
ఈరోజుల్లో మనిషి కంటే మనీకే విలువ ఎక్కువ. రిలేషన్స్ కంటే అవసరాలకే ప్రాధాన్యం ఉంటోంది. మనిషి వాస్తవంలో బతుకుతోంది తక్కువ!. స్మార్ట్ ఫోన్‌లో.. సోషల్ మీడియాలోనే సగం కంటే ఎక్కువ జీవితం గడిచిపోతోంది. అఫ్‌కోర్స్.. ఇవన్నీ చర్చించుకోవడానికి బాగానే అనిపించొచ్చు.
కానీ, వాస్తవ ప్రపంచం వేరు. ఒక అంశంపై ఎవరి ఒపీనియన్ వాళ్లది. వాళ్లకు అనిపించిందే కరెక్ట్!. జనరేషన్లు ముందుకెళ్తున్నా కొద్దీ.. ఈ తీరు మరింత మొండిగా మారుతోంది. మనీ ఆల్వేస్ మ్యాటర్. లాభం వచ్చే పని ఏదైనా సరే!.. చేసుకుంటూ ముందుకెళ్లడమే!. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇండియా ఇన్ ఫ్లెక్స్ అనే ట్విటర్ పేజీ రెండు ఆప్షన్స్‌తో ఈమధ్య ఓ పోల్ నిర్వహించింది.
‘1 మిలియన్(పది లక్షల) యూట్యూబ్ సబ్ స్క్రయిబర్స్, పీహెచ్‌డీ పట్టా.. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ విలువ ఉంటుంది?’ అని ట్విటర్ పోల్ నిర్వహించింది. దేనికి ఎక్కువ ఓట్లు వచ్చి ఉంటాయనుకుంటున్నారు. యస్.. మీరు ఊహించిందే కరెక్ట్. కింద పోల్ ఫలితం చూస్తున్నారుగా.. విద్య కంటే.. ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇంకా పడుతున్నాయి కూడా!. ఇందుకు ఫేమ్, డబ్బు కారణాలు కావొచ్చు. వాళ్ల అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. ఇంతకీ మీ దృష్టిలో విలువైంది ఏంటి?.. ఎందుకో కారణంతో సహా చెబితే మరీ మంచిది!.
which of these do you think has more value today?
— India in Pixels (@indiainpixels) December 11, 2021