![TPCC Chief Revanth Reddy Fires On PM Modi BJP TRS - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/13/REVANTH-REDDY.jpg.webp?itok=_8VU0v8g)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ తమ ప్రయోజనాల కోసం అలజడి సృష్టించడమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు భావిస్తున్నారని తెలి పారు. మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా రేవంత్‌రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు.
‘పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. కాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐటీ, ఐఐఎం, రామగుండంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు, గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, ఐటీఐఆర్, జవహర్ నవోదయ, సైనిక్ స్కూల్స్ ఏర్పాటు, డిఫెన్స్ కారిడార్, చేనేతపై జీఎస్టీ ఎత్తివేత వంటి అంశాల్లో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’ అని పేర్కొన్నారు.
పసుపుబోర్డు ఏర్పాటు, డిఫెన్స్ కారిడార్ లాంటి విషయాల్లో కూడా తెలంగాణకు అన్యాయమే జరి గిందన్నారు. సీఎం కేసీఆర్ వైఖరికి బీజేపీ రాష్ట్ర శాఖలోని కొందరు నాయ కులు సహకరించే పరిస్థితి ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలెదు ర్కొంటున్న సమస్యలపై వెంటనే కార్యాచరణ ప్రకటించాలని, లేదంటే వచ్చే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ స్పష్టంచేశారు.
చదవండి: మోదీకి వ్యతిరేకంగా నిరసనలు.. 7 వేల మంది సీపీఐ కార్యకర్తల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment