కశ్మీర్ బీజేపీ అభ్యర్థుల్లో 40 శాతం ముస్లింలే | BJP candidates, 40 per cent of the Muslim Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్ బీజేపీ అభ్యర్థుల్లో 40 శాతం ముస్లింలే

Published Tue, Nov 18 2014 6:50 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

కశ్మీర్ బీజేపీ అభ్యర్థుల్లో 40 శాతం  ముస్లింలే - Sakshi

కశ్మీర్ బీజేపీ అభ్యర్థుల్లో 40 శాతం ముస్లింలే

జమ్మూ: మతతత్వ ముద్రను చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలను పెద్ద సంఖ్యలో పోటీకి నిలబెట్టింది. ఆ పార్టీ అభ్యర్థుల్లో 40 శాతం మందికి పైగా ముస్లింలే ఉన్నారు. 87 సీట్లున్న అసెంబ్లీలో మెజారిటీ సాధించడానికి కాషాయదళం ‘మిషన్ 44 ప్లస్’ వ్యూహంతో ముందుకెళ్తోంది.

రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. 70 స్థానాలకుపై పోటీ చేస్తున్న ఆ పార్టీ 32 మంది ముస్లింలను తమ అభ్యర్థులుగా బరిలోకి దింపింది. వీరిలో 25 మంది కశ్మీర్ లోయలో, ఆరుగురు జమ్మూ ప్రాంతంలో ఒకరు లడఖ్‌లో పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల్లో కశ్మీరీ పండిట్లు, బౌద్ధులు కూడా ఉన్నారు.

ఆ పార్టీ కశ్మీర్ లోయలో నలుగురు కశ్మీరీ పండిట్లు, ఒక సిక్కు, లడక్‌లో ముగ్గురు బౌద్ధులకు టికెట్లు ఇచ్చింది.  బీజేపీ ఈ ఎన్నికల్లో.. వివాదాస్పద అంశాలను జోలికెళ్లకుండా శాంతి, అభివృద్ధి నినాదాలతో ప్రజలకు చేరువ కావడానికి యత్నిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement