Telangana BJP Chief Kishan Reddy Fires On CM KCR Alleged Looted Public Money - Sakshi
Sakshi News home page

ప్రజాధనాన్ని కొల్లగొట్టారు.. కుటుంబ పాలనను తరిమికొట్టండి: కిషన్‌రెడ్డి

Aug 18 2023 3:45 PM | Updated on Aug 18 2023 4:11 PM

Telangana Bjp Chief Kishan Reddy Fires On Cm Kcr - Sakshi

 తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు.

సాక్షి, నల్గొండ: తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. నకిరేకల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తోందన్నారు.

గ్రామకంఠం భూములతో సహా, దళితులకు ఇచ్చిన భూములను బీఆర్‌ఎస్‌ నేతలు ఆక్రమించారన్నారు. లిక్కర్‌ షాపుల్ని ఆరు నెలల ముందే వేలం వేస్తున్నారు. కుటుంబ పాలనను తరిమికొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రైతు రుణమాఫీ, డబుల్‌ బెడ్రూం పంపిణీ బీజేపీ పోరాట ఫలితమే’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: కాంగ్రెస్‌ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ: రేవంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement