Gadwal ZP Chairperson Sarita Tirupataiah Joined In Congress - Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు

Published Fri, Jul 21 2023 9:36 AM | Last Updated on Fri, Jul 21 2023 10:43 AM

Gadwal ZP Chairperson Sarita Tirupataiah Joined In Congress - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/గద్వాల రూరల్‌: జోగుళాంబ గద్వాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్‌ నాయకురాలు సరితా తిరుపతయ్య దంపతులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నివాసంలో జరిగిన కార్యక్రమంలో సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరారు. 

ఇక, వీరితో పాటు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ సునీల్‌ రెడ్డి. మాజీ మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ బండ్ల లక్ష్మీదేవి దంపతులు, గట్టు సర్పంచ్‌ ధనలక్ష్మి దంపతులు, ధరూరు మండలానికి సీనియర్‌ నేతలు రాఘవేంద్రరెడ్డి, సోము, మల్దకల్‌ మండలం సీనియర్‌ నేత అమరవాయి కృష్ణారెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. వీరి వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.  

ఇది కూడా చదవండి: కోర్టులో కలుద్దాం.. మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు సుఖేశ్‌ లేఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement