సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ నిర్ణయాలు కాపీ కొట్టడంలో కేసీఆర్ బిజీబిజీ అయ్యారు.. మా అభ్యర్థులను ప్రకటించే దాకా కేసీఆర్ బీఫారం లు ఇవ్వలేదు’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేం 55 మందిని ప్రకటిస్తే కేసీఆర్ 51 మందికే బీ ఫామ్‌లు ఇచ్చారు. కేసీఆర్ లాగా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. మేం ఇచ్చిన హామీలన్నీ ఆచరణకు సాధ్యమే’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సాధ్యమేనని కేసీఆర్ రాజముద్ర వేశారు. మా ఆరు గ్యారెంటీ స్కీమ్‌లకే కొంత డబ్బులు పెంచారు. మా గ్యారెంటీ స్కీమ్ చూసి కేసీఆర్ పెద్ద లోయలో పడిపోయారు. కేసీఆర్‌కి ఆలోచన చేసే శక్తి తగ్గిపోయింది. కేసీఆర్ ఇప్పుడు పరాన్నజీవి’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ హామీలను కేసీఆర్ తన మేనిఫెస్టోలో పెట్టారు. రాబోయే ఎన్నికల్లో పైసా ఇవ్వకుండా, మందు పోయకుండా ప్రజల్లోకి వెళ్దామా?. 17న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నువ్వు, నేను ప్రమాణం చేద్దామా? అంటూ రేవంత్ సవాల్ విసిరారు.
‘‘నవంబర్ నెల 1వ తేదీన పెన్షన్లు, జీతాలు వేస్తే కేసీఆర్‌ను ప్రజలు నమ్ముతారు. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్‌లో వేసినట్టు పాత అంశాలను మేనిఫెస్టోలో పెట్టారు. మేం పొగ పెడితే బొక్కలో ఉన్న ఎలుక బయటకి వచ్చింది. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్.. కేసీఆర్ ఎక్పైరీ డేట్ అయిపోయింది. కేసీఆర్ ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటే మంచిది’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
చదవండి: బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే..
Comments
Please login to add a commentAdd a comment