
న్యూఢిల్లీ : కర్ణాటక రాజకీయ సంక్షభ సెగ పార్లమెంట్‌కు తాకింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జీరో అవర్లో చర్చించేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించడంతో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ లోక్ సభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను వెంటాడి వేటాడి పడగొట్టే సంస్కృతిని అధికార పార్టీ మానుకోవాలని పెద్ద ఎత్తున నినదించారు. కాంగ్రెస్ సభ్యులకు డీఎంకే సభ్యులు మద్దతుగా నిలిచారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా ఇదే కారణంతో వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment