తూప్రాన్: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి. ఇంటర్ ఫలి తాల సమయంలో నెలకొన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫలితాలకు ముందే విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని, వారికి అవగాహన కల్పించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని పలు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఎంఈ ఓలు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పరీక్షలు.. మార్కులే జీవితం కావన్నారు.
విద్యార్థులు సాధించిన మార్కుల విషయంలో తల్లిదండ్రులు నిరుత్సాహపర్చేవిధంగా వ్యవహరించకూడదన్నారు. భవిష్యత్తుపై వారిలో నమ్మకం కలిగించే విధంగా ధైర్యం చెప్పాలన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించాల్సి ఉండాల్సింది అని వారిపై ఒత్తిడి తేవద్దన్నారు. దురుసుగా వ్యవహరిస్తే క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలని, విద్యార్థుల అభీష్టానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వారిపై రుద్దవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment