
ఓటమిని అంగీకరిస్తున్నాం: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. అధికారంలోకి వచ్చే పార్టీలో హామీలను నెరవేర్చాలని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సోనియా మీడియాతో మాట్లాడారు.
మహారాష్ట్ర, హర్యానాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడింది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్ మూడో స్థానంతో్ సరిపెట్టుకుంది. కాగా రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని సోనియా చెప్పారు. ప్రజల తరపున జాగూరకతతో వ్యవహరిస్తుందని అన్నారు.