
మీ అభ్యర్థి కేటీఆర్ అయితే రెండు నొక్కండి... చంద్రబాబు
ఉదయం పది గంటలు...పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ట్రిం గ్...ట్రింగ్ మంటూ ఫోన్ మోగింది. హైదరాబాద్ కోడ్‌తో ఉండడంతో ఎవ రా అని కార్యాలయంలోని ఓ నాయకుడు ఫోన్ ఎత్తితే టీడీపీ అధినేత చంద్రబాబు కార్యాలయం నుంచి... ఏం టా అని వింటే.. చీపురుపల్లి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కేఏ నాయుడు కావాలనుకుంటే ఒకటి నొక్కండి... త్రిమూర్తులు రాజు (కేటీఆర్) కావాలనుకుంటే రెండు నొక్కండి... గద్దే బాబూరావు కావాలనుకుంటే మూడు, కిమిడి మృ ణాళిని కావాలంటే నాలుగు నొక్కాలంటూ వాయిస్ ద్వారా చెబుతున్నారు.
ఓ వైపు అ సెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు రోజుల్లో నామినేషన్లు స్వీకరించనున్న నేపథ్యంలో అభ్యర్థుల కో సం సర్వే చేస్తుండడంతో తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇ ప్పటివరకూ ఎమ్మెల్యే టిక్కెట్ కేటీఆర్‌కు ఇస్తారని అంతా భా వించారు. అయితే బీజేపీతో పొత్తు నేపథ్యంలో గజపతినగరం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి కేటాయించారు. దీంతో అక్క డి టిక్కెట్ ఆశించిన కేఏ నాయుడును చీపురుపల్లి అభ్యర్థి గా పార్టీ అధిష్టానం పరిగణలోకి తీ సుకుంటున్న ట్టు తెలుస్తోంది. దీంతో స్థాని కంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు అ యోమయానికి గురికాగా, ఇంతవరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీకి సేవలందించి, ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న కేటీఆర్ పరిస్థితి మ రింత గందరగోళంగా మా రింది.
కొంత కాలంగా ఆయన అభ్యర్థిత్వంపై అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీతో పొత్తు పుణ్యమాని కేటీఆర్‌కు మరోసారి చుక్కెదురు కా నుంది. ఈ నెల 12వ తేదీ నుంచి సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండడంతో కేటీఆర్ నా మినేషన్ వేసేందుకు ముహూర్తం కూ డా పెట్టించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేఏ నాయు డు పేరుతో ఇంట్రాక్టివ్ వాయిస్ రె స్పాండ్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) ద్వారా మరో సర్వే నిర్వహిస్తుండడంతో కేటీఆర్ వర్గీయుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ పార్టీ అభివృద్ధి కోసం పడిన కష్టమంతా వృథానేనని ఆవేదన చెందుతున్నారు. అధినేత తీరు పై మండి పడుతున్నారు.