సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పట్ల ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరుపైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో ప్రతినిధులకు ప్రతిరోజు అవమానాలేనా? ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పైన గద్వాల జిల్లా యంత్రాంగం వ్యవహరించిన అనుచిత తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేతిలో తిరస్కరించబడిన కాంగ్రెస్ నాయకులను అధికారిక సమావేశాలు, కార్యక్రమాల్లో ఎందుకు ఆహ్వానిస్తున్నారో? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానించేందుకు ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ విధానాలను ఏమైనా మార్చిందా? ’అని కేటీఆర్ నిలదీశారు.
Praja Palana where our public representatives are humiliated every day
I condemn the atrocious conduct of District officials who have insulted our MLA, Alampur Vijayudu Garu@TelanganaCS What is the reason for insisting on inviting the Congress party leaders who’ve been… https://t.co/p490wZePDl— KTR (@KTRBRS) August 6, 2024
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలపై వివాదం మంగళవారం వివాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్టు మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు. మోటార్లు ఆన్‌చేసి మూడు గంటలైనా నీళ్లు రాకపోవడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. తుమ్మిళ్ల నుంచి విజయుడు వెళ్లిన కొంత సమయానికి అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పంప్‌లను ఆఫ్ చేశారు. దీంతో ఆర్డీఎస్ కాలువకు నీరు నిలిచిపోయిందని ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రైతులతో కలిసి తుమ్మిళ్లకు లిఫ్ట్‌ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద రోడ్డుపై భైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తిత పరిస్థితి చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment