ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ (Union Budget 2025-26) సమావేశంలో తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (droupadi murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ (sonia gandhi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నీ తప్పుడు హామీలే ఇచార్చు. పైగా రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో బాగా అలసి పోయారు. పూర్ థింగ్’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, సోనియా గాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం ధీటుగా బదులిచ్చింది. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది.
ఆ లేఖలో .. సోనియా గాంధీ వ్యాఖ్యలో ఆమోదయోగ్యంగా లేవు. ఉన్నత పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తన మాటల్లో రాష్ట్రపతి అలసి పోయారని,చాలా కష్టంగా మాట్లాడారని అన్నారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని అనుకున్నాం.
#WATCH | Delhi | After the President's address to the Parliament, Congress MP Sonia Gandhi says,"...The President was getting very tired by the end...She could hardly speak, poor thing..." pic.twitter.com/o6cwoeYFdE
— ANI (@ANI) January 31, 2025
రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదు. ఎప్పటికి అలసిపోరు. బడ్జెట్ ప్రసంగంలో నిజానికి, అట్టడుగు వర్గాల కోసం, మహిళలు, రైతుల గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఆమె ప్రసంగాన్ని నాయకులు (సోనియాగాంధీని ఉద్దేశిస్తూ) హిందీ వంటి భారతీయ భాషలలోని యాస, ఉపన్యాసాలపై పరిచయం లేని కారణంగా రాష్ట్రపతి ప్రసంగంపై తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పడి ఉండొచ్చని రాష్ట్రపతి కార్యాలయం విశ్వసిస్తోంది. సోనియా గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఖండించదగినవి’ అని పేర్కొంది.
👉చదవండి : రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment