![Cm Revanth Reddy Sensational Comments On Kcr - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/20/Cm-Revanth-Reddy-Sensational.jpg.webp?itok=WtmplLn5)
సాక్షి, హైదరాబాద్: లండన్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నిల్లోనూ రిపీట్ అవుతాయని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని రేవంత్ అన్నారు.
కాగా, రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి.. లండన్ పర్యటనలో అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ పాండిత్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. ప్రశ్న ఒకటి అయితే ఆయన చెప్పింది ఒకటి చూసి జనం నవ్వుకుంటున్నారు. కారు పార్టీని బొంద పెడతామంటూ రేవంత్ చౌక బారు మాటలు మాట్లాడారు. కేసీఆర్ సంగతి చూస్తానన్న రేవంత్ గురువు చంద్రబాబు ఏం చేయలేకపోయాడు. తెలంగాణ నుంచి పలాయనం చిత్తగించాడంటూ నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment