
పొత్తు లేదోచ్
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకట నతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వా తావరణం వేడెక్కింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యన పొత్తులు ఉంటాయన్న ఊహా గానాలకు ఆయన శనివారం తెర దించా రు. తెలంగాణ రాష్ట్రం ప్రకటన తర్వాత ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని.. లేదంటే పొత్తులతో పోటీ చేస్తాయన్న ప్రచారం కొ నసాగింది.
ఇప్పుడిక దానికి తావు లేదు. ‘‘కాంగ్రెస్‌తో పొత్తులు ఉండవు, రేపటి నుంచి కాంగ్రెస్ పని చెబుతా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వస్తారో, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు వెళ్తారో చూ ద్దాం’’ అంటూ తెలంగాణభవన్‌లో కేసీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం కలిగించా యి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యన ప్రచ్ఛన్న యు ద్ధం మొదలైనట్లేనన్న చర్చకు తెర లేచింది. మరోవైపు రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ ఒంటరిపోరులో అభ్యర్థులుగా బరిలోకి దిగే ఆశావహుల జాబితా పెరుగుతోంది.
ప్రతిష్టాత్మకమే..
ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రధాన రాజకీయ పక్షాలకు, చాలా మంది నేతలకు ప్రతిష్టాత్మకంగా మారా యి. ఈ ఎన్నిలలో అమీ తుమీ తేల్చుకునేందుకు వారంతా సిద్ధ పడుతున్నారు. ఇప్పటి వరకు పొత్తుల ప్రచారం వారిని కలవరపెట్టింది. కొద్ది రోజులుగా నెలకొంటున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్, టీ ఆర్‌ఎస్ వర్గాలను గందరగోళానికి గురి చేశాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒంటరిపోరుకే పచ్చజెండా ఊపడంతో ఆశావహులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. పార్టీ శ్రేణులలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతోపాటు జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి నేతలు సిద్ధమవుతున్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల సంఖ్య నాలుగుకు చేరగా, మరో రెండు నియోజకవర్గాలకు కూడా పార్టీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. మిగిలింది మూడు నియోజకవర్గాలే.
మూడు సీట్లపైన సస్పెన్స్
పొత్తుల మాట పక్కన బెడితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలుపుకుని ఆరు నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ అ భ్యర్థుల జాబితా ఇప్పటికే ఖరారైనట్లే. 2009 ఎన్నికలలో ఎల్లారెడ్డి నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి ఒక్కడే టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. జుక్కల్, కామారెడ్డి, బాన్సువాడ నుంచి గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది.
2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు సిట్టింగ్‌లుగా మళ్లీ అవకాశం ఉంది. ఆర్మూరు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేరు ఏడాది క్రితమే ప్రకటించగా, 10 రోజుల క్రితం బాల్కొండకు వేముల ప్రశాంత్‌రెడ్డి పేరును ప్రకటించారు. బోధన్ నుంచి గతంలో ఓడిపోయిన ఎండీ షకీల్‌కు మళ్లీ అవకాశం ఇస్తారా? లేదా? తేలాల్సి ఉంది. నిజామాబాద్ అర్బన్, రూరల్ ఇన్‌చార్జులుగా బస్వ లక్ష్మీనర్యయ్య, డాక్టర్ భూపతిరెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే అధికారికంగా వారి అభ్యర్థి త్వాలు ఖరారు కావాల్సి ఉంది. ఇదిలా వుంటే ముందుగా ప్రకటించిన విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఇదివరకే ప్రకటించిన, ప్రకటించనున్న అభ్యర్థులకు బెర్త్‌లు ఖరారైనట్లేనా? లేక చివరి నిముషంలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? అన్న చర్చ కూడ జరుగుతోంది.