పదో తరగతి ఫలితాలు నేడే | Tenth class results today | Sakshi
Sakshi News home page

పదో తరగతి ఫలితాలు నేడే

Published Thu, May 15 2014 12:58 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM

Tenth class results today

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో గవర్నర్ సలహాదారు ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు ప్రోటో టైప్ మెమోలను ఏపీ ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు.
 
ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపారు. www.bseap.org వెబ్‌సైట్‌తో పాటు పలు వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫలితాల కోసం యూనినార్ నెట్‌వర్క్‌లో 5333560కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.
 
ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ నుంచి ఎస్‌ఎస్‌సీ అని టైప్‌చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబర్ రాసి 53346 నంబరుకు ఎస్‌ఎంఎస్ చేయాలన్నారు. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి అయితే పైవిధంగా టైప్ చేసి 58888, 52070కు ఎస్‌ఎంఎస్ పంపించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement