1, 2 తేదీల్లో ఢిల్లీలో నితీశ్‌కుమార్ ప్రచారం | Nitish Kumar may address Delhi voters | Sakshi
Sakshi News home page

1, 2 తేదీల్లో ఢిల్లీలో నితీశ్‌కుమార్ ప్రచారం

Published Tue, Nov 26 2013 1:16 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

Nitish Kumar may address Delhi voters

న్యూఢిల్లీ: జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వచ్చేనెల 1, 2వ తేదీల్లో రాజధాని ఢిల్లీలో ప్రచారం చేయనున్నారు. 30నే నగరానికి చేరుకోనున్న నితీశ్ పార్టీ కార్యకర్తల సమావేశంతోపాటు తర్వాతి రెండ్రోజులపాటు నిర్వహించే బహిరంగ సభల్లో పాలొంటారని జేడీయూ నేత ఒకరు తెలిపారు. 2008లో ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన జేడీయూ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి కూడా 11 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ ఎలాగైనా బోణీ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఢిల్లీలో బీహారీలతోపాటు పూర్వాంచల్‌కు చెందినవారి ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నాయి. దీంతో బీహార్, పూర్వాంచలీయుల ఓట్లతోపాటు ఉత్తరాది ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు నితీశ్ ప్రచారం ఉపకరిస్తుందని ఆ పార్టీ స్థానిక నేతలు భావిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement