విద్యార్ధుల తల్లితండ్రులు ఆందోళన చెందవద్దు: పాపిరెడ్డి
Published Thu, Aug 7 2014 5:03 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
హైదరాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ పాపిరెడ్డి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజులుగా విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పాపిరెడ్డి తెలిపారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ అంశంపై శుక్రవారం సమావేశం నిర్వహిస్తామని ఆయన మీడియా తెలిపారు. సీఎం కేసీఆర్, అధికారులతో చర్చించి కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని ఓ ప్రశ్నకు పాపిరెడ్డి సమాధానమిచ్చారు. ఎంసెట్, ఇంజినీరింగ్ అడ్మిషన్ల వ్యవహరంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంసెట్ కౌన్సెలింగ్ ను మేమే నిర్వహించుకుంటాం అని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే ఏపీ అధికారులతో చర్చిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి మరో ప్రశ్నకు జవాబిచ్చారు.
Advertisement