parliment budget sessions
-
పార్లమెంట్‌కు కర్ణాటక సెగ.. వాయిదా
న్యూఢిల్లీ : కర్ణాటక రాజకీయ సంక్షభ సెగ పార్లమెంట్‌కు తాకింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జీరో అవర్‌లో చర్చించేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించడంతో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ లోక్ సభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను వెంటాడి వేటాడి పడగొట్టే సంస్కృతిని అధికార పార్టీ మానుకోవాలని పెద్ద ఎత్తున నినదించారు. కాంగ్రెస్ సభ్యులకు డీఎంకే సభ్యులు మద్దతుగా నిలిచారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా ఇదే కారణంతో వాయిదా పడింది. -
అక్టోబర్ 2 నాటికి స్వచ్చ భారత్ సంపూర్ణం కావాలి
-
అవినీతి రహిత పాలనకే ప్రాధాన్యం : రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి రహిత పాలనకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. నిరుపేదలకు సైతం వంటగ్యాస్, విద్యుత్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. నవభారత నిర్మాణానికి ప్రభుత్వం కృషిసాగిస్తుందన్నారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడంతో గురువారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కోవింద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆయుష్మాన్ భారత్ సహా పలు ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. హృద్రోగులకు ఉపయోగించే స్టెంట్ల ధరను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. 50 కోట్ల మందికి ప్రభుత్వం ఆరోగ్య బీమాను అమలుచేస్తోందన్నారు. ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. కాగా, అంతకుముందు పార్లమెంట్ సమావేశాలకు విపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అర్ధవంతమైన చర్చల్లో భాగస్వాములు కావాలని కోరారు. కీలక అంశాలన్నింటిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో 16వ లోక్‌సభ చిట్టచివరి సమావేశం గురువారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 13 వరకూ జరిగే ఈ సమావేశాల్లో ఫిబ్రవరి 1న ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సభ సజావుగా సాగేందుకు సభ్యలు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ కోరారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తాలని సభ్యులకు ఆమె సూచించారు. -
భూసేకరణ బిల్లుకు సవరణలు
రాజ్యసభలో భూసేకరణ బిల్లు ఆమోదం కోసం కేంద్రం కొంత వెనుకడుగు వేయకతప్పలేదు. ఈ బిల్లుపై మంగళవారం ఎగువసభలో ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇతర పార్టీలను సంతృప్తి పర్చడమే లక్ష్యంగా భూసేకరణ బిల్లుకు మార్పుచేర్పులను చేసింది మోదీ ప్రభుత్వం. ఈ మేరకు భూమిని కోల్పోయే రైతులకు తర్వరితగతిన నష్టపరిహారం అందించేందుకు మెరుగైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ను తప్పనిసరి చేస్తూ పలు కీలక సవరణలు చేసింది.