Opinion Poll
-
USA presidential election 2024: ఒపీనియన్ పోల్‌లో ట్రంప్ ముందంజ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిదన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడింది. మాజీ ప్రత్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మళ్లీ పోటీ పడుతున్నారు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ఏమిటన్నదానిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక ఓపీనియన్ పోల్ నిర్వహించింది. ఏడు కీలక రాష్ట్రాల్లో సర్వే చేయగా, ఏకంగా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ వైపు మొగ్గు కనిపించింది. తదుపరి అధ్యక్షుడిగా ట్రంప్‌ను ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల పట్ల జనం అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. -
Times Now ETG Survey on Elections 2024: మళ్లీ ఎన్డీఏనే!
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొడుతుందని టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ ఒపీనియన్ పోల్ బుధవారం వెల్లడించింది. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏకంగా 323 సీట్లొస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమి 163 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి 57 స్థానాలు దక్కించుకుంటాయని వెల్లడించింది. ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనైతే ఆ పార్టీ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేస్తుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 354 సీట్లు రావడం తెలిసిందే. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు 93 సీట్లు రాగా ఇతరులకు 96 దక్కాయి. -
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉందని ఈటీజీ సంస్థతో కలిసి టైమ్స్ నౌ చేపట్టిన ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నుంచి 10 స్థానాలు గెలిచే వీలుందని తెలిపింది. బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయని పేర్కొంది. బీజేపీ కూడా కనిష్టంగా మూడు, గరిష్టంగా 5 స్థానాలు దక్కించుకునే వీలుందని తెలిపింది. వాస్తవానికి బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.92 శాతం ఓట్లు సాధిస్తే, 2023లో 13.9 శాతం తెచ్చుకుంది. 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్‌కు ఓటింగ్ 10.97 శాతం పెరిగింది. బీఆర్ఎస్కు ఓట్లు 9.52 శాతం తగ్గాయి. -
తాజా సంచలన సర్వే.. తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని ఇండియా టీవీ సర్వే తేల్చిచెప్పింది. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను విడుదల చేసిన ఇండియా టీవీ.. బీఆర్ఎస్కు 70, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 88, కాంగ్రెస్‌కు 19, ఎంఐఎం 7, ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. -
కాంగ్రెస్‌కే జై కొడుతున్న కన్నడిగులు.. సీఎంగా మాత్రం ఆయనే కావాలట..!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో మే 10 న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఈసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకుంటున్నారు. స్థానిక పార్టీ జేడీఎస్ కూడా సత్తా చాటి కింగ్ మేకర్‌గా అవతరిస్తుందనే అంచనాలున్నాయి. కానీ సీఓటర్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో మాత్రం ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారం చేజిక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. అధికార బీజేపీ ప్రభుత్వంపై 57 శాతం మంది తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పేర్కొంది. సీఎం బసవరాజ్ బొమ్మై పనితీరు పేలవంగా ఉందని సర్వేలో పాల్గొన్న 47శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 26.8 శాతం మంది ఆయన పాలన బాగుందన్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌కు 115-127 సీట్లు, బీజేపీకి 68-80, జేడీఎస్‌కు 23-35 సీట్లు వస్తాయని సీఓటర్ సర్వే తెలిపింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం (29.1 శాతం) మౌలిక సదుపాయాల కల్పన(21.5శాతం)పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎంగా ఆయనే.. ఈ ఒపీనియన్ పోల్‌లో కర్ణాటక తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందనే విషయంపైనా ఓటింగ్ నిర్వహించారు. 39.1శాతం మంది కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకే జై కొట్టారు. బసవరాజ్ బొమ్మై కావాలని 31.1 శాతం మంది తెలిపారు. హెచ్డీ కుమారస్వామికి 21.4 శాతం మంది ఓటేశారు. ఇక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు కేవలం 3.2 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ చాలా కాలంగా బలమైన పార్టీగా ఉంటోంది. 2008 ఎన్నికల్లో ఓడిపోయి 80 సీట్లే గెలిచిన ఆ పార్టీ.. 2013లో తిరిగి పుంజుకుని 122 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. 2018లో మళ్లీ 80 సీట్లే గెల్చుకుంది. అయినా జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఏడాదికే ఈ సర్కార్ కూలిపోవడంతో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. మరోవైపు మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించారు. తనకు 80 ఏళ్లు దగ్గరపడుతున్నందున ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం మాత్రం తనవంతు కృషి చేస్తానన్నారు. కాగా.. ఈసారి కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ఇటీవలే కన్నడ వార్త పత్రిక సర్వేలో తేలిందని వార్తలొచ్చాయి. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అది ఫేక్ అని తేలింది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం బసవరాజ్‌బొమ్మైతో పాటు ఇతర బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఫేక్ సర్వేపై మండిపడ్డారు. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
బంజారాహిల్స్ రోడ్ నెం.45 ట్రాఫిక్ డైవర్షన్: కొనసాగించాలా..? ఎత్తేయాలా.?
బంజారాహిల్స్: ట్రాఫిక్ డైవర్షన్ వల్ల మీరు ఆనందంగా ఉన్నారా..? ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? ఈ డైవర్షన్‌ను ఇలాగే కొనసాగించాలా..? ఎత్తేయాలా..? అంటూ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ డైవర్షన్‌పై వాహనదారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గత నెల 24న రోడ్ నెం.45లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పలు చోట్ల వాహనాల మళ్లింపు, ‘యూ’ టర్న్‌లు, జంక్షన్ల మూసివేత, అంతర్గత రహదారుల వినియోగం తదితర చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇవి కొంత మందికి ఇబ్బంది కలిగిస్తుండగా మరి కొందరు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, పోలీసులు క్షేత్ర స్థాయిలో నేరుగా వాహనదారుల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి వాహనదారులతో ముచ్చటిస్తున్నారు. ఈ రహదారులపై రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే వాహనదారులను గుర్తించి వారి నుంచే అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45, రోడ్ నెం. 36, ఫిలింనగర్ రోడ్ నెం.1, జర్నలిస్టు కాలనీ, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రతినిధులు వాహనదారులను ట్రాఫిక్ డైవర్షన్‌పై పలు కోణాల్లో ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడుతున్నారు. వీటిని క్రోడీకరించి నగర పోలీస్ కమిషనర్‌కు నివేదిక అందించేందుకు సిద్ధమవుతున్నారు. నేడో, రేపో కమిషనర్‌కు ట్రాఫిక్ వెస్ట్‌జోన్ డీసీపీ ఈ నివేదికను అందించనున్నారు. మరో వైపు డ్రోన్ ద్వారా ట్రాఫిక్ రాకపోకలను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టకముందు, చేపట్టిన తర్వాత అనే రెండు కోణాల్లో ప్రస్తుతం సర్వే జరుగుతోంది. వాహనదారులు ఎంత దూరం ప్రయాణించాల్సి వస్తున్నది..? డైవర్షన్ వల్ల ఎంత సమయం ఆదా అవుతున్నది.. తదితర వివరాలను కూడా నివేదిక రూపంలో కమిషనర్‌కు అందించనున్నారు. ట్రాఫిక్ పోలీసులు క్షేత్ర స్థాయి పరిశీలనతో కూడిన నివేదికను పరిశీలించిన తర్వాత నగర పోలీస్ కమిషనర్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ డైవర్షన్‌పై ఓ నిర్ణయాన్ని వెలువరించనున్నారు. కొనసాగించాలా..? వద్దా..? అన్నది వాహనదారుల అభిప్రాయాల ద్వారానే నిర్ణయించనున్నారు. -
Twitter: ఆయన పునరాగమనం కావాలా? వద్దా?
శాన్ఫ్రాన్సిస్కో: ఎలన్ మస్క్ మళ్లీ ఆసక్తికర చర్చ వైపు దారి తీశాడు. ఒకవైపు ట్విటర్ ఉద్యోగులు కంపెనీని వీడుతున్నప్పటికీ.. తనకేం ఫరక్ పడదని, ఉత్తమ ఉద్యోగులు తన వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు పరోక్ష చర్యల ద్వారా అమెరికా రాజకీయాలను కదిలిస్తున్నాడు. ట్విటర్ వేదికగా ఈ ఉదయం ఆయన మరో ట్వీట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరాగమనం కావాలా? వద్దా? అంటూ ఓ పోల్ నిర్వహించాడు ఈ అపరకుబేరుడు. అయితే అది ట్విటర్ వరకే అనుకుంటే పొరపాటే!. ట్రంప్ తాజాగా 2024-అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ చేసిన ట్వీట్ పరోక్షంగా ఆయన రాజకీయ పునరాగమనం గురించి అని అర్థం చేసుకోవచ్చు!. 2020 జనవరిలో క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్‌పై ట్విటర్ శాశ్వత నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఎలన్ మస్క్ ట్విటర్‌ను చేజిక్కించుకున్న తర్వాత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించాడు. ఈ క్రమంలోనే ట్రంప్ రీఎంట్రీ ఉండొచ్చనే సంకేతాలు అందించాడు కూడా. అయితే.. ట్విటర్‌ను మస్క్ టేకోవర్ చేయడంపై అభినందించిన ట్రంప్.. తిరిగి ట్విటర్‌లోకి వస్తారా? అనే విషయంపై మాత్రం సరైన స్పందన ఇవ్వలేదు. Reinstate former President Trump — Elon Musk (@elonmusk) November 19, 2022 తాజాగా.. జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలోనూ ట్రంప్ ట్విటర్ రీ-ఎంట్రీపై జోరుగా చర్చ నడిచింది. ఈ క్రమంలో.. తాజాగా ఎలన్ మస్క్ ట్రంప్ ట్విటర్ పునరాగమనం ఉండాలా? వద్దా? అనే అంశంపై పోలింగ్ నిర్వహించాడు. దీనికి అవును అనే స్పందనే ఎక్కువగా లభిస్తోంది. Kathie Griffin, Jorden Peterson & Babylon Bee have been reinstated. Trump decision has not yet been made. — Elon Musk (@elonmusk) November 18, 2022 ట్విటర్ నిషేధం అనంతరం సొంతంగా ట్రూత్‌సోషల్ యాప్ ప్రారంభించాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ట్విటర్లో ఆయనకు దక్కిన ఫాలోయింగ్కంటే(బ్యాన్ నాటికి 80 మిలియన్ ఫాలోవర్స్).. సొంత ప్లాట్‌ఫారమ్‌లో దక్కిన ఆదరణ చాలా చాలా తక్కువ. ఒకవేళ ఆయన ట్విటర్ అకౌంట్‌ను గనుక పునరుద్ధరిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆయన ప్రయత్నానికి బాగా కలిసొస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పోల్ నిర్వహణ ముందర.. ట్విటర్ శాశ్వత నిషేధం విధించిన మరికొన్ని అకౌంట్లను పునరుద్ధరించేందుకు సుముఖంగా ఉన్నట్లు, ట్విటర్ చేసే పని స్వేచ్ఛవాదులకు ఫ్రీ హ్యాండ్ అని అర్థం వచ్చేలా వరుస ట్వీట్లు చేశాడు ఎలన్ మస్క్. -
గుజరాత్ మళ్లీ బీజేపీదే.. ఆప్‌కు సింగిల్ డిజిటే!
అహ్మదాబాద్: గుజరాత్లో అధికార పీఠాన్ని మళ్లీ బీజేపీ దక్కించుకోనుందని ఏబీపీ న్యూస్–సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఆదివారం వెల్లడించింది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ సంవత్సరం ఆఖర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి 135–143 సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ తెలియజేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకటి నుంచి రెండు సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. ప్రతిపక్ష కాంగ్రెస్ 36–44 స్థానాలు గెలుచుకోనుందని వివరించింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పట్ల ఓటర్లు సానుకూలత వ్యక్తం చేస్తున్నారని, ఆయన మరోసారి సీఎం కావాలని కోరుకుంటున్నారని ఒపీనియన్ పోల్‌లో తేలింది. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
మణిపూర్‌లో ఆ పార్టీదే గెలుపు.. ఎందుకంటే?
ఇంఫాల్: మణిపూర్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని రిపబ్లిక్ టీవీ- పీఎంఏఆర్‌క్యూ ప్రిపోల్ సర్వే అంచనా వేసింది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ 31-37 సీట్లు (39.2 శాతం ఓట్లు) గెల్చుకునే అవకాశం ఉందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి 13-19 సీట్లు (28.7 శాతం ఓట్లు) దక్కుతాయని తెలిపింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 3 నుంచి 9, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఒకటి నుంచి 5 స్థానాలను కైవసం చేసుకుంటాయని సర్వేలో వెల్లడైంది. ఎన్పీపీకి 14.2, ఎన్పీఎఫ్ 6.4, ఇతరులు 11.5 శాతం ఓట్లు దక్కించుకుంటారని అంచనా కట్టింది. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు ప్రోత్సహించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు మాత్రమే నెగ్గిన బీజేపీ బలం ఈ ఐదేళ్ల కాలంలో 29కి పెరిగింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. (చదవండి: పశ్చిమ యూపీ బీజేపీకి కత్తిమీద సామే!) నిరుద్యోగమే అతిపెద్ద సమస్య మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 59 శాతం మంది, ఫర్వాలేదని 29 శాతం, బాలేదని 12 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సమస్య ఉపాధిలేమి అని ఎక్కుమంది(29 శాతం) తెలిపారు. తాగునీటి కొరత(24 శాతం), అస్తవ్యస్థ రహదారులు(17 శాతం), అవినీతి(5 శాతం) వంటి సమస్యలు కూడా ఉన్నాయని వాపోయారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు ఎన్ బైరాన్ సింగ్ పేరును ఎక్కువ మంది(36 శాతం) చెప్పారు. ఇబోబి సింగ్(17 శాతం), యుమ్నం జోయ్‌కుమార్ సింగ్(11 శాతం), గైఖేంగమ్(10 శాతం), బిశ్వజిత్(5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. (చదవండి: ఆ రోజు వద్దు.. మరో రోజు పోలింగ్ పెట్టండి ప్లీజ్) మార్చి 10న ఎన్నికల ఫలితాలు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, తొలి విడత పోలింగ్ తేదీని మార్చాలని ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ (ఏఎంసీఓ) కోరుతోంది. (చదవండి: ఎన్నికల రాష్ట్రంలో వరుస గ్రెనేడ్ దాడులు.. కలకలం) -
మీ దృష్టిలో విలువైంది ఏదో చెప్పండి
ఈరోజుల్లో మనిషి కంటే మనీకే విలువ ఎక్కువ. రిలేషన్స్ కంటే అవసరాలకే ప్రాధాన్యం ఉంటోంది. మనిషి వాస్తవంలో బతుకుతోంది తక్కువ!. స్మార్ట్ ఫోన్లో.. సోషల్ మీడియాలోనే సగం కంటే ఎక్కువ జీవితం గడిచిపోతోంది. అఫ్కోర్స్.. ఇవన్నీ చర్చించుకోవడానికి బాగానే అనిపించొచ్చు. కానీ, వాస్తవ ప్రపంచం వేరు. ఒక అంశంపై ఎవరి ఒపీనియన్ వాళ్లది. వాళ్లకు అనిపించిందే కరెక్ట్!. జనరేషన్లు ముందుకెళ్తున్నా కొద్దీ.. ఈ తీరు మరింత మొండిగా మారుతోంది. మనీ ఆల్వేస్ మ్యాటర్. లాభం వచ్చే పని ఏదైనా సరే!.. చేసుకుంటూ ముందుకెళ్లడమే!. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇండియా ఇన్ ఫ్లెక్స్ అనే ట్విటర్ పేజీ రెండు ఆప్షన్స్‌తో ఈమధ్య ఓ పోల్ నిర్వహించింది. ‘1 మిలియన్(పది లక్షల) యూట్యూబ్ సబ్ స్క్రయిబర్స్, పీహెచ్డీ పట్టా.. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ విలువ ఉంటుంది?’ అని ట్విటర్ పోల్ నిర్వహించింది. దేనికి ఎక్కువ ఓట్లు వచ్చి ఉంటాయనుకుంటున్నారు. యస్.. మీరు ఊహించిందే కరెక్ట్. కింద పోల్ ఫలితం చూస్తున్నారుగా.. విద్య కంటే.. ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇంకా పడుతున్నాయి కూడా!. ఇందుకు ఫేమ్, డబ్బు కారణాలు కావొచ్చు. వాళ్ల అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. ఇంతకీ మీ దృష్టిలో విలువైంది ఏంటి?.. ఎందుకో కారణంతో సహా చెబితే మరీ మంచిది!. which of these do you think has more value today? — India in Pixels (@indiainpixels) December 11, 2021 -
కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకిత్తిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. మరో రెండు నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు గల బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్-వామపక్షాలతో కూడిన కూటమి పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గడిచిన రెండేళ్ల వరకు రాష్ట్రంలో ఏమాత్రం ఉనికి కూడా లేని బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సవాలు విసిరింది. ఎవరూ ఊహించిన విధంగా 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే రెండుసార్లు సీఎంగా విజయం సాధించిన ముచ్చటగా మూడోసారి ఆశపడుతున్న మమతకు చెక్ పెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. ఉత్కంఠ పోరులో విజయం ఎవరిది.. ఇప్పటికే టీఎంసీకి చెందిన అనేకమంది కీలక నేతలను తనవైపుకు తిప్పుకుని ఎన్నికలకు ముందే పైచేయి సాధించింది. జంగల్‌మహాల్, నందిగ్రాం వంటి కీలకమైన ప్రాంతాల్లో పట్టున్న సువేందు అధికారి బీజేపీలో చేరడం మమతకు భారీ ఎదురుదెబ్బ లాంటిదే. ఆయనతో పాటు కెబినేట్ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీదీకి హ్యాండ్ ఇచ్చి కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే నేతలు పోతేనేం తమకు ప్రజా మద్దతు ఉందంటూ మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల కాలంలో ప్రవేశపెట్టినే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమను మరోసారి గెలిపిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ సైతం విజయంపై సంచలన ప్రకటనలే చేస్తోంది. ఈ ఎన్నికల్లో టీఎంసీని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని, బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగరేసి తీరుతామని కమళనాథులు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ ఎన్నికలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని ముగించారు. దేశ వ్యాప్తంగా బెంగాల్ ఎన్నికలపై పెద్ద చర్చేసాగుతోంది. ఉత్కంఠంగా సాగుతున్న పోరులో ఎవరు విజయం సాధిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. మమత హ్యాట్రిక్.. ఈ క్రమంలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఓ సంస్థ నిర్వహించిన సర్వే ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. హోరాహోరీగా సాగిన పోరులో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయం సాధిస్తుందని సీఎన్ఎక్స్, ఏబీపీ ఆనంద (ప్రైవేటు సంస్థలు) నిర్వహించిన పబ్లిక్ ఒపినియన్ సర్వేలు తెలిపాయి. టీఎంసీ 146 నుంచి 156 స్థానాల్లో విజయం సాధించి మమత మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని పేర్కొన్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ 113-121 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పాయి. మేజిక్ ఫిగర్ 148 సీట్లు కాగా... కాంగ్రెస్-వామపక్షాల నేతృత్వంలోని కూటమికి 20-28 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేల్చాయి. అయితే మెజార్టీ సంఖ్యకు మమత కొంత దూరంలో నిలిచిపోతే లెఫ్ట్ కూటమి మద్దతుతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. కాగా బెంగాల్ వ్యాప్తంగా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 7 వరకు 8,960 మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వేను వెల్లడించినట్లు సీఎన్ఎక్స్ నిర్వహకులు తెలిపారు. జయలలిత బాటలో మమత.. సీన్ రిపీటవుతుందా -
బెంగాల్లో దీదీ.. తమిళనాడులో డీఎంకేకు పట్టం
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఏబీపీ(ఆనంద బజార్ పత్రిక) న్యూస్, సీ ఓటర్ సర్వే నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. 2021లో పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సర్వే ఫలితాలు ఇలా.. పశ్చిమబెంగాల్: రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. అధికారం నిలుపుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. అయితే, పశ్చిమబెంగాల్ ఓటర్లు మళ్లీ దీదీ మమత వైపే మొగ్గు చూపుతున్నట్లు ఏబీపీ న్యూస్, సీ ఓటరు సర్వేలో తేలింది. 148 సీట్ల మేజిక్ ఫిగర్‌ను దాటి 158 స్థానాల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గెలుపు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. అయితే, 2016లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 211 స్థానాల్లో గెలిచి, క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ సారి ఆ స్థాయి విజయం సాధ్యం కాకపోవచ్చని సర్వే పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేనప్పటికీ.. గణనీయ సంఖ్యలో సీట్లను పెంచుకుంటుందని సర్వే తేల్చింది. గత ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గానూ 289 సీట్లలో పోటీ చేసి, మూడే స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఈ సారి 102 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. అధికార పక్షం నుంచి, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు బీజేపీ దూరంగానే నిలుస్తుందని ఈ సర్వేలో తేలడం విశేషం. కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, వామపక్షాలు 30 సీట్లను గెల్చుకుంటాయని, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి 76 సీట్లు గెల్చుకున్నాయి. ముఖ్యమంత్రిగా మమత బెనర్జీకి రాష్ట్ర ప్రజలు మంచి మార్కులే వేశారు. కేరళ: కేరళలోనూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వంలో వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్) అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. ఈ సంవత్సరం ఏప్రిల్– మే నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 41.6 శాతం ఓట్లను, విపక్ష యూడీఎఫ్ 34.6% ఓట్లను, బీజేపీ 15.3% ఓట్లను సాధిస్తాయని సర్వేలో తేలింది. 2016 ఎన్నికల్లో మొత్తం 140 స్థానాలకు గానూ ఎల్డీఎఫ్ 91 సీట్లను, యూడీఎఫ్ 47 సీట్లను గెలుచుకున్నాయి. ఈ సారి ఎల్డీఎఫ్ 85 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని, యూడీఎఫ్ 53 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ ఒక స్థానంలో గెలుస్తుందని సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ 47% ప్రజాదరణతో విపక్ష కాంగ్రెస్ నేత ఊమెన్‌చాందీ(22%) కన్నా చాలా ముందున్నారు. తమిళనాడు: ఈ సారి ఎన్నికల్లో అధికార పక్షంపై వ్యతిరేకత గణనీయ ప్రభావం చూపనుంది. ఇది డీఎంకేకు అనుకూలంగా పరిణమిస్తుందని ఏబీపీ న్యూస్, సీ ఓటర్ సర్వే పేర్కొంది. అన్నాడీఎంకే, బీజేపీల అధికార ఎన్డీయే కూటమి ఈ ఎన్నికల్లో కేవలం 28.7% ఓట్లతో 98 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. గత ఎన్నికల్లో ఈ కూటమి 43.7% ఓట్లతో 136 సీట్లు గెల్చుకుంది. డీఎంకే, కాంగ్రెస్‌ల యూపీఏ కూటమి 41.1% ఓట్లతో 162 సీట్లు గెల్చుకుని అధికారంలోకి వస్తుందని తేల్చింది. గత ఎన్నికల్లో ఈ కూటమి 39.4% ఓట్లు సాధించి 98 సీట్లు గెల్చుకుంది. ‘చిన్నమ్మ’శశికళ పార్టీ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం’గెలుపు సాధించలేకపోయినా, అన్నాడీఎంకే విజయావకాశాలను దెబ్బతీస్తుందని విశ్లేషించింది. కమల్ హాసన్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేడని తేలింది. తమిళనాడులోని మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 234. పుదుచ్చేరి: 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో ఎన్డీఏ(ఏఐఎన్ఆర్సీ, బీజేపీ, ఏడీఎంకే) స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఏబీపీ న్యూస్ సర్వే తేల్చింది. 30 మంది సభ్యుల అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో ఎన్డీయే 16 సీట్లను, కాంగ్రెస్, డీఎంకేల సెక్యులర్ డెమొక్రటిక్ అలయన్స్(ఎస్డీఏ) 14 సీట్లను గెల్చుకుంటాయని తెలిపింది. గత ఎన్నికల్లో ఎస్డీఏ 17, ఎన్డీఏ 12 సీట్లలో విజయం సాధించాయి. అస్సాం: గత ఎన్నికల్లో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు అంతం పలికి బీజేపీ చరిత్ర సృష్టించి, రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో మొత్తం 126 స్థానాలకు గానూ.. బీజేపీ, అస్సాం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ కూటమి 86 సీట్లు గెల్చుకుంది. ఇందులో బీజేపీ గెల్చిన స్థానాల సంఖ్య 60. తరుణ్ గొగోయి నేతృత్వంలోని కాంగ్రెస్ 26 స్థానాల్లో గెల్చింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏదే విజయమని సర్వే తేల్చింది. 73 – 81 స్థానాల్లో ఎన్డీఏ, 36 – 44 సీట్లలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ గెలుస్తుందని పేర్కొంది. ►పశ్చిమబెంగాల్: మళ్లీ మమత వైపే పశ్చిమబెంగాల్ ఓటర్లు మొగ్గు. మొత్తం 294 స్థానాలకు గాను.. 158 స్థానాల్లో టీఎంసీ విజయం. గత ఎన్నికల్లో మొత్తం 3 స్థానాల్లోనే గెలిచిన బీజేపీ.. ఈ సారి 102 సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్–వామపక్షాలు 30 చోట్ల విజయం. ►కేరళ: సీఎం పినరయి విజయన్ నాయకత్వంలో ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. 140 స్థానాలకు గానూ ఎల్డీఎఫ్ 85 స్థానాల్లో విజయం సాధిస్తుంది. యూడీఎఫ్ 53 సీట్లు, బీజేపీ ఒక సీటు గెలుస్తుంది. ►తమిళనాడు: ఈ సారి ఎన్నికల్లో అధికార పక్షంపై వ్యతిరేకత గణనీయ ప్రభావం చూపనుంది. ఇది డీఎంకేకు అనుకూలంగా పరిణమిస్తుంది. మొత్తం 234 స్థానాల్లో అన్నాడీఎంకే–బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో 98 సీట్లులో.. డీఎంకే–కాంగ్రెస్ కూటమి 162 సీట్లు గెల్చుకుంటుంది. ►అస్సాం: బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏదే విజయం సాధిస్తుంది. మొత్తం 126 స్థానాలకు గాను 73 – 81 స్థానాల్లో ఎన్డీఏ, 36 – 44 సీట్లలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ గెలుస్తుంది. ►పుదుచ్చేరి: కాంగ్రెస్ నేతృత్వంలోని ఎస్డీఏపై ఎన్డీఏ స్వల్ప మెజారిటీ సాధిస్తుంది. 30 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్డీయే 16 సీట్లను, ఎస్డీఏ 14 సీట్లను గెల్చుకుంటాయి. -
ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ సత్తా చాటుతుందని మరోసారి తేలింది. రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లో వైఎస్సార్సీపీ 22 చోట్ల, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధిస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్స్ పేర్కొంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సాధారణ మెజారిటీ సాధించినా 2014తో పోలిస్తే సుమారు 70 సీట్లు కోల్పోయే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 మేజిక్ ఫిగర్ కాగా, బీజేపీ స్వతహాగా 238 చోట్ల, ఎన్డీయే కూటమి 285 సీట్లలో గెలుపొందుతుందని తెలిపింది. 2014లో 282 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి 44 సీట్లను కోల్పోయి 238 స్థానాలను దక్కించుకునే అవకాశముందని తెలిపింది. గతంలో 80 స్థానాలకే పరిమితమైన యూపీయే ఈసారి తన బలాన్ని 126 సీట్లకు పెంచుకునేందుకు అవకాశాలున్నట్లు సర్వే తెలిపింది. అప్పుడు 44 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఈసారీ మూడంకెల స్కోరును అందుకోవడం కష్టమేనంది. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీఆర్ఎస్, ఇతర ప్రాంతీయ పార్టీలు సుమారు 130 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్లు తెలిపింది. 2014 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 16 స్థానాలు, అఖిలేశ్ యాదవ్ నేతృత్వం వహిస్తున్న ఎస్పీ 18 సీట్లు కైవసం చేసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ రాష్ట్రంలో 2014లో 80 స్థానాలకు గాను 71 చోట్ల గెలుపొందిన బీజేపీ ఈసారి 40 చోట్ల మాత్రమే విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది. తెలంగాణలో టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1 చోట గెలుస్తాయని పేర్కొంది. మార్చి 1–7 మధ్య దేశవ్యాప్తంగా 193 లోక్‌సభ స్థానాల్లో నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 20 వేల మంది పురుషులు, 18 వేల మంది మహిళల నుంచి సమాచారం సేకరించారు. రాష్ట్రాల వారీగా అంచనాలు.. యూపీ(80): బీజేపీ 40, ఎస్పీ 18, బీఎస్పీ 16, కాంగ్రెస్ 4, ఆర్ఎల్డీ 1, అప్నా దళ్ 1 పశ్చిమబెంగాల్(42): టీఎంసీ 30, బీజేపీ 12 రాజస్తాన్(25): బీజేపీ 20, కాంగ్రెస్ 5 మధ్యప్రదేశ్(29): బీజేపీ 23, కాంగ్రెస్ 6 గుజరాత్(26): బీజేపీ 26: ఢిల్లీ(7): బీజేపీ 7 మహారాష్ట్ర(48): బీజేపీ 22, శివసేన 10, కాంగ్రెస్ 9, ఎన్సీపీ 7 బిహార్(40): బీజేపీ 15, జేడీయూ 12, ఆర్జేడీ 8, ఎల్జేపీ 3, కాంగ్రెస్ 2 తమిళనాడు(39): డీఎంకే 16, ఏడీఎంకే 12, కాంగ్రెస్ 5, పీఎంకే 2, బీజేపీ 1 కర్ణాటక(28): బీజేపీ 13, కాంగ్రెస్ 13, జేడీఎస్ 2 కేరళ(20): యూడీఎఫ్ 12, ఎల్డీఎఫ్ 7, బీజేపీ 1 -
ఛత్తీస్‌లో మళ్లీ కాషాయ రెపరెపలే!
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాషాయ జెండానే రెపరెపలాడనుందని ఒక ఒపీనియన్ పోల్ తేల్చింది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రమణ్‌సింగ్ నేతృత్వంలో బీజేపీ విజయం సాధించనుందని సీఎన్ఎక్స్ పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఆ ఎన్నికల్లో బీజేపీ 50, కాంగ్రెస్ 30, అజిత్‌జోగీ నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్( జోగి), బీఎస్పీ కూటమి 9 సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇతరులు ఒక స్థానంలో గెలవొచ్చని పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 42.22%, కాంగ్రెస్‌కు 37.21%, జోగి, మాయావతి కూటమికి 6.38%, ఇతరులకు 14.21% ఓట్లు రావచ్చని సీఎన్ఎక్స్ సర్వేలో వెల్లడైంది. నవంబర్ 12, 20 తేదీల్లో రెండు దశల్లో చత్తీస్ గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి 49, కాంగ్రెస్‌కు 39 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో రమణ్‌సింగ్ ప్రజాదరణకు తిరుగులేదని ఈ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 40.71% రమణ్ సింగ్నే మళ్లీ సీఎంగా కోరుకున్నారు. కాంగ్రెస్ నేత భూపేశ్ భాగెల్‌కు 19.2% మద్దతిచ్చారు. అభివృద్ధి, నిరుద్యోగం, పెట్రో ధరలు ఈ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపనున్నాయి. -
బాబు పాలన బాగోలేదు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి విశృంఖలమైందని, సమర్థవంతమైన పాలనను అందించడంలో ఆయన దారుణంగా విఫలమయ్యారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ గ్రూపునకు చెందిన తెలుగు వెబ్సైట్ ‘సమయం’ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ(ఒపీనియల్ పోల్)లో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా పోల్ నిర్వహించినట్లు ‘సమయం’ తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో, రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని 60 శాతం మందికి పైగా ప్రజలు తమ మనోగతాన్ని వెల్లడించారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం అమరావతికి ఉపయోగ పడలేదని తేల్చారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జోక్యం పెరిగిందని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం సరికాదని 80 శాతం మంది సూచించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు? అనే ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్రెడ్డికే తమ ఓటని సర్వేలో పాల్గొన్న అత్యధిక శాతం మంది స్పష్టం చేయటం గమనార్హం. -
కర్ణాటకలో హంగ్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ తరుణంలో కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై వెలువడిన ఇండియా టుడే-కార్వీ ఒపీనియన్ పోల్ ఫలితాల్ని పరిశీలిస్తే... కాంగ్రెస్ పార్టీనే మరోసారి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది కాంగ్రెస్‌కు 90-101 సీట్లు వచ్చే అవకాశం బీజేపీకి 78-86 సీట్లు వచ్చే అవకాశం జేడీఎస్‌కు 34-43 సీట్లకు ఛాన్స్ ఇతరులు 4-7 సీట్లు దక్కించుకోవచ్చు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న జేడీఎస్ 33 శాతం ప్రజలు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు -
24 గంటలా? 9 గంటలా?
‘సార్.. కొత్తగూడెం సబ్ స్టేషన్ నుంచి లక్ష్మీపురం ఫీడర్‌కు విద్యుత్ సరఫరా చేసే లైన్లను గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజులుగా బ్రేక్‌డౌన్ అయ్యేలా చేస్తున్నారు. రోజూ సాయంత్రం బ్రేక్‌డౌన్ అవుతున్నట్లు లైన్‌మన్ తెలిపారు. వెళ్లి చూడగా 24 గంటల కరెంట్ వల్ల మూడు రోజులుగా బోర్లలో నీరు ఊరడం లేదని.. పాత కండక్టర్ ముక్కను పోల్‌కు తగిలేట్టుగా లైన్ మీద వేసి బ్రేక్‌డౌన్ అయ్యేలా చేస్తున్నారు’ – విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు వాట్సాప్‌లో మిర్యాలగూడ రూరల్ ఏఈ ఇటీవల పంపిన సందేశమిది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. క్షేత్రస్థాయిలో రైతాంగం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో 24 గంటల సరఫరా కొనసాగింపుపై పునఃసమీక్షించేందుకు సిద్ధమైంది. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సర్వే నిర్వహించనున్నాయి. 24 గంటల విద్యుత్ కొనసాగించాలా, లేక గతంలో మాదిరి పగటి పూటే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందా అనే అంశంపై రైతుల అభిప్రాయాన్ని తీసుకోనున్నాయి. 24 గంటల సరఫరాతో సమస్యలు ఎదురవుతున్నాయా అనే అంశంపైనా రైతుల నుంచి ఆరా తీయనున్నాయి. ప్రత్యేక నమూనాలో సర్వే.. అభిప్రాయ సేకరణను పకడ్బందీగా నిర్వహించేందుకు డిస్కంలు ఓ ప్రత్యేక నమూనాలో సర్వే ఫారాన్ని సిద్ధం చేశాయి. సర్వేలో భాగం గా 24 గంటల విద్యుత్‌పై అభిప్రాయం తెలిపే రైతు పేరు, ఫోన్ నంబర్, పొలం సర్వే నం బర్, విస్తీర్ణం, ఏ రకం పంట తదితర వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వేలో అత్యధిక శాతం మంది రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభు త్వం ఓ నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నా యి. అసెంబ్లీ సమావేశా ల్లో కూడా 24 గంటల విద్యుత్ సరఫరాపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కోరాలని భావిస్తోంది. ‘రబీ’ఎండిపోయే ప్రమాదం ఇటీవలి కాలంలో రైతులు గరిష్టంగా 600 అడుగుల లోతు వరకు బోరు బావులను తవ్వుతున్నారు. ఏళ్ల కిందటి బోర్లు 100–200 అడుగుల లోతులోనే ఉండటంతో కొత్త బోర్ల దెబ్బకి అవి ఎండిపోతున్నాయి. అధిక సామర్థ్యం ఉన్న మోటార్లతో పెద్ద రైతులు భూగర్భ జలాలను తోడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోని చిన్న రైతుల బోర్లకు నీళ్లు అందక అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే మార్చి వరకు 24 గంటల విద్యుత్‌ను కొనసాగిస్తే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి రబీ పంటలు ఎండిపోతాయని రైతులు భయాం దోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల భూగర్భ జలాల సమస్య ఏర్పడిందని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. 24 గంటల విద్యుత్ వద్దని కొన్ని చోట్ల రైతులు స్థానిక విద్యుత్ అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వరుసగా మూడు, నాలుగు రోజులపాటు కొన్నిచోట్ల బోర్లలో నీళ్లు ఊరడం లేదు. దీంతో రైతులు విద్యుత్ సరఫరా వైర్లపై కండక్టర్ వైరు ముక్కలు విసిరేసి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నారని క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభం.. వ్యతిరేకత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నో నెలల ముందు నుంచి ప్రభుత్వం దీనికి ఏర్పాట్లు చేసింది. రూ.24 వేల కోట్లను వెచ్చించి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు వీలుగా రాష్ట్రంలో విద్యు త్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచింది. కేసీఆర్ సైతం ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి పలుసార్లు సమీక్షలు జరిపారు. దీంతో ఒక్కసారిగా యావత్ దేశం దృష్టి రాష్ట్రంపై పడింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు లేఖ రాశారు. గుజరాత్, యూపీ, పంజాబ్ తదితర రాష్ట్రాల అధికారులు రాష్ట్ర అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని భావిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం పునరాలోచన జరపాల్సిన పరిస్థితి నెలకొంది. -
బ్యాటిల్ గుజరాత్
-
ఒపీనియన్... ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం
సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగనున్నందున ఓపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ వంటివి నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రచార, ప్రసార మాధ్యమాలు ఇలాంటి వాటిని ప్రచారం... ప్రసారం చేయరాదని పేర్కొంది. ఇవి పోలింగ్‌పై ప్రభావం చూపనున్నందున నిషేధం విధించినట్టు పేర్కొంది. ఇంటర్నెట్, రేడియో, టీవీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ, శాటిలైట్, కేబుల్ చానెల్స్, మొబైల్, తదితర ఏ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానూ ప్రసారం చేయడానికి వీల్లేదు. ప్రింట్ మాధ్యమానికి సంబంధించి వార్తాపత్రిక, మేగజైన్, పీరియాడికల్, పోస్టర్, ప్లకార్డు, హ్యాండ్బిల్, ఇతరత్రా డాక్యుమెంట్ల రూపేణా ప్రచారం చేయకూడదు. వీటిని అతిక్రమించే వారికి రెండేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్రమంత్రులు ఓటరుగా, లేదా పోటీ చేస్తే అభ్యర్థిగా, అధీకృత ఏజెంటుగా తప్ప ఇతరత్రా అధికారంతో పోలింగ్ కేంద్రాల్లోకి కానీ, ఓటర్ల లెక్కింపు రోజున కౌంటింగ్ కేంద్రంలోకి కానీ వెళ్లేందుకు వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సెక్యూరిటీ సదుపాయం ఉన్న మంత్రులు ఎన్నికల ఏజెంట్‌గా, పోలింగ్ ఏజెంట్‌గా, కౌంటింగ్ ఏజెంట్‌గా వ్యవహరించేందుకు వీల్లేదు. భద్ర తా సిబ్బందినీ కేంద్రాల్లోకి అనుమతించరు. -
టీడీపీ అభిప్రాయ సేకరణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు, విభేదాల కారణంగా పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక క్లిష్టంగా తయారైంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆ పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో కసరత్తు చేసి, చివరకు కార్యకర్తల అభిప్రాయ సేకరణకు పూనుకుంది. ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి, ఆ భిప్రాయాల ఆధారంగా జిల్లా అధ్యక్షుడలను ఎంపిక చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 16, 18 తేదీలలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరుగనున్నాయి. -
'ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 314 సీట్లు ఖాయం'
న్యూఢిల్లీ: ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీకి, బీజేపీకి మరింత ఆదరణ పెరిగింది. ప్రస్తుతం లోక్‌సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ మరిన్ని సీట్లు అదనంగా గెలుస్తుందని ఓ సర్వేలో తేలింది. 'మూడ్ ఆఫ్ నేషన్' పేరుతో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బీజేపీకి 314 లోక్సీట్లు వస్తాయని వెల్లడైంది. అంటే బీజేపీ మొన్నటి ఎన్నికల్లో గెల్చిన సీట్ల కంటే 32 సీట్లు ఎక్కువ. ప్రధాని పదవికి మోడీ సమర్థుడని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే గ్రూప్, హంస రీసెర్చ్ సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. 48 శాతం ప్రజలు మళ్లీ బీజేపీకి ఓటేస్తామని, 76 శాతం మంది మోడీ పాలనలో సురక్షితంగా ఉన్నామని తెలిపారు. మైనార్టీల నుంచి మోడీకి మద్దతు పెరగడం విశేషం. బీజేపీకి ఓటేస్తామని 27 శాతం మంది ముస్లింలు తెలిపారు. కాగా కాంగ్రెస్‌కు 24 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ముస్లింలు ఎక్కువ మంది కాంగ్రెస్ కంటే బీజేపీ వైపే మొగ్గుచూపారు. -
రాజధానిలో కాషాయ హవా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వేగంగా మారుతోన్న రాజకీయ సమీకరణాలతో ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వెలువడే అవకాశం ఉందని ఇండియా టుడే తాజా ఎన్నికల సర్వే తేల్చింది. నరేంద్ర మోడీ ప్రభజంనం గట్టిగా వీస్తోందని అభిప్రాయపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య సంఖ్యలో సీట్లను సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై నగర ఓటర్లకు మోజు తగ్గిందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. బీజేపీకి ఏడింటిలో ఐదు స్థానాలు దక్కవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ గరిష్టంగా రెండు సీట్లను, కాంగ్రెస్ గరిష్టంగా ఒక సీటును గెలవవచ్చని తెలిపింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాలనూ సాధించడం తెలిసిందే.ఢిల్లీవాసుల్లో 44 శాతం మంది నరేంద్ర మోడీ, 24 శాతం మంది కేజ్రీవాల్, 19 శాతం మంది రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని సర్వే తెలిపింది. హర్షవర్ధన్ ముఖ్యమంత్రి కావాలని 29 శాతం మంది, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలని 19 శాతం మంది కోరుతున్నారని సర్వే తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 33 శాతమున్న బీజేపీ ఓటర్ల వాటా లోక్‌సభ ఎన్నికల్లో 41 శాతానికి చేరవచ్చని సర్వే తెలిపింది. కాంగ్రెస్ ఓటు శాతం 23 శాతానికి పడిపోతుందని ఇది పేర్కొంది. న్యూఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ డిల్లీలో బీజేపీకి విజయావశాశాలు అధికంగా ఉన్నాయని, చాందినీ చౌక్‌లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్‌కు కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్, ఆప్ అభ్యర్థి ఆశుతోష్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని సర్వే తెలిపింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్ స్వల్ప ఆధిక్యతతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయనకు కూడా బీజేపీ అభ్యర్థి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. సౌత్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీల్లో ఆప్‌కు ఆవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న 25-55 సంవత్సరాలలోపు వారిలో 41 శాతం మంది బీజేపీకి ఓటు వేస్తామని చెప్పారు. యువతలో 38 శాతం బీజేపీవైపు మొగ్గు చూపగా, 25 ఏళ్లలోపు వారిలో 31 శాతం మంది ఆప్‌కు, 25 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటు వేస్తామని చెప్పారు. సంప్రదాయంగా బీజేపీకి మద్దతు ఇచ్చే ఉన్నత కులాలతోపాటు జాట్లు, ఇతర ఓబీసీలు ఆ పార్టీవైపు ఆకర్షితులవుతున్నారని సర్వే తెలిపింది. దళితులు, పంజాబీ ఖత్రీలు ఆప్‌కు మద్దతు ఇస్తున్నారని వివరించింది. కాంగ్రెస్ ముస్లిం ఓటుబ్యాంకు బీటలు వారిందని వీరిలో అత్యధికులు ఆప్‌వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఢిల్లీలో కాస్త తగ్గిందని ఈ సర్వే విశ్లేషించింది. కేవలం 49 రోజులకే ప్రభుత్వం నుంచి వైదొలగడంతో ఆప్‌పై విశ్వాసం తగ్గిందని చెబుతున్నారు. ఇక భారీ అవినీతి, కుంభకోణాలు, ప్రభుత్వ వ్యతిరేకత, సమర్థ నాయకత్వ లేమి కాంగ్రెస్ ప్రతిబంధకాలుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పదిలోపు ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవడం తెలిసిందే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌నే ఆప్ ఆగ్ర నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ భారీ ఓట్ల తేడాతో ఓడించారు. ఉన్నత, ఎగువ మధ్యతరగతిపాటు దిగువ వర్గాల ఓటర్లు బీజేపీకి ఓటు వేస్తామంటున్నారని సర్వే ఫలితాలు విశ్లేషించాయి. సిసిరో అనే సంస్థ ద్వారా ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించామని ఇండియా టుడే సంస్థ ప్రకటించింది. -
దూత మారాడు!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో భాగంగా అభిప్రాయ సేకరణ కోసం రాహుల్‌గాంధీ దూత జిల్లాకు రాక విషయమై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముందుగా మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్ ఠాకూర్ ఈనెల మొదటి వారంలో జిల్లాకు వస్తారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆయన జిల్లాకు వచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఆయన స్థానంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు ఉమేష్‌రావు దేశ్‌ముఖ్‌ను నియమించినట్లు సమాచారం. లాతూర్ జిల్లాలో ఎమ్మెల్యే అయిన ఉమేష్ రాహుల్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు, మూడు రోజుల్లోనే ఉమేష్ పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశాలున్నాయని డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి ‘సాక్షి ప్రతినిధి’తో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అభిప్రాయ సేకరణ తంతు ముగించాల్సి ఉండగా, ఇంకా ఆలస్యమవుతోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానం అభ్యర్థి ఎంపిక విషయమై అభిప్రాయ సేకరణ తంతు ముగిసింది. గ్రూపు రాజకీయాలు పరిపాటైన కాంగ్రెస్ పార్టీలో రాహుల్ దూత పర్యటన సందర్భంగా మరోమారు బలప్రదర్శనకు దిగేందుకు ఆయా వర్గాల నేతలు, కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. ఈ స్థానం ఎస్టీకి రిజర్వు కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు టిక్కెట్టు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. -
ముఖం చాటేశారు..
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధిష్టానం రానున్న సాధారణ ఎన్నికల సన్నాహకంగా వేసిన మొదటి అడుగే తడబడింది. పార్లమెంట్ స్థానాల వారీగా అభ్యర్థుల ఎంపిక కోసం చేపట్టిన అభిప్రాయ సేకరణ ఒంగోలులో చప్పగా సాగింది. రెండు రోజులుగా స్థానిక డీసీసీ కార్యాలయంలో మకాం వేసిన రాహుల్‌గాంధీ దూతలకు ఆశించిన మేర స్పందన లభించలేదు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్‌కు అభ్యర్థిగా మెడలో గంట కట్టించుకునేవారే కరువయ్యారు. నాలుగు రోజుల క్రితమే ఏఐసీసీ దూతలుగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే బసవరాజు, పీసీసీ నుంచి నెల్లూరు జిల్లా సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే సి.వి.శేషారెడ్డిలు వస్తున్నారని చెప్పినా.. ముఖ్యనేతలెవరూ వారికి ముఖం చూపించేందుకు ఇష్టపడలేదు. పార్లమెంట్‌తో పాటు, పనిలో పనిగా దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ, బయోడేటాలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపీ నగరంలో ఉన్నా.. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నగరంలో ఉన్నా, డీసీసీ కార్యాలయంలో మకాం వేసి ఉన్న దూతల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మొదటి రోజు 5 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండోరోజు ఒంగోలు, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభిప్రాయాలు సేకరించారు. అయితే ఎంపీ మాగుంట మాత్రం పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ విజయకుమార్‌తో కలిసి డీసీసీ కార్యాలయం మీదుగానే వెళ్లారు. కానీ అక్కడ ఆగకుండా వెళ్లిపోయారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కరు మాత్రమే హాజరు.. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో నలుగురు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలుండగా ఇద్దరు వైఎస్సార్సీపీ, ఒక టీడీపీ ఎమ్మెల్యే. అయితే ఆ నలుగురిలో కొండపి ఎమ్మెల్యే జి.వి.శేషు మాత్రమే ఆదివారం ఏఐసీసీ దూతల ముందు హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో తనకే కొండపిలో పార్టీ టికెట్ ఇవ్వాలని దూతలకు బయోడేటా పత్రాన్ని స్వయంగా అందించారు. అయితే మొదటిరోజు శనివారం జరిగిన అభిప్రాయ సేకరణకు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరు అన్నా రాంబాబు, యర్రగొండపాలెం ఆదిమూలపు సురేష్‌లు ముఖం చాటేశారు. కాకపోతే మొక్కుబడిగా తమ అనుచరులను కొంత మందిని దూతల వద్దకు పంపి మ... మ... అనిపించారు. ఇకపోతే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఒంగోలుకు వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి తాజా మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీకి చెందిన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు కాగా, మార్కాపురంలో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కనీసం ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఏఐసీసీ దూతల వద్దకు రాలేదు. ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు పార్టీ తరఫున ఏ ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలుపుతూ ముందుకు రాలేదు. కాని ఏడు అసెంబ్లీ స్థానాల తరఫున తాము పోటీ చేస్తామంటూ ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థాయి నాయకులు తమ అనుచరులతో వచ్చి దూతలకు దరఖాస్తులిచ్చారు. ప్రథమశ్రేణి నేతలు ఎలాగూ ముందుకు రావడం లేదు కాబట్టి, కనీసం ఎమ్మెల్యే కాకపోయినా, శాసనసభకు పోటీ చేశామన్న కోరిక నెరవేర్చుకునేందుకు ముందుకొచ్చారు. ఒంగోలు అసెంబ్లీకి... ఒంగోలు శాసనసభా నియోజకవర్గానికి దాదాపు 20 మందికిపైగా బయోడేటాలు అందించారు. వారిలో ప్రధానంగా పార్టీ నగర అధ్యక్షుడు జడా బాలనాగేంద్రం, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, పీసీసీ కార్యదర్శి కోలా ప్రభాకర్‌లు మొదటి వరుసలో ఉన్నారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, గొర్రెపాటి శ్రీనివాసరావు, తాతా ప్రసాద్, మంత్రి శ్రీనివాసరావు, వేమా శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ కండే శ్రీనివాసరావు, నిమ్మకాయల శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్, బంకా చిరంజీవి, ఈదా సుధాకరరెడ్డి, వాకా కృష్ణారెడ్డి, కుసుమకుమారితో పాటు పలువురు బయోడేటా ఇచ్చిన వారిలో ఉన్నారు. కొండపిలో... కొండపిలో ఎమ్మెల్యే జీవీ శేషుతో పాటు, ఆయన తనయుడు విమల్‌రాజ్, ఎద్దు శశికాంత్ భూషణ్, చుండి దేవదాసు, బిల్లా చెన్నయ్య, నాళం నరసమ్మ, శ్రీపతి ప్రకాశం, కండె శ్రీనివాసులుతో పాటు మరికొంత మంది బయోడేటా అందించారు. -
పోటీ చేసే నాయకులేరీ!
కర్నూలు, న్యూస్‌లైన్: శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. నాయకులు, కార్యకర్తల నుంచి చేపట్టిన అభిప్రాయ సేకరణకు మొదటి రోజు స్పందన కొరవడింది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు ఏఐసీసీ నుంచి రాహుల్‌గాంధీ దూతగా కర్ణాటక రాష్ట్రం ఉడిపి ఎమ్మెల్యే ప్రమోద్ మద్వరాజ్, పీసీసీ నుంచి జిల్లా ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ తిప్పేస్వామి మంగళవారం కర్నూలుకు వచ్చారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులు, కార్యకర్తలతో జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్యతో కలిసి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను విడివిడిగా కలిసి అభిప్రాయాలను సేకరించారు. నియోజకవర్గాల వారీగా గుర్తించిన నాయకులను డీసీసీ కార్యాలయానికి రావాల్సిందిగా పిలుపు వెళ్లినప్పటికీ స్పందన కొరవడింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, మునిసిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, జిల్లా పార్టీ కార్యవర్గ ప్రతినిధులు, పార్టీ సీనియర్లను ఆహ్వానించారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మినహా పార్టీ ముఖ్యులు ఎవరూ కూడా హాజరు కాలేదు. ఎమ్మిగనూరులో ప్రస్తుతం వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నందున అందుకు ధీటైన అభ్యర్థి ఎవరున్నారని ఆరా తీశారు. ఎమ్మిగనూరు నుంచి రుద్రగౌడ్, సూర్యనారాయణతో పాటు మరికొంత మంది కార్యకర్తలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే కోడుమూరులో కోట్ల అనుచరుడు మురళీకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, రేపల్లె సూర్యచంద్ర తదితరులు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట హాజరై వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతూ దరఖాస్తులు ఇచ్చుకున్నారు. శాసనమండలి సభ్యుడు సుధాకర్‌బాబు అనుచరులు కొంతమంది హాజరై కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఎస్సీలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. డీసీసీ తరఫున సర్దార్‌బుచ్చిబాబు మాత్రమే హాజరై తన వాదనను చెప్పుకున్నారు. అలాగే కర్నూలు నగరానికి సంబంధించి మైనార్టీ నాయకులు సలాం, నౌషద్, సలీం, చున్నుమియ్య తదితరులు కర్నూలు సీట్‌ను మైనార్టీలకు కేటాయించాలని కోరారు. మంత్రి టీజీ వెంకటేష్ అనుచరులు ఎవరూ మొదటి రోజు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 9వతేదీ వరకు డీసీసీ కార్యాలయం నుంచే నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని వారు సమీక్షించనున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న బృందానికి ఈనెల 13వ తేదీన నివేదిక ఇస్తున్నట్లు పరిశీలకులు వెల్లడించారు.