Manikrao Thakre
-
కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు. ప్రభుత్వం- పార్టీ మధ్య అనుసంధానం అనే ప్రధానాంశంతో పీఏసీ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పార్లమెంట్ ఎన్నికలపై, నామినేటెడ్ పదవుల భర్తీ పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక.. ఈ నెల 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలపై పీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు, అలాగే.. బోయినపల్లి లోని గాంధీ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం వేగవంతం కోసం ఆ బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పచెప్పే ప్రకటనలు పీఏసీలోనే చేస్తారని తెలుస్తోంది. మరోవైపు.. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మలి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు(19న) ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్ ఆఫర్.. సున్నితంగా తిరస్కరణ -
కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గురువారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌కుమార్‌లు పాల్గొన్నారు. వాస్తవానికి ఇవాళ(శుక్రవారం) కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం నడిచింది. అయితే.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభానికే ముందే పార్టీ సభ్యత్వం ఉండాలనే సాంకేతిక కారణాలతో హడావిడిగా ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. 𝐑𝐚𝐣𝐠𝐨𝐩𝐚𝐥𝐑𝐞𝐝𝐝𝐲 𝐦𝐞𝐞𝐭𝐬 𝐁𝐡𝐚𝐭𝐭𝐢, 𝐔𝐭𝐭𝐚𝐦 Komati Reddy Rajagopal Reddy, who is joining the Congress, had a courtesy meeting with CLP leader Bhatti Vikramarka and MP Uttam Kumar Reddy in Delhi on Thursday night.#KomatireddyRajGopalReddy pic.twitter.com/ZRfsVPuYDu — Team Congress (@TeamCongressINC) October 26, 2023 మరోవైపు ఈ ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారికంగా చేరునున్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని, పైగా కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ ఎండగట్టడంలో విఫలమైందని చెబుతూ.. అందుకే తాను తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాదు.. తాను మునుగోడు నుంచే బరిలోకి దిగుతానని.. అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పైనా పోటీ చేస్తానంటూ ఆయన అంటున్నారు. -
‘కాంగ్రెస్‌లో చేరే వారికి ఎలాంటి అడ్డంకులు లేవు’
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌లో చేరే వారికి ఎలాంటి అడ్డంకులు లేవని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలనుకుంటున్నారని, సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పండిదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.శనివారం కాంగ్రెస్‌లో చేరేందుకు భారీగా నకిరికేల్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. వారిని మాణిక్ రావ్ ఠాక్రే ఆధ్వర్వంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలనుకుంటున్నారు. బీఆర్ఎస్తో తమకు రక్షణ లేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ రావడంతో పాటు హైదరాబాద్ తెలంగాణకు రావడానికి సోనియాగాంధీనే కారణమని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందర్నీ కలుపుకుని వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. తొలి విడత అభ్యర్థుల జాబితా త్వరలో విడుదల అవుతుంది. సీఈసీ తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత రెండో విడత జాబితా విడుదల అవుతుంది. ఓబీసీలు కాంగ్రెస్‌తో ఉన్నారు. రాష్ట్రంలోనే చేరికలు ఉంటాయి.. హైకమాండ్ ను కలవడానికి ఢిల్లీ వస్తున్నారు. కాంగ్రెస్ చేరడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. 50 శాతానికి పైగా సీట్లు తొలి విడత లిస్ట్‌లోనే ఉంటాయి. త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి విడత జాబితాను విడుదల చేస్తాం’ అని మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు. -
తెలంగాణలో ఫుల్ స్పీడ్‌లో కాంగ్రెస్.. ఉత్తమ్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఇతర పార్టీలతో పొత్తులపై కీలక మంతనాలు జరుగుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఠాక్రే మాట్లాడుతూ.. ‘ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. అధికారికంగా లెప్ట్ పార్టీలతో చర్చలు జరగలేదు. టీపీసీసీ చీఫ్, సీఎల్పీ లీడర్ సమక్షంలో లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరుగుతాయి. పార్టీతో పొత్తుల గురించి అధిష్టానం ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. కాంగ్రెస్‌కు మద్దతు పలకడానికి చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయి’ అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. సూర్యాపేటలోని కోదాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన సమ్మేళనంకు మాజీ టీపీసీసీ, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, శివసేనా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయి. డిసెంబర్ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. నిరుద్యోగులకు రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. కోదాడ, హుజూర్నగర్ నుంచి నేను, పద్మావతి పోటీ చేస్తున్నాం. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 50వేల మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయి’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో టికెట్ ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లోకి సీనియర్ ఎమ్మెల్యే! -
పక్కా వ్యూహంతో వెళ్తే గెలుపు ఖాయం
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా ప్రచార వ్యూహంతో ముందుకెళితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. ఎన్నికల ప్రచార నిర్వహణలో, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపడంలో టీపీసీసీ ప్రచార కమిటీ చురుకుగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం గాందీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ తొలి సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కన్వినర్ అజ్మతుల్లా హుస్సేనీలతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌చౌదరి, మన్సూర్ అలీఖాన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక మాదిరే ఇక్కడా.. ఠాక్రే మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ప్రజల మ ధ్య యాత్ర చేసిన కర్ణాటకలో పార్టీ విజయం సాధించిందని, తెలంగాణలో కూడా ఘన విజ యం సాధిస్తామని చెప్పారు. ఖమ్మంలో రాహుల్‌గాంధీ పాల్గొన్న బహిరంగ సభ రాష్ట్ర రాజకీ యాలను మార్చి వేసిందని అన్నారు. మధు యాష్కీ, పొంగులేటిల నేతృత్వంలో మంచి ప్ర చార వ్యూహంతో ముందుకెళితే తప్పక విజ యం సాధిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు లోపాయికారీగా పనిచేస్తున్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అసెంబ్లీ నియోజకవర్గా ల వారీగా సమస్యలను గుర్తించి ప్రత్యేక ప్రణాళికతో పోరాడాలని సూచించారు. రాహుల్‌గాంధీ చేసిన రైతు డిక్లరేషన్, ప్రియాంకాగాంధీ చేసిన యూత్ డిక్లరేషన్లను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ విషయంలో పార్టీ అనుబంధ సంఘాలు గట్టిగా పనిచేయాలని కోరారు. మాఫీ అయింది మిత్తి మాత్రమే: మధుయాష్కీ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీల తోడుదొంగల సినిమాను ప్రజల మధ్య బయటపెడతామని మధుయాష్కీ చెప్పారు. కేసీఆర్, మోదీలు తెరవెనుక ఏం చేశారో, తెర ముందు ఏం చేశారో వివరిస్తామన్నారు. రుణమాఫీని ఐదేళ్లుగా చేయకుండా ఇప్పుడు చేయడంతో ఐదేళ్ల మిత్తి మాత్రమే మాఫీ అయిందని, దీనిపై పోస్టుకార్డు ఉద్యమం చేస్తామని చెప్పారు. ఈ నెల 6న గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించే సమావేశంలో ప్రచార వ్యూహాలపై మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. -
నేడు ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో టీ. కాంగ్రెస్ కీలక భేటీ
-
పొలిటికల్ అలర్ట్.. తెలంగాణలో చక్రం తిప్పిన కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెట్ స్పీడ్‌లో దూసుకోపోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు హాజరు కానున్నారు. రేపు ఢిల్లీకి రేవంత్.. ఈ సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకే పార్టీ ముఖ్యులను కోమటిరెడ్డి లంచ్‌కు ఆహ్వానించారని తెలియవచ్చింది. త్వరలో పార్టీలో చేరే నాయకుల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకొనే దిశగా చర్చలు జరిపేందుకే ఈ భేటీ జరగనుందని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత రేవంత్‌రెడ్డితోపాటు ఠాక్రే, ఇతర ముఖ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. గురువారం వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. ప్రియాంకా గాంధీ సమక్షంలో జూపల్లి, కూచుకుళ్ల బృందంతోపాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన పలువురు నేతలు కూడా వారితోపాటు వెళ్లి ఖర్గేను కలుస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో భారీ చేరికలు.. ఇక, ఈ జాబితాలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, నల్లగొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఓ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రముఖ ట్రావెల్స్ అధినేత, ఆదిలాబాద్‌కు చెందిన మరో కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం భేటీ అనంతరం కోమటిరెడ్డి నివాసంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారని, ఈ సమావేశంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ నేతలు స్పష్టతనిస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘కాంగ్రెస్‌లో చేరినందుకే కక్ష సాధింపు చర్యలు’ -
ఉచిత విద్యుత్ మొదలుపెట్టిందే మేం!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలపడుతుండటం, రైతు డిక్లరేషన్‌కు మంచి స్పందన వస్తుండటంతో.. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఉచిత విద్యు త్ అంశంలో కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుంచుకోవాలన్నారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డితో కలసి మాణిక్‌రావ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లోనే రైతులకు అందించే ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రకటించిందని.. మున్ముందు ప్రకటించే డిక్లరేషన్‌లో 24గంటల ఉచిత విద్యుత్ అంశం ఉంటుందని వివరించారు. కేసీఆర్ పాలన అంతా అవినీతి, అక్రమాల్లో మునిగిపోయిందని మాణిక్ రావ్ ఠాక్రే ఆరోపించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబానికే ప్రయోజనాలు చేకూరాయని, ప్రజలకు చేసిందేమీలేకున్నా అయినా పబ్లిసిటీ మాత్రం బాగా చేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాల ముసుగు త్వరలోనే తొలగిపోతుందన్నారు. రైతులకు ప్రతి సందర్భంలో కాంగ్రెస్ మేలు చేసిందని, మద్దతుగా నిలిచిందని చెప్పారు. అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను వక్రీకరించి, తప్పుడు అర్థం వచ్చేలా దు్రష్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పేరే ఎత్తని కేసీఆర్.. ఇప్పుడు పదే పదే కాంగ్రెస్‌ను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో పంటల బీమా పథకం ఎందుకు అమలు చేయడం లేదని, రుణమాఫీ హామీ ఎటు పోయిందని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, అందుకే కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎకరానికి రూ.15వేలు పెట్టుబడి సాయం: వంశీచంద్‌రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఏకమైనా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి చెప్పారు. వైఎస్ హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని వివరించారు. రైతులకు ఎకరానికి 15 వేల పెట్టుబడి సాయం ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, కౌలు రైతులకూ ఎకరానికి 12 వేలు సాయం చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులకు కొదవలేదు: ఠాక్రే తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులకు కొదవలేదని.. తమది కేసీఆర్ మాదిరిగా కుటుంబ పార్టీ కాదని మాణిక్‌రావ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. రేవంత్, ఉత్తమ్, భట్టి, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్కలాంటి ఎంతో మంది సీఎం అభ్యర్థులు ఉన్నారన్నారు. అయితే ఎమ్మెల్యేల అభిప్రాయాల ఆధారంగానే సీఎం ఎంపిక ఉంటుందని, ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి ప్రకటన ఉండబోదని చెప్పారు. -
టీ కాంగ్రెస్‌లో ‘సీఎం సీటు’పై మాణిక్‌రావ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎక్కువ స్థాయిలో ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలపడుతోందని, అది కేసీఆర్‌కి నచ్చడం లేదని, అందుకే కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. కేసీఆర్ పదేళ్ల పాటు తన కుటుంబం బాగు కోసమే పని చేశాడు. తెలంగాణలో పంటల బీమాకు దిక్కు లేదు. రైతు రుణ మాఫీ చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారు. 24 గంటల ఉచిత కరెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం’’ అని ఠాక్రే వెల్లడించారు. చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా! ‘‘తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థులకు కొదవలేదని, మాది కేసీఆర్‌లా కుటుంబ పార్టీ కాదు. రేవంత్, ఉత్తమ్, భట్టీ, మధు యాష్కీ, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క లాంటి ఎంతో మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల ఆధారంగా సీఎం ఎంపిక ఉంటుంది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి ప్రకటన ఉండదు’’ అని ఠాక్రే తెలిపారు. -
ఖమ్మంలో కాంగ్రెస్ సభ.. అదే రోజు భట్టికి రాహుల్‌తో సత్కారం
సాక్షి, ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు బుధవారం ఖమ్మంలో పర్యటించారు. జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ గురించి ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా ఆసక్తికరంగా చర్చలు జరిపారు. అనంతరం రాహుల్‌గాంధీ విచ్చేయనున్న బహిరంగ సభ స్థలాన్ని మాణిక్‌రావు ఠాక్రే పరిశీలించారు. ఈ సందర్భంగా మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. జూలై 2న లక్ష మందితో ఖమ్మంలో కాంగ్రెస్ జన గర్జన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు కూడా అదే రోజు ఉంటుందని పేర్కొన్నారు. పీపుల్స్ మార్చ్‌ను దిగ్విజయంగా పూర్తి చేసిన భట్టిని ఆ సభలో రాహుల్ గాంధీ ఘనంగా సత్కరిస్తారని చెప్పారు. అదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు. భట్టి పాదయాత్ర సక్సెస్ అయ్యిందని, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. పీపుల్స్ మార్చ్ ముగించుకొచ్చే ముగించుకొచ్చే భట్టి విక్రమార్కకు స్వాగతం పలికే వారిలో పొంగులేటి కూడా ఉంటారన్నారు. చదవండి: కాంగ్రెస్ VS బీజేపీ: పీవీ జయంతి చుట్టూ రాజకీయాలు -
మహారాష్ట్ర పర్యటన.. సీఎం కేసీఆర్‌కు మాణిక్‌రావు ఠాక్రే సవాల్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సవాల్ విసిరారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. ఒక్కసీటు వచ్చిన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. కాగా సీఎం కేసీఆర్ రెండు రోజులు మహారాష్ట్రలో పర్యటించనున్న విషయం తెలిసిందే. సోమవారం ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు బయల్దేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై మాణిక్‌రావు స్పందించారు. కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌తో ఒరిగేదేమీ లేదన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌గా మారిందని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. చదవండి: విపక్షాల ఐక్యతపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు -
కాంగ్రెస్‌తో టచ్‌లో వైఎస్ షర్మిల? మాణిక్‌రావు థాక్రే కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడం ఖాయమైంది. ఈక్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్డీకే శివకుమార్‌ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిసిన సంగతి తెలిసిందే. దీంతో హస్తం పార్టీలో షర్మిల పార్టీ విలీనం అంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలకు బలాన్నిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం టచ్‌లో ఉందని.. ఆమె వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీకి చాలా లాభమని మాణిక్‌రావు థాక్రే వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను రెండు విడతలుగా ముందుగానే ప్రకటిస్తామన్నారు. బీఆర్ఎస్ - బీజేపీ ఒకటే అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీ కోసం గట్టిగా పోరాడుతున్నారని కొనియాడారు. భట్టి విక్రమార్క వాహనం అనేది ఎక్కకుండా వంద రోజులుగా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని.. ఇది పార్టీకి చాలా దోహదం చేస్తుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లోని కీలక నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. (చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు టైమొచ్చిందా?..ఆ విషయంలో సక్సెస్ అయ్యే ఛాన్స్!) వైఎస్ షర్మిల రిప్లై ఇదే.. ఇదిలా ఉండగా.. మాణిక్‌రావు థాక్రే వ్యాఖ్యలకు భిన్నంగా వైఎస్ షర్మిల ట్వీట్‌తో బదులిచ్చారు. ‘వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి. అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే’ అని ట్వీట్లో స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. (చదవండి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ) వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని… — YS Sharmila (@realyssharmila) June 23, 2023 చదవండి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ -
పార్టీ నేతలపై కాంగ్రెస్ తెలంగాణ ఇన్ ఛార్జ్ ఠాక్రే ఫైర్
-
ఇలా చేస్తే కష్టమే.. కాంగ్రెస్ నేతలపై థాక్రే సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల పనితీరుపై థాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు నియోజకవర్గాల్లో పర్యటించకపోవడంపై థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, శనివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల సమావేశంగా హాట్ హాట్‌గా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలపై ఇన్ఛార్జ్ థాక్రే ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో ఉండకపోతే నష్టమేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేయాలని థాక్రే సూచించారు. నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. గట్టిగా కష్టపడితే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యేలా వాస్తవాలను ప్రచారం చేయాలి. మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించాలి అని అన్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర వేయి కిలోమీటర్లకు చేరుకోవడంతో అభినందించారు. సీట్ల కేటాయింపు ఎవరి చేతుల్లో ఉండదు. సర్వేల్లో మంచి పేరు ఉంటేనే సీటు ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా నా సీటు నా చేతుల్లో కూడా ఉండదు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో సిద్దరామయ్య ఒక సీటు కోరినా ఇవ్వలేదు. పార్టీ సర్వే చేసి చెప్పిన చోట పోటీ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అందరూ పార్టీ కోసమే పనిచేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్నవారు ప్రతీ 15 రోజులకు ఒక నివేదిక ఇవ్వాలి. బోయినపల్లి రాజీవ్‌గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంకుస్థాపనకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బండికి కేంద్రమంత్రి పదవి.. టీబీజేపీ చీఫ్‌గా డీకే అరుణ! -
టీకాంగ్రెస్ నేతలకు ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే హెచ్చరిక
-
‘దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్‌లో లేదు’
సాక్షి, హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘దళిత ముఖ్యమంత్రి’ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే స్పందించారు. దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్‌లో లేదని, కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరిస్తుందని ఠాక్రే స్పష్టత ఇచ్చారు. దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్‌లో ఏనాడూ జరగలేదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరిస్తుందని పేర్కొన్నారాయన. అలాగే ఏలేటి మహేశ్వరరెడ్డి బీజేపీ చేరికపైనా ఠాక్రే స్పందించారు. మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్ ఏం తక్కువ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పించింది. ఆయన పార్టీని ఎందుకు వీడారో చెప్పాల్సిన అవసరం ఉందని ఠాక్రే వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికార పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ నడుస్తోంది. దీనిపై ఠాక్రే స్పందిస్తూ.. తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తు ఉండదు. ఈ విషయంపై పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని ఠాక్రే తెలిపారు. -
నా యాత్ర ఎందుకు ఆపారు? ఎవరి ఒత్తిడికి తలొగ్గారు?: మహేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిఖ్ రావు ఠాక్రేకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశమైంది. తన హాత్ సే హాత్ జోడో యాత్రను అర్ధంతరంగా నిలిపివేయాలని ఆదేశించడం తనను తీవ్రంగా బాధించిందని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. యాత్ర ఆగిపోవడం తనను అప్రతిష్టపాలు చేసిందని, ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి నా యాత్రను నిలిపివేశారని అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్సే సర్వస్వం అనుకుని పని చేస్తున్న తనను ఇలా అవమానించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. 'నా 18 ఏళ్ల రాజకీయ ప్రస్ధానంలో ఇలా బాధను, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాయడం కూడా ఇదే మొదటి సారి. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు తలపెట్టిన యాత్రను నాలుగు రోజులు నిర్వహించిన అనంతరం అర్ధంతరంగా నిలిపివేయాలని మీరు ఆదేశించడం నన్ను తీవ్రంగా బాధించింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు తలపెట్టిన నా తెలంగాణ పోరు యాత్రను విరామం అనంతరం తిరిగి ఈ నెల పదో తేదీ నుంచి ప్రారంభించేందుకు నేను అన్ని ఏర్పాట్లు ముందే చేసుకున్నాను. కానీ మీరు నిర్మల్ సభ ముగిసిన అనంతరం, షెడ్యూల్ ప్రకారం నా యాత్రను కొనసాగించడానికి వీల్లేదని, రద్దు చేసుకోవాలని ఆదేశించడం నన్ను షాక్ కు గురిచేసింది. ఈ సందర్భంలో మీరు నాతో మాట్లాడిన తీరు కూడా నన్ను తీవ్రంగా బాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు హాత్ సే హాత్ జోడో యాత్రను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహిస్తానంటూ ముందుకురావడం, సహకరించాలని నన్ను కోరడంతో నేను నా యాత్రను భట్టి గారి యాత్రలో విలీనం చేస్తున్నట్టు, ఈ యాత్రను ఆయన కొనసాగిస్తారని ప్రకటించాల్సి వచ్చింది. నా యాత్రను మీరు ఉన్న పళంగా అకారణంగా రద్దు చేసిన అంశం వివాదం కావొద్దనే సదుద్దేశంతో నేను భట్టి విక్రమార్క గారి యాత్రకు సహకరిస్తున్నట్టు ప్రకటించాను. అయితే నాయాత్రను ఆపేయాలన్న మీరు అదే సందర్భం లో ఇతర సీనియర్లు కూడా యాత్రలు చేస్తారని చెప్పడం వెనకున్న మతలబేంటి, మరి విజయవంతంగా సాగుతున్న నా యాత్రను అర్ధంతరంగా ఎందుకు నిలిపివేసినట్టు, ఇంతలా నన్ను అవమానించడం ఎంత వరకు సమంజసం? హాత్ సే హాత్ జోడో అభియాన్ అనేది ఏఐసీసీ రూపొందించిన ప్రోగ్రామ్. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ గా తెలంగాణలో హాత్ సే హాత్ జోడో యాత్రలను పర్యవేక్షించాల్సింది నేనే. అలాంటి బాధ్యతలో ఉన్న నన్ను, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ అయినే మీరే అడ్డుకోవడమేంటి? కాంగ్రెస్ ఇమేజ్ ను బలోపేతం చేసేందుకు పార్టీ జెండా పట్టుకుని యాత్ర చేస్తున్నానే తప్ప కొందరిలా సొంత ప్రతిష్ట పెంచు కోవాలనే అజెండాతో కాదే, మరి అలాంటపుడు ఎందుకని నా యాత్రను ఆపేయాలన్నారు? ఏఐసిసి ప్రోగ్రామ్స్ అమలు విషయంలో నన్ను బైపాస్ చేస్తూ, అవమానిస్తున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. అయితే జరుగుతున్న లోపాలను సరిచేయాల్సిన మీరే అవేమీ పట్టించు కోకుండా ఏక పక్షంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం. పదవులు నాకు ముఖ్యం కాదు, ప్రజా సేవే నా లక్ష్యం. ఇది నాకు తాత, తండ్రి నుంచి వచ్చిన రక్తగత లక్షణం. ఆత్మాభిమానాన్ని చంపుకుని అవమానాలు, భరిస్తూ పనిచేయడం నా విధానం కాదు. నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నా.' అని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. చదవండి: నా యాత్రలో అందరూ భాగస్వాములు కావాలి: భట్టి విక్రమార్క -
బీజేపీకి లాభం కలిగేలా బీఆర్ఎస్ వైఖరి
సాక్షి ప్రతినిధి, వరంగల్: కేంద్రంలోని అధికార బీజేపీకి లాభం కలిగేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారిందే తప్ప, ఆ పార్టీ నేతల్లో మార్పులేదని ఎద్దేవా చేశారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సభపై దాడి ఘటనలో గాయపడిన కాంగ్రెస్ నేత తోట పవన్‌కుమార్‌ను ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌహాన్‌తో కలిసి ఠాక్రే గురువారం అడ్వకేట్స్ కాలనీలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు దాడులను నమ్ముకున్నారని, కాంగ్రెస్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే హనుమకొండలో పవన్‌ను చంపాలని చూశారని, ఆ దాడిలో ఆయన చనిపోయాడని అనుకొని వెళ్లిపోయారని మాణిక్‌రావ్ పేర్కొన్నారు. ఈ ఘటనలో దోషులెవరో తెలిసినా పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అక్రమాలను ప్రశ్నించొద్దనే బీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని, కాంగ్రెస్ పార్టీ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. పేదలకు న్యాయం అందాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని, కానీ, ఇప్పుడు ఇంతటి దుర్మార్గ పాలన నడుస్తుందని అనుకోలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెలంగాణలో అన్యాయాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, నేతలు కూచన రవళిరెడ్డి, హర్కర వేణుగోపాల్, పోరిక బలరాంనాయక్, ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు. -
హైదరాబాద్ మీదుగా కోదాడకు ఠాక్రే..
సాక్షి, హైదరాబాద్/కోదాడ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మంగళవారం హైదరాబాద్ వచ్చారు. నాగ్‌పూర్ నుంచి వచ్చిన ఆయనకు టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్‌రావు, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు తదితరులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అక్కడ కాసేపు టీపీసీసీ నేతలతో మాట్లాడిన ఠాక్రే ఏఐసీసీ కార్యదర్శు లు బోసురాజు, రోహిత్‌చౌదరితో కలిసి నేరుగా కోదాడ వెళ్లిపోయారు. మంగళవారంరాత్రి అక్కడే ఉండనున్న ఆయన బుధవారం ఉద యం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ అయి జోడో యాత్రలపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత కోదాడలో హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలో పాల్గొని ములుగు వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు తెలంగాణలోనే ఉండనున్న ఆయన వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. అనంతరం రెండు రోజులు గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఠాక్రే వెంట నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉన్నారు. -
కోమటిరెడ్డి గురించి మరోసారి మాట్లాడుదాం.. మీటింగ్‌లో ఠాక్రే సీరియస్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్స్ వేళ పీసీసీ ఉపాధ్యక్షులతో ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రపై సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కూడా ఠాక్రే స్పందించారు. సమావేశం సందర్భంగా మాణిక్‌రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఠాక్రే మాట్లాడుతూ.. కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్‌కు ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్నే తాను చెప్పానన్నారు. కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు. త్వరలో పాదయాత్రలో పాల్గొంటారు. ఒంటిరిగానే ఎన్నికలకు వెళ్తాం, విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పీసీసీ ఉపాధ్యక్షుల తీరుపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి 20 మంది ఉపాధ్యక్షులు హాజరుకాకపోవడంతో సీరియస్ అయ్యారు. సమావేశానికి హాజరుకానీ వారందరూ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే శుక్రవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి వ్యవహారంపై మరోసారి మాట్లాడుకుందామని నేతలకు ఠాక్రే సర్ది చెప్పారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రతి ఇంటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సందేశాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్రంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే వెల్లడించారు. భారత్‌జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ నెల ఆరో తేదీన మేడారంలో జోడో యాత్రలను ప్రారంభిస్తామని, రెండు నెలలపాటు ఈ పాదయాత్రలు కొనసాగుతాయని చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో పార్టీ సీనియర్లతో సమావేశమైన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. యాత్రల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్రలు ఒకేసారి ప్రారంభమవుతాయని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తోపాటు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ తదితర ముఖ్యనేతల ఆధ్వర్యంలో ఈ యాత్రలు నిర్వహిస్తామని చె ప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాట్లాడుతూ ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతసహా ఇతర ముఖ్య నేతలు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నెల 24, 25, 26 తేదీల్లో యాత్రకు విరామం ఉంటుందని చెప్పారు. 1999–2004 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, విద్యుత్‌రంగాల్లో సంక్షోభం ఏర్పడిందని, ఇప్పుడు అవే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని రేవంత్ చెప్పారు. రైతుల రుణమాఫీ కాలేదని, 2014–17 మధ్య కాలంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో, 2017 నుంచి మూడో స్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి దృష్టి మరల్చేందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లు రెండూ ఒకే తానులోని ముక్కలని అభివర్ణించారు. ఎనిమిదేళ్లపాటు అన్ని అంశాల్లో కలిసి పనిచేసిన ఆ రెండు పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి కాంగ్రెస్ వైపు చూస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇరుపార్టీలు నాటకాలకు తెరలేపాయని విమర్శించారు. పచ్చిఅబద్ధాలు ఆడిన గవర్నర్ కేసీఆర్‌ను కాపాడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బీజేపీ భ్రమల నుంచి తెలంగాణ సమాజం బయటపడాలని కోరారు. రాహుల్‌గాంధీని విమర్శించేస్థాయి కేటీఆర్‌కు లేదని, ఆయనకు క్యాట్ వాక్, డిస్కో డ్యాన్స్, పబ్‌ల గురించి మాత్రమే తెలుసని విమర్శించారు. -
స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ముఖ్యనేతలతో మాణిక్‌రావు ఠాక్రే సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాణిక్‌రావు ఠాక్రే.. కాంగ్రెస్ నేతలతో గాంధీ భవన్లో సమావేశమై కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మరోసారి మాణిక్‌రావు ఠాక్రే హస్తం పార్టీ నేతలతో వరుసగా భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువురు ముఖ్య నేతలతో ఠాక్రే భేటీ కానున్నారు. -
గాంధీ భవన్ వద్ద రచ్చ రచ్చ.. అలిగి వెళ్లిపోయిన వీహెచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ ఇందుకు మరోసారి వేదిక అయ్యింది. సీనియర్ నేత వీ హన్మంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో గాంధీ భవన్ నుంచి వీహెచ్ బయటకు వచ్చేశారు. క్రికెట్ టోర్నమెంట్‌కు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను ఆహ్వానించేందుకు వీహెచ్ గాంధీభవన్‌కు వెళ్లారు. అయితే.. ఆ సమయంలో మహేష్ గౌడ్, వీహెచ్ మధ్య వాగ్వాదం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్‌కు ఠాక్రేను వీహెచ్ ఆహ్వానించగా.. 22వ తేదీన ఇన్‌ఛార్జి షెడ్యూల్ ఖాళీగా లేదని మహేష్ గౌడ్ బదులిచ్చారు. దీంతో ఇన్‌ఛార్జి వస్తానంటే నువ్వెందుకు అభ్యంతరం చెప్తున్నావంటూ వీహెచ్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఆపై బయటకు వచ్చేసిన వీహెచ్.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ‘‘ఈ కార్యక్రమం పీసీసీ ప్రెసిడెంట్ పెట్టలేదని, తాను పెట్టానని మహేష్ గౌడ్ తనతో అన్నాడని, పీసీసీ ప్రెసిడెంట్కే లేని అభ్యంతరం అతనికి ఎందుకని? ఎవరికి వారే ఇక్కడ లీడర్ ఉన్నారంటూ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారాయన. -
22న నాగర్‌కర్నూల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవసభ
సాక్షి, హైదరాబాద్: మార్కండేయ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా తమ పార్టీకి చెందిన దళిత, గిరిజన నాయకులపై అధికార బీఆర్ఎస్ నేతల దాడిని నిరసిస్తూ ఈనెల 22న నాగర్‌కర్నూల్ కేంద్రంగా ‘దళిత గిరిజన ఆత్మగౌరవ సభ’ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న ఆయన రాష్ట్ర ఇన్చార్జి హోదాలో ఈ సభకు తొలిసారి అతిథిగా రానున్నారు. కాగా, పంజగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ టీపీసీసీ బృందం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి విజ్ఞప్తి చేయనుంది. పంజగుట్ట చౌరస్తా నుంచి తొలగించి పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన అంబేడ్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అప్పగించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ విగ్రహాన్ని పంజగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరనుంది. ఇందుకోసం శాంతికుమారి అపాయింట్మెంట్ కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇప్పటికే పార్టీ తరఫున లేఖ రాశారు. సీఎస్ అపాయింట్మెంట్ లభిస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సీఎస్‌ను కలిసి అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, ఎమ్మెల్యేలకు ఎర కేసుతోపాటు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడాన్ని కూడా విచారించాలని కోరనుంది. గొంతుపై కాలుపెట్టి చంపే యత్నం చేశారు: నాగం మార్కండేయ ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల గొంతుపై కాలు పెట్టి చంపేందుకు యత్నించారని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ మల్లురవితో కలిసి ఆయన గాం«ధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దళిత, గిరిజన నేతలపై దాడులు చేయడమేకాక తిరిగి వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. -
నాపై కేసు పెట్టిన విషయం తెలియదు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు ఇవాళ హాజరుకాలేనంటూ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి సమాచారమిచ్చారు. కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేతో ఈరోజు నాకు మీటింగ్ ఉంది. అందుకే ఇవాళ విచారణకు హాజరుకాలేనంటూ సైబర్ క్రైం పోలీసుల నోటీసులకు సమాధానమిచ్చారు. 'సంక్రాంతి పండగ తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే విచారణకు హాజరై పూర్తిగా సహకరిస్తాను. 41 సీఆర్పీసీ నోటీసుకు కొంత వెసులుబాటు ఉంటుంది. నాపై కేసు పెట్టిన విషయం తెలియదు. మేము సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు విమర్శించడానికే తప్ప అవమానించడానికి కాదు' అని మల్లు రవి చెప్పారు. చదవండి: (కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణకు అన్యాయం: సీఎం కేసీఆర్) -
మాణిక్ రావు ఠాక్రేతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ
-
‘గాంధీభవన్‌కు రానంటే రాను!’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే రాక సందర్భంలోనూ.. పార్టీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విభేదాలను పక్కనపెట్టి.. అంతా ఆయనకు కలిసే స్వాగతం పలుకుతారేమోనని భావించారంతా. కానీ, అక్కడా టీపీసీసీ చీఫ్ డామినేషన్ కనిపించింది. బుధవారం ఎయిర్‌పోర్ట్‌లో రేవంత్‌రెడ్డి అండ్ కో.. మాణిక్‌రావ్ ఠాక్రేకు స్వాగతం పలికింది. మరోవైపు సీనియర్ వీహెచ్ స్వాగతం పలికేందుకు అక్కడకు వెళ్లగా.. ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆయన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లు మినహా రేవంత్ నాయకత్వంపై అసంతృప్త గళం వినిపిస్తున్న వాళ్లెవరూ అక్కడ కనిపించలేదు. ఇదిలా ఉంటే.. గాంధీ భవన్‌కు చేరుకున్న ఠాక్రే.. ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీలతో భేటీ అయ్యారు. అయితే.. గాంధీ భవన్‌కు రావాల్సిందిగా ఠాక్రే స్వయంగా ఫోన్ చేసినా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. చాలాకాలంగా పార్టీ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో రలిగిపోతున్నారు. ముఖ్యంగా రేవంత్ నాయకత్వాన్ని ఆయన బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన మాణిక్‌రావ్ ఠాక్రే ఆయనకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే గాంధీ భవన్ మీటింగ్ తాను రానని స్పష్టం చేసిన కోమటిరెడ్డి.. కావాలంటే బయటే కలుస్తానని ఠాక్రేకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి కోమటిరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. ఇక గాంధీ భవన్ చేరుకున్న టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మానిక్ రావ్ థాక్రే.. ఏఐసీసీ సెక్రటరీ లు బోస్ రాజు , నదీమ్ జావెద్ ,రోహిత్ చౌదురి తో భేటీ అయిన థాక్రే.. రాష్ట్రంలో పార్టీ పని తీరు, నాయకుల మధ్య విభేధాల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకోనున్నారు. ఆపై ఆయన అందరితో కలిసే భేటీ నిర్వహించాలని యోచినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
Telangana: మాణిక్‌రావ్ ఠాక్రేకు టీపీసీసీ స్వాగతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే నగరానికి వచ్చారు. బాధ్యతల నేపథ్యంలో ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. దీంతో ఆసక్తి నెలకొంది. బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే కు ఘనంగా స్వాగతం లభించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సీనియర్ నేత వీహెచ్ సైతం ఠాక్రేకు స్వాగతం పలికారు. రెండు రోజలు పాటు ఆయన ఇక్కడే ఉండి.. పూర్తి పరిస్థితిని సమీక్షించనున్నారు. సీనియర్లు వర్సెస్ రేవంత్‌రెడ్డి పంచాయితీ ముదరడంతో.. గాంధీభవన్ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు మాణిక్ రావు ఠాక్రేను అధిష్టానం వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందా? అనే చర్చ మొదలైంది. -
మ్యాజిక్ లేదు..మాటలతోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్‌రావ్ ఠాక్రే చెప్పారు. ఏ సమ స్యకైనా పరిష్కారం ఉంటుందని, తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలకు కూడా ఎక్కడోచోట పరిష్కారం లభిస్తుందని, ఆ పరిష్కారం కనుగొనేందుకే తాను తెలంగాణకు వస్తున్నానని అన్నారు. తాను రాష్ట్రానికి వచ్చి ఏదో మ్యాజిక్ చేయాలనుకో వడం లేదని, కూర్చుని మాట్లాడుకుంటే ఏదైనా సాధ్యమవుతుందనేది తన నమ్మకమని ఆయన పే ర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియా మకమైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మంగళవారం ముంబై నుంచి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలుఠాక్రే మాటల్లోనే.. కాంగ్రెస్ బలం తగ్గలేదు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో మా బలం ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుభూతితో ఉన్నారు. నాకున్న అవగాహనకు తోడు పార్టీ నేతల ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుని, డిస్కషన్స్ (చర్చలు)తోనే తెలంగాణ కాంగ్రెస్‌ను డీల్ చేయాలనుకుంటున్నా. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయి. పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నాయకుడిని విడివిడిగా కలవాలని నిర్ణయం తీసుకున్నా. వచ్చీ రాగానే విడివిడిగా సమావేశం ఎందుకు పెట్టారన్నదానికి ప్రత్యేక సమాధానం ఏం లేదు.. కానీ ఒంటరిగా కలిసిన ప్పుడే కొంతమంది అన్ని విషయాలు మాట్లాడతా రు. రాజకీయ పార్టీల్లో ఈ ఒరవడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే వేర్వేరుగా కలవాలని నిర్ణ యం తీసుకున్నా. రాష్ట్రానికి చెందిన మరికొందరు సీనియర్ నేతలతో కూడా విడిగా భేటీ అవుతా. పార్టీ పటిష్టత, గెలుపు కోసం వారి మనసులో మాట ఏంటో తెలుసుకుంటా. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జ రుగుతాయి. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించే టాస్క్ ఏఐసీసీ నాకిచ్చింది. ఆ టాస్క్‌ను విజయవంతం చేయడం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తా.’ రాష్ట్రంలో బీజేపీ గాలిబుడగలాంటిది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నా యం. ఎవరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రత్యామ్నాయం సాధ్యం కాదు. ప్రాంతీయ పార్టీల ప్రభావం కొంతమేర ఉన్నా మేం లేకుండా ఏమీ చేయలేరు. బీఆర్ఎస్ అయినా మరే కొత్త పార్టీ వచ్చినా అది సాధ్యం కాదు. తెలంగాణలో బీజేపీ గాలిబుడగ లాంటిది. కాంగ్రెస్ పార్టీని దాటి ముందుకెళ్లే పరిస్థితి ఇప్పట్లో జరిగేది కాదు. తెలంగాణలో ఈసారి మేం అధికారంలోకి వచ్చి తీరతాం. -
TS: కాంగ్రెస్‌లో ఎవరిగోల వారిదే.. ఠాక్రే ముందున్న సవాళ్లేంటీ?
కాంగ్రెస్ అంటేనే ఓ విచిత్రమైన పార్టీ. అక్కడ ఎవరి గోల వారిదే. వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న పార్టీ స్వయంకృతాపరాధాలతోనే నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. తెలంగాణలో కూడా అదే బాటలో నడుస్తోంది. రెండున్నరేళ్ళ క్రితం వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్‌రావు ఠాక్రేకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్‌లో ఇన్‌చార్జ్‌లను అవసరమైతే మూడేళ్లకో సారి మార్చుతారు. గతంలో పలువురు సీనియర్ నేతలు రెండు మూడు దఫాలుగా కూడా కొనసాగారు. కాని ఠాగూర్‌ను రెండున్నరేళ్ళకు ఎందుకు సాగనంపారు? ఠాగూర్ రాష్ట్రంలోని సీనియర్లతో వ్యవహరించిన తీరే ఆయన్ను పక్కన పెట్టారని గాంధీభవన్‌లో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. మాణిక్కం ఎక్కడ తిరగబడ్డారు? తెలంగాణ ఇన్చార్జ్గా వచ్చిన ఠాగూర్ మొదట్లో మంచి క్రేజ్ సంపాదించారు. చిన్న వయస్సులోనే కీలక రాష్ట్రానికి ఇంచార్జ్ గా బాధ్యతలు రావడంతో మొదట్లో ఉత్సాహంగా పని చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో శ్రేణులందరినీ మోహరింప చేసి గౌరవప్రదమైన ఓట్లు సాధించేలా చూశారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ మార్పు విషయంలో సీనియర్లతో మొదలైన గ్యాప్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. పీసీసీ సీటు కోసం సీనియర్లు చాలా మంది ప్రయత్నించారు. వారందరినీ కాదని తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్‌కు గాంధీభవన్ అప్పగించడంతో ఠాగూర్ పెద్ద అపవాదును మూట కట్టుకున్నారు. సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఠాగూర్ పీసీసీ చీఫ్ పదవిని 40 కోట్లకు అమ్ముకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై అనేకసార్లు మాణిక్కం ఠాగూర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా..ఫిర్యాదు చేసినవారిని ఎగతాళి చేసేవారట. దీంతో సీనియర్లు క్రమంగా ఠాగూర్‌కు దూరమయ్యారు. ఆయన్ను తొలగించాలని ఎప్పటినుంచో హైకమాండ్‌ను డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ రేవంత్ రూటు ఏంటీ? సీనియర్లతో పని చేయించుకునే విషయంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి విఫలం కావడం.. నిరంతరం గ్రూపు తగాదాలతో రెండేళ్ళుగా పార్టీ బాగా డ్యామేజ్ అయింది. ఈ పరిస్థితులలో పార్టీని గాడిన పెట్టాల్సిన ఇంచార్జ్ ఠాగూర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయనపై ఉన్న ప్రధానమైన ఫిర్యాదు. సీనియర్లను పట్టించుకోవడం మానేయడమే గాకుండా..కొత్త కమిటీల ఏర్పాటు సందర్భంగా కూడా సీనియర్ల ఆగ్రహానికి ఠాగూర్ గురి కావాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గమనించిన తర్వాత పార్టీ హైకమాండ్ రంగంలోకి వచ్చి.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్ పంపించింది. పీసీసీ చీఫ్తోను..సీనియర్లతోనూ చర్చించిన దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ వెళ్ళి హైకమాండ్‌కు నివేదిక సమర్పించారు. డిగ్గీ రాజా ఇచ్చిన రిపోర్టు ఠాగూర్‌కు వ్యతిరేకంగానే ఉన్నట్లు సమాచారం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఠాగూర్ సైతం తెలంగాణ బాధ్యతల నుంచి తనను తప్పించమని పార్టీ అధిష్టానాన్ని వేడుకున్నారట. డిగ్గీ రాజా నివేదికలో ఏముంది? దిగ్విజయ్ సింగ్ నివేదిక పరిశీలించిన తర్వాత ఢిల్లీ పెద్దలు ఠాగూర్‌ను తప్పించడానికి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద తెలంగాణ సీనియర్ల దెబ్బకు ఠాగూర్ ఇక్కడి నుంచి సర్దుకోవాల్సి వచ్చింది. అయితే ఠాగూర్ నుంచి కొత్త గా వచ్చిన ఇంఛార్జ్ ఠాక్రే చాలా నేర్చుకోవాల్సిఉంది. సీనియర్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు..అందరినీ ఏకతాటిపై నడిపించడం కూడా కొత్త ఇన్చార్జ్ ముందున్న సవాళ్ళు. కొత్త ఇన్చార్జ్ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంతవరకు బాగుపడుతుందో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మాణిక్‌రావ్ రాకతోనైనా ‘మారేనా’?
సాక్షి, హైదరాబాద్: మాణిక్యం ఠాగూర్ మారారు.. మాణిక్‌రావు ఠాక్రే వస్తున్నారు.. మరి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారుతుందా? మాణిక్యం కుదర్చలేని సమన్వయం మాణిక్రావ్తో సాధ్యమవు తుందా? మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లపాటు పనిచేసిన అనుభవంతో తెలంగాణ కాంగ్రెస్‌కు ఆయన ఎలాంటి చికిత్స చేయబోతున్నారనేది ఇప్పుడు టీకాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరు ణంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే రాకతోనైనా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మారుతుందా అని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌లో ఒకప్పుడు కీలకనేతగా గుర్తింపు పొందిన మాణిక్‌రావ్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరని తెలుస్తోంది. తన పని తాను చేసుకుని పోతున్న తరుణంలో అధిష్టా నం వెతికి మరీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలు అప్పజెప్పడానికి గల కారణమేంటనేది కూడా చర్చనీయాంశమైంది. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా పేరున్న ఠాక్రే ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడటం, సొంత పార్టీలో పరిస్థితులను చక్కబెట్టడంలో దిట్ట అని, తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కృషి చేశారనే చర్చ జరుగుతోంది. శరద్‌పవార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మహారాష్ట్ర హోంమంత్రిగా పనిచేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో పాలనానుభవం కూడా ఉందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ముందున్న ప్రధాన సవాల్ అయిన తెలంగాణ కాంగ్రెస్‌లోని గ్రూపు తగాదాలను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది. వచ్చేవారం రాక.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హోదాలో మాణిక్‌రావ్ ఠాక్రే వచ్చేవారం తెలంగాణకు రానున్నారని తెలుస్తోంది. వచ్చీరాగానే పార్టీ ముఖ్య నేతలందరినీ కలుస్తారని సమాచారం. కాగా, కొత్త ఇన్చార్జితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ఫోన్లో మాట్లాడారని, పార్టీ ఇన్చార్జిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు తెలంగాణకు రావాలని ఆహ్వానించారని తెలుస్తోంది. -
Manickam Tagore: చక్కదిద్దలేక.. స్వచ్ఛందంగా..!
సాక్షి, హైదరాబాద్: మాణిక్యం ఠాగూర్.. కాంగ్రెస్ రాష్ట్రాల ఇన్చార్జుల జాబితాలో పాపులర్ అయిన పేరు ఇది. తెలంగాణ ఇన్చార్జిగా ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ మూడు కొట్లాటలు, ఆరు తగాదాలన్నట్టుగా నిత్యం వార్తల్లో నిలిచింది. 2020 సెప్టెంబర్‌లో బాధ్యతలు తీసుకున్న ఆయన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకునే వరకు ప్రతిరోజూ ఏదో ఒక తలనొప్పితోనే సతమతమయ్యారు. పార్టీ నేతలను సమన్వయం చేయలేక, పరిస్థితులను చక్కదిద్దలేక, అధిష్టానానికి ఏం చెప్పాలో అర్థం కాక నానా అవస్థలు పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత ఈ తలనొప్పులు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టడం, తెలంగాణ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలగడం చర్చనీయాంశమయ్యింది. ఆయన రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పుకుంటారని, కొత్త ఇన్చార్జి వస్తారనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. విఫల ఇన్చార్జిగా మిగిలిపోతానని..! రాష్ట్ర పార్టీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించేందుకు మాణిక్యం ఠాగూర్ విముఖత వ్యక్తం చేయడం వెనుక పలు కారణాలున్నాయని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పారీ్టలోని కయ్యాలు తన వ్యక్తిగత కెరీర్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన భావించినట్టు తెలుస్తోంది. తాను ఇన్చార్జిగా వచ్చిన తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ వైఫల్యం తనకు చుట్టుకుంటే తానో విఫల ఇన్చార్జిగా మిగిలిపోతాననే ఆందోళన ఆయన రాష్ట్ర పార్టీ నేతల వద్ద వ్యక్తం చేశారు. పార్టీ పరిస్థితులను చక్కదిద్దలేకపోయానని అధిష్టానం భావిస్తే సంస్థాగతంగా కూడా తనకు ఇబ్బంది అవుతుందని భావించే వారని మాణిక్యంతో సన్నిహితంగా ఉన్న నేతలు వెల్లడించారు. దీనికి తోడు లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్నా.. తన సొంత నియోజకవర్గమైన విదురకు సమయం ఇవ్వలేకపోతున్నానని, కోరుకున్న విధంగా తమిళనాడు పీసీసీ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను నియోజకవర్గానికి వెళ్లిపోతానని ఆయన చెప్పేవారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. -
మాణిక్యం ఎగ్జిట్.. మాణిక్ ఎంట్రీ
సాక్షి,హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించి బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను అధిష్టానం తప్పించింది. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్‌రావ్ ఠాక్రేను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మాణిక్యం ఠాగూర్‌కు గోవా రాష్ట్ర వ్యవహారాలను అప్పగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాష్ట్రంలోని సీనియర్ నేతల ఒత్తిడితో పాటు, పార్టీ ఇన్చార్జిగా కొనసాగేందుకు మాణిక్యం సైతం విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో అధిష్టానం ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మాణిక్యంను తప్పిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు వెలువడడానికి కొద్దిగా ముందు, టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్‌రెడ్డి వేదాంత ధోరణిలో మాట్లాడడం పార్టీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘రేవంత్’ వేదాంతం.. పదవిలో ఉన్నా లేకున్నా పార్టీకి కట్టుబడి పనిచేస్తా. అధ్యక్షుడిగా వేరేవారిని నియమించినా భుజాలపై మోస్తా. పార్టీ కోసం పదవులను, అవసరమైతే ప్రాణాలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధం. అందరూ మానవమాత్రులే. అప్పుడప్పుడూ పొరపాట్లు జరుగుతాయి. వాటిని సరిదిద్దుకుంటాం. సీనియర్లు లేని శిక్షణ ‘హాథ్‌సే హాత్‌జోడో’ పాదయాత్రల గురించి చర్చించడంతో పాటు ధరణి పోర్టల్‌పై నేతలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు సీనియర్లు డుమ్మా కొట్టారు. ఏఐసీసీ సమన్వయకర్త గిరీష్ జోడంకర్ హాజరైన భేటీకి సీనియర్లు గైర్హాజరవడం చర్చనీయాంశమయింది. ఏఐసీసీ సమన్వయకర్త గిరీష్ జోడంకర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఈ భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి తదితరులు హాజరు కాగా.. కారణాలేవైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు లాంటి నాయకులు పాల్గొనకపోవడం చర్చనీయాంశమవుతోంది. పలు అంశాలపై టీపీసీసీ చర్చ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో బుధవారం ఏర్పాటు చేసిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా జనవరి 26 నుంచి నిర్వహించాల్సిన ‘హాత్‌సే హాత్‌జోడో’ పాదయాత్రల గురించి నేతలు చర్చించారు. ధరణి పోర్టల్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేతలకు అవగాహన కల్పించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన పక్షంలో బీమా కల్పన, మీడియాతో సమన్వయం, ఎన్నికల నిబంధనలు తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మల్లురవి, గాలి అనిల్‌కుమార్, సంపత్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి, చిన్నారెడ్డి, అంజ¯న్‌కుమార్ యాదవ్, హర్కర వేణుగోపాల్, రాములు నాయక్, నిరంజన్‌లతో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, పీసీసీ ప్రతిని«ధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ ఏ గట్టునుంటారో చెప్పండి: రేవంత్ ఈ సమావేశాన్ని రేవంత్‌రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరణ ద్వారా ప్రారంభించారు. సమావేశం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన వివాదాల విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ గట్టునుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. ‘గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ ఎటువైపు ? ఆస్తుల విభజనలో తెలంగాణ వైపా, ఆంధ్రప్రదేశ వైపా?’ అని ప్రశ్నించారు. ఎన్నో త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఆ గట్టున చేరిన కేసీఆర్ తెలంగాణను ముంచాలనుకుంటున్నాడని విమర్శించారు. రెండుసార్లు ప్రజలు అధికారమిచి్చనా కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని, కేసీఆర్ పాలనలో దగా పడని వర్గం లేదని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఉప్పెనలా కప్పేద్దాం కాంగ్రెస్ కార్యకర్తలంతా కార్యోన్ముఖులై కదలాలని, ఉప్పెనలా కేసీఆర్ కుటుంబాన్ని కప్పేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా తాను పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తానని, పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధమని అన్నారు. పార్టీ ఏ ఆదేశాలిచ్చినా సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ కుటుంబానికి జానారెడ్డి పెద్దదిక్కులాంటి వారని, ఆయన సూచనల ప్రకారం నడుచుకుని పార్టీని రాష్ట్రంలోని అన్ని మూలలకు తీసుకెళ్దామని చెప్పారు. కొన్ని దుష్టశక్తులు ఆశించినట్టుగా తెలంగాణ సమాజానికి నష్టం చేయబోమని కాంగ్రెస్ శ్రేణులు నిరూపించారని, తెలంగాణ ప్రజలకు నష్టం కలిగేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించబోదని ఈ వేదిక నుంచి సందేశం ఇద్దామని అన్నారు. ఐక్యంగా పనిచేస్తే అధికారం: జోడంకర్ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా హాత్‌సే హాత్‌జోడో యాత్రలు చేయాలని గిరీష్ జోడంకర్ పిలుపునిచ్చారు. ఈ యాత్రలను ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకోవాలని, హాత్‌సే హాత్‌జోడో యాత్రల విజయవంతం కోసం ఈనెల 8వ తేదీన జిల్లా, మండల, బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. పార్టీ నేతల మధ్య సమన్వయానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయన్నారు. నేతలందరూ ఐక్యంగా పనిచేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పారీ్టదే అధికారమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ పాదయాత్ర ఓ చరిత్ర అంతకుముందు సమావేశం ప్రారంభం సందర్భంగా సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర కాంగ్రెస్ పారీ్టదని, దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టేందుకే రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర ఓ చరిత్రగా నిలిచి పోయిందని, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ యాత్ర తోడ్పడిందని తెలిపారు. వైఎస్సార్ స్ఫూర్తితో తెలంగాణలో పాదయాత్రలు చేద్దామని రేవంత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హాత్‌సే హాత్‌జోడో యాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రతి గడపను తట్టి రాహుల్‌గాంధీ ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పారు. కేడర్‌ను ఉత్తేజితుల్ని చేయండి టీపీసీసీ సమావేశానంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ఏఐసీసీ నియమించిన హాత్‌సే హాత్‌జోడో అభియాన్ సమన్వయకర్త గిరీష్ జోడంకర్, రేవంత్‌రెడ్డిలు సమావేశమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కేడర్‌ను ఉత్తేజితులను చేయాలని, జనవరి 26 నుంచి జరగనున్న పాదయాత్రలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అదే విధంగా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా స్థానిక ప్రజలెదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చార్జిషీట్లు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారం దక్కించుకునే దిశలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా..మంత్రిగా.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మాణిక్‌రావు ఠాక్రే 2008 నుంచి 2015 వరకు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1985 నుంచి 2004 మధ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, 2009 నుంచి 2018 మధ్య ఎమ్మెల్సీగా పని చేశారు. శరద్ పవార్, విలాస్ రావు దేశ్ ముఖ్, సుశీల్ కుమార్ షిండేల మంత్రి వర్గాల్లో మూడుసార్లు వివిధ శాఖల మంత్రిగా సేవలందించారు. మంత్రిగా పరిపాలన అనుభవంతో పాటు దాదాపు ఎనిమిదేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మాణిక్‌రావ్ ఠాక్రేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
మాణిక్‌రావ్‌పై వేటు!?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను పదవి నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో దీనిపై ఢిల్లీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేసే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పదవిని ఆశిస్తున్న కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటి నుంచే పైరవీలు చేయడం ప్రారంభించారు. రాష్ట్రంలో ఏప్రిల్, మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, అనంతరం అక్టోబర్‌లో జరిగిన శాసన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో పార్టీని ప్రక్షాళన చేయాలని అధిష్టానం అప్పుడే నిర్ణయం తీసుకుంది. ఓటమికి గల ప్రధాన కారణమైన (కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మినహా) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను మార్చాలని ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో మహారాష్ట్ర కూడా ఉంది. దీంతో ఈ పదవిలో కొనసాగుతున్న మాణిక్‌రావ్ ఠాక్రేపై కూడా వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ, శాసన సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను మార్చాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది. దీంతో మాణిక్‌రావ్ ఠాక్రే అదనంగా మరో రెండు, మూడు నెలలు ఈ పదవిలో కొనసాగే అవకాశం లభించింది. కాని ఇప్పుడు తప్పేటట్టు లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులను మార్చివేసే ప్రక్రియ ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ప్రారంభించింది. త్వరలో మహారాష్ట్ర వంతు కూడా రానుంది. ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకాగానే ప్రదేశ్ అధ్యక్షున్ని మార్చాలనే అంశం తెరమీదకు వచ్చింది. శాసన సభ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా రావాలంటే ఠాక్రేను మార్చాలని కొందరు ఠాక్రే వ్యతిరేకులు డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని నాయకులు ఢిల్లీ అధిస్టానానికి లేఖలు పంపించారు. కాని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎలాంటి మార్పులు చేయకుండా శాసన సభ ఎన్నికల ముందుకు వెళ్లారు. చివరకు ఊహించిందే జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ అధిష్టానం ద్వారా ఈ అంశం మళ్లీ తెరమీదకు రావడంతో ఆ పదవిని ఆశిస్తున్న నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై ఇంతవరకు ఎవరి పేరు తెరమీదకు రాకపోయినా ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
బీజేపీ సర్కార్‌కు రాజ్యాంగ చట్టబద్ధత లేదు..
ముంబై: రాష్ట్రంలో సీఎం ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకు రాజ్యాంగ చట్టబద్ధత లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. మైనారిటీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బుధవారం జరిగిన బలపరీక్షలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదని ఆరోపించారు. ఓటింగ్ నిర్వహించాల్సి ఉండగా, మూజివాణి ఓటుతో గెలిచినట్లు ప్రకటించుకోవడంలో ఔచిత్యమేమిటో ఆ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఆ పార్టీ బలపరీక్షలో నెగ్గలేదని, గందరగోళం మధ్య స్పీకర్ ప్రభుత్వం బలనిరూపణలో నెగ్గిందని ప్రకటించేశారని ఆయన ఆరోపించారు. పార్టీ ప్రతినిధి బాల్ చంద్ర ముంగేకర్ మాట్లాడుతూ.. సభలో స్పీకర్ తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. మూజివాణి ఓటింగ్‌ను స్పీకర్ పూర్తిగా నిర్వహించలేదని, బీజేపీ మైనారిటీ సర్కారుకు ఎవరు మద్దతు ఇస్తున్నారో.. ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో పూర్తిగా నమోదు చేయలేదని విమర్శించారు. కాగా, విపక్షాలు సరైన సమయంలో మూజివాణి ఓటింగ్‌కు వ్యతిరేకంగా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని బీజేపీ చేస్తున్న ఎదురుదాడిని ఆయన ఖండించారు. సీనియర్ నేత అశోక్ చవాన్ మాట్లాడుతూ.. విశ్వాస పరీక్ష సమయంలో ఓటింగ్‌కు స్పీకర్ అనుమతించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కాగా, శుక్రవారం గవర్నర్‌ను కలిసి తిరిగి విశ్వాస పరీక్ష నిర్వహించాలని కోరుతామని మాణిక్‌రావ్ ఠాక్రే పేర్కొన్నారు. -
ఎంపీసీసీ అధ్యక్ష పదవికి మాణిక్‌రావ్ రాజీనామా
సాక్షి, ముంబై: శాసన సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆదివారం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామ ప్రతులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. మిత్రపక్షమైన ఎన్సీపీతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా బరిలో దిగిన కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కనీసం 50 స్థానాలు కూడా దక్కించుకోలేని దుస్థితి ఏర్పడింది. మాణిక్‌రావ్ ఠాక్రే కుమారుడు రాహుల్ ఠాక్రే సొంత నియోజకవర్గమైన యావత్మాల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇటు పార్టీ, అటు కుమారుడు ఓడిపోవడంతో ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాత్రం దక్షిణ కరాడ్‌లో విజయ ఢంకా మోగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఇవ్వకపోవడంతో విలాస్‌కాకా ఉండాల్కర్ తిరుగుబాటు చేశారు. చవాన్‌కు వ్యతిరేకంగా బరిలోదిగి గట్టిపోటీనిచ్చారు. అయినప్పటికీ ఆయన్ని విజయం వరించలేకపోయింది. -
పీసీసీ అధ్యక్ష పదవికి ఠాక్రే రాజీనామా
ముంబై: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే ఆదివారం ముంబైలో వెల్లడించారు. రాజీనామా లేఖను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేది లేదని ఎన్సీపీ తెగేసి చెప్పింది. అలాగే బీజేపీ, శివసేన కూడా తమ బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించాయి. దీంతో ఈ ఎన్నికల్లో నాలుగు పార్టీలు ఒంటరిగానే పోటీ చేశాయి. బీజేపీ మాత్రం దూసుకుపోతు ముందు వరసలో ఉంది. ఆ తర్వాత స్థానాన్ని శివసేన ఆక్రమించింది. మూడో స్థానాన్ని కాంగ్రెస్, ఎన్సీపీలు నిలిచాయి. -
‘పొత్తు’ మెడపై కత్తి
న్యూఢిల్లీ/ముంబై: మరో ఒకటి, రెండు రోజుల్లో ఎన్సీపీ సానుకూలంగా స్పందించకపోతే ప్రజాస్వామ్య కూటమి ఇబ్బందుల్లో పడే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే కిందటిసారి తాము 174 సీట్లలో పోటీ చేశామని, ఈసారి కూడా ఆ స్థానాలన్నింటికీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని ఆయన వివరించారు. శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో సీట్ల పంపకంపై ఇంకా ఒప్పందం కుదరకపోతే మొత్తం 288 సీట్లకూ అభ్యర్థులను నిలబెట్టే విషయమై ఆలోచిస్తున్నామన్నారు. ఏదేమైనా పొత్తును, సీట్లను ఖరారు చేయాల్సింది తమ పార్టీ అధిష్టానమేనని ఆయన స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేయగా, ఎన్సీపీ 114 నియోజకవర్గాల్లో బరిలోకి దిగింది. ఈసారి తమకు సగానికి సగం 144 సీట్లు కావాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రెండు పార్టీల భాగస్వామ్యం 50:50గా ఉండాలని అంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు, ఎన్సీపీ నాలుగు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, న్యూఢిల్లీలో సోనియాగాంధీతో రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్సీపీతో సీట్ల పంపకం అంశాలపై చర్చించారు. ఎన్సీపీకి 130 సీట్లు ఇవ్వాలని ఆ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలి పాయి. ఈసారి ఎన్నికల్లో సీఎం పృథ్వీరాజ్ చవాన్ పోటీ చేస్తారా? చేస్తే ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు మాణిక్‌రావ్ నిరాకరించారు. తన సొంత జిల్లా సతారాలోని కరాద్ దక్షిణ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని చవాన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విధానమండలి సభ్యునిగా ఉన్నారు. -
‘చేయి’జారలే..!
సాక్షి ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీని కూడా వీడనున్నట్లు వచ్చిన ఊహాగానాలకు మాణిక్‌రావ్ మంత్రాంగంతో తెరపడింది. నారాయణ రాణే జులై 21న మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా అనంతరం ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. అధిష్టానం నుంచి సరైన స్పందన రాలేదని, దీంతో రాణే పార్టీని వీడనున్నారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే రాణేను బుజ్జగించేందుకు అధిష్టానం మాణిక్‌రావ్ ఠాక్రేను రంగంలోకి దించింది. వీరిమధ్య మంగళవారం సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం రాణే తన రాజీనామాను వెనక్కితీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ, మంత్రిపదవిలోనూ కొనసాగుతానని స్వయంగా రాణే ప్రకటించారు. ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతో చర్చల అనంతరం మంగళవారం సాయంత్రం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలోని ధ్యానేశ్వరి నివాసస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణే మాట్లాడుతూ... మంత్రి పదవిని చేపట్టి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన డిమాండ్లను నెరవేరుస్తామని పార్టీ అధిష్టానం నుంచి హామీ లభించిందని చెప్పారు. ఈసారి మాట తప్పబోమంటూ పార్టీ చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాన్నారు. మంత్రిపదవికి చేసిన తన రాజీనామాను ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ ఇంత వరకు స్వీకరించలేదన్నారు. దీంతో తాను మంత్రి పదవిలో కొనసాగడంతోపాటు పార్టీలో క్రియశీలంగా వ్యవహరించనున్నట్టు స్పష్టం చేశారు. మూడు నెలలు అధ్యక్ష పదవి కావాలి... రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడునెలపాటు తనను అధ ్యక్షుడిగా కొనసాగించాలని అధిష్టానాన్ని కోరానని, బుధవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రాణే వివరణ ఇస్తూ... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని భావించానని, విషయాన్ని అధిష్టానానికి తెలిపానన్నారు. అయితే ఈసారి పోటీ చేయాల్సిందిగా అధిష్టానం కోరిందని, దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని రాణే స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు తన కుమారుడు నితేశ్ రాణే పోటీ చేయడానికే తాను తొలి ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. ఉద్దవ్‌పై మండిపాటు... శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేతోపాటు శివసేనలో చేరిన దీపక్ కేసర్కర్పై రాణే తీవ్రంగా మండిపడ్డారు. ఘాటైన పదజాలంతో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. కేవలం శివసేన అధినేత దివంగత బాల్‌ఠాక్రే కారణంగా ఉద్ధవ్‌కు రాజకీయాల్లో చోటు దక్కిందనే విషయం మరచిపోవద్దని విమర్శించారు. లోకసభ ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా అసెంబ్లీలో కూడా అలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని కలలు కంటున్న ఉద్ధవ్‌కు భంగపాటు తప్పదన్నారు. ఎన్సీపీని వీడి, శివసేన పార్టీలో చేరి దీపక్ కేసర్కర్పై కూడా రాణే విమర్శలు కొనసాగించారు. ఎమ్మెల్యేగా విఫలమైన కేస్కర్ శివసేనలో చేరారని, అసలు కేస్కర్ ఎవరని ప్రశ్నించారు. అభివృద్ధి పనులే మా ఎజెండా... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ది పనులే ఎజెండాగా కాంగ్రెస్ ముందుకెళ్తుందన్నారు. మంచిరోజులు వస్తాయంటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రజలను మోసగించారని, ఆయన పాలనలో ధరలు మరింతగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఈసారి రాష్ట్ర ప్రజలు మోడీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. -
పోయివచ్చిరి హస్తినకు..!
ఢిల్లీకి క్యూ కట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సాక్షి, ముంబై: కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు శనివారం ఢిల్లీకి క్యూకట్టారు. అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నందున రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుందంటూ వారంరోజులుగా మీడియాలో అనేకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చవని, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను కూడా మార్చనున్నారంటూ మీడియా ఊదరగొట్టింది. దీంతో ఈ విషయంపై సీఎం చవాన్ కూడా స్వయంగా స్పందించారు. ఇప్పటిదాకా తనకు ఎటువంటి సమాచారం లేదని, మీడియాలో వస్తున్నవన్నీ కబుర్లేనంటూ కొట్టిపారేశారు. అయితే మరుసటి రోజు ఉదయమే ఆయన ఢిల్లీ విమానం ఎక్కారు. ఆ వెనుక విమానాల్లో పార్టీలోని కీలక నేతలుగా చెప్పుకుంటున్న నారాయణ్ రాణే, శివాజీరావ్ మోఘే తదితరులు ప్రయాణమయ్యారు. దీంతో మీడియాలో వస్తున్న కథనాలు నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారిలో మొదటి నుంచి రాణే పేరు వినిపిస్తోంది. ఆయన ఇటీవల సోనియాతో సమావేశమైనట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇక పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి కోసం మోఘే ఫైరవీలు చేస్తున్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. దీంతో వీరిద్దరు కూడా విమానం ఎక్కడంతో అధిష్టానం వీరిని పిలిపించిందా? అనే అనుమానాలు తలెత్తాయి. ఇదిలావుండగా అటు ఢిల్లీలో సీన్ మాత్రం మరో ఉన్నట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం దాకా పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి చవాన్ బిజీబిజీగా గడిపారు. రాణే, మోఘే ఎవరిని కలిశారన్న సమాచారం అందకపోయినప్పటికీ మీడియా ప్రతినిధులు మాత్రం పూర్తిగా చవాన్పైనే దృష్టిపెట్టారు. అయితే సాయంత్రం 5.30 గంటల సమయంలో అధినేత్రి సోనియాతో చవాన్ భేటి అయినట్లు తెలిసింది. అయితే పార్టీ పెద్దలు మాత్రం పార్టీ అంతరంగం ఏమిటనే విషయం నేరుగా చెప్పకుండా రకరకాల లీకులు మీడియాకు విడుదల చేశారు. షిండేకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు వెళ్లాయని కొందరు చెప్పగా నాయకత్వ మార్పుపై పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించేందుకు మొగ్గుచూపుతోందని మరికొందరు చెప్పారు. దీంతో అసలు విషయం ఏమిటన్నది తేలలేదు. -
కథనాలన్నీ ‘కబుర్లే’!
సాక్షి, ముంబై: తనతోపాటు ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను మారుస్తున్నారంటూ పత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాల్లో నిజం లేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఈ విషయమై పుణేలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనున్నట్లు వస్తున్న కథనాల్లో నిజం లేదు. అధిష్టానం ఈ విషయమై ఎటువంటి ఆలోచనలు చేయలేదు. ఇవన్నీ కేవలం వార్తాపత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాలు మాత్రమే. ఒకవేళ అదే నిజమైతే అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తా. వారు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతగా నిర్వర్తిస్తా. లోకసభ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. దీంతో తమ పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీనికి బాధ్యత వహిస్తూ తాము అప్పుడే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధిష్టానానికి చెప్పాం. పార్టీలో అవసరమైన మార్పులు చేయాలని మేమందరం అధిష్టానాన్ని కోరాం. అయితే ఇదంతా ఎన్నికల ఫలితాల అనంతరమే జరిగింది. అప్పటి పరిణామాలపై మీడియాలో ఇప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయి. తాజాగా అధిష్టానం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా నాకు తెలియదు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఆమోదయోగ్యమే. ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తాన’న్నారు. ఎన్నికలపై చర్చలు జరిగాయి... రాబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంపై ఎన్సీపీతో ఇటీవల చర్చలు జరిగాయని పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఎలాంటి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకెళ్లాలనే విషయంపై పార్టీ సీనియర్ నాయకులతో ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ చర్చలు జరిపారని, అదే విషయమై తనతోకూడా చర్చలు జరిపారన్నారు. నాయకత్వమార్పు విషయంపై తమ మధ్య ఎటువంటి చర్చలు జరగలేదన్నారు. తనకు ఏదైనా సమాచారం అందితే ముందుగానే మీడియాకు తెలియజేస్తానని చెప్పారు. ఇదిలాఉండగా ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ కూడా నాయకత్వ మార్పు కథనాలను కొట్టిపారేశారు. ఎన్నికలముందు ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టంచేశారు. -
బాధితులకు సీఎం పరామర్శ
షోలాపూర్, న్యూస్‌లైన్: దక్షిణ షోలాపూర్ తాలూకాలోని పలు ప్రాంతాలలో వడగండ్ల వర్షం కురిసి పంటలు కోల్పోయిన రైతులను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంగళవారం ఓదార్చారు. ఎడ్లబండిపై చవాన్ తాలూకాలోని హోటగి, పతాటె వాడి, కాజికణబసు గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాలలో వడగండ్ల వానవల్ల పంట పొలాలకు తీవ్రనష్టం వాటిల్లింది. పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ద్రాక్ష తోటలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. పశువులు, గొర్రెలు అధిక సంఖ్యలో మృతి చెందాయి. స్థానిక ఇళ్లలో గోడలు కూలి, పైకప్పులు పడిపోవడంతో కొంతమంది నిరాశ్రయులయ్యారు. సీఎం చవాన్ ఉదయం విమానం ద్వారా పట్టణ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే స్వాగతాలను పక్కనపెట్టి వెంటనే వడగండ్ల వానకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఆయన వెంట పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే, పునరావాస శాఖ సహాయ మంత్రి పతంగ్‌రావు కదంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. నష ్టనివారణ విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనేకమంది ముఖ్యమంత్రికి తమ ప్రాంతాలకు సంబంధించిన నివేదికలు అందజేశారు. మధ్యాహ్నం సీఎం తన పర్యటనను ముగించుకొని ఉస్మానాబాద్‌కు వెళ్లారు. -
నేర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓటమి
సాక్షి, ముంబై: యవత్మాల్ జిల్లా నేర్ మున్సిపాలిటీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఇక్కడ గెలుపు కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే అన్ని ప్రయత్నాలూ చేశారు. అయినా చివరకు పరాజయాన్నే చవిచూడాల్సి వచ్చింది. మొత్తం 18 స్థానాల్లో శివసేన తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీలు కూట మిగా ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. ఇక్కడి ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే బరిలో దిగినా ఇరుపార్టీలకు చుక్కెదురయింది. మొత్తం 18 స్థానాలకు ఏకంగా 111 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఇందులో శివసేన తొమ్మిది స్థానాలు కైవసం చేసుకోగా, ఎన్సీపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిగతా రెండిం టిలో ఒకచోటసేన మద్దతుదారుడు విజయఢంకా మోగించగా మరోస్థానంలో ఇండిపెండెంట్ గెలిచా డు. ప్రముఖ పార్టీలు సహా ఆర్పీఐ, బీఎస్పీ, ఎమ్మెన్నెస్ కూడా బరిలో దిగినా ఆశించిన ఫలితాలు రాలేదు.సేన, కాంగ్రెస్‌లో తిరుగుబాటుదారుల బెడద అధికంగా ఉంది. తిరుగుబాటుదారులు శివసైనపై అంతగా ప్రభావం చూపకున్నప్పటికీ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ ఎన్నికల్లో శివసేన తరఫున ఎమ్మెల్యే సంజయ్ రాథోడ్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే సంజయ్ దేశ్‌ముఖ్ ప్రచార బాధ్యతలు తమ భుజస్కందాలపై వేసుకున్నారు. నేర్ మున్సిపాలిటీ మాణిక్‌రావ్ ఠాక్రే పాత శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి రావడంతో ఇక్కడ గెలుపు కాంగ్రెస్‌కు తప్పనిసరిగా మారింది. గెలుపు కోసం ఠాక్రే చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి నిరాశే ఎదురైన నేపథ్యంలో వచ్చే సంవత్సరం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటనే చర్చ మొదలయింది. లోహా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ హవా నాందేడ్ జిల్లా లోహా మున్సిపాలిటికి ఇటీవల జరి గిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది. 16 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఎమ్మెన్నెస్ తొమ్మిది స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించుకుంది. ఎన్సీపీ ఒక్కస్థానమూ దక్కించుకోలేకపోయింది. అదే ఒంటరిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ ఏడు స్థానాలను దక్కించుకుంది. గత అనేక సంవత్సరాల నుంచి లోహా మున్సిపాలిటీ కాంగ్రెస్ అధీనంలోనే ఉండేది. ఇప్పుడది ఎమ్మెన్నెస్ చేతిలోకి వెళ్లింది. -
చర్చలు జరగాల్సిందే!
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్థానాలకు సంబంధించి కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య చర్చలు జరగాల్సిందేనని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. సోమవారం ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘ఎన్సపీతో కలిసి పనిచేసేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎన్నికల్లో పోటీ చేయనున్న స్థానాలపై ఇరుపార్టీలు కూర్చుండి మాట్లాడుకోవాల్సిన అవసరముంది. 2004, 2009 సాధారణ ఎన్నికల సమయంలో ఇరుపార్టీలు సమావేశమై సీట్ల పంపకాల గురించి చర్చించుకున్నారు. మరి ఇప్పుడలా ఎందుకు జరగడంలేదు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుపార్టీల పెద్దలు ఈ విషయమై చర్చలు జరపాల్సిందే’నన్నారు. సీట్ల పంపకాలపై కసరత్తు పూర్తయిందని, పాత ఫార్ములా ప్రకారమే లోక్‌సభ ఎన్నికలకు ఇరుపార్టీలు వెళ్తాయని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ఇటీవల విలేకరుల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ ‘ఎలాంటి చర్చలు జరగకుండా ఎన్నికలకు ఎలా వెళ్తామ’ంటూ ప్రశ్నించారు. కేంద్రస్థాయిలో చర్చలు జరిగిన విషయం తనకు తెలియదని, అలా జరిగినట్లు ఇప్పటిదాకా తన దృష్టికి రాలేదన్నారు. ఇదిలాఉండగా ఇద్దరు నేతలు తాజాగా చేసిన విభిన్న ప్రకటనలతో కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాల విషయమై సయోధ్య కుదరలేదనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజన్ 2014ను ప్రారంభించనున్న రాష్ట్ర కాంగ్రెస్ వచ్చే సంవత్సరం జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్ర కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇందుకోసం 21న జరగనున్న మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ‘విజన్ 2014’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే సోమవారం పాత్రికేయులకు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణే, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ కార్యదర్శి మోహన్ ప్రకాశ్ తదతరులు పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘వచన్ పూర్తి’ పేరుతో కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాక ‘వికాస్ రథ్యాత్ర’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి కూడా రూపకల్పన చేస్తున్నామని మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. -
సీఎం, పీసీసీ అధ్యక్షుడి మధ్య విభేదాలు!
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు అవసరమైతే సీనియర్ మంత్రులను బరిలోకి దింపుతామని సీఎం పృథ్వీరాజ్ చవాన్ చేసిన ప్రకటనతో ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే విభేదించారు. వారిని లోక్‌సభ స్థానాలకు బరిలోకి దింపాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ మాటలను బట్టి వీరి మధ్య సమన్వయం లేకపోవడంతోపాటు విభేదాలు కూడా ఉన్నాయని తెలుస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. గతంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేల మధ్య అంతర్గత కలహాల కారణంగా కోల్డ్ వార్ సాగుతుందన్న వార్తలు పలుమార్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రతిసారీ వీరు అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తూ వస్తున్నారు. అయితే వీరిద్దరి వ్యాఖ్యలు, పరిణామాలను చూస్తే విభేదాలున్నాయని తెలుస్తోంది.తాజాగా కేంద్రంలో మరోసారి అధికారం దక్కించుకునేందుకు అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పట్టున్న రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయమై సీఎం పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ లోక్‌సభ స్థానాలను మరిన్ని పెంచుకునేందుకు సీనియర్ మంత్రులను బరిలోకి దింపేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. దీంతో అనేకమంది మంత్రులు ఈసారి లోకసభకు వెళ్లనున్నట్టు అందరూ భావించారు. అయితే మాణిక్‌రావ్ ఠాక్రే మాత్రం ఈ విషయంపై మరోలా స్పందించారు. సీనియర్ మంత్రులను బరిలోకి దింపాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే అనేక మంది గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులు తమ పార్టీలోనే ఉన్నారని ఆయన చెప్పారు.