pin number
-
వార్నింగ్: ఆ వైరస్ కొత్త వెర్షన్‌తో వచ్చింది, ఇలా చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!
ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అలర్ట్. డ్రినిక్ ఆండ్రాయిడ్ ట్రోజన్ కొత్త వెర్షన్ వెలుగులోకి వచ్చింది. డ్రినిక్ అనేది పాత మాల్వేర్. ఈ వైరస్ మీ ఫోన్ స్క్రీన్ రికార్డింగ్‌లతో వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకులకు సంబంధించి పిన్, సీవీవీ నంబర్లను తస్కరిస్తుంది. ఇప్పటికే 18 భారతీయ బ్యాంకులు ఈ వైరస్ భారిన పడినట్లు సమాచారం. ఈ మాల్వేర్ పట్ల అప్రమత్తం ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. వార్నింగ్: పాత వైరస్, కొత్త వెర్షన్.. ఏపీకే(APK) ఫైల్‌తో ఎస్ఎంఎస్(SMS) పంపడం ద్వారా యూజర్లను డ్రినిక్ లక్ష్యంగా చేసుకున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇది iAssist అనే యాప్‌తో వచ్చింది. భారత్ ఆదాయపు పన్ను శాఖ అధికారిక పన్ను నిర్వహణ టూల్ మాదిరిగానే పనిచేస్తుంది. ఆదాయపు పన్ను రీఫండ్ల పేరుతో వినియోగదారలు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తుంది. 2016 లో వార్తల్లో నిలిచిన ఈ వైరస్ కొంత కాలం గ్యాప్ తీసుకుని ఆధునిక టెక్నాలజీ సామర్థ్యంతో అదే మాల్వేర్ లేటస్ట్ వెర్షన్ మళ్లీ దాడికి సిద్ధమైంది. భారత్‌లో యూజర్లను, 18 నిర్దిష్ట భారతీయ బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఈ బ్యాంకులలో, ఎస్బీఐ (SBI) వినియోగదారులను డ్రినిక్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, కొన్ని ఆఫ్షన్స్‌తో అనుమతులు మంజూరు చేయమంటుంది. అలా అనుమతించిన యూజర్ల ఫోన్లలో ఎస్ఎంఎస్లను పొందడం, చదవడం, పంపడం, కాల్ లాగ్‌ను చదవడం, ఔట్ స్టోరేజీ చదవడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారుకు తెలియకుండానే నిర్దిష్ట విధులను నిర్వహించే అవకాశాన్ని పొందుతుంది. యాప్ నావిగేషన్, రికార్డ్ స్క్రీన్, కీ ప్రెస్‌లను క్యాప్చర్ చేయగలదు. యాప్ అన్ని అనుమతులతో పాటు దానికి కావలసిన ఫంక్షన్లకు యాక్సెస్‌ను పొందగానే వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంది. జాగ్రత్త అవసరం థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుంచి లేదా SMS ద్వారా ఏదైనా యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర (Google Play Store) లేదా యాపిల్ (Apple) యాప్ స్టోర్‌లో యాప్‌లను చెక్ చేయాలి. వాస్తవానికి ప్రాథమిక విధులను నిర్వహించేందుకు అన్ని యాప్‌లకు అనుమతి అవసరం లేదు. కానీ తెలియని యాప్‌కు ఎస్ఎంస్, కాల్స్‌కు సంబంధించిన అనుమతులను ఇవ్వకపోవడం ఉత్తమం. చదవండి: NammaYatri దూకుడు: ఓలా, ఉబెర్‌కు ఊహించని దెబ్బ -
PIN:భారత దేశం.. ఇవాళ మరో మైలురాయి కూడా!
స్పెషల్: స్వతంత్ర భారతావని 75 ఏళ్ల వసంతం పూర్తి చేసుకుంది. దేశం మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇవాళ మన దేశం మరో మైలురాయిని దాటిందన్న విషయం మీకు తెలుసా?.. అదీ తపాలా వ్యవస్థ ద్వారా!. పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్(PIN)కు సరిగ్గా ఇవాళ్టికి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. లెటర్లు, కొరియర్లు, ఇతర పోస్టల్ ఐటెమ్స్ పంపడానికి ఈ నెంబర్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే కదా. ఈ పిన్ను 1972, ఆగస్టు 15న మొదలుపెట్టారు. ఇంతకీ ఇది ఎలా పుట్టింది? ఇది రావడానికి ఎవరి కృషి దాగుంది? తదితర విషయాలు చూద్దాం. Postal Identification Number నే ఏరియా కోడ్ లేదంటే జిప్ కోడ్ అని కూడా పిలుస్తారు. ఈ నెంబర్ వల్లే పోస్టల్ డిపార్ట్మెంట్కు, పోస్ట్‌మ్యాన్‌కు ఉత్తరాలు సరఫరా చేయడం సులభం అవుతోంది. ► పిన్ కోసం కృషి చేసిన వ్యక్తి.. శ్రీరామ్ భికాజి వెలెంకర్. ఫాదర్ ఆఫ్ పిన్‌గా ఈయనకు పేరు ముద్రపడిపోయింది. మహారాష్ట్రకు చెందిన ఈయన కేంద్ర సమాచార శాఖలో అదనపు కార్యదర్శిగా, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్బోర్డులో సీనియర్ సభ్యుడిగా కొనసాగారు. సంస్కృత కవి అయిన వెలెంకర్కు 1996లో రాష్ట్రపతి అవార్డు దక్కింది. 1999లో ఆయన కన్నుమూశారు. ► భారతదేశం అంతటా అనేక స్థలాల పేర్లను నకిలీ చేయడం వలన పిన్ కోడ్ అవసరం ఏర్పడింది. ప్రజలు వివిధ భాషలలో చిరునామాలను కూడా వ్రాసేవారు, ఇది చిరునామాలను గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. అందుకే కోడ్ సిస్టమ్ వల్ల.. పోస్ట్‌మెన్ చిరునామాను సరైన వ్యక్తులకు అందించడంలో సహాయపడింది. ► ఆరు నెంబర్ల పిన్ కోడ్‌లో.. ఫస్ట్ డిజిట్ జోన్‌ను సూచిస్తుంది. ► రెండవది.. సబ్ జోన్‌ను సూచిస్తుంది. ► మూడవది.. జిల్లాను అదీ సదరు జోన్ పరిధిలోనే ఉందని తెలియజేస్తుంది. ► చివరి మూడు డిజిట్స్ మాత్రం.. సంబంధిత పోస్టాఫీస్‌ను తెలియజేస్తుంది. ► పోస్టల్ రీజియన్ కార్యాలయం.. ప్రధాన పోస్టాఫీస్‌కు ప్రధాన కేంద్రం లాంటిది. ► భారతదేశంలో ఎనిమిది ప్రాంతీయ మండలాలు, ఒక ఫంక్షనల్ జోన్ (భారత సైన్యం కోసం) సహా తొమ్మిది పోస్టల్ జోన్లు ఉన్నాయి. ► ఇండియా పోస్ట్ ప్రకారం.. దేశం మొత్తం 23 పోస్టల్ సర్కిల్స్‌గా విభజించబడి ఉంది. ప్రతీ సర్కిల్‌కు హెడ్‌గా చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఉంటాడు. ► PIN prefix లిస్ట్‌లో.. 50 అనే సంఖ్య టీజీ అనేది తెలంగాణను, 51-53 మధ్య ఏపీని సూచిస్తుంది. ► డెలివరీ కార్యాలయం జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO), ప్రధాన కార్యాలయం (HO) లేదా సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే సబ్-ఆఫీస్ (SO) కావచ్చు. ► సాధారణంగా చాలామంది ఆశువుగా పిన్ నెంబర్ అనేస్తుంటారు. కానీ, పోస్టల్ విషయంలో పిన్ నెంబర్ అని రాయకూడదు.. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ లేందటే పిన్ అని మాత్రమే రాయాలి. ఇదీ చదవండి: ‘ఫోన్ లిఫ్ట్ చేసి హలో కాదు.. వందేమాతరం అనండి’ -
ఒక్క ఫోన్ కాల్ తో ఎస్బీఐ పిన్ జనరేట్ చేసుకోండి
దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇప్పుడు ఎస్బీఐ ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుంచే 5 నిమిషాలలో ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్, గ్రీన్ పిన్ జనరేట్ చేసుకోవచ్చునని తెలిపింది. దీని కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. కాగా, ఇప్పుడు ఎస్బీఐ టోల్ ఫ్రీ ఐవిఆర్ సిస్టమ్ ద్వారా 1800 112 211 లేదా 1800 425 3800 కాల్ చేయాలి ఆ తరువాత కింద పేర్కొన్న విధంగా చేయాల్సి ఉంటుంది. Here are the easy steps to generate your Debit Card PIN or Green PIN via our toll-free IVR system. Don't hesitate to call 1800 112 211 or 1800 425 3800.#SBI #StateBankOfIndia #IVR #debitcard pic.twitter.com/MhuJGcwMa2 — State Bank of India (@TheOfficialSBI) February 17, 2021 దశ 1: కాల్ చేసిన తరువాత PIN జనరేట్ చేసుకునేందుకు ఆప్షన్ 6 ఎంచుకోవాలి దశ 2: ఎస్బీఐ కార్డు మీద ఉన్న నెంబర్, పుట్టిన తేదీ, కార్డు చివరి తేదీ ఎంటర్ చేయాలి దశ 3: రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు లేదా మెయిల్ ఐడీకి 6 అంకెల ఓటీపీ వస్తుంది దశ 4: నాలుగు అంకెలు ఉండే పిన్ నెంబర్ ఎంచుకోవాలి, దాన్ని రీ కన్ఫామ్ చేసేందుకు మరోసారి టైప్ చేయాలి దశ 5: ఆ తరువాత ఐవీఆర్ లో మీ పిన్ జనరేట్ అయిందని నిర్దారణ మెస్సేజ్ వస్తుంది చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి -
పిన్ నంబర్ అడిగాడు.. డబ్బు డ్రా చేశాడు
జనగామ : ‘హలో.. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం రెన్యువల్ చేసుకోవాలి.. పిన్ నంబర్ చెప్పండి’ అంటూ ఓ సైబర్ నేరగాడు జనగామ పట్టణానికి చెందిన చిరు వ్యాపారి ఎండీ.జహంగీర్‌కు మంగళవారం ఫోన్ చేశాడు. సెల్ నంబర్ 8404860148 నుంచి కాల్ వచ్చింది. జహంగీర్ తన ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పిన నిమిషాల వ్యవధిలోనే సైబర్ నేరగాడు రూ.49,500 డ్రా చేశాడు. అనంతరం ఎస్బీఐకి వెళ్లి అకౌంట్ వివరాలు పరిశీలించగా, డబ్బులు డ్రా అయ్యాయని గ్రహించారు. ఖాతాలో ఉన్న మిగితా రూ.29వేలను వెంటనే జహంగీర్ డ్రా చేసుకున్నాడు. దీనిపై తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సంతోషం రవీందర్ తెలిపారు. -
పిన్ నంబర్ అడిగాడు.. డబ్బు డ్రా చేశాడు
ఖాతా నుంచి రూ.49,500 తస్కరించిన సైబర్ నేరగాడు జనగామ : ‘హలో.. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం రెన్యువల్ చేసుకోవాలి.. పిన్ నంబర్ చెప్పండి’ అంటూ ఓ సైబర్ నేరగాడు జనగామ పట్టణానికి చెందిన చిరు వ్యాపారి ఎండీ.జహంగీర్‌కు మంగళవారం ఫోన్ చేశాడు. సెల్ నంబర్ 8404860148 నుంచి కాల్ వచ్చింది. జహంగీర్ తన ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పిన నిమిషాల వ్యవధిలోనే సైబర్ నేరగాడు రూ.49,500 డ్రా చేశాడు. అనంతరం ఎస్బీఐకి వెళ్లి అకౌంట్ వివరాలు పరిశీలించగా, డబ్బులు డ్రా అయ్యాయని గ్రహించారు. ఖాతాలో ఉన్న మిగితా రూ.29వేలను వెంటనే జహంగీర్ డ్రా చేసుకున్నాడు. దీనిపై తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సంతోషం రవీందర్ తెలిపారు. -
ఏటీఎం పిన్ నెంబర్ అడిగి...
నల్లగొండ : బ్యాంకు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి వివరాలు అడగటంతో ఓ వ్యక్తి ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పేశాడు. దీంతో అతని ఖాతా నుంచి రూ.5 లక్షలు మాయమయ్యాయి. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ విషయాన్ని సదరు మోసగాడు తెలుసుకుని... మాయం చేసిన నగదును తిరిగి సదరు ఖాతాదారుడి ఖాతాకు బదిలీ చేశాడు. నల్లగొండ పోలీసులు కథనం ప్రకారం... పట్టణంలోని మాన్యంచెల్కకు చెందిన దాదాబాషా బత్తాయి వ్యాపారి. అతనికి గురువారం ఓ వ్యక్తి బ్యాంకు అధికారినంటూ ఫోన్ చేశాడు. సాంకేతిక కారణాలతో ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని...పిన్ నంబర్ చెబితే సరి చేస్తానని నమ్మబలికాడు. దీంతో దాదాబాషా తన ఏటీఎం కార్డు నంబర్ చెప్పాడు. ఆ వెంటనే సదరు వ్యక్తి అతని ఖాతాలో ఉన్న రూ.5 లక్షలను తన ఖాతాలోకి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా మార్చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత దాదాబాషా బ్యాంకుకు వెళ్లి... డబ్బు డ్రా చేయబోగా నగదు లేదని సమాచారం వచ్చింది. దీంతో అతడు వెంటనే అప్రమత్తమై బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన సూచన మేరకు డీఎస్పీని కలిసి విషయం వివరించాడు. దాంతో ఆయన వెంటనే స్పందించి పోలీసులను అప్రమత్తం చేసి... నగదు మాయం చేసిన ఆగంతకుడి ఖాతాను బ్లాక్ చేయించారు. దీంతో ప్రమాదం శంకించిన మోసగాడు రూ.5 లక్షలను తిరిగి దాదాబాషా ఖాతాకు జమ చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.