దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇప్పుడు ఎస్‌బీఐ ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుంచే 5 నిమిషాలలో ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్, గ్రీన్ పిన్ జనరేట్ చేసుకోవచ్చునని తెలిపింది. దీని కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. కాగా, ఇప్పుడు ఎస్‌బీఐ టోల్ ఫ్రీ ఐవిఆర్ సిస్టమ్ ద్వారా 1800 112 211 లేదా 1800 425 3800 కాల్ చేయాలి ఆ తరువాత కింద పేర్కొన్న విధంగా చేయాల్సి ఉంటుంది.
Here are the easy steps to generate your Debit Card PIN or Green PIN via our toll-free IVR system.
— State Bank of India (@TheOfficialSBI) February 17, 2021
Don't hesitate to call 1800 112 211 or 1800 425 3800.#SBI #StateBankOfIndia #IVR #debitcard pic.twitter.com/MhuJGcwMa2
దశ 1: కాల్ చేసిన తరువాత PIN జనరేట్ చేసుకునేందుకు ఆప్షన్ 6 ఎంచుకోవాలి
దశ 2: ఎస్‌బీఐ కార్డు మీద ఉన్న నెంబర్, పుట్టిన తేదీ, కార్డు చివరి తేదీ ఎంటర్ చేయాలి
దశ 3: రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు లేదా మెయిల్ ఐడీకి 6 అంకెల ఓటీపీ వస్తుంది
దశ 4: నాలుగు అంకెలు ఉండే పిన్ నెంబర్ ఎంచుకోవాలి, దాన్ని రీ కన్ఫామ్ చేసేందుకు మరోసారి టైప్ చేయాలి
దశ 5: ఆ తరువాత ఐవీఆర్ లో మీ పిన్ జనరేట్ అయిందని నిర్దారణ మెస్సేజ్ వస్తుంది
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment