సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుంటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో నాలుగు కోట్ల జనం దగా పడ్డారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందన్నారు. ప్రజలకు అండగా నిలబడి ప్రభుత్వంతో కొట్లాడుతున్నామన్నారు. వారం రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు.
చదవండి: మునుగోడు ఉపఎన్నిక ఖాయం: రాజగోపాల్‌రెడ్డి
‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు ఇష్టమున్నట్లు పెంచుతున్నారు. అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే .. తెలంగాణ తగ్గించలేదు. వరదల వల్ల రూ.1400 కోట్లు నష్టం జరిగిందని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్పష్టమైన అంచనా వేయలేదు. వారం రోజులుగా ఢిల్లీలో ఉన్నా.. నోరు మెదపడం లేదు. ప్రజా సమస్యలు గాలి కొదిలేశారని దుయ్యబట్టారు.
‘‘చీకోటి ప్రవీణ్ వెనక ఉన్న చీకటి మిత్రులు ఎవరనేది బయటపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. ఎమ్మెల్యేలు, మంత్రుల పాత్రల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈడీ దాడుల్లో వెలుగు చూసిన ఆధారాలపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. లేకపోతే కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్నట్లుగా భావించవలసి ఉంటుంది. మంత్రులు స్టిక్కర్లు ఇచ్చి దొరికిన కానీ, కేసీఆర్ పట్టించుకోవడం లేదని’’ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment