సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల పనితీరుపై థాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు నియోజకవర్గాల్లో పర్యటించకపోవడంపై థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, శనివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల సమావేశంగా హాట్ హాట్‌గా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలపై ఇన్‌ఛార్జ్ థాక్రే ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో ఉండకపోతే నష్టమేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేయాలని థాక్రే సూచించారు. నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. గట్టిగా కష్టపడితే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యేలా వాస్తవాలను ప్రచారం చేయాలి. మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించాలి అని అన్నారు.
మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర వేయి కిలోమీటర్లకు చేరుకోవడంతో అభినందించారు. సీట్ల కేటాయింపు ఎవరి చేతుల్లో ఉండదు. సర్వేల్లో మంచి పేరు ఉంటేనే సీటు ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా నా సీటు నా చేతుల్లో కూడా ఉండదు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో సిద్దరామయ్య ఒక సీటు కోరినా ఇవ్వలేదు. పార్టీ సర్వే చేసి చెప్పిన చోట పోటీ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అందరూ పార్టీ కోసమే పనిచేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్నవారు ప్రతీ 15 రోజులకు ఒక నివేదిక ఇవ్వాలి. బోయినపల్లి రాజీవ్‌గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంకుస్థాపనకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: బండికి కేంద్రమంత్రి పదవి.. టీబీజేపీ చీఫ్‌గా డీకే అరుణ!
Comments
Please login to add a commentAdd a comment