పదో తరగతి ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.
హైదరాబాద్ : పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 88.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. యథావిధిగా విద్యార్థినులే ఉత్తీర్ణతలో పైచేయిగా నిలిచారు. ఉత్తీర్ణతలో తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థులు తమ ఫలితాలను www.sakshieducation.comలో చూడవచ్చు. ప్రోటో టైప్ మెమోలను ఏపీ ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల ద్వారా పొందవచ్చు.
అలాగే ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. www.bseap.org వెబ్‌సైట్‌తో పాటు పలు వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫలితాల కోసం యూనినార్ నెట్‌వర్క్‌లో 5333560కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు.
ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ నుంచి ఎస్‌ఎస్‌సీ అని టైప్‌చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబర్ రాసి 53346 నంబరుకు ఎస్‌ఎంఎస్ చేయాలన్నారు. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి అయితే పైవిధంగా టైప్ చేసి 58888, 52070కు ఎస్‌ఎంఎస్ పంపించాలి.