ఎంసెట్ లీకేజీపై కాంగ్రెస్ రాస్తారోకో
ఎంసెట్ లీకేజీపై కాంగ్రెస్ రాస్తారోకో
Published Thu, Aug 4 2016 7:09 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఎంసెట్ పరీక్షాపత్రం లీకేజీ అయ్యిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం వాటిల్లిందని, దీనికి కారకులైన విద్య, ఆరోగ్య శాఖ మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తహసీల్దార్ ఆండాళ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులి అంజనేయులుగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోల రమేష్, పంజాల శ్రీనివాస్‌గౌడ్, రేణికుంట బాపురాజు, నాగరాజు, దేవకిషన్, బొమ్మరవేని తిరుపతి, జట్టుపల్లి వీర య్య, స్వామి, అజయ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Advertisement