![Cm Kcr Release Brs Manifesto For Telangana Assembly Polls - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/15/kcr-scheme.jpg.webp?itok=XzwhCJ9u)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదేళ్లలో శాంతియుత వాతావరణం నెలకొల్పామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు. ‘‘గత మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం. రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం. సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది. గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో
► తెల్లరేషన్‌కార్డుదార్లుకు త్వరలో కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా
► రైతు బీమా తరహాలోనే కేసీఆర్ బీమా
► కేసీఆర్ బీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి
►జూన్ నుంచి కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తాం
►తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి రేషన్‌కార్డుదారుడికి సన్న బియ్యం అందజేస్తాం
►ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఇచ్చే హామీలన్నింటిని అమలు పరుస్తాం
►తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్
►సామాజిక పెన్షన్లు రూ.5వేల వరుకూ పెంచుతాం
►దశవారిగా పెన్షన్లు పెంచుతాం
►పెన్షన్లు ఏడాదికి రూ.500 పెంచుతూ వెళతాం
►ఏపీ సీఎం జగన్ పాలనపై సీఎం కేసీఆర్ ప్రశంసలు
►ఏపీలో పెన్షన్ స్కీం చాలా విజయవంతంగా జరుగుతోంది
►వికలాంగుల పెన్షన్ రూ.6వేల వరుకూ పెంచుతాం
►వికలాంగుల పెన్షన్ మార్చి తర్వాత రూ.5 వేలు
►రైతు బంధు రూ.16 వేల వరుకూ పెంచుతాం
►అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి
►సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి
►అర్హులైన లబ్ధిదారులకు రూ.400కే గ్యాస్ సిలిండర్
►అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్
►ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంచుతాం
►జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షల వరుకూ పెంచుతాం
►కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరుతో హెల్త్ స్కీమ్
►జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీమ్
►హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు
►అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక గురుకులం
►మహిళా స్వశక్తి గ్రూపులకు దశలవారీగా పక్కా భవనాలు
►అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ
►ఓపీఎస్ డిమాండ్‌పై కమిటీ నియామకం.. కమిటీ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం
చదవండి: ఏపీ సీఎం జగన్ పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment