రమణ్‌సింగ్
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాషాయ జెండానే రెపరెపలాడనుందని ఒక ఒపీనియన్ పోల్ తేల్చింది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రమణ్‌సింగ్ నేతృత్వంలో బీజేపీ విజయం సాధించనుందని సీఎన్‌ఎక్స్ పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఆ ఎన్నికల్లో బీజేపీ 50, కాంగ్రెస్ 30, అజిత్‌జోగీ నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్( జోగి), బీఎస్పీ కూటమి 9 సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇతరులు ఒక స్థానంలో గెలవొచ్చని పేర్కొంది.
ఈ ఎన్నికల్లో బీజేపీకి 42.22%, కాంగ్రెస్‌కు 37.21%, జోగి, మాయావతి కూటమికి 6.38%, ఇతరులకు 14.21% ఓట్లు రావచ్చని సీఎన్‌ఎక్స్ సర్వేలో వెల్లడైంది. నవంబర్ 12, 20 తేదీల్లో రెండు దశల్లో చత్తీస్ గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి 49, కాంగ్రెస్‌కు 39 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో రమణ్‌సింగ్ ప్రజాదరణకు తిరుగులేదని ఈ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 40.71% రమణ్ సింగ్‌నే మళ్లీ సీఎంగా కోరుకున్నారు. కాంగ్రెస్ నేత భూపేశ్ భాగెల్‌కు 19.2% మద్దతిచ్చారు. అభివృద్ధి, నిరుద్యోగం, పెట్రో ధరలు ఈ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment