IVRS
-
ఒక్క ఫోన్ కాల్ తో ఎస్బీఐ పిన్ జనరేట్ చేసుకోండి
దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇప్పుడు ఎస్బీఐ ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుంచే 5 నిమిషాలలో ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్, గ్రీన్ పిన్ జనరేట్ చేసుకోవచ్చునని తెలిపింది. దీని కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. కాగా, ఇప్పుడు ఎస్బీఐ టోల్ ఫ్రీ ఐవిఆర్ సిస్టమ్ ద్వారా 1800 112 211 లేదా 1800 425 3800 కాల్ చేయాలి ఆ తరువాత కింద పేర్కొన్న విధంగా చేయాల్సి ఉంటుంది. Here are the easy steps to generate your Debit Card PIN or Green PIN via our toll-free IVR system. Don't hesitate to call 1800 112 211 or 1800 425 3800.#SBI #StateBankOfIndia #IVR #debitcard pic.twitter.com/MhuJGcwMa2 — State Bank of India (@TheOfficialSBI) February 17, 2021 దశ 1: కాల్ చేసిన తరువాత PIN జనరేట్ చేసుకునేందుకు ఆప్షన్ 6 ఎంచుకోవాలి దశ 2: ఎస్బీఐ కార్డు మీద ఉన్న నెంబర్, పుట్టిన తేదీ, కార్డు చివరి తేదీ ఎంటర్ చేయాలి దశ 3: రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు లేదా మెయిల్ ఐడీకి 6 అంకెల ఓటీపీ వస్తుంది దశ 4: నాలుగు అంకెలు ఉండే పిన్ నెంబర్ ఎంచుకోవాలి, దాన్ని రీ కన్ఫామ్ చేసేందుకు మరోసారి టైప్ చేయాలి దశ 5: ఆ తరువాత ఐవీఆర్ లో మీ పిన్ జనరేట్ అయిందని నిర్దారణ మెస్సేజ్ వస్తుంది చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి -
కొడుకుకు ప్రేమతో..!
-
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో 77.05 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు 79.24 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 76.11శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ స్కూల్స్ 82.48 శాతం ఉత్తీర్ణత సాధించగా, గురుకుల పాఠశాలలు 92.99 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలలు 87. 83 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ మొత్తం ఫలితాల్లో వరంగల్ జిల్లా 96.01శాతంతో అగ్రస్థానంలో నిలవగా, ఆదిలాబాద్ 54.06శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 1,491 స్కూల్స్ వంద శాతం ఫలితాలను సాధించగా, 28 స్కూల్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఖరారు చేసినట్లు కడియం పేర్కొన్నారు. టెన్త్ సప్లమెంటరీ పరీక్షల రాసే విద్యార్థులు మే 30వ తేదీలోగా రుసుము చెల్లించాల్సి ఉంది. టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి: -
నేడే టెన్త్ ఫలితాలు
-
నేడే టెన్త్ ఫలితాలు
హాజరైన విద్యార్థులు 5.65 లక్షలు ⇒ ఇంటర్నెట్లో ఫలితాలు ⇒ ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ రూపంలోనూ తెలుసుకోవచ్చు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజయ్యారు. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఇస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్ పాయింట్ల సగటును లెక్కించి సీజీపీఏ (క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్) పాయింట్లు ఇస్తారు. లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్ల నుంచే కాకుండా కొన్ని ప్రైవేటు వెబ్సైట్ల నుంచి కూడా పొందేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ రకాల మొబైల్ ఆపరేటర్ల నుంచి కూడా ఎస్ఎంఎస్ల రూపంలోనూ, ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డర్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం వెబ్సైట్లు www.sakshieducation.com www.aponline.gov.in www.bsetelangana.org www.results.cgg.gov.in ఎస్ఎంఎస్ల రూపంలో.. ఎయిర్‌సెల్/వొడాఫోన్/రిలయన్స్ 58888 ఐవీఆర్ఎస్ ద్వారా.. యూనినార్/ఎయిర్టెల్/ఎయిర్‌సెల్/వొడాఫోన్ 5333530 -
టీడీపీ అభిప్రాయ సేకరణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు, విభేదాల కారణంగా పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక క్లిష్టంగా తయారైంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆ పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో కసరత్తు చేసి, చివరకు కార్యకర్తల అభిప్రాయ సేకరణకు పూనుకుంది. ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి, ఆ భిప్రాయాల ఆధారంగా జిల్లా అధ్యక్షుడలను ఎంపిక చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 16, 18 తేదీలలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరుగనున్నాయి. -
బాలికలే టాప్, ప్రధమ స్థానంలో 'తూర్పు'
హైదరాబాద్ : పదో తరగతి ఫలితాల్లో బాలికలే పై చేయిగా నిలిచారు. మొత్తం 88.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 87.96 శాతం ఉత్తీర్ణులవగా, బాలికలు 89.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 96.26 శాతం ఉత్తీర్ణతతో ప్రధమ స్థానంలో నిలవగా, 58.31 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 77 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత రాగా, 5,784 పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు నమోదు చేశాయి. -
పదో తరగతి ఫలితాల విడుదల
హైదరాబాద్ : పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 88.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. యథావిధిగా విద్యార్థినులే ఉత్తీర్ణతలో పైచేయిగా నిలిచారు. ఉత్తీర్ణతలో తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థులు తమ ఫలితాలను www.sakshieducation.comలో చూడవచ్చు. ప్రోటో టైప్ మెమోలను ఏపీ ఆన్లైన్, మీసేవా కేంద్రాల ద్వారా పొందవచ్చు. అలాగే ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. www.bseap.org వెబ్‌సైట్‌తో పాటు పలు వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఐవీఆర్ఎస్ ద్వారా ఫలితాల కోసం యూనినార్ నెట్‌వర్క్‌లో 5333560కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. బీఎస్ఎన్ఎల్ మొబైల్ నుంచి ఎస్ఎస్సీ అని టైప్‌చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబర్ రాసి 53346 నంబరుకు ఎస్ఎంఎస్ చేయాలన్నారు. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి అయితే పైవిధంగా టైప్ చేసి 58888, 52070కు ఎస్ఎంఎస్ పంపించాలి. -
పదో తరగతి ఫలితాలు నేడే
-
పదో తరగతి ఫలితాలు నేడే
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో గవర్నర్ సలహాదారు ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు ప్రోటో టైప్ మెమోలను ఏపీ ఆన్లైన్, మీసేవ కేంద్రాల ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపారు. www.bseap.org వెబ్‌సైట్‌తో పాటు పలు వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఫలితాల కోసం యూనినార్ నెట్‌వర్క్‌లో 5333560కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. బీఎస్ఎన్ఎల్ మొబైల్ నుంచి ఎస్ఎస్సీ అని టైప్‌చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబర్ రాసి 53346 నంబరుకు ఎస్ఎంఎస్ చేయాలన్నారు. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి అయితే పైవిధంగా టైప్ చేసి 58888, 52070కు ఎస్ఎంఎస్ పంపించాలని సూచించారు. -
మీ అభ్యర్థి కేటీఆర్ అయితే రెండు నొక్కండి... చంద్రబాబు
ఉదయం పది గంటలు...పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ట్రిం గ్...ట్రింగ్ మంటూ ఫోన్ మోగింది. హైదరాబాద్ కోడ్‌తో ఉండడంతో ఎవ రా అని కార్యాలయంలోని ఓ నాయకుడు ఫోన్ ఎత్తితే టీడీపీ అధినేత చంద్రబాబు కార్యాలయం నుంచి... ఏం టా అని వింటే.. చీపురుపల్లి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కేఏ నాయుడు కావాలనుకుంటే ఒకటి నొక్కండి... త్రిమూర్తులు రాజు (కేటీఆర్) కావాలనుకుంటే రెండు నొక్కండి... గద్దే బాబూరావు కావాలనుకుంటే మూడు, కిమిడి మృ ణాళిని కావాలంటే నాలుగు నొక్కాలంటూ వాయిస్ ద్వారా చెబుతున్నారు. ఓ వైపు అ సెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు రోజుల్లో నామినేషన్లు స్వీకరించనున్న నేపథ్యంలో అభ్యర్థుల కో సం సర్వే చేస్తుండడంతో తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇ ప్పటివరకూ ఎమ్మెల్యే టిక్కెట్ కేటీఆర్‌కు ఇస్తారని అంతా భా వించారు. అయితే బీజేపీతో పొత్తు నేపథ్యంలో గజపతినగరం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి కేటాయించారు. దీంతో అక్క డి టిక్కెట్ ఆశించిన కేఏ నాయుడును చీపురుపల్లి అభ్యర్థి గా పార్టీ అధిష్టానం పరిగణలోకి తీ సుకుంటున్న ట్టు తెలుస్తోంది. దీంతో స్థాని కంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు అ యోమయానికి గురికాగా, ఇంతవరకు నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీకి సేవలందించి, ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న కేటీఆర్ పరిస్థితి మ రింత గందరగోళంగా మా రింది. కొంత కాలంగా ఆయన అభ్యర్థిత్వంపై అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీతో పొత్తు పుణ్యమాని కేటీఆర్‌కు మరోసారి చుక్కెదురు కా నుంది. ఈ నెల 12వ తేదీ నుంచి సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండడంతో కేటీఆర్ నా మినేషన్ వేసేందుకు ముహూర్తం కూ డా పెట్టించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేఏ నాయు డు పేరుతో ఇంట్రాక్టివ్ వాయిస్ రె స్పాండ్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా మరో సర్వే నిర్వహిస్తుండడంతో కేటీఆర్ వర్గీయుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ పార్టీ అభివృద్ధి కోసం పడిన కష్టమంతా వృథానేనని ఆవేదన చెందుతున్నారు. అధినేత తీరు పై మండి పడుతున్నారు. -
కుప్పంలో బాబుకు ‘ఐవీఆర్ఎస్’ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఇదో వినూత్న కార్యక్రమం.. ఇప్పటివరకు ఎవరూ చేయలేదంటూ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం(ఐవీఆర్ఎస్) గురించి ఊదరగొట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానికి మధ్యలోనే మంగళం పాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకోసం ఎంచుకున్న ఈ విధానం స్వయంగా తనకే షాకివ్వడంతో కంగుతిన్న చంద్రబాబు దానిని మధ్యలోనే అటకెక్కించారు. అభ్యర్థుల ఎంపికకోసం తలపెట్టిన ఈ ప్రయోగం స్వయానా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో వికటించింది. టీడీపీ అధినేత వద్ద ఉన్న లెక్కల ప్రకారం ఆయన ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో రెండు లక్షల సెల్‌ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడినుంచి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో చెప్పాలంటూ.. సెల్‌ఫోన్ ఉన్నవారిని ఐవీఆర్ఎస్ ద్వారా సమాధానం పంపాల్సిందిగా కోరారు. అయితే ఇప్పటివరకు ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు 40 శాతం మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా సమాధానం పంపినట్టు సమాచారం. దీంతో ఇదేదో విక టించేటట్లు ఉందన్న నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఐవీఆర్ఎస్ గురించి మాట్లాడ టం ఆపేశారు. సాధారణంగా ఏదైనా ఆర్భాటంగా ప్రకటించడం.. దానిని మధ్యలోనే వదిలేయడం టీడీపీలో కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆ కోవలోకి ఐవీఆర్ఎస్ చేరింది. ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఈ విధానాన్ని దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయలేదంటూ దానిపై విస్తృత ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రచారం చేసుకున్నన్ని రోజులు కూడా దాన్ని కొనసాగించకుండా మధ్యలోనే నిలిపివేశారు. దీన్ని కొనసాగించినన్ని రోజులు నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్లు ఆశిస్తున్న వారిపేర్లు కాకుండా వేరేవారి పేర్లు ఫోన్లో వినిపించాయి. దీంతో కార్యకర్తలు, నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. తనదాకా వస్తేగానీ తెలియదన్నట్టు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఈ ప్రయోగం వికటించటంతో చంద్రబాబు ఐవీఆర్ఎస్ను పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో ఐవీఆర్ఎస్ ప్రకటనలు ఆగిపోయాయి.