
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. రేపు.. అంటే ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 1గం.కు రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం.
మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం పూర్తి కావడంతో రిజల్ట్స్ రిలీజ్ కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం విద్యా శాఖ ఎదురు చూసింది. ఈలోపు గ్రీన్ సిగ్నల్ రావడంతో పలితాలు విడుదల చేస్తోంది.
ఈసారి మెమోలో మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడులు ఇవ్వనున్నారు. త్వరగతిన.. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఫలితాలు చెక్ చేసుకునేందుకు https://education.sakshi.com/ క్లిక్ చేయండి.