సాక్షి, సిద్ధిపేట: మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదంటూ సీఎం రేవంత్ అబద్దాలాడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఆదివారం ఆయన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో మాట్లాడుతూ.. ‘‘దేవుడిపై నమ్మకం ఉంటే కురుమూర్తి ఆలయానికి రేవంత్ రావాలి.. తడి బట్టలతో నువ్వు, నేను గుడిలోకి వెళ్దాం’’ అంటూ హరీష్‌రావు సవాల్ విసిరారు. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ హయాంలో పదేళ్ల పాటు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కొడంగల్‌లో ప్రశ్నించిన పాపానికి రైతులకు బేడీలు వేయించారు. ఆనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయలేదా? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.
‘‘11 విడతల్లో రూ.73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 13 లక్షల మందికి లక్ష రూపాయల చొప్పున తిప్పలు పడకుండ కళ్యాణ లక్ష్మి ఇచ్చినం. ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది.
..ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్‌ను తిట్టుడు తప్పా రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు. అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేసిండు. ఈ రోజేమో గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మళ్ళీ కొందరికే అని గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్‌ను కూడా మోసం చేసిండు’’ అంటూ హరీష్‌రావు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్
Comments
Please login to add a commentAdd a comment