
'ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 314 సీట్లు ఖాయం'
న్యూఢిల్లీ: ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీకి, బీజేపీకి మరింత ఆదరణ పెరిగింది. ప్రస్తుతం లోక్సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ మరిన్ని సీట్లు అదనంగా గెలుస్తుందని ఓ సర్వేలో తేలింది. 'మూడ్ ఆఫ్ నేషన్' పేరుతో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బీజేపీకి 314 లోక్సీట్లు వస్తాయని వెల్లడైంది. అంటే బీజేపీ మొన్నటి ఎన్నికల్లో గెల్చిన సీట్ల కంటే 32 సీట్లు ఎక్కువ.
ప్రధాని పదవికి మోడీ సమర్థుడని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే గ్రూప్, హంస రీసెర్చ్ సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. 48 శాతం ప్రజలు మళ్లీ బీజేపీకి ఓటేస్తామని, 76 శాతం మంది మోడీ పాలనలో సురక్షితంగా ఉన్నామని తెలిపారు. మైనార్టీల నుంచి మోడీకి మద్దతు పెరగడం విశేషం. బీజేపీకి ఓటేస్తామని 27 శాతం మంది ముస్లింలు తెలిపారు. కాగా కాంగ్రెస్కు 24 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ముస్లింలు ఎక్కువ మంది కాంగ్రెస్ కంటే బీజేపీ వైపే మొగ్గుచూపారు.