ముంబై: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మాణిక్రావు ఠాక్రే ఆదివారం ముంబైలో వెల్లడించారు. రాజీనామా లేఖను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేది లేదని ఎన్సీపీ తెగేసి చెప్పింది. అలాగే బీజేపీ, శివసేన కూడా తమ బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించాయి. దీంతో ఈ ఎన్నికల్లో నాలుగు పార్టీలు ఒంటరిగానే పోటీ చేశాయి. బీజేపీ మాత్రం దూసుకుపోతు ముందు వరసలో ఉంది. ఆ తర్వాత స్థానాన్ని శివసేన ఆక్రమించింది. మూడో స్థానాన్ని కాంగ్రెస్, ఎన్సీపీలు నిలిచాయి.