికల్ ఇంజనీరింగ్ – 294 ఆటోమొబైల్ ఇంజనీరింగ్ – 84 బయోటెక్నాలజీ – 21 బయోమెడికల్ ఇంజనీరింగ్ 30 21 కెమికల్ ఇంజనీరింగ్ 120 126 సివిల్ ఇంజనీరింగ్ 130 7,949 కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టం – 42 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 550 16,614 సీఎస్‌ఐటీ – 42 డైరీయింగ్ 22 – డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్ 60 – ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 500 14,955 ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ – 16 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 490 7,792 ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేనేషన్ ఇంజనీరింగ్ – 322 ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీమ్యాటిక్స్ – 42 ఫుడ్‌సైన్స్ 27 – ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ 20 – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 240 3,717 ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ – 112 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ – 42 మెకానికల్ (మెకట్రానిక్స్) ఇంజనీరింగ్ – 42 మెకానికల్ ఇంజనీరింగ్ 420 8,833 మెటలర్జికల్ ఇంజనీరింగ్ 60 – మైనింగ్ ఇంజనీరింగ్ 55 168 మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ – 42 పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ – 84 ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్ – 42 ప్లానింగ్ 40 – టెక్స్టైల్ టెక్నాలజీ 20 – మొత్తం 3,071 61,638 -
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 ఫలితాలను విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ కార్యదర్శి విజయరాజు సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, 512 (83.64శాతం) మంది క్యాలీఫై అయినట్లు అధికారులు వెల్లడించారు. పులిశెట్టి రవిశ్రీ తేజ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో స్టేట్ ర్యాంకు, వేద ప్రణవ్ రెండో ర్యాంకు సాధించారు. మెడికల్‌లో సుంకర సాయి స్వాతి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆయా ర్యాంకుల వివరాలను విద్యార్థుల నంబర్లకు పంపనున్నట్లు విజయరాజు తెలిపారు. కాగా ఏపీ ఎంసెట్‌కు 36,698 మంది తెలంగాణ విద్యార్థులు పరీక్ష రాశారు. ( ఏపీ ఎంసెట్ ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి ) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంజనీరింగ్ టాప్‌టెన్ ర్యాంకర్లు 1. కరిశెటి రవి శ్రీతేజ 2.వేద ప్రణవ్ 3.గొర్తి భాను దత్తు 4. హేథవావ్య 5. బట్టెపాటి కార్తికేయ 6.రిషి షర్రష్ 7.సూర్య లిఖిత్ 8. అప్పలకొండ అభిజిత్ రెడ్డి 9. ఆర్యన్ లద్దా 10.హేమ వెంటక అభినవ్ అగ్రికల్చర్, మెడికల్ టాప్‌టెన్ ర్యాంకర్లు 1.సుంకర సాయి స్వాతి 2. దాసరి కిరణ్‌కుమార్ రెడ్డి 3. అత్యం సాయి ప్రవీణ్ గుప్తా 4. తిప్పరాజు రెడ్డి 5.జీ మాధురి రెడ్డి 6. గొంగటి కృష్ణ వంశీ 7. కంచి జయశ్రీ వైష్ణవీ వర్మ 8. భీ. సుభిక్ష 9. కొర్నెపాటి హరిప్రసాద్ 10. ఎంపటి కుశ్వంత్ -
రేపటి నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్–2019 ఆన్లైన్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నా యి. 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు ఎంసెట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గం టల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. 18 పట్టణాల పరిధిలోని 94 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేసింది. తెలంగాణలో 15 పట్టణాల పరిధిలోని 83 కేంద్రాల్లో, ఏపీలో మూడు పట్టణాల పరిధిలోని 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. అందులో రెండింటికీ హాజరయ్యే వారు 235 మంది ఉన్నారు. దరఖాస్తుదారుల్లో ఈసారి ఐదుగురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వారిలో నలుగురు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజ రు కానుండగా, ఒకరు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గంటన్నర ముందునుంచే పరీక్ష హాల్లోకి.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. విద్యార్థులను పరీక్ష సమయానికికంటే గంటన్నర ముందునుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని వెల్లడించారు. విద్యార్థులు చివరి క్షణంలో ఇబ్బందులు పడకుండా వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మొదటి విడత పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా ఆ పరీక్షకు ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్ష కోసం విద్యార్థులను 1:30 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. అగ్రికల్చర్ కోర్సులవైపు బాలికల మొగ్గు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు అత్యధికంగా బాలికలే దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కోసం బాలురు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు బాలికలు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాసేందుకు 87,804 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా, 54,410 మంది బాలికలే దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు బాలురు 23,316 మంది దరఖాస్తు చేసుకోగా, బాలికలు 51,664 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులకు సూచనలు ∙విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే చూసుకోవాలి. పరీక్ష రోజు ఇబ్బంది పడకుండా వీలైనంత ముందుగా చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ∙పరీక్ష హాల్లోకి హాల్‌టికెట్, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే అటెస్ట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ∙విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లగానే తమ బయోమెట్రిక్ డేటాను నమోదు చేసుకోవాలి. ∙హాల్‌టికెట్ లేకుండా విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలోకి, హాల్లోకి అనుమతించరు. ∙విద్యార్థులు తమ వెంట తెచ్చుకున్న ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. ∙పరీక్ష ప్రారంభం అయ్యాక వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష హాల్లోకి అనుమతించరు. వచ్చిన వారిని పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపించరు. ∙కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్లు, సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నిషేధం. వాటిని పరీక్ష హాల్లోకి తీసుకెళ్లకూడదు. రఫ్ వర్క్ కోసం బుక్‌లెట్‌ను పరీక్ష హాల్లోనే అందజేస్తారు. ఆ బుక్‌లెట్‌ను తర్వాత ఇన్విజిలేటర్‌కు ఇచ్చేయాలి. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. స్ట్రీమ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విద్యార్థుల సంఖ్య 1,42,218 74,981 బాలురు 87,804 23,316 బాలికలు 54,410 51,664 ట్రాన్స్‌జెండర్స్ 4 1 -
ఎంసెట్‌పై ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ ఫలితాలు వెల్లడించాకే ఎంసెట్–2019 ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులెవరూ ఆందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ ఫలితాల్లో పెద్ద ఎత్తున తప్పిదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియలకు కొంత సమయం పట్టనుండగా, ఆలోపే ఎంసెట్ ఫలితాలు ప్రకటిస్తే, ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఫెయిలైన విద్యార్థులు ఎంసెట్‌లో సైతం ఫెయిల్ కానున్నారు. దీంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తర్వాతే ఎంసెట్ ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించినట్లు తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వి.వెంకటరమణతో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులెవరూ ఇంటర్ ఫలితాలపై బెంగ పెట్టుకోకుండా ఎంసెట్‌కు సిద్ధం కావాలని కోరారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ విషయంలో ఇంటర్ బోర్డుతో సమన్వయం చేసుకుని ఎంసెట్ ఫలితాలు ప్రకటిస్తామన్నారు. విద్యార్థులెవరికీ అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో ఇంజనీరింగ్, 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఎంసెట్ ప్రవేశపరీక్ష జరగనుందని, ఆ తర్వాత 28న ఫలితాలు ప్రకటించాలని భావించినట్లు తెలిపారు. అయితే ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు చెప్పారు. ఎంసెట్ ఫలితాలు కొద్దిగా ఆలస్యమైనా, కౌన్సెలింగ్‌తో పాటు విద్యా సంవత్సరం అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలొచ్చిన తర్వాతే దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును 2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నామని తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. డిగ్రీతో పాటు బీఈడీ చేసేందుకు 5 ఏళ్ల సమయం పట్టనుందని, కానీ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో చేరితే నాలుగేళ్లలో డిగ్రీ, బీఈడీ పూర్తి చేయొచ్చన్నారు. నాలుగేళ్ల బీఏ, బీఈడీ/బీకాం, బీఈడీ/ బీఎస్సీ, బీఈడీ కోర్సులను ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. లక్సెట్టిపేట, కల్వకుర్తి, నారాయణ్‌ఖేడ్, భూపాలపల్లిలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలల్లో తొలుత ఈ కోర్సు ప్రారంభం కానుందన్నారు. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు సాధారణ డిగ్రీతో సమానమన్నారు. -
18న ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెలాఖరుకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సోమవారం ఎంసెట్ పరీక్షలు పూర్తయినందున ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 2, 3 తేదీల్లో అగ్రికల్చర్ కోర్సులకు ఎంసెట్, 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్‌కు ఎంసెట్‌ను జేఎన్టీయూహెచ్ నిర్వహించింది. వాటికి సంబంధించిన ప్రాథమిక కీలను మంగళవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. విద్యార్థులు తమ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యంతరాలను ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఎంసెట్ ర్యాంకులను ఈ నెల 18వ తేదీన ప్రకటించనున్నారు. ఇప్పటికే కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి ఏయే కాలేజీల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి...వాటి ఆధారంగా ఏయే కోర్సుల్లో ఎన్ని సీట్లకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలన్న ప్రక్రియను జేఎన్టీయూహెచ్ పూర్తి చేసింది. ఫలితాలను వెల్లడించిన వెంటనే ప్రవేశాల కౌన్సెలింగ్‌కు కాలేజీలు, సీట్ల జాబితాను అందజేయనుంది. మొత్తానికి ఈ నెలాఖరులో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఇంజనీరింగ్ కోసం 94.25 శాతం హాజరు తెలంగాణలో ఎంసెట్ రాసేందుకు 1,26,547 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 1,19,270 మంది (94.25 శాతం) హాజరయ్యారు. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ రాసేందుకు 63,653 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 58,744 మంది (92.29 శాతం) విద్యార్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీరింగ్ కోసం 21365 మంది దరఖాస్తు చేసుకోగా 17,041 మంది (79.06 శాతం) హాజరయ్యారు. అగ్రికల్చర్ కోసం 9,425 మంది దరఖాస్తు చేసుకోగా 8,113 మంది (86.08 శాతం) విద్యార్థులు హజరయ్యారు. -
ఎంసెట్ పరీక్షలు ప్రారంభం
అల్గునూర్(మానకొండూర్) : మొదటిసారి ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థుల కోసం తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి, వాగేశ్వరి, శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి 7వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహించిన అగ్రికల్చర్ పరీక్షకు 3,502 మందికి 3296 మంది హాజరయ్యారు. ఉదయం వాగేశ్వరి కళాశాలలోని అయాన్ డిజిటల్ సెంటర్లో 750 మందికి 710 మంది, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో 352 మందికి 328 మంది, జ్యోతిష్మతి కళాశాలలో 150 మందికి 135 మంది, శ్రీచైతన్య ఇంజినీరింగ్–1లో 350 మందికి 331 మంది, శ్రీచైతన్య–2లో 149 మందికి 144 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం వాగేశ్వరి అయాన్ డిజిటల్ సెంటర్లో 750 మందికి 712 మంది, ఇంజినీరింగ్ కళాశాలలో 350 మందికి 333, జ్యోతిష్మతిలో 150 మందికి 138, శ్రీచైతన్య–1లో 349 మందికి 325, శ్రీచైతన్య–2లో 150 మందికి 137 మంది హాజరయ్యారని పరీక్షల నిర్వాహకులు తెలిపారు. కాగా ఉదయం వాగేశ్వరి కేంద్రానికి వేములవాడకు చెందిన తిప్పారపు వెన్నెల 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో నిమిషం నిబంధన కింద అధికారులు ఆమెను అనుమతించలేదు. బయోమెట్రిక్‌తో హాజరు నమోదు విద్యార్థులందరికీ బయోమెట్రిక్‌తో హాజరు నమోదు చేశారు. నూతన విధానంలో నిర్వహిస్తున్న పరీక్షతో విద్యార్థులు మొదట కొంత ఆందోళన చెందినా..ఆ తర్వాత అంతా సర్దుకుంది. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను రెండు గంటల ముందే అనుమతించడంతో పరీక్షలు ప్రశాంతంగా రాశారు. హాల్‌టికెట్లపై గెజిటెడ్ సంతకం లేకపోయినా పరీక్ష కేంద్రాల ఇన్‌చార్జిలే సంతకాలు చేయించి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. కేంద్రాలను తనిఖీ చేసిన ఏసీపీ ఎంసెట్ పరీక్ష కేంద్రాలను కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గతంలో అల్గునూర్ చౌరస్తాలో ట్రాఫిక్ కారణంగా అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పోయారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు ఇన్చార్జిగా మానకొండూర్ సీఐ కోటేశ్వర్‌ను నియమించగా, ఎస్సైలు నరేశ్‌రెడ్డి, పల్లె నర్సింగ్ పర్యవేక్షించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాగేశ్వరి కళాశాల సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్‌రెడ్డి టెంట్లు కూడా ఏర్పాటు చేయించి తాగునీటి వసతి కల్పించారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్థులు -
ప్రశాంతంగా ఎంసెట్–3
ఆదిలాబాద్ టౌన్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన ఎంసెట్– 3 ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగింది. జిల్లా కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యం నిబంధన ఉండడంతో అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. ఎంసెట్–2 పేపర్ లీక్ కావడంతో పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసులు అభ్యర్థులను క్షుణంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మొత్తం 932 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 563 మంది హాజరయ్యారు. 369 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 460 మందికి 281 మంది పరీక్ష రాయగా, 179 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 232 మందికి 139 మంది హాజరయ్యారు. 93 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రంలో 240 మందికి 143 మంది పరీక్షకు హాజరయ్యారు. 97 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు శ్రీధర్‌రెడ్డి, వసంత్‌కుమార్, ఎంసెట్ పరీక్ష రీజినల్ కోఆర్డినేటర్లు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎంసెట్ లీకేజీపై కాంగ్రెస్ రాస్తారోకో
రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఎంసెట్ పరీక్షాపత్రం లీకేజీ అయ్యిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం వాటిల్లిందని, దీనికి కారకులైన విద్య, ఆరోగ్య శాఖ మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తహసీల్దార్ ఆండాళ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులి అంజనేయులుగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోల రమేష్, పంజాల శ్రీనివాస్‌గౌడ్, రేణికుంట బాపురాజు, నాగరాజు, దేవకిషన్, బొమ్మరవేని తిరుపతి, జట్టుపల్లి వీర య్య, స్వామి, అజయ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ఎంసెట్-2 లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే
►సీఎల్పీ నేత కె.జానారెడ్డి నాగార్జునసాగర్: ప్రభుత్వం వైఫల్యంతోనే ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్-2 రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వం క్షోభకు గురిచేస్తోందన్నారు. లీకేజీలో పాత్రధారులు, సూత్రధారులందరినీ కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎంసెట్–2 లీకేజీపై ప్రభుత్వాన్ని విమర్శించవద్దు
► ఐఐటీ–జేఈఈ ఫోరమ్ కన్వీనర్ లలిత్ కుమార్ బాలానగర్: ఎంసెట్ –2 లీకేజీపై ప్రభుత్వంపై విమర్శలు మాని విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని ఐఐటీ–జేఈఈ ఫోరమ్ కన్వీనర్ కె. లలిత్ కుమార్ కోరారు. లీకేజి విషయంలో ప్రభుత్వ నిర్ణయమే చట్టబద్ధమైనదని అందుకు తగ్గట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పు దోవ పట్టిస్తున్నాయన్నారు. ఒకవేళ ఎంసెట్ – 2ను ప్రభుత్వం రద్దు చేయకపోయినా న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉందన్నారు. అప్పుడైనా ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎలాగూ రద్దుచేస్తారన్నారు. అప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొనవలసిందేనని, ఒక సంవత్సరం విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడి ఉండేదన్నారు. కాపీ రైట్ చట్టం ప్రకారం ఒక విద్యార్ధి పరీక్షలో అక్రమ మార్గంలో ఉత్తీర్ణుడైనట్లయితే మొత్తం ఆ పరీక్షనే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని చట్టమే ఉన్నదన్నారు. ఆ చట్టానికి అనుగుణంగానే అన్ని కోణాల్లో ఆలోచించి ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇటువంటి లీకేజీ సంఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల విధానాన్ని సంస్కరించాలని కోరారు. -
‘నారాయణ, శ్రీచైతన్యపై’ అనుమానం
హిమాయత్‌నగర్: ఎంసెట్–2 లీక్ వ్యవహారంలో నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కూడా విచారణ జరపాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్.ప్రదీప్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సత్య డిమాండ్ చేశారు. వందలోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులలో ఆ విద్యాసంస్థలకు చెందిన వారు కూడా ఉన్నారని ఆరోపించారు. నారాయణగూడ ఫ్లైఓవర్ కింద పీడిఎస్యూ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావు, మహేష్ పాల్గొన్నారు. -
ఎంసెట్ రద్దు.. వద్దు
ర్యాంకర్లు, తల్లిదండ్రుల ర్యాలీ, ధర్నా పలు విద్యార్థి సంఘాల ఆందోళన కరీంనగర్ ఎడ్యుకేషన్: ఎంసెట్–2 లీకేజీ వ్యవహారంలో బాధ్యులను కఠినంగా శిక్షించి, ర్యాంకర్లకు యథావిధంగా కౌన్సెలింగ్ నిర్వహించాలని, పరీక్ష రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంసెట్–2 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు శుక్రవారం కరీంనగర్ తెలంగాణచౌక్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. పేపర్ లీకేజీకి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని, అసలైన ర్యాంకర్లకు తగిన న్యాయం చేయాలని కోరారు. లక్షలు వెచ్చించి రెండు సంవత్సరాలు కష్టపడి తమ పిల్లలు పరీక్షలు రాశారని, కొంతమంది చేసిన ద్రోహానికి అందరినీ బలిచేయడం భావ్యం కాదని ర్యాంకర్ల తల్లిదండ్రులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతాదక్పథంతో ఎంసెట్–2 కౌన్సెలింగ్‌ను యథావిధంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో... ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగంటి అనిల్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ చౌక్‌లో ఎంసెట్–2 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులతో రాస్తారోకో నిర్వహించారు. అనిల్ మాట్లాడుతూ ఎంసెట్–2 లీకేజీ విషయంలో ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. లీకేజీకి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్య, వైద్య శాఖ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఎంసెట్–2ను రద్దు చేసి విద్యార్థులకు అన్యాయం చేస్తే ఆందోళన ఉధతం చేస్తామన్నారు. నగర కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్, గందె మాధవి, కాంగ్రెస్ నాయకులు అంజన్‌కుమార్, సరిళ్లప్రసాద్, బుచ్చిరెడ్డి, అజిత్‌రావు, జక్కని ఉమాపతి, జితేందర్, సుధీర్‌రెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు అఖిల్, అభిలాష్, శ్రీకాంత్, నాగరాజు, సాయి, విష్ణు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో... ఎంసెట్–2 లీకేజీ వ్యవహారం ముమ్మాటికీ ప్రభుత్వ అలసత్వం వల్లే జరిగిందని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, మహేందర్ మాట్లాడుతూ లీకేజికి కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, మిగతా విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పులి రాకేశ్, అంబ్రిష్, కె.వివేక్, శ్రీనివాస్, అనిల్, అర్జున్, రంజిత్, శ్రావణ్ పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో... ఎంసెట్–2 పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని, నైతిక బాధ్యత వహించి మంత్రులు లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తిరుపతి, బి.సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ప్రోత్సాహంతోనే లీకేజీ వ్యవహరం నడిచిందని ఆరోపించారు. నాయకులు రజనీకాంత్, రాజిరెడ్డి, రాము పాల్గొన్నారు. -
ఎంసెట్ కన్వీనర్, మంత్రుల ఫ్లెక్సీ దహనం
బెల్లంపల్లి : ఎంసెట్ పేపర్ లీకేజీ నిందితులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీ బొమ్మల దహనం చేశారు. బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా కల్వర్టు వద్ద ఎంసెట్ కన్వీనర్ రమణరావు, విద్యా, వైద్య శాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్షా్మరెడ్డిల ఫ్లెక్సీ బొమ్మలను కాల్చివేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎంసెట్ పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రధాన నిందితుడు రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి సహకరించిన విద్యార్థులను మినహాయించి మిగతా విద్యార్థులకు కౌన్సెలింగ్ చేసి సీట్లు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కష్ణదేవరాయులు, బాగ్ కన్వీనర్ ఎన్.మురళీశ్రావణ్, కళాశాల ఇన్చార్జి హిమవంత్, నాయకులు అఖిల్, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎంసెట్’లో ప్రభుత్వం విఫలం: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, లీకేజీ బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎంసెట్ నిర్వహణలో ప్రభుత్వం మొదట్నుంచీ బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. ఎంసెట్-2 లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
24 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్
కమాన్‌చౌరస్తా: ఎంసెట్ తుది దశ కౌన్సిలింగ్ ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎంసెట్ మహిళా పాలిటెక్నిక్ సహాయ కేంద్రం కోఆర్టినేటర్ బి.రాజ్‌గోపాల్ బుధవారం తెలిపారు. గతంలో హాజరుకానీ అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. 24, 25 తేదీల్లో వె»Œ ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈనెల 27న జరుగుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చలానా గడువు నేటితో ఆఖరు ఇంజినీరింగ్ మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులకు ఎస్బీహెచ్లో చలానా చెల్లించడానికి గురువారంతో గడువు ముగియనుందని మహిళా పాలిటెక్నిక్ సహాయ కేంద్రం కోఆర్టినేటర్ బి.రాజ్‌గోపాల్ తెలిపారు. కళాశాలలో చేరేందుకు ఈ నెల 22వరకు గడువు ఉందని పేర్కొన్నారు. నేడు బ్రాహ్మణ సంఘం సమావేశం కరీంనగర్‌సిటీ : అఖిల బ్రాహ్మణ సేవాసంఘం జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం గురువారం కరీంనగర్‌లోని శ్రీగణేశ శారద శంకరమఠంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా, నగర కన్వీనర్లు బ్రహ్మన్నగారి బ్రహ్మయ్య, పురాణం మహేశ్వరశర్మ తెలిపారు. మధ్యాహ్నం 1 గంటలకు జరిగే ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. -
నేడే ఎంసెట్
హాజరుకానున్న విద్యార్థులు 2.32 లక్షలు ఏపీ విద్యార్థులు 43,169 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 9,458 మంది ఉదయం ఇంజనీరింగ్, మధ్యాహ్నం మెడిసిన్ పరీక్ష నిమిషం ఆలస్యమైనా అనుమతించరు సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ఎంసెట్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం సకల ఏర్పాట్లు చేసినట్లు రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వివరించారు. ఈ పరీక్షలకు 2,32,045 మంది హాజరుకానున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి 1,39,677 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,368 దరఖాస్తు చేసుకున్నారు. మెడిసిన్ విభాగంలో పరీక్ష రాసే వారిలో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉన్నారు. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ రాసేందుకు మొత్తంగా 92,368 దరఖాస్తు చేసుకోగా అందులో బాలురు 33,309 మంది ఉంటే బాలికలు 59,329 మంది ఉన్నారు. దాదాపు రెట్టింపు సంఖ్యలో బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా దరఖాస్తులు తెలంగాణలో తొలి ఎంసెట్‌కు ఏపీ నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఆంధ్రా యూనివర్సిటీ పరిధి నుంచి 26,241 మంది, శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధి నుంచి 16,928 మంది కలిపి మొత్తంగా 43,169 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మెడిసిన్ కోసం 26,894 మంది, ఇంజనీరింగ్‌కు 16,275 మంది హాజరవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా 9,458 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించడం విద్యార్థులకు ఊరట కలిగించింది. పరీక్ష కేంద్రాలకు చేరుకోడానికి ఇబ్బందులు తప్పుతాయని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక విద్యార్థుల కోసం ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా విద్యార్థులు వినియోగించుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం మూడంచెల ఏర్పాట్లు చేసిందని, అయితే సమ్మె విరమణతో చాలా వరకు ఇబ్బందులు తప్పినట్లేనని పేర్కొన్నారు. ====================== ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు కేటగిరీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ మొత్తం బాలురు 88,206 33,039 1,21,245 బాలికలు 51,471 59,329 1,10,800 మొత్తం 1,39,677 92,368 2,32,045 -
మే 24న ఎంసెట్-ఏసీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్- అసోసియేటెడ్ కాలేజెస్ (ఏపీ ఎంసెట్-ఏసీ)ను మే 24న నిర్వహిస్తామని వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎంసెట్-ఏసీని ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్ల్లాడుతూ 2015-16 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ ఫీజులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేశామన్నారు. ఎంసెట్‌లో ప్రతిభ కనబరిచి.. మెరుగైన ర్యాంకు సాధించిన వారికి 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో కేటాయించామన్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు పొందే వారికి ఏడాదికి రూ.పది వేలు ఫీజుగా నిర్ణయించామని చెప్పారు. మిగతా 50 శాతం సీట్లలో 35 శాతం సీట్లు భర్తీ చేయడానికి ఈ ఏడాది నుంచి ఏపీ ఎంసెట్-ఏసీను -
''సుప్రీం' తీర్పు ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించండి'
హైదరాబాద్: సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలంగాణ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజి యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్క్షప్తి చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యామండళ్లలో ఎవరూ కౌన్సిలింగ్ నిర్వహించినా.. మాకు అభ్యంతరం లేదు అని వారు తెలిపారు. కౌన్సిలింగ్ ఆలస్యం కావడం వల్ల ఇప్పటికే చాలా నష్టపోయాం. త్వరగా కౌన్సిలింగ్ నిర్వహించాలి అని అధికారులకు తెలంగాణ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజి యాజమాన్యాలు తెలిపాయి. -
తెలంగాణ ఇంటర్ బోర్డుకు ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటుకు న్యాయశాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు ఏర్పాటుపై ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్.21ని విడుదల చేసింది. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుండగా... ఆ పరీక్షలను ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగానే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తాజా జీవో జారీతో వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే పరీక్షలు రాయనున్నారు. -
వేర్వేరుగా ఇంటర్ పరీక్షలు
ఇంటర్ బోర్డు సన్నాహాలు తెలంగాణ, ఏపీలకు వేరుగా ప్రశ్నపత్రాలు రెండు ప్రభుత్వాలకు బోర్డు ప్రతిపాదనలు వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేర్వేరుగా, వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నుంచి అనుమతి కోరుతూ ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపింది. సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేర్వేరుగా, వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నుంచి అనుమతి కోరుతూ ప్రతిపాదనలను పంపించింది. దీంతో ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీ పరిస్థితి గందరగోళంలో పడింది. మరోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల ఎత్తివేతకు ఏపీ సర్కార్ ఆలోచనలు చేస్తోంది.దీనికి సంబంధించిన ఎలాంటి ఆదేశాలు ఆ సర్కార్‌నుంచి ఇంతవరకు ఇంటర్ బోర్డుకు రాలేదు. వురోవైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత లేదు. దీంతో ఇంటర్‌బోర్డు యుథావిధిగా మెుదటి ఏడాది పరీక్షల నిర్వహణకు సిద్ధవువుతోంది. పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీలను కూడా ప్రకటించింది. ఒక రాష్ట్రం ఇస్తే.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో రెండు రాష్ట్రాల విద్యార్థులకు పదేళ్లపాటు ఉమ్మడిగా ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఎంసెట్ ర్యాంకును ఖరారు చేసేప్పుడు విద్యార్థి సాధించిన ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు. దానిని కలుపుకొని తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఒకే ప్రశ్నపత్రం ద్వారా ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తే వెయిటేజీలో ఇబ్బంది ఉండదు. విడిగా పరీక్షలు నిర్వహిస్తే మాత్రం వెయిటేజీ ఖరారులో సమస్యలు తప్పవని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఒక రాష్ట్రం సులభమైన ప్రశ్నలను ఇస్తే, మరో రాష్ట్రానికి చెందిన వారు ఎంసెట్ ర్యాంకుల్లో నష్టపోక తప్పదని అంటున్నారు. ప్రశ్నపత్రాలు ఒకేలా ఉండకపోవచ్చు! ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఒకే ఇంటర్మీడియెట్ బోర్డు సేవలు అందిస్తోంది. ఈ బోర్డు నేతృత్వంలోనే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు రూపొందించినా ఒక రాష్ట్రంలోని కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉండొచ్చు. కొన్ని సులభంగా ఉండొచ్చు. రెండూ సవూనంగా ఉన్నాయని చెప్పడానికి శాస్త్రీయ విధానమంటూ ఉండదు. ఇక కావాలని ఒక రాష్ట్రం ప్రశ్నపత్రాలను సులభంగా ఇస్తే గందరగోళం తలెత్తుతుంది. ప్రశ్న పత్రాలు కఠినంగా వచ్చిన రాష్ట్రంలోని విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది. ఈ ప్రభావం ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాల పై పడుతుందని నిపుణులు అంటున్నారు. ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు వచ్చిన వారికే ఓపెన్ కోటాలో అగ్రశ్రేణి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. మూల్యాంకనమప్పుడే అనుమానాలు.. మెున్నటి మార్చి/ఏప్రిల్‌లో జరిగిన ఇంటర్మీడియెట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం విషయంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఒక ప్రాంతం విద్యార్థుల జవాబు పత్రాలను మరో ప్రాంతంలో మూల్యాంకన ం చేయించవద్దని లెక్చరర్లే పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కావాలని తక్కువ మార్కులు వేస్తారనే అనుమానాలు రెండు వైపుల నుంచీ వ్యక్తం అయ్యాయి. దీంతో ఏప్రాంత విద్యార్థుల జవాబు పత్రాలను ఆప్రాంతంలోనే మూల్యాంకనం చేయించారు. మూల్యాంకనం విషయంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక ప్రశ్న పత్రాలు వేర్వేరుగా ఇస్తే వచ్చే మార్కులకు శాస్త్రీయత ఎలా ఉంటుందని సందేహాలు వ్యక్తం అవుతున్నారుు. వాటి ఆధారంగా 25 శాతం వెయిటేజీ ఎలా ఇస్తారు? అనే వాదనలు వస్తున్నారుు. ఈ పరిస్థితుల్లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీని తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలోనూ దానిని ఎత్తివేసే అంశంపై పరిశీలన జరుపుతున్నట్లు తెలిసింది. ఎంసెట్‌ను రద్దు చేస్తే..? ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ను రద్దు చేసే అంశంపై ఆలోచనలు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ దానికి ప్రత్యామ్నాయాలు ఏంటనే అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల విధానం అమలు చేయాల్సి ఉన్నందున రద్దు సాధ్యం కాకపోవచ్చనే భావన నెలకొంది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ప్రవేశాల నిర్వహణకు దోహదంగా ఉన్న ఎంసెట్‌కు ప్రత్యామ్నాయం అధికారులకు కనిపించడం లేదు. ఏపీ అధికారులైతే ఈ విషయంలో లోతుగా పరిశీలన జరుపుతున్నారు. ఎంసెట్‌ను రద్దు చేస్తే.. ఉమ్మడి ప్రవేశాలకోసం రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన ప్రశ్న పత్రాలతో పరీక్షలు నిర్వహించాలి. ఒకవేళ అదీ చేసినా, మూల్యాంకనంలో తేడాలు వస్తాయనే అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వెయిటేజీ రద్దు, ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజులు గడిస్తేనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రథమ సంవత్సర పరీక్షలు రద్దు ? జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ పరీక్ష విషయుంలో గందరగోళం లేకుండా ఉండేందుకు ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పరీక్షలను ఎత్తివేయూలని గతంలోనే ఆలోచనలు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కొంత సంసిద్ధతను వ్యక్తం చేసింది. తెలంగాణ విద్యా శాఖ వర్గాలు కూడా ఎత్తివేస్తే బాగానే ఉంటుందని భావించారుు. తద్వారా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తరహాలో కేవలం ద్వితీయ సంవత్సరానికే (12వ తరగతి) పరీక్షలు నిర్వహిస్తే సవుస్యలు రావని యోచించారుు. ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా పర్సంటైల్ నిర్ధారణలో రాష్ట్ర విద్యార్థుల విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఇతర రాష్ట్రాలు, సీబీఎస్ఈలో కేవలం 12వ తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకుని పర్సంటైల్ నిర్ధారిస్తుండగా, వునదగ్గర రెండేళ్ల మార్కులను తీసుకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో ఏటా ఆందోళనలు తప్పడం లేదు. అందుకే ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షను ఎత్తివేసి, 12వ తరగతికి సమానమైన ద్వితీయ సంవత్సర పరీక్షలనే నిర్వహించేంచాలన్న డివూండ్లు వచ్చారుు. కాని ఇంతవరకు ప్రభుత్వాలనుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. దీంతో ఈసారికి పరీక్షలు నిర్వహించేందుకే ఇంటర్‌బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. -
ఎంసెట్ అడ్మిషన్లపై మధ్యాహ్నం విచారణ
న్యూఢిల్లీ : ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్లపై సోమవారం మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నఈ వివాదంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవటంతో ఆ ప్రభుత్వం పాస్ ఓవర్ కోరింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తరపున ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కాగా ఎంసెట్ అడ్మిషన్లకు అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ వాదనను ఈ నెల 4న సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ.. ఆగస్టు 31 లోగా అడ్మిషన్లను పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంపై సోమవారం ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత సుప్రీం తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. -
ఎంసెట్‌పై నేడే సుప్రీంకోర్టు తుది తీర్పు
ఎంసెట్‌పై సుప్రీంకోర్టులో విచారణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశం వాదనలతో సిద్ధమైన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు మరింత గడువుకోరనున్న తెలంగాణ సర్కారు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ అడ్మిషన్లపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాలు రెండూ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎంసెట్ అడ్మిషన్లకు అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ వాదనను ఈ నెల 4న సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ.. ఆగస్టు 31 లోగా అడ్మిషన్లను పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంపై సోమవారం ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత సుప్రీం తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. తమ రాష్ట్రంలోని పరిస్థితులను వినిపించేందుకు తెలంగాణ విద్యా, న్యాయ శాఖల ఉన్నతాధికారులు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రంలో పాలనాపరమైన సమస్యలు, అధికారుల కొరత ఉన్నందునే గడువు కోరినట్లు మళ్లీ తెలియచేయనున్నారు. విద్యార్థుల ప్రవేశాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ముడిపడి ఉన్నందున వాటి చెల్లింపుకు తాము కొత్త పథకాన్ని (తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం-ఫాస్ట్) ప్రవేశపెడుతున్నామని, దానికి మార్గదర్శకాలు ఖరారు చేయాల్సి ఉందనే విషయాన్ని కోర్టు దృష్టికి తెలంగాణ సర్కారు తేనుంది. మార్గదర్శకాలు ఖరారయ్యాక తాము ప్రవేశాలను చేపట్టి పూర్తి చేస్తామని తెలపనుంది. తమకు మరింత సమయం కావాలని కోరనుంది. నాలుగో తేదీన కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని, హెల్ప్‌లైన్ కేంద్రాలను నిర్వహించే సిబ్బందితోనూ చర్చిస్తున్నామని చెప్పనుంది. మరోవైపు ప్రవేశాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కూడా తాము చేపట్టిన చర్యలను కోర్టుకు వివరించనున్నాయి. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేయడమే కాకుండా నాలుగు రోజులుగా ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టుఏపీ ఉన్నత విద్యా మండలి కోర్టుకు నివేదించనుంది. నిర్దేశిత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయనుంది. ఉన్నత విద్యావకాశాల్లో పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాలకు సమాన హక్కులుంటాయని విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని సుప్రీం దృష్టికి ఏపీ ప్రభుత్వం కూడా తేనుంది. ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య అడ్మిషన్లలో ఆంధ్రప్రదేశ్‌కు సమాన అవకాశాలు కల్పించారని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి ప్రకటించిన షెడ్యూలు మేరకు అడ్మిషన్లను పూర్తయ్యేలా చూడాలని విన్నవించనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఏపీ అభిప్రాయాన్ని కోరిన పక్షంలో రాష్ట్ర విభజన సమయంలో ఆస్తులు, అప్పులు ఇతర అనేక అంశాల్లో ఇరు రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ జరిపారో వాటిని కూడా అదే ప్రాతిపదికన చెల్లించడానికి తాము సిద్ధమని, ఇప్పటికే ఆ మేరకు ప్రకటించామని తెలియజేయనుంది. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన అఖిల భారతీయ సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కూడా తన వాదనలు వినిపించనుంది. -
విద్యార్ధుల తల్లితండ్రులు ఆందోళన చెందవద్దు: పాపిరెడ్డి
హైదరాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ పాపిరెడ్డి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజులుగా విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్ అంశంపై శుక్రవారం సమావేశం నిర్వహిస్తామని ఆయన మీడియా తెలిపారు. సీఎం కేసీఆర్, అధికారులతో చర్చించి కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని ఓ ప్రశ్నకు పాపిరెడ్డి సమాధానమిచ్చారు. ఎంసెట్, ఇంజినీరింగ్ అడ్మిషన్ల వ్యవహరంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంసెట్ కౌన్సెలింగ్ ను మేమే నిర్వహించుకుంటాం అని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే ఏపీ అధికారులతో చర్చిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి మరో ప్రశ్నకు జవాబిచ్చారు. -
ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ కళ్లు తెరవాలి: దేవినేని ఉమ
విజయవాడ: ఎంసెట్ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పు చూసైనా తెలంగాణ సర్కార్ కళ్లు తెరవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ అన్నారు. లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్‌తో ఆడుకోవడం తగదని తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 371 (డి) ప్రకారం పదేళ్లపాటు అమలులో ఉంటుందనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి దేవినేని ఉమ గుర్తు చేశారు. -
ఎంసెట్ కౌన్సిలింగ్ కు సహకరించాలి: రావెల
హైదరాబాద్: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సహకరించాలని ఏపీ మంత్రి రావెల కిశోర్, సమాచార సలహాదారుడు పరకాల విజ్క్షప్తి చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు నిర్ణయాన్ని పాటించాలని వారన్నారు. స్ధానికత 371-D ప్రకారం ఉండాలని సుప్రీం స్పష్టం చేసిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా రాజ్యాంగానికి లోబడి కౌన్సెలింగ్‌కు సహకరించాలన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకోవద్దని ఏపీ మంత్రి రావెల, సమాచార సలహాదారుడు పరకాల సూచించారు. -
వేణుగోపాల్ రెడ్డిపై దేశపతి ఆగ్రహం!
హైదరాబాద్: ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిపై తెలంగాణ వికాస సమితి దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేణుగోపాల్ రెడ్డి ఆంధ్రా మేధావుల సంఘం చైర్మన్లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం కొత్త కాదని దేశపతి అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేశపతి శ్రీనివాస్ తెలిపారు. -
'తెలుగు విద్యార్ధులు వలస పోతున్నారు'
హైదరాబాద్: ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో చాలామంది తెలుగు విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొ.ఎల్ వేణుగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలనుకూడా దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. అడ్మిషన్లకు ఈనెల 30న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆగస్టు 7 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆప్షన్ల ఎంపిక తర్వాత చేపడతామని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈలోగా అడ్మిషన్లకు సంబంధించి వివిధ అంశాలపై ఇరురాష్ట్రాలు దృష్టిపెట్టాలని ఉన్నత విద్యామండలి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొ.ఎల్ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. -
విద్యార్థుల సమస్యను రాజకీయం చేయొద్దు: గంటా
న్యూఢిల్లీ: 1956 స్థానికత వివాదం, ఎంసెట్ కౌన్సిలింగ్ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. దేశరాజధానిలో రాజ్‌నాథ్‌సింగ్, అనిల్ గోస్వామి, వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీలను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యను రాజకీయం చేయొద్దు అని అన్నారు. 1956 స్థానికతకు ప్రామాణికంగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 371 డి, ఆరుసూత్రాలు నాలుగేళ్లు ఎక్కడ నివసిస్తే అక్కడే స్థానికుడిగా గుర్తించాలనే నిబంధనలున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తామని హోంమంత్రి హామీఇచ్చారని మంత్రి గంటా అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. -
భారమైనా చట్టప్రకారం వెళ్లాల్సిందే
తెలంగాణ సర్కారుకు చంద్రబాబు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటు విషయంలో కష్టమైనా, నష్టమైనా, భారమై నా చట్టాన్ని అనుసరించే వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టంచేశారు. విభజనచట్టంలోనే కాకుండా ఇతర చట్టాల్లోనూ అన్నీ స్పష్టంగా ఉన్నాయని, వాటికి భిన్నంగా వెళ్లేందుకు వీల్లేదని చెప్పారు. క్యాంపుకార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ఎంసెట్ అడ్మిషన్లపై తెలంగాణ సీఎంకు ఒక లేఖ రాశాను. ఆలస్యమైతే ఏపీ, తెలంగాణ పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవకాశముంది. దీనివల్ల ఆయా సంస్థలు దెబ్బతింటాయని లేఖలో స్పష్టం చేశాను’’ అని వివరించారు. తాను వచ్చేవారం నుంచి వారానికి రెండురోజులు జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. -
29 నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జూలై మూడో వారంలో ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రవేశాల కమిటీల్లో రెండు రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. గురువారం ఉన్నత విద్యా మండలిలో చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎంసెట్, ఐసెట్, ఈసెట్‌కు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాంకేతిక విద్యా కమిషనర్లు శైలజా రామయ్యర్, అజయ్‌జైన్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి, ప్రవేశాల క్యాంపు ప్రధాన అధికారి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈనెల 22నుంచే ప్రారంభించాలని ముందుగా భావించినా.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు సంబంధించిన పలు ఉత్తర్వులు (జీఓలు) వెలువడాల్సి ఉంది. మరోవైపు ఏఐసీటీఈ కొత్త కాలేజీలకు అనుమతులు ఇస్తోంది. వాటికి యూనివర్సిటీల నుంచి అఫిలియేషన్ రావాల్సి ఉంది. మేనేజ్మెంట్స్ కన్సార్షియంగా ఏర్పడి నిర్వహించుకునే సొంత పరీక్షపైనా ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల నేపథ ్యంలో 29వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టాలని, ఈలోగా ప్రభుత్వాలను సంప్రదించి అన్నింటికి ఉత్తర్వులు జారీ చేసేలా చ ర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తరువాత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం (లేటరల్ ఎంట్రీ) నిర్వహించిన ఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూన్ 23 నుంచి; ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూలై మూడో వారంలో చేపట్టాలని నిర్ణయించారు. ప్రవేశాల కమిటీల్లో రెండు రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం కల్పించనున్నారు. ప్రతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రవేశాల కమిటీలోనూ రెండు రాష్ట్రాల అధికారుల్లో ఒకరు కన్వీనర్‌గా, మరొకరు కో కన్వీనర్‌గా ఉంటారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టేలా మండలి చైర్మన్‌కు అధికారాలు కల్పించారు. -
ఎంసెట్‌కు అంతా ఓకే
ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్,అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం ఎంసెట్-2014 నిర్వహిస్తున్నారు. ఎంసెట్ నిర్వహణకు ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని 10 ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,862 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇంజినీరింగ్ కోర్సుకు 8,745 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సులకు 2,117 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు 10 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్, మెడిసిన్‌కు 3 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు గంట ముందు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తరువాత నిముషం ఆలస్యమైనా ఎవరినీ అనుమతించేది లేదని ఎంసెట్ రీజనల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జెడ్.రమేష్‌బాబు తెలిపారు. = విద్యార్థుల సీటింగ్ ఎరేంజ్‌మెంట్‌కు సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ విద్యార్థులకు వేరు వేరు రంగుల్లో ప్రత్యేకంగా స్టిక్కర్లను సరఫరా చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు తెలుపు రంగు స్టిక్కర్లలో వారి హాల్‌టికెట్ నంబర్, నలుపు రంగు స్టిక్కర్లో అగ్రికల్చర్, మెడిసిన్ విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్లను సరఫరా చేశారు. వారికి కేటాయించిన స్థానాల్లో ఈ స్టిక్కర్లను అంటించారు. కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: అడ్డదారుల్లో ర్యాంకులు సాధించేందుకు ఎవరైనా హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడి పట్టుబడితే క్రిమినల్ కేసులు పెడతామని రమేష్‌బాబు హెచ్చరించారు. కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డవారు జైలుకు వెళ్లాల్సిందేనని, వారికి బెయిలు కూడా రాదని చెప్పారు. పీజీ మెడికల్ ఎంట్రన్స్‌లో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల విషయంలో రాష్ట్ర గవర్నర్ అమల్లోకి తెచ్చిన కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ఎంసెట్‌లో అక్రమాలకు పాల్పడిన వారు శిక్షార్హులవుతారన్నారు. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకురాకూడదు. విద్యార్థులు ఉపయోగించే పెన్నులు, ఇయర్ ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలను లోదుస్తుల్లో దాచి తెచ్చినా, పట్టుబడతారని ఆయన చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవీ పనిచేయకుండా పరీక్ష కేంద్రాల్లో జామర్లు కూడా ఏర్పాటు చేసినట్లు రమేష్‌బాబు తెలిపారు. కాపీయింగ్‌ను నిరోధించేందుకు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. రె వెన్యూ, విద్యాశాఖ, పోలీసులతో ఈ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ సమాధానాలను ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసేందుకు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను ఉపయోగించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ కులధ్రువీకరణ పత్రాలను గెజిటెడ్ అధికారులతో అటెస్ట్ చేయించి పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్లకు అందజేయాలి. -
నేడు ఎంసెట్.. రేపు ఐసెట్..
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎంసెట్ పరీక్ష గురువారం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు 3,545 మంది హాజరుకానున్నారు. ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక ఎన్ఫోర్స్మెంట్ అధికారిని నియమించారు. వీరితోపాటు రూట్ అధికారులను, ప్రత్యేక పరీశీలకులను నియమించినట్లు ఎంసెట్ రీజినల్ కో-ఆర్డినేటర్ నాగేందర్ తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి గంట ముందుగానే అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. హాల్లోకి అనుతించబోమని స్పష్టం చేశారు. అన్లైన్ పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని పరీక్ష కేంద్రంలో అందజేయాలన్నారు. మూడు పరీక్ష కేంద్రాలు.. ఆదిలాబాద్ పట్టణంలోని నలంద, విద్యార్థి, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ కోసం మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,805మంది పరీక్షకు హాజరు కానున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్, మెడిసిన్ కోసం ఇవే మూడు కేంద్రాలలో 1,740 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు క లుగకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు రీజినల్ కో-అర్డినేటర్ తెలిపారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సేవలు ఏర్పాటు చేశారు. రేపు ఐసెట్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశం కోసం శుక్రవారం ఐసెట్ పరీక్ష జరగనుంది. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్ష జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వ హించబడుతుందని ఐసెట్ పరీక్ష నిర్వహణ రీజినల్ కో ఆర్డి నేటర్ అశోక్ తెలిపారు. ఈ పరీక్షకు 349 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమై నా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబడదన్నారు. అభ్యర్థు లు బాల్ బ్లాక్ పాయింట్ పెన్, హల్‌టికెట్, పరీక్ష ప్యాడ్ వెం ట తెచ్చుకోవాలన్నారు. హాల్ టికెట్‌పై ఫొటో లేకపోతే రెం డు పాస్‌పోర్టు సైజు ఫొటోలను వెంట తెచ్చుకోవాని, సెల్ఫో న్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవన్నారు.పరీక్ష నిర్వహాణ కోసం ఒక సీఎస్, అబ్జర్వర్, యూనివర్సిటీ అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులకు సూచనలు ఎంసెట్ పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి కంటే ఒక గంట ముందుగా చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. పరీక్ష కేంద్రం లోపలికి సెల్ఫోన్లు, పేజర్లను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. నీలి, నలుపు రంగు బాల్ పాయింట్ పెన్ను, హాల్ టికెట్‌ను వెంట తెచ్చుకోవాలి. హల్ టికెట్‌పై ఫొటో లేకపోతే రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలను వెంట తెచ్చుకోవాలి. -
నేడే ఎంసెట్
మెదక్ టౌన్/ మెదక్ మున్సిపాలిటీ/ సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్ : ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష (ఎంసెట్-2014) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని మెదక్, సిద్దిపేట పట్టణాల్లోని 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్లకు కలిపి మొత్తం 5,107 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 3016 కాగా, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగంలో 2091 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష సమయం ఇంజనీరింగ్ విభాగం పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగం పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోని అనుమతి ఉంటుందని, అందువల్ల విద్యార్థులంతా నిర్దిష్ట సమయం కన్నా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తోపాటు బాల్‌పాయింట్ పెన్ మాత్రమే వెంట తెచ్చుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పూర్తిచేసిన ఆన్లైన్ ఫారంతోపాటు గెజిటెడ్ అధికారి సంతకం చేసిన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీ వెంట తెచ్చుకోవాలన్నారు. పకడ్బందీ ఏర్పాట్లు ఎంసెట్-2014 ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎంసెట్ మెదక్ కో ఆర్డినేటర్ సుబ్బారాయుడు, సిద్దిపేట కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా..పరీక్ష కేంద్రంలోని అనుమతించబోమన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. అభ్యర్థుల సంఖ్యకనుగుణంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటికనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. -
ఎంసెట్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఈ నెల 22న నగరంలోని స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఆ కళాశాల కరస్పాండెంట్ చావా ప్రతాప్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు నగరంలోని మయూరి సెంటర్, గాంధీచౌక్, రైల్వే స్టేషన్ , జడ్పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్, రోటరీ నగర్లో బస్సులు సిద్ధంగా ఉంటాయని వివరించారు. దీనిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. విజయ కళాశాల ఆధ్వర్యంలో.. కొణిజర్ల: ఈ నెల 22 న జరిగే ఎంసెట్ (ఇంజనీరింగ్, మెడికల్) ప్రవేశ పరీక్షలకు తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాయబోవు విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు విజయ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంసెట్ పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థుల కోసం పాలేరు, కల్లూరు, వైరా, వల్లభి, బోనకల్, తిరుమలాయపాలెం నుంచి ఉదయం 7:15 గంటలకు బస్సులు బయల్దేరుతాయని తెలిపారు. ఖమ్మం నగరం నుంచి పరీక్షకు హాజయరయ్యే విద్యార్థుల కోసం పెవెలియన్ గ్రౌండ్, రైల్వేస్టేషన్, ఇల్లెందు క్రాస్ రోడ్ల నుంచి ఉదయం 7:45 నిమిషాలకు బస్సులు బయల్దేరుతాయని తెలిపారు. విద్యార్థులను, వారి వెంట వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లక్ష్య కళాశాల ఆధ్వర్యంలో .. కొణిజర్ల..: తనికెళ్లలో గల లక్ష్య ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాసే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు కళాశాల చైర్మన్ గుర్రం తిరుమలరావు, సెక్రటరీ, కరస్పాడెంట్ కొప్పురావూరి శ్రీనివాస్,ట్రెజరర్ బూరుగడ్డ కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రఘురామ్‌లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం బస్టాండ్, రైల్వేస్టేషన్, గాంధీఛౌక్, ముస్తఫానగర్, బైపాస్‌రోడ్, ఖానాపురం , శ్రీనివాసనగర్, వైరాల నుంచి ప్రత్యేక బస్సులు ఉదయం 8:20 నిమిషాలకు బయలుదేరుతాయని తెలిపారు. ఆడమ్స్ కళాశాల ఆధ్వర్యంలో.. పాల్వంచ: ఖమ్మంలో ఈ నెల 22వ తేదీన జరిగే ఎంసెట్ 2014 పరీక్షకు హాజరయ్యే దూర ప్రాంత విద్యార్థిని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు స్థానిక ఆడమ్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ పరిటాల చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల నుంచి ఖమ్మంకు తరలివెళ్లే వారు ఉదయం 5 గంటలకు ఆయా ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు సెల్ నంబర్ 94400 05304,99661 96435లో సంప్రదించాలని కోరారు. అబ్దుల్ కలామ్ కళాశాల ఆధ్వర్యంలో.. కొత్తగూడెం రూరల్: ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కొత్తగూడెం మండల సుజాతనగర్ పంచాయతీ వేపలగడ్డ గ్రామంలోని అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ కార్తిక్, ప్రిన్సిపాల్ జనార్థన్ ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం, పాల్వంచ, టేకులపల్లి, కొత్తగూడెం, గౌతంపూర్ ఏరియా నుంచి బయలు దేరే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
అనంతగిరి, న్యూస్‌లైన్: వికారాబాద్‌లోని ఎస్ఏపీ కళాశాల, ధన్నారం సమీపంలోని అన్వర్‌ఉలూమ్ కళాశాల సెంటర్లలో గురువారం ఎంసెట్ నిర్వహించనున్నట్లు ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త, ఎస్ఏపీ కళాశాల ప్రిన్సిపాల్ పి.శివప్రకాశ్ తెలిపారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మెడికల్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5-30 గంటల దాకా జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ రెండు కేంద్రాల్లో కలిపి ఇంజినీరింగ్‌కు 1,012 మంది, మెడిసిన్‌కు 694మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ పరీక్షలు రెం డు సెంటర్లలోనూ ఉన్నాయన్నారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భం గా ఎంసెట్ రాసే విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ పెన్నులను వాడాలి హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి ఫొటో అతికించి అటెస్టెడ్ చేసిన అప్లికేషన్ ఫారం తప్పనిసరి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అటెస్టెడ్ చేసిన కుల ధ్రువీకరణపత్రం తీసుకురావాలి పరీక్ష హాల్ల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు పరీక్ష సమయానికి గంట ముందు కేంద్రానికి చేరుకోవాలి. గంట ముందు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. హాల్టికెట్లలోని నిబంధనలను చదివి విద్యార్థులు విధిగా పాటించాలి. -
ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ ఈనెల 22వ తేదీన జరగనుంది. ఈ మేరకు వరంగల్ రీజినల్ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రీజినల్ కోఆర్డినేటర్, కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనుండగా 14,323మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పరీక్ష కోసం 23 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 36 మంది పరిశీలకులను నియమించామని శ్రీనివాసులు తెలిపారు. అలాగే, మధ్యాహ్నం 2-30నుంచి సాయంత్రం 5.30గంటల వరకు మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష జరగనుండగా, 6,669మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని వివరించారు. ఈ పరీక్ష కోసం పది కేంద్రాలు ఏర్పాటు చేయగా, 18 మంది పరిశీలకులను నియమించామని తెలి పారు. కాగా, విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని శ్రీనివాసులు వివరించారు. -
ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు మెదక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎంసెట్ రీజి నల్ కోఆర్డినేటర్ సబ్బారాయుడు తెలి పారు. సోమవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఈనెల 22న జరిగే పరీక్షకు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వైపీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సిద్దార్థ్ మోడల్ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,836, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాల్లో 1,221 మంది పరీక్ష రాయనున్నారని పేర్కొన్నా రు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్, హాల్‌టికెట్ మాత్రమే తీసుకురావాలన్నారు. హాల్‌టికెట్ రానివారు గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించిన ఆన్లైన్ అప్లికేషన్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే కుల ధ్రువీకరణ పత్రం కూడా తీసుకురావాలను. కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురాకూడదన్నారు. -
సెట్ల కాలం
సాక్షి, నల్లగొండ, టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు ముగిశాయి. మరోవైపు ప్రభుత్వం వివిధ ‘సెట్’లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, డైట్‌సెట్, ఎడ్‌సెట్,లాసెట్, పీజీఈ సెట్, పీఈ సెట్, పాలిసెట్ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. దీంతో విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లపై దృష్టిసారించారు. ఎంట్రెన్స్లలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. వివిధ సెట్లను ఒకసారి పరిశీలిస్తే.. - ఉన్నత విద్యాభ్యాసానికి వరుస ‘ఎంట్రెన్స్’లు - సమాయత్తమవుతున్న విద్యార్థులు - కోచింగ్ సెంటర్లవైపు పరుగులు కోచింగ్ సెంటర్లు ప్రారంభం జిల్లాలో నల్లగొండ పట్టణంతో పాటు సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి పట్టణాల్లో కోచింగ్ సెంటర్లు వెలిశాయి. ఈ సెంటర్లు విద్యార్థులతో సందడిగా మారాయి. విద్యార్థులు సైతం మంచి ర్యాంకు సాధించాలన్న తలంపుతో కృషి చేస్తున్నారు. ఐసెట్ ఈ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏలలో అడ్మిషన్ పొందవచ్చు. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సు చేయడానికి అనేకమంది ఆసక్తి చూపుతున్నారు. రెగ్యులర్‌గా తరగతులకు వెళ్లి విద్యన భ్యసిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యావేత్తలంటున్నారు. ఈ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ నెల 23న పరీక్ష నిర్వహించనుంది. జూన్ 9న ఫలితాలు వెల్లడించనుంది. లాసెట్.. న్యాయవాద వృత్తిలో ఆసక్తి ఉన్నవారు రాసే ఈ ప్రవేశ పరీక్షను ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎల్ఎల్బీ మూడు లేదా ఐదేళ్ల కోర్సులో ప్రవేశం పొందవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటన మార్చి 4న వెలువడింది. జూన్ 8న పరీక్ష ఉంటుంది. జూన్ 19న ఫలితాలు వెల్లడిస్తారు. పీఈసెట్ ఇది వ్యాయామ విద్యకు సంబంధించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రెండు సంవత్సరాల వ్యవధి గల బీపీఈడీ/యూజీడీపీఈడీ కోర్సు చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటన మార్చి 7న వెలువడింది. ఈ నెల 5న పరీక్ష ఉంటుంది. ఫలితాలు వెల్లడించే తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది. పీజీఈ సెట్ ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అర్హత సాధించడం ద్వారా రెండేళ్ల వ్యవధి గల ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం.అగ్రికల్చరల్ కోర్సుల్లో చేరే అవకాశముంది. పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ(యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్) నిర్వహిస్తోంది. పరీక్ష ప్రకటనను ఫిబ్రవరి 28న వెల్లడించింది. ఈనెల 26న పరీక్ష ఉంటుంది. జూన్ 17న ఫలితాలు విడుదల చేస్తారు. ఎడ్‌సెట్ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడడానికి మొదటి స్టెప్‌గా ఉండే ఈ కోర్సు వ్యవధి ఏడాది. దీనిని ఈ సంవత్సరం ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మార్చి 5న ప్రకటన వచ్చింది. మే 30న పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 23న ఫలితాలు వెల్లడించనున్నారు. ఎంసెట్ ఈ ఎంట్రెన్స్ రాసి ర్యాంకు సాధించిన వారు ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ విభాగ కోర్సులు చేయడానికి అర్హులు. ఈ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదే శ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పక్షాన నిర్వహించనుంది. ఫిబ్రవరి 10న ప్రకటన వచ్చింది. మే 17న పరీక్ష నిర్వహిస్తారు. జూన్2న పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నారు. ఈసెట్ ఈ పరీక్ష రాయడానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, బీఎస్సీ(మ్యాథ్స్) చేసినవారు అర్హులు. పరీక్షను జేఎన్టీయూ(కాకినాడ) నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఫిబ్రవరి 4న వెలువడింది. ఈ నెల 10న పరీక్ష ఉంటుంది. ఇదే నెల 19న ఫలితాలు వెల్లడించనున్నారు. పాలీసెట్ ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ చేయవచ్చు. కోర్సు పూర్తి చేసి ఈసెట్ అర్హత సాధిస్తే ఇంజినీరింగ్ సెకండియర్‌లో ప్రవేశం పొందవచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ ఏపీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 6న ప్రకటన చేయగా, ఈనెల 21న పరీక్ష ఉంటుంది. ఫలితాలు జూన్ 6న వెల్లడించనున్నారు. -
హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించాలి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 22న జరగనున్న ఎంసెట్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, హైటెక్ కాపీయింగ్ జరగకుండా చూడాలని ఎంసెట్ రాష్ట్ర కోకన్వీనర్, జేఎన్టీయూ ప్రొఫెసర్ కూరపాటి ఈశ్వర్ప్రసాద్ సూచించారు. కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మ సీ సెమినార్ హాల్లో ఆదివారం జరిగిన చీఫ్ సూపరిం టెండెంట్లు, పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందే అభ్యర్థులను అనుమతించాలని, నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా రానివ్వొద్దని సూచించారు. ఇటీవల జరిగిన పలు పరీక్షల్లో హైటెక్ పద్ధతుల్లో కాపీ జరుగుతున్నట్లు తేలిందని. ఈ మేరకు ఎలాంటి అవకతవకలకు తావివ్వొద్దని ఆయన సూచించారు. విద్యార్థులను పరీక్ష మధ్యలో టాయిలెట్‌కు సైతం పంపించొద్దని, తప్పనిసరైతే సిబ్బందిని వెంట పంపించాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్ల నియామకంలో కూడా జాగ్రత్తలు పాటిం చాలని, పరీక్ష రాసే వారిలో బంధువులు ఉన్న పక్షంలో వారిని ఇన్విజిలేటర్లుగా నియమించొద్దని ఈశ్వర్ప్రసాద్ ఈ సందర్భంగా సూచించారు. వరంగల్ రీజియన్‌లో 33 కేంద్రాలు.. ఈనెల 22న జరగనున్న ఎంసెట్ కోసం వరంగల్ రీజి యన్‌లో 33 కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు ఈశ్వర్ప్రసాద్ వివరించారు. ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష 14,400 మంది రాయనుండగా.. 23 కేంద్రాలు, మెడిసిన్ పరీ క్షకు 6,800 మంది రాయనుండగా పది కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రత్యేక పరిశీల కులను నియమించగా, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది వారికి సహకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎస్‌లు, పరిశీలకుల సందేహాలను నివృత్తి చేశారు. జనగామలో.. జనగామ రూరల్ : జనగామ కేంద్రంగా ఎంసెట్ రెండోసారి నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంసెట్ రాష్ట్ర కోకన్వీనర్ ఈశ్వర్ప్రసాద్ సూచించారు. స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ శాఖల ఉద్యోగులకు ఎంసెట్‌పై సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఈశ్వర్ప్రసాద్ మాట్లాడుతూ జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏకశిల డిగ్రీ కళాశాల, ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఏ సందేహమున్నా కన్వీనర్ దృష్టికి తీసుకువెళ్లాలని.. ఎలాంటి పొరపాట్లు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అనంతరం రీజి నల్ కోఆర్డినేటర్ నర్సింహారెడ్డి పరీక్ష నిర్వహణపై పలు సూచనలు చేయగా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.రవిచందర్, ఎస్సై ఎం.కరుణాకర్, ట్రాన్స్‌కో ఏఈ ఎల్ల య్య, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
సాక్షి భవిత 1st Sept 2013