reavanth reddy
-
యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌కు సీఎం రేవంత్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు సీఎం రేవంత్ సహా మంత్రులు ఆదివారం యశోద ఆసుపత్రికి వెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం రేవంత్.. కేటీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వార్డులో ఉన్న కేసీఆర్ వద్దకు రేవంత్, కేటీఆర్ కలిసి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం, యశోద ఆసుపత్రి వద్ద రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్‌ను పరామర్శించాను. ఆయన కోలుకుంటున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీ రావాలి’ అని కామెంట్స్ చేశారు. ఇక, మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్లో కాలిజారి కిందపడిపోవడంతో ఎడమ కాలి తొంటికి తీవ్ర గాయమైంది. దీంతో, కేసీఆర్‌కు యశోద ఆసుపత్రి వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేశారు. కాగా, ఆపరేషన్ అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు. వాకర్ సాయంతో కేసీఆర్‌ను వైద్యులు నడిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. Sir❤️ pic.twitter.com/w0X2mj1BEM — Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) December 9, 2023 -
శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
సాక్షి, తిరుమల: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. జోరు మీదున్న తెలంగాణ ఎన్నికల ప్రచారానికి పండుగ బ్రేక్ రావడంతో ఆయన తిరుమల వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆంధ్ర, తెలంగాణ మధ్య మానవ, ఆర్ధిక, రాజకీయ సంబంధాలు ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ‘రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం కావాలని స్వామి వారిని కోరుకున్నా. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి కట్టుగా ఉండాలని ప్రార్ధించా. రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నా’ అని రేవంత్ అన్నారు. కాగా,రేవంత్‌రెడ్డి శనివారం రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురి కాంగ్రెస్ విజయభేరి సభల్లో పాల్గొని సుడిగాలి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. -
బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు
సాక్షి, న్యూఢిల్లీ/గద్వాల రూరల్: జోగుళాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీఆర్ఎస్ నాయకురాలు సరితా తిరుపతయ్య దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన కార్యక్రమంలో సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరారు. ఇక, వీరితో పాటు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి. మాజీ మార్కెట్ యార్డు చైర్పర్సన్ బండ్ల లక్ష్మీదేవి దంపతులు, గట్టు సర్పంచ్ ధనలక్ష్మి దంపతులు, ధరూరు మండలానికి సీనియర్ నేతలు రాఘవేంద్రరెడ్డి, సోము, మల్దకల్ మండలం సీనియర్ నేత అమరవాయి కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరి వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: కోర్టులో కలుద్దాం.. మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు సుఖేశ్ లేఖ -
ఇలా చేస్తే కష్టమే.. కాంగ్రెస్ నేతలపై థాక్రే సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల పనితీరుపై థాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు నియోజకవర్గాల్లో పర్యటించకపోవడంపై థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, శనివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల సమావేశంగా హాట్ హాట్‌గా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలపై ఇన్ఛార్జ్ థాక్రే ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో ఉండకపోతే నష్టమేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేయాలని థాక్రే సూచించారు. నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. గట్టిగా కష్టపడితే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యేలా వాస్తవాలను ప్రచారం చేయాలి. మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించాలి అని అన్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర వేయి కిలోమీటర్లకు చేరుకోవడంతో అభినందించారు. సీట్ల కేటాయింపు ఎవరి చేతుల్లో ఉండదు. సర్వేల్లో మంచి పేరు ఉంటేనే సీటు ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా నా సీటు నా చేతుల్లో కూడా ఉండదు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో సిద్దరామయ్య ఒక సీటు కోరినా ఇవ్వలేదు. పార్టీ సర్వే చేసి చెప్పిన చోట పోటీ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అందరూ పార్టీ కోసమే పనిచేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్నవారు ప్రతీ 15 రోజులకు ఒక నివేదిక ఇవ్వాలి. బోయినపల్లి రాజీవ్‌గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంకుస్థాపనకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బండికి కేంద్రమంత్రి పదవి.. టీబీజేపీ చీఫ్‌గా డీకే అరుణ! -
జనవరి 26 నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర
-
ఇంట్లో పోరు ఉండొద్దు.. కారుతో పొత్తుండదు
టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యం టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను ఎదుర్కోవడంపైనే నేతలు దృష్టిపెట్టి పనిచేయాలి. టీఆర్‌ఎస్‌తోగానీ, ఎంఐఎంతోగానీ పొత్తు, స్నేహం లాంటి ఆలోచనలు ఉండనే ఉండవు. అలాంటి ఊహాగానాలను పట్టించుకోవద్దు. టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యం. కొత్తవాళ్లను చేర్చుకోవడంపై దృష్టి పెట్టండి, యువతకు పెద్దపీట వేయండి. మనం.. ఓ కుటుంబం.. గతంలో జరిగింది.. జరిగిపోయింది.. మనమంతా ఒక కుటుంబం.. అందరం కలిసికట్టుగా పనిచేయాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారం సాధించాలి. నేను కూడా తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తా.. –టీపీసీసీ నేతలతో రాహుల్‌గాంధీ సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను గట్టిగా ఎదుర్కోవడంపైనే దృష్టిపెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒక కుటుంబమని.. ఇక నుంచి పార్టీ నేతలంతా విభేదాలు మాని ఏకతాటిపైకి రావాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40మంది ముఖ్య నేతలు సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిశారు. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలు, ప్రభుత్వ విధానాలు, క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులు, అంతర్గత విభేదాలు, సంస్థాగత వ్యవహారాలు, పలు ఇతర అంశాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర నేతలు చెప్పిన అంశాలను విన్నారు. అనంతరం పలు సూచనలు చేశారు. మీడియా ముందు మాట్లాడొద్దు పార్టీలో ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని రాష్ట్ర నేతలకు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. మీడియా ముందు ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. ఏవైనా అభిప్రాయ భేదాలుంటే అధిష్టానానికి చెప్పుకొనేలా తాను ఏర్పాటు చేస్తానని.. పార్టీ అంతర్గత విషయాలను బయట చర్చిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారం సాధించాలని.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై పోరుబాట పట్టాలని ఆదేశించారు. తాను కూడా తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తానని పార్టీ నేతలకు మాట ఇచ్చారు. కాగా.. సమావేశంలో భాగంగా పలువురు నేతలు తమతో విడివిడిగా మాట్లాడాలని రాహుల్‌ను కోరారు. దీనిపై స్పందించిన రాహుల్.. త్వరలోనే అందరికీ వన్‌టూవన్ చర్చల కోసం సమయం ఇస్తానని మాట ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర నేతలు చెప్పే అంశాలను వినేందుకే రాహుల్ ప్రాధాన్యత ఇచ్చారని.. ఆయన కేవలం ఏడెనిమిది నిమిషాల పాటు మాత్రమే మాట్లాడారని తెలిసింది. సునీల్‌ను పరిచయం చేసిన రాహుల్ భేటీ సందర్భంగా సునీల్ కనుగోలును టీపీసీసీ నేతలకు రాహుల్‌గాంధీ పరిచయం చేసి, పలు సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి సునీల్ తన పని తాను చేసుకుంటున్నారని, ఆయనను ఓ ఏజెన్సీగా భావించవద్దని పేర్కొన్నట్టు తెలిసింది. సునీల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ అని, ఆయన పూర్తిగా ఏఐసీసీ పరిధిలో పనిచేస్తారని, అవసరమైనప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతల సాయం తీసుకుంటారని వివరించినట్టు సమాచారం. గతంలో మాట్లాడినవి మర్చిపోయా.. భేటీ సందర్భంగా తాను పార్టీకోసం ఏమేం చేశాననే దానిపై రాహుల్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరించినట్టు సమాచారం. కొన్ని కారణాల వల్ల తాను మాట్లాడాల్సి వచ్చిందని.. తనకు 10 నిమిషాలు సమయమిచ్చి, తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన రాహుల్.. అంతా ఓ కుటుంబంలా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. రాహుల్ చెప్పిన మాటతో తాను సంతృప్తి చెందానని, గతంలో తాను మాట్లాడిన విషయాలన్నీ మర్చిపోయానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు పార్టీలో కమ్యూనికేషన్ గ్యాప్ నెలకొందని.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తాము ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదని భేటీ సందర్భంగా పలువురు నేతలు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రాహుల్.. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా తాను చూసుకుంటానని చెప్పారు. పార్టీ అనుమతి లేకుండా టికెట్లను ప్రకటిస్తున్నారని, అలా జరగవద్దని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొనగా.. అలా టికెట్లు ప్రకటించడం సరైంది కాదని, భవిష్యత్తులో అలా జరగొద్దని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి రాహుల్ సూచించినట్టు తెలిసింది. ఇక గత ఎన్నికల సందర్భంగా పొత్తుల పేరుతో చివరి వరకూ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేకపోయామని, టికెట్లు వచ్చిన వారు సరిగా ప్రచారం చేసుకోలేకపోయారని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించినట్టు సమాచారం. ఆరు నెలలు, ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటిస్తే మంచిదని కూడా ఆయన కోరగా.. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించే అంశంపై కసరత్తు చేద్దామని రాహుల్ చెప్పినట్టు తెలిసింది. ఇక అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఓ స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. పీఏసీకి అధికారం ఇవ్వడమా, లేక కొత్త కమిటీ ఏర్పాటు చేయడమా అన్నదానిపై చర్చిద్దామనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. రాహుల్‌తో భేటీ అయిన నేతలు వీరే రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, వీరయ్య, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మధుయాష్కీగౌడ్, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వీహెచ్, రేణుకాచౌదరి, బలరాం నాయక్, పొన్నాల లక్ష్మయ్య, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, అజారుద్దీన్, గీతారెడ్డి, సంపత్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, ఎం.కోదండరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, కొండా సురేఖ, సుదర్శన్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు. -
నిరుదోగ్య సమస్యపై పోరాటానికి సిద్ధమవుతున్నాం
-
‘హరీష్ శిక్ష అనుభవిస్తున్నాడు’
కోస్గి (కొడంగల్): సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ఢిలీల్లో పోరాడతానని, నియోజకవర్గంలో పదేళ్ల కాలంలో రేవంత్‌రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం గాని, ప్రస్తుత ఎమ్మెల్యే గాని చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని మల్కాజ్గిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డికి శుక్రవారం కోస్గిలో పార్టీ నాయకులు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రశ్నించే వాడు లేకుంటే పాలించే వాడిదే రాజ్యమవుతుందని గుర్తించిన రాష్ట్ర ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని, ఢిల్లీలో ఉన్న కొడంగల్ ప్రజల ఆదరణ, అభిమానాన్ని ఎన్నడూ మర్చిపోనన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని, మున్సిపాలిటీలకు నిధులు కేంద్రమే ఇస్తుందని, కేంద్రంలో పోరాడి నిధులు తెచ్చే బాధ్యత నాదేనన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ పంపిన హరీష్‌రావు గతి ఇప్పుడేమైందో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. పొట్టోన్ని పొడుగొడు కొడితే.. పొడుగొన్ని పోశమ్మ కొట్టిందన్నట్టు హరీష్‌రావు కొడంగల్ ప్రజలకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నారన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు. అంతముందు రేవంత్‌రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ ఆలయంలో, కోస్గి శివారులోని సయ్యద్ పహాడ్ దర్గాలో పూజలు చేసి రామాలయం, శివాజీ చౌరస్తా మీదుగా రోడ్‌షో నిర్వహిస్తూ లక్ష్మీనర్సింహా గార్డెన్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో తిరుపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, రఘువర్దన్‌రెడ్డి, నరేందర్, రాఘవరెడ్డి, భీంరెడ్డి, బెజ్జు రాములు, గోవర్దన్‌రెడ్డి, ఆసీఫ్, విక్రంరెడ్డి, ఇద్రీస్, సురేష్‌రెడ్డి, అచ్యుతారెడ్డి పాల్గొన్నారు. -
రేవంత్, సండ్ర స్వర నివేదికలివ్వండి
-
ఓటుకు కోట్లు కేసులో కీలక నివేదిక
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు కీలక దశకు చేరుకుంది. స్టింగ్ ఆపరేషన్ లో ఉన్న వీడియో టేపులు నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నిర్ధారించింది. ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న వాయిస్ నిందితులదేనని తేల్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ నేత జెరూసలెం మత్తయ్య వాయిస్ తో సరిపోలినట్టు నిర్ధారించింది. ఇక ఎఫ్ఎస్ఎల్ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాయిస్ నమూనాను సేకరించాలని భావిస్తున్నామని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడానికంటే ముందు చంద్రబాబు స్వర నమూనా తీసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. అసెంబ్లీ, మీడియా చానల్స్ ద్వారా నిందితుల స్వర నమూనాలను సేకరించి ఎఫ్ఎస్ఎల్ పరీక్షకు పంపారు. స్టింగ్ ఆపరేషన్ ఆడియో, వీడియోల్లోని వాయిస్ తో నిందితుల వాయిస్ సరిపోలినట్టు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికను కోర్టుకు ఫోరెన్సిక్ అధికారులు సమర్పించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికను తమకు ఇవ్వాలని కోర్టును ఏసీబీ కోరనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెసన్ సన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. మే 30న బోయిగుడాలోని బిషప్ హ్యారీ సెబాస్టియన్ నివాసంలో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా మాటలను ఐఫోన్, డిజిటల్ రికార్ల ద్వారా రహస్యంగా రికార్డు చేయించారు. మే 31న విక్రంపురి కాలనీలోని తన మిత్రుడు మాల్కమ్ టేలర్ నివాసంలోనూ టీడీపీ నాయకుల మాటలను రికార్డు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తూ ఏసీబీకి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఈ సందర్భంగా సెబాస్టియన్ ఫోన్ లో రికార్డైన వాటిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక యాప్ ద్వారా ఆయన రికార్డు చేసినట్టు గుర్తించారు. దీంతో ఏసీబీ అధికారులకు అదనంగా మరో సాక్ష్యం దొరికినట్టైంది. ఇందులో 516 కాల్స్ రికార్డు కాగా అందులో 102 కాల్స్ ఓటుకు కోటుకు కేసుకు సంబంధించినవే అని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారానే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎఫ్ఎస్ఎల్ నివేదికతో ఈ కేసులో ఏసీసీ దర్యాప్తు వేగం పుంజుకోనుంది.