
టీడీపీ అభిప్రాయ సేకరణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు, విభేదాల కారణంగా పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక క్లిష్టంగా తయారైంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆ పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో కసరత్తు చేసి, చివరకు కార్యకర్తల అభిప్రాయ సేకరణకు పూనుకుంది.
ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి, ఆ భిప్రాయాల ఆధారంగా జిల్లా అధ్యక్షుడలను ఎంపిక చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 16, 18 తేదీలలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరుగనున్నాయి.