assembly polls
-
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’ ఒంటరి పోటీ
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) నిర్ణయించుకుంది. రాజధాని ముంబయి నగరంలోని మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత ప్రీతిశర్మ మీనన్ సోమవారం(ఆగస్టు5) మీడియాకు తెలిపారు.‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. అయితే జాతీయస్థాయిలో ఇండియా కూటమితో స్నేహం కొనసాగుతుంది. ముంబైలోని మొత్తం 36 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తాం. ఢిల్లీ, పంజాబ్ పాలన మోడల్‌ను చూపించే ఎన్నికలకు వెళతాం. మహారాష్ట్రలో ప్రస్తుతమున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమంపై అసలు పట్టింపే లేదు.మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం వాళ్లకు లేదు. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లు గుజరాత్ కోసమే పనిచేస్తున్నారు. మహారాష్ట్ర ప్రయోజనాలు వారికి అవసరం లేదు’అని మీనన్ విమర్శించారు. -
ప్రచారంలో వేగం పెంచిన తెలంగాణ బీజేపీ
-
మూడు రోజుల్లో పోలింగ్..బీజేపీ నేతను కాల్చి చంపిన మావోయిస్టులు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ నేతను కాల్చి చంపారు. నారాయణ్‌పూర్ జిల్లా కౌశల్నార్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. నారాయణ్‌పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రతన్ దూబే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఇంతలో మావోయిస్టులు వచ్చి ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో దూబే అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి ప్రత్యేక పోలీసుల టీమ్ వెళ్లి దర్యాప్తు చేస్తోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదేళ్లలో శాంతియుత వాతావరణం నెలకొల్పామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు. ‘‘గత మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం. రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం. సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది. గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ► తెల్లరేషన్కార్డుదార్లుకు త్వరలో కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా ► రైతు బీమా తరహాలోనే కేసీఆర్ బీమా ► కేసీఆర్ బీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి ►జూన్ నుంచి కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తాం ►తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి రేషన్‌కార్డుదారుడికి సన్న బియ్యం అందజేస్తాం ►ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఇచ్చే హామీలన్నింటిని అమలు పరుస్తాం ►తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ ►సామాజిక పెన్షన్లు రూ.5వేల వరుకూ పెంచుతాం ►దశవారిగా పెన్షన్లు పెంచుతాం ►పెన్షన్లు ఏడాదికి రూ.500 పెంచుతూ వెళతాం ►ఏపీ సీఎం జగన్ పాలనపై సీఎం కేసీఆర్ ప్రశంసలు ►ఏపీలో పెన్షన్ స్కీం చాలా విజయవంతంగా జరుగుతోంది ►వికలాంగుల పెన్షన్ రూ.6వేల వరుకూ పెంచుతాం ►వికలాంగుల పెన్షన్ మార్చి తర్వాత రూ.5 వేలు ►రైతు బంధు రూ.16 వేల వరుకూ పెంచుతాం ►అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ►సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి ►అర్హులైన లబ్ధిదారులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంచుతాం ►జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షల వరుకూ పెంచుతాం ►కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరుతో హెల్త్ స్కీమ్ ►జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీమ్ ►హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ►అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక గురుకులం ►మహిళా స్వశక్తి గ్రూపులకు దశలవారీగా పక్కా భవనాలు ►అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ ►ఓపీఎస్ డిమాండ్‌పై కమిటీ నియామకం.. కమిటీ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం చదవండి: ఏపీ సీఎం జగన్ పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసలు -
యాద్గిర్... బరాబర్.. కల్యాణ కర్ణాటకలోని గ్రామీణ జిల్లాలో రసవత్తర పోరు
కల్యాణ కర్ణాటకలోని గ్రామీణ జిల్లా అయిన యాద్గిర్లో ఎన్నికల వేడి హోరెత్తిస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలయిన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు ఇక్కడ హోరాహోరీ తలపడుతున్నాయి. బీమా నదీ పరివాహక ప్రాంతమైన ఈ జిల్లాలోని ఓ చిన్న భాగానికి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తుండడంతో ఇక్కడ వ్యవసాయాధారిత ప్రజలు ఎక్కువగా ఉంటారు. గుర్మిట్కల్లో కొంత మేర పరిశ్రమలు ఉండగా, షాహ్పూర్లో తెలుగు ప్రజలు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అయితే, రాజకీయంగా చైతన్యవంతమైన ఇక్కడి ప్రజలు ఏకపక్షంగా లేరని, విలక్షణ తీర్పు ఇవ్వనున్నారని ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. యాద్గిర్ జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి నియోజకవర్గాల వారీగా.. షాహ్పూర్ తెలుగు ప్రజల ప్రభావం కన్పించే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంత మొగ్గు కనిపిస్తోంది. ఇక్కడ చాలా కాలంగా శరణబసప్ప, గురుపాటిల్ శిర్వాల్ కుటుంబాల మధ్యనే రాజకీయంగా వైరం ఉంది. ఈసారి కూడా కూడా ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఈ కుటుంబాలకు చెందిన వారే పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి గతంలో జేడీఎస్ నుంచి పోటీ చేసిన అమీన్‌రెడ్డి బరిలో ఉన్నారు. కుటుంబ రాజకీయ వైరంలో ఈయన ఈసారి కూడా వెనుకంజలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. సుర్పూర్ ఇక్కడ ఓసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. పోటీ మాత్రం 2008 నుంచి తలపడుతోన్న నరసింహనాయక్ (రాజగౌడ), రాజా వెంకటప్పనాయక్ల మధ్యనే కనిపిస్తోంది. నరసింహ నాయక్ బీజేపీ సిట్టింగ్కాగా, వెంకటప్పనాయక్ కాంగ్రెస్ పక్షాన బరిలో ఉన్నారు. ఇక్కడ జేడీఎస్ నుంచి బరిలో ఉన్న కొత్త అభ్యర్థి శ్రవణ్‌కుమార్ నాయక్ ప్రభావం తక్కువగానే ఉంది. కురబ యాదవ సామాజిక వర్గం ఇక్కడ ప్రభావిత శక్తి కాగా, బీజేపీ వైపు కొంత సానుకూలత కనిపిస్తోంది. గుర్మిట్కల్ ఇక్కడ కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పోరు నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి. ఈసారి ఎన్నికల్లో జేడీఎస్ పక్షాన గత ఎన్నికల్లో గెలిచిన నాగనగౌడ కుమారుడు శరణ గౌడకు టికెట్ లభించింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాబూరావు చించన్సూర్, బీజేపీ నుంచి కొత్త అభ్యర్థి లలితా అనపూర్ తలపడుతున్నారు. ఈ ఇద్దరి సామాజిక వర్గం ఒకటే. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండే కోలీ (ముదిరాజ్) వర్గానికి చెందిన ఇద్దరిలో కొంత మొగ్గు బాబూరావు వైపే కనిపిస్తున్నా లలిత చీల్చే ఓట్లను బట్టి గెలుపోటములు నిర్ధారణ కానున్నాయి. ఇక్కడి ప్రజలు జేడీఎస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. యాద్గిర్ లింగాయత్ సామాజికవర్గ ప్రభావం కనిపించే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌నుంచి మాజీ ఎమ్మెల్సీ చెన్నారెడ్డి పాటిల్ బరిలో ఉండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన ఎ.బి.మలక్రెడ్డి ఈసారి జేడీఎస్ పక్షాన పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి వెంకట్‌రెడ్డి ముద్నాల్ బరిలో ఉన్నారు. జేడీఎస్ ఇక్కడ బలహీనంగా ఉన్నప్పటికీ మలక్రెడ్డి రాకతో పోటీలోకి వచ్చింది. మొత్తంగా బీజేపీ కొంత ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. చదవండి: మీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి -
Karnataka Polls: కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. మాజీ సీఎం రాజీనామా..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ రాలేదనే అసంతృప్తితో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరుతున్నారు. తాజాగా కమలం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కూడా పార్టీని వీడారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్ శెట్టర్ హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఈసారి కూడా టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం యువ నాయకులకు అవకాశం ఇవ్వాలని ఈయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలో బీజేపీ 20-25 సీట్లు కోల్పోతుందని ఈయన ఇప్పటికే హెచ్చరించారు. అయినా అధిష్ఠానం మాత్రం టికెట్ కేటాయించలేదు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన తనను చివరకు పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని జగదీశ్ చెప్పుకొచ్చారు. లింగాయత్ వర్గానికి చెందిన ఈయన ఎన్నికల ముందు పార్టీని వీడటం బీజేపీకి కచ్చితంగా నష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. జగదీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. టికెట్ ఖరారు చేసుకున్నాకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
కాంగ్రెస్‌కే జై కొడుతున్న కన్నడిగులు.. సీఎంగా మాత్రం ఆయనే కావాలట..!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో మే 10 న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఈసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకుంటున్నారు. స్థానిక పార్టీ జేడీఎస్ కూడా సత్తా చాటి కింగ్ మేకర్‌గా అవతరిస్తుందనే అంచనాలున్నాయి. కానీ సీఓటర్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో మాత్రం ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారం చేజిక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. అధికార బీజేపీ ప్రభుత్వంపై 57 శాతం మంది తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పేర్కొంది. సీఎం బసవరాజ్ బొమ్మై పనితీరు పేలవంగా ఉందని సర్వేలో పాల్గొన్న 47శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 26.8 శాతం మంది ఆయన పాలన బాగుందన్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌కు 115-127 సీట్లు, బీజేపీకి 68-80, జేడీఎస్‌కు 23-35 సీట్లు వస్తాయని సీఓటర్ సర్వే తెలిపింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం (29.1 శాతం) మౌలిక సదుపాయాల కల్పన(21.5శాతం)పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎంగా ఆయనే.. ఈ ఒపీనియన్ పోల్‌లో కర్ణాటక తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందనే విషయంపైనా ఓటింగ్ నిర్వహించారు. 39.1శాతం మంది కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకే జై కొట్టారు. బసవరాజ్ బొమ్మై కావాలని 31.1 శాతం మంది తెలిపారు. హెచ్డీ కుమారస్వామికి 21.4 శాతం మంది ఓటేశారు. ఇక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు కేవలం 3.2 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ చాలా కాలంగా బలమైన పార్టీగా ఉంటోంది. 2008 ఎన్నికల్లో ఓడిపోయి 80 సీట్లే గెలిచిన ఆ పార్టీ.. 2013లో తిరిగి పుంజుకుని 122 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. 2018లో మళ్లీ 80 సీట్లే గెల్చుకుంది. అయినా జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఏడాదికే ఈ సర్కార్ కూలిపోవడంతో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. మరోవైపు మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించారు. తనకు 80 ఏళ్లు దగ్గరపడుతున్నందున ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం మాత్రం తనవంతు కృషి చేస్తానన్నారు. కాగా.. ఈసారి కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ఇటీవలే కన్నడ వార్త పత్రిక సర్వేలో తేలిందని వార్తలొచ్చాయి. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అది ఫేక్ అని తేలింది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం బసవరాజ్‌బొమ్మైతో పాటు ఇతర బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఫేక్ సర్వేపై మండిపడ్డారు. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
తెలంగాణలో ముందస్తు మేఘాలు!
సాక్షి, హైదరాబాద్: శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభం, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, వేల సంఖ్యలో కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ‘ఎమ్మెల్యేలకు ఎర’, రాష్ట్ర మంత్రులు లక్ష్యంగా ఐటీ దాడులు లాంటి పరిణామాలూ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వైపు మొగ్గుకు కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెలుగు చూడటంతో బీజేపీ బాగా ఇరకాటంలో పడిందనే భావన టీఆర్ఎస్ అధిష్టానంలో ఉందని ఆ వర్గాలంటున్నాయి. రాష్ట్ర మంత్రులపై కక్షపూరితంగా జరుగుతున్న ఐటీ దాడులు ఉపకరిస్తాయన్న ఉద్దేశం కూడా ఉండొచ్చ ని చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టనుండటాన్ని ప్రస్తావిస్తున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికల అంచనాతోనే బీజేపీ, కాంగ్రెస్ వంటి విపక్ష పారీ్టలు కార్యాచరణకు సిద్ధమవుతున్నాయనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాపరమైన అంశాల్లో వేగం పెంచారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల మరమ్మతు, ఆ«ధునికీకరణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో వచ్చే ఏడాది మార్చిలోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడం, సొంత జాగాలో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంపైనా ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయడంతో పాటు యూనిట్ల మంజూరును కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అభివృద్ధి పనులన్నీ మార్చిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. సెక్రటేరియట్‌కు సంక్రాంతి ముహూర్తం? సచివాలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ సంక్రాంతిని ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలిసింది. సెక్రటేరియట్‌కు ఎదురుగా నిర్మాణంలో ఉన్న అమరుల స్మారకాన్ని పూర్తి చేసి అదేరోజు ప్రారంభించేలా చూడాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ఎన్టీఆర్ ఘాట్ పక్కనే వచ్చే నెల్లోనే ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కొలువుల భర్తీకి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. తాజాగా శుక్రవారం ఏకంగా 9,168 గ్రూపు–4 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. టీఎస్పీఎస్సీతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వరుసబెట్టి కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లా కలెక్టరేట్ల భవనాలను వరుసగా ప్రారంభించేలా అధికారులు సీఎం పర్యటన షెడ్యూలు సిద్ధం చేస్తున్నారు. సీఎం జిల్లాల పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభలు కూడా జరుగుతాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌పై కేంద్రం విధిస్తున్న ఆంక్షలు, తదితరాలపై చర్చించనున్నారు. కేంద్రం కక్షపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై రెండు రోజులుగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఈ కసరత్తులో కీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాలపై స్పెషల్ నజర్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల బాట పట్టారు. ఓ వైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే సొంత నియోజకవర్గాన్ని, క్షేత్ర స్థాయిలో సంస్థాగత లోపాలను చక్కదిద్దుకోవడంపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మండలాల వారీగా పార్టీ కేడర్‌తో ఆతీ్మయ సమ్మేళనాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిల కోసం జాబితాల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే..? వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎదురయ్యే అనుకూల, వ్యతిరేక పరిణామాలతో పాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే సంపూర్ణంగా కసరత్తు చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పేరు భారత్ రాష్ట్ర సమితిగా మారే అంశంపై డిసెంబర్ మూడో వారంలో ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: Hyderabad: జనవరిలో నూతన భవనంలోకి యూఎస్ కాన్సులేట్ -
మోదీ ఇలాకాలో ఆ సీట్లు బీజేపీకి అందని ద్రాక్షే.. 75 ఏళ్లలో ఒక్కసారీ గెలవలే..!
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేశాయి. మరోవైపు చూసుకుంటే గడిచిన 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్‌పై బీజేపీకి అంతటి పట్టు ఉన్నప్పటికీ.. 7 అసెంబ్లీ స్థానాలు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయాయంటే నమ్మశక్యం కాదు కదా? అయితే, అది నిజమే. స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి చూసుకుంటే ఆ సీట్లలో కాషాయ పార్టీ పాగా వేయలేకపోతోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 182 స్థానాలు వస్తాయని బీజేపీ చెబుతోంది. అయితే.. ఆ 7 స్థానాల్లో మాత్రం ఎందుకు గెలవలేకపోతోంది? బోర్సాద్, ఝగ్డియా, అంకలావ్, దానిలిమ్దా, మహుధా, గర్బడా, వ్యారా అసెంబ్లీ స్థానాలను ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది బీజేపీ. మహారాష్ట్ర నుంచి గుజరాత్ 1960లో వేరుపడి రాష్ట్రంగా ఏర్పడింది. అక్కడ 1962లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఆయా స్థానాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలు, స్వతంత్రులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ► బోర్సాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో రెండు ఉప ఎన్నికలు ఉండగా.. తొలిసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత ప్రతిసారీ కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తోంది. ► ఝగ్డియా సీటులో 1962 నుంచి 2017 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్, జనతా దళ్, జనతా దళ్ యునైటెడ్, బీటీపీ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. కానీ, బీజేపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఇక్కడ 1990 నుంచి చోటు వాసవా గెలుస్తూ వస్తున్నారు. ► వ్యారా నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఓసారి ఉప ఎన్నికలు జరిగాయి. అన్నిసార్లూ కాంగ్రెస్ విజయం సాధించింది. ► మరో ఆసక్తికర అంశం ఏంటంటే అహ్మదాబాద్‌లోని దనిలిమ్దా నియోజకవర్గం సహా.. అన్ని స్థానాలు ట్రైబల్ ప్రాంతాలకు సంబంధించినవే. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రైబల్ ప్రాంతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును బీజేపీ చీల్చలేకపోతోంది. ► 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99, కాంగ్రెస్ 77, స్వతంత్రులు 3, బీటీపీ 2, ఎన్సీపీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇదీ చదవండి: కేసీఆర్ సర్కార్ 15 రోజుల్లో కూలిపోతుంది.. రాజగోపాల్‌రెడ్డి -
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్లో కీలక పరిణామం.. ఆ మంత్రులకు షాక్!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఆఖర్లో జరగనున్నాయి. ఈ తరుణంలో బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇద్దరు కీలక కేబినెట్ మంత్రులకు కేటాయించిన శాఖలను తగ్గించారు. ఇద్దరు రాష్ట్ర మంత్రుల శాఖలను తగ్గిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి రాజేంద్ర త్రివేది పోర్టిఫోలియోల నుంచి కీలక శాఖ అయిన రెవెన్యూను, పూర్ణేశ్ మోదీ శాఖల్లోని కీలకమైన రోడ్డు, భవనాల శాఖను ముఖ్యమంత్రి తొలగించారు. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఇలా మంత్రివర్గంలో మార్పులు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజేంద్ర త్రివేది, పుర్ణేశ్ మోదీల నుంచి తొలగించిన రెండు శాఖలను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పర్యవేక్షించనున్నారు. రాజేంద్ర త్రివేది వద్ద న్యాయ, విపత్తు నిర్వహణ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు ఉన్నాయి. మరోవైపు.. పూర్ణేశ్ మోదీ వద్ద రవాణా, పౌర విమానయాన, పర్యటకం, దేవాదాయ అభివృద్ధి శాఖలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భూపేంద్ర పటేల్ ప్రభుత్వంలోని 10 కేబినెట్ ర్యాంక్ మంత్రుల్లో త్రివేది, మోదీలు ఉన్నారు. అయితే, రోడ్లు, భవనాల విభాగం, రెవెన్యూ విభాగల పనితీరు సరిగా లేదని సీఎంకు ప్రభుత్వ వర్గాలు సూచించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హర్ష రమేశ్‌కుమార్ సంఘ్వీకి రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా, జగదీశ్ ఐశ్వర్ పంచల్‌కు రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు సీఎం భూపేంద్ర పటేల్. గత ఏడాది సెప్టెంబర్‌లో విజయ్ రూపానీ స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు భూపేంద్ర పటేల్. ఇప్పుడు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన తాజా పరిణామం వెనుకున్న కారణం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. Gujarat | In state cabinet rejig before Assembly elections, Revenue ministry taken from Rajendra Trivedi while Road and Building Ministry take from Purnesh Modi, both the ministries will now be handled by CM Bhupendra Patel pic.twitter.com/2VavVSJQBI — ANI (@ANI) August 20, 2022 ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్ బ్యాన్పై మనీశ్ సిసోడియా విమర్శలు -
టార్గెట్ అసెంబ్లీ.. శాసనసభకు పోటీ చేయడానికే మొగ్గుచూపుతున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కీలక కాంగ్రెస్ నేతలంతా ఈసారి శాసనసభకు ఎన్నికయ్యేందుకే ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎంపీలుగా పోటీ చేసి న వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి పోటీ చేయా లనే ఆలోచనలోనే ఉన్నారు. ఈ మేరకు తమ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు పరిస్థితులను చక్కబెట్టుకుంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ, భువనగిరి, మల్కాజ్గిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలతో పాటు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఫలితాలు తమకు సానుకూలంగా వస్తాయని, రాష్ట్రం వచ్చిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరిస్తారనే ఆలోచనతోనే వీరంతా అసెంబ్లీ వైపు మొగ్గుచూపుతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మధిరలో ‘పట్టు వదలని విక్రమార్కుడు’ నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా, రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా తెచ్చుకునే ప్రయత్నాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముందు వరుసలో ఉన్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే ఆయన మూడు విడతలుగా నియోజకవర్గంలో పర్యటించారు. ‘పీపుల్స్ మార్చ్’పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాల్లో 400 కిలోమీటర్ల మేర 86 గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఎర్రుపాలెం మండలం మినహా నియోజకవర్గంలో ని మిగిలిన మండలాల్లో ఆయన గ్రామగ్రామానికి వెళ్లి ఓ వైపు ప్రజాసమస్యలను తెలుసుకోవడం, తా ను చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు పార్టీ కేడర్‌ను ఉత్తేజితులను చేసే ప్రయత్నం చేశారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ స్పీడు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ బాట పడుతున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించడమే ధ్యేయంగా ఈ నెల 21 నుంచి ఆయన యాత్ర చేపట్టారు. టీపీసీసీ పిలుపులో భాగంగా పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో గత ఐదురోజుల్లోనే 40 గ్రామాల్లో పర్యటించారు. ఎండను లెక్క చేయకుండా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైతు రచ్చబండలు, సభల్లో పాల్గొంటున్నారు. వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజలకు వివరించడంతో పాటు నియోజకవర్గంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ ప్రజల సమస్యలను వారికి వివరిస్తున్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ కేడర్‌తో కూడా సమావేశమవుతున్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలతో వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ సమాచారం పంపించడం, కార్యక్రమాలు విజయవంతం చేసేలా పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేయడం కోసం ఈ గ్రూపులను ఉపయోగించుకో వాలనేది ఉత్తమ్ ఆలోచనగా చెబుతున్నారు. శివారు నియోజకవర్గంపై యాష్కీ కన్ను ఇక గతంలో నిజామాబాద్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఈసారి హైదరాబాద్ శివార్లలోని ఓ అసెం బ్లీ నియోజకవర్గంపై కన్నేసినట్టు చర్చ జరుగుతోంది. తన సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానంపై ఆయన గురిపెట్టారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి ఎప్పటిలాగే జగిత్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరితో పాటు ఇప్పటికే అసెంబ్లీ ఇన్చార్జులుగా ఉన్నవారు, గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన నాయకులు పలువురు కూడా వరంగల్ డిక్లరేషన్ పేరుతో గ్రామాల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు పార్టీలో, ఇటు నియోజకవర్గంలో పట్టు సాధించే లక్ష్యంతో తమ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. నల్లగొండ నుంచి ఖాయమన్న కోమటిరెడ్డి... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషయానికొస్తే.. తాను వచ్చే ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తాన ని ఆయన ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే త్వరలో నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచనలో కోమటిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. -
యూపీలో 40% టికెట్లు మహిళలకే
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఆ ఎన్నికల్లో 40% టికెట్లను మహిళలకు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం ప్రకటించారు. దీంతో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పక్షాన 161 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉంటారు. ప్రియాంక మంగళవారం లక్నోలో మీడియాతో మాట్లాడారు. మహిళలు రాజకీయాల్లో చేరాలని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపునిచ్చారు. బరిలో నిలవాలనుకునే వారు నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహిళలకు ఉత్తరప్రదేశ్‌లో హక్కు లభిస్తే, ఇదే హక్కును కేంద్రంలో కూడా పొందుతారని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు కేటాయించే సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ మహిళా అభ్యర్థులకు పూర్తి సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గళం వినిపించలేని వారి తరఫున తాను పోరాడుతున్నానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 40% మహిళా అభ్యర్థులను బరిలో నిలబెట్టడం ద్వారా కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా మహిళల మద్దతును కాంగ్రెస్ పొందగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు, ఓట్ల శాతం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చదవండి: Punjab: కెప్టెన్ సొంత పార్టీ! -
డీఎంకే ఎన్నికల ఖర్చు రూ. 114 కోట్లు
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే రూ. 114 కోట్లు, అన్నాడీఎంకే రూ. 57 కోట్లను ఖర్చు పెట్టింది. ఇందుకు తగ్గ లెక్కలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేరాయి. రాజకీయ పార్టీలు విరాళాల్ని చెక్కులు, నగదు, డాక్యుమెంట్ల రూపంలో పొందేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇందుకు తగ్గ లెక్కల్ని ఎన్నికల అనంతరం సీఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో పుదుచ్చేరితో పాటుగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం, పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టాయి. ఆయా పార్టీలు ఎన్నికల్లో పెట్టిన ఖర్చులకు తగ్గ వివరాల్ని సీఈసీకి సమర్పించి ఉన్నాయి. ఆ వివరాలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. డీఎంకే ఖర్చు ఇలా.. తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరి ఎన్నికల్లో డీఎంకే రూ. 114 కోట్లు ఖర్చు పెట్టింది. ఎన్నికల నగారా అనంతరం ఆ పార్టీకి రూ. 134 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. తమిళనాడులో పోటీ చేసిన డీఎంకే అభ్యర్థులు 188 మందిలో ఒకొక్కరికి రూ. 25 లక్షలు ఎన్నికల ఖర్చుగా అందజేశారు. పుదుచ్చేరిలో పోటీ చేసిన 13 మందికి రూ. 15 లక్షలు చొప్పున పంపిణీ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో తదితర వాటికి రూ. 5. 72 కోట్లు, ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పనిచేసిన ఐప్యాక్ సంస్థకు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు. టీవీ, సామాజిక మాధ్యమాలు తదితర ప్రచారాలకు రూ. 39 కోట్లు, పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు తదితర వాటికి రూ. 12 కోట్లు ఖర్చు చూపించారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రచారం కోసం విమాన ప్రయాణ ఖర్చుగా రూ. 2 కోట్ల 25 లక్షలుగా వెల్లడించారు. అన్నాడీఎంకే లెక్కలు.. అసెంబ్లీ ఎన్నికల నగారా మోగే సమయానికి అన్నాడీఎంకే ఖాతాలో రూ. 266 కోట్ల 14 లక్షలు ఉన్నట్టు, నగారా తదుపరి రూ. 14 కోట్ల 46 లక్షలు విరాళం రూపంలో వచ్చినట్టు లెక్కలు చూపించారు. ప్రకటనలు, తదితర వాటికి రూ. 56 కోట్లు ఖర్చు పెట్టినట్టు వివరించారు. పార్టీ సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పళనిస్వామి హెలికాఫ్టర్ ప్రచారానికి రూ. 13 లక్షలు ఖర్చు పెట్టినట్టు ప్రకటించారు. -
ఎన్నికల్లో పోటీకి శశికళ వ్యూహరచన
సాక్షి, చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చిన్నమ్మ శశికళ వ్యూహ రచన చేశారు. న్యాయనిపుణులతో చర్చించి కేవియేట్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆమె ప్రతినిధులు నిమగ్నమయ్యారు. అక్రమాస్తుల కేసులో జైలు నుంచి జనవరిలో చిన్నమ్మ శశికళ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సోమవారం తన న్యాయవాది రాజా చెందూర్ పాండియన్‌కు చిన్నమ్మ రాసిన లేఖ వెలుగు చూసింది. ఇందులో ఆమె ఇచ్చిన సూచన ఆధారంగా సుప్రీంకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలుకు కసరత్తులు సాగుతుండడం గమనార్హం. నాలుగేళ్లు జైలు శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆమెకు లేదు. దీంతో తనకు విధించిని శిక్షకు వ్యతిరేకంగా కేవియేట్ పిటిషన్ దాఖలుతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన వ్యూహాలకు చిన్నమ్మ వ్యూహం పన్నుతున్నట్టు తెలిసింది. ('10 కోట్ల చెల్లింపునకు సిద్ధంగా ఉండండి') అక్రమాస్తుల కేసు విచారణ ఒకే కోణంలో జరిగినట్టు, అన్ని కోణాల్లో పరిశీలించి విచారణ జరగాలని, అలాగే, శిక్ష విషయంగా పునస్సమీక్షించేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు వ్యూహరచన జరుగుతున్నట్టు సమాచారం. చిన్నమ్మ ప్రతినిధి దినకరన్, న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ ఢిల్లీలోని న్యాయవాదులు, న్యాయప్రతినిధులతో సంప్రదింపులకు సిద్ధమవుతున్నారు. చిన్నమ్మ విడుదల తర్వాత ఈ పిటిషన్ కోర్టుకు వెళ్లొచ్చని, అనుకూలంగా తీర్పు వచ్చిన పక్షంలో ఎన్నికల్లో చిన్నమ్మ పోటీ ఖాయమని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్నమ్మ కోర్టుకు చెల్లించాల్సిన జరిమానా రూ.10కోట్లు సిద్ధంగా ఉందని న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ తెలిపారు. దీప, దీపక్‌లకు నోటీసులు... దివంగత సీఎం జయలలితకు చెందిన వేదనిలయాన్ని అమ్మస్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి వ్యతిరేకంగా జయలలిత మేనల్లు్లడు దీపక్, మేనకోడలు దీప కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే భవనం విలువ, జయలలిత చెల్లించాల్సిన ఆదాయపన్ను మొత్తం రూ.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై సిటీ సివిల్ కోర్టుకు చెల్లించింది. ఆ మొత్తాన్ని తీసుకోవాలని జయలలిత వారసులు దీప, దీపక్, ఆదాయపన్నుశాఖకు సిటీ సివిల్ కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. నవంబర్ 5లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాం: అమిత్ షా
సాక్షి, చెన్నై: తమిళనాడుపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 చోట్ల పోటీ చేయాలన్న లక్ష్యంతో బీజేపీ పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గాల్ని గురి పెట్టి కార్యక్రమాల్ని విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంగ్లిషు మీడియాకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళనాట ఈ సారి పాగా వేసి తీరుతామన్న ధీమాను అమిత్ షా వ్యక్తం చేయడం గమనార్హం. అలాగే, రజనీ ప్రస్తావన ఈ భేటీలో రావడంతో ప్రాధాన్యత పెరిగింది. వ్యూహాలకు పదను..... తమిళనాడుపై ఈ సారి తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇక్కడి రాజకీయాలను నిశితంగానే పరిశీలించామని, ఏడు నెలల్లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, బలం పుంజుకోవడం లక్ష్యంగా విస్తృత కార్యక్రమాలు సాగుతున్నాయ ని వివరించారు. ఈసందర్భంగా ఎన్నికల్లో రజనీతో పొత్తు ఉంటుందా అని ప్రశ్నించగా, ఎన్నికలకు ఇంకా ఏడు నెలలు గడువు ఉందని, ఈ దృష్ట్యా, సమయాన్ని బట్టి నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. రజనీ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో రాలేదుగా, పార్టీ కూడా ఏర్పాటు చేయలేదుగా అని ఎదురు ప్రశ్నతో సమయం , సందర్భం కోసం వేచి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. (వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన అమిత్ షా) బీజేపీలో, కూటమిలో మార్పులు ఉంటాయా అని ప్రశ్నించగా, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉంటాయన్నారు. ప్రధానంగా పార్టీలో బలోపేతం లక్ష్యంగా మార్పులు, చేర్పులు సాగుతున్నాయని, ఇది కొనసాగుతుందన్నారు. కూటమి విషయానికి వస్తే, అన్నాడీఎంకేతో కలిసి పయనం చేస్తున్నామని, ఆ పార్టీ తమకు బలమైన మిత్ర పక్షం అని, ఇప్పటికే ఎన్నికల్ని ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. అయితే, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందే చెప్పలేమని సమాధానం ఇచ్చారు. ఎన్నికలకు ఏడు నెలలు సమయం ఉన్న దృష్ట్యా, భవిష్యత్తు రాజకీయాల గురించి ఇప్పడే ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. -
పార్టీ విజయానికి సమష్టిగా పనిచేద్దాం
సాక్షి, చెన్నై: పార్టీ ప్రస్థానంలో వచ్చే ఏడాది ఎంతో ముఖ్యమైందని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ద్వారా చరిత్ర సృష్టిద్దామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, పన్నీర్‌సెల్వం, కో–కన్వినర్ ఎడపాడి పళనిస్వామి పార్టీ శ్రేణులకు శుక్రవారం లేఖ రాశారు. అన్నాడీఎంకే 49వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం జరుపుకోనున్న సందర్భంగా వారిద్దరూ రాసిన లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘ప్రాణాల కంటే మిన్నగా కాపాడుకుంటూ వస్తున్న మన పార్టీ 48 ఏళ్లు పూర్తి చేసుకుని 49 సంవత్సరంఅడుగుపెడుతోందని తెలిపారు. వచ్చే ఏడాది అన్నాడీఎంకే పార్టీ స్వర్ణోత్సవం జరుపుకోనుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మనం చేసే కార్యక్రమాలన్నీ స్వర్ణోత్సవాల ప్రారంభంగా ఉండాలని ప్రేమ పూర్వకంగా కోరుకుంటున్నామని తెలిపారు. పురట్చి తలైవర్ ఎంజీ రామచంద్రన్ సేవలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు. అన్నాదురై మరణం తరువాత ఏర్పడిన ప్రభుత్వం, కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన వ్యక్తి ద్రవిడ పార్టీ లక్ష్యాలను విస్మరించి స్వప్రయోజనాలు, అధికారానికి వాడుకున్నారని తెలిపారు. (కాంగ్రెస్ మునిగే నౌక అని తెలిసినా.. : కుష్బూ) ఇలాంటి దుష్టశక్తుల చేతిలో చిక్కుకున్న రాష్ట్రాన్ని కాపాడేందుకే 1972 అక్టోబర్ 17వ తేదీన అన్నాడీఎంకే ఆవిర్భవించిందని, అధికారాన్ని చేపట్టి ఎంజీఆర్ నేతృత్వంలో ప్రజావసరాలను తీర్చిందని తెలిపారు. తమిళనాడులో సరికొత్త చరిత్రను సృష్టించిందని చెప్పారు. ఆయన తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత ఎంజీఆర్ చూపిన మార్గంలో ప్రజల మన్ననలు పొందారు. వారిద్దరిని ఆదర్శంగా తీసుకుని అందరం ముందుకు సాగుదాం. పార్టీ ప్రస్తానంలో 2021 ఎంతో ముఖ్యమైంది. పార్టీ స్వర్ణోత్సవ ఏడాదిలో అన్నాడీఎంకేను అధికార పీఠంపై కూర్చోబెట్టి చరిత్ర సృష్టిద్దాం. స్వర్ణోత్సవం దిశగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దాం..’ అంటూ ఆ లేఖలో పిలుపునిచ్చారు. -
ఛత్తీస్‌లో మళ్లీ కాషాయ రెపరెపలే!
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాషాయ జెండానే రెపరెపలాడనుందని ఒక ఒపీనియన్ పోల్ తేల్చింది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రమణ్‌సింగ్ నేతృత్వంలో బీజేపీ విజయం సాధించనుందని సీఎన్ఎక్స్ పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఆ ఎన్నికల్లో బీజేపీ 50, కాంగ్రెస్ 30, అజిత్‌జోగీ నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్( జోగి), బీఎస్పీ కూటమి 9 సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇతరులు ఒక స్థానంలో గెలవొచ్చని పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 42.22%, కాంగ్రెస్‌కు 37.21%, జోగి, మాయావతి కూటమికి 6.38%, ఇతరులకు 14.21% ఓట్లు రావచ్చని సీఎన్ఎక్స్ సర్వేలో వెల్లడైంది. నవంబర్ 12, 20 తేదీల్లో రెండు దశల్లో చత్తీస్ గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి 49, కాంగ్రెస్‌కు 39 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో రమణ్‌సింగ్ ప్రజాదరణకు తిరుగులేదని ఈ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 40.71% రమణ్ సింగ్నే మళ్లీ సీఎంగా కోరుకున్నారు. కాంగ్రెస్ నేత భూపేశ్ భాగెల్‌కు 19.2% మద్దతిచ్చారు. అభివృద్ధి, నిరుద్యోగం, పెట్రో ధరలు ఈ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపనున్నాయి. -
కర్ణాటకలోనూ ఆప్ పోటీ
సాక్షి, బెంగళూరు : గుజరాత్ ఎన్నికల్లో ఓటమి పరిపూర్ణం కావడంతో.. ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా.. కర్ణాటక ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే విషయాన్ని కర్నాటకలో పార్టీ అబ్జర్వర్‌గా పనిచేస్తున్న సంజయ్ సింగ్ ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల గురించి స్థానిక నేతలతో చర్చించేందుకు ఆయన గురువారం బెంగళూరు వచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతో పాటు, స్థానిక సమస్యలను పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతారని ఆప్ రాష్ట్ర కన్వీనర్ పృథ్వీ రెడ్డి చెప్పారు. పార్టీకి ఇక్కడ నాయకత్వ సమస్య ఉన్నా... కార్యకర్తలు మాత్రం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. -
హిమాచలంలో ఎన్నికల వేడి!
హిమాచల్‌ప్రదేశ్ 13వ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు సోమవారంతో ముగిసింది. పాలక, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 68 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాక రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేవలం 4 లోక్‌సభ సీట్లు, 71 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ కొన్ని కొత్త పోకడలకు తెరలేపింది. సీఎం పదవికి పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌నే ప్రకటించింది. అంతేగాదు, ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే సూత్రానికి వీడ్కోలు చెప్పి 83 ఏళ్ల వీరభద్రతోపాటు, ఆయన కొడుకు విక్రమాదిత్యసింగ్కు (తండ్రి సీటైన సిమ్లా-రూరల్) టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. రెండేళ్ల క్రితం 2015 సెప్టెంబర్ 26న ఓ పక్క ముఖ్యమంత్రి వీరభద్ర చిన్న కూతురు మీనాక్షి పెళ్లి ఏర్పాట్లలో ఉండగానే సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఆయన, ఆయన కుమారుడు విక్రమాదిత్య ఆస్తులపై దాడులు జరిపి, కేసులు నమోదుచేశాయి. ఈ పరిణామాలను బీజేపీ కక్షసాధింపు చర్యలుగానే భావించిన కాంగ్రెస్ అప్పటి నుంచి వీరభద్రను సమర్థిస్తూనే ఉంది. మరో బలమైన కాంగ్రెస్ నేత లేకపోవడం సింగ్‌కు కలిసొచ్చిన అంశం. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సీటును కొడుక్కి ఇచ్చి, వరుసగా ఎనిమిదిసార్లు గెలిచిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు విద్యాస్టోక్స్ నియోజకవర్గం ఠియోగ్ (సిమ్లాజిల్లా) నుంచి ఆయన ఈసారి పోటీచేస్తున్నారు. 90 ఏళ్ల స్టోక్స్ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. గెలిచే అవకాశాలున్నా బీజేపీలో సీఎం పదవికి పోటాపోటీ! 1990 నుంచీ 2012 వరకూ బీజేపీ, కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చాయి. ప్రతి ఐదేళ్లకూ ఇలా పాలకపక్షాన్ని ప్రజలు మార్చే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగితే బీజేపీ వచ్చే నవంబర్ 9న జరిగే ఎన్నికల్లో గెలుస్తుంది. ఒకప్పటి కాంగ్రెస్ మాదిరిగా బీజేపీ తన సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. గతంలో బీజేపీ తరఫున పదేళ్లు సీఎంగా ఉన్న ఠాకూర్ ప్రేంకుమార్ ధూమల్, కేంద్ర ఆరోగ్యమంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్ఢా ఎంపీ, మాజీ సీఎం శాంతాకుమార్(83)కు వయసు, గ్రూపు రాజకీయాల వల్ల బీజేపీ విజయం సాధించినా సీఎం అయ్యే అవకాశాలు లేవు. 1992లో ముఖ్యమంత్రి పదవికి శాంతాకుమార్ రాజీనామా చేశాక రెండు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు క్షత్రియులే(ఠాకుర్లు లేదా రాజపూత్‌లు) ఇప్పటి వరకూ ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే వీరభద్ర, ధూమల్లే పాతికేళ్లుగా ముఖ్యమంత్రి పీఠం సొంతం చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఈసారి పాలకపక్షం కాంగ్రెస్ ఓడిపోయి, నడ్డా బీజేపీ తరఫున సీఎం అయితే, పాతికేళ్లుగా సాగుతున్న ఠాకూర్ల పాలనకు తెరపడుతుంది. నడ్డా గతంలో రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆరోగ్యమంత్రిగా పనిచేసిన నడ్డా బ్రాహ్మణకుటుంబంలో జన్మించారు. రాష్ట్ర చరిత్రలో శాంతా కుమార్ ఒక్కరే బ్రాహ్మణ ముఖ్యమంత్రి. ఠాకూర్ల (38 శాతం) తర్వాత ఎక్కువ జనాభా ఉన్న బ్రాహ్మణులు(18 శాతం) ఇప్పటి వరకూ ‘కింగ్మేకర్లు’గా పేరు సంపాదించారు. నియోజకవర్గం మారిన ధూమల్ ప్రస్తుతం హమీర్పూర్ ఎమ్యెల్యే అయిన మాజీ సీఎం ధూమల్ ఈసారి సుజన్పూర్ నుంచి పోటీచేస్తుండగా, సుజన్పూర్ బీజేపీ శాసనసభ్యుడు నరేంద్ర ఠాకూర్ హమీర్పూర్ నుంచి రంగంలోకి దిగారు. అవినీతి కుంభకోణాలతో పేరుమోసిన కేంద్ర టెలికం మాజీ మంత్రి పండిత్ సుఖరాం శర్మ కొడుకు అనిల్‌శర్మ వీరభద్ర కేబినెట్ నుంచి రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై తన సొంత స్థానం మండీ నుంచి పోటీచేస్తున్నారు. సోనియాగాంధీ. రాహుల్‌గాంధీ సహా 40 మంది కాంగ్రెస్ సీనియర్లు పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ప్రకటించారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ మొత్తం నాలుగు లోక్‌సభ నియోజకర్గాల్లో ఒక్కొక్క బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వ్యతిరేక ప్రభావం లేకుంటే కాషాయపక్షానికే విజయావకాశాలుంటాయని అంచనా. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
బీఎస్పీకి బుఖారీ మద్దతు
పశ్చిమ యూపీలో ముగిసిన ప్రచార పర్వం లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి మద్దతు ఇస్తున్నట్లు ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమాం మౌలానా అహ్మద్ బుఖారీ ప్రకటించారు. రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ మద్దతు ఇచ్చిన మర్నాడే బుఖారీ మద్దతు ప్రకటించడంతో బీఎస్పీ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. గురువారం బుఖారీ మాట్లాడుతూ.. ‘ముస్లింలు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. బీఎస్పీకి మద్దతు ఇవ్వనున్నారు. లేకుంటే ప్రతి రాజకీయ పార్టీ ముస్లింలను తమ ప్రయో జనాల కోసం ఫుట్బాల్లా వాడుతుంది. అఖిలేశ్ హయాంలో ముస్లింలు వివక్షకు గురయ్యారు. అఖిలేశ్ ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడని ములా యం చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం’అని పేర్కొన్నారు. పశ్చిమ యూపీలో త్రిముఖ పోటీ పశ్చిమ యూపీలో తొలిదశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఈ ప్రాంతంలోని 73 స్థానాల్లో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఎస్పీ కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ ప్రధాని మోదీ విస్తృత ప్రచారం నిర్వహించారు. నోట్లరద్దుతో అవినీతిపై కొరడా ఝళిపించిన బీజేపీకి ఓటేయాలని కోరారు. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఎస్పీ, బీఎస్పీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. -
గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్ పూర్తి
-
ఆర్బీఐ, సీబీఐ తరహాలో ఈసీ కూడా..
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసీ పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీకి లొంగిపోయిందని, పిరికిపందలా తయారైందని విమర్శించారు. శనివారం జరిగిన గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కార్యకర్తలు పార్టీ గుర్తు, ఇతర ప్రచార సామాగ్రితో పోలింగ్ బూత్‌లలోకి వెళ్లడం, పోలింగ్ రోజున టీవీలు, సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈసీపై విమర్శలు సంధించారు. ఈసీ తీరు సిగ్గుమాలిన, పిరికపంద వ్యవహారమని నిందించారు. సీబీఐ, ఆర్బీఐ తరహాలో ఈసీ కూడా మోదీ ముందు మోకరిల్లిందని అన్నారు. కేజ్రీవాల్ గతంలో సీబీఐ, ఆర్బీఐలను టార్గెట్ చేస్తూ ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని విమర్శించారు. మోదీ తనకు కావాల్సిన వారిని నియమించుకుని ఆర్బీని నాశనం చేసినట్టే ఈసీని కూడా చేశారని ఆరోపించారు. నల్లధనం అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారని, కానీ గోవా, పంజాబ్ ఎన్నికల్లో బహిరంగంగా పంచిపెట్టారని, నోట్ల రద్దు వల్ల ఏం ప్రయోజనం కలిగిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. -
గోవాలో జోరు.. పంజాబ్‌లో బేజారు
న్యూఢిల్లీ: గోవా, పంజాబ్‌లలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గోవాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. శనివారం పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రికార్డు స్థాయిలో 67 శాతం పోలింగ్ నమోదైంది. కాగా పంజాబ్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థతి కనిపిస్తోంది. గోవాతో పోలిస్తే చాలా తక్కువ శాతం ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 2:30 గంటలకు 48 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పోలింగ్ జరిగింది. పంజాబ్‌లో 79 శాతం, గోవాలో 82.2 శాతం ఓటింగ్ నమోదైంది. తాజా ఎన్నికల్లో గోవాలో అదే స్థాయిలో ఓటింగ్ జరుగుతుండగా, పంజాబ్‌లో చాలా మందగించింది. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గోవాలో బీజేపీ, పంజాబ్‌లో బీజేపీ-అకాలీదళ్ అధికారంలో ఉన్నాయి. వచ్చే నెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
నో డౌట్.. అధికారం మాదే!!
గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలు మళ్లీ తమదే అధికారమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటింగ్ సరళీ అధికార పార్టీలకు అనుకూలంగా ఉందని అంచనా వేస్తున్నాయి. కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. గోవా ఎన్నికల్లో మరోసారి బీజేపీదే అధికారమని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని పేర్కొన్నారు. అటు పంజాబ్‌లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అధికార శిరోమణి అకాలీ దళ్ కూడా మరోసారి తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేసింది. పంజాబ్‌లో తాము మరోసారి గెలిచితీరుతామని అకాలీ దళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్‌ది డ్రామా అని, ఆయనకు డిపాజిట్ కూడా రాదని ఆయన పేర్కొన్నారు. ఆప్ మూడోస్థానానికి పరిమితమవుతుందని బాదల్ జోస్యం చెప్పారు. మరోవైపు పంజాబ్, గోవాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
గోవాలో రికార్డు స్థాయిలో ఎన్నికల పోలింగ్
ఢిల్లీ : గోవా అసెంబ్లీ ఎన్నికలకు రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అవుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు 40 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పంజాబ్‌లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు 25 శాతం పోలింగ్ నమోదైంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో 79 శాతం, గోవాలో 82.2 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి కూడా అంతే స్థాయిలో పోలింగ్ నమోదు కావచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పనాజిలో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ గోవాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు అవుతుందని..విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. జలదంర్‌లోని 66వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు కొద్దిసేపు పోలింగ్‌ను నిలిపివేశారు. -
గోవాలో రికార్డు స్థాయిలో ఎన్నికల పోలింగ్
-
పంజాబ్, గోవా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం
ఢిల్లీ : పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. పంజాబ్‌లోని 117 స్థానాలు, గోవాలో 40 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పనాజిలో రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోవాలో భారీగా ఓటింగ్ నమోదవుతుందని చెప్పారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఈ–బ్యాలెట్‌ను వాడనున్నారు. జవాన్లతో సహా వివిధ సర్వీసు ఉద్యోగులు దీని ద్వారా ఆన్ లైన్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గోవాలో 40 స్థానాలకు 251 మంది అభ్యర్థులు, పంజాబ్ 117 స్థానాలకు 1145 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో 1,642 పోలింగ్ కేంద్రాలు, పంజాబ్‌లో 22,615 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మార్చి 11న ఫలితాలు వెలువడనున్నాయి. -
పంజాబ్, గోవాలలో పోలింగ్ ప్రారంభం
-
పంజాబ్, గోవాల్లో పోల్స్ మాటేంటి?
చండీగఢ్/పణజి: నోట్ల రద్దు తర్వాత దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరానికి తెరలేసింది. పంజాబ్, గోవాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్‌లోని 117 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. పంజాబ్‌లో 1.98 కోట్ల మంది ఓటర్లు 1,145 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. కాంగ్రెస్ మొత్తం సీట్లలో పోటీ చేస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 112 స్థాన్లాల్లో, లోక్ ఇన్సాఫ్ 5 స్థానాల్లో బరిలో ఉంది. అధికార శిరోమణి అకాలీ దళ్ 94 చోట్ల, దాని మిత్రపక్షం బీజేపీ 23 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక 11 లక్షల మంది ఓటేయనున్న గోవాలో 250 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 34 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ మిగిలిన 5 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిస్తోంది. కాంగ్రెస్ 48 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆప్ 38 సీట్లలో, మహారాష్ట్రవాదీ గోమంత్ పార్టీ(ఎంజీపీ) 28 సీట్లలో బరిలో ఉన్నాయి. తొలిసారి ఈ–బ్యాలెట్.. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు తొలిసారి ఈ–బ్యాలెట్‌ను వాడనున్నారు. జవాన్లతో సహా వివిధ సర్వీసు ఉద్యోగులు దీని ద్వారా ఆన్ లైన్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గోవాలో అన్ని స్థానాల్లో, పంజాబ్‌లో ఆత్మనగర్, తూర్పు లుధియానా, ఉత్తర లుధియానా, ఉత్తర అమృత్సర్, పశ్చిమ జలంధర్.. మొత్తం 5 స్థానాల్లోనూ వీటిని వాడనున్నారు. ఈ–బ్యాలెట్‌ను ద్వారా డౌన్ లోడ్ చేసుకుని, నచ్చిన వారికి ఓటేసి, రిటర్నింగ్ అధికారులకు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పంజాబ్, గోవా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కేజ్రీవాల్ ఆప్ రెండు చోట్లా బరిలోకి దిగుతోంది. ఒపీనియన్ పోల్స్ మాటేంటి? పంజాబ్‌లో కాంగ్రెస్ లేదా ఆప్ అధికారంలోకి వచ్చే వీలుందని పలు సర్వేలు చెప్పాయి. 65 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే–యాక్సిస్ అంచనా. ఆప్‌కు 100 సీట్లు రావొచ్చని హఫ్పోస్ట్–సీటర్ సర్వే పేర్కొంది. గోవాలో బీజేపీ గెలవొచ్చని సర్వేలు చెప్పాయి. -
నేడే కేంద్ర బడ్జెట్
-
ఎదురు దెబ్బలు తగిలినా భవిష్యత్తు ఆశాజనకమే !
-
నేడే కేంద్ర బడ్జెట్
న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఉదయం సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెడ్తున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా పలు నిర్ణయాలను ఆర్థికమంత్రి ఈ బడ్జెట్లో ప్రకటించనున్నారని, పన్ను శ్లాబుల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కీలకమైన యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటంతో..ఆయా ఓటర్లను ఆకట్టుకునేలా బడ్జెట్లో పలు ప్రతిపాదనలుండొచ్చు. అయితే, ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎలాంటి ప్రకటనలు ఉండొద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో.. జైట్లీ తాజా పద్దు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. -
బడ్జెట్ ను వాయిదా వేయండి!
-
బడ్జెట్ ను వాయిదా వేయండి!
లక్నో: ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో యూనియన్ బడ్జెట్ ను నిలిపివేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఫిబ్రవరి 11న రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం సరి కాదన్నారు. వెంటనే నిలుపుదల చేయాలన్నారు. ఎన్నికల తరువాతే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ఆయన మోదీని కోరారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రభావితమ్యే అవకాశం ఉందని తన లేఖలోఅభ్యంతరం వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్- ఆర్థిక బడ్జెట్ కలిపి పెడుతున్నందువల్ల సంక్షేమ పథకాలను, లాభాలను కోల్పోనున్నారనీ, ఇది రాష్ట్రంలోని 20 కోట్ల జనాభాపై ప్రత్యక్షంగా ప్రభావితం చేయనుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి-మార్చి 2012 లో అప్పటి ప్రభుత్వంఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు బడ్జెట్ వాయిదా వేయడానికి సొంతంగా ఒక నిర్ణయాన్ని తీసుకుందని అఖిలేష్ గుర్తు చేశారు. వచ్చేనెల11 నుంచి మార్చి 8వ తేదీ వరకు యూపీలో ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 30 న ప్రారంభంకానున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నాలుగో వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టనున్నారు. దీంతో అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ను వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తంచేశాయి. కాగా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టిన కొద్దిరోజులకే ఓటింగ్ ప్రారంభం కానున్నందున అయిదు రాష్ట్రాల ఓటర్లు ప్రభావితం చేసే ఎలాంటి ప్రకటనలు ఉండకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అటు అడ్వకేట్ ఎంఎల్ శర్మ బడ్జెట్ ప్రవేశంపై ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో వేశారు. దీనిపై స్పందించిన సుప్రీం బడ్జెట్ ను వాయిదా వేయాల్సి అవసరం లేదని స్పఫ్టం చేసిన సంగతి తెలిసిందే. -
యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?
సమాజ్‌వాదీ పార్టీలో తండ్రీ తనయుల మధ్య ఏర్పడిన తగువు త్వరగా తీరకపోతే పార్టీ నిట్టనిలువునా చీలిపోతుందా? చీలిపోతే నెలరోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి లేదా ఏ కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఎలా ఉంటాయి? ములాయం వర్గంతో అఖిలేష్ వర్గం విడిపోతే పార్టీలో మెజారిటీ వర్గం ఆయనవైపే ఉన్నా ఆయన పొత్తు కుదుర్చుకునే కూటమి ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందా? 2012లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న ముందస్తు అంచనాలు దాదాపు అన్నీ నిజమయ్యాయి. అప్పుడు మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీచిన గాలులతో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరు అంచనా వేయగలిగారు. అయితే అఖండ విజయం సాధిస్తుందని మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. ఈసారి కూడా ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ అవి తన మీద పడకుండా అఖిలేష్ తెలివిగా తప్పించుకుంటూ వస్తున్నారు. తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ యాదవ్ లాంటి పెద్దల జోక్యం వల్ల తనకు స్వేచ్ఛ లేకపోయిందని అఖిలేష్ ప్రజలను నమ్మించగలిగారు. రాజకీయ సమీకరణలు ఏమిటి? ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో కూడా తనకే పూర్తి స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో సొంత జాబితాను విడుదల చేసి తండ్రితో అఖిలేష్ తగువుకు దిగారు. ఇరువురి మధ్య సమీప భవిష్యత్తులో రాజీ కుదురుతుందా.. అన్న అంశంపై భవిష్యత్ రాజకీయ సమీకరణలు ఆధారపడి ఉన్నాయి. పార్టీ నుంచి అఖిలేష్ చీలిపోతే ఆయన పార్టీతో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పొత్తు కడతాయి. అప్పుడు విజయావకాశాలు కొద్దిగా మెరుగుపడతాయి. పార్టీ విడిపోకపోతే కాంగ్రెస్‌తో పొత్తుకు ములాయం సింగ్ అంగీకరించరు. ఒకవేళ అంగీకరిస్తే సమాజ్‌వాదీ పార్టీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అది ఎంత ఎక్కువన్నది ఇప్పుడే చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారన్న విషయం ఇప్పటికైతే అంతు చిక్కడం లేదు. సర్వేలు ఏం చెబుతున్నాయి? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 33 శాతం ఓట్లు వస్తాయని, సమాజ్‌వాదీ పార్టీకి 26 శాతం, బీఎస్పీకి 26 శాతం, కాంగ్రెస్‌కు ఆరుశాతం ఓట్లు వస్తాయని ఇండియా టుడే–ఆక్సిస్ ఇటీవల నిర్వహించిన సర్వే తెలియజేస్తోంది. కాంగ్రెస్‌కు వచ్చే ఓట్ల శాతాన్ని కలుపుకుంటే సమాజ్‌వాదీ పార్టీ కొచ్చే ఓట్ల శాతం 32. అంటే, బీజేపీ కన్నా ఒక్క శాతం తక్కువ. లోక్‌నీతి–ఏబీపీ–సీఎస్డీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం బీజేపీకి 27 శాతం, ఎస్పీకి 30 శాతం, బీఎస్పీకి 22 శాతం, కాంగ్రెస్‌కు 8 శాతం ఓట్లు వస్తాయి. అంటే కాంగ్రెస్‌కు వచ్చే ఓట్ల శాతాన్ని కలుపుకొంటే ఎస్పీకి 38 శాతం ఓట్లు వస్తాయి. ఇది బీజేపీ కన్నా 11 శాతం ఎక్కువ కనుక సమాజ్‌వాదీ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ అధికారంలోకి రావాలంటే... ఎన్నికల తర్వాత బీఎస్పీతో పొత్తు పెట్టుకునే అవకాశం బీజేపీకి లేదు గానీ, అదే జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుంది. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. నాటి ఎన్నికల్లో ఒక్క బీజేపీకే 42.63 శాతం ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీకి 22.30 శాతం ఓట్లు వచ్చాయి. నాడు కాంగ్రెస్‌కు, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు వచ్చిన ఓట్ల శాతాన్ని కలుపుకొంటే ఎస్పీ కూటమికి 30.74 శాతం ఓట్లు అవుతాయి. అంటే, అప్పటికీ బీజేపీ కన్నా 12 శాతం ఓట్లు తక్కువ. అప్పుడు మోదీకున్న ప్రతిష్ట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని చెప్పలేం. ఎంతో కొంత తక్కువే ఉంటుంది. అది ఎంత తక్కువన్నదే ప్రస్తుతం రాజకీయ పరిశీలకులకు కూడా అంతుచిక్కడం లేదు. బీజేపీ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే మోదీ ప్రతిష్టను నమ్ముకునే ఎన్నికల్లోకి దిగుతోంది. బీఎస్పీతో పొత్తు కుదిరితే.... బిహార్ తరహా పొత్తు కుదుర్చుకుంటే బీజేపీని యూపీలో సులువుగా ఓడించవచ్చు. ఆ రాష్ట్రంలో ఆర్జేడీ, జేడీయూ పొత్తు కుదుర్చుకున్నట్లు యూపీలో ఎస్పీ, బీఎస్పీలు సంకీర్ణ ప్రభుత్వానికి సంసిద్ధం కావాలి. ముఖ్యమంత్రి పదవి వదులుకోడానికి అఖిలేష్ యాదవ్, మాయావతిలో ఎవరూ సిద్ధంగా ఉండరు. ఏదిఏమైనా సమాజ్‌వాదీ పార్టీ రాజకీయాలు రానున్న రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతాయన్న అంశంపైనే రాజకీయ సమీకరణలు, విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
ఒకేసారి ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు!
-
ఒకేసారి ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు!
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లకు ఒకేసారి శాసనసభ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఒకేరోజులో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే అవకాశముంది. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మొదట్లో ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి ఓటమి తప్పదని, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్నికల సర్వే వెల్లడించింది. ఇక పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీదళ్ ఓడిపోతుందని, కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని.. ఉత్తరాఖండ్‌లో అధికార కాంగ్రెస్‌కు షాక్ తప్పదని, బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని సర్వేలో తేలింది. -
100 మంది ఎమ్మెల్యేలకు మొండిచేయి!
న్యూఢిల్లీ: 2017లో ఉత్తరప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు తమ అభ్యర్ధిత్వాన్ని కోల్పోనున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో ఉద్వాసన పలకడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 403 నియోజకవర్గాలు కలిగిన అతిపెద్ద రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీకి 229 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభకు ఎన్నికలు ముగిసిన తర్వాత క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై పార్టీ వేటు వేసింది. అంతేకాకుండా, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత ఉన్నవారికి ఎన్నికల్లో సీట్ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు పార్టీకి చెందిన ఓ కీలక నేత తెలిపారు. సీఎం అఖిలేష్ యాదవ్ పై ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నా.. ఎమ్మెల్యేలపై ఎక్కువగా ఉందని వివరించారు. వ్యతిరేకత ఉన్నవారికి టికెట్లు ఇవ్వకపోవడమే మంచి పని అన్నారు. కాగా, పార్టీ తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని పార్టీలోని మరికొంత మంది గాబరా పడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టిన సమాజ్ వాదీ పార్టీ ప్రత్యర్థులు చేసిన సభ్యులను ఖరారు చేసిన స్థానాల్లో 150 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగతా అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఎస్పీ చీఫ్ ములాయాం సింగ్ యాదవ్ నియోజకవర్గాల నుంచి నాయకుల సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. కాగా, ములాయాం ఎంపిక చేసిన అభ్యర్థులకే సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
'అన్ని ఎన్నికలు ఒకేసారి'కి బీజేపీ ఓకే
న్యూఢిల్లీ: లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదనకు బీజేపీ మద్దతు తెలిపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పార్లమెంటరీ స్థాయీ సంఘానికి లేఖ రాశారని బీజేపీ సీనియర్ నాయకుడు బుధవారం చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల మధ్య దీనిపై పెద్దఎత్తున చర్చ జరగాలని అమిత్‌షా అందులో పేర్కొన్నారు. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఈసీని కోరారు. దీన్ని కాంగ్రెస్, తృణమూల్ వ్యతిరేకిస్తున్నాయి. అన్నాడీఎంకే, అస్సాం గణ పరిషత్, శిరోమణి అకాలీ దళ్ సమర్థించాయి. -
3,500 పోటీ చేస్తే 9 మంది గెలిచారు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగిన వారికి నిరాశే మిగిలింది. మొత్తం 3,500 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా అందులో విజయం సాధించింది కేవలం 9 మందే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గెలిచిన 9 మందిలో ఒక్క కేరళ నుంచే ఆరుగురు విజయం సాధించారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు గెలుపొందారు. తమినాడు నుంచి ఒక్కరూ గెలవకపోవడం గమనార్హం. 3,500 మందిలో కేరళ నుంచి 782, అస్సాం నుంచి 711, పశ్చిమ బెంగాల్ నుంచి 371, పుదుచ్చేరి నుంచి 96 మంది రంగంలోకి దిగినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మొత్తం 822 నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్ధులు పశ్చిమ బెంగాల్లో 2.2 శాతం, తమిళనాడులో 1.4 శాతం, కేరళలో 5.3 శాతం, అస్సాంలో 11 శాతం, పుదుచ్చేరిలో 7.9 శాతం ఓట్లను పొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు రాష్ట్రాల నుంచి 2,556 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా అందులో ఏడుగురు విజయం సాధించారు. -
మార్ఫింగ్ ఫొటోతో రచ్చరచ్చ!
కోల్‌కతా: మమతా బెనర్జీపై కేవలం కార్టూన్ వేసినందుకు ఏకంగా ప్రొఫెసర్‌ను జైలుకు పంపిన చరిత్ర తృణమూల్ కాంగ్రెస్ నేతలది. ఇప్పుడు ఆ పార్టీ నేతలే మార్ఫింగ్ ఫొటోలతో రాజకీయ లబ్ధి పొందేందుకు తహతహలాడుతున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కరత్‌కు మిఠాయి తినిపిస్తున్నట్టు ఉన్న ఓ ఫొటోను తృణమూల్ ఎంపీ డిరెక్ ఒబ్రియన్ ఆదివారం విలేకరులకు విడుదల చేశాడు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా సిద్ధాంత వైరుధ్యమున్న బీజేపీ-సీపీఎం చేతులు కలిపాయనడానికి ఈ ఫొటో నిదర్శనమంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఇది నిజమైన ఫొటోనా? కాదా? అన్నది మాత్రం ఆయన చూసుకోలేదు. ఈ ఫొటోపై వెంటనే బీజేపీ మండిపడింది. అది ఫొటోషాపింగ్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటో అని, నిజానిజాలు తెలుసుకోకుండానే తృణమూల్ నకిలీ ఫొటోలను విడుదలచేస్తూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నదని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. 2013లో ప్రధాని నరేంద్రమోదీకి రాజ్‌నాథ్ స్వీట్ తినిపిస్తున్న ఫొటోను మార్ఫింగ్ చేసి తృణమూల్ నాటకమాడుతుందని ఆయన దుయ్యబట్టారు. సీపీఎం అగ్రనేత కరత్ కూడా స్పందించారు. రాజ్‌నాథ్ హోంమంత్రి అయ్యాక ఆయనను తాను కలువనే లేదని స్పష్టం చేశారు. దీంతో నాలుక కరుచుకున్న డిరెక్ ఒబ్రియన్ క్షమాపణ చెప్పారు. తమ రీసెర్చ్ టీమ్ సరిగ్గా పరిశీలించకుండానే ఈ ఫొటోను ఇచ్చిందని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు. -
ఇక మౌనమే!
ఇన్నాళ్లు దూకుడుగా వ్యవహరించిన డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి ఇక మౌనం పాటించేందుకు నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ తన మద్దతు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇదే తన మద్దతు దారులకూ వర్తిస్తుందని ప్రకటించారు. సాక్షి, చెన్నై:డీఎంకే నుంచి అళగిరి బహిష్కరించబడ్డ విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో అళగిరి వ్యవహరించిన తీరుతో డీఎంకే చావు దెబ్బ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఎన్నికల్లో ఆయన మద్దతు కోసం బీజేపీ కూటమి తీవ్రంగానే కుస్తీలు పట్టాయి. కొందరు అభ్యర్థులు వ్యక్తిగతంగా అళగిరితో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో చావు దెబ్బతో డీఎంకే డిపాజిట్లు గల్లంతు అయ్యేందుకు అళగిరి కూడా ఓ కారకుడిగా చెప్పవచ్చు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుకు సాగుతూ వచ్చిన అళగిరి రూపంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ చిక్కులు మళ్లీ ఎదురు అవుతాయో అన్న బెంగ డీఎంకేకు తప్పలేదు. అదే సమయంలో గత నెల మీడియాతో మాట్లాడుతూ తన దారి ఏమిటో ఎన్నిక నామినేషన్ల పర్వం లోపు తేలుతుందని, అంత వరకు వేచి చూడాల్సిందే అన్న అళగిరి వ్యాఖ్య ఉత్కంఠకు దారి తీసింది. అళగిరి వ్యవహార శైలి ఎలా ఉండబోతోందో అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇక ఏడాదిన్నరగా కరుణానిధి అనుమతి కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన అళగిరికి ఈ సారి గోపాలపురంలో భేటీకి అవకాశం దొరికింది. గత వారం కరుణానిధితో భేటీ కావడం, ఈ భేటీ గురించి స్టాలిన్ సైతం మౌనం వహించడంతో ఇక అళగిరి బెడద తీరినట్టే అన్న ఆనందం డీఎంకే వర్గాల్లో నెలకొంది. ఒకటి కాదు, ఏకంగా రెండు సార్లు, వారం వ్యవధిలో కరుణానిధితో అళగిరి భేటీ కావడంతో, దక్షిణ తమిళనాడులో గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకుంటారేమో అన్న చర్చ బయల్దేరింది. అయితే అళగిరి కోట మధురై నుంచే స్టాలిన్ ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో ఆ చర్చ కాస్త సద్దుమణిగింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు దూరంగా ఉండడం మంచిదన్న నిర్ణయానికి అళగిరి వచ్చి ఉన్నారు. దూకుడుగా వ్యవహరించి నోరు జారడం కన్నా, మౌనం పాటించడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చి ఉన్నారు. ఎప్పుడూ మీడియా సంధించే ప్రశ్నలకు ఘాటుగా స్పందించే అళగిరి మంగళవారం శాంత స్వభావంతో ఒకే సమాధానం ఇచ్చి ముందుకు సాగడం విశేషం. చెన్నై నుంచి మధురైకు వెళ్తూ, మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియా చుట్టుముట్టడంతో స్పందించారు. మీడియా పలు ప్రశ్నల్ని సందించినా స్పందన లేదు. ఈ ఎన్నికల్లో తానెవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని, ఇది తన మద్దతుదారులకూ వర్తిస్తుందంటూ ముందుకు సాగడం విశేషం. ఎన్నికల్లో ఎవరి కోసం పనిచేయాల్సిన అవసరం లేదని పరోక్షంగా తమ మద్దతుదారుల కోసం ఈ వ్యాఖ్య చేసి ముందుకు కదిలారు. -
రెండు దశాబ్దాల తరువాత అసెంబ్లీ బరిలో వైగో!
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మే 16 న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు వరాల జల్లును కురిపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉంటూ వస్తున్న ఎండీఎంకే నాయకుడు వైగో.. ఈ సారి ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు శనివారం ఎండీఎంకే అధికారికంగా ప్రకటించింది. కొవిల్‌పట్టి నియోజకవర్గం నుంచి వైగో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైగో చివరిసారిగా 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విలత్తికులమ్ నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థిపై స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం శివకాశి నియోజకవర్గం నుంచి పోటీచేసి రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో విరుధునగర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కెప్టెన్ విజయ్ కాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు సాగుతున్న నాలుగు పార్టీల కూటమి పీడబ్యూఎఫ్ (ప్రజా సంక్షేమ కూటమి)లో భాగస్వామిగా ఎండీఎంకే ఈ దఫా ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఎండీఎంకేకు కేటాయించిన 29 స్థానాల్లో 27 స్థానాల నుంచి పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. మరో రెండు సీట్లను మాత్రం తమకు అనుబంధంగా ఉన్న చిన్న పార్టీల అభ్యర్థులకు ఎండీఎంకే కేటాయించింది. అన్ని పార్టీలు ఎవరికి వారే అధికారం తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా సంక్షేమ కూటమి నేతలైతే మరో అడుగు ముందుకేసి ప్రచార వేదికలోనే ఏ మంత్రి పదవి ఎవరికో తేల్చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. డీఎండీకే యువజన నేత సుదీష్.. ఇటీవల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ వైగోకు డిప్యూటీ సీఎం అని ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఏజ్ 91అయినా.. ఎన్నికల్లో దిగాడంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కురువృద్ధుడు బరిలోకి దిగాడు. 91 ఏళ్ల వయసులోనూ ఆయన మరోసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నాడు. బెంగాల్ మొత్తం ఎన్నికల్లోనే పోటీ చేస్తున్న వ్యక్తుల్లో అతి పెద్ద వయసుకలిగిన వ్యక్తి ఈయనే. గ్యాన్ సింగ్ సోన్ పాల్ అనే వ్యక్తి ఇప్పటికే పదిసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు పోటీ చేయడం 11వసారి. అందరూ ఆయనను అక్కడ చాచాజీ అని అంటుంటారు. ఖరగ్ పూర్ సర్దార్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. 1982 నుంచి కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సోహన్ పాల్ సొంత ప్రాంతం పంజాబ్ కాగా బెంగాల్‌కు 1900 ప్రాంతంలో వలస వచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేసిన ఆయన తొలిసారి 1969లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. -
ప్రచార బాట
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లో శ్రీకారం చుట్టనున్నారు. ఐల్యాండ్ గ్రౌండ్ వేదికగా శనివారం సాయత్రం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో పర్యటించేందుకు తగ్గ ఎల్ఈడీ స్క్రీన్లతో కూడిన 75 ప్రచార రథాలు సిద్ధం చేశారు. ఈ వేదికపై 20 మంది అభ్యర్థులను జయలలిత పరిచయం చేయబోతున్నారు. మళ్లీ అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే శ్రేణులు పరుగులు తీస్తున్నారు. తమ అమ్మ జయలలిత రచించిన వ్యూహాల్ని అమలు పరిచే పనిలో పడ్డారు. ఇక 227 స్థానాల్లో తమ అభ్యర్థులు, ఏడు స్థానాల్లో మిత్ర పక్ష అభ్యర్థులు బరిలోకి దిగడంతో అన్నాడీఎంకే ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్థులందరూ రెండాకుల చిహ్నం మీద బరిలోకి దిగుతుండడంతో ఇక ప్రచార పోరు రసవత్తరం కానున్నది. అదే సమయంలో ఆరోసారిగా జయలలిత అభ్యర్థుల్ని మార్చడం ఆ పార్టీలో తీవ్ర గందరగోళం ఆయా నియోజకవర్గాల్లో నెలకొంది. శుక్రవారం కూడా అభ్యర్థులను మార్చారు. తిరుచ్చి పశ్చిమం అభ్యర్థి తమిళరసిని తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి, అక్కడ బరిలో ఉన్న ఆర్ మనోహరన్‌ను పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. అలాగే, రాధాపురం రేసులో జీడీ లారెన్స్‌ను తొలగించి ఇన్భదురైను అభ్యర్థిగా ప్రకటించారు. అభ్యర్థుల మార్పు పర్వం మరిన్ని రోజులు సాగనున్నదో అన్న ప్రశ్నబయలు దేరిన సమయంలో ఇక, ప్రచార బాటకు అమ్మ సిద్ధమయ్యారు. అమ్మ ప్రచారం : క్లీన్ స్వీప్ లక్ష్యంగా, మళ్లీ అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఎన్నికల ప్రచారానికి జయలలిత సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో పార్టీ తరఫున ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. చెన్నై ఐల్యాండ్ గ్రౌండ్ వేదికగా భారీ బహిరంగ సభకు అన్నాడీఎంకే వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. ఈ వేదిక నుంచి సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల ప్రచారానికి జయలలిత శ్రీకారం చుట్టనున్నారు. చెన్నైలో 16 నియోజకవర్గాలతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లా పరిధిలోకి వచ్చే మరో నాలుగు నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఈ వేదికపై పరిచయం చేయనున్నారు. అలాగే, ఇదే వేదిక మీద నుంచి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నారు. ఈ ప్రచారం తదుపరి రాష్ట్రవ్యాప్తంగా జయలలిత బహిరంగ సభల రూపంలో జయలలిత పర్యటన సాగనుంది. విరుదునగర్, ధర్మపురి, అరుప్పుకోట్టై, కాంచీపురం, సేలం, తిరుచ్చి,మదురై, కోయంబత్తూరు, విల్లుపురం, పెరుంతురై, తంజావూరు, తిరునల్వేలి, వేలూరులో బహిరంగ సభలకు కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. మే 12 వ తేదీ వరకు ఈ పర్యటన సాగనుంది. ప్రతిరోజూ చెన్నై నుంచి హెలికాప్టర్ లేదా, విమానంలో బయలు దేరే జయలలిత, ఆయా ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్ని ముగించుకుని అదే రోజు చెన్నైకు వచ్చేయడానికి తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకుని ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే సర్కారు ప్రగతి పథకాలు, అమ్మ మేనిఫెస్టోలోని అంశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తగ్గ ఎల్ఈడీ ప్రచార రథాలు సిద్ధమయ్యాయి. 75 ప్రచార రథాలు శుక్రవారం పోయెస్ గార్డెన్‌కు చేరాయి. దీంతో ఆ మార్గం వెంబడి ఈ రథాలు బారులు తీరి ఉన్నాయి. వీటిని ప్రచార బహిరంగ సభలో జయలలిత జెండా ఊపి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సాగనంపనున్నారు. కోర్టుకు ‘వేదిక’ వివాదం : అన్నాడీఎంకే తొలి ప్రచార వేదిక వివాదానికి దారి తీసింది. ఐల్యాండ్ గ్రౌండ్లో పర్యాటక శాఖ నేతృత్వంలో ఎగ్జిబిషన్ జరిగింది. గత నెల 24తో ఈ ప్రదర్శన ముగిసింది. ఇక్కడి స్టాల్స్‌ను తొలగించేందుకు 40 రోజుల వరకు గడువు ఉంది. అయితే, అమ్మ ప్రచార పర్యటన కోసం ఆ దుకాణాలను ఆగమేఘాలపై తొలగిస్తున్నారు. దీంతో గుడ్ వర్క్ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. తాము సిద్ధం చేసి దుకాణాల్ని తొలగించేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి సుబ్బయ్య నేతృత్వంలోని బెంచ్ వివరణ ఇవ్వాలంటూ అధికారుల్ని ఆదేశించారు. అయితే, కోర్టు ఆదేశాలు బేఖాతరు అయ్యాయని చెప్పవచ్చు. తమ దుకాణాల్ని తొలగిస్తున్న దృష్ట్యా, కోర్టు ధిక్కార కేసుకు చర్యలు చేపట్టనున్నామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అధికార జులుంతో ఐల్యాండ్ గ్రౌండ్‌ను ఖాళీ చేయిస్తున్న తొలి ప్రచార వేదిక వ్యవహారం కోర్టుకు చేరడం చర్చకు దారి తీసింది. -
నేను ఇంకా బతికేఉన్నాను: మహిళా సీఎం
లాల్ గఢ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరింత జోరందుకోనున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భయపడేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. తాను ఇంకా బతికే ఉన్నానని, తాను ఉన్నంత వరకూ పోరాడుతూనే ఉంటానని ప్రజలకు అండగా ఉంటానని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు హుషారుగా ఎన్నికల్లో ముందుకెళ్లాని, ప్రజల మద్ధతు తమ పార్టీకి ఎప్పుడూ ఉంటుందున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరో వస్తారని భయపడాల్సిన అవసరం లేదని, వారు కేవలం మూడు రోజుల్లోనే తోకముడుస్తారని మమత పేర్కొన్నారు. గతంలో మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండే జంగల్ మహల్ ఏరియాలో ప్రచార కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచారు. తృణముల్ కాంగ్రెస్ అంటేనే తల ఎత్తుకునేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ తో కలిసి సీపీఐ(ఎం) పార్టీ చేసే దుష్ప్రచారానికి వెనక్కి తగ్గరాదని, వారికి తమను ఓడించే సామర్థ్యం లేదని చురకలు అంటించారు. కేవలం నాలుగేళ్లలోనే 400 ఏళ్ల పనులు నిర్వహించామని సీఎం మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. -
రెండు రోజుల్లో నగారా
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాజకీయ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్జైదీ మంగళవారం తుదివిడత చర్చలు జరుపుతున్న తరుణంలో నోటిఫికేషన్ జారీ చేస్తారని ఢిల్లీ వర్గాల భోగట్టా. తమిళనాడు ప్రభుత్వానికి మే 22వ తేదీతో గడువు ముగుస్తుంది. ఈ లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తిచేసి కొత్త ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది. ఇందుకోసం ఎన్నికల కమిషనర్ ఏర్పాట్లపై తలమునకలై ఉన్నారు. ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన యంత్రాలు ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు చేరుకున్నాయి. నకిలీ ఓటర్ల తొల గింపు కార్యక్రమం గత నెల 15 నుంచి 29వ తేదీ వరకు సాగింది. బందోబస్తుకు సీఆర్పీఎఫ్ దళాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 65వేల పోలింగ్ కేంద్రాల్లో 38 వేల కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి వెబ్కెమెరాలను అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇలా అన్ని రకాల పనులను నూరుశాతం పూర్తి చేసిన దశలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందరిలానే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎదురుచూస్తోంది. రాష్ట్రంలోని ఎన్నికల అధికారులందరికీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్‌లఖానీ మంగళవారం అత్యవసర ఉత్తరాలు పంపారు. నోటిఫికేషన్ వెలువడగానే కొత్తగా ప్రభుత్వ పథకాలను ప్రకటించరాదు, అమలు చేయరాదని ఆ ఉత్తరం ద్వారా ఆదేశించారు. అలాగే సీఎం జయలలిత సైతం సోమవారం అత్యవసరంగా సమావేశం అయ్యారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్ని పథకాల ప్రచార చిత్రాలను వీడియో కాన్ఫరెన్స్ద్వారా హడావిడిగా విడుదల చేశారు. సోమవారం ప్రారంభించిన అనేక పథకాలు, నిర్మాణాలు అసంపూర్తిగా ఉండగానే ప్రారంభించడం సీఎం హడావిడితనానికి అద్దం పట్టింది. ఇందువల్ల ఎన్నికల తేదీ ముఖ్యమంత్రికి ముందే చెప్పి ఉంటారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇటువంటి సంకేతాల కారణంగా బుధ, గురువారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం ఖాయమని తెలుస్తోంది. ‘ఎన్నికల తేదీపై నిర్ణయం జరిగిపోయింది, ఈ నెల 4వ తేదీ సాయంత్రం లేదా 5 వ తేదీ ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది’ అని రాష్ట్ర ఎన్నికల అధికారి ఒకరు రహస్య సమాచారం ఇచ్చారు. ఈసీకి డీఎంకే విజ్ఞప్తి ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీ సాగకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులను నియమించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్లఖానికి డీఎంకే విజ్ఞప్తి చేసింది. పార్టీ లీగల్‌సెల్ సహాయ కార్యదర్శి పరంధామన్ మంగళవారం సచివాలయంలో ఈసీని కలిశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఎన్నికల కమిషన్ 144 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతో అధికార అన్నాడీఎంకే, పోలీసులు తమకు అనుకూలంగా మలచుకున్నారని ఆరోపించారు. ఇటువంటి తప్పిదాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులను పరిశీలకులుగా నియమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ కు సైకిల్ దక్కేనా?
సాక్షి, చెన్నై: తమకు మళ్లీ సైకిల్ చిహ్నం దక్కేనా అన్న ఆశాభావంతో తమిళ మానిల కాంగ్రెస్ వర్గాలు ఎదురు చూపుల్లో పడ్డారు. సీటు కోసం నాలుగు వేల మందికి పైగా ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు.రాష్ట్ర కాంగ్రెస్‌లో ఒకప్పుడు అగ్ర నేతగా జీకేమూపనార్ తన సత్తాను చాటిన విషయం తెలిసిందే. ఆ పార్టీతో ఏర్పడ్డ విభేదాలతో బయటకు వచ్చిన మూపనార్ 1996లో తమిళ మానిల కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్టీ రెండు అసెంబ్లీ, మూడు లోక్ సభ ఎన్నికల్ని ఎదుర్కొంది. రెండు అసెంబ్లీ, ఒక లోక్ సభ ఎన్నికల్లో సైకిల్ చిహ్నంతో తన సత్తాను తమిళ మానిల కాంగ్రెస్ చాటుకుంది. మూపనార్ మరణంతో పార్టీ పగ్గాల్ని ఆయన తనయుడు జీకే వాసన్ చేపట్టారు. తదుపరి చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీని మళ్లీ కాంగ్రెస్‌లో కలిపేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఏర్పడ్డ విబేధాలతో బయటకు వచ్చిన జీకేవాసన్ మళ్లీ తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను తెర మీదకు తెచ్చి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. పొత్తు వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, మళ్లీ బల నిరూపణ దిశగా వాసన్ తన వ్యూహాల్ని అమలు చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పదో తేదీ నుంచి అన్ని జిల్లాల్లో సాగిన ఈ దరఖాస్తుల పర్వానికి స్పందన బాగానే వచ్చిందని చెప్పవచ్చు. నాలుగు వేల మందికి పైగా ఆశావహులు తమ కంటే తమకు సీటు కావాలని దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. ఇక, జీకే వాసన్ తమ నియోజకవర్గంలో అంటే, తమ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ దరఖాస్తులు సమర్పించుకున్న వాళ్లూ ఉన్నారు. ఇక, విల్లివాక్కం సీటు కోసం ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బి జవహర్ బాబు దరఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, తమకు మళ్లీ సైకిల్ చిహ్నం దక్కేనా అన్న ఎదురు చూపుల్లో తమిళ మానిల కాంగ్రెస్ వర్గాలు పడ్డాయి. సైకిల్ గుర్తు దక్కేనా: సైకిల్ చిహ్నం మళ్లీ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ఎన్నికల యంత్రాంగానికి విన్నవించుకునే పనిలో పడ్డారు. తమకు గతంలో కేటాయించిన చిహ్నం మళ్లీ దక్కే రీతిలో చర్యలు తీసుకోవాలని లేఖలు సంధించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇది వరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, తమిళ మానిల కాంగ్రెస్ పేరు పాతే అయినా, కొత్తగా ఆవిర్భవించిన పార్టీ పరిధిలోకి రావడం ఖాయం. రానున్న ఎన్నికల్లో తన సత్తాను చాటుకున్న తదుపరి శాశ్వత చిహ్నం ఈ పార్టీకి దక్కుతుంది. అందువల్ల ఈ సారి ఆ పార్టీ అభ్యర్థులందరికీ సైకిల్ చిహ్నం దక్కేనా అన్న ప్రశ్న బయలు దేరి ఉన్నది. స్వతంత్ర అభ్యర్థులు ఆ చిహ్నం కోసం రంగంలోకి దిగితే, సంక్లిష్ట పరిస్థితులు తప్పవు. అయితే, ఈ పరిస్థితి బయలు దేరకుండా ముందస్తుగా ఎన్నికల యం త్రాంగాన్ని ఆశ్రయించి సైకిల్‌ను దక్కిం చుకునే ప్రయత్నాలకు టీఎంసీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ విషయంగా పార్టీ నే త ధర్మరాజు పేర్కొంటూ, తమకు సైకిల్ చిహ్నం మళ్లీ దక్కుతుందన్న నమ్మకం ఉందని, తప్పకుండా ఆ చిహ్నం మీదే ఎన్నికల బరిలో తమ అభ్యర్థులు ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
జనతా పరివార్ నుంచి తప్పుకున్న ములాయం
-
నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరగనుంది. ఫిబ్రవరి 7న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రెండో విడత అభ్యర్థుల జాబితాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. నాలుగు రోజుల క్రితం కాషాయ కండువా కప్పుకున్న మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీకి ఢిల్లీలో పార్టీ ప్రచార బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించే అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపించటం లేదు. సమావేశం అనంతరం గానీ లేదా మంగళవారం ఉదయం ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని ప్రకటించే అవకాశం ఉంది. తదుపరి సీఎం అభ్యర్థిగా ఇటీవలే పార్టీలో చేరిన కిరణ్ బేడీ పేరు ప్రకటించే అవకాశం ఉందని చిత్రీకరించడంతో, చాలామంది సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. -
కశ్మీర్ బీజేపీ అభ్యర్థుల్లో 40 శాతం ముస్లింలే
జమ్మూ: మతతత్వ ముద్రను చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలను పెద్ద సంఖ్యలో పోటీకి నిలబెట్టింది. ఆ పార్టీ అభ్యర్థుల్లో 40 శాతం మందికి పైగా ముస్లింలే ఉన్నారు. 87 సీట్లున్న అసెంబ్లీలో మెజారిటీ సాధించడానికి కాషాయదళం ‘మిషన్ 44 ప్లస్’ వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. 70 స్థానాలకుపై పోటీ చేస్తున్న ఆ పార్టీ 32 మంది ముస్లింలను తమ అభ్యర్థులుగా బరిలోకి దింపింది. వీరిలో 25 మంది కశ్మీర్ లోయలో, ఆరుగురు జమ్మూ ప్రాంతంలో ఒకరు లడఖ్‌లో పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల్లో కశ్మీరీ పండిట్లు, బౌద్ధులు కూడా ఉన్నారు. ఆ పార్టీ కశ్మీర్ లోయలో నలుగురు కశ్మీరీ పండిట్లు, ఒక సిక్కు, లడక్‌లో ముగ్గురు బౌద్ధులకు టికెట్లు ఇచ్చింది. బీజేపీ ఈ ఎన్నికల్లో.. వివాదాస్పద అంశాలను జోలికెళ్లకుండా శాంతి, అభివృద్ధి నినాదాలతో ప్రజలకు చేరువ కావడానికి యత్నిస్తోంది. -
ఓటమిని అంగీకరిస్తున్నాం: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. అధికారంలోకి వచ్చే పార్టీలో హామీలను నెరవేర్చాలని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సోనియా మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, హర్యానాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడింది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్ మూడో స్థానంతో్ సరిపెట్టుకుంది. కాగా రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని సోనియా చెప్పారు. ప్రజల తరపున జాగూరకతతో వ్యవహరిస్తుందని అన్నారు. -
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం షురూ
న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలను చర్చించనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించినందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను పార్టీ నేతలు అభినందించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ లేదా శివసేన సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. శివసేన అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. -
పీసీసీ అధ్యక్ష పదవికి ఠాక్రే రాజీనామా
ముంబై: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే ఆదివారం ముంబైలో వెల్లడించారు. రాజీనామా లేఖను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేది లేదని ఎన్సీపీ తెగేసి చెప్పింది. అలాగే బీజేపీ, శివసేన కూడా తమ బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించాయి. దీంతో ఈ ఎన్నికల్లో నాలుగు పార్టీలు ఒంటరిగానే పోటీ చేశాయి. బీజేపీ మాత్రం దూసుకుపోతు ముందు వరసలో ఉంది. ఆ తర్వాత స్థానాన్ని శివసేన ఆక్రమించింది. మూడో స్థానాన్ని కాంగ్రెస్, ఎన్సీపీలు నిలిచాయి. -
ఓటు వేయలేదని మహిళపై సజీవదహన యత్నం
సాక్షి, ముంబై: తాము చెప్పిన అభ్యర్థికి ఓటు వేయలేదని ఓ మహిళను సజీవదహనం చేసేందుకు దుండగులు యత్నించారు. ఈ సంఘటనలో జెలుబాయి వాబలే (65) తీవ్ర గాయాలయ్యాయి. కాగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యేవ్లా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఫుల్మాలి ‘సాక్షి’కి అందించిన వివరాల మేరకు.. నాసిక్ జిల్లా యేవ్లా తాలూకా బాభుల్‌గావ్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన అశోక్ బోరనారే, పాండురంగ బోరనారే, నందకిషోర్ భూరక్ బుధవారం ఓటు వేసేందుకు బయలుదేరిన జెలూబాయి వాబలేకు మూడవ నంబర్ బటన్ (మీట) నొక్కాలని చెప్పారు. అయితే వయసు పైబడడంతో ఆమె రెండవ నంబర్ మీట నొక్కింది. ఇది తెలుసుకున్న నిందితులు ముగ్గురు గురువారం రాత్రి జెలుబాయిపై దాడిచేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటిబయటే కూర్చున్న ఆమెను చూసి చివాట్లు పెడుతూ ఇంట్లో ఉన్న కిరసనాయిల్ ఒంటిపై పోసి నిప్పంటించారు. సుమారు 60 శాతం కాలిన ఆమెను నాసిక్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి ముగ్గురు నిందితులపై కేసు నమోదుచేసుకుని అరెస్టు చేశారు. -
హర్యానా చరిత్రలో ఇదే భారీ పోలింగ్
-
మహారాష్ట్రా 64%..హర్యానాలో 76%
-
ఏకమయ్యే సమయమిదే!
సాక్షి, ముంబై: ముంబై, భివండీలతోపాటు తెలుగు ఓటర్లు గెలుపోటములను శాసించే నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఓట్లు చీలిపోతుండడంతో ప్రతి ఎన్నికల్లోనూ తెలుగువారి ఓట్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయనే అభిప్రాయాలను అన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అదే తెలుగువారు ఐక్యంగా నిలబడి, ఒకే అభ్యర్థికి ఓటువేసేలా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే గెలుపోటములను శాసించే స్థాయికి చేరడం ఏమంత కష్టం కాదని రాజకీయ పార్టీలే అంగీకరిస్తున్నాయి. ఇది సాధ్యం కావాలంటే తెలుగు సంఘాలన్నీ ముందు ఏకతాటిపైకి రావాల్సిన అవసరముంది. నిజానికి ఎన్నికలకు ముందే తమ ప్రతినిధిగా ఒకరిని నిలబెట్టి, అసెంబ్లీకి పంపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అసెంబ్లీ తెలుగు అభ్యర్థుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో ఉండేది. అయితే ఇప్పుడు అందుకు సమయం దాటిపోయింది. ఇప్పుడు తెలుగువారి చేతుల్లో ఉన్నదల్లా ఐక్యంగా నిలబడి, తెలుగువారి సంక్షేమానికి కృషి చేస్తాడని నమ్మే అభ్యర్థిని గెలిపించడమే. బరిలో ఉన్న కొంతమంది తెలుగువారికైనా మద్దతుగా నిలవడమే.. అయితే రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న తెలుగువారి వివరాలు ఇలా ఉన్నాయి... మహాసంగ్రామంలో మనోళ్లు 15 మంది.. సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా భివండీ మినహా ముంబై, పశ్చిమ మహారాష్ట్ర షోలాపూర్, మరాఠ్వాడా జాల్నా, విదర్భ చంద్రాపూర్, యావత్మాల్ తదితర జిల్లాల్లో 15 మంది తెలుగు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15 మంది తెలుగు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా షోలాపూర్‌లో రెండు స్థానాలకుగాను ఐదుగురు, యావత్మాల్ జిల్లాలో నలుగురు, చంద్రాపూర్ జిల్లాలో ఇద్దరు, నాందేడ్ జిల్లాలో ఇద్దరు, ముంబై, జాల్నాలలో ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కైలాస్ గోరింట్యాల్, వామన్రావ్ కాసంవార్, సుధీర్ మునగంటివార్లు మళ్లీ బరిలో ఉండగా మాజీ ఎమ్మెల్యే ఆడెం నర్సయ్య మరోసారి బరిలోకి దిగారు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో తెలుగు ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. షోలాపూర్‌లో ముగ్గురు హోరాహోరీ.. పశ్చిమ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో తెలుగు ప్రజలున్నారు. జిల్లా కేంద్రమైన షోలాపూర్ పట్టణంలో సుమారు 70 శాతం మంది తెలుగువారే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా ఆడెం నర్సయ్య, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అత్యంత సన్నిహితులైన విష్ణుకోటే కుమారుడైన మహేష్ కోటే బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్లుగా మరో ముగ్గురు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆడెం నర్సయ్య, మహేష్ కోటేలతోపాటు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సుశీల్‌కుమార్ షిండే కుమార్తె ప్రణతి షిండేల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. వీరికి ఎన్సీపీ అభ్యర్థి విద్యా లోల్గే, బీజేపీ అభ్యర్థి మోహినీ పట్కి, ఎంఐఎం అభ్యర్థి షేఖ్ తౌఫిక్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విదర్భలో... విదర్భలోని చంద్రాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న చంద్రాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో కరీంనగర్, అదిలాబాద్లతోపాటు ఇతర జిల్లాలకు చెందిన తెలుగు ప్రజలున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదిగిన మహారాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు సుధీర్ మునగంటివార్ బల్లార్షా నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. వరుసగా మూడు సార్లు విజయం సాధించిన సుధీర్ మునగంటివార్ బల్లార్షాలో మరోసారి విజయం సాధించేందుకు శాయశక్తులా ప్రచారం చేశారు. మరోవైపు చంద్రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన తరఫున కిషోర్ జోరగేవార్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు ఇక్కడ పలువురి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక విదర్భలోని వనీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వామన్రావ్ కాసావార్ మళ్లీ బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా తెలుగు వ్యక్తి అయిన బోద్కువార్ సంజీవరెడ్డిని బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ తెలుగువారి మధ్య హోరాహోరి పోరు సాగడం ఖాయమంటున్నారు. మరోవైపు యావత్మల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి తెలుగు అభ్యర్థులు మదన్ యేర్వార్, పీడబ్ల్యూపీ నుంచి దిలీప్ ముక్కావార్లు పోటీ పడుతున్నారు. మరాఠ్వాడాలో... నిజాంపరిపాలనలో తెలంగాణతో కలిసి ఉండే మరాఠ్వాడా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తెలుగుప్రజలున్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలను ఆనుకొని ఉన్న నాందేడ్‌లో భారీ సంఖ్యలో తెలుగువారున్నారు. దీంతో సౌత్ నాందేడ్ నుంచి తెలుగు వ్యక్తి దిలీప్ కందుకుర్తి బీజేపీ నుంచి బరిలోకి దిగుతుండగా ఎమ్మెన్నెస్ ప్రకాశ్ మారావార్ను బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ కూడా తెలుగువారి మధ్య పోటీ ఏర్పడింది. మరోవైపు జాల్నాలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కైలాస్ గోరింట్యాల్ మళ్లీ బరిలోకి దిగారు. మరాఠ్వాడాలోనే తెలుగు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గెలుపు నల్లేరుమీద నడకేనంటున్నారు విశ్లేషకులు. ముంబై, భివండీలలో... ముంబైతోపాటు తెలుగువారు అధికంగా ఉండే భివండీలో రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎవరూ ఎదగలేకపోతున్నారు. అనేక నియోజకవర్గాల్లో తెలుగువారు కీలకంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇంకా వెనుబడే ఉన్నామనే చెప్పాలి. ముంబైలో ఈసారి మహీం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా తెలుగు వ్యక్తి నాగ్‌సేన్ మాల బరిలో ఉన్నారు. ఇక భివండీలో ఒక్క తెలుగు అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం. -
'విజయం మాదే, కాంగ్రెస్ ను మట్టికరిపిస్తాం'
థానే: మహారాష్ట్ర ఎన్నికల్లో మాకే మెజార్టీ లభిస్తుందని బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. థానేలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక పాలన అందించిన కాంగ్రెస్, ఎన్సీపీల కూటమితోనే తాము పోటీ పడుతామని జవదేకర్ అన్నారు. శివసేనకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం, ప్రకటనలు ఇవ్వకూడదని బీజేపీ తీసుకుందని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిని చావుదెబ్బ తీస్తామని జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. మంచి పాలనను అందించేందుకు బీజేపీ అధికారంలోకి రానుందని ఆయన జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటులో ఏకాభిప్రాయం రాకపోవడంతో బీజేపీ, శివసేనలు తమ 25 ఏళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకున్నాయి. -
హర్యానా ఎన్నికల బరిలో సుష్మా సోదరి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సోదరి వందన శర్మ హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. శనివారం రాత్రి బీజేపీ 47 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలకు, ఓ మాజీ మంత్రికి జాబితాలో చోటు దక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై జాబితాను ఖరారు చేసింది. దీంతో హర్యానాలోని మొత్తం 90 స్థానాలకు బీజేపీ తరపున అభ్యర్థులను ఎంపిక చేసినట్లయింది. హర్యానాలో వచ్చే నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. -
వివాదం ముదిరేనా?
సాక్షి, ముంబై: దక్షిణ కరాడ్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలనే వివాదం మరింత ముదిరే అవకాశముంది. అక్కడి నుంచి పోటీపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆసక్తి కనబరుస్తుండగా, వదులుకునేందుకు సిద్ధంగా లేనని సిట్టింగ్ ఎమ్మెల్యే విలాస్‌కాకా పాటిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ అధిష్టానం దక్షిణ కరాడ్ నుంచి తనకు అభ్యర్థిత్వం ఇవ్వని పక్షంలో మరో పార్టీ నుంచైనా పోటీ చేస్తానని, ఒకవేళ అదికూడా వీలుకాకపోతే స్వతంత్య్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని పాటిల్ పేర్కొన్నారు. దీంతో ఈ నియోజక వర్గంపై వివాదం మరింత రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా పృథ్వీరాజ్ చవాన్ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే అంశం ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. ఈ సమస్య ఎటూ తేలకపోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో గందగోళం నెలకొంది. వచ్చే నెల 15న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో దక్షిణ కరాడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇందులోభాగంగా అక్కడి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ నియోజక వర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించిన విలాస్‌కాకా పాటిల్ ఈ స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆదివారం సాయంత్రం జరిగిన ఓ సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అవసరమైతే ఢిల్లీ అధిష్టానంపై తిరుగుబాటు చేస్తానని పేర్కొన్నారు. ‘దక్షిణ కరాడ్ నియోజక వర్గం నాకు కంచుకోట. ఇప్పటికే అక్కడినుంచి రెండుసార్లు గెలిచా. ఈ ఎన్నికల్లోనూ నా గెలుపు తథ్యం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని వదులుకోను’అని అన్నారు. దీంతో చవాన్ ఇరకాటంలో పడిపోయారు. -
ఈసారీ అధికారం మాదే
ముంబై : వరుసగా నాలుగో పర్యాయం కూడా తమనే ప్రజలు ఎన్నుకుంటారని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలో శని వారం ఆయన శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ఓ గాలి వీచింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, శాసనసభ ఎన్నికల ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య తే డా ఉంటుంది. ఎవరికి పగ్గాలను అప్పగించాలనే విషయం ప్రజలకు తెలుసు. వారు తెలివైన నిర్ణయం తీసుకుంటారు. మహారాష్ట్రను అభివృద్ధి విషయంలో మరింత బాగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. అందువల్లనే ప్రజలను ఓట్లు వేయాల్సిందిగా కోరనున్నాం’ అని అన్నారు. అమిత్ షా డైరీ నిండా కోర్టు కేసుల తేదీలే కేరళ గవర్నర్‌గా పి.సదాశివన్‌ను నియమించడమేమిటని ఆయన ప్రశ్నించారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై కేసులు ఎత్తివేసినందుకు కృతజ్ఞతగానే ఆయనకు ఈ పదవిలో నియమిస్తున్నారనే వదంతులు షికార్లు చేస్తున్నాయన్నారు. ఈ క్విడ్‌ప్రోకోలో నిజమెంతనే విషయం తనకు కూడా తెలియదన్నారు. షా డైరీ నిండా కోర్టు కేసులకు సంబంధించిన తేదీలే ఉంటాయన్నారు. ఫిరాయింపుదారులంతా అవకాశవాదులే అనేకమంది ఎన్సీపీ నాయకులు, మాజీ మంత్రులు బీజేపీలో చేరుతున్నారు కదా అని ప్రశ్నించగా వారంతా అవకాశవాదులేనని పవార్ అన్నారు. అటువంటి వారి గురించి తానేమీ మాట్లాడదలుచుకోలేదన్నారు. రాష్ట్రాన్ని ఎవరూ విడదీయలేరు రాష్ట్రాన్ని ఏ శక్తీ విడదీయలేదని ఎవరూ విడదీయలేరని పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాయన్నారు. అవన్నీ అవాస్తవాలు అనంతరం ఎన్సీపీ నాయకుడు అజిత్‌పవార్ మాట్లాడుతూ రాష్ర్టంలో రూ. 11 లక్షల కోట్ల మేర కుంభకోణాలు జరిగాయంటూ అమిత్‌షా ఇటీవల చేసిన విమర్శలను ఖండించారు. అవన్నీ అవాస్తవాలన్నారు. గుజరాత్లో ప్రారంభించారా? అనంతరం ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ భారత్‌లో త్వరలో బులెట్ రైలును ప్రవేశపెడతామని చెబుతున్న ప్రధాని మోడీ గుజరాత్లో మోనో లేదా మెట్రో రైలును ప్రారంభించారా అని ప్రశ్నించారు. -
మరోసారి ఆపేనా?
న్యూఢిల్లీ: సరిగ్గా ఐదు నెలల క్రితం ఢిల్లీ రాజకీయాల్లో నవచరిత్ర సృష్టించిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈసారి అదే ఊపును కొనసాగిస్తుందా? తిరిగి అధికారాన్ని దక్కించుకుంటుందా? అసెంబ్లీలో లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేసిన కేజ్రీవాల్‌ను తిరిగి ప్రజలు ఆమోదిస్తారా? దేశ రాజధానిలో ఇప్పుడు ఎక్కడా చూసినా ఇదే హాట్ టాపిక్ వినిపిస్తోంది. దీనికితోడు తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డీలాపడటం, ఆ వెంటనే పార్టీ సీనియర్ నేతలు రాజీనామాలు చేయడం ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న చీపురు గుర్తు పార్టీ మళ్లీ ఢిల్లీపై పట్టు సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం మిషన్ 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ‘మహారాష్ట్ర, హర్యానాలతో పాటుగా అక్టోబర్‌లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించాం. లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ఓడిపోయామనే దానిపై వీరంతా నివేదికలు పంపించే పనిలో నిమగ్నమయ్యార’ని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఏడు లోక్‌సభ స్థానాల్లో ఒక్కటీ దక్కించుకొని ఆప్‌కు మాత్రం ఓటు శాతం పెరగడం ఒక రకంగా ఉత్సాహన్నిస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 29.3 శాతం ఉన్న ఓటు బ్యాంక్ లోక్‌సభ ఎన్నికల్లో 32.9 శాతానికి పెరిగింది. అన్ని స్థానాల్లో ఆప్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 60 నుంచి 70 స్థానాల్లో బీజేపీ ముందుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధించడం ఎలా అనే దానిపై ప్రధానంగా దృష్టి సారించింది. ‘ఆర్కే పురం, ఓకాలో మా పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంది. మధ్య తరగతి నియోజకవర్గాల్లో మరింత శ్రమించాల్సి ఉంది. గ్రేటర్ కైలాశ్, మాల్వియా నగర్లో పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు కష్టించాల్సిన అవసరముంద’ని ఆప్ నాయకుడు ఒకరు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేజ్రీవాల్ పెద్ద హీరో కాదని, ఇప్పటికీ అలానే ఉన్నాడని పార్టీ భావిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి సీఎం అభ్యర్థి లేరని కేజ్రీవాల్ తరపున న్యూఢిల్లీ, వారణాసిలో ఎన్నికల ప్రచారం చేసిన గోపాల్ మోహన్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన వారిలో 20 శాతం మంది మోడీని ప్రధాని చేసేందుకు వేశామని అంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తామని చెబుతున్నారని ఆయన చెప్పారు. ఒకవేళ ఇదే జరిగి పది శాతం ఓటింగ్‌కు తమ పార్టీకి వస్తే 43 శాతానికి పెరుగుతుందని, బీజేపీ ఓటు బ్యాంక్ 36 శాతానికి పడిపోతుందని తెలిపారు. ఢిల్లీలో ఇప్పటికీ ఆప్ పటిష్టంగా ఉందని బీజేపీ గుర్తించిందని రాజకీయ విశ్లేషకుడు రవి రాజన్ చెప్పారు. అయితే హర్షవర్ధన్ కేంద్ర మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టడంతో బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటిస్తారాన్న దానిపై ఆ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉందని తెలిపారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అనేక స్థానిక సమస్యలు ప్రజలను ప్రభావితం చేస్తామని, ఇక్కడ పోలింగ్ మరో రకంగా ఉంటుందని చెప్పారు. విద్యుత్ రాయితీ, ఉచిత నీటి సరఫరా, అవినీతి రహిత యంత్రాంగాన్ని తీసుకొస్తామన్న పాత హామీలతోనే మళ్లీ కేజ్రీవాల్ పార్టీ ఢిల్లీవాసుల ముందుకు వెళుతుందని తెలిపారు. బీజేపీ నేత నితిన్ గడ్కారీ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ జైలుకెళ్లడాన్ని సమర్థిస్తూ ఆప్ వాలంటీర్లు ఇంటి ఇంటికీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. కేజ్రీవాల్ లేఖలపై దాఖలైన పిటిషన్ కొట్టివేత న్యూఢిల్లీ: తీహర్ జైలు నుంచి తన మద్దతుదారులకు బహిరంగ లేఖలు రాసిన కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. ఆ లేఖలను పంపిణీ చేయడంపై నిషేధం విధించడంపై ఏమీ చేయలేమని పిటిషన్‌దారు శర్మకు స్పష్టం చేసింది. ‘ఇది కోర్టు పరిధిలోని అంశం కాదు. కావాలనుకుంటే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చ’ని ఆదేశించింది. కేజ్రీవాల్ బహిరంగ లేఖలు ఉపసంహరించుకునేంత వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలని శర్మ పిటిషన్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, పాటియాలా కోర్టులో రూ.పదివేల పూచీకత్తుతో బెయిల్ బాండ్ సమర్పించిన కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. -
అసెంబ్లీ ఎన్నికలు సత్వరమే జరపాలి
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభ ఎన్నికల కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయమై ఆ పార్టీకి చెందిన దళిత నాయకుడు ఉదిత్‌రాజ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజలతోపాటు వెనుకబడిన కులాలవారు అండగా ఉన్నారని, అందువల్ల ఈసారికూడా అధికారంలోకి వస్తామని ఆప్ కలగంటోందన్నారు. అయితే మధ్యతరగతి ప్రజలు తమ పార్టీని నమ్ముతున్నారని, అందువల్ల త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో వారి కలలు కల్లలవడం తథ్యమన్నారు. శాసనసభ ఎన్నికలను ఎట్టిపరిస్థితుల్లోనూ వీలైనంత త్వరగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మధ్యతరగతి ప్రజలతోపాటు వెనుకబడిన కులాల ఓటుబ్యాంకు తమదేనని ఒకవేళ ఆప్ భావిస్తే అది పొరపాటు మాత్రమే అవుతుందన్నారు. కాగా ఢిల్లీలో మొత్తం 12 రిజర్వ్డ్ స్థానాలు ఉండగా గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. అదే ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలు కైవసం కావడంతో కాంగ్రెస్ పార్టీ సహకారంతో అధికారం చేపట్టింది. అయితే సరిగ్గా 49 రోజుల తర్వాత జన్‌లోక్‌పాల్ బిల్లు వీగి పోవడంతో అధికారం నుంచి వైదొలిగింది. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ బోల్తాపడింది. కేవలం నాలుగు స్థానాల్లోనే విజయం సాధించింది. ఈ విషయమై ఉదిత్‌రాజ్ మాట్లాడుతూ దళితులే కాకుండా ఇతర వర్గాలు కూడా తమకు అండగా నిలిచాయనే విషయం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. అన్నివర్గాల ప్రజలకు తమ పార్టీపై విశ్వాసం పెరిగిందన్నారు. ఆప్ నాయకుల లెక్కలన్నీ తప్పాయన్నారు. అందువల్లనే అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యాడన్నా రు. అయినప్పటికీ ఏదోవిధంగా జనసామాన్యాన్ని ఆకట్టుకునేందుకు నానాతంటాలు పడుతున్నాడన్నారు. తామే యోధులమని నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నారన్నారు. శాసనసభ ఎన్నికల కు బీజేపీ ఎజెండా ఎలా ఉండే అవకాశముందని ప్రశ్నించగా లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే ఉంటుందన్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని అందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాం గ్రెస్, ఆప్‌లు తమకు పోటీయే కాదన్నారు. ఆప్ ఇప్పటికే ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి విఫలమైందన్నారు. ఈసారి తమ పార్టీకి కనీసం 60 స్థానాలు రావడం తథ్యమన్నారు. -
ఈసారి మరిన్ని సీట్లు మాకే
ముంబై: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయిందనే విషయం లోక్‌సభ ఎన్నికలతో తేలిపోయిందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ పేర్కొన్నారు. అందువల్ల వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తమకే మరిన్ని స్థానాలు దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో వారు మాకు తక్కువ సీట్లు ఇచ్చారు. అందువల్ల శాసనసభ ఎన్నికల్లో మాకే మరిన్ని స్థానాలు రావాలి. సీట్ల సర్దుబాటుపై చర్చల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చర్చల విషయంలో ఎక్కువ ఆలస్యం జరగనివ్వం. శాసనసభ ఎన్నికలకు వీలైనంత త్వరగా సన్నాహాలు చేస్తాం’ అని అన్నారు. మరిన్ని స్థానాల్లో తాము గెలవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడిందన్నారు. ఆహార భద్రత లాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆశించినమేర ఫలితాలు రాలేదన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడంలో ఏడు నెలల మేర ఆలస్యమైందన్నారు. రాజీవ్‌గాంధీ ఆరోగ్యదాయని, స్వల్ప వడ్డీకి రుణాలు వంటి పథకాలు సైతం ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయన్నారు. ఎన్నికల్లో వైఫల్యాలకు గల కారణాలపై చర్చించాల్సి ఉందన్నారు. ప్రజలకు మరింత చేరువ కావాల్సి ఉందన్నారు. వచ్చే నెల 15వ తేదీ తర్వాత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ తమ జిల్లాలకు వెళ్లి, ర్యాలీలు, సభలు నిర్వహించాలని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నించాలన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా జరుపుకునేందుకు సంబంధించి తమ పార్టీ ప్రణాళికలను రూపొందించాల్సి ఉందన్నారు. కొన్ని వర్గాలు తమకు దూరమయ్యాయనే విషయం ఈ ఎన్నికల్లో తేలిందన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎల్బీటీ విధానం వల్ల వ్యాపారవర్గాలు తమకు దూరమయ్యాయని ఈ సందర్భంగా ఉదహరించారు. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేయాలని షాహు మహారాజ్ వంటి మహానుభావులు పేర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కాగా 2009 నాటి శాసనసభ ఎన్నికల్లో ఎన్సీపీ 114, కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీచేశాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ నాలుగు స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ కేవలం రెండింటికే పరిమితమైన సంగతి విదితమే. -
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయా? అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. శనివారం పార్టీ కార్యాలయంలో కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీవాసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం, కార్యకర్తల కృషిని ప్రశంసించడం... ఇవన్నీ ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాన్ని ఇచ్చాయని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ నేతలు, శ్రేణులు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని కోరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల వేడి చల్లారకముందే అసెంబ్లీ ఎన్నికలు జరిపించడం మంచిదని అంటున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నికవడంతో అసెంబ్లీలో బీజేపీ సంఖ్యా బలం 29కి పడిపోయింది. ఈ సంఖ్యతో ప్రభుత్వం ఏర్పాటుచేయడం కోసం ప్రత్యర్థి పార్టీలను చీల్చవలసి ఉంటుందని, దాని కన్నా సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటుచేయడం మేలని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే నిన్నటివరకు అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని కోరుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లాలంటే జంకుతోంది. ఢిల్లీలో ఒక్కసీటు కూడా దక్కకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలలో మనోబలం సన్నగిల్లింది. అయితే అన్ని స్థానాలలో తాము రెండో స్థానంలో నిలవడం ,అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటు శాతం కూడా పెరగడం ఆ పార్టీ నేతలకు ఆశలు రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఆప్‌కు 30 శాతం ఓట్లు లభించగా, లోక్‌సభ ఎన్నికలలో అది 33 శాతానికి పెరిగిందని వారంటున్నారు. తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉందని, పేద, దళిత ఓటర్లు తమను వదలలేదని, కాంగ్రెస్ ఓటర్లు బీజేపీకి ఓటేశారని వారు భావిస్తున్నారు. -
చివరి బంతికి హిట్ వికెట్
చేతులెత్తేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్న మాజీ సీఎం సాక్షి ప్రతినిధి, తిరుపతి: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులెత్తేశారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుంచి క్రికెట్ పరిభాషలో మాట్లాడి, రాష్ట్ర విభజనలోనూ అదే భాష ఉపయోగిస్తూ.. చివరి బంతి మిగిలే ఉందని అంటుండేవారు. తీరా చివరి బంతి వచ్చేసరికి ఆయనంతట ఆయనే హిట్ వికెట్‌తో ఔటైపోయారు. నామినేషన్ల చివరి రోజున ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పీలేరు నుంచి తన సోదరుడిని పోటీకి దింపి, ఆయన వెనక్కొచ్చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మూడున్నరేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించి, సొంత పార్టీ పెట్టుకున్న కిరణ్ తీరా ఎన్నికలొచ్చేసరికి తప్పుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటమి తప్పదనే ఆందోళనతోనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కిరణ్ వాయల్పాడు నుంచి మూడుసార్లు గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో పీలేరు నుంచి పోటీచేసి విజయం సాధించారు. రోశయ్య తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఇటీవలి వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన, అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో జేఎస్పీ అభ్యర్థులను బరిలోకి దించాలని భావించారు. తాను పీలేరు నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య శనివారం ఉదయం పీలేరు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన తమ్ముడు కిషన్‌కుమార్‌రెడ్డి (కిశోర్‌కుమార్‌రెడ్డి)తో నామినేషన్ వేయించి వెనుదిరిగారు. అక్కడి నుంచి రోడ్‌షోగా బయల్దేరారు. తాను రాష్ట్రమంతా తిరగాల్సి ఉన్నందున, పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పారు. కిరణ్ రాజకీయ భవితవ్యంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న సంకేతాలున్న కారణంగానే ఆయన పోటీకి దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈసారిపోటీ చేయకూడదని ఆయన కొద్ది రోజుల కిందటే నిర్ణయానికొచ్చినప్పటికీ, ఓ పార్టీ అధ్యక్షుడిగా పోటీలో లేకపోతే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతోనే నామినేషన్ల చివరి రోజున సోదరుడిని బరిలో దింపి, ఆయన తప్పుకున్నట్లు సమాచారం. జై సమైక్యాంధ్ర పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంటే కిరణ్ ఎన్నికల బరిలో నిలిచేవారేనని ఆయన సన్నిహితులు అంటున్నారు. పార్టీ ఏర్పాటు చేయడంలోని ఉద్దేశమే వేరని, అలాంటప్పుడు ఎందుకు పోటీ చేస్తారని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వచ్చిన చంద్రబాబుకు, ఆయన పార్టీకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే ఆయన పార్టీని స్థానించారని, ఓట్ల చీలిక ద్వారా టీడీపీకి ప్రయోజనం చేకూర్చాలన్నది కిరణ్ ఆలోచన అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయోమయంలో జేఎస్పీ అభ్యర్థులు సమైక్య ఛాంపియన్లుగా ప్రచారం చేసుకోవడమే కాకుండా, సీపీఎంతో పొత్తు పెట్టుకున్న తర్వాత.. చివర్లో పార్టీకి కెప్టెన్‌లాంటి కిరణ్ బ్యాటొదిలేసి క్రీజు నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. కిరణ్ తీరుపై మండిపడుతున్నారు. పలువురు అభ్యర్థులు రంగం నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్టు చెబుతున్నారు. -
మళ్లీ వాళ్లే
-
రెండు నెలలు ఓపిక పట్టండి
మీ కష్టాలన్నీ తీరుస్తా ప్రజలకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్ఛాపురంలో రోడ్‌షోకు ప్రజల బ్రహ్మరథం ఉత్కళాంధ్ర సీమలో జన నేతకు నీరాజనం జాతీయ రహదారిపై వెల్లువెత్తిన జనాభిమానం శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని ఉత్కళాంధ్ర సాంస్కృతిక సీమ ఇచ్ఛాపురంలో పర్యటించారు. మున్సిపాలిటీలోని ఇరుకు వీధుల్లో కూడా ఆయన పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఆయన్ను చూసేందుకు ప్రజలు పోటెత్తారు. జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఇచ్ఛాపురం పట్టణంలో రోడ్ షో ప్రారంభించింది మొదలు సాయంత్రం వరకు పోటెత్తిన జనప్రవాహం మధ్య ఆయన పర్యటన సాగింది. జగన్‌ను చూసేందుకు.. పలకరించేందుకు మహిళలు, వృద్ధులు భారీగా తరలి వచ్చారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా తన కోసం వచ్చిన వారందరితో జగన్ మనసారా మాట్లాడారు. ‘నాలుగున్నరేళ్లుగా మీరు పడుతున్న బాధలు తెలుసు. రాష్ట్రమంతా తిరిగి కళ్లారా చూశాను. రెండు నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. పేదలందరి బాధలు తీరుస్తా’ అని భరోసా కల్పించారు. జగన్‌ను చూడాలని.. జగన్మోహన్రెడ్డి తమ వద్దకు వస్తున్నారని తెలిసి.. ఆయనను చూడాలని ఇచ్ఛాపురంలో నాగుల గంగు(102) అనే వృద్ధురాలు అతి కష్టం మీద ఇంటి బయటకు వచ్చింది. కానీ అప్పటికే ఆయన కాన్వాయ్ వెళ్లిపోయింది. దాంతో నిరాశతో కూర్చుండిపోయిన నాగుల గంగును ఒక యువకుడు చేతులపై మోసుకుని జగన్ వాహనం వద్దకు తీసుకువెళ్లగా... ఆమెను చూసిన జగన్మోహన్రెడ్డి వాహనం దిగి దగ్గరకు వెళ్లారు. తనకు రూ.200 మాత్రమే పింఛను వస్తోందని, అది సరిపోవడం లేదని చెప్పిన ఆమెతో... ధైర్యంగా ఉండవ్వా.. నీకు రూ.700 పింఛన్ నేను ఇస్తానంటూ భరోసా ఇచ్చారు. ఇచ్ఛాపురం దాసన్నపేటలో సరోజ అనే మహిళ వచ్చి తన వికలాంగ కుమారుడు హిమతేజకు ఇస్తున్న పింఛన్ సరిపోక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఆమెకు జగన్ ధైర్యం చెబుతూ తాను అధికారంలోకి రాగానే పింఛను రూ.1,000కు పెంచుతానని చెప్పారు. కండ్ర వీధిలో కండ్ర కులస్తులు కలిసి తమను ఎస్సీల్లో చేర్చాలని కోరగా..‘‘తప్పకుండా ఎస్సీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటాను. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాను’’ అని హామీ ఇచ్చారు. వెల్లువెత్తిన జనసందోహం.. జగన్మోహన్రెడ్డి రోడ్‌షో సందర్భంగా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ జన జాతరను తలపించింది. మున్సిపాలిటీలోని 23 వార్డుల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు ఆయన్ను చూసేందుకు తరలివచ్చారు. దాంతో కాన్వాయ్ ముందుకు సాగడమే గగనమైపోయింది. ఇచ్ఛాపురం దాసన్నపేట నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంతానికి చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టిందంటే ఏ స్థాయిలో ప్రజాభిమానం వెల్లువెత్తిందో తెలుస్తోంది. కండ్ర వీధి, కస్పా వీధి, బ్రాహ్మణ వీధి, పంజా వీధి, కాపు వీధి, హరిజన వీధుల మీదుగా రోడ్ షో సాగింది. అప్పటికే సమయం మించిపోవడంతో రోడ్‌షోను ముగించాలని భావించారు. కానీ ఉప్పాడ వీధి, బెల్లుపడలకు చెందిన ప్రజలు వచ్చి తమ ప్రాంతానికి రావల్సిందేనని పట్టుబట్టారు. అప్పటికే మధ్యాహ్న భోజన వేళ మించిపోయింది. అయినా వారి మాట కాదనకుండా జగన్ ఉప్పాడ వీధి, బెల్లుపడ వెళ్లారు. రోడ్‌షో ముగించిన అనంతరం శ్రీకాకుళం మీదుగా విశాఖపట్నానికి బయలుదేరారు. జాతీయరహదారిపై పలుచోట్ల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి జగన్‌ను చూసేందుకు పోటీ పడ్డారు. దాంతో ఆయన తన వాహనాన్ని ఎక్కడికక్కడ ఆపి కిందకు దిగి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అలా లొద్దపుట్టి, శిలగాం, మఖరాం పురం జంక్షన్, అంపురం జంక్షన్, పలాసపురం, కొర్లాం తదితర చోట్ల వేలాదిగా ప్రజలు తరలివచ్చి జగన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. నీ వైద్యానికి నాదీ భరోసా సుభాష్‌చంద్ర, ప్రమీల అనే పేద దంపతులు ఇచ్ఛాపురంలో జగన్‌ను కలిసి ‘‘అన్నా... మా పాప కాళ్లు చచ్చుబడి ఇంట్లో ఉంది. ఒకసారి వచ్చి చూడన్నా..’’ అని కోరడంతో జగన్ వెంటనే వాహనం దిగి వారి ఇంటికెళ్లారు. రెండు కాళ్లూ చచ్చుబడిపోయిన వారి కుమార్తె సుమిత్రా నందాను చూసి చలించిపోయారు. ఏమైందని అడిగారు. ఏదో వ్యాధి సోకి తమ అమ్మాయి నడుం నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయాయని వారు చెప్పారు. రూ.లక్ష అప్పు చేసి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయారు. ‘నాకూ అందరిలో నడవాలని ఉంది సార్’అని సుమిత్ర అనడంతో చలించిపోయిన జగన్.. లోక్‌సభ అభ్యర్థి రెడ్డి శాంతి, పార్టీ నేత నర్తు రామారావులకు ఆ అమ్మాయి బాధ్యత అప్పగించారు. ఆమెకు కావల్సిన వైద్యం చేయించాలని చెప్పారు. తాము పిలిచిన వెంటనే వచ్చి.. ఆదుకుంటామని మాటిచ్చారంటూ సుభాష్ నందా, ప్రమీల కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. -
చీటర్లు, లూటర్లెవరో ప్రజలు తేలుస్తారు
రాష్ట్ర విభజన వ్యవహారంలో చీటర్లు (మోసగాళ్లు), లూటర్లు (దోపిడీదారులు) ఎవరో ప్రజలే తేలుస్తారని బీజేపీ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సాఫీగా, ఒక పద్ధతి ప్రకారం జరగలేదని చెప్పడమే పాపమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వాలంటూనే సీమాంధ్ర సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావించడం నేరమా? అన్నారు. ప్రాంతానికో మాట మాట్లాడి, పూటకో డ్రామా అడిన వారి సంగతేమిటో తేల్చే రోజులు దగ్గరపడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీని ప్రధానిని చేసేందుకు బీజేపీకి, ఆ పార్టీ మద్దతుదార్లకు (వారెవ్వరో స్పష్టంగా చెప్పలేదు) ఓటేయాలని అభ్యర్థించారు. ‘మోడీని ప్రధానిని చేద్దాం’ నినాదంతో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో డాక్టర్ రామారావు అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యతో పాటు బీజేపీ జాతీయ కోశాధికారి పీయుష్ గోయల్, అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, ఉభయ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు కె.హరిబాబు, జి.కిషన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎన్.రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు నరేంద్ర మోడీపై రాసిన పాటల క్యాసెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... 2009లో చిదంబరం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కల్పించిందని, దాని కొనసాగింపుగా జరిగిన ఉద్యమంలో వేయి మందికి పైగా అమరులయ్యారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 2014 సాధారణ ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయమే రెండేళ్ల కిందటే తీసుకొని ఉంటే ప్రస్తుత పరిస్థితి నెలకొని ఉండేది కాదన్నారు. విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంలో తమ పార్టీ నేతలు సుష్మా స్వరాజ్, అద్వానీలతో పాటు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ సమయంలో ఏమి చేయాలని నాలుగు రోజులు నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. తెలంగాణ రావాలి, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలనడం ఏవిధంగా ద్రోహమో చెప్పాలన్నారు. బాగో, జాగో అంటూ సీమాంధ్రుల్లో భయాందోళనలు సృష్టించారని, వాటిని పారదోలేందుకు ప్రధానితో ప్రకటన చేయించిన ఏకైక వ్యక్తిని తానేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను గానీ, తన కుమార్తె గానీ పోటీ చేయబోమని ప్రకటించారు. కొందరు మళ్లీ రాష్ట్రాన్ని కలుపుతామనడంపై స్పందిస్తూ, ఇదేమైనా పాతాళ భైరవి సినిమానా? అని ఎద్దేవా చేశారు. పీయుష్ గోయల్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రధానైతే పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యమన్నారు. హైదరాబాద్‌కు మజ్లిస్ పార్టీయే ప్రధాన సమస్యని కిషన్‌రెడ్డి అన్నారు. హరిబాబు మాట్లాడుతూ సీమాంధ్రకు ప్యాకేజీ బీజేపీ కృషేనని చెప్పారు. -
పొత్తు లేదోచ్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకట నతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వా తావరణం వేడెక్కింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యన పొత్తులు ఉంటాయన్న ఊహా గానాలకు ఆయన శనివారం తెర దించా రు. తెలంగాణ రాష్ట్రం ప్రకటన తర్వాత ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని.. లేదంటే పొత్తులతో పోటీ చేస్తాయన్న ప్రచారం కొ నసాగింది. ఇప్పుడిక దానికి తావు లేదు. ‘‘కాంగ్రెస్‌తో పొత్తులు ఉండవు, రేపటి నుంచి కాంగ్రెస్ పని చెబుతా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వస్తారో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు వెళ్తారో చూ ద్దాం’’ అంటూ తెలంగాణభవన్‌లో కేసీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం కలిగించా యి. కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యన ప్రచ్ఛన్న యు ద్ధం మొదలైనట్లేనన్న చర్చకు తెర లేచింది. మరోవైపు రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ ఒంటరిపోరులో అభ్యర్థులుగా బరిలోకి దిగే ఆశావహుల జాబితా పెరుగుతోంది. ప్రతిష్టాత్మకమే.. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రధాన రాజకీయ పక్షాలకు, చాలా మంది నేతలకు ప్రతిష్టాత్మకంగా మారా యి. ఈ ఎన్నిలలో అమీ తుమీ తేల్చుకునేందుకు వారంతా సిద్ధ పడుతున్నారు. ఇప్పటి వరకు పొత్తుల ప్రచారం వారిని కలవరపెట్టింది. కొద్ది రోజులుగా నెలకొంటున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్, టీ ఆర్ఎస్ వర్గాలను గందరగోళానికి గురి చేశాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒంటరిపోరుకే పచ్చజెండా ఊపడంతో ఆశావహులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. పార్టీ శ్రేణులలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతోపాటు జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి నేతలు సిద్ధమవుతున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల సంఖ్య నాలుగుకు చేరగా, మరో రెండు నియోజకవర్గాలకు కూడా పార్టీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. మిగిలింది మూడు నియోజకవర్గాలే. మూడు సీట్లపైన సస్పెన్స్ పొత్తుల మాట పక్కన బెడితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలుపుకుని ఆరు నియోజకవర్గాలలో టీఆర్ఎస్ అ భ్యర్థుల జాబితా ఇప్పటికే ఖరారైనట్లే. 2009 ఎన్నికలలో ఎల్లారెడ్డి నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి ఒక్కడే టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. జుక్కల్, కామారెడ్డి, బాన్సువాడ నుంచి గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనంతరం టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు సిట్టింగ్‌లుగా మళ్లీ అవకాశం ఉంది. ఆర్మూరు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేరు ఏడాది క్రితమే ప్రకటించగా, 10 రోజుల క్రితం బాల్కొండకు వేముల ప్రశాంత్‌రెడ్డి పేరును ప్రకటించారు. బోధన్ నుంచి గతంలో ఓడిపోయిన ఎండీ షకీల్‌కు మళ్లీ అవకాశం ఇస్తారా? లేదా? తేలాల్సి ఉంది. నిజామాబాద్ అర్బన్, రూరల్ ఇన్చార్జులుగా బస్వ లక్ష్మీనర్యయ్య, డాక్టర్ భూపతిరెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే అధికారికంగా వారి అభ్యర్థి త్వాలు ఖరారు కావాల్సి ఉంది. ఇదిలా వుంటే ముందుగా ప్రకటించిన విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఇదివరకే ప్రకటించిన, ప్రకటించనున్న అభ్యర్థులకు బెర్త్‌లు ఖరారైనట్లేనా? లేక చివరి నిముషంలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? అన్న చర్చ కూడ జరుగుతోంది. -
నేడు టీఆర్ఎస్ అభ్యర్థులు తొలి జాబితా విడుదల
-
.‘తీన్మార్’తో తికమక
నియోజకవర్గ స్థాయి నేతలకు స్థానిక ఎన్నికలు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. తమకు సహకరించే వారు స్వయంగా ఎన్నికలను ఎదుర్కొంటుండడంతో గ్రామాల్లో రాజకీయ వ్యూహం ఎలా అనేది వీరికి అంతుపట్టడంలేదు. ఇదే సమయంలో తమను నడిపించే వారు కిమ్మనకపోవడం... బాగోగులు చూసుకోకపోవడంతో ఎన్నికల పోరులో ఎలా అడుగులేయూలో తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు డీలా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వస్తే లీడర్లు బరిలో ఉంటారు. వారి గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడతారు. అన్ని రకాలుగా పోరాటం సాగిస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, చైర్మన్... ఈ ఎన్నికలు వస్తే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు బరిలో ఉంటారు. వారిని లీడర్ నడపిస్తారు... గెలిచేవారిని బరిలోకి దించుతారు.. అలిగిన వారిని బుజ్జగిస్తారు. బరిలో దించినవారిని గెలిపించుకుంటారు. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం చేయాల్సినవన్నీ చేస్తారు. రాజకీయ పార్టీలకు సంబంధించి లీడర్, కేడర్‌కు ఉండే ఎన్నికల సంబంధం ఇది. ఇప్పటివరకు ఏ ఎన్నిక అయినా ఇలాగే జరిగింది. ఇప్పుడు ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికలు రావడంతో పరిస్థితి మారింది. లీడర్... కేడర్... ద్వితీయ శ్రేణి... గ్రామ స్థాయి నాయకులు ఎవరి ఎన్నికల్లో వారు తలమునకలయ్యారు. సొంత గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ప్రత్యేకమైనదే కావడంతో ఒక్కొక్కరు ఒక్కో గెలుపు వ్యూహంతో ముందుకుపోతున్నారు. ఈ ప్రత్యేక వ్యూహాలతో రాజకీయ పార్టీల్లో స్వతహాగా ఉండే బంధం గతంలో లాగా గట్టిగా కనిపించడం లేదు. ఇదీ.. వరుస ఎన్నికలతో వచ్చిన మార్పును స్పష్టం చేస్తోంది. పెద్ద నేతలకు పరీక్ష ఐదేళ్లకోసారి వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు, అందులో ప్రాతినిధ్యం వహించే ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకమే. నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో తమ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడంతోపాటు ప్రత్యర్థి వర్గాలకు చెందిన వారిని దగ్గర చేసుకునే వ్యూహంతో ఇవి జరుగుతాయి. క్షేత్రస్థాయి నాయకులు సైతం... ఏ పార్టీ వారు తమ నాయకుడికి మద్దతు తెలిపారనే అంశంతో సంబంధం లేకుండా పని చేస్తారు. అంతిమంగా తమ పార్టీ విజయం కోసం పని చేస్తారు. ఇది నియోజకవర్గ స్థాయి నేతలకు బాగా ఉపకరిస్తుంది. ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. నియోజకవర్గ స్థాయి నేతలకు ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తమకు సహకరించే వారు స్వయంగా ఎన్నికలను ఎదుర్కొంటుండడంతో గ్రామాల్లో రాజకీయ వ్యూహం ఎలా అనేది వీరికి అంతుపట్టడంలేదు. ఎన్నికల్లో కీలకమైన రాజకీయ, ఆర్థిక అంశాలను కిందిస్థాయి వరకు చేరే వేసే క్రీయాశీల నాయకులు ఇప్పుడు స్వయంగా పోటీలో ఉండడం... వారి పనిలో వారు నిమగ్నం కావడం ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో తమను నడిపించే వారు కిమ్మనకపోవడం... బాగోగులు చూసుకోకపోవడంతో ఎన్నికల పోరులో ఎలా అడుగులేయూలో తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు డీలా పడుతున్నారు. క్షేత్రం మారింది.... రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు ఈసారి కొత్త రూపును సంతరించుకున్నాయి. ఒక్క ఎన్నిక వస్తేనే పండుగ వాతావరణం కనిపించే గ్రామాల్లో ఇప్పుడు మూడు ఎన్నికలు వచ్చినా... ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కంటే నెల ముందుగా ... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఈ మేరకు గ్రామాల్లో రాజకీయ సందడి మరింత పెరగాల్సి ఉండగా... దీనికి భిన్నంగా ఉంది. నియోజకవర్గ స్థాయి నేతలు ఇప్పుడు గ్రామాలు, మునిసిపల్ ఎన్నికలు జరిగే ఊర్లకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. స్థానిక, మునిసిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై పోటీ చేయాల్సి ఉంటుంది. పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసే బీ-ఫారాన్ని ఒక స్థానంలో ఒకరికే ఇస్తారు. అభ్యర్థిత్వం ఆశించే వారు మాత్రం ఎక్కువ మంది ఉంటారు. దీంతో అభ్యర్థిత్వాల ఖరారు అంటేనే... నియోజకవర్గ స్థాయి నాయకులు ఆందోళన పడుతున్నారు. ఒక్కరిని ఖరారు చేస్తే... అభ్యర్థిత్వం ఆశించే వారంతా తిరుగుబాటు చేస్తారు. ఇది సాధారణ సమయాల్లో అయితే పర్వాలేదు. ఎన్నికలు జరిగిన రెండుమూడు నెలలకు వీరంతా శాంతిస్తారు. స్థానిక ఎన్నికలు జరిగిన నెలలోపే సాధారణ ఎన్నికలు వస్తుండడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆభ్యర్థిత్వం ఆశించి నిరాశకు గురైన వారి ఆగ్రహం చల్లారేలోపే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఈ ప్రభావం వీరిపై ఉంటుంది. ఇది ఎన్నికల ఫలితాలను ప్రభావం చేస్తుంది. ఈ పరిస్థితిని తల్చుకుని నియోజకవర్గ స్థాయి నేతలు స్థానిక సమరానికి దూరంగా ఉంటున్నారు. అంతా కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే అంటున్నారు. ఇది గ్రామాల్లోని వారికి ఆగ్రహం కలిగిస్తోంది. ఇన్నాళ్లు పనిచేస్తున్న వారిలో సమర్థులను గుర్తించే స్థాయి నియోజకవర్గ స్థాయి నేతకే ఉంటుంది. పని చేసేవారిని గుర్తించి అభ్యర్థిత్వం ఖరారు చేసే సమయంలో ఇలా తప్పించుకోవడం ఏమిటనే ప్రశ్నలు నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారుు -
పార్టీ బలోపేతంపై వైఎస్సార్సీపీ దృష్టి
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ దృష్టి సారించింది. ఇందుకు కమిటీలను ఏర్పాటు చేసి అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొమ్ముల వినాయక్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రింట్మీడియా ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో గ్రామ, బూత్, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నెలాఖరులోగా అన్ని కమిటీలను పూర్తి చేసే బాధ్యత మండల కన్వీనర్లకు అప్పగించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో వైఎస్సార్ అభిమానులను ఏకం చేసి.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ పోరాడుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. పేద ప్రజల కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. అత్యవసర సమయంలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 108 పథకాన్ని సైతం నీరుగారుస్తోందన్నారు. జిల్లాలోని పసుపు రైతులు అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని, వారికి కనీస మద్దతు ధర రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్‌కుమార్, ఆదిలాబాద్ మండల కన్వీనర్ గోపాల్, పట్టణ కన్వీనర్ ఇస్లామొద్దీన్, యువజన విభాగం నాయకుడు వసీం ఖాద్రీ, బీసీ సెల్ నాయకుడు కృష్ణమీనన్ యాదవ్, నాయకులు మోయినొద్దీన్, నామ్‌దేవ్ పాల్గొన్నారు. -
పోటీ చేసే నాయకులేరీ!
కర్నూలు, న్యూస్‌లైన్: శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. నాయకులు, కార్యకర్తల నుంచి చేపట్టిన అభిప్రాయ సేకరణకు మొదటి రోజు స్పందన కొరవడింది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు ఏఐసీసీ నుంచి రాహుల్‌గాంధీ దూతగా కర్ణాటక రాష్ట్రం ఉడిపి ఎమ్మెల్యే ప్రమోద్ మద్వరాజ్, పీసీసీ నుంచి జిల్లా ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ తిప్పేస్వామి మంగళవారం కర్నూలుకు వచ్చారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులు, కార్యకర్తలతో జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్యతో కలిసి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను విడివిడిగా కలిసి అభిప్రాయాలను సేకరించారు. నియోజకవర్గాల వారీగా గుర్తించిన నాయకులను డీసీసీ కార్యాలయానికి రావాల్సిందిగా పిలుపు వెళ్లినప్పటికీ స్పందన కొరవడింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, మునిసిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, జిల్లా పార్టీ కార్యవర్గ ప్రతినిధులు, పార్టీ సీనియర్లను ఆహ్వానించారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మినహా పార్టీ ముఖ్యులు ఎవరూ కూడా హాజరు కాలేదు. ఎమ్మిగనూరులో ప్రస్తుతం వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నందున అందుకు ధీటైన అభ్యర్థి ఎవరున్నారని ఆరా తీశారు. ఎమ్మిగనూరు నుంచి రుద్రగౌడ్, సూర్యనారాయణతో పాటు మరికొంత మంది కార్యకర్తలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే కోడుమూరులో కోట్ల అనుచరుడు మురళీకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, రేపల్లె సూర్యచంద్ర తదితరులు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట హాజరై వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతూ దరఖాస్తులు ఇచ్చుకున్నారు. శాసనమండలి సభ్యుడు సుధాకర్‌బాబు అనుచరులు కొంతమంది హాజరై కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఎస్సీలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. డీసీసీ తరఫున సర్దార్‌బుచ్చిబాబు మాత్రమే హాజరై తన వాదనను చెప్పుకున్నారు. అలాగే కర్నూలు నగరానికి సంబంధించి మైనార్టీ నాయకులు సలాం, నౌషద్, సలీం, చున్నుమియ్య తదితరులు కర్నూలు సీట్‌ను మైనార్టీలకు కేటాయించాలని కోరారు. మంత్రి టీజీ వెంకటేష్ అనుచరులు ఎవరూ మొదటి రోజు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 9వతేదీ వరకు డీసీసీ కార్యాలయం నుంచే నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని వారు సమీక్షించనున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న బృందానికి ఈనెల 13వ తేదీన నివేదిక ఇస్తున్నట్లు పరిశీలకులు వెల్లడించారు. -
సమైక్యనాదమే జగన్నినాదం
ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యనాదమే జగన్నినాదమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులోని రిలే దీక్ష శిబిరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు నూకసాని బాలాజీ, తూమాటి మాధవరావు, ఉన్నం వీరాస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఇరుప్రాంతాలు తీవ్రంగా నష్టపోయి అభివృద్ధి కుంటుపడుతుందని తెలిసినా మొండిగా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడటం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికార దాహంతో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ బిల్లు చర్చకన్నా ముందే అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ కోరినా.. కాంగ్రెస్, టీడీపీలు మొద్దు నిద్ర వీడకపోవడం దారుణమన్నారు. దీక్షలో 16 మంది కూర్చున్నారు. కనిగిరిలో చేపట్టిన రిలే దీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మలతోపాటు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు వై.నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముక్కలైతే అభివృద్ధి కల్ల అన్నారు. సంక్షేమ రాజ్యం కోసం జనం ఎదురుచూస్తుంటే సంక్షోభ రాజ్యాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కనిగిరిలో 9 మంది దీక్ష చేపట్టారు. వీరితోపాటు జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, యువజన విభాగం నాయకుడు బన్నీ తదితరులు పాల్గొన్నారు. పామూరులో 8 మంది, వెలిగండ్లలో 16 మంది రిలే దీక్షలో కూర్చున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పెద్దదోర్నాల నటరాజ్ సెంటర్లో రిలే దీక్షను నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర కడగండ్లు ఎదుర్కొంటున్న పశ్చిమ ప్రకాశం రైతులు వెలిగొండ ప్రాజెక్టు వస్తేనైనా తమ బతుకులు బాగుపడతాయని గంపెడాశెతో ఉన్నారన్నారు. కానీ రాష్ట్ర విభజన పేరుతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఆ నమ్మకాన్ని సైతం వమ్ము చేస్తున్నాయని, ప్రతి రైతు సమైక్యాంధ్రకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక్కడ 12 మంది దీక్షలో కూర్చున్నారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి సమైక్యాంధ్ర దీక్షను ప్రారంభించారు. మొత్తం పది మంది దీక్ష చేపట్టారు. గిద్దలూరు తహసీల్దారు కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి రిలే దీక్షను ప్రారంభించారు. మొత్తం 12 మంది దీక్ష చేపట్టారు. దర్శిలో తొలిరోజు నలుగురు దీక్ష చేపట్టగా..జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కుమ్మిత అంజిరెడ్డి దీక్షలను ప్రారంభించారు. ఒంగోలులో వైఎస్సార్ సీపీ బీసీసెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, బీసీ సెల్ నగర కన్వీనర్ బొప్పరాజు కొండలరావు, బీసీ విభాగం రాష్ట్ర నాయకులు పొగర్త చెంచయ్య, బూర్సు మాలకొండయ్యతో కలిపి మొత్తం 25 మంది దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించగలరన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు సమైక్యాంధ్రపై నాటకాలాడుతూ ప్రజలను దారుణంగా మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల దళిత విభాగం కోఆర్డినేటర్ పాలడుగు విజేంద్ర బహుజన్, వైఎస్సార్ సీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, గోవర్థన్‌రెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, గంగాడ సుజాత తదితరులు ప్రసంగించారు. -
స్వల్ప లాభాలతో సరి
సోమవారం వెలువడనున్న అసెంబ్లీల ఎన్నికల ఫలితాలపై దృష్టిపెట్టిన మార్కెట్లు వారాంతం రోజున కొంత మందగించాయి. వెరసి సెన్సెక్స్ కేవలం 130 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. చివరకు 39 పాయింట్లు లాభపడి 20,997 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 19 పాయింట్లు పెరిగి 6,260 వద్ద స్థిరపడింది. నవంబర్ నెలకు శుక్రవారం రాత్రి వెలువడనున్న యూఎస్ ఉద్యోగ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారని నిపుణులు పేర్కొన్నారు. హౌసింగ్, తయారీ రంగం, ఉద్యోగ గణాంకాల వంటి అంశాల ఆధారంగా ఈ నెల 17-18న సమావేశం కానున్న ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీంతో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంబించారని నిపుణులు తెలిపారు. కాగా, ఎఫ్ఐఐల పెట్టుబడులు కొనసాగాయి. గురువారం రూ. 1,152 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 864 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 744 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సెన్సెక్స్‌లో టాటా పవర్ దాదాపు 6% జంప్‌చేయగా, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, హీరో మోటో, ఓఎన్జీసీ 3.6-1.3% మధ్య లాభపడ్డాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, హెచ్‌యూఎల్, భారతీ 2-1% మధ్య నష్టపోయాయి. చక్కెర షేర్లకు డిమాండ్ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అధ్యక్షతన ఏర్పడ్డ మంత్రివర్గ బృందం(జీవోఎం) చక్కెర మిల్లులకు చేసిన బెయిలవుట్(ప్యాకేజీ) ప్రతిపాదన నేపథ్యంలో షుగర్ షేర్లు లాభాలతో తీపెక్కాయి. ప్యాకేజీలో భాగంగా చెరకు రైతుల బకాయిల చెల్లింపుల కోసం చక్కెర మిల్లులకు రూ. 7,200 కోట్లమేర బ్యాంకులు రుణాలందించేలా జీవోఎం ప్రతిపాదించింది. ఈ రుణాలకు 12% వడ్డీ మినహాయింపు(ఇంటరెస్ట్ సబ్వెన్షన్) పథకాన్ని అమలు చేస్తారు. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా రుణాల పునర్వ్యవస్థీకరణ, పెట్రోల్‌లో 10% వరకూ ఇథనాల్‌ను మిక్స్ చేసేందుకు అనుమతించడం వంటి సూచనలు చేసింది. దీంతో షుగర్ షేర్లు ఓధ్ షుగర్, శక్తి, బజాజ్ హిందుస్తాన్, ధంపూర్, ద్వారకేష్, శ్రీ రేణుకా తదితరాలు 12-4% మధ్య దూసుకెళ్లాయి. -
ప్రజాస్వామ్యానికి శ్రేయోదాయకం
ముంబై: ఇటీవల ముగిసిన వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో యువ ఓటర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని గవర్నర్ శంకర నారాయణన్ పేర్కొన్నారు. స్థానిక రవీంద్ర నాట్యమందిర్లో బుధవారం జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిజం, శాసనసభ, న్యాయవ్యవస్థ, పరిపాలనా రంగాలలో తమ సత్తా చాటుకున్న వారికి ఆర్యచాణక్య పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత భారీసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం ప్రజాస్వామ్య వికాసానికి దోహద పడుతుందన్నారు. గడచిన 66 సంవత్సరాల కాలంలో దేశంలోప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమైందన్నారు. పాలనారంగంలోకి యువత అడుగుపెడితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పరిఢవిల్లుతుందన్నారు. కాగా ఈ పురస్కారాలను అందుకున్నవారిలో అమరావతి జిల్లాలోని అచలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బచ్చు కడూ, లోక్మత్ సంపాదకుడు సురేష్ ద్వాదశివార్,పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కమిషనర్ శ్రీకర్ పరదేశి, అడ్వొకేట్ దారియస్ ఖంబాటా తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిక్కిం గవర్నర్ శ్రీనివాస్ పాటిల్, స్పీకర్ దిలీప్‌వాల్సే పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
1, 2 తేదీల్లో ఢిల్లీలో నితీశ్‌కుమార్ ప్రచారం
న్యూఢిల్లీ: జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వచ్చేనెల 1, 2వ తేదీల్లో రాజధాని ఢిల్లీలో ప్రచారం చేయనున్నారు. 30నే నగరానికి చేరుకోనున్న నితీశ్ పార్టీ కార్యకర్తల సమావేశంతోపాటు తర్వాతి రెండ్రోజులపాటు నిర్వహించే బహిరంగ సభల్లో పాలొంటారని జేడీయూ నేత ఒకరు తెలిపారు. 2008లో ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన జేడీయూ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి కూడా 11 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ ఎలాగైనా బోణీ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఢిల్లీలో బీహారీలతోపాటు పూర్వాంచల్‌కు చెందినవారి ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నాయి. దీంతో బీహార్, పూర్వాంచలీయుల ఓట్లతోపాటు ఉత్తరాది ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు నితీశ్ ప్రచారం ఉపకరిస్తుందని ఆ పార్టీ స్థానిక నేతలు భావిస్తున్నారు. -
భోపాల్‌లో ఓటు వేసిన సుష్మా స్వరాజ్