తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి  | Congress has upper hand in Telangana elections | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి 

Published Thu, Dec 14 2023 4:43 AM | Last Updated on Thu, Dec 14 2023 4:43 AM

Congress has upper hand in Telangana elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలు జరిగితే అధికార కాంగ్రెస్‌ పార్టీకి మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉందని ఈటీజీ సంస్థతో కలిసి టైమ్స్‌ నౌ చేపట్టిన ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్‌ 8 నుంచి 10 స్థానాలు గెలిచే వీలుందని తెలిపింది. బీఆర్‌ఎస్‌ 3 నుంచి 5 స్థానాలు సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయని పేర్కొంది.

బీజేపీ కూడా కనిష్టంగా మూడు, గరిష్టంగా 5 స్థానాలు దక్కించుకునే వీలుందని తెలిపింది. వాస్తవానికి బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.92 శాతం ఓట్లు సాధిస్తే, 2023లో 13.9 శాతం తెచ్చుకుంది. 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్‌కు ఓటింగ్‌ 10.97 శాతం పెరిగింది. బీఆర్‌ఎస్‌కు ఓట్లు 9.52 శాతం తగ్గాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement