Gadwal
-
GHMC: అవగాహన లేకుండా ‘అవిశ్వాసం’
సాక్షి, హైదరాబాద్: బల్దియా పాలకమండలి ఏర్పాటై వచ్చే నెల 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం.. ఆ తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం జరగనున్న జీహెచ్ఎంసీ ప్రత్యేక బడ్జెట్, సాధారణ సర్వసభ్య సమావేశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ ఈ సమావేశాల సందర్భంగా ఏం జరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నా అందుకు పాలకమండలి సమావేశం వేదిక కాకపోయినప్పటికీ, పొలిటికల్ హీట్ మాత్రం పెరిగింది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం బీజేపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ నాయకుడు, ఎంపీ కె.లక్ష్మణ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. పలువురు పార్టీ అగ్రనేతలు కూడా హాజరైన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై నిలదీయాలని ఉద్భోదించారు. కేంద్రం నిధులివ్వడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే అంటున్నందున జీహెచ్ఎంసీలో ప్రజలు వేల కోట్ల పన్నులు కడుతున్నా మీరెందుకు వారికి పనులు చేయడం లేదని ప్రశ్నించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నిధులు ఎక్కడికి మళ్లిస్తున్నారో అడగాలని, ఆ నిధులన్నీ ఏం చేస్తున్నారో నిలదీయాలని సూచించారు. ముఖ్యంగా.. జీహెచ్ఎంసీ బడ్జెట్‌పైనా, ప్రజా సమస్యలపైనా గళమెత్తాలని ఆదేశించారు. సమస్యలపై ప్రశ్నించేందుకు బీజేపీ సభ్యులకు అవకాశమివ్వకపోవడం తగదన్నారు. ప్రశ్నల ద్వారా సమాధానాలు రాబట్టాలన్నారు. మేయర్‌పై అవిశ్వాసానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది. హాజరైన కార్పొరేటర్లు ముగ్గురే.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఆమె బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ కావడం తెలిసిందే. పాలకమండలి తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచి్చంది కేవలం రెండు కార్పొరేటర్ స్థానాలే అయినప్పటికీ, ఏడాది క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీలోనూ కాంగ్రెస్ బలం పెరిగింది. ప్రస్తుతం ఆ పారీ్టలో 24 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మేయర్ ఆహ్వానానికి కేవలం ముగ్గురు మాత్రమే హాజరు కావడం బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. అనుసరించాల్సిన వ్యూహం కోసం పిలిస్తే కనీస సంఖ్యలో కూడా సభ్యులు రాలేదు. అవగాహన లేకుండా ‘అవిశ్వాసం’ తనపై ఏ పార్టీవారు అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని మేయర్ విజయలక్ష్మి ఉప్పల్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. చట్టం, నిబంధనల మేరకు వారికా అవకాశం ఉందంటూ ఫిబ్రవరి 11 తర్వాత మాత్రమే అది సాధ్యమన్నారు. ఆలోగా ఏయే పార్టీలు కలిసి అవిశ్వాసం పెడతాయో చూద్దామన్నారు. అసలు అవిశ్వాసం పెట్టాలంటే ఎంత బలం ఉండాలో వారికి తగిన అవగాహన లేదన్నారు. తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అవినీతి వ్యాఖ్యలపై స్పందిస్తూ, పదేళ్లుగా తాను, దాదాపు యాభయ్యేళ్లుగా తనతండ్రి కేశవరావు రాజకీయాల్లో ఉన్నా.. మా లైఫ్‌స్టైల్ ఏంటో, కొత్తగా ఎమ్మెల్యేలైన బీఆర్ఎస్ వారి లైఫ్ స్టైల్ ఏంటో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చునన్నారు. బీజేపీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ వ్యాఖ్య జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పక్ష నాయకుడు దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఈటల రాజేందర్‌కు దక్కకుండా ఉండేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివిగా ప్లాన్ చేశారని ఆరోపించారు. గద్దర్‌కు అవార్డు ఇవ్వకపోవడం గురించి చేసిన వ్యాఖ్య ద్వారా బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల అర్హుడు కాదనే సంకేతాలిచ్చారన్నారు. -
మేయర్‌పై అవిశ్వాసం
సాక్షి, సిటీబ్యూరో: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మాన అంశం మంగళవారం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన విందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణల్లో మేయర్‌పై అవిశ్వాసం అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరించి వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం, ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగ తా అంశాలతో పాటు దీనిపై కూడా కొద్దిసేపు మా ట్లాడినట్లు తెలిసింది. విందుకు పలువురు నేతలు హాజరు కావడం.. మేయర్‌పై అవిశ్వాసానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఉండటంతో ఇదే అంశంపై చర్చ జరిగిందనే ప్రచారం వైరల్‌గా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ మారినందునే.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేయర్ పదవి కోసం ఎంతోమంది పోటీ పడినా.. గద్వాల్ విజయలక్ష్మికే బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. కాగా.. ఆమె కనీస కృతజ్ఞత లేకుండా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో అవిశ్వాసం అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేవలం కుటుంబ కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశంలో, తాము రాజకీయాల్లో ఉన్నందున రాజకీయ అంశాలు కూడా పిచ్చాపాటీగా చర్చకు వచ్చాయని పార్టీ నాయకుడొకరు తెలిపారు. వివిధ అంశాలతో పాటు మేయర్‌పై అవిశ్వాసం కూడా ప్రస్తావనకు వచ్చిందిని, అంతకు మించి ఎక్కువ చర్చ జరగలేదని చెప్పారు. బహుశా వచ్చే శనివారం.. లేదంటే ఆదివారం నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తదితరులతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఆ రోజు రాజకీయ అంశాలతో పాటు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితరాలపై ఎజెండాకు అనునుగుణంగా సమావేశం జరగనున్న ట్లు తెలిసింది. అదే సమావేశంలో మేయర్‌పై అవిశ్వాసానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇంతకీ ఏం జరగనుంది? మేయర్‌పై అవిశ్వాసం పెడితే ఏం జరగనుంది? గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పదవిని కోల్పోక తప్పదా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనలు, ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఆయా పార్టీల బలాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే పదవి పోయేంత ప్రమాదమేమీ లేదని మున్సిపల్ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. నిబంధనల మేరకు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల్లో (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) 50 శాతం మంది అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ.. నిరీ్ణత ప్రొఫార్మా ద్వారా సంతకాలు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 196 మంది ఉండగా, అందులో 98 మంది సంతకాలు చేస్తేనే అది సాధ్యం, బీఆర్ఎస్కు కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలు కలిసి 71 మంది సభ్యుల బలం ఉంది. ఆ పార్టీలు కలిసి వచ్చేనా? అవిశ్వాసం పెట్టాలంటే మరోపార్టీ కలిసి రావాలి. ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉండటం తెలిసిందే. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి నడుస్తుందని చెప్పలేం. ఇక మిగిలింది బీజేపీ. అది సైతం బీఆర్ఎస్తో కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ అవిశ్వాసం కోసమే రెండింటిలో ఏదో ఒక పార్టీ సభ్యులు లోపాయికారీగా సంతకాలు చేసి.. అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా అవిశ్వాసం నెగ్గే పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీలోని సంబంధిత సెక్షన్ 91–ఎ మేరకు మొత్తం ఓటు హక్కున్న సభ్యుల్లో మూడొంతుల మెజారిటీ ఉంటేనే అవిశ్వాసానికి కోరం ఉన్నట్లు లెక్క. ఆ లెక్కన ప్రస్తుతమున్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియోలను పరిగణనలోకి తీసుకుంటే 131 మంది సభ్యుల బలం ఉండాలి. బీఆర్ఎస్తో బీజేపీ కలిసినా, లేక ఎంఐఎం కలిసినా అది సాధ్యం కాదు. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే మొత్తం బలం 116 అవుతుంది. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసినా 122 అవుతుంది. కోరమే ఉండనప్పుడు అవిశ్వాసం ముందుకు వెళ్లే పరిస్థితే ఉండదని జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. -
శ్రీకృష్ణదేవరాయలకు రక్షణగా ‘గట్టు’
గద్వాల: శ్రీకృష్ణదేవరాయులు తన విజయనగర సామ్రాజ్యాన్ని ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకూ విస్తరించారు. ఆంధ్ర ప్రాంతంలో ఎత్తయిన ప్రదేశంగా ఉన్న గట్టు ప్రాంతంలో ఆయన శత్రువుల నుంచి రక్షణ కోసం కోటగోడ ప్రాకారాలు నిర్మించారు. ఈ క్రమంలోనే అక్కడ రాజ్యవిస్తరణ జరిగి గట్టు సంస్థానం వెలసినట్టు చరిత్రకారులు చెబుతారు. అందుకే శ్రీకృష్ణదేవరాయలను ఆంధ్ర, కన్నడ ప్రజలు గొప్ప చక్రవర్తిగా అభిమానిస్తారు. ఆంధ్రా భోజుడిగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడ్డారు.సోమనాద్రికి అండగా..పూడూరు కేంద్రంగా నలసోమనాద్రి గద్వాలలో తన రాజ్యస్థాపన చేసే క్రమంలో కోట నిర్మాణం చేశారు. అయితే దీనిని సహించని ఉప్పేరు నవాబు నలసోమనాద్రిపై యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలో ఉప్పేరు నవాబు రాయచూరు నవాబు సాయం కోరారు. గట్టు ఆరగిద్ద ప్రాంతంలో హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నలసోమనాద్రి విజయ దుందుభి మోగించారు. తన విజయంలో గట్టు ప్రాంతం ఎంతో కీలక పాత్ర పోషించిందని నలసోమనాద్రి చెప్పినట్టు చరిత్రకారులు చెబుతారు. ఆ యుద్ధం అనంతరం సోమనాద్రి తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకొని పాలించారు. రతనాల గట్టు.. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలం(1509–1529)లో సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఎనిమిది చావిడ్లు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గట్టు సంతబజారులో రతనాలు, బంగారు నాణేలను రాశులుగా పోసి క్రయవిక్రయాలు జరిపే వారని చరిత్ర తెలిసిన పెద్దలు నేటికీ చెబుతుంటారు. గట్టులో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. సారవంతమైన భూమిలో మంచి పంటలు పండించేవారు. శ్రీ కృష్ణదేవరాయలు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ప్రోత్సహించేవారు. అందులో భాగంగానే చెరువులు, కాల్వలు తవ్వించి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడ్డారు. అనేక రకాల పండ్ల తోటలు పెంచేవారు. వ్యవసాయాధార పరిశ్రమలు ప్రతి గ్రామంలోనూ ఉండేవి. బెల్లం, నీలిమందు తయారీ, వస్త్ర తయారీ వంటివి కూడా ప్రోత్సహించారు. గట్టులో పట్టుపరిశ్రమను ప్రోత్సహించారు. అప్పట్లో మగ్గాలపై వ్రస్తాలను తయారు చేసేవారు. ఇలా తయారు చేసిన వ్రస్తాలను రాయలసీమలోని రాయదుర్గానికి తరలించే వారని చెబుతారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాతి కాలంలో.. శ్రీకృష్ణదేవరాయల తర్వాతి కాలంలో పాలించిన రాజులు గట్టు ప్రాంతంపై నిర్లక్ష్యం చూపడంతో పూర్తి వెనుకబాటుకు గురైంది. దీంతో ఈ ప్రాంతంలో పేరుమోసిన ఓ దొంగ గట్టును ఆవాసంగా చేసుకున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దోచుకున్న సొమ్మును గట్టులో భద్రపర్చుకునే వాడని చెబుతారు. ఈ సొమ్ముకు కాపలాగా తన సోదరిని పెట్టగా.. ఆమె ఓ బాటసారిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న దొంగ తన సోదరిని పక్కనే ఉన్న గంగిమాన్దొడ్డిలో ఆమె చివరి జీవనం వరకు బందీగా చేశాడని చెబుతారు. రక్షణ ప్రాంతంగా.. కర్ణాటకకు సరిహద్దు ప్రాంతంగా ఉండే గట్టును శ్రీకృష్ణదేవరాయలు రక్షణ ప్రాంతంగా నిర్మించారు. గ్రామం చుట్టూ కోటబురుజులతో కూడిన ప్రహరీ, లోపల 8 వరకు చావిడిలను నిర్మించారు. వీటిపై అర్ధచంద్రాకార గుర్తులు ఉన్నాయి. చీకటి పడితే కోటగోడలపై కాగడాలు వెలిగించి, సైనికులు కాపలా కాసేవారని చెబుతారు. కరువుకు నిలయం..రాజుల కాలంలో సిరిసంపదలతో తులతూగిన గట్టు ప్రాంతం.. రాజులు పోయి, రాజ్యాలు అంతరించిన తర్వాత అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా పేరుగాంచింది. కరువుకు నిలయంగా మారింది. ఇక్కడి నుంచే పొట్టచేత పట్టుకొని కుటుంబాలకు కుటుంబాలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్న దైన్యస్థితి నెలకొంది.40 ఏళ్ల క్రితం..సుమారు 40 ఏళ్ల క్రితం గట్టు నేతాజీ చౌరస్తాలో గుప్తనిధుల తవ్వకాలలో పెద్దఎత్తున అలనాటి విలువైన నిధులు, బంగారు నాణేలు బయటపడ్డాయి. వీటిలో కొంతమేర అన్యాక్రాంతం కాగా.. మిగిలిన వాటిని ప్రభుత్వం స్వాదీనం చేసుకొని హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచారు. -
రాజసం... గద్వాల సంస్థానం
గద్వాల: కవులు.. కట్టడాలకు పేరుగాంచిన గద్వాల సంస్థానం వైభవం నేటికీ చెక్కుచెదరలేదు. రాజసానికి నిలువెత్తు నిదర్శనమైన గద్వాల సంస్థానం ఏర్పాటు ఆద్యంతం అత్యంత ఆసక్తికరం. నిజాం సంస్థానంతోపాటు 1948లో భారత యూనియన్‌లో విలీనమైన గద్వాల సంస్థానంపై సవివర కథనమిది. నల సోమనాద్రి ఆధ్వర్యంలో ఆవిర్భావం నల సోమనాద్రి (పెద సోమభూపాలుడు) క్రీస్తుశకం 1663లో గద్వాల మండలం పూడూరు కేంద్రంగా గద్వాల సంస్థానాన్ని ఏర్పాటు చేశారు. నాటినుంచి 1948 వరకు ఆయన వారసులు పాలన కొనసాగించారు. నలసోమనాద్రి 1663–1712 వరకు, తర్వాత కల్లా వెంకటన్న క్రీ.శ. 1712– 1716 వరకు, రమణయ్య క్రీ.శ. 1716– 1723 వరకు, తిమ్మక్క క్రీ.శ. 1723– 1725 వరకు, లింగమ్మ క్రీ.శ. 1725– 1740 వరకు, తిరుమలరావు క్రీ.శ. 1740– 1742 వరకు, మంగమ్మ క్రీ.శ. 1742– 1745 వరకు, చొక్కమ్మ క్రీ.శ. 1745– 1747 వరకు, రామరాయలు క్రీ.శ. 1747– 1761 వరకు, చినసోమభూపాలుడు– 2 క్రీ.శ. 1761– 1794 వరకు, రామభూపాలుడు–1 క్రీ.శ. 1794– 1807 వరకు, సీతారామభూపాలుడు–1 క్రీ.శ. 1807– 1810 వరకు, వెంకటలక్ష్మమ్మ క్రీ.శ. 1840– 1840 (4 నెలలు), సోమభూపాలుడు– 3 క్రీ.శ. 1840– 1844, వెంకటలక్ష్మమ్మ (మరల) క్రీ.శ. 1844–1845, రామభూపాలుడు–2 క్రీ.శ. 1845– 1901 వరకు, సీతారామభూపాలుడు– 2 క్రీ.శ. 1901–1924 వరకు, ఆ తర్వాత చివరి తరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ క్రీ.శ. 1924–1948 వరకు పాలన కొనసాగించారు. విద్వత్కవులకు పేరు.. గద్వాల సంస్థానం కవులకు పేరుగాంచింది. నలసోమనాద్రి, చినసోమభూపాలుడు, రామభూపాలుడు–2, సీతారామభూపాలుడు–2, మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ తదితరులు కవులకు పెద్దపీట వేసినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరి పాలనలోనే గద్వాల సంస్థానం విద్వత్కవుల ప్రాంతంగా వరి్ధల్లింది. వీరి పాలనలో సంస్థాన కవులు, సంస్థాన ప్రాంత నివాస కవులు, సంస్థానేతర ఆశ్రిత కవులకు ఆశ్రయమిచ్చి గద్వాల సంస్థాన ప్రాశస్త్యాన్ని నలుమూలలా చాటినట్లు చెబుతారు. ఈ కవులు రచించిన పద్యాలలో చాటు పద్యాలు ప్రత్యేకంగా గుర్తింపు సాధించాయి.చెక్కుచెదరని నాటి కట్టడాలు నలసోమనాద్రి కాలం పాలన మొదలుకొని చివరితరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ కాలం వరకు నిర్మించిన వివిధ కట్టడాలు, భవనాలు, బావులు నేటికీ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నాటి భవనాలు రాజుల అభిరుచికి, నాటి వైభవాన్ని గుర్తు చేస్తూ.. చెక్కు చెదరకపోవడం విశేషం.గద్వాల కోటలో డిగ్రీ కళాశాల, ఆలయం.. రాజులు పాలన సాగించిన ప్రధాన గద్వాల కోటలో ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చెన్నకేశవస్వామి ఆలయాలున్నాయి. కోట లోపలి భాగం చాలా వరకు శిథిలావస్థకు చేరి కూలిపోగా.. ముఖద్వారం, కోట చుట్టూ భాగాలు నేటికీ పర్యాటకులకు కనువిందు చేస్తాయి.చెక్కుచెదరని ఫిరంగిరాజులు యుద్ధ సమయంలో వినియోగించే ఫిరంగి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీనిని ప్రస్తుతం గద్వాల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో లింగమ్మ (1725– 1740), (1745– 1747) బావులు గత పాలన చిహ్నాలుగా ప్రతిబింబిస్తాయి. వీటిని ప్రస్తుత పాలకులు ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఏటా జరిగే గద్వాల జాతర సందర్భంగా తెప్పోత్సవాలు ఈ బావుల్లోనే నిర్వహిస్తారు.మహారాజా మార్కెట్.. సంస్థానంలోని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు మొదలుకొని.. మిగతా అన్ని రకాల వస్తువులు మహారాజా మార్కెట్లోనే లభించేవి. రైతులు పండించే పంట ఉత్పత్తులు కూడా ఇక్కడ విక్రయించేవారని చరిత్రకారులు చెబుతారు. మహారాజా మార్కెట్ చిహ్నం చాలా భాగం ధ్వంసమైనప్పటికీ.. దాని ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి.కృష్ణారెడ్డి బంగ్లా ప్రత్యేకం నలసోమనాద్రి నిర్మించిన (ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కాలేజీ) కోటలోనే రాజవంశీయులు కలిసి జీవించేవారు. అయితే 1924లో సీతారామభూపాలుడు–2 మృతి చెందడంతో.. ఆయన భార్య మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ పాలన పగ్గాలు చేపట్టారు. సీతారామభూపాలుని సోదరుడు వెంకటకృష్ణారెడ్డికి అప్పటి పాలకులతో మనస్పర్థలు ఏర్పడి.. మాట పట్టింపుతో గద్వాల కోటను దాటి కృష్ణారెడ్డి బంగ్లాను నిర్మించుకున్నారు. ఈయన రాజవంశీయుల చివరితరం పాలనలో రెవెన్యూ, భూ పరిపాలన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ భవనంలోనే చిరంజీవి హీరోగా నటించిన ‘కొండవీటిరాజా’ సినిమా షూటింగ్ చేశారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎస్ఈ కార్యాలయం, భూసేకరణ కార్యాలయం ఇక్కడే కొనసాగాయి. గద్వాల బ్లాక్ సమితి కార్యాలయం, అనంతరం ఏర్పడిన మండల రెవెన్యూ కార్యాలయం కూడా చాలాకాలం పాటు ఇక్కడే కొనసాగింది. రాజావారి బంధువులు నేటికీ ఈ భవనంలోనే జీవనం కొనసాగిస్తుండగా.. మరికొంత భాగంలో ఎంబీ హైసూ్కల్, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలున్నాయి. ఎండాకాలం, చలికాలం, వానాకాలంలో కూడా ఒకేరకమైన వాతావరణం ఉండేలా ఈ భవనాన్ని నిర్మించడం విశేషం. -
మంత్రి జూపల్లి కాన్వాయ్ పై రాళ్ల దాడి..
-
ప్రజాప్రతినిధులకు రోజూ అవమానాలేనా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పట్ల ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరుపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో ప్రతినిధులకు ప్రతిరోజు అవమానాలేనా? ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పైన గద్వాల జిల్లా యంత్రాంగం వ్యవహరించిన అనుచిత తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేతిలో తిరస్కరించబడిన కాంగ్రెస్ నాయకులను అధికారిక సమావేశాలు, కార్యక్రమాల్లో ఎందుకు ఆహ్వానిస్తున్నారో? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానించేందుకు ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ విధానాలను ఏమైనా మార్చిందా? ’అని కేటీఆర్ నిలదీశారు.Praja Palana where our public representatives are humiliated every dayI condemn the atrocious conduct of District officials who have insulted our MLA, Alampur Vijayudu Garu@TelanganaCS What is the reason for insisting on inviting the Congress party leaders who’ve been… https://t.co/p490wZePDl— KTR (@KTRBRS) August 6, 2024తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలపై వివాదం మంగళవారం వివాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్టు మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు. మోటార్లు ఆన్‌చేసి మూడు గంటలైనా నీళ్లు రాకపోవడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. తుమ్మిళ్ల నుంచి విజయుడు వెళ్లిన కొంత సమయానికి అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పంప్‌లను ఆఫ్ చేశారు. దీంతో ఆర్డీఎస్ కాలువకు నీరు నిలిచిపోయిందని ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రైతులతో కలిసి తుమ్మిళ్లకు లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద రోడ్డుపై భైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తిత పరిస్థితి చోటుచేసుకుంది. -
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. మళ్లీ కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.కాగా, గురువారం ఉదయం మంత్రి జూపల్లి.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరూ తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో, మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన సిద్ధమైనట్టు సమాచారం. కాగా, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.అయితే, మొన్న అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. దీంతో, మంత్రి జూపల్లి రంగ ప్రవేశం చేసి ఆయనతో చర్చలు జరిపారు. ఇక, బండ్ల కృష్ణమోహన్‌తో నిన్న జీఎంఆర్ కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ హస్తం గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
ఆ ఎమ్మెల్యే మనకొద్దు.. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
-
గద్వాల్ జిల్లాలో బస్సు ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్
-
గద్వాల్ పబ్లిక్ మేనిఫెస్టో
-
బీసీలంతా ఏకమై బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి
-
గద్వాల చరిత్ర చాలా గొప్పది: సీఎం కేసీఆర్
-
గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం.. కారణమిదే..?
ఢిల్లీ: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర స్థాయి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ , కిషన్ రెడ్డిలు పోటీ చేయట్లేదని ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా తాము ప్రచారం చేస్తామని వెల్లడించారు. అయితే.. ఇదే వరుసలో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అధిష్టానానికి డీకే అరుణ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీ గూటికి రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీ గూటికి చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్‌కు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అసంతృప్తికి గురైన బాపురావు.. బీజేపీ నుంచి బరిలో దిగనున్నారు. ఇదీ చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక -
గద్వాలలో కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లో చేరిన డీసీసీ అధ్యక్షుడు
సాక్షి, జోగులాంబ గద్వాల: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు నేతలు పార్టీని వీడారు. గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గద్వాల నుంచి ఎమ్మెల్యే టికెట్‌కెట్ దక్కలేదన్న అసంతృప్తితో ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ప్రభాకర్ రెడ్డి టీపీసీసీ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గద్వాల కాంగ్రెస్ టికెట్‌ను రేవంత్ కొత్తగా వలస వచ్చిన జడ్పీ చైర్ పర్సన్ సరితకు అమ్ముకున్నారని విమర్శించారు. గద్వాలలో రేవంత్ రెడ్డి బ్యానర్‌ను ప్రభాకర్ రెడ్డి అనుచరులు దగ్ధం చేశారు. ఇప్పటికే సరిత అభ్యర్థిత్వాన్ని అటు కాంగ్రెస్ అసమ్మతి నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉప్పల్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తనకు గౌరవం లేని పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకన్న లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. సాయంత్రం ప్రగతి భవన్‌కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలువనున్నారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. చదవండి: మహబూబ్‌నగర్ నా గుండెల్లో ఉంటుంది: సీఎం కేసీఆర్ -
అనర్హతపై స్టే.. గద్వాల్ ఎమ్మెల్యేకు ఊరట
ఢిల్లీ: గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారని కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుపై కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సుప్రీం కోర్టులో బండ్ల పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఏం జరిగిందంటే.. అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పించారంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికపై హైకోర్టులో డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పకపోవడం తన తప్పని అంగీకరించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.. ఆ ఖాతాలు తన భార్యవని, సేవింగ్స్ ఖాతాలని తన తరపు న్యాయవాది ద్వారా వాదనలు వినిపించారు. ఇక.. వ్యవసాయ భూమిని 2018 ఎన్నికలకు ముందే అమ్మానని, దానివల్ల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడలేదని కోర్టుకు విన్నవించారు. అయితే.. వివరాలు వెల్లడించకపోవడం కచ్చితంగా చట్ట ఉల్లంఘన అని డీకే అరుణ తరఫున న్యాయవాది వాదించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు డీకే అరుణ. -
రసవత్తరంగా మారనున్న గద్వాల ఎన్నికలు.. గెలుపు ఎవరిది?
నియోజకవర్గం: గద్వాల మండలాల సంఖ్య: 5 (గద్వాల, మల్దకల్, ధరూర్, గట్టు, కేటీదొడ్డి ) మొత్తం పంచాయితీలు: 130 పెద్ద మండలం: గద్వాల మొత్తం ఓటర్లు: 91875 పురుషులు: 45321; మహిళలు: 46544 ప్రతిసారి ఎన్నికలు గద్వాలలో హోరాహోరీగా సాగుతాయి. గడచిన మూడు సాధారణ ఎన్నికల్లో ప్రధానంగా అత్తా అల్లుళ్ల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. కానీ వచ్చే ఎన్నికల్లో కూడ వీరిద్దరు మరోసారి తలబడనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడ సామాజిక వర్గ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బలమైన బీసీ అభ్యర్దిని బరిలో దింపటానికి సిద్దమవుతుంది. దీంతో ఈసారి ఈ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. త్రిముఖపోటీ అనివార్యం కానుంది. కాంగ్రెస్ కంచుకోట.. ఈసారి కూడా బీఆర్ఎస్ వచ్చేనా? సంస్ధానాల పాలన.. జాతీయస్దాయి గుర్తింపు గల చేనేత కార్మికులు.. కృష్ణా తుంగభద్రా నదుల మధ్య గల నడిగడ్డ ప్రాంతంగా పిలువబడే గద్వాల రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రసవత్తరంగా పోటీ సాగే నియోజకవర్గాల్లో గద్వాల కూడ ఒకటి. మొదటి నుంచి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులే విజయం సాధించారు. డీకే కుటుంబ సభ్యులే అక్కడ 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. డీకే సమరసింహారెడ్డి, డీకే అరుణ మంత్రులుగా కూడా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. వీరిద్దరు వరుసకు అత్తా-అల్లుళ్లు. గడచిన మూడు ఎన్నికల్లో వీరిద్దరు తలబడితే రెండుసార్లు డీకే అరుణ విజయం సాధించగా కృష్ణమోహన్ రెడ్డి ఒకసారి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డీకే అరుణ బీజేపీలో చేరారు. 2019లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా అరుణకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ వీడిన తర్వాత గద్వాలలో బీజేపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా సాధనకు ఆమె అప్పట్లో గట్టిపోరాటం చేశారు. ప్రజాసమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆమె వెంటనే స్పందిస్తుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్‌పై సైతం విధానపరమైన విమర్శలు చేస్తూ పార్టీ అధిష్టానంలో తనదైన ముద్రవేసుకుంది. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసింది. నియోజకవర్గంలో ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు దాదాపు 30 వేల వరకు ఉన్నాయి. ఈ ఓట్లు ఒకవేళ పార్టీపరంగా బీజేపీకి వ్యతిరేకంగా పడితే కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. అయితే కేసీఆర్ పాలనతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆపార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు డీకే అరుణ వర్గీయులు. సిట్టింగ్‌లకే బీఆర్ఎస్ సీటు సిట్టింగ్‌లకే ఈసారి సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో మరోసారి కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయటం ఖాయమైంది. కానీ పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు, గ్రూపు తగదాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. ఆయన అనుచరులే వ్యతిరేకంగా చాపకింది నీరులా పావులు కదుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తారాస్దాయికి చేరటంతో ఇటీవలే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం గాంధీ భవన్లో గద్వాల నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈసారి గద్వాల నుంచి బలహీన వర్గాల అభ్యర్దిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆమెకు సీటు ఖాయమైందని స్పష్టమవుతుంది. అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేతలు పెద్దగా ప్రభావితం చేసే వాళ్లు కాకపోవటంతో ఈమెకు మార్గం సుగమమయ్యింది. ఈ నియోజవర్గంలో వాల్మీకి బోయలు, కురువల ఓట్లు అధికంగా ఉండటంతో కురువ సామాజిక వర్గానికి చెందిన సరిత పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉండే గద్వాల నియోజకవర్గంపై ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉంటుందని ఈపార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే అన్నితానై వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ వారే అరోపిస్తున్నారు. తన అనుచరులకే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, బండ్ల రాజశేఖర్‌రెడ్డితో కూడా పొసగటం లేదట. అందుకే బక్కచంద్రన్నగా పిలిచే చంద్రశేఖర్‌రెడ్డి కూడా జడ్పీచైర్ పర్సన్ సరితతో పాటుగా కాంగ్రెస్‌లో చేరారు. ఇది ఎమ్మెల్యేకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారే ప్రమాదం లేకపోలేదు. అయితే ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలే తమపార్టీని గెలిపిస్తాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండంగా ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రేస్ పార్టీ నేతలు సైతం ఈసారి తామే విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నారు.మొత్తంగా నడిగడ్డ రాజకీయాలు ఎన్నికలకు నాలుగు నెలల ముందే రంజుగా సాగుతున్నాయి. త్రిముఖ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గం ఇటు కృష్ణా, అటు తుంగభద్రా నదుల మధ్య ఉండటంతో ఈ ప్రాంతాన్ని నడిగడ్డగా పిలుస్తారు. గద్వాల కేంద్రంగా సంస్దానాల పాలన సాగింది నదులు: కృష్ణానది ,జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు ఆలయాలు: మల్దకల్ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, జమ్మిచేడు జమ్మలమ్మ ఆలయం, పర్యాటకం: జూరాల పర్యాటక కేంద్రంగా డ్యాంలో నీటి నిల్వను, గేట్ల ద్వారా పారే నీటి ప్రవాహాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తారు. అదేవిధంగా గద్వాల కోటను చూసేందుకు, గద్వాల పట్టు చీరలను కొనేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. తిరుమల వెంకన్నకు ప్రతిఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు ఇక్కడి నుంచి స్వామివారికి జోడుపంచెలు తీసుకెళ్తారు. ఇది వందల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం -
Dil Raju : గద్వాల్లో దిల్ రాజు కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం (ఫొటోలు)
-
‘గట్టు ఎత్తిపోతల’లో భారీ గోల్మాల్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు (నల సోమనాద్రి) ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ పరిహారం పంపిణీలో భారీ గోల్మాల్ చోటుచేసుకుంది. ఇటు రికార్డులు లేకున్నా అటు పొజిషన్లో లేకున్నా.. పలువురికి పరిహారం చెల్లించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతంలో రూ.3.74కోట్లు దుర్వినియోగం కావడం కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందంటే.. కరువు పీడిత ప్రాంతమైన జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, కేటీదొడ్డి, ధరూర్, మల్దకల్ మండలాల్లోని 33వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు గట్టు ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ జరిగింది. ఈ మేరకు కుచ్చినెర్ల గ్రామ శివారులో రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రిజర్వాయర్, కట్ట నిర్మాణంలో మొత్తం 955.45 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్లు అంచనా వేశారు. ఇందులో 574 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేల్చారు. ముంపు ప్రాంతానికి సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.7.80లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భూములు కోల్పోతున్న వారి పేర్లు, వారికి ఎంతెంత భూమి ఉంది.. ప్రభుత్వ భూమిలో పొజిషన్లో ఉన్న వారు ఎంతమంది.. వంటి వివరాలు సేకరించి ఈ ఏడాది ఏప్రిల్‌లో 155మందితో కూడిన జాబితాను కుచ్చినెర్ల గ్రామపంచాయతీలో అధికారులు ప్రదర్శించారు. నోటీసులు అందజేసి.. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఆ తర్వాత మారిన సీన్.. ఇంతవరకు బాగానే ఉన్నా.. అధికార పార్టీకి చెందిన పలువురు రాజకీయ నాయకుల జోక్యంతో అక్రమా లకు తెరలేచింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న ప్రభుత్వ భూము లకు సంబంధించి పట్టాలు లేకున్నా, పొజిషన్లో ఉంటే సరిపోతుందని అధికారులు చెప్పడాన్ని అక్రమా ర్కులు అదునుగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమిలో పట్టా లేనప్పటికీ, పొజిషన్లో లేకున్నప్పటికీ మరో 17మందిని పొజిషన్లో ఉన్నట్లు చూపిస్తూ.. వారి పేర్లను పరిహారం జాబితాలో చొప్పించారు. ఇందకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలోని కొందరు సిబ్బంది, సర్వేయర్లు అండదండలు అందించినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇలా 17 మందికి సంబంధించి రూ.3.76కోట్లు దండుకున్నట్లు సమాచారం. బ్యాంకులో పరిహారం డబ్బులు పడిన తర్వాత ఆ 17మంది నుంచి సదరు నేతలు రికవరీ కూడా చేసుకున్నారని అంటున్నారు. అయితే ఇలా 17మందిని అడ్డుపెట్టు కుని అధికారపార్టీ నేతలు రూ.కోట్లు దండుకున్న విషయం ఓ ముఖ్య నేత దృష్టికి రాగా ఆయన సీరియస్ అయినట్టు తెలిసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా విషయం రచ్చ కాకుండా సెటిల్ చేసుకోవాలని సదరు ముఖ్యనేత క్లాస్ పీకినట్టు సమాచారం. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం 17 మందికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు. వివరాలు సేకరించి క్షేత్ర స్థాయిలో మరోసారి విచారణ చేపడతాం. అక్రమాలు నిజమని రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – వల్లూరు క్రాంతి, కలెక్టర్, జోగుళాంబ గద్వాల. ఇది కూడా చదవండి: బఫర్ జోన్లో ఎలా నిర్మిస్తారు? -
బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు
సాక్షి, న్యూఢిల్లీ/గద్వాల రూరల్: జోగుళాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీఆర్ఎస్ నాయకురాలు సరితా తిరుపతయ్య దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన కార్యక్రమంలో సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరారు. ఇక, వీరితో పాటు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి. మాజీ మార్కెట్ యార్డు చైర్పర్సన్ బండ్ల లక్ష్మీదేవి దంపతులు, గట్టు సర్పంచ్ ధనలక్ష్మి దంపతులు, ధరూరు మండలానికి సీనియర్ నేతలు రాఘవేంద్రరెడ్డి, సోము, మల్దకల్ మండలం సీనియర్ నేత అమరవాయి కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరి వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: కోర్టులో కలుద్దాం.. మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు సుఖేశ్ లేఖ -
ప్రేమికులపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడి.. ఎస్పీ కార్యాలయానికి పరుగులు
సాక్షి, గద్వాల: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసు కున్న ఓ జంటపై యువతి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లోనే దాడికి పాల్పడ్డ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గద్వాలకు చెందిన ప్రశాంత్, మండలంలోని పూడూరుకు చెందిన శిరీష ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇళ్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఇద్దరికీ వివాహం చేద్దామని యువతి తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఇద్దరి కులాలు వేరు కావడంతో అభ్యంతరం చెప్పారు. దాంతో మేజర్లయిన ప్రేమికులు ఈ నెల 8న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. 9న కర్నూలు జిల్లా పాలబుగ్గ సమీపంలోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇంటికి వచ్చేందుకు, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ గద్వాల రూరల్ పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫర్నిచర్ ధ్వంసం పోలీసులు ఇరువురి కుటుంబసభ్యులను స్టేషన్‌కు పిలిపించి నచ్చజెప్పారు. అయితే యువతి కుటుంబసభ్యులు బలవంతంగా ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. ఆమె కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేసి యువకుడి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. పోలీసు సిబ్బంది అడ్డుకోగా.. వెంటనే రక్షణ కోసం సమీపంలోని ఎస్పీ కార్యాలయానికి రోడ్డు వెంట ఆ ప్రేమజంట పరుగులు తీసింది. ఎస్పీ సృజన వద్దకు వెళ్లి జరిగిన విషయం వివరించారు. వెంటనే ఎస్పీ ఆ ఇద్దరూ మేజర్లు కావడంతో వారికి రక్షణ కల్పించే బాధ్యత పోలీస్‌శాఖపై ఉందన్నారు. భవిష్యత్‌లో వారిపై దాడి చేయడం, అవమానపర్చడం, విడదీసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
మీకోసం ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నా..
గద్వాల రూరల్: నేనంటే గద్వాలలోని కొందరు నాయకులకు భయం.. అందుకే నేను మీటింగ్‌కు వస్తే కరెంట్ తీశారు.. నేను కుల, మత భేదాలు తెలియకుండా అందరి మధ్య పెరిగిన వ్యక్తిని. కానీ, నడిగడ్డలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇక్కడ కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఎస్సీలను ముట్టుకోరు.. దగ్గరకు రానీయరు.. ఇలాంటి పరిస్థితి ఎక్కడా చూడలేదు. ఇక్కడ రాజ్యాధికారం అంతా కొందరి చేతిలో బంధీ అయింది. ఇక్కడ జరుగుతున్న మీటింగ్‌కు చాలామంది రావాల్సి ఉన్నా.. కొందరు నాయకుల దౌర్జన్యానికి భయపడి రాలేకపోయారు. దీంతో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను కేవలం బానిసలుగా చూస్తున్నారు.. ఈ పరిస్థితి మారాలంటే మనకే రాజ్యాధికారం దక్కాలి.. ఇక్కడున్న వారికి ఎవరికి అవకాశం వచ్చినా నేను అండగా నిలబడతాను.. మీకోసం ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నా.. నాకు మీరు అండగా నిలబడాలి అంటూ జెడ్పీ చైర్పర్సన్ కె.సరిత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మల్దకల్లో నిర్వహించిన గద్వాల యువచైతన్య సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమే రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గద్వాలలో ఒక్కసారి బలహీన వర్గానికి చెందిన గట్టుభీముడికి అవకాశం వచ్చిందని, అన్న భీముడు అన్ని వర్గాలకు అండగా నిలబడ్డాడని, ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు సేవ చేస్తూ అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. మన ఓటు మనమే వేసుకుందామని, మనల్ని మనమే గెలిపించుకుందామన్నారు. మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది. ఆ ఒక్కరు నేనై మొదలుపెడతానని, నాకు మీరంత అండగా నిలబడాలని కోరారు. గద్వాలలో మనల్ని అణచివేతకు గురిచేస్తున్నారని, అందుకే మిమ్మల్ని పదే పదే అడుగుతున్నా.. ముఖ్యంగా యువత చెబుతున్నా.. మీరు ఇక్కడికి రాకపోవడానికి రకరకాల భయాలే కారణమని తెలుసు.. కానీ, నేను చెప్పేది మీరు కచ్చితంగా వింటారు. ఎందుకంటే ఫేస్బుక్లో ఎంతమంది నన్ను ఫాలో అవుతారో నాకు తెలుసు. చదువుకున్న యువత ముందుకు రావాలి. ఎన్నికల సమయంలో మీకు క్రికెట్ టోర్నమెంట్ అంటూ పక్కదోవ పట్టించి మోసం చేసేందుకు ఇక్కడి కొందరు నాయకులు కుయుక్తులు పన్నుతారు. వారి కుతంత్రాలకు మోసపోకుండా చైతన్యులు కావాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. వెనకబడ్డ జాతులు బాగుపడటానికి ముందుకొచ్చిన నాయకుడికి నేను అండగా ఉంటా.. నాకు మీరు అండగా ఉండాలి. నా దృష్టిలో రెండే కులాలున్నాయి. ఒకటి మంచితనం, రెండు చెడుతనం. జనాలకు మేలు చేసే కులం అగ్రకులమైతది కానీ, తెల్లబట్టలు వేసుకుని జనాలకు కీడు చేసుకుంటూ హింసిస్తూ నేను అగ్రకులస్తుడిని అంటే సరిపోదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో పాల్గొన్న పలువురు వక్తలు ఈసారి అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే టికెట్ ఇవ్వాలని డిమాండు చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో బీసీ బలమేంటో చూపిస్తాం అన్నారు. -
ప్రియుడు మృతిచెందాడని.. పనిచేస్తున్న ఇంట్లోనే..
గద్వాల క్రైం: తను ప్రేమించిన యువకుడు మృతిచెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాలలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ రామస్వామి కథనం మేరకు.. పట్టణంలోని గంటవీధికి చెందిన బోయ రామేశ్వరి (22) డిగ్రీ పూర్తి చేసింది. చదువుకొనే రోజుల్లో కర్నూలుకు చెందిన జయంత్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే కుటుంబ సమస్యల కారణంగా జయంత్ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి రెండ్రోజుల క్రితం స్నేహితురాలైన సంగీతతో కలిసి ప్రియుడి అంత్యక్రియలకు హాజరైంది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదన, మనస్తాపానికి గురైంది. రామేశ్వరి, సంగీత కొంతకాలంగా గాం«దీచౌక్‌లో ఉండే రామతులసి ఆరోగ్య బాగోగులు చూసేందుకు ఆమె ఇంట్లో విధులు నిర్వర్తిస్తుండేవారు. ఈ క్రమంలో పనిచేస్తున్న ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్నేహితురాలైన సంగీత మంగళవారం ఉదయం విధులకు వచ్చి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రామేశ్వరి తల్లి కుర్మక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కార్పొరేటర్లు కాదు.. అధికారులే వాకౌట్
హైదరాబాద్: కార్పొరేటర్లకు బదులుగా అధికారులు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేసిన ఘటన బుధవారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో చోటుచేసుకుంది. వాటర్‌బోర్డు అధికారులను తీవ్రంగా అవమానించారంటూ వాటర్‌బోర్డు అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేయగా, వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు సైతం తాము కూడా బాయ్‌కాట్ చేస్తున్నామంటూ ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. దీంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశం నిర్వహించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టినా మేయర్ వినిపించుకోలేదు. మంగళవారం డ్రైనేజీ సిల్ట్‌ను తీసుకువెళ్లి బీజేపీ కార్పొరేటర్లు వాటర్‌బోర్డు ఎండి కార్యాలయంలో పూలకుండీల్లో వేయడం తెలిసిందే. దీనికి నిరసనగా వాటర్‌బోర్డు అధికారులు వాకౌట్ చేశారు. సమావేశం మొదలైన దాదాపు 20 నిమిషాలకే బీజేపీ సభ్యుల ఆందోళనల మధ్య వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించడంతో సమావేశం ఎలాంటి చర్చ, ప్రశ్నోత్తరాలు లేకుండానే వాయిదా పడింది. వాయిదా పడ్డాక సైతం కార్పొరేటర్లు, అధికారులు ఎవరికి వారుగా ఎదుటివారి తీరును విమర్శిస్తూ వాదనలు వినిపించారు. ఇంత చేస్తున్నా అవమానిస్తారా? మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సాయన్న, బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్, నాలాలో మరణించిన బాలిక మౌనిక, ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులకు సంతాపం తెలుపుతూ సభ్యులు మౌనం పాటించారు. సభాధ్యక్షత వహించిన మేయర్ విజయలక్ష్మి ప్రారంభోపన్యాసం ముగియగానే లంచ్ బ్రేక్ ప్రకటన చేయగా బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చే శారు. అంతలోనే వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణ తనకు మాట్లాడే అవకాశశమివ్వాలంటూ మాట్లాడారు. తాగునీరు, మురుగు నీరు నిర్వహణ పనులు చేస్తున్న తాము 186 కి.మీ నుంచి గోదావరి, 110 కి.మీ నుంచి కృష్ణాలతో పాటు సింగూరు, మంజీరాల నుంచి నీటిని ఇంటింటికీ అందిస్తున్నామని, 200 ఎయిర్‌టెక్ మెషీన్లతో మురుగునీటి సమస్యలు తీరుస్తున్నామని, అయినా తమను అవమానించినందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామంటూ వెళ్లిపోయారు. వెంటనే జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత లేచి వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులందరం బాయ్‌కాట్ చేస్తున్నామంటూ ప్రకటించడంతో అందరూ వెళ్లిపోయారు. బీజేపీ సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లి సభ జరగాలని పట్టుబట్టినా మేయర్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ బయటకు వెళ్లిపోయారు. అధికారులిలా ప్రవర్తిస్తారా?: బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రజల కోసం పని చేస్తున్న తాము వారి సమస్యలను ప్రస్తావిస్తే పట్టించుకోని అధికారులు సభను బహిష్కరించడం దారుణమని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. ఎక్కడైనా రాజకీయ నేతలు వాకౌట్ చేస్తారు కానీ.. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రశ్నిస్తే వాకౌట్ చేస్తారా? అంటూ అధికారుల తీరును తప్పుబట్టారు. ఓవైపు నాలాల్లో , అగ్ని ప్రమాదాల్లో, కుక్కకాట్లు, దోమలతో ప్రజలు చస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని, ప్రజల ఈ సమస్యలు చర్చించాల్సిన సమావేశం జరగకుండా చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు నాలాల్లో పసిప్రాణాల మరణాలు, కుక్కకాట్ల చావులపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నల్లదుస్తులతో సభకు.. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ తీరుకు నిరసనగా బీజేపీ కార్పొరేటర్లు నల్లదుస్తులతో సభకు హాజరయ్యారు. సభ వాయిదా పడ్డాక సైతం కౌన్సిల్ హాల్లోనే ఉన్న బీజేపీ కార్పొరేటర్లు మేయర్ రావాలంటూ డిమాండ్ చేశారు. కరెంట్ తీసేసినా వారు కదలకపోవడంతో, సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. నిరసన కార్యక్రమం కేటీఆర్‌కు ముందే తెలుసా? అధికారులు నిరసన వ్యక్తం చేయనున్న విషయాన్ని సభకు ముందస్తుగానే వాటర్‌బోర్డు అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వాటర్‌బోర్డులో జరిగిన ఘటనను ఎండీ దానకిశోర్ మంత్రికి వివరించగా, ఏ పార్టీ వారైనా కార్పొరేటర్లు అలా వ్యవహరించడం తగదని మంత్రి సమాధానమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందువల్లే వాటర్‌బోర్డుకు మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు బాయ్‌కాట్ చేశారంటున్నారు. గతంలో అధికారుల వాకౌట్లు గతంలో మాజిద్ హుస్సేన్ మేయర్‌గా ఉన్నప్పుడు కమిషనర్‌గా ఉన్న సోమేశ్‌కుమార్ సమావేశం నుంచి వాకౌట్ చేసినప్పటికీ, కొద్దిసేపు విరామం తర్వాత పలువురు నచ్చచెప్పడంతో తిరిగి సమావేశాన్ని నిర్వహించారు. సమీర్‌శర్మ కమిషనర్‌గా, బండ కార్తీకరెడ్డి మేయర్‌గా ఉన్నప్పుడు సైతం కమిషనర్ సమావేశం నుంచి వెళ్లిపోయిన ఘటనను కొందరు గుర్తు చేస్తున్నారు. కానీ అధికారులంతా మూకుమ్మడిగా వాకౌట్ చేయడం ఇదే ప్రథమం. మేయర్ వచ్చాకే అధికారులు సభలోకి ప్రవేశించడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రజాధనం దుబారా.. ప్రతి సమావేశంలోనూ గందరగోళం సృష్టిస్తూ వాయిదా వేస్తున్నారని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, సమావేశాల సందర్భంగా భోజనాలు, ఇతరత్రా ఖర్చుల పేరిట జీహెచ్ఎంసీ ఖజానాకు రూ.లక్షల ఖర్చు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. బ్లాక్‌డే: మేయర్ సభ వాయిదా పడ్డాక బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మేయర్ మీడియాతో మాట్లాడుతూ.. సీటులోకి రాకముందే తనను మహిళ అని కూడా చూడకుండా దూషించారని, అధికారులను సిగ్గుందా? అనడం సమంజసమా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ అప్రజాస్వామిక భాష వాడలేదన్నారు. కార్పొరేటర్లు అధికారులను అవమానించడంతో వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నారు. ఇదొక బ్లాక్‌డే అని వ్యాఖ్యానించారు. మర్యాద ఇవ్వకపోతే పనులు చేయం: మమత కార్పొరేటర్లు అధికారులతో మర్యాదగా ప్రవర్తించకపోతే సహకరించబోమని కూకట్పల్లి జోనల్ కమిషనర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత తెలిపారు. సభ వాయిదా అనంతరం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. కార్పొరేటర్ల అనుచిత ధోరణికి నిరసనగా సమావేశాన్ని బాయ్‌కాట్ చేశామన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులు కష్టపడి పనిచేస్తున్నా, అందరి ముందూ ఇష్టం వచ్చినట్లు తిడుతూ అధికారులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ► గ్రేటర్ నగరంలో ప్రజల ప్రాణాలకు రక్షణలేకుండా పోయిందంటూ బీజేపీ సభ్యులు వ్యంగ్యంగా ప్రదర్శనలు నిర్వహించారు. నన్ను చంపమని కోరేందుకు దోమ వేషంలో వచ్చానంటూ ఒకరు.. మేం కౌన్సిల్ హాల్లోకి వెళ్లాక ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందోనని కుటుంబ సభ్యులు ఈ అగ్నిమాపక పరికరాలు ఇచ్చి పంపారని, కార్లలోనూ వీటిని ఉంచారని ఒకరు.. హఠాత్తుగా వానొస్తే చెరువులయ్యే రోడ్లతో కారు కొట్టుకుపోతే మాకు ఈత రానందున రక్షణగా టైర్లు, రక్షణ జాకెట్లు ఇచ్చారని కొందరు వివిధ పరికరాలతో, వేషధారణలతో వచ్చి సమావేశానికి ముందు వ్యంగ్యంగా నిరసనలు వ్యక్తం చేశారు. ► ఈ రకంగానైనా అధికారులకు సిగ్గు వస్తుందేమోననే తలంపుతోనే ఈ ప్రదర్శనలకు దిగామన్నారు. అధికారులు బాయ్‌కాట్ చేయడం సిగ్గుచేటని, మేయర్ కౌన్సిల్‌ను అదుపు చేయలేకపోయారని సభ వాయిదాపడ్డాక కొప్పుల నరసింహారెడ్డి, ఆకుల శ్రీవాణి తదితర కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మేయర్ అనుమతి లేకుండానే, మేయర్ కుర్చీకి గౌరవమివ్వకుండా అధికారులు ఇష్టానుసారం వాకౌట్ చేయడం తగదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, సభను అదుపు చేయలేని మేయర్ దిగిపోవాలని కొందరు డిమాండ్ చేశారు. అధికారులు ఎక్కడా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేరని, జోన్లలోనూ అవే పరిస్థితులని, ప్రజలకు తాము సమాధానాలు చెప్పలేకపోతున్నామని పేర్కొన్నారు. నగరాన్ని డల్లాస్ చేస్తామని చెప్పినా, నాలాల్లో ప్రాణాలు పోతుండటం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. వాటర్‌బోర్డు వైఫల్యాలు తెలుపుతూ పూల మొక్కలిచ్చేందుకు వెళ్లిన తమను గూండాల్లా భావించి పోలీస్స్టేషన్లకు తరలిస్తారా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి మొద్దునిద్ర వీడాలన్నారు. కొసమెరుపు.. వాటర్‌బోర్డు సమస్యను జీహెచ్ఎంసీ సమావేశంలో లేవనెత్తి సభను రద్దు చేయడమేంటో అంతుచిక్కడంలేదంటూ నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా జీహెచ్ఎంసీ సమావేశాలకు వాటర్‌బోర్డు అధికారులు హాజరు కారు. ఏమైనా అత్యవసర సందర్భాల్లోనే సంబంధిత అధికారి మాత్రమే హాజరవుతారు. -
గద్వాలలో సరెండర్ లొల్లి!.. హాట్‌టాపిక్‌గా మారిన వ్యవహారం
సాక్షి, మహబూబ్‌నగర్: గద్వా ల జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ సరెండర్..ఆ తర్వాత ఆమె కలెక్టర్ వల్లూరి క్రాంతిపై విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి సీఈఓ ఫిర్యాదు చేయడం చర్చనీ యాంశమైంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో అశ్రద్ధ వహిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా పరిపాలనకు ఆటంకం కలిగిస్తున్నారంటూ విజయ నాయక్‌ను పంచా యతీరాజ్‌శాఖ కమిషనరేట్‌కు సరెండర్ చేస్తూ గద్వాల కలెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రెస్‌మీట్ నుంచే మంత్రికి ఫోన్.. తనను కలెక్టర్ వల్లూరు క్రాంతి సరెండర్ చేసి అన్యా యం చేశారంటూ ప్రెస్‌మీట్ నుంచే జెడ్పీ సీఈఓ..మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్ చేశా రు. తనను అన్యాయంగా సరెండర్ చేశా రని..ఈ ఉత్తర్వులను ఆపి న్యాయం చేయాలని కోరారు. తాను జిల్లాలో నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నానని.. విధులు ఎలా నిర్వర్తిస్తున్నానో తన టూర్ డైరీని పరిశీలించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందించి.. పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. అయితే ఆమె ఆదివారం ఉదయం 10 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పగా.. ఆయన సరేనని సమాధానమి చ్చారు. కాగా.. జెడ్పీ సీఈఓ గతంలోనూ వివాదా స్పదంగా వ్యవహరించినట్లు ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదనపు కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగడం, మహిళా దినోత్సవం రోజు ఓ మహిళా అధి కారితో గొడవపడటం వంటి ఘటనలు ఉన్నాయని.. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్లో బాధితులను విజయ నాయక్ పట్టించుకోరనే ఫిర్యాదు కలెక్టర్‌కు చేరినట్లు తెలిసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
‘డర్టీపిక్చర్’లో కొత్త మలుపులు.. అసలు ఏం జరుగుతోంది?
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘న్యూడ్‌కాల్స్’ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అసలు నిందితులను తప్పించారని.. ఈ మేరకు పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. డర్టీపిక్చర్ను తలపించిన ఈ రోత పనిలో ఓ పోలీస్ అధికారి స్వీయ భాగస్వామ్యం ఉందని.. అయితే కిందిస్థాయి అధికారిపై బదిలీ వేటుతో సరిపుచ్చారని గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో జిల్లా పోలీస్‌శాఖలో అసలు ఏం జరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎటుపోయి ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే భయం ఖాకీల్లో నెలకొంది. తాజాగా రహస్య విచారణ.. న్యూడ్‌కాల్స్ వ్యవహారం వెలుగులోకి రాగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా జిల్లాపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయి పోలీస్ అధికారులు జిల్లాపై డేగ కన్ను వేశారు. ఇటీవల జిల్లాలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకోగా.. అందరూ దాదాపుగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు వారికి ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు.. ఇక్కడ ఎవరి మద్దతు ఉంది.. పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు అనే కోణంలో రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ బృందం రహస్యంగా విచారణ చేపట్టి ఆరా తీసింది. ఈ క్రమంలో న్యూడ్ కాల్స్ వ్యవహారంలో చోటుచేసుకున్న అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అసలు నిందితులను తప్పించే క్రమంలో సుమారు రూ.50 లక్షలు చేతులు మారాయని గ్రహించిన వారు.. ఎవరెవరికి ఎంత ముట్టాయనే లెక్కలు తీస్తున్నట్లు సమాచారం. అప్పట్లో ఏం జరిగింది.. గద్వాలకు చెందిన కొందరు కొన్నాళ్లుగా అమ్మాయిలను ట్రాప్ చేసి లోబరుచుకోవడమే కాకుండా వారితో నగ్న వీడియో కాల్స్ మాట్లాడి స్క్రీన్ రికార్డ్, స్క్రీన్ షాట్లు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ రోత పనులకు పురిగొల్పారు. పలువురి మహిళల అర్ధనగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ అంశం బట్టబయలైన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 4న ఈ ఉదంతం వెలుగులోకి రాగా.. ఇందులో ప్రధాన పారీ్టకి చెందిన యువకులు ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. పలువురు పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు బట్టబయలు కావడం కలకలం సృష్టించింది. అయితే ఫిర్యాదు చేసేందుకు బాధితులెవరూ ముందుకు రాకపోవడంతో ‘సాక్షి’తోపాటు పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోలీసులు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టారు. తొలుత గద్వాల పట్టణానికి చెందిన తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డి, ఆ తర్వాత నిఖిల్, వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తతంగంలో ఓ ప్రజాప్రతినిధికి చెందిన ముఖ్య అనుచరుడు అయిన ఓ ప్రజాసంఘం నాయకుడి కుమారుడు, ఇద్దరు కౌన్సిలర్లతోపాటు ఓ కౌన్సిలర్ భర్త ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అరెస్టు చేసిన ఆ ముగ్గురు మాత్రమే నిందితులని.. మిగతా వారి ప్రమేయం లేదని అప్పటి జిల్లా పోలీస్ బాస్ కొట్టి పారేశాడు. దీనిపై అప్పట్లోనే దుమారం చెలరేగింది. కలవరం.. న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి పట్టుబడిన ముగ్గురు యువకులతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రధాన పార్టీకి చెందిన యువకులే. పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురితోపాటు తప్పించిన అసలు నిందితుడు ఓ పురపాలిక ప్రజాప్రతినిధి అనుచరులే. ఈ పంచాయితీ జిల్లాకు చెందిన ముఖ్య నేత వద్దకు చేరింది. తన వైరి వర్గమైనప్పటికీ జిల్లా పరువు పోతుందనే కారణంతో ఆయన సైలెంట్‌గా ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని స్వీయ భాగస్వామ్యం ఉన్న పోలీస్ అధికారిని వదిలేసి నిందితులతో ఖరీదు దోస్తాన్ చేసిన ఓ ఎస్ఐపై బదిలీ వేటు వేసి కేసు మొత్తం క్లోజ్ చేశారని ఇంటెలిజెన్స్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసు క్లోజ్ అయిన మూడు నెలల తర్వాత రాష్ట్ర ఇంటెలిజెన్స్ రహస్యంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టడం జిల్లా పోలీస్‌శాఖ సిబ్బందిని కలవరానికి గురిచేస్తోంది. ‘సిట్’తో విచారణ జరిపించాలి.. గద్వాలలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులపై ప్రభుత్వం స్పందించాలి. ఇందులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా సరే గుర్తించి శిక్ష పడేలా ప్రత్యేకంగా సిట్ బృందం ఏర్పాటు చేయాలి. ఈ కేసులో జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, పోలీసుల పేర్లు వినపడుతున్నాయి. స్థానిక పోలీసులపై అనేక రకాల ఒత్తిళ్లు ఉంటాయి. వారిని జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పారదర్శకంగా జరగాలంటే సిట్‌తో విచారణ జరిపించాలి. – జ్యోతి, స్త్రీ చైతన్య సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎవరినీ ఉపేక్షించం.. జిల్లాలో న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి నేను బాధ్యతలు తీసుకోక ముందే విచారణ చేశారు. దానిపై ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమే. పరిశీలించి మళ్లీ విచారణ చేపడతాం. తేలిన దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు. – సృజన, జోగుళాంబ గద్వాల ఎస్పీ -
మేయర్ ఇంట్లో 5000 వీధి కుక్కల్ని వదలాలి: RGV
-
భర్త ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ప్రియుడిని రప్పించి చాకచక్యంగా..
సాక్షి, గద్వాల క్రైం: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చాలని భార్య భావించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియుడిని రప్పించి అనుకున్న పనిని చాకచక్యంగా అమలు చేసి వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించారు. ఇక నేరం చేసి తప్పించుకోవాలని వేసిన ఎత్తుగడ మాత్రం ఫలించలేదు. శనివారం డీఎస్పీ రంగస్వామి కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పెబ్బేర్ మండలం బూడిదపాడుకు చెందిన ఎండీ అబ్దుల్లా (35) గద్వాల పట్టణానికి చెందిన మహబూబ్‌బీని 12 ఏళ్ల కిందట వివాహైంది. వివాహ అనంతరం గద్వాలలోనే కూలీ పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భర్త మద్యానికి బానిసై కుటుంబ పోషణ పట్టించుకోవడం మానేశాడు. తరుచూ ఇద్దరి మధ్య గొడవలు అవుతుండడంతో, భర్త కూలీ పనులు మాని ఇంటి వద్దే సొంతంగా కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపార సమయంలో భార్య ఎవరితోనైనా చనువుగా మాట్లాడిన ఆమెపై అనుమానంతో తీవ్రంగా అవమానపరిచేవాడు. అయితే మార్కెట్ నుంచి ఆటోలో రోజూ కూరగాయాలు తీసుకువచ్చే డ్రైవర్ రఫీతో ఆరు నెలలుగా పరిచయం ఏర్పడింది. విషయం గుర్తించిన భర్త ఆమెను మందలించాడు. ఎలాగైన భర్తను అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి పథకం వేశారు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో అబ్దుల్లా ఒంటరిగా నిద్రిస్తుండగా, భార్య గమనించి ప్రియుడు రఫికి ఫోన్ చేసి ఇంటికి రావాలని తెలిపింది. రాఘవేంద్రకాలనీలో ఉన్న వ్యక్తి బైక్‌పై నల్లకుంట కాలనీకి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంతలోనే భార్య ఇంటి తలుపులను మూస్తుండగా, తలుపులు ఎందుకు వేస్తున్నావంటూ భర్త ప్రశ్నించేలోపే భార్య రెండు కాళ్లు లాగి కిందకు పడేసింది. అక్కడే ఉన్న ప్రియుడు చున్నీతో గొంతుకు బలంగా బిగించి, మర్మాంగాలపై కొట్టారు. దీంతో అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదుతో.. ఎవరికీ అనుమానం రాకుండా రఫీని ఇంటి నుంచి బయటకు పంపింది. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో భర్త బంధువు వరుసకు సోదరుడు హాజీకి ఫోన్ చేసి అబ్దుల్లాకు ఫిట్స్ వచ్చి చనిపోయినట్లు ఫోన్ చేసి భార్య చెప్పింది. శుక్రవారం బంధువులు వచ్చి చూడగా గొంతుపై కమిలి ఉండడం, ఛాతీ, ముఖంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. సీఐ చంద్రశేఖర్, పట్టణ ఎస్ఐ అబ్దుల్ షుకూర్ అక్కడికి చేరుకుని ఇంటి చుట్టు పక్కల వారిని ఆరాతీశారు. భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, బైక్, చున్నీ స్వా«దీనం చేసుకున్నారు. -
కిషన్ రెడ్డి కేంద్ర నిధులు తేలేకపోయారు: మేయర్ విజయలక్ష్మి
-
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి
గద్వాల క్రైం (జోగులాంబ గద్వాల): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన శుక్రవారం గద్వాలలో కలకలం రేపింది. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన ఎండీ అబ్దుల్ (35) గద్వాల పట్టణానికి చెందిన మహబూబ్‌బీని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరు గద్వాల పట్టణంలోని నల్లకుంట కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ కూరగాయాల వ్యాపారం చేస్తున్నారు. దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్య అదే కాలనీకి చెందిన రఫీతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై వారం రోజుల క్రితం భార్యతో గొడవపడ్డాడు. అయితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి గురువారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలసి చున్నీతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా హత్య చేశారు. ఇక భర్త తరఫు బంధువులకు భార్య ఫోన్ చేసి ఫిట్స్ వచ్చి మృతి చెందాడని చెప్పింది. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాన్ని పరిశీలించి మహబూబ్‌బీపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పట్టణ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. హత్య చేసినట్లు అంగీకరించారు. మృతుడి సోదరుడు మహ్మద్ హాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. భార్యను అదుపులోకి తీసుకున్నామని, ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
ఇద్దరూ ఒక పార్టీకి చెందినవారే.. గద్వాలలో కారు డ్రైవర్ ఎవరు?
వారిద్దరూ అధికార పార్టీకి చెందినవారే. ఒకరు జడ్పీ చైర్మన్, మరొకరు ఎమ్మెల్యే. కాని ఒకరంటే ఒకరికి పడదు. సమన్వయంతో పనిచేయడం మానేసి.. ఆధిపత్య పోరుకు తెర తీసారు. ఒకరు మంత్రి మనిషి.. మరొకరికి మంత్రితో పడదు.. దీంతో ఈ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? ఇంటా, బయటా.. వేడేక్కిన రాజకీయం నడిగడ్డగా పేరు పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య జరగాల్సిన రాజకీయ పోరాటం.. అధికార పార్టీలోని వారి మధ్యే జరుగుతోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు కొంతకాలంగా అంతర్గత వైరం కొనసాగుతుంది. గతంలో జడ్పీ సీఈఓల బదిలీల విషయంలో మొదలైన అంతర్గత పోరు ఇప్పటికీ చల్లారలేదు. జడ్పీ చైర్ పర్సన్ సరితకు మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు ఉండటంతో ఆమె ఎమ్మెల్యేతో సై అంటే సై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సైతం డీ అంటే డీ అన్నట్టుగా ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న డీకే అరుణను ఎదుర్కొని నిలవటం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌కు నిత్యం సవాల్‌గా మారుతోంది. ఇప్పుడు స్వంత పార్టీ నేత నుంచి కూడా ప్రతికూల పరిస్ధితులు ఎదురు కావడంతో ఆయనలో ఆందోళన పెరుగుతోంది. మా దారి మాదే గద్వాల నియోజకవర్గంలో జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఎవరికి వారుగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విధిలేని పరిస్ధితిలో జడ్పీ సమావేశంలో కలిసి పాల్గొన్నా అంటిముట్టనట్టే ఉంటున్నారు. వీరిద్దరి మద్య వైరానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయుడిగా ముద్ర పడింది. దీంతో నిరంజన్‌రెడ్డితో ఆయనకు సఖ్యత లేదనే వాదన చాలా కాలంగా కొనసాగుతోంది. తన నియోజకవర్గంలో మంత్రి తనకు వ్యతిరేకంగా మరోవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ సరిత గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఓసారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలను ఆహ్వానించారు. మంత్రుల ఫోటోలతో జిల్లా కేంద్రంలో స్వాగత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు చైర్మన్ సరిత. తనకు సమాచారం ఇవ్వకుండా ఒక్కరే వెళ్లి ఎలా పిలుస్తారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారట. ఇదే విషయాన్ని మంత్రుల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. వీరిద్దరి వర్గపోరు కారణంగానే ఆ ఇద్దరు మంత్రులు మీటింగుకు రాకుండా డుమ్మా కొట్టారు. కులాల కురుక్షేత్రం గద్వాల నియోజకవర్గంలో బీసీ వర్గాల్లో వాల్మీకి బోయల తర్వాత కురువ సామాజిక ఓటర్లే అధికంగా ఉన్నారు. కురువ వర్గానికి చెందిన సరిత రాజకీయంగా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. గద్వాలలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు. చదవండి: బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత బీసి కోటా కింద గద్వాల నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ వస్తే ఎంతైనా ఖర్చు చేస్తామన్న ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారట. పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పట్ల అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలను చేరదీసి తన వర్గంలో కలుపు కుంటున్నారట. జడ్పీ చైర్పర్సన్ భర్త తిరపతయ్య కూడ గద్వాల రాజకీయాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. నన్నే పక్కనబెడతారా? ఇటీవల బీసీ గురుకుల పాఠశాల భవనాన్ని తాను రాకముందే జడ్పీ చైర్‌పర్సన్‌తో ప్రారంభింప చేయటంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక సంబంధిత శాఖ జిల్లా కోఆర్డినేటర్‌పై చేయిచేసుకున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో ఎమ్మెల్యేకు, జడ్పీ చైర్‌పర్సన్‌కు మద్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఘటనపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడ వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతుండటంతో ప్రభుత్వ అధికారుల పరిస్దితి డోలాయమానంలో పడింది. ఎవరిని కలిస్తే ఎవరికి కోపం వచ్చి తమను టార్గెట్ చేస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారులు గద్వాల జిల్లాలో పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒక కంట కనిపెట్టాలని.. విభేదాలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ కేడర్ కోరుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఫోన్ ఛార్జింగ్ తీస్తూ కరెంట్ షాక్ తో చిన్నారి మృతి
-
అధికారి కాలర్ పట్టుకున్న గద్వాల ఎమ్మెల్యే
గద్వాల రూరల్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఓ ప్రభుత్వ అధికారి చొక్కా కాలర్ పట్టి బూతులు తిట్టిన ఘటన మంగళవారం గద్వాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. గద్వాలలో మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరితను అధికారులు ఆహ్వానించారు. నిర్దేశిత సమయానికి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ ఆ గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకొని కోపంతో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే అధికారులపై చిందులు తొక్కారు. ప్రొటోకాల్ ప్రకారం గురుకుల పాఠశాలలకు తాను చైర్మన్‌కాగా, జెడ్పీ చైర్‌పర్సన్‌తో దానిని ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ వెంగళ్‌రెడ్డి సర్దిచెప్పబోగా ఒక్కసారిగా కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే ఆయన చొక్కా కాలర్ పట్టుకుని బలంగా వెనక్కి నెట్టేశారు. పత్రికలో రాయలేని విధంగా బూతులు తిడుతూ ఊగిపోయారు. దీంతో పక్కనే ఉన్న మహిళా అధికారులు, నాయకులు బిత్తరపోయారు. అక్కడే ఉన్న పార్టీ నాయకులు అధికారి వెంగళ్‌రెడ్డిని పక్కకు తీసుకుపోయారు. ప్రజాప్రతినిధి దాదాగిరికి పాల్పడటంపట్ల అధికార, ఉద్యోగవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్లో ఉన్న గ్రూపుల మధ్య నలుగుతున్న అధికారులు తాజా ఘటనతో బెంబేలెత్తుతున్నారు. వారిలో భయాందోళన వ్యక్తమవుతోంది. -
అధికారి గల్లా పట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
-
వాడిని వదలొద్దు నాన్నా!
గద్వాల క్రైం: న్యూడ్ కాల్స్ వ్యవహారం మరవక ముందే గద్వాల మండలంలో మరో దారుణం మంగళవారం చోటు చేసుకుంది. బంధువైన ఓ యువకుడితో దిగిన ఫొటో ఓ డిగ్రీ విద్యార్థిని చావుకు కారణమైంది. అనంతపురం గ్రామానికి చెందిన లక్ష్మన్న, నాగమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె మేఘలత అలియాస్ మేఘన(21) జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన శివకుమార్(24) తమకు బంధువు కావడంతో 2019లో కలిసి ఫొటో దిగారు. ఈ క్రమంలో శివకుమార్ ప్రేమిస్తున్నట్లు చెప్పగా.. యువతి నిరాకరించడంతో ఈ నెల 6న ఉరేసుకొని చనిపోయాడు. అయితే శివకుమార్ స్నేహితుడు అలీబాబు ఆ ఫొటోను వీడియోగా చిత్రీకరించి అమర ప్రేమికులంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో మానసిక వేదనకు గురైన యువతి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి కిందకి దించగా అప్పటికే మృతిచెందింది. అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి... చనిపోయే ముందు యువతి రాసిన సూసైడ్ నోట్ పోలీసుల చేతికి చిక్కింది. అందులో ‘అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి... నేను ఎవరినీ ప్రేమించలేదు.. 2019లో నేను, శివకుమార్ ఓ ఫొటో దిగగా దాన్ని అడ్డం పెట్టుకొని నాలుగేళ్లుగా వేధించాడు. మీకు చెబితే లేనిపోని గొడవలవుతాయని సైలెంట్‌గా ఉన్నా. వాడు చనిపోయాక తోక శాలన్న కుమారుడు అలీబాబు ఆ ఫొటోను వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి.. నన్ను బ్లాక్మెయిల్ చేయడంతోపాటు మన పరువు తీశాడు. దీంతో నేను ఎనిమిది రోజులుగా ఎవరికీ మొహం చూయించలేకపోతున్నా.. వాడిని మాత్రం వదలకు నాన్నా. చెల్లిని, తమ్ముడిని బాగా చూసుకో.. ఐ లవ్ యూ నాన్న.. ఐ లవ్ యూ అమ్మ..’అని రాసి ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కంటిలో నుంచి బియ్యపు గింజలు.. బాలిక నరకయాతన..
-
‘డర్టీ పిక్చర్’లో కొత్త కోణం! మహిళ ప్రమేయం లేకుండానే ఫొటో వైరల్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో మహిళలు, యువతులను ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేని ఓ మహిళ ఫొటోను వైరల్ చేసిన విషయం బయటికి వచ్చింది. సదరు మహిళ దీనిపై బుధవారం ఎస్పీ రంజన్ రతన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాను, తన కుటుంబం అంటే పడనివారు కావాలనే ఇలా సామాజిక మాధ్యమాల్లో ఫొటోను పోస్టు చేశారని వాపోయారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినవారిని శిక్షించాలని కోరారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కీలక వ్యక్తులను తప్పిస్తున్నారనే ఆరోపణలు మహిళలపై ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ ఉదంతంలో ఇప్పటివరకు గద్వాల పట్టణానికి చెందిన తిరుమలేశ్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డితోపాటు నిఖిల్, వినోద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఓ పోలీస్ అధికారిపై బదిలీ వేటు వేశారు. అయితే ఈ వ్యవహారంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన యువ నాయకులు, కౌన్సిలర్లు, ఓ ముఖ్య నేత అనుచరుడు ఉన్నారని.. వారిని తప్పిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కీలక వ్యక్తులను అరెస్టు చేయాలంటూ.. బుధవారం ప్రజా, విద్యార్థి సంఘాలు, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్టీపీ, సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో గద్వాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేయాలని, అసలు నిందితులను అరెస్టు చేయాలని ఆందోళనకారులు కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రంజన్ రతన్కుమార్లకు వినతిపత్రాలు అందజేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది. స్థానిక పోలీసులపై ఒత్తిళ్లు ఉన్నాయని, సిట్‌తో విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని డీజీపీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో పట్టణంలో సిట్ అధికారులు రహస్య విచారణ చేపట్టారంటూ రోజంతా హైడ్రామా నడవడం గమనార్హం. ముఖ్య నేతకు ఫోన్.. సీరియస్ వార్నింగ్? మహిళలపై ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ ఘటన పరిణామాలపై ప్రధాన పార్టీకి చెందిన ముఖ్య నేతతో పార్టీ అధిష్టానం మాట్లాడినట్టు తెలిసింది. ముందుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి నుంచి అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరు ఉన్నారు? ఏం చేస్తున్నారనే వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాతే గద్వాలకు చెందిన ముఖ్యనేతతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఎవరున్నా ఉపేక్షించొద్దని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు సమాచారం. పోలీసుల విచారణకు ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని సూచించినట్టు తెలిసింది. చదవండి: హనీట్రాప్ కేసులో సంచలనం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి లీలలు -
హనీట్రాప్ కేసులో సంచలనం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి లీలలు
సాక్షి, గద్వాల: హనీట్రాప్ వ్యవహారం జోగుళాంబ గద్వాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా ఓ ఖాకీ పాత్రపై కూడా ఆరోపణలు వెల్లువెత్తడం జిల్లావ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధాన సూత్రధారుల్లో ఓ యువ నేతతో పోలీసు అధికారికి స్నేహం ఉండటంతో.. సదరు నేతకు ఖరీదైన నజరానాలు ఇవ్వడం వంటి విషయాలు వెలుగు చూస్తుండటం కేసును మరో స్థాయికి తీసుకెళ్తుంది. అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసిన నియోజకవర్గ స్థాయి పోలీసు అధికారి, పశుసంవర్ధక శాఖలో పనిచేసిన జిల్లా స్థాయి అధికారి నెరపిన ‘లీలలు’ సైతం ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇందులో బాధితులు ఎవరూ కూడా ముందుకు రాకపోవడం, మరోవైపు కేసులో పలుకుబడి గల నాయకుల నుంచి ఒత్తిళ్లు, పలు రకాల ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా అటు తిరిగి.. ఇటు తిరిగి తమ కొంపనే ముంచుతుందనే ఉద్దేశంతో పోలీసులు అత్యవసరంగా కేసు మూసేందుకు అనామకులపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన సూత్రధారులతో దోస్తానా.. హనీట్రాప్ వ్యవహారంలో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన సూత్రధారులతో జిల్లాలో పనిచేస్తున్న ఓ ఖాకీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఇద్దరి మధ్య పలు రకాల లావాదేవీలు కొనసాగినట్లు తెలిసింది. అలాగే ఇటీవల ప్రధాన సూత్రధారికి సంబంధించి వ్యక్తిగత వేడుకలో సదరు ఖాకీ అధికారి ఖరీదైన నజరానాను ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. అయితే ప్రధాన సూత్రధారి అనుకోని విధంగా పంజరంలో చిక్కడం.. యువతులు, మహిళలతో సాగించిన వ్యవహారాలు వెలుగులోకి రావడంతో సదరు ఖాకీ ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయంతో సదరు అధికారి లోలోపల మదనపడుతున్నట్లు తెలిసింది. చదవండి: గద్వాలలో హనీట్రాప్ కలకలం!.. ఫోన్లో 150 మంది మహిళల ఫొటోలు వివరాలు వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖర్, వెనక నిందితుడు తిరుమలేష్ రాజకీయ నేతల ఒత్తిళ్లు ఈ హనీట్రాప్ వ్యవహారంలో బాధితులు ఎవరూ కూడా కేసు పెట్టేందుకు ముందుకు రాకపోవడం.. పలుకుబడి గల నేతల నుంచి ఒత్తిళ్లు రావడం.. మరోవైపు కొందరు ఖాకీల పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ తలనొప్పిని వదిలించుకునేందుకు పోలీసులు అనామకులపై కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకునేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇద్దరిపై కేసు నమోదు కాగా ఒకరిని రిమాండుకు తరలించడం, మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు విలేకరులకు తెలిపారు. అలాగే ఇందులో ఏ రాజకీయ పారీ్టకి సంబంధించిన నేతలు లేరని చెప్పారు. కాగా.. అసలు సూత్రధారులను వదిలి అమాయకుడైన తమ కుమారుడిని (తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డి)ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపండంపై తల్లిదండ్రులు పద్మ, నారాయణలు పట్టణ పోలీసుస్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పాత అధికారులు వెలుగులోకి ఇదిలా ఉంటే గతంలో జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన ఓ ఖాకీ అధికారి, అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో పనిచేసిన ఓ జిల్లా స్థాయి అధికారి నెరపిన రాసలీలల వ్యవహారం కూడా గుప్పుమంది. సాధారణ ప్రజలు చేస్తే దండన విధించే పోలీసులు.. వారి శాఖలోనే పనిచేసే కొందరు ఖాకీలపై ఆరోపణలు వస్తే మాత్రం పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారనే వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును పోలీసులు లోతుగా విచారణ జరిపి ఇందులో ప్రధాన సూత్రధారులను గుర్తించి కఠిన శిక్ష వేస్తేనే ఇలాంటి లతో సహా ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు.. మీరు చెబుతున్నట్లు ఈ వ్యవహారంలో పోలీసు పాత్ర ఉందనడం అవాస్తవం. మహిళల పట్ల జరిగే ఇలాంటి వ్యవహారాలు సహించేది లేదు. ఏదైనా నిర్దిష్టమైన ఆధారాలుంటే పోలీసులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు. అదేవిధంగా ఆధారాలు లేని ప్రచారాలను కూడా మీరు నమ్మకుండా ఇలాంటి సున్నితమైన అంశంలో సమన్వయం పాటిస్తే బాగుంటుంది. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. మీరు చెప్పినట్లు ఏదైనా ఆధారాలు లభిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – రంజన్ రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
గద్వాలలో హనీట్రాప్ కలకలం!.. ఫోన్లో 150 మంది మహిళల ఫొటోలు
సాక్షి, గద్వాల రూరల్: ప్రధాన నగరాలకే పరిమితమైన హనీట్రాప్ విష సంస్కృతి ఇప్పుడు గద్వాలకు పాకింది. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులుగా ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన యువనాయకులు ఉన్నారన్న విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు యువ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలతో కొందరు మహిళలకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు వెలుగు చూసినట్లు సమాచారం. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసుల అదుపులో ఇద్దరు.. ఈ ఘటనపై జిల్లా పోలీసు బాస్ తీవ్రంగా స్పందించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న యువ నాయకుల కదలికలపై రహస్యంగా నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే శుక్రవారం వెంకంపేట మార్గంలోని ఓ ఫంక్షన్‌హాల్ వద్ద ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట వీరిని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి రహస్యంగా ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో వంద నుంచి 150 మంది మహిళల ఫొటోలు, వివరాలు ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న ఇద్దరి నుంచి పూర్తి వివరాలను పోలీసులు తమదైన శైలిలో కూపీ లాగుతున్నారు. జిల్లా కేంద్రంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు గద్వాల పట్టణంలో ఏనోట విన్నా ఇదే విషయంపై చర్చ సాగుతుంది. విచారణ చేస్తున్నాం ఈ వ్యవహారం చాలా సున్నితమైన అంశం. లోతుగా విచారణ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. సమగ్ర విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చట్టవిరుద్ధమైన వ్యవహారాలను సహించేది లేదు. ఇందులో ఎలాంటి పైరవీలకు తావు లేదు. బాధితులు ఎవరైనా ముందకు వచ్చి ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసు నమోదు చేస్తాం. – రంజన్‌రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల విభేదాలతోనే.. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువ నాయకులు కొంతకాలంగా కొందరు అమాయక మహిళలను లోబర్చుకుని వారితో వాట్సప్‌లో అశ్లీలంగా మాట్లాడడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. వీరంతా ఒకే గ్యాంగ్‌గా ఉంటూ లోబర్చుకున్న మహిళల అశ్లీల ఉన్న ఫొటోలు, వీడియోలను తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ ముగ్గురు కూడా సదరు మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురు నాయకుల్లో ఒకరికి సంబంధించిన బంధువు మహిళ అశ్లీల ఫొటో కనిపించింది. దీంతో ముగ్గురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. రెచ్చినపోయిన సదరు ముగ్గురు యువనాయకులు తమ వద్దనున్న మహిళల అశ్లీల ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త వెలుగు చూడడంతో పట్టణంలో కలకలం సృష్టించింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో సదరు యువ నాయకులు నష్టనివారణ చర్యలకు దిగారు. తమకున్న పలుకుబడి నాయకుల శరణు కోరారు. విషయం పోలీసు కేసుల వరకు వెళ్లకుండా చూడాలంటూ పైరవీలు చేశారు. అయితే ఈ వ్యవహారం మహిళలకు సంబంధించి కావడంతో ఆ ప్రధాన నేత యువ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. -
నకిలీ విత్తనాలతో నిండా ముంచారు
గద్వాల రూరల్: నకిలీ విత్తనాలను కట్ట బెట్టి తమను నిండా ముంచేశారని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లాలోని పత్తి రైతులు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఉండవెల్లి, అలంపూర్, మానవపాడు మండలాలకు చెందిన రైతులు కలెక్టరేట్‌కు గురువారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా చేశారు. భూత్పూర్ వద్దనున్న కంపెనీ నకిలీ బీటీ పత్తి విత్తనాలు తమకు కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విత్తనాలతో సుమారు 20 వేల ఎకరాల్లో సాగు చేస్తే.. పంట దిగుబడి రాలేదని, దీనికి నకిలీ విత్త నాలే కారణమని వాపోయారు. ఇదే విష యమై వ్యవసాయ శాఖ అధికారులకు ఫి ర్యాదు చేస్తే.. క్షేత్ర పరిశీలనకు వచ్చిన శాస్త్రవేత్తలు సీడ్ కంపెనీలకు అమ్ముడు పోయి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపి ంచారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు ఇచ్చిన కంపెనీపై, తప్పుడు నివేదిక ఇచ్చిన వ్యవసాయ శాస్త్ర వేత్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రత్తి రైతుకు ఎకరా కు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. కలెక్టర్ తమకు స్పష్టమై న హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. మధ్యా హ్నం కలెక్టరేట్ ఎదుటే సామూహిక భోజ నాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ మదన్మోహన్కు వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో రైతు సంఘం నాయ కులు ఆంజనేయులు, లక్ష్మీకాంతరెడ్డి, రామాంజనేయులు, నాగన్న, ఎర్రన్న, జైలు, నారాయణరెడ్డి, భీంరెడ్డి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో పది, సాగర్‌లో 22 గేట్లు ఎత్తివేత
దోమలపెంట(అచ్చంపేట)/గద్వాల రూరల్/నాగార్జునసాగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు 2,67, 000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 43 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. మొత్తం 3,76, 825 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. జలాశయం నీటిమట్టం 884.5 అడుగులు కాగా, 212.9198 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం ఆనకట్ట వద్ద పదిగేట్లను 15 మీటర్ల మేర ఎత్తి 3,77,160 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువ నుంచి మొత్తం 4,42,694 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ ప్రాజెక్టు వద్ద 22 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా 3,55,228 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. విద్యుదుత్పాదనకు, కుడి, ఎడమ కాల్వలు, వరదకాల్వలు, ఎస్ఎల్బీసీకి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 589.50 అడుగులు ఉంది. -
శ్రీశైలంలో 9 గేట్ల ఎత్తివేత
దోమలపెంట(అచ్చంపేట)/గద్వాల రూరల్: జూరాల, శుంకేసుల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద తొమ్మిది గేట్లను ఎత్తారు. జూరాల స్పిల్‌వే ద్వారా 1,72,368 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 33,221, సుంకేసుల ద్వారా 1,21,185, హంద్రీ నుంచి 20,820 మొత్తం 3.47 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885.0 అడుగులుగా ఉంది. 215.8070 టీఎంసీలతో పూర్తిస్థాయిలో నిల్వ ఉంది. తొమ్మిది గేట్లను పది మీటర్ల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 2.52లక్షలు, తెలంగాణ ఎడమగట్టు, ఏపీ కుడిగట్టు విద్యుత్ కోసం 66,151 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో 33 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. -
తిరుపతి వెంకన్నకు.. గద్వాల ఏరువాడ జోడు పంచెలు
సాక్షి, గద్వాల: గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు నియమ నిష్ఠలతో నేత కార్మికులు తయారు చేసిన గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేయడం సంప్రదాయంగా కొనసాగుతుంది. నాటి నుంచి వస్తున్న సంప్రదాయం మేరకు గద్వాలలో చేపట్టిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెల నేత ఇటీవల పూర్తయింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీవారి అలంకరణకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాధీశురాలు శ్రీలతాభూపాల్ లేఖను తీసుకొని పంచెల తయారీ నిర్వాహకుడు మహంకాళి కర్ణాకర్ తిరుపతికి బయలుదేరారు. అక్కడ ఏరువాడ జోడు పంచెలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఐదుగురు చేనేత కార్మికులు 41 రోజులుగా నిష్ఠతో శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను తయారు చేశారు. మూలవిరాట్‌కు ధరింపజేసే ఏరువాడ జోడు పంచెలు వారసత్వంగా సమర్పణ.. శతాబ్దాలుగా గద్వాల సంస్థానాధీశులు తమ వంశపెద్దల సంప్రదాయ ఆచారంగా శ్రీవేంకటేశ్వరునికి ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేస్తారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవేంకటేశ్వరునికి ఉత్సవాల మొదటిరోజు, విజయ దశమి రోజున ఈ ఏరువాడ పంచెలను మూలవిరాట్‌కు ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాధీశులలో ఒకరైన రాజు సీతారాంభూపాల్ తన వంశస్థుల ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరునికి పంచెలను సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి శ్రీవారికి అందుతున్న ఏకైక కానుక ఏరువాడ జోడు పంచెలు కావడం విశేషం. ఎనిమిది కోటకొమ్ములు.. ఏరువాడ పంచెలు 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పుతో అంచు ఉంటుంది. శ్రీవారికి సమర్పించే ఈ పంచెలపై ఎనిమిది కోటకొమ్ములు ఉంటాయి. ఒక్కొక్క పంచె తయారు కావడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. జోడు పంచెలను లింగంబాగ్ కాలనీలో ప్రత్యేకంగా నిర్మించిన మగ్గంపై ఐదుగురు నేత కార్మికులు ప్రత్యేక భక్తిశ్రద్ధలను పాటిస్తూ ఈ పంచెలను సిద్ధం చేశారు. ఏరువాడ పంచెల తయారీలో కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల శణ్ముఖరావు, కరుణాకర్, రమేష్ పాల్గొన్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం.. తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థానాధీశులు అందించే ఏరువాడ జోడు పంచెలను మూలవిరాట్‌కు ధరింపజేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గత 12 ఏళ్లుగా ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు గర్వపడుతున్నాం. ఈ సేవలో గద్వాల నేత కార్మికులు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ జోడు పంచెలను రెండు రోజుల క్రితం టీటీడీ అధికారులకు అందజేశాం. – మహంకాళి కర్ణాకర్, జోడు పంచెల తయారీదారు -
శ్రీశైలం పదిగేట్లు ఎత్తివేత.. సాగర్‌కు పెరిగిన వరద
నాగార్జునసాగర్/దోమలపెంట (అచ్చంపేట)/గద్వాల రూరల్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద భారీగా పెరిగింది. సోమవారం జూరాలలో స్పిల్‌వే ద్వారా 68,850, విద్యుదుత్పత్తి ద్వారా 39,092, సుంకేసుల నుంచి 90,222, హంద్రీ నుంచి 4,905 మొత్తం 2,03,069 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. దీంతో విద్యుదుత్పత్తి ద్వారా 62,112క్యూసెక్కులు, పది గేట్లు 15 మీటర్ల మేర ఎత్తి మొత్తం 4,37,792 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ 22 గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 884.2 అడుగులు, 210.9946 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోపక్క శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో సాగర్ పోటెత్తుతోంది. దీంతో 22 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, కుడి, ఎడమ కాల్వలతో పాటు వరదకాల్వ, ఏఎమ్మార్పీకి 20,589 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలకు 1.16లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..17 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 68,850 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 39,092 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
శ్రీశైలంలో 7 గేట్ల ఎత్తివేత
దోమలపెంట/గద్వాల రూరల్: శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువనున్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,03,847 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఆనకట్ట వద్ద 7 గేట్లు ఒక్కొక్కటి 10 అడుగుల మేర పైకెత్తి 1,96,525 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 62,708 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి జూరాలకు 1,85,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్టులోని 37 గేట్లు ఎత్తి 1,52,292 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 36,111 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు. -
శ్రీశైలం గేట్లు మూసివేత
గద్వాల రూరల్/దోమలపెంట (అచ్చంపేట): జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో మంగళవారం శ్రీశైలం ఆనకట్ట గేట్లను మూసివేశారు. ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుంచి 1,43,233 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఎడమ గట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784, ఏపీ జెన్కో పరిధిలోని కుడి గట్టు కేంద్రంలో విద్యుత్ కోసం 31,459.. మొత్తం 63,243 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలకు స్వల్పంగా ఇన్‌ఫ్లో పెరిగింది. మంగళవారం రాత్రి 7 గంటలకు జూరాలకు 1.20 లక్షల ఇన్‌ఫ్లో ఉండగా.. 24 గేట్లు ఎత్తి శ్రీశైలానికి 99,072 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుదుత్పత్తి కోసం 22,436 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. -
శ్రీశైలంలో 8 గేట్ల ఎత్తివేత
దోమలపెంట/గద్వాల రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో శుక్రవారం ఆనకట్ట వద్ద ఎనిమిది గేట్లను పైకెత్తారు. స్పిల్‌వే, విద్యుదు త్పత్తి ద్వారా కలిపి 2,86,529 క్యూసె క్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశులతో కలిపి మొత్తం 2,45,590 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. ఎగు వ నుంచి 2.10 లక్షల క్యూసెక్కుల ప్రవా హం వస్తుండటంతో 40 గేట్లు పైకె త్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత
గద్వాల రూరల్/దోమలపెంట/బాల్కొండ: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో భారీగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతంగా వస్తోంది. దీంతో శుక్రవారం ఉదయం జూరాల ప్రాజెక్టు 27 క్రస్టుగేట్లు ఎత్తి 1,45,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సీజన్లో ఒకేసారి 27 గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. సాయంత్రం 6 గంటలకు వరద తగ్గడంతో 17 గేట్లు మూసి వేసి.. 75,005 క్యూసెక్కులు విడుదల చేశారు. రాత్రి 8 గంటల సమయంలో జూరాలకు 92 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మరోవైపు ఈ ఏడాది తొలిసారిగా శ్రీశైలం ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి.. సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి సాయంత్రం 6 గంటలకు 1,52,589 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 62,896 క్యూòÜక్కులు, స్పిల్‌వే ద్వారా 1,39,915 క్యూసెక్కులు, మొత్తం ప్రాజెక్టు నుంచి 2,02,811 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.8 అడుగులు, 214.84 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎస్సారెస్పీలోకి పోటెత్తిన వరద.. ఎస్సారెస్పీలోకి ఎగువ నుంచి 88,470 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 14 గేట్లను ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులు. కాగా శుక్రవారం రాత్రికి 1,088.6 (78.34 టీఎంసీలు) అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. -
శ్రీశైలం, జూరాల గేట్లెత్తారు
గద్వాల రూరల్/దోమలపెంట: ఎగువ నుంచి భారీగా వరద పెరగడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు గేట్లను మరోసారి ఎత్తారు. గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులకు గురువారం రాత్రి 8 గంటల సమయంలో 81,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా పదిగేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 81,892 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 8.591 టీఎంసీలు, 317.990 మీటర్ల మేర నీటిని నిల్వ చేశారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాలతోపాటు సుంకేశుల నుంచి భారీగా వరద పోటెత్తింది. సుంకేశుల 1,16,062, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు, జూరాలతో కలిపి మొత్తం 1,98,204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు పది అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 27,662 క్కూసెక్కులు, ఎడమ గట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,237 క్యూసెక్కులు మొత్తం 91,683 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.1 అడుగులు, 210.5133 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
శ్రీశైలం, జూరాల గేట్లు మూసివేత
గద్వాల రూరల్/దోమలపెంట: ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు గేట్లను మూసి వేశారు. జూరాల ప్రాజెక్టుకు 23,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యుత్ ఉత్పత్తి కోసం 19,505 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.701టీఎంసీలను నిల్వ చేశారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు సాయంత్రం 6 గంటలకు జూరాల నుంచి 19,501, సుంకేసుల నుంచి 8,414 క్యూసెక్కులు మొత్తం 27,915 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 881.6 అడుగులు, 196.561 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
Fashion: వేడుకల వేళ.. కాటన్ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ!
రాబోయేది పండగల సీజన్. సంప్రదాయ చీర కట్టులో భాగంగా వేడుకలో పట్టుకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. సౌత్ ఇండియన్ కాటన్స్తో సౌకర్యంగానూ, పండగ కళ పెంచేలా డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. మనవైన కాటన్స్ తలపునకు రాగానే ప్రముఖంగా మంగళగిరి, నారాయణ్ పేట్, పోచంపల్లి, గద్వాల, ఉప్పాడ, కలంకారీ.. వంటివి కళ్ల ముందు నిలుస్తాయి. అయితే, కాటన్ అనగానే చాలామంది ఈ సీజన్‌కి సరైనవి కావు అనుకుంటారు. కానీ, ఏ కాలమైనా మనవైన కాటన్స్ జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ ఉంటాయి. వాటిలో పండగల కాలంలో పట్టు కట్టకపోయినా ఏ మాత్రం వన్నె తగ్గని జరీ అంచు కాటన్ వినూత్నమైన కళను తీసుకువస్తాయి. వాటిలో చీరకట్టు మాత్రమే కాదు సౌకర్యంగా ఉండే కుర్తా సెట్, లాంగ్ అండ్ షార్ట్ గౌన్స్ కూడా ధరించవచ్చు. క్యాజువల్‌గానూ అదే విధంగా పార్టీవేర్‌గానూ ఎంపిక చేసుకోవచ్చు. అయితే, వీటిని రెడీమేడ్‌గా కాకుండా ఎవరికి తగినట్టుగా వారు డిజైన్ చేసుకోవచ్చు. సరైన డ్రెస్ అందుబాటులో లేదనుకుంటే మనదైన సంప్రదాయ జరీ అంచు కాటన్ దుపట్టా ధరించినా చాలు పండగ కళ వచ్చేస్తుంది. వీటికి సంప్రదాయ ఆభరణాలు లేదా టెర్రకోట, ఫ్యాబ్రిక్, సిల్వర్ జ్యువెల్రీ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఆభరణాల ఊసు లేకపోయినా అందంగానూ ఉంటాయి. చదవండి: Bindu Madhavi: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 45వేల పైమాటే! ప్రత్యేకత ఏమిటంటే! -
ఊపిరి ఆగింది.. ఉత్తీర్ణతలో మెరిసింది
గద్వాల: బాగా చదివి, మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండాలని కలలు కన్న ఆ విద్యార్థిని.. ఇంటర్ పరీక్ష రాసి ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది.. కానీ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన నల్లన్న కుమార్తె రాజేశ్వరి (18) జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ చదివింది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసిన రోజు మే 19న కుమార్తె రాజేశ్వరిని ఆమె తండ్రి బైక్‌పై ఎక్కించుకుని గద్వాల నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో తండ్రీ కుమార్తె అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కాగా, మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో రాజేశ్వరి ఎంపీసీలో 867 మార్కులు సాధించి జిల్లాలోని కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. ఇంటర్లో రాజేశ్వరి ప్రతిభను గుర్తు చేసుకుని అధ్యాపకులు, తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. -
రైతుబీమా సొమ్ము కోసం కక్కుర్తి.. బతికుండగానే చంపేశారు!
సాక్షి, మహబూబ్‌నగర్: రైతుబీమా సొమ్ముకు ఆశపడి బతికున్న మహిళ చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించి, సొమ్ము కాజేసిన ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రంజన్‌రతన్ కుమార్ ఆ వివరాలు వెల్లడించారు. గట్టు మండలానికి చెందిన మల్లమ్మ అనే మహిళా కూలీపనుల నిమిత్తం రాయిచూర్‌లో ఉంటోంది. ఆమె బంధువైన మాల నాగరాజు, అలమంచి రాజు(రాజప్ప)లు స్నేహితులు. తనకు డబ్బు అప్పుగా కావాలని మాల నాగరాజు, రాజును అడిగాడు. అయితే తన పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పాడు. డబ్బు కావాలంటే మీ బంధువులది ఎవరిదైనా గట్టు రెవెన్యూ రికార్డుల్లో పొలం ఉంటే చెప్పు.. వాళ్లు మరేదైన ప్రాంతంలో ఉంటే మనకు రూ.5లక్షలు వస్తాయని చెప్పాడు. దీంతో నాగరాజుకు మల్లమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె రైతుబంధు నగదు కోసం మాత్రమే ఇక్కడికి వస్తుందని రాజుకు తెలిపాడు. ఈ చర్చలో ఉండగానే అదే గ్రామంలో మాల నాగరాజు బంధువు మాల నరసమ్మ చనిపోయింది. ఇదే అదునుగా భావించిన ఇద్దరు స్నేహితులు, మాల నరసమ్మ పేరును మాల మల్లమ్మ పేరుతో అంగన్వాడీ టీచర్ శశిరేఖను తప్పుదోవ పట్టించి మరణ ధ్రువీకరణ నివేదికను పంచాయతీ సెక్రెటరీ శుభవతి వద్దకు తీసుకెళ్లారు. విచారణ చేపట్టి సర్టిఫికెట్ మంజూరు చేస్తానని చెప్పడంతో, నేను వార్డు మెంబర్‌ను నా మాటలు నమ్మరా అంటూ మాల నాగరాజు ప్రశ్నించాడు. దీంతో సరేనంటూ 2021 డిసెంబర్ 23న డెత్ సర్టిఫికెట్‌ను మంజూరు చేశారు. ఆ పత్రంతో రైతుబీమా కోసం దరఖాస్తు చేశారు. 2022 ఫిబ్రవరి 15న బీమా సొమ్ము రూ.5లక్షలు మాల నాగరాజు ఖాతాలో జమ అయ్యాయి. అనంతరం గట్టు ఎస్బీఐలో రూ.3 లక్షలు డ్రా చేసుకుని మాల నాగరాజు రూ.లక్ష, రాజప్ప రూ.2లక్షలు పంచుకున్నారు. మిగిలిన రూ.2 లక్షలు మాల నాగరాజు ఒక్కడే తీసుకోవడంతో ఇరువురికి గొడవ తలెత్తింది. ఈ క్రమంలోనే రాజప్ప జరిగిన విషయాన్ని తెలిసిన వారికి వివరించాడు. ఈ వ్యవహారం బయటికి పొక్కడంతో జరిగిన మోసంపై ఆయా పత్రికలలో ఈనెల 9న కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ మేరకు జిల్లా పోలీసు, వ్యవసాయ అధికారులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. మోసానికి పాల్పడిన ఇద్దరి నుంచి రూ.5లక్షలు రికవరీ చేశామని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. తప్పుడు మరణధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐ ఎస్ఎం బాష, ఎస్ఐను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
చరణ్ కోసం 264 కిమీ నడిచిన ఫ్యాన్, అతడిని కలిసి మురిసిపోయిన మెగా హీరో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖచిత్రాన్ని ఓ వ్యక్తి ఏకంగా వరి పంటతో తయారుచేసి అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. సదరు అభిమానిని తాజాగా చరణ్ తన నివాసంలో కలిశాడు. చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ అరుదైన కానుక ఇచ్చిన సదరు ఫ్యాన్‌కు చెర్రి ఆత్మీయ ఆహ్వానం పలికాడు. అయితే ఆ వ్యక్తి చరణ్‌ను కలిసేందుకు 264 కిలోమీటర్లు నడిచి రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీంతో చరణ్ తన అభిమానికి ఆత్మీయ ఆహ్వానం పలికాడు.కాగా తెలంగాణలోని గద్వాల్ జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి షార్ట్ ఫిలిం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: F3 First Day Box Office Collections: ఊహించని కలెక్షన్స్.. ఎంతంటే..? గట్టు మండలం ఆరగిద్దలోని ఓ రైతు నుంచి ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని రామ్ చరణ్ ముఖచిత్రం వచ్చేలా మూడు నెలలు శ్రమించి, వరి పెంచాడు. గత మార్చిలో ఈ ఫొటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజగా ఈ ఫొటోలను, తాను పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు జైరాజ్ 264 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్‌ను కలుసుకున్నాడు. చరణ్ నివాసంలో ఆయనను కలిసి బియ్యం గింజలతో తాను వేసిన చరణ్ బొమ్మ ఫొటోలతో పాటు, వరి వీడియోను కూడా చూపించాడు. జైరాజ్ అభిమానాన్ని చూసి చరణ్ మురిసిపోయాడు. అతడి ఆర్ట్‌కి ఫిదా అయిన చెర్రి జైరాజ్‌ను ప్రశంసించాడు. -
అవే చివరి పలకరింపులు.. ఇంటర్ పరీక్షలు ముగించుకొని బైక్‌పై వెళ్తూ..
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియడంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా గడిపింది. హాస్టల్లో తన వస్తువులు సిద్ధం చేసుకొని మరోసారి మిత్రులందరినీ పలకరించి నాన్నతో పాటు ఆనందంగా బైక్‌పై గ్రామానికి బయల్దేరింది. కానీ.. ఆ విద్యార్థిని ఆనందం కొన్ని నిమిషాల్లో ఆవిరైపోయింది. దారి మధ్యలోనే బస్సు రూపంలో వచ్చిన మృత్యువు తండ్రి, కూతురిని బలితీసుకుంది. ఇక సెలవంటూ స్నేహితురాళ్లకి.. ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్లో విద్యార్థిని చెప్పిన ఆ పలకరింపులే.. చివరివయ్యాయి. సాక్షి, గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన గద్వాల మండలం అనంతపురం శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం మేరకు వివరాలిలా.. ఇటిక్యాల మండలం మునగాలకి చెందిన నల్లన్న (42), పద్మమ్మకు ఇద్దరు సంతానం. కుమార్తె రాజేశ్వరి (18) గద్వాల మండలంలోని గొనుపాడు కేజీబీవీ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతుంది. గురువారం ఇంటర్మీడియెట్ చివరి పరీక్ష సైతం పూర్తవడంతో విద్యార్థిని పరీక్ష కేంద్రం వద్ద, హాస్టల్లో తోటి విద్యార్థినులతో ఆనందంగా పలకరిస్తూ.. తిరిగి పైచదువులకు కలుద్దామని చెప్పింది. కూతురిని ఇంటికి తీసుకొచ్చేందుకు తండ్రి నల్లన్న బైక్‌పై మునగాల నుంచి గోనుపాడులోని కేజీబీవీ హాస్టల్‌కు చేరుకున్నాడు. స్నేహితులందరికీ మరోసారి పలకరించిన రాజేశ్వరి తండ్రితో పాటు బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరింది. బస్సు రూపంలో కబళించిన మృత్యువు.. గురువారం మధ్యాహ్నం తండ్రీకూతురు ఇద్దరూ గద్వాల మీదుగా స్వగ్రామానికి వెళ్తుండగా.. ఎర్రవల్లి నుంచి గద్వాల వైపు వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుఎదురుగా వస్తున్న వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పైనుంచి వారు ఎనిమిది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన నల్లన్న, రాజేశ్వరి అక్కడిక్కడే మృతిచెందారు. ఇదిలా ఉండగా, బైక్ మామూలు వేగంతోనే వెళ్తుండగా.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న వీరి బైక్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. చదవండి: దిశ కేసు: వారిని పోలీసులే వేధించి కాల్చి చంపారు గ్రామంలో విషాదం. రోడ్డు ప్రమాదంలో మునగాలకి చెందిన తండ్రీకూతురు మృతి చెందారనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కన్నీటి పర్యాంతమయ్యారు. రాజేశ్వరి చదువులో ఎంతో చురుకుగా ఉంటూ.. సెలవుల సమయంలో వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబ సభ్యులకు అండగా ఉండేదని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వ్యవసాయ పనులపైనే ఆధారపడి బతుకీడుస్తున్న నల్లన్న కుటుంబంలో ఒక్కసారిగా ఇరువురు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు, బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఏఎస్ఐ వెంకట్రాములు తెలిపారు. -
ఆర్డీఎస్ ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుంది: బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కీలకమైన ఆర్టీఎస్ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టబోతోందని.. కొద్దినెలల్లో ప్రాజెక్టును పూర్తిచేసి 87,500 ఎకరాల సాగు నీరందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నివేదిక ఇచ్చిందని, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ విషయం చెప్పారని తెలిపారు. ఆర్డీఎస్ విషయంలో ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తూ.. నడిగడ్డను ఎడారిగా మార్చిన సీఎం కేసీఆర్‌ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా గురువారం 8వ రోజు పాదయాత్ర చేసిన బండి సంజయ్.. గద్వాల పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ చేతగానితనంతో ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించలేకపోయారని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రం ఆర్డీఎస్ ఆధునీకరణకు ముందుకొచ్చిందని.. అలంపూర్, గద్వాల పరిధిలో 87,500 ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు వాటా మేర నీళ్లు అందించేలా ఆర్డీఎస్ ఆనకట్ట, హెడ్ రెగ్యులేటర్ డిజైన్‌లో మార్పులు చేయనున్నామని.. కాలువ సీపేజీ, ఓవర్ ఫ్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాన కాలువకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. కేంద్రంపై ఏడుపెందుకు? : కేంద్రంపై ఏడవటం తప్ప సీఎం కేసీఆర్ సాధించిందేంటని సంజయ్ నిలదీశారు. ‘‘మోదీ ప్రభు త్వం ఇప్పటివరకు తెలంగాణకు 3 లక్షల కోట్లకుపైగా నిధులు ఇచ్చింది. అందులో పన్నుల రూపంలో రూ.1.68 లక్షల కోట్లు, మిగతావి ప్రాయోజిత పథకాలు, రహదారుల రూపంలో ఖర్చుచేసింది. ఈ విషయంలో బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా? గ్రామ పంచాయతీలకు, టాయిలెట్లకు, శ్మశానవాటికలు, ఇతర మౌలిక సదుపాయాలకు కేంద్రమే నిధులిస్తుంటే.. కేసీఆర్ తానే ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. పైగా మోదీనే అవమానించేలా మాట్లాడుతున్నారు.’’అని మండిపడ్డారు. అన్నీ అరాచకాలే.. : రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, టీఆర్ఎస్ నేతల అరాచకాలే కనిపిస్తున్నాయని సంజయ్ ధ్వజమెత్తారు. ఖమ్మంలో స్థానిక మంత్రి అక్రమాలను సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తున్న సాయిగణేశ్‌పై 16 కేసులు బనాయించి, బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే అనుచరులు ఓ కౌన్సిలర్‌ను చంపారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల కళ్లలో సీఎం మట్టి: ఈటల చెరువులు, బావులు, బోర్లలో నీళ్లున్నా.. వరి, మక్కలు వేయొద్దం టూ రైతుల కళ్లల్లో సీఎం కేసీఆర్ మట్టి కొట్టారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. రైతుబంధు ఇచ్చేది పంటలు వేసుకోవడానికా, బంద్ చేయడానికా అని నిలదీశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక అన్నీ పక్కనపెట్టి నియంత పాలన కొనసాగిçస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిగా మారిందన్నారు. కాగా.. ప్రధాని మోదీ నవభారత నిర్మాణం చేస్తుంటే.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల కలల తెలంగాణను ధ్వంసం చేస్తున్నారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి ఆరోపించారు. గవర్నర్‌ను అడుగడుగునా అవమానిస్తూ బాధపెడుతున్నారని.. కేసీఆర్ కుసంస్కారానికి ఇది నిదర్శమని ధ్వజమెత్తారు. ‘తెలంగాణ పథకాలు కర్ణాటకలో అమలు చేయాలి’ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా, రైతుబంధు, ఉచిత కరెంటు, ‘దళితబంధు’ పథకాలను కర్ణాటకలో కూడా అమలయ్యేలా చూడాలని కొందరు కర్ణాటక వాసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కోరారు. కార్యక్రమంలో జీఎం జయన్న, అంజినయ్య తదితరులు పాల్గొన్నారు. -
Ram Charan: రామ్ చరణ్ బర్త్‌డే.. అదిరిపోయిన అభిమాని గిఫ్ట్
సాక్షి, గట్టు (మహబూబ్‌నగర్): సినీనటుడు రామ్ చరణ్ ముఖచిత్రాన్ని ఓ వ్యక్తి వరి పంటతో తయారుచేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డికి చెందిన సంధ్యాజయరాజ్ షార్ట్ ఫిలిం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. గట్టు మండలంలోని ఆరగిద్దలోని ఓ రైతు నుంచి ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని అభిమాన నటుడు రామ్ చరణ్ ముఖచిత్రం వచ్చేలా మూడు నెలలు శ్రమించి, వరి పెంచాడు. డ్రోన్‌తో ఆకాశం నుంచి వరి చేలలోకి చూస్తే ఈ ముఖచిత్రం కనిస్తుంది. రెండు రోజుల క్రితమే అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయు డు ఈ చిత్రాన్ని పరిశీలించి అభినందించారు. కాగా, ఆదివారం రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వరి పంటతో చరణ్ పట్ట తన అభిమానాన్ని చాటుకున్నాడు. చదవండి: అమృత్‌సర్‌కి రామ్ చరణ్, ఎందుకంటే..? -
89 ఏళ్ల వయస్సులో కర్ణాటక భక్తురాలి సాహసం
సాక్షి (గద్వాల)మహబూబ్‌నగర్: పర్వత మల్లన్న దంపతుల దర్శనం కోసం వయస్సును సైతం లెక్క చేయక పాదయాత్ర చేస్తోంది కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీశైల మల్లన్న భక్తురాలు బోరమ్మ. పాదయాత్రలో భాగంగా గురువారం మండల కేంద్రానికి చేరుకుంది. 44 ఏళ్లుగా పాదయాత్రగా వెళ్తున్నట్లు వృద్ధురాలు తెలిపింది. స్వగ్రామం కర్ణాటకలోని జవరిగి ప్రాంతానికి చెందిన 89 ఏళ్ల బోరమ్మ ఇప్పటికి పాదయాత్ర కొనసాగిస్తోంది. కరోనా కారణంగా మధ్యలో రెండేళ్లు విరామం తర్వాత ఇప్పుడు తిరిగి కొనసాగిస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాంత వాసులతో అందరిని ఆప్యాయంగా పలుకరించుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఇళ్ల వారి నుంచి తీపి (చక్కెర) తీసుకుని శ్రీశైల మల్లన్నకు నైవేద్యంగా సమర్పిస్తుంది. ఉగాది పండుగ రోజున మల్లన్నను దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతున్నట్లు తెలిపింది. ప్రాణం ఉన్నంత వరకు పాదయాత్ర చేస్తూనే ఉంటానని, తనను మల్లన్ననే నడిపిస్తున్నారని చెప్పారు. కర్ణాటకకు చెందిన మరో భక్తుడు కాళ్లకు కర్రలను కట్టుకుని పాదయాత్ర చేస్తూ, శ్రీశైలంకు గట్టు మీదుగా వెళ్లాడు. చదవండి: ‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు -
Gadwal Bidda: ఇంటర్నెట్ సెన్సేషన్ గద్వాల్ బిడ్డ కన్నుమూత!
Gadwal Bidda Death News Viral In Social Media: ‘నువ్వెనివో నాకు తెల్వదు..’ అంటూనే కోట్లాది మందికి పరిచయమైన చిన్నారి ‘గద్వాల్‌బిడ్డ’ ఇక లేడనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ చిన్నారి.. నిత్యం వీడియోలు, మీమ్స్, స్టిక్కర్లతో ఏదో ఒక దగ్గర కనిపిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి చిన్నారి హఠాన్మరణం విషయం తెలియగానే.. ఇంటర్నెట్లో చాలామంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అది మీమ్స్ పేజీ ఆరంభంలో ఉన్నరోజులు. ‘ఐతే ఏంటి?, సీవోసీ’ లాంటి కొద్దిపాటి పేజీలు మాత్రమే పాపులర్ అయిన సమయం. ఆ టైంలో దర్శకుడు ఆర్జీవీ ప్రకటించిన ఓ టైటిల్‌పై దుమారం రేగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఓ చిన్నారి చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. గద్వాల్బిడ్డగా తననుతానూ పరిచయం చేసుకుంటూ.. ఆర్జీవీని దూషిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసి వైరల్ అయ్యాడు ఆ పిలగాడు. ఆపై దళితులను కించపరిచేలా వ్యవహరించాడంటూ దళిత సంఘాలు ఆ చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మైనర్ కావడంతో పోలీసుల సమక్షంలోనే అతనితో క్షమాపణలు చెప్పించగా.. ఆ సమయంలో సంభాషణలు, అతని ఏడుపు సైతం వైరల్ అయ్యింది. ఆపై చాలాకాలం ఇంటర్నెట్కు దూరంగా ఉన్నప్పటికీ ఈ చిన్నారి మీమ్స్ స్టఫ్‌గా మారాడు. ట్రోల్ వీడియోస్, మీమ్స్ టెంప్లేట్, స్టిక్కర్స్ రూపంలో వైరల్ అయ్యాడు. కొద్దిగ్యాప్ తర్వాత కారులో కునుకు తీసిన వీడియో ఒకటి, ఆపై దసరా శుభాకాంక్షలు చెప్తూ ఉన్న వీడియో సైతం వైరల్ అయ్యింది. ఈ క్రమంలో అతని హఠాన్మరణం వార్త.. ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. ఆ చిన్నారి అసలు పేరు మల్లికార్జున్‌రెడ్డి అని సమాచారం. ప్రస్తుతం ఓ సినిమాలోనూ అతని నటిస్తున్నాడని, ఆస్తమాతో అతను మృతిచెందినట్లు, ఈ విషయం అతని కుటుంబ సభ్యులే స్వయంగా వెల్లడించినట్లు సౌత్ ఇండియన్ థగ్స్ అనే పేజీ నుంచి మెసేజ్ వైరల్ అయ్యింది. స్వగ్రామం జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నెలో గద్వాల్ బిడ్డ ‘మల్లికార్జున్’ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. ‘నువ్వు ఎవనివో నాకు తెల్వదు, బండెక్కినంటే.. భయపడాలె, చూస్కోండి, ఖబడ్దార్బిడ్డా..’ డైలాగ్‌లతో గద్వాల్‌బిడ్డ పేరుతో మీమ్స్, వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ తరుణంలో.. చిన్నవయసులోనే ఆ చిన్నారి లేడనే వార్త ఇంటర్నెట్లో విషాదం నింపుతోంది. మీమ్స్, వీడియోల రూపంలో బతికే ఉంటాడంటూ పలువురు కామెంట్ల చేస్తున్నారు. -
Scooter Trolley: ఐడియా అదిరింది
రోజువారీ రవాణా ఖర్చులు పెరుగుతుండటంతో ఈ యువ రైతు కొత్తగా ఆలోచించాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్‌కడ్మూర్‌కు చెందిన జానకి రాంరెడ్డి తమకున్న ఆరెకరాల పొలంలో బొప్పాయి తోటను సాగు చేశాడు. ఈ పండ్లను అమ్మడానికి అమరచింత, ఆత్మకూర్‌కు రావడానికి ఆటోకు రోజుకు రూ.600 చెల్లించేవాడు. ఇది భారంగా మారింది. అతను స్వతహాగా బైక్ మెకానిక్ కావడంతో దాన్నుంచి బయటపడే ఆలోచన చేశాడు. స్కూటర్‌కు ట్రాలీని జతపరిచాడు. తన భార్యతో కలిసి బొప్పాయిలను విక్రయిస్తున్నాడు. – అమరచింత పరుగో పరుగు జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో భవానీమాత జాతర సందర్భంగా ఆదివారం నిర్వహించిన శునకాల పరుగుపందెం పోటీలు ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతిని గద్వాలకు చెందిన శునకం దక్కించుకుంది. – గద్వాల (గట్టు) చిలుకమ్మ పలికింది.. విజయవాడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన డాగ్ షోలో రెండు చిలుకలు సందడి చేశాయి. ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన తోకటూ(తెల్ల రంగులో ఉన్నది), అమెరికా నుంచి తెచ్చిన మకావ్ చిలుకలు సందర్శకుల మాటలకు బదులిస్తూ వారిని ఆశ్చర్యచకితులను చేశాయి. దీంతో డాగ్‌షోకు వచ్చిన పలువురు ఈ చిలుకలతో సరదాగా మాట కలిపి ఆనందంలో మునిగితేలారు. – సాక్షి, విజయవాడ -
భార్య మీద ప్రేమతో.. రూ. 7లక్షల వ్యయంతో మండపం
గద్వాల: 83 ఏళ్ల ఓ వృద్ధుడు తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. చనిపోయిన భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తన మమకారాన్ని చూపారు. గద్వాలకు చెందిన గంటలబోయిన హనుమంతుకు భార్య రంగమ్మ, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేయగా.. వారందరూ ఎవరికి వారు జీవితంలో స్థిరపడ్డారు. కొన్నాళ్లుగా కుటుంబసభ్యులతో కలిసి జమ్ములమ్మ ఫిల్టర్‌బెడ్ ఎదురుగా ఉన్న సొంత వ్యవసాయ పొలంలో ఇళ్లు నిర్మించుకుని వారు జీవనం సాగిస్తున్నారు. అయితే రెండేళ్ల కిందట రంగమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. తన భార్యపై ఉన్న ప్రేమతో హనుమంతు రూ.7 లక్షల వ్యయంతో ఒక మండపాన్ని నిర్మించి అందులో రంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. భార్యపై హనుమంతుకు ఉన్న అభిమానాన్ని పలువురు ప్రశంసించారు. -
తిరుపతి వెంకన్నస్వామికి గద్వాల ఏరువాడ పంచెలు రెడీ
సాక్షి, గద్వాల: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా పంపించే గద్వాల ఏరువాడ జోడు పంచెలు సిద్ధమయ్యాయి. గద్వాల సంస్థానాదీశుల కాలం నుంచి తిరుమల శ్రీవెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు ఏరువాడ జోడు పంచెలను ఏటా అందజేయడం సంప్రదాయం. గత 400 సంవత్సరాలుగా కొనసాగుతోంది ఈ ఆనవాయితీ. ఈసారి చేపట్టిన శ్రీవారి జోడు పంచెల నేత ఇటీవలే పూర్తయింది. ఐదుగురు చేనేత కార్మికులు 41 రోజులు నిష్టతో వీటిని తయారుచేశారు. చదవండి: అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం లేదు: టీటీడీ అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీవారి అలంకరణలో జోడు పంచెలను ధరింపజేస్తారు. గురువారం ఈ పంచెలను టీటీడీ అధికారులకు అందజేస్తామని పంచెల తయారీని పర్యవేక్షించిన మహం కాళి కరుణాకర్ తెలిపారు. ఏరువాడ పంచెలు 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పు అంచుతో ఉంటాయి. తుంగభద్ర, కృష్ణానదుల మధ్య గద్వాల ఉండడంతో వీటికి ఏరువాడ పంచెలు అనే పేరు వచ్చింది. చదవండి: బ్రహ్మోత్సవాల నుంచి నడకదారిలో భక్తులకు అనుమతి గద్వాల సంస్థానాధీశులు సీతారాంభూపాల్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం ఆనవాయితీ. అదే సంప్రదాయం వారి వంశీయులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత గద్వాల్ సంస్థానం వారసురాలిగా ఉన్న శ్రీలతాభూపాల్ ఆధ్వర్యంలో జోడు పంచెలను శ్రీవారికి పంపే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. -
పాము, విభూతి, భస్మంతో బురిడీ, రూ.62 లక్షలు గోవిందా!
గద్వాల : ప్రజల అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని మంత్రాల పేరిట డబ్బు దోచుకుంటున్న ఓ ముఠాను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ఈ ముఠా సభ్యులు ఓ వ్యక్తిని నమ్మించి ఏకంగా రూ.62.5 లక్షలను ఎత్తుకెళ్లారు. రెండేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఎనిమిది మంది మోసగాళ్లను గద్వాల జిల్లా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్ ఈ ముఠా చేసిన మోసాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని వాసి జిల్లా రిసోడ్‌కు చెందిన మహమ్మద్ తాశావర్‌ఖాన్, సయ్యద్‌ఇక్బాల్, అజయ్, భీంరావు, అలీముద్దీన్, నవాజ్‌షేక్, హైదరాబాద్‌కు చెందిన అన్వర్‌ఖాన్, షేక్‌బషీర్ ఓ ముఠాగా ఏర్పడి మంత్రాల పేరిట జనాన్ని మభ్యపెట్టి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. పూజల పేరిట నమ్మించి.. రూ.62 లక్షలకు టోకరా 2019 అక్టోబర్‌లో ఈ ముఠా సభ్యులు జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉప్పలకు చెందిన ప్రహ్లాద్‌రెడ్డిని కలసి మాయమాటలు చెప్పి ఇంట్లో నాగదేవత పేరిట పాముకు ప్రత్యేక పూజలు చేస్తే అద్భుతమైన శక్తులు వస్తాయని నమ్మించారు. అలాగే తమ వద్ద ఉన్న మహిమగల భస్మం, విభూతిని ఇంట్లో చల్లితే కష్టాలు పోయి పెద్ద ధనవంతులు అవుతారని, పూజలో డబ్బులు ఉంచితే పదింతలు అవుతాయని చెప్పారు. దీంతో బాధితుడు ఇంట్లో ఉన్న రూ.62.5 లక్షలను పూజలో ఉంచాడు. ముఠాసభ్యులు పూజ పేరిట కొద్దిసేపు హడావుడి చేసి పథకం ప్రకారం అప్పటికే మత్తు కలిపిన పౌడర్‌ను అతడిపై చల్లి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. డబ్బులు వస్తాయన్న భ్రమలో ఉన్న బాధితుడు రెండు రోజుల తర్వాత మంత్రగాళ్లు మోసం చేశారని గుర్తించి అయిజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో ఈ ముఠాసభ్యులు గత నెల 30వ తేదీన అయిజ మండలం తుపత్రాలలో సూర్యవెంకటన్నగౌడ్కు కూడా మాయమాటలు చెప్పారు. పూజలకోసం భస్మం, విభూతి డబ్బా కొనేందుకు రూ.10 లక్షలు కావాలని అడిగారు. అయితే అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో అడ్వాన్సుగా రూ.30 వేలు ముఠా సభ్యులకు ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున అయిజ శివారులో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు, రెండు రాగి రింగులు, భస్మం, విభూతి, నాగుపాముతో పాటు రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. పామును అటవీ అధికారులకు అప్పగించారు. కాగా, ఈ కేసుల దర్యాప్తులో పాల్గొన్న పోలీసులను ఎస్పీ అభినందించారు. -
అవినీతి మరక: గద్వాలలో ఖాకీలు వర్సెస్ ఖద్దరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఖాకీలు వర్సెస్ ఖద్దరు అన్నట్లు పోరు తుది అంకానికి చేరింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన పోలీస్ శాఖపై ఇటీవల కాలంలో పలు అవినీతి మరకలు వెలుగుచూడగా.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఓ సర్కిల్‌స్థాయి అధికారి అవినీతి బాగోతం బట్టబయలు కాగా సంచలనం సృష్టించింది. ఈ మేరకు దృష్టి సారించిన రాష్ట్రస్థాయి అధికారులు ప్రక్షాళనకు నడుం బిగించారు. ఇందులో భాగంగా సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పలువురిని బదిలీ చేశారు. ప్రధానంగా సస్పెన్షన్ వేటు తర్వాతే ఒక్కొక్కటిగా సమీకరణలు మారాయి. తన సన్నిహితుడిగా పేరున్న ఆ అధికారిని వైరి వర్గ నేతల ఫిర్యాదుతో సస్పెండ్ చేయడాన్ని సవాల్‌గా తీసుకున్న జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చక్కదిద్దుకునే కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బదిలీ తప్పదని గ్రహించిన ఖాకీలు కొందరు ‘ఖద్దరు’తో రాజీకి ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. (చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి) వైరి వర్గానికి చెక్ పెట్టేలా.. తనకు సన్నిహితుడిగా ముద్రపడిన సదరు అధికారిని సస్పెండ్ చేయడం పట్ల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జీర్ణించుకోలేకపోయారు. తన పార్టీలోని వైరి వర్గంతో పాటు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు పోలీసులతో తన ఆధిపత్యానికి గండిపడుతుందని భావించిన ఆయన రాష్ట్రస్థాయిలో పక్కా స్కెచ్‌తో పావులు కదిపినట్లు సమాచారం. అధిష్టానం నుంచి ఆశీస్సులు సైతం ఉండడంతో పోలీస్‌శాఖలో వైరి వర్గానికి మద్దతిస్తున్న ఖాకీలను బదిలీ చేయించడంతో పాటు తన అనుకూల వర్గానికి పెద్దపీట వేసేలా ముందుకు సాగుతున్నట్లు జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఓ ఉన్నతాధికారి, కొందరు పోలీసుల బదిలీలతో పాటు పలువురికి పోస్టింగ్ లభించినట్లు సదరు ప్రజాప్రతినిధి అనుచర వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. త్వరలో మరో అధికారి సైతం బదిలీ కానున్నట్లు ముందస్తుగా లీక్‌లు ఇస్తున్నాయి. (చదవండి: ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు..) బెడిసికొట్టిన రాజీయత్నాలు.. మారిన పరిస్థితుల్లో ఏం చేయలేమని గ్రహించిన పలువురు ఖాకీలు సదరు ప్రజాప్రతినిధితో రాజీయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. పట్టణానికి చెందిన సినిమా రంగంలోని ప్రముఖ వ్యక్తి ద్వారా రాయబారం నడిపినట్లు తెలిసింది. అయితే సదరు ప్రజాప్రతినిధి ససేమిరా అనడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేఖా మిల్లు ఘటనపై చర్యలు హుళక్కేనా.. ఓ సీఐ ‘ఫోర్జరీ’పై కేసు నమోదు లేనట్టేనా.. అనే అనుమానాలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. వీటికి సంబంధించి ఓ పోలీస్ అధికారిని సంప్రదించగా.. ‘ఈ రోజు, రేపు, ఇంకెప్పుడైనా బదిలీ ఆర్డర్ వస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారు. -
సాక్షి ఎఫెక్ట్: ‘ర్యాలంపాడు’ లీకేజీల అడ్డుకట్టకు చర్యలు
గద్వాల రూరల్: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిరి్మంచిన ర్యాలంపాడు రిజర్వాయర్ కట్ట లీకేజీలపై అధికారులు దృష్టిసారించారు. రిజర్వాయర్ కట్టకు బీటలు పడి పెద్ద ఎత్తున లీకేజీ ఏర్పడిన సంఘటనపై సోమవారం ‘సాక్షి’లో ‘ర్యాలంపాడు’కి బీటలు శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. లీకేజీలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కట్ట నుంచి ఎక్కడెక్కడ లీకేజీలున్నాయి? ఎంత పరిమాణంలో నీరు వృథా అవుతోంది.. తదితర అంశాలపై చర్చించారు. రిజర్వాయర్ పరిస్థితిపై ఇటీవల ఇద్దరు సీఈల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన నివేదికను పరిశీలించారు. ఇదిలా ఉంటే లీకేజీలకు మరమ్మతు చేయాలంటే.. ముందుగా ర్యాలంపాడులోని నీటిని బయటకు పంపాల్సి ఉంటుందని, అయితే దీనివల్ల ప్రస్తుతం 1.36 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పంటలు దెబ్బతింటాయని గద్వాల జిల్లా ఇరిగేషన్ ఇంజనీర్లు ఉన్నతాధికారులకు వివరించారు. ఈ సీజన్‌కు సాగునీటిని అందించి వచ్చే యాసంగిలో జలాశయంలోని నీటిని పూర్తిగా బయటకు తోడేసేందుకు వీలుపడుతుందన్నారు. -
జూరాల జలాశయానికి హైడ్రోగ్రాఫిక్ సర్వే
గద్వాల రూరల్: రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల జలాశయానికి సాగునీటి పారుదల శాఖ అధికారులు త్వరలో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించనున్నారు. త్వరలోనే ముంబైకి చెందిన నిపుణులు బృందం జూరాల జలాశయానికి హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయనున్నట్లు సాగునీటి పారుదల శాఖ అధికారి ఆదివారం మీడియాకు వివరించారు. 2009లో వచి్చన భారీ వరదల అనంతరం 2012లో జూరాల జలాశయంలోని నీరు, బురదను లెక్కించారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం హైడ్రోగ్రాఫిక్ సర్వే చేసింది. ఈ సర్వేలో జలాశయం సామర్థ్యం 11.94 టీంఎసీల నుంచి 9.657 టీఎంసీలకు పడిపోయినట్లు సుమారు మూడున్నర టీఎంసీల మేర బురద పేరుకు పోయినట్లు లెక్క తేల్చారు. దీంతో జూరాల కింద 1.20 లక్షల ఆయకట్టు కాస్త 1.07 లక్షలకు కుదించారు. తాజాగా తెలుగు రాష్ట్రాలోని కృష్ణానదిపై ఉన్న జలాశయాల నిర్వహణను కృష్ణాబోర్డు అ«దీనంలోకి తీసుకోనున్న నేపథ్యంలో మరోమారు జలాశయం నీటినిల్వ సామర్థ్యం, ఎంత మేర పూడిక (బురద) పేరుకుపోయిందో లెక్కవేయనున్నారు. -
గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ భర్త ఆడియో వైరల్
గద్వాల్ రూరల్: గద్వాల్ సీఐగా పనిచేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన హనుమంతుతో జెడ్పీ చైర్పర్సన్ భర్త తిరుపతయ్య ఫోన్లో మాట్లాడిన సంభాషణలు శనివారం సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం జిల్లాలో చర్చనీయాంశమైంది. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డికి చెందిన ఓ వ్యక్తి గతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యవహారానికి సంబంధించి కేసు విషయంలో తిరుపతయ్య.. హనుమంతుతో ఫోన్లో మాట్లాడుతూ గట్టు మండల పోలీసు శాఖ అధికారి, స్థానిక ఎమ్మెల్యేపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ సంభాషణ ఎంతవరకు వాస్తవం, ఇది తాజాదా, లేక గతంలో మాట్లాడిన సంభాషణా అన్నదానిపై స్పష్టత లేదు. మొత్తంగా గద్వాల టీఆర్ఎస్లో వర్గవిభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఫోన్ సంభాషణతో మరోమారు స్పష్టమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
గద్వాల్ జడ్పీ చైర్ పర్సన్ భర్త ఆడియో కలకలం
-
‘ఖాకీ‘లతో రాజకీయం.. టీఆర్ఎస్లో తారస్థాయికి వర్గ విభేదాలు
సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు పరిధిలోని జోగుళాంబ గద్వాలలో ‘అధికార’ పార్టీ టీఆర్ఎస్లో పలువురు ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. ఇరువురి నేతల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేదాలు.. మారుతున్న పరిణామాల క్రమంలో భగ్గుమన్నాయి. చీకటి దందాల్లో సైతం ఆధిపత్యమే హద్దుగా ఎవరికి వారు పావులు కదుపుతుండడంతో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. అసాంఘిక శక్తుల భరతం పట్టి, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక భూమిక వహించాల్సిన పోలీస్‌శాఖను సైతం కీలుబొమ్మగా మార్చిన విధానం ప్రజలను నివ్వెరపరుస్తోంది. ఇరు వర్గాలూ ఖాకీలను తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్న తీరు ఒక్కొక్కటిగా ఇటీవల వెలుగులోకి రాగా.. విస్మయానికి గురిచేస్తోంది. ఒకే పార్టీలో ఉండి ప్రత్యర్థులుగా చెలామణి అవుతున్న ఇరువురు ప్రజాప్రతినిధులు పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిపై పోటాపోటీగా ఫిర్యాదులు చేయడం కలకలం రేపుతోంది. జిల్లాలో పోలీస్ శాఖ రెండుగా చీలిపోయిందనేందుకు ఇదే నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతా మాఫియా కనుసన్నల్లోనే.. నడిగడ్డగా పేరొందిన గద్వాల జిల్లా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. నకిలీ విత్తనాలు, రేషన్ బియ్యం, ఇసుక, గుట్కా, మట్టి ఇలా అన్ని రకాల దందాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంతంలో ఏది జరగాలన్నా ఆయా మాఫియాల కనుసన్నల్లోనే కొనసాగుతోంది. వీరికి రాజకీయ నేతలు జత కలిసి ఖాకీలతో తతంగం నడిపిస్తుండడంతో దోచుకున్నోడికి దోచుకున్నంతగా పరిస్థితులు దాపురించాయి. క్రమశిక్షణకు వరుపేరుగా నిలిచే పోలీస్‌శాఖలో కొందరు పోలీసులు రాజకీయ నేతల అండతో అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నా.. ఇటీవల చోటుచేసుకున్న వరుస పరిణామాలు ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. జిల్లాలో ఓ సర్కిల్ స్థాయి పోలీస్ అధికారిపై ఫిర్యాదుతో అక్రమాల తుట్టె ఒక్కొక్కటిగా కదిలింది. విచారణలో రాజకీయ నేతల అండ, పలువురు ఖాకీల మద్దతుతో అక్రమాలు పరాకాష్టకు చేరాయని గ్రహింన సదరు అధికారి పోలీస్ బాస్‌కు మొత్తం సమాచారం మౌఖికంగా చేరవేశారు. దీంతో జిల్లాలో ఏయే దందాల్లో ఎవరెవరు కీలకంగా ఉన్నారు.. ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు.. వీటిలో పోలీస్ సిబ్బంది పాత్రపై నిఘా వర్గాల ద్వారా పూర్తిస్థాయిలో సమాచారం సేకరింనట్లు తెలిసింది. కొందరి వల్ల పోలీసు శాఖకే చెడ్డపేరు గద్వాలలో కొందరు పోలీసుల వైఖరి కారణంగా మొత్తం శాఖకే చెడ్డపేరు వస్తుంది. పైరవీకారులు, అక్రమాలకు పాల్పడే వారికే అధిక ప్రాధాన్యత ఇస్త డిపార్ట్మెంట్కు తలవంపులు తీసుకొస్తున్నారు. ఇటీవల బియ్యం, ఇసుక, మట్టి, సీడ్, భూకబ్జాలు వంటి మాఫియాలకు అడ్డూ అదుపు లేకుండాపోతుంది. దీనికి కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న పారదర్శకత వైఖరి లేకపోవడమే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని చట్టాన్ని సామాన్యులకు అందుబాటులో ఉండేలా, ప్రజాసమస్యలపై మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటే మంచింది. – మధుసూదన్‌బాబు, జేఏసీ నాయకుడు, గద్వాల -
ఆ లంకె బిందెలో 98 బంగారు నాణేలు.. కానీ చివరికి!
సాక్షి, మానవపాడు(మహబూబ్‌నగర్): జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో వెలుగు చూసిన లంకె బిందె వ్యవహారం లింకు దొరికింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న కూలీల నుంచి రూ.4.60 లక్షలు, 12.12 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... మానవపాడులో రెండు నెలల క్రితం జనార్దన్‌రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తీస్తుండగా కూలీలకు మట్టికుండలో 98 చిన్న బంగారు నాణేలు లభించాయి. వాటిని 9 మంది కూలీలు పంచుకున్నారు. 11 నాణేలు కలిపి దాదాపు 3 తులాల వరకు ఉంటాయి. నాణేలను బంగారు దుకాణాల్లో అమ్మేసి, ఎవరికి వారు ఆభరణాలు తయారు చేయించుకున్నారు. కొందరేమో డబ్బులు తీసేసుకున్నారు. ఈ విషయం ఇంటి యజమానికిగానీ, అధికారులకుగానీ తెలియదు. ‘జూలై 28న పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపాం. కూలీలను పిలిపించి మాట్లాడాం. వారి నుంచి 12.12 తులాల బంగారం, రూ.4.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. తొమ్మిది మందిని అరెస్టు చేశాం’ అని సీఐ తెలిపారు. -
క్షణం క్షణం ఉత్కంఠ ... పరుగులు పెట్టించిన బీరువా కథ : గద్వాల్
-
బియ్యం అక్రమార్కులకు పెద్దల అండ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని రేఖ రైస్ మిల్లు అక్రమాల్లో భాగస్వాములైన అధికారులకు రాష్ట్రస్థాయిలో ఓ ఉన్నతాధికారి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాపతినిధి అండగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అందువల్లే గత ఏడాది డిసెంబర్లో విచారణ నివేదిక అందినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. అయితే గద్వాల టీఆర్ఎస్ పార్టీలో మూడు వర్గాలు ఉండగా.. ఓ వర్గం నేతలు జిల్లాస్థాయి అధికారికి మద్దతు ఇస్తున్నారని, మరో వర్గం తటస్థంగా ఉందని తెలిసింది. వారికి పోటీగా ఉండే ఇంకో వర్గం నేతలు రేషన్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ యంత్రాంగంపై ఇటీవల తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. దీని కారణంగానే ఒకరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు చెప్తున్న వివరాలు కూడా ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. ఒకరిపై కేసు నమోదుకు ఆదేశాలు ‘‘రేఖ రైస్‌మిల్లులో పట్టుబడిన 170.05 క్వింటాళ్ల రేషన్ బియ్యం విషయంలో రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులను తప్పుదోవ పట్టించిన ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గణపతిరావుపై కేసు నమోదు చేయాలని చెప్పారు. ఈ మేరకు గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం’’అని ఇన్చార్జి డీఎస్ఓ రేవతి తెలిపారు. ఈ ఘటనతో సంబంధమున్న ఇతర అధికారులపై చర్యలకు సంబంధించి పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వివరించారు. ఈ లెక్కన రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదిక బుట్టదాఖలైనట్టేనా? అందులో పేర్కొన్న అదనపు కలెక్టర్ (రెవెన్యూ), మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇన్చార్జి తహసీల్దార్, సీఐ, ఎస్సైలపై చర్యలుంటాయా.. లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘రేషన్’ బియ్యం వ్యవహారం ఇదీ.. 2020 అక్టోబర్ 2న గద్వాల శివారులోని రేఖ రైస్ మిల్లులో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు స్థానిక పోలీసులకు పక్కా సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు ఆ మిల్లులో సోదాలు నిర్వహించారు. 341 సంచుల్లో (170.05 క్వింటాళ్లు) రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కానీ మిల్లు యాజమాన్యంతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారు. పట్టుబడినది రేషన్ బియ్యం కాదంటూ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఎల్.గణపతిరావు తప్పుడు నివేదిక రూపొందించి బురిడీ కొట్టించాడు. దీనిపై అప్పట్లో పోలీస్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గతంగా వివాదం చెలరేగింది. ఈ విషయం బయటికి రావడంతో రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మిల్లులో సీజ్ చేసిన బియ్యాన్ని ల్యాబ్‌కు పంపగా రేషన్ బియ్యమేనని తేలింది. దీంతో పూర్తిస్థాయిలో ఆరా తీశారు. రేఖ మిల్లులో బియ్యం పట్టుబడ్డ రోజు గణపతిరావు విధుల్లోనే లేరని, తప్పుడు అనుమతి పత్రాలను రూపొందించి అధికారులకు ఇచ్చారని గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పటి గద్వాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)తోపాటు మరో ఐదుగురి హస్తం ఉన్నట్టు తేల్చి గత ఏడాది డిసెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇన్నాళ్లూ ఆ నివేదిక మూలనపడగా.. తాజాగా గత నెల 21న గద్వాల పట్టణ పోలీసు స్టేషన్లో డీటీ గణపతిరావుపై కేసు నమోదు చేశారు. ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. -
జీరో దందాలకు అడ్డాగా ‘గద్వాల’.. కిలోల్లో బంగారం..
సాక్షి, గద్వాల: జీరో దందాకు కేరాఫ్ అడ్రస్‌గా నడిగడ్డ పేరు తెరపైకి వచ్చింది. ఏ వ్యాపారం చేయాలన్నా అక్రమార్కులు ముందుగా నడిగడ్డను ఎంచుకుంటున్నారు. పన్నులు ఎగ్గొట్టి దర్జాగా ధనం సంపాదించాలనే కుతూహలంతో జీరో దందా చేసే ముఠా గద్వాలలో పాగా వేశారు. తాజాగా మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అల్ మీనా జ్యువెలర్ వర్క్ దుకాణానికి చెందిన కోట్ల హీరాబేగ్ ఎలాంటి అనుమతి లేకుండా 1.786 కిలోల (సుమారు రూ.66 లక్షల విలువజేసే) బంగారు ఆభరణాలను జిల్లాకేంద్రంలోని పలు దుకాణాల యజమానులకు విక్రయించేందుకు వచ్చాడు. పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్‌్కఫోర్స్ సీఐ జగదీష్‌గౌడ్, ఎస్ఐ నరేష్, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించి హీరాబేగ్‌ను రాజవీధిలో అదుపులోకి తీసుకున్నారు. వాణిజ్య, కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ శాఖల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా బంగారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అయితే గద్వాలలోనే దాదాపు 20 కిలోలకు పైగా బంగారాన్ని విక్రయించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం 1.786 కిలోల బంగారాన్ని మాత్రమే వాణిజ్య పన్నులశాఖకు అప్పగించారు. ఈ విషయంపై జిల్లా వాణిజ్య పన్నులశాఖ అధికారి గోవర్ధన్‌ను మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి, పన్నులు చెల్లించకుండా బంగారం విక్రయించేందుకు హీరాబేగ్ గద్వాలకు వచ్చినట్లు పోలీసులు గుర్తించి సమాచారం అందించారన్నారు. బంగారానికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున ఫెనాలీ్టగా రూ.4 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. సెంట్రల్, కస్టమ్స్‌శాఖకు నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దు కావడమే.. రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో గద్వాల జీరో దందాలకు అడ్డాగా మారింది. ఆర్నెల్ల క్రితం కర్ణాటక పోలీసులు గద్వాలకు చెందిన ఓ వ్యాపారిని అరెస్టు చేసి రూ.20 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. ఇక్కడి వ్యాపారులే ఇతర రాష్ట్రాల వారితో ముఠాగా ఏర్పడి జీరో దందాను ప్రోత్సాహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్యలు తప్పవు.. బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వచ్చిన వ్యాపారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి విచారణ చేపట్టి జీరో వ్యాపారంగా గుర్తించారు. ఆభరణాలను జప్తు చేశాం.. ఏవైనా అనుమతి పత్రాలుంటే సంబంధితశాఖ అధికారులకు చూపించి తీసుకెళ్లాలని సూచించాం. పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లాలో అక్రమంగా బంగారం, ఇతరత్రా వ్యాపారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. – రంజన్‌రతన్ కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల జిల్లా -
పాడు పిల్లి.. రైతు దాచుకున్న అక్షరాల రూ.లక్ష బూడిదయ్యాయి
కేటీదొడ్డి (గద్వాల): ఓ పిల్లి చేసిన పనికి ఆ రైతు కష్టించి పోగు చేసిన లక్ష రూపాయలు నిప్పంటుకుని కాలిపోయాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం నందిన్నెకు చెందిన రైతు తెలుగు వీరేష్ తనపొలంలో యాసంగిలో వరి సాగు చేశాడు. చేతికొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిం చాడు. దీనికి సంబంధించి ఈ నెల 1న బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమయ్యాయి. శనివారం డబ్బు లు డ్రా చేసి బట్టలో చుట్టి ఇంట్లో (గుడిసె)ని సంచిలో భద్ర పరిచాడు. కాగా, సోమవారం దేవుడి పటాల ముందు పూజ చేసి హారతి ఇచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన ఓ పిల్లి హారతికి తగలడంతో గుడిసెలో మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పేసి నప్పటికీ అప్పటికే దాచుకున్న రూ.లక్ష నగదు దగ్ధమయ్యాయి. పంట పెట్టుబడికి ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి తెచ్చిన రూ.50 వేల అప్పు తీరు ద్దామనుకునేలోపే ప్రమాదం జరగడంతో బాధిత రైతు వీరేష్ లబోదిబోమంటున్నాడు. -
పెళ్లైన ఎనిమిదేళ్లకు పుట్టావు... అప్పుడే దూరమయ్యావా కొడుకా
గద్వాల క్రైం/తెలంగాణ: ‘అమ్మా త్వరగా వచ్చేయి. నేను, నాన్న.. నీ కోసం ఎదురు చూస్తుంటాం.. సరే బైక్‌పై జాగ్రత్తగా వెళ్లండి. నేను త్వరగా వచ్చేస్తాను..’అని ఆ తల్లి బదులిచ్చింది. ఆ కొద్దిసేపటికే జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా మారిన సంఘటన ఇది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణంలోని ఎర్రమట్టివీధిలో కటిక ముని, నవీన్‌కుమార్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు అఖిలేష్రాజ్ (8) ఉన్నాడు. ముని ఎనిమిదేళ్లుగా స్థానిక కేజీబీవీలో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. ఎప్పటిలాగే బుధవారం ఉదయం బైక్‌పై కుమారుడితో కలిసి తల్లిదండ్రులు కేజీబీవీకి వెళ్లారు. ఆమెను అక్కడ దింపి తండ్రి, కొడుకు తిరుగు ప్రయాణమయ్యారు. సంగాల బ్రిడ్జి వద్దకు చేరుకోగానే రాయచూర్ నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కారు డ్రైవర్ పరారీ అయ్యాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. నవీన్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రూరల్ ఏఎస్ఐ వెంకట్రాములు పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. గుండెలవిసేలా.. కాగా, విగతజీవిగా మారిన కుమారుడు, తీవ్ర గాయాలపాలైన భర్తను చూసి గుండెలవిసేలా భార్య ముని రోదించడం.. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ‘వివాహమైన ఎనిమిదేళ్లకు జన్మించావు. అప్పుడే మా నుంచి దూరమయ్యావా..’అని బాలుడి మృతదేహంపై పడి ఆ తల్లి దుఃఖించడంతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ పసిప్రాణం గాలిలో కలిపోయిందని బంధువులు కంటతడి పెట్టారు. అనంతరం బాధిత కుటుంబాన్ని డీఈఓ మహమ్మద్ సిరాజ్ద్దీన్, ఎంఈఓ సురేష్, ఉపాధ్యాయినులు ప్రణీత, శ్రీదేవి పరామర్శించారు. -
రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపాడు
కేటీదొడ్డి (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలో రైతుబంధు డబ్బులు ఇవ్వనందుకు కన్నతల్లినే ఓ కొడుకు కొట్టి చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కేటీదొడ్డి మండలంలోని గువ్వలదిన్నెకు చెందిన దాసరి శాంతమ్మ (52), హన్మంతుకు ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితమే భర్త ఎటో వెళ్లిపోయి ఇంతవరకు తిరిగి రాలేదు. పెద్ద కుమారుడు, కోడలు బతుకుదెరువుకోసం హైదరాబాద్ వలస వెళ్లారు. రెండో కుమారుడు వెంకటేశ్, తల్లి శాంతమ్మ స్వగ్రామంలోనే ఉంటూ తమకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రెండో పెళ్లి చేసుకున్న వెంకటేశ్‌ను తల్లి ఇంటి నుంచి గెంటేసింది. దీంతో వేరే కాపురం పెట్టిన అతను మద్యానికి బానిసై తరచూ డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. రెండు రోజుల క్రితమే ‘రైతుబంధు’డబ్బులు వచ్చాయని తెలుసుకున్న వెంకటేశ్ మంగళవారం అర్ధరాత్రి తల్లి వద్దకు వచ్చి గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వాలని అడగ్గా అమె నిరాకరించడంతో అంతు చూస్తానని చెప్పి కర్రతో తలపై కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ యాదగిరి, ఎస్ఐ కుర్మయ్య పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
అరచేతిలో.. ఫ్యాన్సీ నంబర్!
గద్వాల క్రైం: కారు కొనాలనే ఆశయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.లక్షలు వెచ్చించి దక్కించుకునేందుకు వెనకడుగు వేయరు. అయితే ఇక్కడే పలువురు యజమానులు దళారుల వైపు.. ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అయినప్పటికీ దళారులకు తెలిసిన సిబ్బంది ద్వారా ఫ్యాన్సీ నంబర్‌ను పెద్ద మొత్తంలో చెల్లించే యజమానులకు ఎలాగైనా ఫ్యాన్సీ నంబర్ సొంతం చేయాలనే లక్ష్యంతో ఉంటారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి తెలంగాణ ట్రాన్స్‌పోర్టు శాఖ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వివిధ సేవలు ఆన్లైన్ చేసి దళారీ వ్యవస్థకు చెక్ పెట్టింది. తాజాగా ఫ్యాన్సీ నంబర్ విషయంలోనూ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్లైన్లోనే వాహనదారులకు ఉపయోగపడేలా కోరుకున్న నంబర్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లాలో ఈ విధానానికి ఈనెల 10న అనుమతులు జారీ చేయడంతో వాహన యజమానులు ఊరట చెందుతున్నారు. సేవలు ప్రారంభం.. ఫ్యాన్సీ నంబర్‌ను పొందేందుకు జిల్లా రవాణా శాఖలో ప్రతిరోజూ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రక్రియ పూర్తయి మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. అనంతరం కోరుకున్న నంబర్‌ను త్వరగా పొందవచ్చు. ఇక ఎక్కడి నుంచైనా ఆన్లైన్ నంబర్‌ను ఎంపిక చేసుకునే ఆవకాశం ఉండటంతో వాహనదారులకు ఎంతో ఉపయోగపడనుంది. సద్వినియోగం చేసుకోవాలి వాహనాల రిజిస్ట్రేషన్‌లో భాగంగా ఫ్యాన్సీ నంబర్లు ఆన్లైన్లో రిజర్వు చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఈ విధానం ద్వారా వాహన యజమానులు కోరుకున్న నంబరును సులువుగా పొందవచ్చు. అలాగే 15 రోజుల్లో వాహనాన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – పురుషోత్తంరెడ్డి, డీటీఓ -
మొబైల్లో పాటలు వింటూ పట్టాలపై వెళ్తుండగా..
సాక్షి, గద్వాల : ఆ యువకుడి చిన్నపాటి నిర్లక్ష్యం.. అతని ప్రాణాన్నే బలిగొనేలా చేసింది. చెవిలో ఇయర్‌ఫోన్స్‌తో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా.. రైలు ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని వెంకమ్‌పేట శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. వెంకమ్‌పేటకి చెందిన పేతురు రాజు (24) శుక్రవరాం సాయంత్రం మొబైల్‌కు హేడ్‌సెట్ కనెక్ట్ చేసి పాటలు వీంటూ గ్రామ శివారులోని రైలు పట్టాలపై వెళ్తున్నాడు. గద్వాల నుంచి హైద్రాబాద్ వైపు వెళ్తున్న రైలు డ్రైవర్.. పట్టాలపై వెళ్తున్న రాజుని గమనించి హారన్ మోగించినప్పటికి అతను అప్రమత్తం కాలేదు. ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు యువకుడిని 108లో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి సుదర్శనం ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 5 నిమిషాల్లో గమ్యం.. అంతలోనే మరణం వంగూరు (కల్వకుర్తి): మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుతాడుకున్న వ్యక్తిని.. బస్సు రూపంలో మృత్యువు కబళించింది. మండలంలోని తిరుమలగిరి సమీపంలో శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సలయ్య అనే వ్యక్తి మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. తిరుమలగిరికి చెందిన పొలం సలయ్య(50) కల్వకుర్తి నుంచి టీవీఎస్ వాహనంపై తిరుమలగిరికి బయల్దేరాడు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరతాడు అనుకున్న సమయంలో వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన సలయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించి వివరాలను తెలుసుకుని కేసు నమోదు చేశాడు. మృతుడికి భార్య కళమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. చదవండి: కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని.. -
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారీ వర్షం
సాక్షి, గద్వాల : గత వారం రోజులుగా భారీ వర్షం కురుస్తుండటంతో పట్టణం తడిసి ముద్దయింది. భారీ వర్షంతో గద్వాల పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ముఖ్యంగా గంజి పేట, కుంట వీధి , రాజీవ్ మార్గ్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ గుండా భారీ వర్షపునీరు నిల్వ ఉంది. దీంతో కాలనీలోని ప్రజలతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనంటున్నారు. భారీ వర్షం వల్ల కాలనీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధులను, ప్రధాన కూడళ్లను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పరచడంతో పాటు మురుగునీరు నిల్వ ఉండకుండా చూసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పునరావాసం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చెరువులు వాగులు, వంకలు నిండుకుండలా ఉన్న దృష్టి ఆ వైపు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల గద్వాలలో 82.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
అవే.. ఆ తండ్రి చివరి మాటలు!
సాక్షి, గద్వాల: ‘20 నిమిషాల్లో వస్తా.. నువ్వు, తమ్ముడు, అమ్మ రెడీగా ఉండండి.. బయటకు వెళ్దాం’ అని ఆ తండ్రి తన కొడుకుతో ఫోన్లో మాట్లాడిన ఆ మూడు మాటలే.. కడసారి మాటలయ్యాయి. విధుల్లో భాగంగా వెళ్లిన ఆ ప్రభుత్వ ఉద్యోగి.. సాయంత్రం తిరిగి ఇంటికి బైక్‌పై వస్తున్న సమయంలో లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. ఇంటికి వస్తున్నా అని మాటిచ్చిన అతడు.. ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటనతో అప్పటి వరకు సంతోషాలతో నిండిన ఆ కుటుంబం ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఈ ఘటన గద్వాల మండలం అనంతపురం శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం మేరకు.. గద్వాల పట్టణానికి చెందిన విజయ్‌బాబు (39) విద్యుత్ లైన్మెన్గా ఇటిక్యాల మండలం కొండేరులో విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారి విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై ఉదయం విధులకు వెళ్లాడు. అయితే సాయంత్రం తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై గద్వాలకు బయల్దేరాడు. ఈక్రమంలో గద్వాల నుంచి ఎర్రవల్లి వైపు వెళ్తున్న లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను కొట్టాడు. ఈ ప్రమాదంలో విజయ్‌బాబు అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. దుఃఖసాగరంలో కుటుంబసభ్యులు 20నిమిషాల్లో ఇంటికి వస్తున్నానని చెప్పిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో విజయ్‌బాబు భార్య పద్మ నిశ్చేష్టురాలైంది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విజయ్‌బాబు స్వగ్రామం ఇటిక్యాల మండలం పెద్దదిన్నె కాగా.. గత కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి రెండవ రైల్వేగేటు బృందవన్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తొటి ఉద్యోగి మరణ వార్త తెలుసుకొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానూభూతి తెలిపారు. సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆ డాక్టర్లపై చర్యలు తీసుకుంటారా లేదా?
సాక్షి, హైదరాబాద్: గద్వాల జిల్లాకు చెందిన గర్భిణి జెనీలా (20)కు కరోనా పరిస్థితుల కారణంగా వైద్యం చేసేందుకు నిరాకరించి, ఆమె మృతికి కారణమైన ఆరుగురు డాక్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటారో లేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలకే పరిమితం కావద్దని, ఇది క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన ఘటన అని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా వైరస్ వ్యాప్తి ఉందని చెప్పి ఆమెకు వైద్యం చేసేందుకు నిరాకరించిన ఆరుగురు మహిళా డాక్టర్లపై శాఖాపర విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందేనని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేదీ లేనిదీ స్పష్టం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం తెలిపింది. వైద్యం అందక జెనీలా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు కరణం కిషోర్‌కుమార్, శ్రీనిత పూజారి వేర్వేరుగా రాసిన లేఖలను ధర్మాసనం ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించింది. ఆరుగురు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా ప్రభుత్వం నియమించిన ముగ్గురు ప్రొఫెసర్ల కమిటీ తేల్చిందని ఏజీ చెప్పారు. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, వైద్యం చేసేందుకు నిరాకరించినట్లుగా తేలినప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేదీ లేనిదీ తెలియజేయాలని ఆదేశించింది. గర్భిణీలకు వైద్యం అందిం చాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా జెనీలాకు కరోనా ఉందేమోనన్న భయంతో చికిత్స చేయని వైద్యులపై తీసుకున్న చర్యలు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా (అమికస్‌క్యూరీ) మాజీ వైద్యాధికారి లేదా గాంధీ/ఉస్మానియా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను నియమిస్తామని ప్రకటించింది. విచారణను జూన్ 10కి వాయిదా వేసింది. -
ఏడు ఆస్పత్రుల నుంచే పరిహారం
సాక్షి, హైదరాబాద్: గద్వాలకు చెందిన గర్భిణి జనీలాకు వైద్యం అందించని ఆస్పత్రుల యాజమాన్యాల నుంచే ఆమె కుటుంబానికి పరిహారం అందించాల్సి ఉంటుందని హై కోర్టు పేర్కొంది. కరోనా వైరస్ నివారణ వైద్యం చేయని ఆస్పత్రులు గర్భిణులకు, ఇతర అత్యవసర వైద్య సేవలను అంద జేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి తేల్చి చెప్పింది. వైద్యం అందించని ఏడు ఆస్పత్రుల వైఖరి క్షమించరానిదని వ్యాఖ్యానించింది. ప్రసవ వేదనతో బాధపడుతూ పలు ఆస్పత్రులకు తిరిగి చివరికి హైదరాబాద్‌లో పసికందుకు జన్మనిచ్చిన తర్వాత తల్లీబిడ్డలిద్దరూ మరణించిన ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని న్యాయవాదులు కిశోర్‌కుమార్, శ్రీనిత పూజారి రాసిన లేఖలను హైకోర్టు పిల్స్‌గా పరిగణించింది. వీటిని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. -
మూగబోయిన మగ్గంపై కన్నీళ్ల నేత
సాంచాల చప్పుళ్లతో కళకళలాడే నేతన్నల ఇళ్లలో మూగ రోదనలు వినిపిస్తున్నాయి. రంగు రంగుల పట్టుచీరలు నేసే ఆ మగ్గాలు.. పూట గడవక కన్నీళ్లను నేస్తున్నాయి. ధగధగ మెరిసే పట్టు చీరలను చూసి మురిసిపోయే ఆ కళ్లు.. వంటగదిలో నిండుకున్న కుండలను చూసి కన్నీళ్లు పెడుతున్నాయి. రాట్నాలు ఒడికే చేతులు.. అన్నార్థుల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా చేనేత రంగంపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న నేతన్నల దుస్థితి. యాదాద్రి, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో లాక్‌డౌన్‌తో పనుల్లేక ఇక్కట్లు పడుతున్న వేలాది మంది నేతన్నల బతుకు చిత్రంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. సాక్షి యాదాద్రి/గద్వాల/సిరిసిల్ల/సిద్దిపేట: కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మగ్గం చప్పుళ్లు ఆగిపోయాయి. పూటగడవని నేతన్న అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నాడు. ఒకపూట తిండికోసం, వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం చేనేత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. లాక్డౌన్ కారణంగా నేతన్నల జీవితాలు తారుమారయ్యాయి. చేనేతకు అవసరమైన ముడి పట్టు, కాటన్, నూలు రవాణా నిలిచిపోయాయి. రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, గద్వాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువగా చేనేత వృత్తిపై ఆధారపడి వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరికీ చేతిలో పనిలేక, డబ్బుల్లేక పోవడంతో నిత్యావసరాలు కొనుక్కోలేక పస్తులు ఉండాల్సి వస్తోంది. మందులకు డబ్బులు లేవు.. యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన చేనేత కార్మికురాలు వడ్డెపల్లి గీతావాణి. లాక్‌డౌన్‌తో పని లేక నానా అవస్థలు పడుతోంది. ఈమె భర్త గోపాల్ 7 సంవత్సరాల కింద అనారోగ్యంతో మృతిచెందాడు. ఏకైక కుమారుడు శ్రీధర్ (10) మానసిక వికలాంగుడు. శ్రీధర్ వైద్యఖర్చులు, మందులకే నెలకు నాలుగైదు వేలు ఖర్చవుతోంది. గీతావాణి మస్రస్ చీరలను మగ్గంపై నేస్తుంది. నెలకు 5 నుంచి 6 చీరలు నేయడం ద్వారా సరాసరి నాలుగున్నర వేలు సంపాదిస్తుంది. నెలరోజులుగా మగ్గం నడవట్లేదు. చేనేత అనుబంధ పనులు ఏమైనా చేద్దామంటే అవి కూడా మూతపడ్డాయి. మందులు కొనడానికి డబ్బులు లేవని, ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌బియ్యం, రూ.1,500 నిత్యావసర సరుకులు కొనడానికే సరిపోతున్నాయని చెబుతోంది. చేతిలో డబ్బుల్లేక ఇక్కట్లు పోచంపల్లికి చెందిన ఈమె పేరు కాముని పద్మ. భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంటి బాధ్యతను భుజాలకు ఎత్తుకుని 22 ఏళ్లుగా మగ్గం నేస్తోంది. అద్దె ఇంట్లో ఉంటోంది. కూలీ మగ్గం నేసి ముగ్గురు కుమార్తెల వివాహం చేసింది. ఇంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత రోజూ 8 గంటలు కూలీకి మగ్గం నేస్తుంది. నెలంతా పనిచేస్తే రూ.5 వేలు సంపాదిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మహిళా సంఘం ద్వారా బ్యాంకులో తీసుకున్న లోన్, పొదుపు డబ్బులు కట్టలేకపోతోంది. పేరుకుపోతున్న వస్త్ర నిల్వలు యాదాద్రి జిల్లా వ్యాప్తంగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. పోచంపల్లిలో రూ.70కోట్లకు పైగా పట్టు చీరల నిల్వలు, రామన్నపేట, మిగతా ప్రాంతాల్లో రూ.60కోట్ల కాటన్ వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. పోచంపల్లిలో కొండా లక్ష్మణ్ బాపూజీ షాపింగ్ కాంప్లెక్స్‌లో 100కు పైగా దుకాణాలు ఉన్నాయి. మాస్టర్ వీవర్స్ వద్ద రూ.10 కోట్లు, చేనేత సహకార సంఘంలో రూ.1.5 కోట్లు, వస్త్ర దుకాణాల్లో మరో రూ.50 కోట్లకు పైగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. స్టాక్ అమ్మాకే కార్మికులకు ఉపాధి ఇవ్వగలుగుతామని మాస్టర్ వీవర్స్ అంటున్నారు. ‘ఇక్కత్’కు కష్టాలు పోచంపల్లి మగ్గాల కేంద్రానికి తాళం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్పత్తి అయిన పట్టు చీరలు, కాటన్ ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోవడంతో రూ.130 కోట్ల విలువ చేసే చేనేత ఉత్పత్తులు పేరుకుపోయాయి. సహకార, సహకారేతర రంగంలో భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, భువనగిరి, రాజపేట, ఆలేరు, గుండాల, ఆత్మకూర్ (ఎం) యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల్లో చేనేత రంగంలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిలో 1,300 పైచిలుకు మగ్గాలు ఉండగా, 3 వేలకు పైగా చేనేత కార్మికులు చేనేత పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 5,500 మంది జియో ట్యాగింగ్‌లో నమోదు కాగా, మరో 15 వేల మందికి పైగా ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. నిలిచిన ముడి సరుకు రవాణా ప్రభుత్వం లాక్డౌన్ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇస్తూ చేనేత కార్మికులు పని చేసుకోవచ్చని తెలిపింది. కానీ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో చేనేత కార్మికులకు పని కల్పించే సానుకూల పరిస్థితులు లేవు. చైనా దేశం నుంచి దిగుమతి అయ్యే పట్టు ముడిసరుకు, రంగులు, రసాయనాలు 3 నెలల కిందటే నిలిచిపోయాయి. బెంగళూరులో ఉత్పత్తి అయ్యే పట్టు దేశంలోని కార్మికుల అవసరాలకు సరిపోవట్లేదు. చీరల జరీ సూరత్ నుంచి వస్తుంది. కాటన్ వస్త్రాలS తయారీకి అవసరమైన కాటన్ నూలు తమిళనాడులోని ఈరోడ్, సేలం, ఆదిలాబాద్ నుంచి జిల్లాకు వస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ముడిసరుకు దిగుమతి ఆగిపోయింది. చాలా చోట్ల ముడి నూలు లేక వస్త్రాల తయారీ నిలిచిపోయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నేతన్నల దుస్థితి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 10,550 మంది చేనేత కార్మికులు వివిధ రకాల డిజైన్లతో జరీ చీరలు, దుప్పట్లు, తువాళ్లను తయారు చేస్తున్నారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబం నెలకు సగటున నాలుగు జరీ చీరలు నేస్తారు. లాక్డౌన్ రోజుల్లో సుమారు 10 వేల వరకు జరీ చీరలు తయారయ్యాయి. కార్మికులు నేసిన ఈ చీరలను మాస్టర్ వీవర్స్ లాక్డౌన్ కారణంగా కొనుగోలు చేయట్లేదు. దీంతో కార్మికులు తయారు చేసిన చీరలను ఇళ్లలోనే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పని నిలిచిపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో కొంతమంది నేత కార్మికులు ఉన్నారు. ప్రధానంగా గద్వాల, రాజోలి, అమరచింత, నారాయణపేట, కొత్తకోట, అయిజ, ధన్వాడ, గట్టు, మాచర్ల, గోర్లఖాన్దొడ్డి తదితర ప్రాంతాల్లో నేత కార్మికుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. నూలు ధరలపై నియంత్రణేది చైనా నుంచి నూలు ముడి సరుకు నిలిచిపోయింది. దీంతో సిల్క్ ఉత్పత్తి తగ్గి బెంగళూరు కేంద్రంగా సరఫరా అయ్యే నూలుకు డిమాండ్ పెరిగి ధరలు రెట్టింపయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందు 3 నెలల కింద కిలో పట్టు వార్పు రూ.3,200ల నుంచి రూ.4,500లకు, వెప్ట్ కిలో రూ.3,500ల నుంచి రూ.4,800లకు పెరిగింది. మొత్తానికి వార్పు (7చీరలు)పైన రూ.15 వేల వరకు ధర పెరిగిందని వాపోతున్నారు. పెరిగిన నూలు ధరలకు అనుగుణంగా చీరల ధరలు పెంచితే మార్కెట్లో కొనుగోలుదారులు వస్త్రాలను కొనలేని పరిస్థితి నెలకొంది. గతంలో జరిపిన విక్రయాలకు డబ్బులు రాకపోవడంతో మాస్టర్ వీవర్స్ తమ వద్ద పనిచేసే కార్మికులకు పని నిలిపేశారు. దీంతో పనులు లేక కార్మికులు అర్ధాకలితో గడుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం, రూ.1,500 మాత్రమే వారికి జీవనాధారం అయ్యాయి. మూగబోయిన సిరిసిల్ల.. సిరిసిల్లలో కరోనా ప్రభావంతో కార్ఖానాలు బంద్ అయ్యాయి. బట్ట ఉత్పత్తి చేస్తేనే నేత కార్మికుల పొట్ట గడుస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్‌లోనూ ఆధునిక మరమగ్గాలు బంద్ అయ్యాయి. దీంతో మొత్తంగా సిరిసిల్లలో 25 వేల మరమగ్గాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా సిరిసిల్లలో వేలాది మంది కార్మికుల ఉపాధికి విఘాతం ఏర్పడింది. కాగా, సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. 6.2 కోట్ల మీటర్లు బతుకమ్మ చీరల బట్టను ఉత్పత్తి చేయాలని సిరిసిల్లలో వస్త్రోత్పత్తిదారులకు గత ఫిబ్రవరిలో ఆర్డర్లు ఇచ్చారు. చీరల డిజైన్‌ను మార్చడంతో బతుకమ్మ చీరలకు అవసరమైన నూలును దిగుమతి చేసుకుంటున్న దశలో కరోనా లాక్డౌన్ అయింది. దీంతో సిరిసిల్లకు పూర్తి స్థాయిలో నూలు ఇంకా రాలేదు. వచ్చిన నూలుతో వస్త్రోత్పత్తికి లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. దీంతో సిరిసిల్లలో అటు పాలిస్టర్ బట్ట, ఇటు బతుకమ్మ చీరల బట్ట ఏదీ ఉత్పత్తి కావట్లేదు. దీంతో నేత కార్మికుల బతుకు దయనీయంగా మారింది. నిత్యం పని చేసే కార్మికులకు నెల రోజులుగా పని లేకపోవడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక.. దిక్కుతోచక..! ఈ చిత్రంలో దీనంగా కనిపిస్తున్న శంకర్, పద్మ దంపతులిద్దరూ చేనేత కార్మికులు. వీరికి ఆరేళ్లపాప ఉంది. చేనేత వృత్తే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరూ కష్టపడి మగ్గం ద్వారా జరీ చీరలను తయారు చేస్తారు. నెలకు 3 చీరలు నేయడమే గగనం. వీటి ద్వారా సంపాదన నెలకు రూ.10 వేలకు మించదు. లాక్డౌన్ విధించడం, రాజోలి రెడ్‌జోన్‌లోకి వెళ్లడంతో మగ్గాలు నిలిచిపోయాయి. దీంతో వారు ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఘొల్లుమంటున్న ‘గొల్లభామ’ గత 40 రోజులుగా సిద్దిపేట జిల్లాలో నేతన్నల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గత నాలుగు రోజుల నుంచే చేనేత కార్మికులు పని ప్రారంభించారు. జిల్లాలో 13 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 5,450 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా గొల్లభామచీరలు, లివర్ టవల్స్, జర్నరీ టవల్స్ అధికంగా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన వస్త్రాలను టెస్కో ఖరీదు చేస్తుంది. గత 4 నెలల నుంచి వస్త్రాలను ఖరీదు చేయడంలో టెస్కో ఆలస్యం చేయడంతో కార్మికులకు కూలీ చెల్లించలేకపోతున్నారు. సహకార సంఘాల వద్ద వస్త్రాలు పేరుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా 2.5 కోట్ల విలువైన వస్త్రాలు సహకార సంఘాల వద్ద ఉన్నాయి. వీటిని విక్రయిస్తేనే కార్మికులకు వేతనాలు అందుతాయి. ప్రభుత్వం ఈ వస్త్రాలను త్వరగా ఖరీదు చేసి అదుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. పొట్ట నిండటమే కష్టమవుతోంది.. ఇతడి పేరు చాప శ్రీనివాస్ (38). నిత్యం సాంచాలు నడుపుతూ రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదించే వాడు. లాక్డౌన్ నేపథ్యంలో శ్రీనివాస్‌కు ఉపాధి కరువైంది. అద్దె ఇంట్లో ఉండే శ్రీనివాస్‌కు ఇద్దరు ల్లలు. భార్య బీడీ కార్మికురాలు. పొట్ట నింపుకోవడం కష్టమైతుందని వాపోతున్నాడు. చాప శ్రీనివాస్, పవర్లూమ్ కార్మికుడు, సిరిసిల్ల -
లాక్డౌన్ : కాన్పుకు వెళ్తే.. పొమ్మన్నారు
సాక్షి, గద్వాల : పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళితే.. అధిక రక్తపోటు, తక్కువ రక్తం ఉందని వైద్యు లు కాన్పు చేయమన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వేరే ఆస్పత్రికి వెళ్దామన్నా గత్యంతరం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ గర్భిణి ఆసుపత్రి ఆవరణలోనే బెంచీపై పడుకొని తీవ్ర అవస్థలు ఎదుర్కొంది. పురిటి నొప్పులతో ఆమె పడుతున్న వేదనను చూడలేక భర్త ఆమె బాధను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదంతా జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. (775కు చేరిన కరోనా మృతుల సంఖ్య) మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలింపు.. అయిజ మండలం యాపదిన్నెకి చెందిన జెనీలియా అనే గర్భిణిని డెలవరీ కోసం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రికి భర్త మహేంద్ర తీసుకొచ్చాడు. ఆస్పత్రి సిబ్బంది జెనీలియాకు పరీక్షలు నిర్వహించగా అధిక రక్తపోటు, తక్కువ రక్తం ఉండడంతో డెలివరీ చేయడం సాధ్యం కాదంటూ బయటకు పంపేశారు. దీంతో భర్త మహేంద్ర ఏం చేయాలో దిక్కుతోచక సంఘటనపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై డీఎస్పీ యాదగిరి వెంటనే స్పందించారు. పోలీసు సిబ్బందిని ఆస్పత్రికి పంపించారు. జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓతో మాట్లాడి గర్భిణిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. (విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే) -
కరోనా కోరలు: ఉలిక్కిపడ్డ గద్వాల
సాక్షి, గద్వాల : రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో గద్వాల జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మంగళవారం ఒక్కరోజే మరో ఎనిమిది కేసులు వెలుగుచూశాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. ఒక్క రోజే ఎనిమిది కేసులు నమోదు కావడంతో గద్వాల ఉలిక్కిపడింది. ఈ ఎనిమిది మందిలో ఏడుగురు గద్వాల పట్టణానికి చెందిన వారే కావడం గమనార్హం. రాజోలి మండలంలో మరొకరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 19, నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు చొప్పున మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. (తెలంగాణ బాటలో మరికొన్ని రాష్ట్రాలు!) తాజా కేసులతో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లా అధికారుల్లో ఆందోళన నెలకొంది. వారం రోజుల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా ఇప్పుడు కరోనా పేరు వింటేనే ఉలికిపడుతోంది. ఢిల్లీలో జరిగిన ధార్మిక సభలో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొన్న 127 మందిలో 71మంది గద్వాల జిల్లాకు చెందిన వారే ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారి వివరాలు తెలుసుకుని ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే గద్వాలకు చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌తో చనిపోవడం.. తాజాగా మరో ఎనిమిది మందికి పాజిటివ్ రావడంతో ఆ జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. -
గద్వాలలో అదృశ్యం.. ఆగ్రాలో ప్రత్యక్షం
సాక్షి, గద్వాల క్రైం: మూడు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయి అదృశ్యమైన ఓ మహిళ గద్వాలలో అదృశ్యమై.. ఆగ్రాలో ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాలలోని క్రిష్ణరెడ్డి బంగ్లాకు చెందిన పుట్ట లక్ష్మి అనే మహిళ మతిస్థిమితం కోల్పోయి గత మూడు నెలల కిందట అదృశ్యమైంది. అయితే సదరు మహిళ ఆదివారం ఆగ్రా పోలీసుల వద్దకు చేరింది. అక్కడి పోలీసులు అమెను గుర్తించి వివరాలు తీసుకుని గద్వాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గద్వాలలోని లక్ష్మి భర్త ఆదినారాయణ, కుటంబ సభ్యులకు ఆమె ఫొటో చూపించగా గుర్తు పట్టారు. అయితే భార్య మతిస్థిమితం కోల్పోయి గతంలోనూ ఇలా వెళ్లినట్లు తెలిపారు. దీంతో ఆగ్రా, గద్వాల పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అమెను తీసుకురావడానికి వారి కుటుంబ సభ్యులు ఆగ్రాకు బయలు దేరారు. -
వీడిన కార్తీక్ హత్య కేసు మిస్టరీ
గద్వాల క్రైం: మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాలలో సంచలనం సృష్టించిన కార్తీక్ హత్య, రాగసుధ ఆత్మహత్య కేసు చిక్కుముడి వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే కార్తీక్ హత్యకు గురయ్యాడని.. ఆ నేరం తనపైకి వస్తుందనే ఆందోళనతో రాగసుధ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గద్వాల డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి శనివారం కేసు వివరాలు వెల్లడించారు. రాగసుధ, కార్తీక్ ఇంటర్లో క్లాస్మేట్స్.. రవి వీరి కంటే సీనియర్. కొన్నేళ్ల క్రితం రాగసుధకు మహబూబ్‌నగర్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌తో వివాహమైంది. గతంలో రాగసుధకు కార్తీక్, రవితో ఉన్న పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రవితో చనువుగా ఉండటం గమనించిన కార్తీక్.. రాగసుధను వేధించసాగాడు. ఈ నేపథ్యంలో కార్తీక్ నుంచి తనకు విముక్తి కలిగించాలని రాగసుధ రవికి చెప్పింది. దీంతో అతను కార్తీక్ అడ్డు తొలగించాలనుకున్నాడు. ఫిబ్రవరి 24న కార్తీక్ రాగసుధకు ఫోన్ చేయగా.. ఆ విషయాన్ని ఆమె రవికి చెప్పింది. (ప్రాణాలు తీసిన ఫేస్బుక్ చాటింగ్) కార్తీక్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి తెలుసుకున్న రవి.. అతనిని శ్రీనివాస్‌నగర్ కాలనీలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో కలిశాడు. అక్కడ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి కార్తీక్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు వసంత్, అనిల్‌ను రవి తన కారులో ఎక్కించుకుని రాత్రి ఒంటిగంట సమయంలో గద్వాల వెళ్లాడు. అక్కడ మరో మారు వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవి.. కార్తీక్ తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. దీంతో స్పృహ తప్పిన కార్తీక్‌ను కారు డిక్కీలో వేసుకుని రవి నిర్వహిస్తున్న డెకరేషన్ షాప్ వద్దకు తీసుకెళ్లారు. తెల్లవారుజామున కార్తీక్‌ను లేపేందుకు ప్రయత్నించగా.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దీంతో అదే కారులో మేలచెర్వు గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి పాతిపెట్టారు. మిస్సింగ్ కేసు నమోదుతో వెలుగులోకి.. కార్తీక్ 24వ తేదీన మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి సూరిబాబు ఫిబ్రవరి 25న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిని గద్వాలకు చెందిన కొంతమంది బెదిరిస్తున్నారని చెప్పడంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్, కాల్‌డేటా ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో కార్తీక్‌ను హత్య చేసినట్లుగా రవికుమార్, వసంత్, అనిల్‌లు ఒప్పుకున్నారు. హత్యకు గురైన కార్తీక్‌ను పూడ్చిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగించారు. అయితే ఈ కేసులో మరో ఆరుగురు ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. -
టీఆర్ఎస్ వారిని భయపెట్టి ఓట్లు మళ్లించుకుంది: అరుణ
సాక్షి, గద్వాల(మహబూబ్‌నగర్): జిల్లా మున్సిపాలిటీలోని 10 స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకుందని మాజీ మంత్రి డీకే ఆరుణ హర్షం వ్యక్తం చేశారు. గద్వాలోని తన నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ: 6 వార్డుల్లో కేవలం 50 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నైతికంగా విజయం సాధించిందని, ఎస్ఆర్సీ పేరుతో ముస్లిం ఓటర్లను భమభ్రాంతులకు గురి చేసి టీఆర్ఎస్ వారి ఓట్లను మళ్ళీంచుకుందని తెలిపారు. కాగా ముస్లిం ఓటర్లు లేని చోట బీజేపీ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టితో గెలిచారని వెల్లడించారు. కేవలం ఎస్ఆర్సీ పేరుతో టీఆర్ఎస్ ముస్లింలను భయపెట్టి బీజేపీకి ఓటు వేయకుండా చేసిందన్నారు.గద్వాల మున్నిపాలిటీలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. -
మున్సిపల్ ఎన్నికల్లో తటస్థులకు గాలం
సాక్షి, గద్వాల: అన్నా.. రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది. మీ ఆశీర్వాదం ఉంటేనే నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలోకి దిగుతా. లేకుంటే పోటీ నుంచి విరమించుకుంటా.. ఇలా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని వివిధ వార్డుల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ముందస్తుగా ఆయా వార్డుల్లోని ఇళ్లకు వెళ్లి ఓటు మాటను తీసుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పట్టణాల్లో 77 వార్డులలో ప్రచారం చేస్తున్నారు. ఓవైపు పలువురిని తమ పార్టీల్లో చేర్చుకుంటూనే, మరోవైపు తటస్థ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఎవరికి అనుకూలంగా ఉన్న కుల సంఘాలను వారు కూడగట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఎటువైపు మొగ్గు చూపకుండా ఉండే ఓటర్ల మనసుని గెలిచేలా వ్యూహాన్ని అను సరిస్తున్నారు. ఎవరు చెబితే ఆ ఓటరు కుటుంబం తమవైపు మల్లుతుందో తెలుసుకొని వారితో చెప్పిస్తున్నారు. ఒకసారి తమకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలవడం కష్టమైన ప్రక్రియగా పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థితోపాటు వేర్వేరుగా 4 నుంచి 6 బృందాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరికి ద్వితీయశ్రేణి నాయకులు, మహిళా, విద్యార్థి విభాగాల నాయకులు సారథ్యం వహించేలా శ్రద్ధ కనబరుస్తున్నారు. అంతిమంగా ప్రతి ఇంటికి వెళ్లి ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలనే విషయం నేరుగా చేరడంతోపాటు ప్రచార కరపత్రాన్ని అందించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఒకే వీధిలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వెళ్లడం లేదు. ఇలా వెళ్తే ఓటరుతో ఏకాంతంగా మాట్లాడేందుకు సమయం ఉండకపోవడం, ఒకరిద్దరు ఇళ్ల చెంతనే సమయం వృథా అవుతుండటంతో అసలు సందేశం ఓటర్లకు చేరడం లేదు. దీంతో కొత్త తరహాలో ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. ఇదే తీరును అన్ని పార్టీలోని వారు అవలంభిస్తున్నారు. ఒక చోటా.. మోటా నాయకులు తాము ప్రచారాన్ని ఫలానా కాలనీలో చేస్తాం. గరిష్టంగా ఇన్ని ఇళ్ల వాళ్లను కలిసి ప్రచారం చేస్తామని, ఇందుకయ్యే ఖర్చు భరించాలని అభ్యర్థులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. వార్డుల వారిగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉండే ఓటరు మనస్సును గెలిచే ప్రయత్నాలు జోరవుతున్నాయి. ఇప్పటికే మహిళా సంఘాలు, కుల సంఘాలతో అభ్యర్థులు ఓటు మాటలను తీసుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల వీరికి గంపగుత్తగా ఉన్న ఈ ఓట్లు తమకే పడతాయనే ధీమాను ఆయా పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. పలుచోట్ల తటస్థంగా ఉన్న పెద్ద కుటుంబాల మద్దతు కోరేందుకు పోటీదారులు మక్కువ చూపిస్తున్నారు. రాజకీయ ఆర్భాటాలకు దూరంగా ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు, విభిన్నరంగాల్లో ఉన్న కుటుంబాల ఓట్లకు గాలం వేసేలా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. -
అన్నను హత్య చేశారనే పగతో..
సాక్షి, గద్వాల క్రైం: పెద్దల ఆస్తి కోసం తరచూ చోటుచేసుకుంటున్న ఘర్షణలు ఒకవైపు.. తన అన్నను గతంలో హత్య చేశారనే అనుమానం, పగ మరోవైపు. దీంతో ఎలాగైనా సదరు వ్యక్తిని అంతం చేయాలని నిర్ణయించి.. పథకం ప్రకారం మద్యం తాగుదామని నమ్మించి మరో వ్యక్తి సాయంతో గురువారం హత్య చేశారు. ఈ హత్యాఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ కృష్ణ వెల్లడించారు. శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో హత్యకు దారి తీసిన కారణాలను ఆయనతోపాటు, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ హన్మంతు వివరించారు. గద్వాలలోని తెలుగుపేట(గజ్జెలమ్మ వీధి)కు చెందిన కుర్వపాండు ఈ నెల 4వ తేదీన పిల్లిగుండ్ల సమీపంలో హత్యకు గురయ్యాడన్నారు. మృతుడు పాండు, గోవిందు ఇద్దరూ బంధువులు. అయితే అదేకాలనీలో పెద్దల ఆస్తి అయిన ఇట్టి స్థలం వివాదం వారి మధ్య చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే గోవిందు అన్న వెంకటేష్ 2015 జూన్ 13న మృతి చెందాడు. అయితే, తన అన్న మృతికి పాండు ప్రమేయం ఉందనే అనుమానంతో సదరు వ్యక్తిపై కక్ష్య పెంచుకున్నాడు. ఈ నెల 4వ తేదీన గద్వాల శివారు ప్రాంతమైన పిల్లిగుండ్ల కాలనీలో మద్యం తాగేందుకు గోవిందు బావమరిది వేణు సాయంతో అక్కడికి పిలుచుకొని పాండు కత్తితో పొడిచి హత్య చేశాడని వారు వివరించారు. నమ్మించి మట్టుబెట్టారు అన్న మృతి అతనే కారణమనే అనుమానం, ఇంటి స్థలం వివాదంతో కక్ష్య పెట్టుకున్న గోవిందు ప్రత్యర్థిని ఎలాగైన చంపాలనే కసితో బావమరిది వేణు సహాయం తీసుకున్నాడన్నారు. పథకం మేరకు ఈ నెల 4వ తేదీన మద్యం తాగేందుకు వెళ్దామని వేణు పాండుకు చెప్పి రాత్రి 8గంటల ప్రాంతంలో తన బైక్‌పై ఎక్కించుకొని పిల్లిగుండ్ల శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడన్నా రు. ఇద్దరం మద్యం తాగుతున్నామని బావమరిది తన బావకు ఫోన్ ద్వారా తెలియజేయగా.. గోవిందు సైతం అక్కడకు చేరుకున్నాడన్నారు. ఈక్రమంలో మద్యం మత్తులో ఉన్న వేణును పాండు వెనుక నుంచి వచ్చి పదునైన కత్తితో పొ డిచి హత్య చేశాడన్నారు. అనంతరం మృతదేహాన్ని దగ్గర్లో ఉన్న రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారన్నారు. పట్టుబడిందిలా.. ఈమేరకు మృతదేహం పడిన స్థలాన్ని పరిశీలించామని, అయితే, హత్య చేసిన ప్రాంతంలో తాగిపడేసిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని మద్యం ఎక్కడ కొనుగోలు చేశారనే కోణంలో విచారణ చేపట్టామన్నారు. మద్యం సీసాలకు సంబంధించిన లేబుల్‌ను స్కాన్ చేయడంతో పట్టణంలోని కూరగాయాల మార్కెట్ సమీపంలో ఓ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించామని వివరించారు. ఇక సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి రెండు బృందాలుగా వీడిపోయి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితులు పలుమార్లు ఫోన్ ద్వారా బంధువులతో మాట్లాడం, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నామన్నారు. శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. అయితే నిందితుల నుంచి ఒక బైక్, రెండు సెల్ఫోన్లు, ఓ కత్తి, మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నామన్నారు. హత్య జరిగిన అయిదు రోజుల వ్యవధిలోని నిందితులను పట్టుకున్నామన్నారు. వీరిని పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన హేడ్ కానిస్టేబుల్ భాస్కర్, సాంకేతిక సిబ్బంది చంద్రయ్య, రామకృష్ణ, ప్రేమ్కోటిలను ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ సత్యనారయణ తదితరులు ఉన్నారు. -
8 ఏళ్లకే 87 సార్లు రక్తం ఎక్కించారు..
సాక్షి, అలంపూర్: ఆ బాలుడి వయస్సు కేవలం ఎనిమిదేళ్లే.. కానీ, మాయదారి జబ్బు సోకడంతో జీవితానికి ఎదురీదుతున్నాడు.. రక్తపిపాసి తలసేమియా సోకడంతో ఇప్పటికే 87 సార్లు రక్తం ఎక్కించారు.. వ్యాధి శాశ్వత నివారణకు ఆపరేషన్ చేయాల్సిందేనని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి సంతానమే.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం మాన్‌దొడ్డికి చెందిన భాస్కర్, లక్ష్మీదేవిల మొదటి సంతానంగా జన్మించిన హేమంత్‌కుమార్‌కు పుట్టుకతోనే తలసేమియా వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉండటం వల్ల శరీరంలో రక్తం పెరగదు. దీంతో తల్లిదండ్రులు బాబుకు ఏడాదిన్నర వయస్సు నుంచి వైద్యుల సూచన మేరకు నిర్ణీత రోజులకొకసారి రక్తం ఎక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ చిన్నారి బాబుకు 87 సార్లు రక్తం ఎక్కించారు. ఇలా ఎక్కువగా రక్తం ఎక్కించడం వల్ల శరీరంలోని ప్రతి అవయవంలో ఐరన్ ఎక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే బాబుకు అవయవాల్లో ఐరన్ ఎక్కువ కావడంతో, దాని కోసం కూడా మందులు వాడుతున్నారు. బాబు కోసం గ్రామం వదిలి.. తమ కొడుకును కాపాడుకునేందుకు తల్లిదండ్రులు మారుమూల గ్రామం మాన్‌దొడ్డి నుంచి జడ్చర్లకు తమ నివాసాన్ని మార్చారు. తండ్రి భాస్కర్ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆస్పత్రిలో వైద్యం తీసుకునేందుకు, హైదరాబాద్ వెళ్లేందుకు కూడా ఇక్కడి నుంచి దగ్గరవుతుందని జడ్చర్లలోనే ఉంటున్నామని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. బాబు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యకు ఆపరేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అందుకు రూ.10 లక్షల అవసరం కాగా.. ఇప్పటికే ఎంతో ఖర్చు చేశామని, కడుపు కట్టుకుని రూ.2 లక్షలు పోగు చేసుకున్నామని, మిగతా డబ్బును దాతలు ఎవరైనా అందిస్తే తమ కుమారుడికి నిండు జీవితాన్ని అందించినవారవుతారని విజ్ఞప్తి చేస్తున్నారు. బాధిత కుటుంబానికి సహాయం చేయదలిచిన వారు 8985548806 గూగుల్ పే నంబర్ ద్వారా, స్టేట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 32383343535 శాంతినగర్ శాఖ ద్వారా కానీ సహాయం చేయాలని, పూర్తి వివరాలకు సెల్ నం. 85550 40715ను సంప్రదించాలని హేమంత్ తల్లిదండ్రులు కోరుతున్నారు. -
గద్వాల్ మైత్రి సంస్ధల మోసాలపై విచారణ
-
ఇక బాలామృతం ‘ప్లస్’!
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో తీవ్ర పోషక లోపాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త పౌష్టికాహారం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అన్నిరకాల పోషక విలువలున్న ఆహారంగా ‘బాలామృతా’న్ని చిన్నారులకు అందిస్తున్నారు. దీంతో చిన్నారుల పెరుగుదల సంతృప్తికరంగా ఉంటోంది. అయితే పోషకలోపాలున్న చిన్నారులకు బాలామృతం కంటే మరింత అధిక పోషణ గుణాలున్న ఆహారాన్ని ఇవ్వాలని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘బాలామృతం ప్లస్’ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (ఎన్ఐఎన్)లో జరిగిన కార్యక్రమంలో ‘బాలామృతం ప్లస్’ను వినియోగంలోకి తెచ్చారు. ముందుగా రెండు జిల్లాల్లో... అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఆరోగ్య స్థితిని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. వారి బరువు, ఎదుగుదలను క్రమం తప్పకుండా కొలవడంతో పాటు వారి ఆరోగ్య స్థితిని సైతం రికార్డు చేస్తుంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయి నివేదికను విశ్లేషించగా... కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఎక్కువ మంది చిన్నారులు తీవ్ర పోషక లోపాల బారిన పడినట్లు గుర్తించారు. ఇలాంటి వారికి సాధారణ ఆహారంతో పాటు అధిక పోషక విలువలున్న ఆహారాన్ని ఇవ్వాలి. అలా అయితేనే వారు ఐదేళ్ల వయసొచ్చేసరికి పోషక లోపాలు అధిగమించడంతో పాటు ఆ తర్వాత ఎదుగుదల సాధారణంగా మారుతుంది. ఈ అంశంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగంతో పాటు ఎన్ఐఎన్, టీఎస్ ఫుడ్స్, యూనిసెఫ్ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి పోషక విలువలు ఎక్కువగా ఉన్న బాలామృతం ప్లస్‌ను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్, యూనిసెఫ్ దక్షిణాది రాష్ట్రాల చీఫ్ మిషల్ రాస్డియా తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆహారంలో... కొత్తగా తీసుకొచ్చిన బాలామృతం ప్లస్‌లో పాలపొడి, పల్లీ నూనె, రైస్, వీట్, బెంగాల్‌గ్రామ్, చక్కెరతో పాటు కొవ్వు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిశ్రమాలను జత చేస్తారు. దీంతో పోషక విలువలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బాలామృతం ప్లస్‌ను కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు జిల్లాల్లో నెలకు సగటున టన్ను బాలామృతం ప్లస్ సరఫరా చేసేలా తయారు చేస్తున్నారు. డిమాండ్‌కు తగినట్లు పరిమాణాన్ని పెంచేందుకు టీఎస్‌ఫుడ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లస్ ఆహారాన్ని అందిస్తూ చిన్నారుల ఎదుగుదల, పోషక లోపాల తీరును వరుసగా మూడు నెలల పాటు పరిశీలిస్తారు. ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది మరో 10 జిల్లాల్లో బాలామృతం ప్లస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తోంది. -
గులాబీలో గలాటా..!
సాక్షి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో రాజకీయ అలజడి రేగింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. దళిత వర్గానికి చెందిన తనపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారంటూ అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. శుక్రవారం హైదరాబాద్ వెళ్లిన అబ్రహం.. నియోజకవర్గంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడ మీడియాకు వివరించారు. రెండురోజుల క్రితం తన నియోజకవర్గ పరిధిలోని అయిజ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలోనూ అబ్రహం.. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా ఇలాకాలో ఇతరుల జోక్యం తగదు. నేనూ ఎమ్మెల్యేనే.. ఆయనా ఎమ్మెల్యేనే.. పక్క నియోజకవర్గానికి చెందిన ఆయన ఇక్కడ నాపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. దీంతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఇరువురు మధ్య విభేదాలు ఎట్టకేలకు బట్టబయలయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో ఏకంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తూ అబ్రహం ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. దళితవర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే తనపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన నియోజవకర్గంలో కాలుపెడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో గద్వాల ఎమ్మెల్యేపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ పరిణామాలు ఎటూ దారి తీస్తాయోననే ఆందోళన ఆ జిల్లాలోని గులాబీ కార్యకర్తల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. చిచ్చుపెట్టిన ‘పుర’ టికెట్లు.. త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికలే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు సృష్టించాయి. అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని అయిజ మున్సిపాలిటీలో ఈ సారి తను సూచించిన అభ్యర్థులకే బీ ఫారాలు ఇవ్వాలని.. లేకపోతే ఆయా స్థానాల్లో రెబెల్స్‌ను బరిలోకి దింపి వారిని గెలిపించుకుని తీరుతానంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఫోన్లో తనను బెదిరించారని ఎమ్మెల్యే అబ్రహం ఆరోపిస్తున్నారు. మంచి తనాన్ని చేతకాని తనంగా భావించిచొద్దని సూచించిన అబ్రహం.. పార్టీకి నష్టం చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటానని ఎవరికీ అన్యాయం జరగనీయబోనని కార్యకర్తల సమావేశంలో తేల్చి చెప్పారు. ఇదీలా ఉంటే.. ఇరువురి ఎమ్మెల్యేల మధ్య చిచ్చుకు అదే పార్టీకి చెందిన మరో నేత కారణమనే చర్చ జరుగుతోంది. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యం కోసం తను చెప్పిన వారికి టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేసి విఫలమైన సదరు నాయకుడు తాజాగా ‘పుర’పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో అబ్రహంకు ఫోన్ చేయించినట్లు అధికార పార్టీలోనే చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. ఏదేమైనా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలు.. ప్రస్తుతం గద్వాల జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇద్దరు ఎమ్మెల్యే మధ్య నెలకొన్న విభేదాలపై అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరోవైపు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తనపై చేసిన విమర్శలపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అంతగా స్పందించలేదు. ఆయన వివరణ కోసం సాక్షి ఫోన్లో సంప్రదించగా... ‘అలంపూర్ ఎమ్మెల్యే చేసిన విమర్శలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరి గురించి అన్నారో తెలియదు. ఏమున్నా... పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా’ అని సమాధానం చెప్పారు. -
గద్వాల – మాచర్ల రైల్వేలైన్‌కు కేంద్రం అంగీకారం
గద్వాల టౌన్: గద్వాల– మాచర్ల రైల్వేలైన్ చేపట్టేలా కృషి చేస్తున్నామని, రాష్ట్రవాటాతో కలిసి చేపట్టేందుకు కేంద్ర మంత్రి అంగీకరించినందున త్వరలోనే ప్రజాప్రతినిధులు అందరం కలిసి సీఎం కేసీఆర్‌ను కలవబోతున్నామని నాగర్‌కర్నూలు పార్లమెంట్ సభ్యులు పి రాములు అన్నారు. శనివారం గద్వాల మండలం జమ్మిచేడు హరిత హోటల్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. రాయచూరు నుంచి గుంటూరు జిల్లాలోని మాచర్ల వరకు ఏర్పాటు చేయాల్సిన రైల్వే లైన్లో గద్వాల రాయచూర్ మధ్య మాత్రమే మొదటి దశలో పూర్తయిందని, రెండో దశగా గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిల ద్వారా మాచర్ల వరకు చెపట్టాల్సిన రైల్వే లైన్‌ను చేపట్టేందుకు కృషి చేస్తున్నానమన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి పీయూస్ గోయల్‌ను కోరగా, ప్రాజెక్టులో రాష్ట్ర వాటాకు అంగీకరిస్తే చేపట్టేందుకు వీలుపడుతుందని చెప్పారన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరం కలిసి త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించామని తెలిపారు. గద్వాల మాచర్ల లైన్ వల్ల ఈ ప్రాంత అభివృద్దికి జరిగే మేలును ఆయనకు వివరించి, రాష్ట్ర వాటాను కలిపేందుకు కోరుతామన్నారు. త్వరలోనే గద్వాల మాచర్ల లైన్ డీపీఆర్‌కు అవసరమైన కసరత్తు పూర్తి చేసేలా తన వంతు కృషి ఉంటుందని తెలిపారు. గద్వాల, జోగుళాంబ స్టేషన్ల అభివృద్ధికి చర్యలు గద్వాల రైల్వే స్టేషన్లో 21 బోగీల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తగినట్లుగా ప్లాట్ ఫాంలు 1.2లను పొడగింపురకు జీఎం అంగీకరించారన్నారు. గద్వాల జిల్లా కేంద్రం, జంక్షన్ స్టేషన్‌గా ఉన్న ఈ స్టేషన్ ద్వారా ఆగకుంగా వెళ్తున్న కొంగు, అజరత్ నిజాముద్దీన్, ఘోరక్పూర్, ఓకా రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లకు హల్టింగ్ ఇవ్వాలని కోరడమైందన్నారు. వాటిలో రెండింటిని ఆపేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారన్నారు. గద్వాల స్టేషన్లో వాహనాల పార్కింగ్‌ను విస్తరించాలని కోరగా.. చేస్తామన్నారని వివరించారు. జోగుళాంబ రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్సించేలా బుకింగ్‌ను అభివృద్ధి, స్టేషన్ ప్రక్కనే ఉన్న రహదారికి అండర్ బ్రిడ్జిని చేపట్టాలని కోరగా.. అందుకు అంగీకారం తెలిపారన్నారు. -
జూరాలకు భారీ వరద
గద్వాల టౌన్: ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. మంగళవారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 25 క్రస్టు గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,28,146 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి, ఇతర కాల్వల ద్వారా దిగువ నదిలోకి 2,54,910 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,45,424 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువ నదిలోకి 1,56,407 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 10 క్రస్టు గేట్లను ఎత్తి దిగువ నదిలో కి 2,57,844 క్యూసెక్కుల వరదను విడుదల చే స్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న జూరాలకు బుధవారం ఉదయానికి వరద స్థాయి మరింతగా పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర నదిలోనూ.. కృష్ణానదికి ఉపనది అయిన తుంగభద్ర నదిపై కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం100.83 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,44,757 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టులోని 33 క్రస్టు గేట్లను ఎత్తి దిగువ నదిలోకి 1.54 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీ వద్ద 1,16,536 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. బ్యారేజీకి వరద మరింతగా పెరగనుంది. ఎత్తిపోతల పథకాలకు.. జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి ఎత్తిపోతల పథకాలకు పంపింగ్‌ను కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, భీమా స్టేజీ–1కు 650, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల కుడి ప్రధాన కాల్వకు 822, ఎడమ ప్రధాన కాల్వకు వెయ్యి, సమాంతర కాల్వకు 340 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ 21,995 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. -
క్యాట్‌ఫిష్‌పై టాస్క్‌ఫోర్స్..!
సాక్షి , మహబూబ్‌నగర్: నిషేధిత క్యాట్‌ఫిష్ సాగుపై టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో విచ్చలవిడిగా సాగవుతోన్న ఈ ప్రాణాంతక క్యాట్‌ఫిష్ చెరువులపై టాస్క్‌ఫోర్స్ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ అటువైపు కన్నెత్తి చూడని సంబంధిత అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో నేరుగా రంగంలో దిగిన జిల్లా ఇన్చార్జి ఎస్పీ అపూర్వరావు ఈ నెల 10న పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ సిబ్బందితో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. మరుసటి రోజే రంగంలో దిగిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గద్వాల నియోజకవర్గ పరిధిలోని ధరూర్, అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఇటిక్యాల, అయిజ మండలాల్లో సాగవుతోన్న క్యాట్‌ఫిష్ చెరువులపై దాడులు నిర్వహించారు. సుమారు 2 క్వింటాళ్ల క్యాట్‌ఫిష్ చేపపిల్లలను గుర్తించి.. వాటిని రసాయనాలతో చంపేశారు. తర్వాత భూమిలో పాతిపెట్టారు. దీంతో ఇన్నాళ్లూ యథేచ్ఛగా సాగు చేస్తున్న క్యాట్‌ఫిష్ నిర్వాహకుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇప్పటికే తాము సాగు చేస్తోన్న చేపలు టాస్క్‌ఫోర్స్ కంటబడకుండా వాటిని రక్షించే పనిలో పడ్డారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కలిగిన సాగు కావడంతో వాటిని కాపాడుకునేందుకురాజకీయ నేతలనూ ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన క్యాట్‌ఫిష్ జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో సాగవుతున్నా మత్స్యశాఖఅధికారుల దృష్టికి రాకపోవడం గమ నార్హం. తాజాగా టాస్క్‌ఫోర్స్‌దాడులు గద్వాలలో చర్చనీయాంశంగా మారాయి. అక్కడా అత్యధిక సాగు.. నిషేధిత క్యాట్‌ఫిష్ సాగు ఉమ్మడి జిల్లా పరిధిలోని జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో జోరుగా సాగుతోంది. సాగు దారులు ఎవరికీ అంతుపట్టకుండా గ్రామ శివారులో ఉన్న భూముల్లో క్యాట్‌ఫిష్‌ను పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా గద్వాల మండలం బీరెల్లి, లత్తిపురం, అనంతపురం, అయిజ మండలంచిన్నతండ్రాపాడ్, ధరూర్ మండలం ఉప్పేర్, గార్లపాడు, ఖమ్మంపాడు, నందిమల్ల, పెబ్బేరు, రంగాపూర్, ఇటిక్యాల మండలం ఆర్ గార్లపాడు, యుక్తాపూర్, తిమ్మపురం, కొండేర్, జింకలపల్లి తదితర ప్రాంతాల్లో ఈ ప్రాణాంతక చేపలు భారీ మొత్తంలో సాగవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో భూములను లీజుకు తీసుకున్న కొందరు అక్రమార్కులు వాటిలో క్యాట్‌ఫిష్‌ను దశాబ్దకాలంగా సాగు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో పాటు పర్యావరణ ముప్పునకు కారకమైన ఈ చేపలను సాగు చేసి.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఇటిక్యాల, ధరూర్ మండలంలో భారీ మొత్తంలో సాగవుతున్న పలు క్యాట్‌ఫిష్ చెరువులపై టాస్క్‌ఫోర్స్ బృందాలు దృష్టి సారిస్తాయా? లేదా? అనే చర్చ అప్పుడే మొదలైంది. మనోళ్ల చెరువులపై ఆంధ్రుల సాగు.. ఉమ్మడి జిల్లాలోని ఎన్నో ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నిషేధిత క్యాట్‌ఫిష్ సాగు అవుతున్నా.. ఆయా చెరువుల నిర్వాహకులు మాత్రం తెలంగాణేతరులే కావడం గమనార్హం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు ఉమ్మడి జిల్లాలోని పలు శివారు ప్రాంతాల్లో ఎక్కువ డబ్బులిచ్చి చెరువులు లీజుకు తీసుకుంటారు. వాటిలో నిషేధిత క్యాట్‌ఫిష్‌ను సాగు చేస్తారు. పలుచోట్ల కనబడకుండా చెరువుల చుట్టూ కంప చెట్లు పెంచుకుంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లో చెరువులు ఉన్నట్లు.. వాటిలో నిషేధిత క్యాట్‌ఫిష్ ఉన్నట్లు కనీసం ఆయా గ్రామాల ప్రజలకు సైతం తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు క్యాట్‌ఫిష్‌ను గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. దాడులు విస్తృతం చేశాం.. టాస్క్‌ఫోర్స్.. నిషేధిత క్యాట్‌ఫిష్ సాగుపై కొరడా ఝుళిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో జిల్లాలో పలుచోట్ల దాడులు నిర్వహించి క్యాట్‌ఫిష్‌ను గుర్తించాం. వాటిని చంపి.. భూమిలో పాతిపెట్టాం. ఇకపైనా దాడులు కొనసాగుతాయి. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం. – రూపేందర్‌సింగ్, జిల్లా మత్య్యశాఖాధికారి, జోగులాంబ గద్వాల -
గట్టు.. లోగుట్టు!
సాక్షి, గట్టు (గద్వాల): పంచాయతీకి అత్యంత కీలకమైన రివిజన్ రిజిస్టర్ గట్టు పంచాయతీలో మాయం చేశారు. పంచాయతీలో ఎన్ని గృహాలు ఉన్నాయి.. ఖాళీ స్థలాలు.. వ్యాపార దుకాణాలు ఇలా అన్ని రకాల వాటికి సంబంధించిన అత్యంత కీలమైనది రివిజన్ రిజిస్టర్. ప్రస్తుతం ఈ రిజిస్టర్ కనిపించడం లేదు. గతంలో ఇక్కడ పని చేసి, ఇదే మండలంలో వేరే పంచాయతీలో పనిచేస్తున్న కార్యదర్శికి, ప్రజాప్రతినిధి భర్తకు మధ్య పంచాయతీ నిధుల వాటాల పంపకాల్లో తేడాల కారణంగా ఓ నేత రివిజన్ రికార్డులను మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు పంచాయతీ నిధులకు సంబంధించిన జమ, ఖర్చుల రికార్డులు సైతం పంచాయతీలో కనిపించకుండా చేశారు. 2017 నుంచి వసూలు చేసిన ఇంటి పన్నులు ఎక్కడ జమ చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు వారి హ యాంలో విలువైన ఖాళీ స్థలాలకు సంబంధించి పంచాయతీ రికార్డులో నమోదు చేసి, పాత తేదీల్లో పొజీషన్ సర్టిఫికెట్లను జారీ చేశారు. తాజాగా గ్రామ పంచాయతీలో చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో పంచాయతీ స్థలాలను చదును చేస్తుండటంతో ఆయా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రికార్డులు అప్పగించలే.. గట్టు పంచాయతీకి సంబంధించిన రివిజన్ రిజిస్టర్‌తోపాటు ఇతర రికార్డులను అప్పగించని వ్యవహారంపై జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ గట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం గట్టు పర్యటనకు వచ్చిన కలెక్టర్ శశాంక దృష్టికి గట్టు–1 ఎంపీటీసీ సభ్యురాలు మహేశ్వరి భర్త రామునాయుడు, మరికొందరు యువకులు రివిజన్ రిజిస్టర్ లేని విషయాన్ని తీసుకువచ్చారు. దీంతో గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన ఆరుగురు పంచాయతీ కార్యదర్శులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించిన తరుణంలో డీపీఓ గట్టు పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ రికార్డులను అప్పగించని వారిపై ఫిర్యాదు చేశారు. కార్యదర్శులు రికార్డులతోపాటు పంచాయతీ నిధులు సైతం పెద్దఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.40 లక్షలకు రికార్డులేవీ..? గట్టు పంచాయతీలో 13, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.40,56,656లకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేకుండానే డ్రా చేసుకున్న వ్యవహారంపై 2017లో జిల్లా పంచాయతీ అధికారి అప్పటి సర్పంచ్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 2018లో పంచాయతీ నిధులు రూ.1,35,764 ఎలాంటి పనులు లేకుండా పంచాయతీ కార్యదర్శి, అప్పటి సర్పంచ్ స్వాహా చేసినట్లు అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గట్టు– 2 ఎంపీటీసీ సభ్యురాలు నాగవేణి, వార్డు సభ్యులు కలిసి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు. -
ఏటీఎంల వద్ద జాదుగాడు
గద్వాల క్రైం: నగదు కోసం ఏటీఎం సెంటర్ల వద్దకు ఖాతాదారులు నిత్యం వెళ్తుంటారు. అయితే కొందరు ఖాతాదారులకు నగదు డ్రా చేసుకునే విషయంలో మిషన్‌పై అవగాహన లేకపోవడంతో ఇతరుల సహాయంతో కోరడం కనిపిస్తుంది. ఇదే అదునుగా భావించిన జాదుగాళ్లు ఖాతాదారుల బలహీనతను లక్ష్యంగా చేసుకుని పలువురి ఖాతాలోంచి నగదు కొల్లగొట్టిన సంఘటన గద్వాలలో చోటు చేసుకుంది. ఇటీవల ధరూరు మండలం ఉప్పేరుకు చెందిన ఓ ఖాతాదారుడు నగదు విత్‌డ్రా చేసేందుకు గద్వాలలోని ఎస్బీహెచ్ఎ ఏటీఎంకు వెళ్లాడు. అయితే నగదు డ్రా చేయడం తెలియకపోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సహాయం చేస్తానని నమ్మబలికి సదరు వ్యక్తికి సంబంధించిన ఏటీఎం కార్డు, పిన్ నంబర్ తీసుకొని నగదు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత డబ్బులు రావడం లేదని ఖాతాదారునికి చెప్పి.. జాదుగాడు తన వద్ద ఉన్న మరో ఏటీఎం కార్డును చేతిలో పెట్టాడు. ఖాతాదారుడు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ.8,500 నగదు డ్రా చేశాడు. దీంతో అసలు ఖాతాదారుడు నగదు డ్రా చేయకుండానే తన ఫోన్‌కు నగదు డ్రా చేసినట్లు గుర్తించి వెంటనే బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి తన కార్డును బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పలువురు వ్యక్తుల అమాయకత్వాన్ని అదునుగా భావించిన జాదుగాడు ఇదే తరహాలో మోసం చేసేందుకు పలు ఏటీఎంల వద్ద మాటు వేశాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం పట్టణంలోని అదే ఏటీఎం వద్ద నగదు డ్రా చేసుకునేందుకు గద్వాల మండలం కుర్వపల్లికి చెందిన ఓ ఖాతాదారు రాగా.. అక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇలా వెలుగులోకి.. కుర్వపల్లికి చెందిన వ్యక్తి తన ఖాతాలోంచి నగదు డ్రా చేసినట్లు తెలుసుకుని ఉప్పేరుకు చెందిన ఖాతాదారుని నిలదీశాడు. అయితే తన ఖాతాలోంచి నగదు డ్రా అయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు మోసపోయామని గమనించారు. అయితే ఇక్కడే జాదుగాడు ఒకరికి తెలియకుండా మరొకరి ఏటీఎం కార్డుల ద్వారా నగదు బదిలీ చేయడం కొసమెరుపు. దీంతో పోలీసులు సైతం ఆ కేసును ఛేదించాలనే లక్ష్యంతో బ్యాంకుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇదో సినిమాను తలపించేలా ఉంది. ఇక ముందు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఒక వేళ ఫిర్యాదు చేయకుండా ఉంటే తనే దొంగగా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. అతి తెలివి ప్రదర్శించి.. జాదుగాడు అత్యంత తెలివిని ప్రదర్శించి ముందు మోసం చేసిన వ్యక్తి ఖాతాలోకి కుర్వపల్లికి చెందిన ఖాతాదారుని అకౌంట్లోంచి కొంత నగదు బదిలీ చేశాడు. అయితే ఖాతాలో కొంత నగదు డిపాజిట్ కావడంతో ఉప్పేరుకు చెందిన వ్యక్తి కాస్త అయోమయానికి గురయ్యాడు. అయితే కుర్వపల్లికి చెందిన సదరు ఖాతాదారు బ్యాంకు అధికారులకు నగదు డ్రా అయిందని ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం తెలుసుకుని ఉప్పేరుకు చెందిన వ్యక్తిపై కుర్వపల్లికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
పట్టాలెక్కని గద్వాల - మాచర్ల రైల్వే లైను
గద్వాల టౌన్: ఒక ప్రాజెక్టును చేపడితే తదుపరి కార్యచరణ ఉండాలనే ఆలోచనను రైల్వే ఉన్నతాధికారులు మరిచినట్టున్నారు. నిజాం కా లంలోనే గద్వాల రైల్వేస్టేషన్‌ను తూర్పు, పడమ ర రైల్వేలను కలిపే జంక్షన్ చేయాలనే లక్ష్యంతో 117 ఎకరాలు కేటాయించారు. కర్ణాటక రాష్ట్రం లోని రాయచూరు గద్వాల మీదుగా వనపర్తి, నాగర్‌కర్నూలు, దేవరకొండ మీదుగా ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్ ఏర్పాటుకు అప్పట్లోనే ప్రతిపాదించారు. ముఖ్యంగా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తూర్పు, పడమర భారతాన్ని రైల్వే రవాణాలో ఏకం చేయాల ని ఆనాడే తలంచారు. ఆ తర్వాత కాలంలో ఆ లైన్ ప్రతిపాదనను 1990 వరకు ఎండమావిగా నే వదిలేశారు. చివరకు అది ఎ న్నికలలో వాగ్దానంగా మారింది. 2002లో అప్ప టి కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ గద్వాల–రాయచూరు మధ్య మొదటి దశ పనులకు శంకుస్థాపన చేశారు. దశల వారీగా మాచర్ల వరకు లైన్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో గద్వాల నుంచి మాచర్ల వరకు సర్వేను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించగా పూర్తయింది. కొత్త లైన్‌ను పీపీసీ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించినా కార్యరూపం దాలచ్చడం లేదు. 55 కి.మీ–పుష్కర కాలం గద్వాల–రాయచూరు పట్టణాల మధ్య రాయచూరు–మాచర్లలో భాగమైన మొదటి దశను 12ఏళ్ల పాటు పనులు కొనసా..గించారు. కేవలం 55 కి.మీ. పనిని పుష్కర కాలం చేశారు. ఎ ట్టకేలకు 2013లో అప్పటి కేంద్ర రైల్వే శాఖ మం త్రి మల్లికార్జునఖర్గే రాయచూరులో గద్వాల–రాయచూరు లైన్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచే గద్వాల–రాయచూరు మధ్య డెమో రైలు రాకపోకలు ఆరంభమయ్యాయి. ఆ తర్వాత రా యచూరు నుంచి గద్వాల, కర్నూలు, నంద్యాల, గుంటూరు మీదుగా విజయవాడకు ఎక్స్‌ప్రెస్ రైలును ప్రతిపాదించారు. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కాకినాడ నుంచి రాయచూరు వరకు రైలు వేస్తారను కుంటే అది కూడా కర్నూలు, కాకినాడకే పరిమితం చేశారు. 3ఎక్స్‌ప్రెస్ రైళ్ల దారి మళ్లింపు కాచిగూడ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరులోని యశ్వంతపూర్‌కు నడుస్తున్న మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించాలని అధికారులు ప్ర తిపాదనలు పంపారు. కాచిగూడ నుంచి య శ్వంతపూర్కు వెళ్లే ఈ రైళ్లకు డోన్ వరకే ట్రాఫిక్ ఉండడం వల్ల డిమాండ్ ఉన్న రాయచూరు ద్వా రా మళ్లించాలని ఆలోచిస్తున్నారు. ఈ రైళ్లు కా చిగూడ నుంచి మహబూబ్‌నగర్, గద్వాల మీ దుగా రాయచూరు ద్వారా బెంగళూరులోని య శ్వంతపూర్ మళ్లించాలని ప్రతిపాదనలు చేశా రు. రాయచూరు నుంచి బెంగళూరుకు వెళ్లే ప్ర యాణికులతో పాటు హైదరాబాద్ నుంచి రా యచూరుకు, రాయచూరు నుంచి హైదరాబా ద్‌కు వెళ్లే వారికి ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మూడు యశ్వంతపూర్‌కు వెళ్లే రైళ్లను మాత్రమే మళ్లించనున్నారు. -
పాపం ఎద్దులు బెదరడంతో..
సాక్షి, ధరూరు (గద్వాల) : నెట్టెంపాడు ప్రధాన కాల్వలోకి ఎద్దుల బండితో సహా దూసుకెళ్లిన సంఘటన మండలంలోని మన్నాపురం శివారులో చో టుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కుర్వ తిమ్మన్న శనివారం ఉదయం ఎద్దులతో బండిని వ్యవసాయ పొలానికి తీసుకెళ్లి.. సా యంత్రం ఎద్దుల బండితో ఇంటికి తిరుగుపయాణమయ్యాడు. అయితే గ్రామ సమీపంలో ఓ రైతు కాల్వ వద్ద విద్యుత్ మోటార్‌ను ఆన్ చేసి మట్టి దిబ్బ పక్క నుంచి సడన్‌గా లేచాడు. దీం తో కాల్వ పక్కనే వెళ్తున్న ఎద్దులు ఒక్కసారిగా బెదిరిపోయి.. నెట్టెంపాడు ప్రధాన కాల్వలోకి దూసుకెళ్లాయి. కాల్వలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రైతు కుర్వ తిమ్మన్న ప్రాణాల ను కాపాడుకుని బయటకు రాగా.. ఎద్దులబండి కట్టి ఉండటంతో ఎద్దులు మృత్యువాత పడ్డా యి. ఈ విషయమై రైతులు వెంటనే ఘటనా స్థలానికి అర కిలో మీటర్ దూరంలో ఉన్న పంప్‌హౌస్ వద్దకు వెళ్లి పంపులను ఆఫ్ చే యాలని కోరగా అక్కడి అధికారులు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు చెబితేనే బంద్ చేస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖ అధికారులు స్పందించకపోవ డంతో ఈ విషయాన్ని రేవులపల్లి పోలీసులు, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిలకు సమాచారం ఇవ్వడంతో వారు గుడ్డెందొడ్డి లిఫ్టు–1కు ఫోన్ చేసి నీటి పంపింగ్‌ను బంద్ చేయించారు. ట్రెయినీ ఎస్ఐ సందీప్‌రెడ్డి, ఏఎస్ఐ వెంకటేష్‌గౌడ్ అక్కడికి వచ్చి ఎద్దులు, బండిని తాళ్లతో కట్టి బయటకు తీశారు. అయితే మూడు నెలల క్రితమే పెబ్బేరు సంతలో ఎద్దులను రూ.80 వేలకు కొనుగోలు చేశామని బాధిత కుటుంబ సభ్యులు రోదించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
'కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదు'
సాక్షి, గద్వాల : రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదని బీజేపీ మహిళా నేత డీకే అరుణ విమర్శించారు. గడిచిన ఆర్నెళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. అంతేగాక నిధుల విషయంలో సర్పంచ్‌కు, ఉప సర్పంచ్‌కు మధ్య కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే సమయం తప్పకుండా వస్తుందని ఘాటుగా స్పందించారు.కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సర్పంచ్ హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. తలా తోక లేని పార్టీగా కాంగ్రెస్ మారిందని, కనీసం వారి నాయకులను కాపాడుకునే పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. 2023 కల్లా రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా అవతరించనుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. -
పేట చేనేతకు వందేళ్ల చరిత్ర..
మన్నికైన వస్త్రాలతో ఒకప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత చేనేత వృత్తిది.. ఆ కళాకారులది. చేనేత కార్మికులు నైపుణ్యంతో దేశీయ వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, రాజోళి, నారాయణపేట చీరల పేర్లు వింటేనే నాజూకు వస్త్రాలు గుర్తుకువస్తాయి. ఇక్కడి చేనేత కార్మికుల చేతిలో అద్భుతమైన చీరలు తయారవుతున్నాయి. సాధారణ నూలుతోనే ఆకర్షించే చీరలు నేస్తూ..విభిన్నమైన చీరలు రూపుదిద్దడంలో తమకు తామే సాటని చాటుతున్నారు. మగ్గాలపై తమలోని తృష్ణను బయటకు తీసి, చీరలపై అందమైన డిజైన్లుగా మారుస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, మహబూబ్‌నగర్(నారాయణపేట) : పల్లె నుంచి పట్నం వరకు అడిగిమరి కొనే చీరల్లో నారాయణపేట పట్టు ఒకటి. ఇక్కడి చేనేతకు వందేళ్ల చరిత్ర ఉంది. అంతటి మన్నికైన.. అపురూపమైన డిజైన్ల చీరలను తయారు చేయడం ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభ. పేట చీరల చీరల తయారీకి పట్టణంతో పాటు జాజాపూర్, కోటకొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు ఉన్నారు. 1900 సంవత్సరం నుంచే ఇక్కడ పట్టుచీరలు తయారుచేస్తున్నట్లు చరిత్ర చెప్తుంది. మగ్గాలపై చీరలు నేస్తూ ఎంతో గుర్తింపు సంపాదించిన నారాయణపేట కార్మికులు నాలుగు సంవత్సరాల క్రితం జియోగ్రాఫికల్ నుంచి పెటెంట్హక్కును సాధించుకున్నారు. అగ్టిపెట్టెలో పట్టెంత చీరను నేసి రికార్డు నారాయణపేట పట్టుచీరలు దేశ, విదేశాల్లో సైతం ఖ్యాతిని సంపాదించుకున్నాయి. పెద్ద, పెద్ద పట్టణాల్లో సైతం ఎంతో ఆదరణ ఉంది. మారుతున్న డిజైన్లు, ఫ్యాషన్‌కు అనుగుణంగా చీరలు నేయడం ఇక్కడి ప్రత్యేకత. అగ్గిపెట్టెలో పట్టెంత చీరను నేసి రికార్డు సృష్టించిన చరిత్ర ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి సైతం ఈ చీరలు కట్టుకుందంటే ఎంతటి గుర్తింపు దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి చీరలు తీసుకోవడం పరిపాటి. పట్టులో రకాలు పట్టు చీరల్లో పలు రకాలు అందుబాటులో ఉన్నాయి. టెంపల్ గర్భరేషన్, నిఖల్, పారాస్, పైటీనియా, సైటనీ, నీవాళి దనవతి, శివశంభు, నివాళి శివశంలలో కడ్డి మరియూ ప్లేన్ రకాలతో పాటు స్పెషల్ బార్డర్ వంటివి ప్రత్యేక ఆకర్శణగా ఉంటాయి. వీటికి తోడు కొత్తగా వస్తున్న మాడల్స్‌కు అనుగుణంగా తయారుచేస్తున్నారు. అర్డర్లు ఇచ్చి మరి తయారు చేయించుకోవడం జరుగుతుంది. మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరగడంతో చీరల ధరలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో చీర నేయడానికి రెండు నుంచి మూడు రోజలు సమయం పడుతుంది. గల్లి నుంచి ఢిల్లీ వరకు విక్రయాలు ‘పేట’ నేత కార్మికుల కుటుంబాలు తయారు చేసిన పట్టు చీరలు ఢిల్లీ వరకు అమ్మకానికి వెళ్తుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా హైద్రాబాద్, వరంగల్, పూణె, ముంబాయి, సాంగ్లీ, షోలాపూర్, ఔరంగాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, రాయిచూర్, గుల్బర్గ, యాద్గీర్, బెంగుళూర్, విజయవాడ, విషాఖపట్నం దుకాణాల్లో ప్రత్యేకంగా అమ్ముతుంటారు. డిల్లీలో సైతం ‘పేట’ పట్టు చీరలు దొరకడం విశేషం. పెళ్లిలు, శుభకార్యాలకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తుంటారు. గద్వాల టౌన్: సంస్థానాధీశుల కాలం నుంచి నేటి తరం ఆధునిక మహిళల మనస్సును కట్టిపడేసే డిజైన్లను అద్దుకున్న గద్వాల చీర నేడు దేశ, విదేశీ వనితల ఆదరణ పొందుతూ తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. కాటన్ చీరకు జరీ అంచుతో డిజైన్ చేయబడిన నాటి తరం సంప్రదాయాన్ని కొనసాగిస్తునే నేటి అదునిక అవసరాలకు అనుగుణంగా సీకో(కాటన్, సిల్క్)లను కలిపి దారంతో సరికొత్త డిజైన్లతో మహిళలను మనస్సుకు నచ్చేలా గద్వాల ప్రాంత చేనేత కార్మికులు చీరల నేతలను కొనసాగిస్తున్నారు. గద్వాల సంస్థానం ఏర్పడిన నాలుగు వందల ఏళ్ల నాటి నుంచి గద్వాల చీరకు ప్రత్యేక కాలగుణంగా ప్రత్యేకత ఉండేలా చేనేతకు ప్రాణం పోస్తున్నారు. ఆదునిక సాంకేతకను జోడిస్తూ గద్వాల చీర ప్రత్యేకతను నిలబెట్టుకునేలా ఇక్కడి చేనేత వృత్తిని సగర్వంగా కాలంతో వస్తున్న పోటీలో నిలుస్తున్నారు. చీరల తయారీలో మాస్టర్ వీవర్స్, వీవర్స్ తమ వృత్తిలో నిల్చునేలా, గద్వాల చీరకు ప్రత్యేకత, గుర్తింపు, మహిళల ఆదరణ ఉండేలా ఎవరికి వారు పోటీ పడుతున్నారు. సంస్థానాధీశుల కాలంలో చేనేత కార్మికులు తమ చేనేత కళ ప్రతిభతో అగ్గిపెట్టెలో చీర ఇమిడేలా తయారు చేసేవారు. ఆ నాటి నుంచి తిరుమల శ్రీనివాసుడికి ఏటా జరిగే దసర బ్రహ్మోత్సవాలలో గద్వాలలో నిష్టగా తయారు చేసిన ఎరవాడ పంచెలను ధరింప చేస్తున్నారు. అంతటి ప్రత్యేక గద్వాల చీరలకు, చేనేత ప్రతిభకు ఉంది. రూ.1200 నుంచి రూ.40వేల విలువ వరకు... కాటన్ చీరకు అంచు, కొంగు బార్డర్లో గద్వాల వారసత్యంగా వస్తున్న డిజైన్లతో పాటు, నేటి ఆదునిక డిజైన్లను నేస్తున్నారు. జరీలో వెండి, రాగి, బంగారుతో తయారైన జరీ పోగులను బార్డర్, కొంగు, చీర మద్యలో డిజైన్, బుట్టాలకు తమ ప్రతిభతో అందాలను అద్దుతున్నారు. గద్వాల చీర రూ.12 వందల నుంచి రూ.40 వేల విలువ వరకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. అంతకు మించి డిజైన్‌ను మరింత ఖరీదుతో చేయాలంటే ముందస్తు ఆర్డర్‌ను ఇవ్వాల్సింటుంది. -
విద్యార్థులు ప్రైవేట్‌కు వెళ్తే మీరెందుకు..?
గద్వాల క్రైం: సాక్ష్యాత్తు కలెక్టర్ పాఠశాల పనితీరుపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులు ఎందుకు చేరడం లేదని హెచ్ఎంను అడగగా.. పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారంటూ చెప్పడంతో పిల్లలు లేనప్పుడు ఇక్కడ మీరెందుకు.. ఈ పాఠశాలను ఎందుకు మూసివేయకూడదని జోగుళాంబ గద్వాల కలెక్టర్ శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని వెంకంపేట ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 85 మంది మాత్రమే ఉండటంతో హెచ్ఎంను నిలదీశారు. ఇంత మంది ఉపాధ్యాయులు ఉండి నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్‌కు నాంది పలికి, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం కలిగించలేకపోవడం మీ నిర్లక్ష్యమేనన్నారు. ఇక ఈ పాఠశాలను మూసి వేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించగా సరిగా ఉడకని అన్నం, నీళ్ల చారు ఉండడంతో వంట ఏజెన్సీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని హెచ్చరించారు. పాఠశాల నిర్వహణలో అలసత్వం వహించిన హెచ్ఎంకు మెమో జారీ చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించగా అక్కడ ఇదే తీరు ఉండడం, స్టాక్ రిజిష్టర్ నమోదు చేయకపోవడంతో కార్యకర్తకు మెమో జారీ చేశారు. -
హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు
సాక్షి, గద్వాల(మహబూబ్‌నగర్): దాదాపు ఏడాది కిందట అదృశ్యమైన వారు హత్యకు గురయ్యారనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ కృష్ణఓబుల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఎల్కూరుకి చెందిన సంజన్నకు ఇద్దరు భార్యలు. రెండవ భార్య సరోజ(24)కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, కుటుంబ సమస్యలు తలెత్తడంతో భార్య సరోజ వేరే కాపురం పెట్టమని భర్త సంజన్నపై ఒత్తిడి తెచ్చేది. దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రెండో భార్య, కుమారుడిని ఎలాగైనా చంపాలని భర్త పథకం పన్నాడు. ఈ క్రమంలో 2018 అక్టోబర్ 3వ తేదీన కర్నూల్ జిల్లా మంత్రాలయానికి వారిని తీసుకెళ్లాడు. అక్కడ తుంగభద్ర నదిలో స్నానం చేస్తుండగా భార్య, కుమారుడిని గొంతు నులుమి నదిలోనే వదిలేశాడు. విషయాన్ని గోప్యంగా ఉంచిన సంజన్న గ్రామానికి వచ్చి భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంజన్నపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, ఇటీవల కాల్‌డేటా రావడంతో దాని ఆధారంగా విచారించగా.. భార్య, కుమారుడిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మిస్సింగ్ కే సును హత్య కేసుగా మార్చి నిందితుడు సంజన్నను మంగళవారం గద్వాల కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సబ్ ఇంజనీర్ మృతి
సాక్షి, గద్వాల అర్బన్(మహబూబ్ నగర్): విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సబ్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మండలంలోని జమ్మిచేడు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. గద్వాల రూరల్ ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి, స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. గద్వాల పట్టణానికి చెందిన సంజీవయ్య (41) మల్దకల్ మండలంలో విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆ శాఖ తరపున వరంగల్‌లో క్రీడలు నిర్వహిస్తుండగా మూడు రోజుల క్రితం సంజీవయ్యతో పాటు జూబేర్లో పోటీల్లో పాల్గొనేందుకు కారులో వెళ్లారు. తిరిగి పట్టణానికి వస్తుండగా.. మంగళవారం ఉదయం 7గంటలకు గద్వాల మండలంలోని జమ్మిచేడు హరిత హోటల్ ఎదుట వారి వాహనానికి పంది అడ్డు రాగా దానిని ఢీకొట్టి వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న జుబేర్‌కు చెయ్యి విరగ్గా సంజీవయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి శవాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య శ్రీలతతో పాటు కుమారుడు వినయ్, కుమార్తె అక్షిత ఉన్నారు. ఇదిలాఉండగా, సంజీవ య్య మృతి చెందడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విద్యుత్ ఎస్ఈ చక్రపాణి, 1104 విద్యుత్ యూనియన్ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు, గద్వాల ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు కుటుంబసభ్యులను పరామర్శించారు. -
ఎవరితోనూ విభేదాలు లేవు
సాక్షి, గద్వాల: పార్టీలో కానీ, మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం అన్నారు. గత రెండు రోజులుగా పత్రికల్లో వస్తున్న విషయాలను ఎమ్మెల్యేలు ఇరువురూ ఖండించారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ, మంత్రి, మా మధ్య కానీ బేధాభిప్రాయాలు లేవన్నారు. వ్యక్తిగత కారణాలతోనే గన్మెన్లను సరెండర్ చేశానని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో భద్రత అవసరం లేదని భావించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీకి, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీని, సీఎం కేసీఆర్, పార్టీ అధ్యక్షులు కేటీఆర్‌ను గౌరవిస్తామని, వారి ఆదేశానుసారం నడిగడ్డ అభివృద్ధికి పని చేస్తామన్నారు. నడిగడ్డపై అభిమానంతో సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సుమారు కోట్లాది నిధులు ఇచ్చారని తెలిపారు. సాంకేతిక కారణాలు, పరిపాలన పరమైన కారణాలతోనే సీఈఓ మార్పు జరిగిందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌లు మాపై గురుత్వర బాధ్యతలు పెట్టారని అన్నారు. పార్టీ భీ–ఫామ్‌లు ఇచ్చిన కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగురవేసేలా చేశారన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నడిగడ్డకు ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు కళ్లలాగా ఉండి పని చేస్తామని చెప్పారు. మాలో గ్రూపులు లేవు, తగాదాలు అసలే లేవన్నారు. మమ్మల్ని నమ్మి నడిగడ్డ ప్రజలు అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ సీఎం కేసీఆర్ కలలు గంటున్న బంగారు తెలంగాణ దిశగా పని చేస్తామన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు బీఎస్.కేశవ్, ఎంపీపీలు తిరుమల్‌రెడ్డి, విజయ్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ‘సారీ’ కూత లేదు
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం ఎదురుచూస్తున్నజిల్లా ప్రజలకు మరోమారు నిరాశే మిగిలింది. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా..ఈ బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం కలను కలగానే మిగిల్చింది. తెలంగాణలోని గద్వాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్ కోసం నిధులు కేటాయిస్తారని అంతా అనుకున్నామరోమారు మొండిచేయి చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయం లేకపోవడం వల్లనే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. దీంతో నాగర్‌కర్నూల్ నుంచి కల్వకుర్తి, అచ్చంపేట గుండా మాచర్ల వరకు రైల్వేలైన్ వస్తుందనుకున్న ప్రజల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. 1980లో రైల్వేలైన్‌కు బీజం 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు గద్వాల– మాచర్ల రైల్వేలైన్ వేయడం వల్ల కలిగే లాభాలను వివరి స్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీంతో అప్పట్లో రూ.919 కోట్ల బడ్జెట్‌తో 184.2 కి .మీ. మేర రైల్వేలైన్ కోసం ప్రతిపాదనలు తయారు చేయారు. ఈ రైల్వేలైన్ వనప ర్తి, నాగర్‌కర్నూల్, మిర్యాలగూడ మీ దుగా మాచర్ల వరకు చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పటి నుంచి మరుగున పడిపోయిన ఈ అంశంపై 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసి కేంద్రానికి అందించారు. దీంతో 2015లో కేంద్రం కంటి తుడుపు చర్యగా కేవలం నల్లగొండ– మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఇది మినహా ఇప్పటి వరకు ఈ రైల్వేలైన్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న చొరవ ఏమీ లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపైనే ఈ అంశం ఆధారపడి ఉందనేది అందరి వాదన. రైల్వేలైన్ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభు త్వం ఒప్పుకుంటే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. భూ సేకరణ, ఇ తర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చెల్లింపులు చేయాలి. ఫలితంగా రాష్ట్ర ప్ర భుత్వం చొరవ తీసుకుంటే తప్ప కేం ద్రం ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. మొదటి దశ పూర్తి.. రెండో దశ? ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్టాలను కలుపుతూ రాయచూర్ నుంచి మాచర్లకు రైల్వేలైన్ కోసం ప్రతిపాదించారు. దీని వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా మూడు రాష్ట్రాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో 2002లో అప్పటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి హోదాలో దత్తాత్రేయ రాయచూర్– గద్వాల రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేశారు. గత రెండేళ్ల క్రితం డెమో కూడా పూర్తి చేసుకుని రాకపోకలు సైతం ప్రారంభమయ్యాయి. ఇక రెండో దశకు సంబంధించి గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వేలైన్ కోసం 151 నుంచి 154 కిలోమీటర్ల మేర ఉండే ఈ రైల్వే లైన్ కోసం దాదాపు రూ.1,160 కోట్లు అవుతుందని రైల్వేశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. సగం వాటా భరిస్తే కొత్త లైన్లు వేస్తామని కేంద్ర విధించిన నిబంధన మేరకు రాష్ట్రానికి చెందిన నేతలు, ఇక్కడి ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు రైల్వేలైన్‌కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజకీయ నాయకులు రైల్వే లైన్ కోసం మరో ఉద్యమం చేస్తే తప్ప సాధ్యం కాదని ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఏదేమైనా గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం ఇంకెన్ని దశాబ్దాలు వేచి చూడాలనేది ఈ ప్రాంత ప్రజల ప్రశ్న. ముఖ్యమంత్రి లేఖ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమోదం పొందేలోపు రాష్ట్ర Ðముఖ్యమంతి గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం లేఖ ఇవ్వాలి. సప్లిమెంటరీ కింద కేంద్ర నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వేలైన్ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. కాబట్టి ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒప్పించి సమస్యను పరిష్కరించాలి. -సుధాకర్‌రెడ్డి, రైల్వే సాధన సమితి జిల్లా చైర్మన్ -
‘గద్వాల’ గులాబీలో వర్గపోరు
సాక్షి, మహబూబ్‌నగర్: గద్వాల అధికార టీఆర్ఎస్ స్వపక్షంలోనే మరో విపక్షం పుట్టికొచ్చిందా? గత కొన్నాళ్లుగా స్థానిక ఎమెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. మంత్రి నిరంజన్‌రెడ్డి మధ్య సాగుతోన్న వర్గపోరు తారా స్థాయికి చేరుకుందా? అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. గద్వాలలో మంత్రి ప్రమేయం పెరిగిందని, స్థానికంగా ఆయనకు అనుకూలంగా మరో వర్గాన్ని తయారు చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే సైతం అనూహ్యంగా తన వ్యక్తిగత భద్రత సిబ్బందిని ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వ్యక్తిగత కారణాలతోనే భద్రత సిబ్బందిని ఉపసంహరించుకున్నానని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ మంత్రి ప్రమేయమే కారణమని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఇటీవల జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులందరూ ఓ చోట సమావేశమై.. విందు చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే కలత చెందారని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తన అంగరక్షకులను ఉపసంహరించుకున్నారని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గద్వాల టీఆర్ఎస్లో కొనసాగుతోన్న వర్గపోరు అధిష్టానం దృష్టికి వెళ్లింది. పరిస్థితి ఇలానే ఉంటే దాని ప్రభావం త్వరలోనే జరగనున్న ‘పుర’ పోరు ఫలితాలపై పడుతుందని భావించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అంగరక్షకులను ఉపసంహరించుకున్న విషయం తెలుసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. వెంటనే హైదరాబాద్‌కు రావాలని ఆదేశించడంతో ఆయన హుటాహుటీనా బయల్దేరి వెళ్లారు. వర్గపోరే కారణామా? మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి నిరంజన్‌రెడ్డి గతంలోనే రెండు వర్గాలుగా విడిపోయింది బహిరంగ రహస్యమే. 2014 ఎన్నికల్లో గెలిచిన కృష్ణారావు మంత్రిగా ఉన్న సమయంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉన్నారు. దీంతో బండ్లకు కృష్ణారావు వర్గీయుడిగా పేరు పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి ఓడిపోయారు. అదే సమయంలో వనపర్తి నుంచి గెలిచిన నిరంజన్‌రెడ్డికి అనూహ్యంగా వ్యవసాయశాఖ మంత్రి దక్కింది. దీంతో మంత్రి నిరంజన్‌రెడ్డి.. జూపల్లిపై ఉన్న వ్యతిరేకతతోనే.. ఆయన వర్గీయుడైన బండ్లకు ప్రత్యామ్నాయంగా గద్వాలలో మరో వర్గాన్ని తయారు చేస్తున్నారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. ఫలితంగా గత వారం జిల్లాకేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు మంత్రి నిరంజన్‌రెడ్డి రావడంపై ఎమ్మెల్యే అయిష్టత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో మంత్రి కూడా కనీసం అరగంట కూడా గద్వాలలో గడపలేదు. మరోపక్క.. మంత్రి గద్వాలలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నూతన జెడ్పీ చైర్పర్సన్ సరితకు, ఆమె వర్గానికి మంత్రి నిరంజన్‌రెడ్డి అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
అక్రమాల అడ్డా.. నడిగడ్డ!
సాక్షి, గద్వాల క్రైం: అక్రమార్కుల ధాటికి జోగుళాంబ గద్వాల జిల్లాలోని విలువైన సంపద లూఠీ అవుతోంది. అమాయక ప్రజలను గారడీ మాటలతో మోసం చేసి మల్టీలెవల్ స్కీంల పేరిట రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఉన్నత విద్యకు తక్కువ ఫీజంటూ చెప్పి రూ.లక్షలు దండుకున్నారు. ఆరుగాలం శ్రమించే రైతన్నలకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మి సొమ్ము చేసుకున్న ముఠాలు, రూ.100కు రూ.10 వడ్డీ వసూలు చేసే జలగలు, అనుమతుల పేరిట, అధికారుల ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు, ఇసుక, మట్టి తవ్వకాలు.. ప్రభుత్వ, దేవాదాయ, ఇనాం భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలు.. గుట్కా, మట్కా, గంజాయి, సారా, కల్తీ కల్లు విక్రయాలు, యువతను పెడదోవ పట్టించే బెట్టింగ్, పేదల బియ్యం పక్కదారితోపాటు పలు చీకటి దందాలకు నడిగడ్డ అడ్డాగా మారింది. ఇక కేసుల పరిష్కారం కోసం బాధితులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాకు కొత్తగా వచ్చే ఎస్పీపైనే ప్రజలు కోటి ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో నడిగడ్డ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, చీకటి వ్యాపారాలపై ప్రత్యేక కథనం.. పాత కేసుల పురోగతి సాధ్యమేనా? 2018లో నకిలీ పాస్ పుస్తకాల విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుమారు 10 వేల నకిలీ పాస్ పుస్తకాలు బయటపడ్డాయి. ఈ కేసులు ఇందులో దళారీ నుంచి రాజకీయ నాయకులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వ్యాపారులు సైతం చిక్కి జైలు జీవితం గడిపారు. ఇక కేసు అనుకున్న స్థాయిలో విచారణ జరగకపోవడం, కీలక సూత్రదారులు బయటకు రాకపోవడంతో మిస్టరీగా మిగిలింది. నకిలీ విత్తనాలు జిల్లాలో సీడ్ కాటన్ (పత్తి) పంటలను రైతులు ఎక్కువ శాతం పండించడం, విత్తన తయారీకి జాతీయ స్థాయిలో గద్వాలకు పేరు ఉంది. అయితే ఇక్కడే జాదుగాళ్లు నకిలీ విత్తనాలకు తెరలేపారు. ఫలితంగా సీడ్‌పత్తి పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోగా.. పలువురు బలవన్మరణాలకు సైతం పాల్పడ్డారు. వ్యవసాయాధికారులు పరిశీలించి నకిలీ విత్తనాలను నాటడంతోనే పంట దిగుబడి రాలేదని ధ్రువీకరించారు. ఈ విషయమై అప్పటి కలెక్టర్ రజత్‌కుమార్‌సైని, ఎస్పీ విజయ్‌కుమార్ ప్రత్యేకంగా దృష్టిసారించడంతో జిల్లా యంత్రాగం ఒక్కసారిగా నకిలీ విత్తనాల ముఠా సభ్యుల స్థావరాలపై దాడులు చేసి నకిలీ పత్తి విత్తనాల కేసులను వెలుగులోకి తెచ్చారు. ఈ విత్తనాల తయారీలో పలు బడా కంపెనీలు, సీడ్‌పత్తి వ్యాపారులు, దళారులను అదుపులోకి తీసుకుని వేలాది క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ సీడ్‌పత్తి విత్తనాలతోపాటు మిర్చి, ఇతరత్రా కంపెనీలపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే వివిధ కారణాలతో ఈ కేసుల విషయంలో కూడా ఎలాంటి పురోగతి కనిపించలేదు. వడ్డీ జలగలు.. అవసరాలకు అప్పులు చేసేందుకు సామాన్యులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే వారిని నిలువునా ముంచుతున్నారు. రూ.100కు రూ.10 వడ్డీ వసూలు చేయడం గమనార్హం. అప్పు తీసుకుని సకాలంలో వడ్డీలు చెల్లించలేక ఉన్న కొందరు ఆస్తులను తాకట్టు పెట్టి నేటికీ సతమతమవుతున్నారు. 2017లో అప్పటి ఎస్పీ వద్దకు బాధితులు ఫిర్యాదు చేయడంతో జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు. ఇచ్చిన అప్పులకు కట్టిన వడ్డీలను అంచనా వేయగా రూ.కోట్లలో తేలింది. ఈ విషయమై ప్రముఖ వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కేసుల్లో కూడా తీవ్ర జాప్యం జరిగిందన్న విమర్శలున్నాయి. విలువైన సంపద ఖాళీ జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదుల పరిసర ప్రాంతాల నుంచి జాతీయ సంపదైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ వనరులను కాపాల్సిన ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు సంఘాల నాయకులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీస్‌శాఖ ప్రత్యేక సిబ్బందితో ఇసుక వ్యాపారానికి కాస్త చెక్ పెట్టారు. ఈ దందాలో పలువురు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటడంతో నామమాత్రపు చర్యలు తప్ప కఠిన చర్యలు లేవని ప్రజలు ఆరోపణ. అలాగే మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జిల్లాలో జరుగుతున్నాయి. అక్రమార్కుల ధాటికి గుట్టలు సైతం ఖాళీ అవుతున్నాయి. ఇక అక్రమ దందాను నిలువరించేందుకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక పీడీఎస్ బియ్యం సైతం పక్కదారి పడుతుంది. నిషేధిత మత్తు పదార్థాలు నిషేధిత మత్తు పదార్ధాల దందా సైతం జిల్లాలో జోరుగా సాగుతుంది. గంజాయి సాగు కూడా గుట్టుగా సాగిస్తున్నారు. ముఖ్యంగా అయిజ, గద్వాల, నదితీర ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి పలు రాష్ట్రాలకు కూడ ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. కల్తీ కల్లు, సారా, మద్యం కూడా జిల్లాలో జోరుగా నడుస్తుంది. ఇక రాయిచూర్ నుంచి గద్వాల మీదుగా ప్రతిరోజు గుట్కాను అక్రమంగా తరలిస్తున్నారు. తెరపైకి పలువురి పేర్లు జిల్లా ఎస్పీ ఎవరనే విషయంపై ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా సింధుశర్మ, మల్లారెడ్డి, శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి నారాయణపేట, వనపర్తి ఎస్పీల పేర్లు సైతం ప్రచారంలోకి వచ్చాయి. గత నెల 30న పదవీ రమణ పొందిన లక్ష్మీనాయక్ స్థానంలో అదే రోజే వనపర్తి ఎస్పీ అపూర్వారావుకు ఇన్చార్జ్ ఎస్పీగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఏర్పాటు తర్వాత.. జోగుళాంబ గద్వాల జిల్లాగా ఏర్పాటు నుంచి పలు చికటీ కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కుమార్ అక్రమార్కుల దందాలపై తనదైన ముద్ర వేసి చాలా వరకు అడ్డుకట్ట వేశారు. ఇక 2018 మార్చి నెలలో ఎస్పీ విజయ్‌కుమార్ బదిలీ పై వెళ్లారు. అప్పటి నుంచి జిల్లాలో పలు దందాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.ఈ క్రమంలోనే గత నెల 30న జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ పదవీ విరమణ పొందడంతో జిల్లా బాస్ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎస్పీపైనే ఈ బాధ్యతలన్నీ పడనున్నాయి చర్యలు తీసుకుంటాం అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్తులను దోచుకునే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. గతంలో నమోదైన కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులను తయారు చేసి విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తాం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపుతాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – అపూర్వరావు, ఇన్చార్జ్ ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
జూనియర్ గద్దర్‌కు ఘన నివాళి
సాక్షి, అలంపూర్: జూనియర్ గద్దర్‌గా పేరుగాంచిన ఉపాధ్యాయుడు ప్రభాకర్‌కు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. అలంపూర్‌కు చెందిన ప్రభాకర్ గుండెపోటుతో మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు స్ధానిక శ్మశాన వాటికలో బుధవారం నిర్వహించారు. కళాకారుడిగా, సామాజిక సేవా కార్యకర్తగా, యూటీఎఫ్ సంఘంలో జిల్లా కోశాధికారిగా వివిధ రంగాల్లో సేవలు అందించి అందరి మన్ననలు పొందిన ఉపాధ్యాయుడు మృతితో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఉపాధ్యాయుడు మృతి చెందిన సమాచారంతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బుధవారం అలంపూర్‌కు చేరుకొని భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అదేవిధంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.కిష్టయ్య, మహబుబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు జంగయ్య, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు రామదాసు, జిల్లా అధ్యక్షుడు తిప్పన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, ఎంఈఓలు రాజు, అశోక్‌కుమార్, డేవిడ్ తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరితోపాటు వెంకటేష్ రమేష్, కృష్ణ, నాగరాజు తదితరులున్నారు. అలాగే హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఉపాధ్యాయుడు ప్రభాకర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయనతోపాటు తెలంగాణ రాష్ట్ర పశు వైద్యాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ ఉన్నారు. అనంతరం వారు ప్రభాకర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభాకర్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం పాల్గొన్నారు. భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు నాయకులు నారాయణరెడ్డి, సుదర్శన్‌గౌడ్, జయరాముడు, కిషోర్, సుంకన్న ఉన్నారు. -
‘ఉపాధి’ ఊసేది!
సాక్షి, ధరూరు: వలసలను నివారించి ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులు కల్పించాలనే సంకల్పంతో ప్రారంభమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఆ శాఖ అధికారులు తీరు కారణంగా నీరుగారిపోతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతుండగా.. మండలంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముందు నుంచి ఆ శాఖ అధికారులు మండలంలో కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అసలే వర్షాలు లేక ఇళ్ల ఉంటున్నామని, దీంతో జీవనోపాధికి ఇబ్బందిగా ఉందని ఉపాధి పనులు ప్రారంభించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. మండలంలో ఇదీ పరిస్థితి... మండలంలో మొత్తం 28 పంచాయతీలకు గాను 18 వేల జాబ్ కార్డులు ఉన్నాయి. గ్రామాల్లో నామమాత్రంగా పనులు కల్పింస్తున్నారు. కూలీలకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలనే ఆలోచన కలగడం లే దు. 28 పంచాయతీలకు గాను దాదాపు స గం గ్రా మాల్లో పనులు జరగడం లేదు. పనులు కల్పించాలని ఉపాధి ఏపీఓను, ఫీల్డ్ అసిస్టెంట్లను కోరుతున్నా.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. వర్షాలు కురవకపోవడంతో కూలీలు ఇళ్లలో ఉంటున్నారు. కనీసం ఉపాధి పనులైనా కల్పిస్తే జీవనం గడుస్తుందని కూలీలు భావిస్తున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు.. ఉపాధి పనులు ప్రారంభించాలని రెండు నెలలుగా ఈజీఎస్ అధికారులను కోరుతున్నా.. ప్రారంభం చేయడం లేదని కోతులగిద్ద, అల్వాలపాడు, మైలగడ్డ గ్రామాల కూలీలు ఆరోపిస్తున్నారు. వర్షాలు లేక పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు, ఈజీఎస్ ఏపీఓ అనిల్, ఎంపీడీఓ జబ్రాను కోరుతున్నా వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని ఆరోపిస్తున్నారు. రేపు మాపు అంటూ పబ్బం గడుపుతున్న అధికారుల తీరును నిరసిస్తూ.. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ గోడును చెబుతామని కూలీలు వాపోతున్నారు. ఎమ్మెల్యే హెచ్చరించినా.. గత నెలలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉపాధి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పనులు కల్పించకపోతే ఎదురయ్యే పరిణామాలకు తాము బాధ్యులం కాదని హెచ్చరించినా.. వారిలో మార్పు రావడం లేదు. కార్యాలయానికి వచ్చి కేవలం హాజరు వేసుకుని వెళ్తున్న ఆ శాఖ అధికారులకు నిద్ర మత్తు వీడడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వరుస ఎన్నికల నేపధ్యంలో కేవలం ఉపాధి శాఖలో మాత్రమే నిధులు ఉన్నాయని, కొన్ని వందల రకాల పనులు కల్పించే అవకాశాలు ఉన్నా.. ఎందుకు పనులు కల్పించడం లేదో అర్థం కావడంలేదని వారి తీరుపై సభలోనే ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరించారు. కానీ ఈజీఎస్ అధికారులు మాత్రం పాత పద్ధతినే అవలంభిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు నెల రోజులుగా ఉపాధి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. గ్రామంలో పనులు లేక జీవనోపాధికి ఇబ్బందిరంగా ఉంది. ఈసారి వర్షాలు కురవలేదు. మున్ముందు ఇంకెన్ని ఇబ్బందులు పడాలో తెలియడం లేదు. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి గోడును వెళ్లబోసుకోవాలనుకుంటున్నాం. – సారంబండ వెంకటేష్, కోతులగిద్ద -
వాగులో పడి ముగ్గురు చిన్నారులు మృతి
-
ఖరీఫ్సాగు ప్రశ్నార్థకమేనా?
సాక్షి, ధరూరు: వరుణుడి కరుణ కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. వాస్తవానికి మే నెలాఖరు లేదా జూన్ మొదటివారంలోనే ఏటా సమృద్ధిగా వర్షాలు కురిసి ఈపాటికే నెలరోజుల పంట సాగయ్యేది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఒక్క ఎకరంలో కూడా పంటసాగును చేయలేకపోయారు. ఇప్పటికే పంటపొలాలను దున్నుకొని సిద్ధం చేసుకున్న రైతులు ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసుకొని వరుణదేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఊరిస్తున్న మబ్బులు.. ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో తేలికపాటి జల్లులు కురుస్తూ రైతులను ఊరిస్తున్నాయి. ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతుంది. ఆరుతడి పంటలతో పాటు మెట్టపంటల సాగును చేసుకునేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు. ఒక్క భారీ వర్షం కూడా కురవకపోవడంతో ఎటు చూసినా వ్యవసాయ పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. ఏ రైతును కదిలించినా దీనగాథలే బయటకు వస్తున్నాయి. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. భూగర్భ జలాలు కూడా రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. బోరుబావుల్లో నుంచి నెలరోజుల క్రితం వరకు రెండు ఈంచుల నీళ్లు వచ్చే బోర్లు, ఒక్క నెలరోజుల వ్యవధిలోనే ఈంచు, అర ఈంచుకు తగ్గిపోయాయి. దీంతో పంటలను సాగు చేసుకునేందుకు బోరుబావులు ఉన్న రైతులు కూడా ముందుకు రావడం లేదు. ధైర్యం చేసి కొంతమంది రైతులు సీడ్‌పత్తి పంటను సాగు చేసుకున్నారు. బోర్లలో రోజురోజుకు నీళ్లు తగ్గుముఖం పడుతుండటంతో వేలాది రూపాయలు ఖర్చుపెట్టి సాగుచేసిన పత్తి పంటపై కూడా రైతులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమయ్యే సబ్సిడీ ఎరువులు, విత్తనాలను కూడా అందుబాటులోకి తేలేదు. మరో పది పదిహేను రోజులు ఇదే గడ్డు పరిస్థితి ఉంటే ఖరీఫ్ పంటసాగు లేనట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవకపోవడంతో జూరాలకు సైతం నీళ్లు రాలేదు. ప్రాజెక్టుకైనా నీళ్లు వచ్చి ఉంటే నెట్టెంపాడు ఎత్తిపోతల పంపుల ద్వారా రిజర్వాయర్లను నింపి కాస్తో, కూస్తో పంటలను సాగు చేసుకునే వారమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో తమ పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైందని వాపోతున్నారు. -
ఇద్దరి దారుణ హత్య
కర్నూలు , సి.బెళగల్: తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుంది. పద్ధతి కాదని చెప్పిన కుమారిడిని చంపుతానని బెదిరించింది. భయపడిన కుమారుడే తల్లిని, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల శివారులో బుధవారంచోటుచేసుకుంది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాలు.. సి.బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామానికి చెందిన తెలుగు కర్రెన్న, శంకరమ్మ (48) దంపతులకు రాముడు, భాస్కర్ కుమారులు సంతానం. కర్రెన్న ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. పెద్ద కుమారుడు రాముడికి తెలంగాణ రాష్ట్రంలోని కొంకల ప్రాంతానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహమైంది. శంకరమ్మ గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన తెలుగు బడేసా (52)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై తల్లీ, కుమారుల మధ్య గొడవలు జరిగాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి శంకరమ్మ పలుమార్లు పెద్ద కుమారుడు రాముడిని హంతు చూస్తానని బెదిరించేది. దీంతో తననను చంపుతుందనే భయంతో కుమారుడే తల్లిని, ఆమె ప్రియుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో బుధవారంరాజోలి గ్రామ శివారులో ఇద్దరూ ఉన్నారన్న సమాచారంతో రాముడు అక్కడికి వెళ్లి వేట కొడవలితో దాడి చేసి, ఇద్దరినీ హత్య చేశాడు. అనంతరం సి.బెళగల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రాజోలి పోలీస్‌లు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సి.బెళగల్ పోలీసులు నిందితుడిని రాజోలి పోలీసులకు అప్పగించారు. -
నాడు లోక్‌సభ హోదా.. నేడు అసెంబ్లీ గోదా
గద్వాల, వికారాబాద్, ఇబ్రహీంపట్నం.. ఇవన్నీ ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లు. కానీ, ఒకప్పుడివి లోక్‌సభ స్థానాలుగా వెలుగొందాయి. 1952లో తొలి పార్లమెంట్ ఎన్నికల తర్వాత జనాభా ప్రాతిపదికన పలుమార్లు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఈ క్రమంలో కొన్ని స్థానాలు కనుమరుగై పోగా, మరికొన్ని కొత్తగా వచ్చి చేరాయి. ఆ క్రమంలో గద్వాల, వికారాబాద్, ఇబ్రహీం పట్నం స్థానాలు లోక్‌సభ జాబితా నుంచి తప్పుకున్నాయి.=- పోలంపల్లి ఆంజనేయులు,సాక్షి ప్రతినిధి– కరీంనగర్ గద్వాల పోయె.. కర్నూలు వచ్చె మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని గద్వాల 1962లో ఐదేళ్ల కాలం మాత్రమే లోక్‌సభ నియోజకవర్గంగా ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల ప్రకారం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో 1967లో ఈ స్థానం రద్దయి నాగర్‌కర్నూలు నియోజకవర్గం ఏర్పడింది. 1962లో గద్వాల నుంచి డి.కె.సత్యారెడ్డిపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి జె.రామేశ్వర్రావు ఆ స్థానం రద్దవడంతో 1967 నాటికి మహబూబ్‌నగర్ వెళ్లారు. 1967లో మహబూబ్‌నగర్ ఎంపీగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం.కిష్టయ్య మీద ఒకసారి, 1971, 1977లో వరుసగా డి.కె. సత్యారెడ్డిపై రెండుసార్లు విజయం సాధించారు రామేశ్వర్రావు. సత్యారెడ్డి ప్రస్తుతం మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డి.కె.అరుణ కుటుంబానికి చెందిన వారే. లష్కర్ కోసం.. పట్నం పోయింది ఇబ్రహీంపట్నం లోక్‌సభ నియోజకవర్గం కూడా ఐదేళ్లు మాత్రమే కొనసాగింది. 1952లో తొలి లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇబ్రహీంపట్నం పేరుతో పార్లమెంట్ నియోజకవర్గం తెరపైకి వచ్చినా, 1957 నుంచి రద్దయిపోయి సికింద్రాబాద్ నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం కొనసాగిన ఐదేళ్ల పాటు కాంగ్రెస్ నేత ఎస్.ఎ.ఖాన్ ఎంపీగా కొనసాగారు. వికారాబాద్.. మహిళకు కిరీటం వికారాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటై 1967 నుంచి రద్దయింది. 1952లో ఎస్.ఎ.ఎబినెజర్ గెలిచారు. ఆ తర్వాత ఆ స్థానం నుంచి 1957, 1962లో సంగం లక్ష్మీబాయి విజయం సాధించారు. లక్ష్మీబాయి హైదరాబాద్ స్టేట్ నుంచి ఎన్నికైన తొలి యాదవ మహిళా పార్లమెంట్ సభ్యురాలు. వికారాబాద్ 2009లో రద్దయి, చేవెళ్ల నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో రద్దయిన స్థానాలివి ♦ నల్లగొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం 1962లో ఏర్పాటై 2004 ఎన్నికల వరకు కొనసాగింది. ఈ నియోజకవర్గం నుంచి బి.ఎన్.రెడ్డి, బద్దం నర్సింహారెడ్డి, సూదిని జైపాల్‌రెడ్డి వంటి మహామహులు ఎంపీలుగా గెలిచారు. 2009లో ఈ నియోజకవర్గం భువనగిరిగా ఆవిర్భవించింది. ♦ తొలి తెలుగు ప్రధాని పీ.వీ.నరసింహారావును 1980లో పార్లమెంట్‌కు పంపించిన హన్మకొండ స్థానం కూడా 2009లో రద్దయింది. ఈ స్థానంలో 1984లో బీజేపీ నుంచి పోటీ చేసిన సి.జంగారెడ్డి ఎవరూ ఊహించని పి.వి.నరసింహారావునే ఓడించారు. అప్పటి పార్లమెంట్లో బీజేపీ తరపున జంగారెడ్డితో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయి మాత్రమే సభ్యులుగా ఉండడం గమనార్హం. ♦ ఆంధ్ర–తెలంగాణ వారధిగా 1967 నుంచి కొనసాగిన భద్రాచలం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం కూడా 2009లోనే రద్దయింది. ఖమ్మం జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో ఉన్న ఈ స్థానం నుంచి చివరిగా 2004లో సీపీఎం తరపున మిడియం బాబూరావు గెలుపొందారు. 2009లో అప్పటి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్(ప్రస్తుత జిల్లా కేంద్రం) ఎస్టీ నియోజకవర్గంగా మారిపోయింది. మహబూబాబాద్ నియోజకవర్గం 1957లో జనరల్ సీటుగా ఏర్పాటై 1967లో రద్దయింది. మళ్లీ లోక్‌సభ నియోజకవర్గంగా రూపొందింది. ♦ సిద్దిపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం 2009లో రద్దయి జహీరాబాద్‌గా మారింది. 1967లో ఏర్పాటైన సిద్దిపేట నుంచి మూడుసార్లు జి.వెంకటస్వామి(కాకా), ఐదు సార్లు నంది ఎల్లయ్య, రెండుసార్లు ఎం.రాజయ్య విజయం సాధించి పార్లమెంట్‌కు వెళ్లారు. ఇక జి.విజయ రామారావు, సర్వే సత్యనారాయణ ఒక్కో దఫా విజయం సాధించారు. 2009లో జహీరాబాద్ జనరల్ సీటు ఏర్పాటు కావడంతో 2009లో సురేష్ షెట్కార్(కాంగ్రెస్), 2014లో బీ.బీ.పాటిల్ (టీఆర్ఎస్) గెలుపొందారు. -
మిషన్ భగీరథ నీళ్లొచ్చాయ్..
సాక్షి, కేటీదొడ్డి: ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించాలనే సంకల్పంతో చేపట్టిన మిషన్ భగీరథ నీళ్లు వచ్చేశాయ్.ప్రధాన పైపులైన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.నల్లా కనెక్షన్ల ద్వారా మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గువ్వలదిన్నె తదితర గ్రామాల్లో తాగునీరు చేరింది.అలాగే కేటీదొడ్డి మండలంలోని తండాల్లో పనులు పూర్తికావడంతో తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లతో తాగునీరు ఇచ్చి తీరుతానని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. వేసవికాలం వస్తే చాలు ప్రతి సంవత్సరం ప్రజలు గ్రామశివారులోని పొలాల నుంచి తాగునీరు తెచ్చుకునేవారు. మిషన్ భగీరథ నీరు రావడంతో నీటికోసం పొలాల్లో బోరుబావులను ఆశ్రయించాల్సిన పనితప్పింది. పలు గ్రామాల్లో తాగునీరు మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గు వ్వలదిన్నె తదితర గ్రామాల్లో ఇప్పటికే పనులు పూర్తయి నల్లాల ద్వారా తాగునీరు కూడా వస్తుంది. నూతనంగా గ్రామపంచాయతీలుగా ఏర్పడిన పైజారితాండా, తూర్పుతండా గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు అంతా పూర్తయ్యాయి. ఇంటింటికీ నల్లాలు కూడా బిగించారు. తండాలో గతంలో కిలో మీటర్ దూరం నుంచి తాగునీరు తెచ్చుకునే వారు. ఇప్పుడు నల్లా కనెక్షన్ల ద్వారా ఆ సమస్య తీరనుందని గ్రామస్తులు, తండవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గువ్వలదిన్నెలో దాదాపు నల్లా కనెక్షన్ పూర్తియ్యాయి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు వేసవికా లంలో కూడా పుష్కలంగా మిషన్ భగీరథ నీటిని తాగుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామానికి ఇబ్బంది లేదు గత సంవత్సరం నుంచి మా గ్రామానికి తాగునీటికి ఎలాంటి సమస్య లేదు. 6 నెలల నుంచి మిషన్ బగీరథ ద్వారా తాగునీరు వస్తుంది. దీంతో తాగునీటి ఇబ్బందులు తీరాయి. ఎండాకాలంలో కూడా నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నారు. – అంజనమ్మ, కొండాపురం -
వారి కుటుంబమే బంగారమైంది : రాహుల్ గాంధీ
సాక్షి, గద్వాల : నీళ్లు, నిధులు, నియామకాల గురించి కలలుకన్న తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గద్వాలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం పీఠమెక్కిన కేసీఆర్ కేవలం ఆయన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ అన్ని రంగాల్లో ప్రజలను మోసం చేసిందని, మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల క్రితం రాష్ట్రం ఏర్పడిన సమయంలో రూ. 17 వేలకోట్ల మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉందని గుర్తుచేశారు. సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘పాలమూరు రంగారెడ్డి పథకాన్ని 11 వేల కోట్లతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసింది. కేసీఆర్ రీడిజైన్ చేసి 65 వేలకోట్లకు పెంచారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు. అందుకే కేసీఆర్‌ను కావో కమీషన్ రావు అని ప్రజలు పిలుస్తున్నారు. తెలంగాణ ప్రజల ఒక్కో తలపై లక్షన్నర అప్పుభారం మోపారు. కానీ వారి కుటుంబ సభ్యుల ఆస్తులు మాత్రం 400 శాతం పెరిగాయి. అందుకే వారిది బంగారు కుటుంబమైంది. యువకులకు ఉద్యోగాలు లేవు, ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు ఇక బంగారు తెలంగాణ ఎక్కడిది. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారు. కేసీఆర్ యువకులకు, రైతులకు క్షమాపణలు చెప్పాలి’’ అని అన్నారు. ‘‘ఇళ్లులేని ప్రతీ ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇళ్లు కటిస్తామని గతంలో హామీ ఇచ్చారు. కనీసం రెండువందల ఇళ్లు కూడా కట్టలేదు. ఆయన మాత్రం 300 కోట్లతో పెద్ద కోట కట్టుకున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు ఇస్తాం. బడ్జెట్లో 20 శాతం నిధులు విద్యకు కేటాయిస్తాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. కేసీఆర్ ఒంటరిగా ఉన్నానంటూ కేంద్రంలో మోదీకి అండగా ఉంటున్నారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ స్వయం సేవక్‌గా మారింది’’ అని వ్యాఖ్యానించారు. -
కేసీఆర్‌ను కావో కమీషన్ రావుగా పిలుస్తున్నారు
-
కేసీఆర్ హఠావో.. జనతాకో బచావో
సాక్షి, గద్వాల న్యూటౌన్: మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ.. రాష్ట్రం లో అన్నివర్గాలకు వ్యతిరేకంగా పాలన కొనసాగించిన కేసీఆర్‌ను ఈసారి ఎన్నికల్లో ఓ డించి కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని టీపీసీసీ అ ధికార ప్రతినిధి పేరి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక విధానాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. అన్ని జిల్లాల్లో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగులంతా భయబ్రాంతులతో పనిచేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు ఎలాంటి లాభం చేకూరలేదన్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ప్రకటించలేకపోయిందని విమర్శించారు. విద్యారంగంలో 2015 నుంచి పదోన్నతులు కల్పించలేదన్నారు. రూ.1,200 కోట్లు మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు టీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిందని, దీంతో కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయన్నారు. ప్రభుత్వ నిర్వాకంతో పేదలతోపాటు ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు చేస్తామన్నారు. అలాగే 43 శాతం ఐఆర్‌తోపాటు 63 శాతం ఫిట్మెంట్ ఇస్తామన్నారు. 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి హర్షవర్ధన్‌రెడ్డి, నాయకులు వెంకట్రాములు, సురేందర్‌గౌడ్, అబ్రహాం, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
గద్వాల క్రైం: మరో అయిదు నిమిషాలైతే ఆ మహిళా కూలీలు వారి ఇంటికి చేరుకునేవారు. ఉదయం నుంచి కూలీపనిలో ఉన్న వారు వాహనంలో బయలుదేరి ఇంటివద్ద ఉన్న భర్త, పిల్లలను గుర్తు చేసుకున్నారు. ఇంటికెళ్లి చేయాల్సిన పనుల గురించే మాట్లాడుతున్నారు. ఇంతలోనే మృత్యువు మరో వాహనరూపంలో ఎదురుగా దూసుకొచ్చింది. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఎగిరి మృత్యుశకటం చక్రాల మధ్య పడి ప్రాణాలొదిలారు. నిమిషం వ్యవధిలో విగతజీవులుగా మారారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షులు, టాటాయేస్ డ్రైవర్ కథనం ప్రకారం ఆ వివరాలు... గద్వాల మండలం జమ్మిచేడు గ్రామానికి చెందిన ఈడిగ అనసూయమ్మ(41), బోయ రాములమ్మ (40)తో పాటు అదే గ్రామానికి చెందిన మరికొంత మంది (10మందికి పైగా) మహిళా కూలీలు, పట్టణ శివారులోని ఓ జిన్నింగ్ మిల్లులో పత్తి గింజలు వేరు చేసే కూలిపనికి వెళ్తున్నారు. అయితే రోజులాగే మంగళవారం కూడా టాటాయేస్ వాహనంలో పనికి వెళ్లారు. సాయంత్రం తిరిగి 7.15 గంటల సమయంలో ఇంటికి వాహనంలో వస్తున్నారు. ఇద్దరు ఓ వైపు నిల్చుని ఉన్నారు. గద్వాల నుంచి అయిజ వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం కొండపల్లి మలుపు వద్ద వేగంగా వస్తూ వీరిని ఢీ కొట్టింది. దీంతో టాటాయేస్ వాహనంలో నిల్చుని ఉన్న ఇద్దరు మహిళలు గుర్తుతెలియని వాహనం చక్రాల కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వీరితోపాటు రుక్మిణి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన మహిళా కూలీలు కేకలు వేస్తూ గట్టిగా రోదించారు. స్థానికులు గమనించి వారిని వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో జమ్మిచేడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం ప్రమాద వార్త తెలియడంతో జమ్మిచేడు గ్రామస్తు లు, బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. తమ వారిని చూసుకుని గుండెలవిసేలా రోధించారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారుమోగింది. అనసూయమ్మ భార్త రాములు, రాములమ్మ భర్త బీసన్న ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మా ర్చురీలో భద్రపర్చారు. కూలీలు మృతి చెందారన్న విషయం తెలుసుకుని కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, బీఎల్ఎఫ్, బీఎస్పీ తదితర పార్టీల నాయకులు బాధిత కుంటుబాలను ఓదార్చారు. అన్నివిధాలా ఆదుకుంటామని బంధువులకు హామీ ఇచ్చారు. -
ధర్మాగ్రహ సభతో పార్టీల్లో కదలిక
సాక్షి, గద్వాల అర్బన్: హైదరాబాద్‌లో ఈ నెల 11న ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక నిర్వహించిన ధర్మాగ్రహ సభతో అన్ని రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చిందని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర పరిశీలకులు పర్వత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎస్టీయూ టీఎస్ జిల్లా కౌన్సిల్ సమావేశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు యూనిస్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పర్వత్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న సమయంలో ధర్మాగ్రహ సభ ఎందుకని ప్రశ్నించిన వారికి రాజకీయ పార్టీలు సీపీఎస్, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై స్పందించిన తీరే వారడిగిన ప్రశ్నలకు సమాధానమన్నారు. సీపీఎస్ విధానం వెంటనే రద్ద చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, విజయభాస్కర్‌రెడ్డి, చెన్నకేశవులు, శ్రీహరి, పాషా, మల్లయ్య, నాగరాజు, రాజన్న, గౌరిశంకర్ పాల్గొన్నారు. -
రైతు శ్రేయస్సే కాంగ్రెస్ లక్ష్యం
సాక్షి, గద్వాల రూరల్: దేశానికి పట్టుగొమ్మలైన రైతులను అన్ని విధాలుగా ఆదుకొని వారి శ్రేయస్సును కోరేది కాంగ్రెస్ మాత్రమేనని టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం డీకే బంగ్లాలో పూడూరు, జంగంపల్లి గ్రామాల ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. కేవలం అధికారం కాంక్షతోనే టీఆర్ఎస్ జిమ్మిక్కులు చేస్తుందని, శాశ్వత అభివృద్ధి, రైతులకు మద్దతు ధర కల్పన కాంగ్రెస్ ద్వారానే సాధ్యమన్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగ యువతకు అవకాశాల కల్పనకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చడం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం పొందుటకు ఎమ్మెల్యే డీకే అరుణను గెలిపించాలని కోరారు. వెంకటేష్, వెంకట్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలి మల్దకల్: గద్వాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణను నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని డీకే అరుణ కుమార్తె డీకే స్నిగ్ధారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బిజ్వారంలో గద్వాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణ తరఫున డీకే స్నిగ్ధారెడ్డి, మల్దకల్ మాజీ ఎంపీపీ సత్యారెడ్డి, మురళీధర్‌రెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, మళ్లీ ఇప్పుడు చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను ప్రారంభించారు. రమేష్‌రెడ్డి, చక్రాధర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మీ పాల్గొన్నారు. దొరల పాలనను అంతం చేద్దాం ధరూరు: ఈ ఎన్నికల్లో దొరల పాలనను అంతమొందిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర ఏర్పాటుతో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండలంలోని అల్వలపాడు, కొత్తపాలెం, తండా, కోతులగిద్ద, ర్యాలంపాడు, మార్లబీడు, చెన్నారెడ్డిపల్లి, బూరెడ్డిపల్లి, ఓబులోనిపల్లి, జాంపల్లి తదితర గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరగలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు నేరుగా లబ్ధిదారులకే అందిస్తామన్నారు. ప్రతి మహిళా సంఘానికి రూ.10 లక్షల రుణం, లక్ష గ్రాంట్‌ను అందిస్తామన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆధరణ లభిస్తోందని, టీఆర్ఎస్ జూట మటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాంచంద్రారెడ్డి, డీఆర్ విజయ్, శ్రీకాంత్‌రెడ్డి, కిష్టన్న, లింగారెడ్డి, వాహిద్, ప్రతాప్, బుచ్చిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల్‌బాస్, అంజిరెడ్డి, రాజేష్, హన్మంతరాయ పాల్గొన్నారు. -
బాబుతో పొత్తు సిగ్గుచేటు.. హరీశ్ ద్వజం
సాక్షి, గద్వాల: గద్వాలలో జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధి, అవకాశవాదానికి మధ్య జరుగుతున్నవిగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభివర్ణించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తనది ఇక్కడ తొలి అడుగు మాత్రమేనని.. కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించుకుని తన వెంట అసెంబ్లీలోకి తీసుకునే వెళ్తాననే ధీమా వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా గద్వాలలో డబ్బు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తున్నారని.. డబ్బు అహంకారం ఇక నడవదని పేర్కొన్నారు. అలాగే, హరీశ్‌రావు ఇక్కడకు వచ్చాడని గుర్తించాలని సూచించారు. గద్వాల నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్‌లో డాక్టర్ అబ్రహం గెలుపు ఖాయమని అన్నారు. కంటికి రెప్పలాగా గద్వాల కార్యకర్తలను కాపాడుకుంటామని, ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా పార్టీ కోసం 19 ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తలు మరో 19రోజులు గట్టిగా కష్టపడితే ఖచ్చితంగా కృష్ణమోహన్‌రెడ్డి గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. గద్వాలలో కొందరు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని.. వారికి అధికారం, పదవులు తప్ప ప్రజాసంక్షేమం పట్టలేదని విమర్శించారు. టికెట్ వస్తే ఒక పార్టీ.. రాకపోతే మరో పార్టీ.. అంతిమ లక్ష్యం మాత్రం అదికారమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. బాబుతో పొత్తు సిగ్గుచేటు తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటని హరీశ్‌రావు అన్నారు. చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుని వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలకు కారణమయ్యారని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలోనే మహబూబ్‌నగర్ వలసల జిల్లాగా మారిందన్నారు. పోతిరెడ్డిపాడుకు బొక్కకొట్టి మహబూబ్‌నగర్‌కు రావాల్సిన నీటిని ఆం«ధ్రాకు తరలించినప్పుడు డీ.కే.అరుణ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని తెలిపారు. దీంతో ఎటు చూసినా చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. నెట్టెంపాడుకు 2004లో కొబ్బరికాయ కొడితే 2014వరకు పదేళ్లలో పట్టుమని 10వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్లలో కాల్వలు పూర్తిచేసి రూ.వందల కోట్లు ఖర్చుతో 1.20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. ఈ మధ్య కొబ్బరి కాయకొట్టే పాత ఫొటో పట్టుకొచ్చి తామే జీఓ తెచ్చామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. ఇన్నేళ్లు మంత్రిగా ఉండి గట్టు ఎత్తిపోతలకు తట్టెడు మట్టి తవ్వని వ్యవస్థ మీదైతే... రూ.552కోట్లు మంజూరు చేసిన, చేయించుకున్న ఘనత కేసీఆర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి దక్కుతుందని తెలిపారు. గట్టు ఎత్తిపోతల ద్వారా గట్టు మండలాన్ని సశ్యశ్యామలం చేస్తామని అన్నారు. గద్వాలకు 350 పడకల ఆస్పత్రి, గద్వాలకు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు, ఆర్డీసీ బస్టాండ్ ఆధునీకరణకు రూ.2కోట్లు, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, గుర్రగడ్డ బ్రిడ్జికి రూ.10కోట్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న గద్వాలలో టెక్స్టైల్ పార్కుకు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పేద ప్రజలు, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పథకాలు ప్రవేశపెట్టామని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకుంటా.. 15ఏళ్లుగా ఓడినా, గెలిచినా వెన్నంటే ఉన్న కార్యకర్తల రుణం రుణం తీర్చుకుంటానని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు పెట్టినా, ఇబ్బందులు వచ్చినా తన వెంట ఉన్న కార్యకర్తలను మరువలేనని అన్నారు. ఈసారి అవకాశం ఇచ్చి అందరి రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అచ్చంపేట రాములు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాథం, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, వినియోగదారుల కార్పొరేషన్ ఛైర్మన్ గట్టు తిమ్మప్ప, టీఎస్ టెక్నాలజీ ఛైర్మన్ రాకేష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, జిల్లా గ్రం«థాలయ చైర్మన్ బీ.ఎస్. కేశవ్, టీఆర్ఎస్ నాయకులు పరుమాల నాగరాజు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీజీ కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన
గద్వాల అర్బన్: పీజీ కళాశాల ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడారు. పీజీ ఇంగ్లిష్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నా.. వారి అభిప్రాయం తీసుకోకుండా ఇంగ్లిష్ విభాగం ఎత్తివేయడం దుర్మార్గమన్నారు. అర్ధంతరంగా ఇంగ్లిష్ విభాగం ఎత్తివేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించడం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమేనన్నారు. ఈ రోజు సెమిస్టర్ ఫీజులు చెల్లించేందుకు చివరి రోజైనా కళాశాలకు ప్రిన్సిపాల్, స్టాప్ రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై నాలుగు రోజుల క్రితం పాలమూరు వీసీని కలిసినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో సంవత్సరం మధ్యలో కోర్స్ ఎత్తివేస్తామంటే ఎక్కడికి వెళ్లాలని ఆక్రోశించారు. వివాహం అయిన మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందన్నారు. ప్రైవేటు పీజీ కళాశాలలను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్రిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా పాలమూరు వీసీ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు అవినాష్, భరణికుమార్, అనూష, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రాత్మకం.. గద్వాల చరితం
సాక్షి,గద్వాల : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. పౌరుషానికి మారుపేరుగా, కళలకు కాణాచిగా, విద్యకు పుట్టినిల్లుగా, తిరుపతి వెంకట కవులు సన్మానం పొందిన నేలగానే కాకుండా కృష్ణమ్మ, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డగా విరాజిల్లుతోంది. నిజాం రాజ్యంలో దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్న గద్వాల సంస్థానం చరిత్ర పుటల్లో సుస్థిర స్థానాన్ని పొందింది. 1663 నుంచి 1949 వరకు 286 ఏళ్ల చరిత్ర కలిగిన గద్వాల సంస్థానం చారిత్రక నేపథ్యం ఎంతో గొప్పది. 1956 లో గద్వాల నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గద్వాల నియోజకవర్గంలో డీ.కే కుటుంబమే ఎక్కువగా పాలన సాగించింది. దివంగత సత్యారెడ్డి నుంచి మొదలైన ఈ ప్రస్థానం డీకే అరుణ వరకు కొనసాగుతోంది. డీ.కే సమరసింహరెడ్డి, డీ.కే భరతసింహరెడ్డి, డీ.కే అరుణ గద్వాల ఎమ్మేల్యేలుగా గెలుపొందారు. ఇక డీకే కుటుంబం నుంచి బయటకు వచ్చిన వారు కూడా ఇతర పార్టీల్లో కొనసాగుతున్నారు. జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్లు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరులు. దేశంలోనే అత్యధికంగా గద్వాల నియోజకవర్గంలోనే సీడ్ పత్తి పండిస్తారు. అదే విధంగా మూడు రాష్ట్రాల కూడలిగా గద్వాల రైల్వే జంక్షన్ కొనసాగుతోంది. చేనేతకు పుట్టినిళ్లయిన గద్వాలలో చారిత్రాత్మకమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. డీకే ఫ్యామిలీదే ఆధిక్యం సంస్థానం కనుమరుగైన అనంతరం 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నగద్వాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు గద్వాల నియోజకవర్గానికి 14 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో డీకే ఫ్యామిలీ ఎవరూ పోటీ చేయలేదు. 1952లో పాగ పుల్లారెడ్డి, డాక్టర్ విజయమోహన్‌రెడ్డి పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 1957లో డీకే.సత్యారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పాగ పుల్లారెడ్డిపై గెలిచారు. 1962లో డీకే.సత్యారెడ్డి తప్పుకుని సంస్ధాన వారసుడిగా ఉన్నకృష్ణరాంభూపాల్ను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి పాగ పుల్లారెడ్డిని ఓడించారు. 1967లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన డీకే.సత్యారెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా గోపాల్‌రెడ్డి గెలిచారు. 1972లో జరిగిన ఎన్నికల్లో పాగ పుల్లారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీచేసి డీకే.సత్యారెడ్డిని ఓడించారు. సత్యారెడ్డి 1978లో పాగ పుల్లారెడ్డిని ఓడించారు. సత్యారెడ్డి మరణంతో 1980లో ఉప ఎన్నిక నిర్వహించగా ఆయన కుమారుడు సమరసింహరెడ్డి కాంగ్రెస్(ఐ) నుంచి పోటీకి దిగి గెలిచారు. 1983లో కూడా సమరసింహరెడ్డే కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సమరసింహరెడ్డి గోపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయాడు. తిరిగి కోర్టుకు వెళ్లగా రీకౌంటింగ్‌కు ఆదేశించడంతో సమరసింహరెడ్డిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ 1987లో తీర్పు వచ్చింది. 1989లో కూడా సమరసింహరెడ్డి గెలిచారు. 1994లో డీ.కే.భరతసింహరెడ్డి ఇండిపెండెంట్‌గా.. కాంగ్రెస్ అభ్యర్థి అయిన తన అన్న సమరపై గెలిచారు. ఇక 1999లో తొలిసారిగా డీకే.అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి పోటీకి దిగగా టీడీపీ అభ్యర్థి గట్టు భీముడు చేతిలో ఓడారు. 2004, 2009,2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు నాలుగోసారి బరిలో దిగుతున్నారు. ఇలా గద్వాలలో జరిగిన ఎన్నికలన్నింట్లో డీకే ఫ్యామిలీ అడుగులు ఉండసాగాయి. ప్రత్యర్థులూ ఆ గూటి పక్షులే... గద్వాల ఎన్నికల్లో డీకే.సత్యారెడ్డి అనంతరం వచ్చిన డీ.కే.సమరసింహరెడ్డి, డీ.కే.భరతసింహరెడ్డి, డీకే.అరుణపై పోటీకి నిలబడుతున్న వ్యక్తులంతా డీకే బంగ్లా నుంచి వచ్చిన వారే. ప్రత్యర్థులుగా గెలిచిన వారిలో ఉప్పల గోపాల్‌రెడ్డి, గట్టు భీముడు ఉన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి రెండుసార్లు నిలబడి ఓడిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా డీ.కే.భరతసింహరెడ్డికి మేనల్లుడు. ఆయన కూడా బంగ్లా నుంచి వచ్చిన వారేననే చర్చ ఉంది. అదే విధంగా ప్రస్తుతం బీజేపీ నుంచి బరిలో ఉన్న గద్వాల వెంకటాద్రిరెడ్డి కూడా బంగ్లాకు చాలా కాలంగా అనుకూలంగా పనిచేశారు. నాటి కాలంలో ఎన్నికల్లో డీకే ఫ్యామిలీకి ఎదురుగా నిలబడిన పాగ పుల్లారెడ్డి,ఉప్పల గోపాల్‌రెడ్డి వర్గీయులెవరూ రాజకీయాల్లో లేరు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డీకే ఫ్యామిలీ నుంచి వచ్చిన డీకే అరుణ(కాంగ్రెస్), టీఆర్ఎస్ పార్టీ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీజేపీ నుంచి వెంకటాద్రిరెడ్డి, బిఎల్ఎఫ్ నుంచి రంజిత్‌కుమార్ పోటీలో ఉన్నారు. ఐదు.. నాలుగు.. ఐదు గద్వాల నియోజకవర్గం ప్రస్తుతం గద్వాల, కేటి దొడ్డి, మల్దకల్, గట్టు, ధరూరు మండలాలతో కొనసాగుతోంది. అయితే నిమోజకవర్గం ప్రారంభమైనప్పుడు గద్వాల, మల్దకల్, గట్టు, ధరూరుతో పాటు అయిజ కూడా ఇదే నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో అయిజను అలంపూర్‌లో కలిపారు. దీంతో నాలుగు మండలాలే మిగిలాయి. కాగా, తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన మండలాల పునర్విభజనలో గట్టు, ధరూరు నుంచి కొన్ని గ్రామాలను విడదీసి కేటీ దొడ్డి మండలంగా ఏర్పాటుచేశారు. దీంతో మళ్లీ గద్వాల నియోజకవర్గంలోని మండలాల సంఖ్య ఐదుకు చేరింది. అక్షరాస్యతలోనే వెనకడుగు జోగుళాంబ గద్వాల జిల్లా అక్షరాస్యత ప్రస్తుతం కేవలం 49.87శాతం మాత్రమే ఉంది. అంటే జిల్లా జనాభాలో కనీసం సగంమంది కూడా అక్షరాస్యులు లేరన్నమాట. ఆసియా ఖండంలోనే అక్షరాస్యతలో వెనకబడ్డ గట్టు మండలం గద్వాల నియోజకవర్గంలోనే ఉంది. సాగునీరుకు ఆధారం జూరాల, నెట్టెంపాడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి ప్రాజెక్టుగా కృష్ణా నదిపై జూరాల ప్రాజెక్టు నిర్మాణమైంది. జూరాల ప్రాజెక్టు సాగునీటితో పాటు తాగు నీటి అవసరాలను తీర్చే వరదాయనిగా మారింది. జూరాల రిజర్వాయర్ నుంచి మూడు ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని పాలమూరు, జడ్చర్ల, వనపర్తి, గద్వాల వంటి ముఖ్య పట్టణాలే కాకుండా వందలాది గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వలసల జిల్లాగా పేరుండే పాలమూరులో ఇప్పుడు సాగు పెరగడానికి జూరాల ప్రాజెక్టు ఉపయోగపడులోంది. జూరాల ప్రాజెక్టు పరిధిలో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇక రిజర్వాయర్ ద్వారా నెట్టెంపాడు ఎత్తిపోతలకు 20 టీఎంసీలను అందిస్తూ రెండు లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీల ద్వారా రెండు లక్షల ఎకరాలకు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 3.9 టీఎంసీలను అందిస్తూ దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తూ ఉమ్మడి జిల్లాలో మొత్తం ఐదున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. ఇదీ సంస్థాన చరిత్ర గద్వాల సంస్థానాధీశుల చరిత్ర 1663 నుంచి1712 మధ్య కాలంలో మొదలైంది. తొలుత సోమానాద్రి నుంచి మొదలు 1924 నుంచి 1948 చివరి వరకు మహరాణి ఆదిలక్ష్మీదేవమ్మ వరకు కొనసాగింది. గద్వాల సంస్థాన కాలంలో సంస్థానాధీశుగా పురుషులతో సమానంగా స్త్రీలు కూడా రాణులుగా కొనసాగిన చరిత్ర ఉంది. గద్వాల సంస్థానాధీశులుగా కొనసాగిన వారిలో 11మంది పురుషులు, ఎనిమిది మంది రాణులుగా గద్వాల సంస్థానాన్నిపరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. తిరుపతి వెంకట కవులే కాకుండా ఎందరో వేద పండితులకు సత్కారాలు చేయడంతో గద్వాలకు విద్వత్ గద్వాలగా పేరు వచ్చింది. ఆనాటి గద్వాల సంస్థానాధీశుల ఏలుబడి నుంచి ప్రజాస్వామ్యంలో అడుగిడిన గద్వాలలో తొలిసారిగా 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఎన్నికలు జరిగాయి. మూడు రాష్ట్రాల కూడలిగా రైల్వే జంక్షన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గద్వాల రైల్వే స్టేషన్‌ను జంక్షన్‌గా మార్చడం ద్వారా దక్షిణ భారతదేశంలోని తూర్పు, పశ్చిమలను కలిపేలా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ప్రతిపాదించారు. నిజాం రైల్వేగా అవతరించిన నాడే గద్వాల సంస్థానాధీశులు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గద్వాల రైల్వే జంక్షన్ ఏర్పాటుకు 105 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. స్వాతంత్ర్యం వచ్చాక భారతీయ రైల్వేలో విలీనం కాగా రాయచూర్-రాయచూర్ రైల్వే లైన్ ఎన్నికల ప్రచార అంశంగా మారింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రిగా పనిచేసిన మల్లికార్జున్ తనకాలంలో రాయచూర్-మాచర్ల రైల్వే లైన్‌ను దశలు విభజించి గద్వాల-రాయచూర్ మధ్య మొదటి దశగా మంజూరు ఇప్పించారు. అనంతరం 11ఆగష్టు 2002 న అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహయమంత్రి బండారు దత్తాత్రేయ గద్వాల-రాయచూర్ లైన్‌కు శంకుస్థాపన చేశారు. 12 అక్టోబర్2013న అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్ కార్గే కొత్త లైన్‌ను ప్రారంభించారు. గద్వాలలో అప్పటి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ, స్థానిక ఎంపీ మందా జగన్నాథం కొత్త రైలుకు స్వాగతం పలికారు. నాటి నుంచి రైల్వే జంక్షన్‌గా గద్వాల రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. 2014జూన్ 2 నుంచి తెలంగాణ ఏర్పాటు కావడంతో మూడు రాష్ట్రాల రైల్వే కైడలిగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు రైల్వే జంక్షన్‌గా ఉన్న గద్వాల స్టేషన్ జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చెందింది. గద్వాల నియోజకవర్గానికి ఇదో విశేషంగా చెప్పవచ్చు. జిల్లాలో ఇతర రంగాలు గద్వాల నియోజకవర్గంలో జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులు, రిజర్యాయర్లు, చెరువులు ఉండటం వల్ల మత్య్స సంపదకు అవకాశాలు ఉన్నాయి. దేశంలోనే 25శాతం పత్తి విత్తనోత్పత్తి చేయడం విశేషం. చేనేతకు దేశంలోనే ప్రసిద్ధి. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనువైన ప్రాంతంగా గట్టు మండలం ఈ నియోజకవర్గంలో ఉంది. -
‘ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్ కర్మ’
సాక్షి, గద్వాల: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్మ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం గద్వాలలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. గద్వాల ప్రజల ఉత్సాహం చూస్తుంటే కేసీఆర్ ఓటమి ఖాయంగా కనిపిస్తోందని జోస్యం చెప్పారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే నాకేంటన్న కేసీఆర్‌కు 20 రోజుల్లోనే భయం పట్టుకుందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం గజదొంగల్లా తెలంగాణను దోచుకుంటుందని.. వారిని తరిమి కొట్టడానికి ప్రజాసంఘాలు, ప్రజలు, అన్ని పక్షాలు కలిసి రావాలని కోరారు. కేసీఆర్ నంబర్ వన్ తెలంగాణ ద్రోహి అని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, లక్ష ఉద్యోగాలు ఇలా ప్రతి విషయంలో కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి ఎజెంట్.. మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు కేసీఆర్ మద్దతు తెలిపారు. నిజామాబాద్ సభలో ఇతరులపై నోరు పారేసుకున్నారు. తెలంగాణ ద్రోహులందరిని కేసీఆర్ పక్కకు పెట్టుకున్నారు. నేను పాకిస్తాన్, చైనా బార్డర్లో పనిచేసిన సమయంలో దుబాయ్ బ్రోకర్‌గా పనిచేసిన కేసీఆర్ నా గురించి మాట్లాడుతున్నావా?. రాబోయే కాంగ్రెస్ పాలనలో ఒకేసారి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. కేంద్రం ఇచ్చే మద్దతు ధరకు మరింత బోనస్ కలిపి పంటలను కొనుగోలు చేస్తాం. మొదటి సంవత్సరమే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. పది లక్షల మందికి నెలకు 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తాం. ప్రైవేట్ కాలేజ్‌ల్లో చదివేవారికి పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తామ’ని తెలిపారు. కేసీఆర్‌ది శృంగారం.. మాదీ వ్యభిచారామా? డీకే అరుణ మాట్లాడుతూ.. చంద్రబాబుతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటే తప్పులేదు కానీ.. కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ది శృంగారం.. మాదీ వ్యభిచారామా అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని విజయశాంతి పార్టీలో చేరారు కానీ.. టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాని చెప్పిన కేసీఆర్ మాత్రం మాట మార్చరని మండిపడ్డారు. పాలమూరు నుంచి ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ పార్లమెంటులో ఒక్కసారైనా ఆర్డీఎస్ గురించి మాట్లాడలేదని తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ గురించి చర్చ జరిగనప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను అన్నింటా మోసం చేసిన కేసీఆర్ కులాల మధ్య చిచ్చు పెట్టాడని విమర్శించారు. చేసిన అవినీతిని బయటపడకుండా ఉండేందుకు కేసీఆర్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని ఆరోపించారు. -
జూరాల నుంచే ‘గట్టు’ ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఆధారం చేసుకొని గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నీటిని తీసుకుంటూ ఈ పథకాన్ని చేపట్టాలని మొదట నిర్ణయించగా, ప్రస్తుతం నేరుగా జూరాల నుంచే తీసుకునే దిశగా తుది ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల నేపథ్యంలో జూరాల నుంచి నేరుగా తీసుకునేలా అధికారులు కొత్త ప్రతిపాదన రూపొందించారు. ఈ నేపథ్యంలో అంచనా వ్యయం రూ.553.98 కోట్ల నుంచి రూ.1,597 కోట్లకు చేరుతోంది. 4 టీఎంసీలతో రిజర్వాయర్.. గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు ఈ ఏడాది జూన్ 29న సీఎం ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. దీన్ని రెండు విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడత రూ.459.05 కోట్లు, రెండో విడతను రూ.94.93 కోట్లకు ప్రతిపాదించారు. అయితే, గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాన్ని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే, 4 టీఎంసీల మేర నీటిని రేలంపాడ్‌కు బదులుగా నేరుగా జూరాల ఫోర్‌షోర్ నుంచి తీసుకుంటేనే ప్రయోజనం ఎక్కువని శంకుస్థాపన సమయంలోనే ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా అధికారులు అధ్యయనం చేశారు. అనంతరం జూరాల నుంచే నేరుగా నీటిని తీసుకునేలా ప్రతిపాదించారు. దీనికోసం కొత్తగా 4 టీఎంసీల సామర్థ్యంతో గట్టు రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. జూరాల నుంచి నేరుగా 50 రోజులపాటు 926 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా పథకాన్ని రూపొందించారు. కొత్తగా నిర్మించే రిజర్వాయర్ పొడవు 8 కిలోమీటర్లు ఉండనుంది.ఈ మట్టికట్ట నిర్మాణానికి రూ.396.60 కోట్లు ఖర్చు కానుంది. రెండు పంపులను ఉపయోగించి జూరాల నుంచి గట్టు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. పంప్‌హౌస్‌ల నిర్మాణానికి మరో రూ.90 కోట్లు అవసరమవుతుంది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో మొత్తం 3,825 ఎకరాల మేర ముంపునకు గురికానుంది. ఎకరాకు రూ.6 లక్షల పరిహారం చొప్పున లెక్కగట్టగా భూసేకరణకే రూ.231 కోట్లు అవసరమవుతున్నాయి. ఈ పథకానికి రూ.1,597 కోట్లతో తుది అంచనాలు సిద్ధమయ్యాయి. ఇక టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. -
మోదీ నాలుగేళ్లలో ముస్లింలకు ఏం చేశారు
గద్వాల జిల్లా : బీజేపీ ప్రవేశ పెట్టిన త్రిబుల్ తలాక్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలపడం శోచనీయమని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం వైఎస్సార్ చౌరస్తాలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ..త్రిబుల్ తలాక్ గురించి మాట్లాడుతున్న మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముస్లిం మహిళలకు గడచిన నాలుగేళ్లలో చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లింకు కూడా తన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సబ్ కా వికాస్ అని ఎలా నినదిస్తారని సూటిగా అడిగారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ముస్లిం మైనారిటీల కోసం ఎక్కువ నిధులు కేటాయించిందని, దాని ఫలితంగా నేడు వేల మంది ముస్లిం విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు తమ స్వార్థ రాజకీయాల కోసం ముస్లింలను వాడుకుంటున్నాయని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల మద్దతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. అరవై ఏళ్లుగా ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతునిస్తూ వచ్చినా ప్రయోజనం జరగలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవధ పేరిట ముస్లింలను హింసిస్తున్నారని అన్నారు. చట్ట సభల్లో, ఉద్యోగాల్లో ముస్లిం జనాభా దామాషాలో ప్రాతినిధ్యం లేదని వివరించారు. -
గద్వాల సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు
-
గద్వల్ ఎత్తిపోతల పథకం కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు
-
29న గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన
సాక్షి, గద్వాల: ఈనెల 29న గట్టు ఎత్తిపోతల పథకానికి గట్టు మండలం పెంచికల పాడు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గతంలోనే శంకుస్థాపన చేశామని కొందరు కాంగ్రెస్ నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 29న జోగుళాంబ గద్వాల జిల్లాకు రానున్న నేపథ్యంలో మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి పర్యటించారు. సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న స్థలంతో పాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు, గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో తుమ్మిళ్ల పనులను పరిశీలించిన అనంతరం హరీశ్ రావు విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు సర్వేల పేరుతో పాలమూరు ఎత్తిపోతల, డిండీ, గట్టు ఎత్తిపోతల పథకాలను కాలయాపన చేస్తూ మోసం చేశారని ఆరోపించారు. అయితే, ఇచ్చిన మాట ప్రకారం పనులను పూర్తి చేసి ప్రజలకు ఫలాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆగస్టు 15 నాటికి: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు 15వ తేదీ నాటికి మొదటి మోటార్ ద్వారా ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హరీశ్ అన్నారు. ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందేదని ప్రస్తుతం 15 వేల ఎకరాలకు పడిపోయిందని, గత ప్రభుత్వాలు ఎవ్వరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రస్తుతం రూ.554 కోట్లతో 33 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేయడానికి వస్తుంటే గౌరవంగా ఆహ్వానించేది పోయి, ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అంతకు ముందు తుమ్మిళ్ల పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డేంజర్ జోన్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా ఓట్లు కురిపించే పథకాలకు మరింత పదును పెడుతోంది. తద్వారా గులాబీ పార్టీకి ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, వారి అనుచరులు వ్యవహరించే తీరు మైనస్‌గా మారుతోందని గుర్తించారు. అంతర్గత సర్వేల ద్వారా ఇవి బయట పడుతుండడంతో అధికార పార్టీలో గుబులు రేపుతోంది. పాలమూరు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల్లో సగంమంది డేంజర్ జోన్లో ఉన్నారని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ కొద్ది మందిని స్వయంగా గులాబీ దళపతి సుతిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం. ఇకనైనా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. ఏడు నుంచి తొమ్మిది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ రానున్న సాధారణ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రమంతా గులాబీ పార్టీకి సానుకూల పవనాలు బలంగా వీచినా ఒక పార్లమెంంట్, ఏడు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలుపొందిన నారాయణపేట ఎస్.రాజేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలం తొమ్మిదికి చేరింది. పనితీరుపై ఆరా ఇంతకాలం ఎమ్మెల్యే పనితీరుపై పెద్దగా దృష్టి సారించని సీఎం కేసీఆర్ ఇటీవల తరచుగా అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లు తెలిసింది.. ఇప్పటికే పలు సర్వేల ఫలితాలను కూడా బహిర్గతం చేశారు. తాజాగా చేయించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేల పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నట్లు తేలిందని సమాచారం. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ముగ్గురి పరిస్థితి ‘డేంజర్ జోన్’లో ఉన్నట్లు గుర్తించారని చెబుతున్నారు. డేంజర్ జోన్ ఉన్నట్లు చెబుతున్న ఓ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు తన నియోజకవర్గ కేంద్రంలో కేవలం ఒక్కసారి మాత్రమే రాత్రివేళ విడిది చేశారట. ఇలాంటి పరిస్థితులో నియోజకవర్గ ప్రజలు ఎలా విశ్వసిస్తారని సీఎం కేసీఆర్ గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఇదే మాదిరిగా మిగతా ఎమ్మెల్యేల బలహీనతలను స్వయంగా సీఎం కేసీఆర్ వారికే నేరుగా చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, మెజార్టీ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల సాను కూలత వ్యక్తమైందని సర్వేల్లో వెల్లడవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా రానున్న ఎన్నికల్లో పాల మూరు ప్రాంతంలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను దాదాపు క్లీన్ స్వీప్ చేయాలని అధినేత భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకోసం రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు ఉమ్మడి పాలమూరు పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపుతున్న వైనా న్ని ప్రస్తావిస్తున్నారు. అయితే పార్టీకి సానుకూల పవనాలు బలంగా ఉన్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల పనితీరు పార్టీకి ముప్పుగా మారే ప్రమాదం ఉం దని సర్వేల ద్వారా వెల్లడైందట. చాలా మంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడకపోతే ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు ఎంచుకోవాలనే యోచనలోగులాబీ బాస్ ఉన్నట్లు సమాచా రం. ఇప్పటికే రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతల తో పాటు ద్వితీయశ్రేణి నాయకులు భారీ సంఖ్య లో కారె క్కారు. పార్టీ తరఫున ఎవరిని నిలి పితే విజయం తథ్యమనే దిశగా పార్టీ అధిష్టానం యో చిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. -
యువకుడి ప్రాణం కాపాడిన వాట్సప్ పోస్టు
గద్వాల అర్బన్: ప్రేమ విఫలమైందని మనస్థాపానికి చెందిన ఓ యువకుడు చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.. హైదరాబాద్ నుంచి కర్నూల్ రైలు ఎక్కి స్నేహితులకు వాట్సప్ ద్వారా ‘‘ఐ మిస్ యూ’’ అంటూ ఫొటో మెసేజ్ పంపించి ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకున్నాడు.. అనుమానించిన స్నేహితులు కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులకు సమాచారం అందజేసి రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే తేరుకున్న రైల్వే పోలీసులు ఆ యువకుడిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన సంఘటన ఆదివారం రాత్రి గద్వాల పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా.. కర్నూల్ పట్టణానికి చెందిన మణిరత్నంకు తల్లిదండ్రులు లేరు. మామ దగ్గర పెరిగాడు. ఉపాధి నిమిత్తం బావ సురేష్ వద్ద ఉంటూ.. హైదరాబాద్‌లో ఓల్వా క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాడు. ఆమె ఇటీవలే వివాహం చేసుకొని వెళ్లిపోయింది. మనస్థాపానికి గురై చనిపోవాలనుకున్నాడు. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో కాచిగూడలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. అనంతరం సెల్ఫీ దిగి ‘‘ఐ మిస్ యూ’ అంటూ స్నేహితులకు వాట్సప్ ద్వారా పోస్ట్ చేశాడు. స్నేహితుల సమాచారం మేరకు.. ఏదో జరుగుతుందని అనుమానించిన స్నేహితులు మణిరత్నం బావ సురేష్‌కు సమాచారం అందజేశారు. వెంటనే వీరందరూ కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే పోలీసులకు విషయం చెప్పారు. దీంతో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల పోలీసులను రంగంలోకి దింపారు. చివరకు రాత్రి 11గంటల సమయంలో గద్వాలకు చేరుకున్న రైలులో గద్వాల పోలీసులు వాట్సప్‌లో వచ్చిన ఫొటో ఆధారంగా యువకుడిని గుర్తించి ఆధీనంలోకి పెట్టుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అర్ధరాత్రి గద్వాలకు చేరుకున్నారు. మానసికంగా కృంగిపోయిన యువకుడికి పోలీసులు సుమారు రెండుగంటల వరకు కౌన్సిలింగ్ ఇచ్చి తెల్లవారుజామున కర్నూల్‌కు పంపించారు. యువకుడిని కాపాడిన గద్వాల రైల్వే పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల గొడవ
-
ఊరించిన సద్దిబువ్వ
గద్వాల వ్యవసాయం : పంటలు చేతికొచ్చాయి. గ్రామీణ ప్రాంతాలనుంచి పంట ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్ యార్డులకు వస్తున్న రైతులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉదయం 9గంటలకే యార్డులకు వెళ్లి సాయంత్రం దాకా కాంట పూర్తయ్యే వరకు తిండితిప్పలు లేకుండా ఉంటున్నారు. మార్కెట్ యార్డులకు వచ్చే రైతుల కోసం ప్రభుత్వం ‘సద్దిబువ్వ మూట’ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.5కే భోజనాన్ని అందిస్తామని ఏడాదిన్నర క్రితం ప్రకటించింది. కానీ ఆ మాటను మరిచిపోవడంతో నిత్యం అన్నదాతలు పస్తులుండాల్సి వస్తోంది. పొద్దూకులూ మార్కెట్లోనే.. పంట ఉత్పత్తులను విక్రయించేందుకు రైతులు ఉదయం 8గంటల నుంచే యార్డులకు వస్తుంటారు. తీసుకొచ్చిన ధానాన్ని యార్డుల్లో రాశులుగా పోసి పొద్దస్తమానం వాటికి కాపలాగా అక్కడే ఉంటారు. 11 గంటల ప్రాంతంలో వ్యాపారులు ధాన్యాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత ధరలు కోడ్ చేస్తారు. 1:30 గంటల తర్వాత టెండర్ ప్రక్రియ ముగిసి అప్పుడు రైతులకు తమ పంట ఉత్పత్తులకు వచ్చిన ధరలు తెలుస్తాయి. ఇక్కడితో పని అయిపోదు. టెండర్ తర్వాత హమాలీలు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత కాంట వేస్తారు. దాదాపు 3:30 గంటల వరకు ఈ తంతు జరుగుతుంది. కాంట పూర్తయి అక్కడి నుంచి ధాన్యం వెళ్లే వరకు రైతులు అక్కడే ఉంటారు. దాదాపు సాయంత్రం 4గంటల వరకు తిండి తిప్పలు లేకుండా ఉంటారు. కళ్లు కాయలు కాచేలా.. పంట ఉత్పత్తులకు సరైన ధర వస్తుందా.. రాదా అని ఆలోచించుకుంటూ పంటను కాపాడుకుంటూ అక్కడే ఉంటారు. టెండర్ పూర్తయినా కాంట కాదు కాబట్టి ఎవైనా జంతువులు వచ్చి పంటను తినేస్తాయేమోనన్న భయ ఒకపక్క.. ఎవరైన ధాన్యాన్ని తస్కరిస్తారన్న భయం మరోపక్క వారిని కళ్లకు కనుకు లేకుండా చేస్తుంది. కనీసం నీళ్ళు తాగి రావాల్సి వచ్చినా తోటి రైతులకు కొంచెం సేపు చూడమని చెప్పి వెళ్తుంటారు. ఇలా సాయంత్రం వరకు ఆకలి దప్పులకు ఓర్చి పంట ఉత్పత్తులను కాపాడుకుంటూ మార్కెట్లోనే కూర్చుంటారు. ‘మూట’ మాట ఏమైనట్టు? రైతుల అవస్థలు గుర్తించిన ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ‘సద్దిబువ్వ మూట’ పేరుతో రూ.5కే భోజన పథకాన్ని ప్రకటించింది. అందులో భాగంగా పథకం నిర్వహణ బాధ్యతలను రెండు స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ప్లేటు భోజనం తయారీ ఖర్చులో రూ.5 సంబంధిత మార్కెట్ కమిటీ తన వాటా కింద చెల్లించాలి. మిగతా ఖర్చులను ఆ స్వచ్ఛంద సంస్థ భరించాల్సి ఉంటుంది. రైతుకు మాత్రం రూ.5కే భోజనం పెట్టాలి. ఏ రోజుకు ఆ రోజు యార్డులకు పంట ఉత్పత్తులను విక్రయించేదుకు వచ్చిన ప్రతి రైతుకు భోజనం అందించాల్సి ఉంటుంది. అయితే ఇంత వరకు ఆ సంస్థలు ఎక్కడా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ప్రభుత్వం సద్దిబువ్వ మూటను నీటిమూటగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం పెడితే బాగుంటది మార్కెట్ యార్డులకు రైతులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. కొందరు మాత్రమే భోజనం తెచ్చుకుంటారు. తెల్లవారుజామున బయల్దేరిన చాలా మందికి తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం ప్రక టించిన విధంగా రూ.5లకే భోజనం అందిస్తే బాగుంటది. ఆదేశాలు రాలేదు సద్దిబువ్వ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు అమలు చేసేందుకు విదివిధానాలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. -
ప్రేమ విఫలం : లైవ్‌లో ఆత్మహత్య
సాక్షి, గద్వాల : ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. లైవ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి మండలం జక్కేరెడ్డి పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ యువతి నిరాకరించడంతో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహేందర్ ఓ పురుగుల మందుల కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. -
రైతుల్ని ముంచిన నకిలీ విత్తనాలు
మల్దకల్ (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలానికి ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి చెరువులు, కుంటలకు నీరు సరఫరా అవుతోంది. దీంతో తాటికుంట, నాగర్‌దొడ్డి రిజర్వాయర్లతోపాటు గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు, వ్యవసాయ బోరు బావుల వద్ద రైతులు రబీలోనూ వరి పంటలు వేల ఎకరాల్లో సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు కాపు వచ్చినా గింజ పట్టక తాలు రావడంతో పంటలు సాగు చేసిన రైతులు నట్టేట మునిగిపోయామంటూ లబోదిబోమంటున్నారు. మండలంలోని ఉలిగేపల్లికి చెందిన రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో తులసి, ధనలక్ష్మి, వినాయక, ఓంకార్, టాటా, ధర్మరాజ్ పల్లి కంపెనీకి చెందిన ఆర్ఎన్ఆర్ 15048 రకం వరి విత్తనాలతో నాటు వేశారు. 25 కిలోల వరి విత్తనాల ప్యాకెట్ రూ.850 నుంచి రూ.900 వరకు వెచ్చించి గద్వాల, రాయచూరు పట్టణ ప్రాంతాల్లోని డీలర్ల వద్ద కొనుగోలు చేశారు. పంట సాగు కోసం ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టినా ఆశించిన మేరకు వరి పంట రాకపోవడంతోపాటు, వరి గింజలు పట్టక తాలుపోయింది. దీంతో వరి పంటలు సాగు చేసిన రైతులు చిన్న సవారన్న, తిమ్మారెడ్డి, తిమ్మప్ప, జైపాల్, లక్ష్మన్న, రాములతోపాటు మరో 80 మందికి పైగా రైతులు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాధిత రైతులు మండల వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల వ్యవసాయాధికారిణి శ్రీలత బుధవారం గ్రామానికి వెళ్లి వరి పంటలను పరిశీలించారు. పంటకాలం పూర్తికావస్తున్నా గింజలు పట్టకుండా తాలుపోవడంతో తమ పరిస్థితి ఏమిటని రై తులు ప్రశ్నించారు. వరి నాటు పెట్టి ఐదు నెలలు కావొస్తుందని, గింజలు పట్టక మొత్తం తాలు గింజలు పట్టినట్లు రైతులకు ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన తమకు కంపెనీలు నకిలీ వరి విత్తనాలను అంటగట్టారని, వరి పంటలకు కంపెనీలే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు వివరిస్తాం.. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పంటలను పరిశీలించామని, వరికి ఇంత వరకు గింజ పట్టక తాలుపోయిందన్నారు. ఈ విషయమై శాస్త్రవేత్తలకు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఇదిలా ఉండగా గతంలో కూడా మల్దకల్ మండలంలోని బిజ్వారం, కుర్తిరావుల్‌చెర్వు గ్రామాల రైతులకు నకిలీ మిరప విత్తనాలు అంటగట్టడంతో రైతులు తీవ్రం గా నష్టపోయారు. దీనిపై అప్పట్లో రైతులు కలెక్టర్ రజత్‌కుమార్‌సైనికి ఫిర్యాదు చేయగా, కంపెనీ అధికారులు పంట పొలాలను పరిశీలించినా ఫలితం లేకపోవడంతో నకిలీ మిరప పంటలను రైతులు స్వచ్ఛందంగా తొలగించారు. ప్రస్తుతం నష్టపోయిన రైతులకైనా నష్టపరిహారం కంపెనీ నిర్వాహకులు చెల్లిస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే. పంటలను పరిశీలిస్తాం : డీఏఓ ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌నాయక్ స్పందిస్తూ ఉలిగేపల్లి రైతులతోపాటు కేటీదొడ్డి, గట్టు మండలాలకు చెందిన రైతులు కూడా ఫిర్యాదు చేశారన్నారు. వారి ఫిర్యాదు మేరకు బుధవారం శాస్త్రవేత్తలతో మాట్లాడి వారికి లేఖ రాశామన్నారు. వారు పంటలను పరిశీలించిన అనం తరం ఏ విషయమనేది తెలుస్తుందని ఆయన చెప్పారు. -
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ డ్రైవర్ ఆత్మహత్య
గద్వాల క్రైం: పురుగు మందు తాగి ఓ కారు డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం చోటుచేసుకుంది. గద్వాల సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పెంట్లవెల్లి మండలం కొండూరుకు చెందిన చుక్క రామన్‌గౌడ్ కుమారుడు కుర్మయ్యగౌడ్(26) గత నాలుగేళ్ల నుంచి గద్వాలలోని పత్తి మిల్లు యజమాని చంద్రశేఖర్‌రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల చంద్రశేఖర్‌రెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కావడంతో ఆమె కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం మధ్యాహ్నం మార్కెట్ కార్యాలయంలోని ఓ గదిలో పురుగు మందు తాగాడు. అనంతరం గదిలో నుంచి బయటికి వస్తున్న క్రమంలో కార్యాలయం ముందు కిందపడ్డాడు. గమనించిన స్థానికులు ఆరా తీయగా పురుగుమందు తాగినట్లు వివరించాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తె లుసుకున్న చంద్రశేఖర్‌రెడ్డి, చైర్మన్ లక్ష్మీదేవ మ్మ అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. అయితే ఈ యన ఆత్మహత్యకు గల కారణాలు తెలి యాల్సి ఉంది.ఈ ఘటనపై కుర్మయ్యగౌడ్ తండ్రి రామన్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గద్వాలలో కలకలం.. మార్కెట్ చైర్మన్ డ్రైవర్ కుర్మయ్యగౌడ్ మార్కెట్ కార్యాలయంలో పురుగు మందు తాగి మృతి చెందడంతో గద్వాలలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పలువురు మార్కెట్ కమీషన్‌దారులు, కూలీలు, సిబ్బంది కలత చెందారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
ఆటోలో 20మంది.. డ్రైవర్ కాలికి చుట్టుకున్న పాము
సాక్షి, జోగులాంబ : గద్వాల జిల్లా అలంపూర్ మండలం, సింగవరం గ్రామం సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈప్రమాదంలో పది మంది విద్యార్థులు గాయాలయ్యాయి. సింగవరం గ్రామం నుంచి 20 మంది విద్యార్థులతో ఓ ఆటో మండల కేంద్రం అలంపూర్ బయలుదేరింది. మార్గ మధ్యలో ఓ పాము ఎక్కడ నుంచి వచ్చిందో తెలీదు కానీ ఆటో డ్రైవర్ కాలికి చుట్టుకుంది. దీంతో డ్రైవర్ భయానికి గురయ్యాడు, ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే బాధితులను చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్ధుల గురించి ఆందోళన అవసరం లేదని, స్వల్పగాయలు తగిలాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. -
పని చేయని ఈ-పంచాయతీలు..
గద్వాల రూరల్: ఈ–పంచాయతీలంటూ ఎంతో గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినా ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదు. రెండేళ్ల క్రితం పంచాయతీ కార్యాలయాలకు కంప్యూటర్లు పంపిణీ చేసినా ఇంటర్నెట్ సౌకర్యం, ఆపరేటర్ల కొరత కారణంగా అవి మూలన పడ్డాయి. కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన సామగ్రి లేకపోవడం గమనార్హం. దీంతో గ్రామపంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు అన్ని సేవలు ప్రజల ముంగిట నిలపాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. జిల్లాలోని 195 గ్రామ పంచాయతీలకుగాను 118చోట్ల మూడేళ్ల క్రితం ఈ–పంచాయతీ సేవలు ప్రారంభించారు. ఒక్కో గ్రామపంచాయతీకి అప్పట్లో రూ.40వేలు విలువజేసే కంప్యూటర్ మానిటర్, యూపీఎస్, టేబుల్ తదితర పరికాలను అందించారు. ఆయా గ్రామాల్లో ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం కేవలం మండల స్థాయిలోనే 12చోట్ల కొనసాగుతోంది. రెండేళ్లపాటు కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించగా కాంట్రాక్టు పూర్తి కావడంతో సంబంధిత కంపెనీ ఈ–సేవల నుంచి తప్పుకొంది. అనంతరం ప్రభుత్వం గ్రామపంచాయతీల నిధుల నుంచి మండలస్థాయిలో ఆపరేటర్లకు వేతనాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 10శాతం వేతనం రూపంలో వివిధ దశల్లో గ్రామపంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. మరోవైపు పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా ఈ–సేవలపై మాత్రం దృష్టి సారించడం లేదు. రెండు గ్రామ పంచాయతీలను క్లస్టర్‌గా ఏర్పరచి మండలానికి ముగ్గురు చొప్పున ఆపరేటర్లు ఉండాలని సూచించింది. 12రకాల సేవలు అందించాలి ఈ–పంచాయతీల్లో భాగంగా ఇంటిపన్ను, ఆస్తి వివరాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ వ్యయాలు, నీటి పథకాలు, కొళాయి కనెక్షన్లు, వీధిదీపాలు, వనరులు, అక్షరాస్యత శాతం, ఇంటి పన్నుల వసూళ్లు, బకాయిల వివరాలు అన్నీ కంప్యూటర్లోనే నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. అంతేకాక సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడంతోపాటు 12రకాల సేవలను అందించాలి. అయితే కేవలం మండల పరిషత్ కార్యాలయాల్లోనే కంప్యూటర్లు వినియోగంలో ఉండగా గ్రామాల్లో మూలకు చేరాయి. చాలా గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో పంపిణీ చేసిన కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. మండలం కేంద్రాల్లో కొనసాగుతున్న ఈ–పంచాయతీల సేవలతోపాటు స్వచ్ఛభారత్, ఆసరా పింఛన్లు, హరితహారం, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన జాబితాల తయారీలో ఆపరేటర్లు బిజీగా ఉన్నారు. దీంతో తమకు పని తలకు మించిన భారమవుతోందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. చాలా ఇబ్బందిగా మారింది నాకు మూడు గ్రామ పంచాయతీలు అప్పగించారు. ఎందులోనూ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో నిధులు, లావాదేవీలు, పింఛన్లు, నీటి, ఇంటి పన్ను బకాయిలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిసారి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. – సురేష్, పంచాయతీ కార్యదర్శి, గోనుపాడు, గద్వాల మండలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతోపాటు ఆపరేటర్ల సమస్య కారణంగా కంప్యూటర్లు వృథాగా ఉన్నది వాస్తవమే. చాలా గ్రామాల్లో బీఎస్ఎన్ఎస్ బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – కృష్ణ, డీపీఓ, గద్వాల -
ఆలయాల్లో పునఃదర్శనం
అలంపూర్ రూరల్ : జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయంలో గురువారం ఉదయం భక్తులను దర్శనానికి అనుమతించారు. బుధవారం సాయంత్రం చంద్రగ్రహణం ఉండడంతో అర్చకులు ఆలయాలను మూసి ఉంచారు. గురువారం ఉదయం 5:30 గంటల నుంచి ఆలయ శుద్ధి చేపట్టారు. ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. మహాసంప్రోక్షణ అనంతరం 10గంటల తర్వాత భక్తులను అనుమతించారు. నాగకన్యల బావి నుంచి జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర సేవాసమితి అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో శివస్వాములు 108 బిందెలతో ఇటీవల ప్రతిష్టించిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి నమూన విగ్రహాలను అభిషేకించారు. ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్‌శర్మ, వనం శ్రీకాంత్ శర్మ, జానకిరామ శర్మ, శ్రీనివాస శర్మ , ధనుంజయ శర్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీను, శేఖర్ పాల్గొన్నారు. -
మృత్యువే గెలిచింది!
ధరూరు (గద్వాల): పత్తి మిల్లులో రాత్రి షిఫ్టు పనులకు వెళ్లి తిరిగి వస్తూ.. గత సోమవారం తెల్లవారుజామున గద్వాల మండలం గోనుపాడు శివారులోని పారుచర్ల స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం సంఘటన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 9మంది పరిస్థితి విషమంగా ఉండగా కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రమేష్(18), నరేష్(17) మృతిచెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది. కోలుకుంటారని కోటి ఆశలతో ఎదురుచూసిన ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. ఈ సంఘటనతో చిన్నపాడు గ్రామం ఇంకా కోలుకోలేకపోతోంది. ఎవరి నోట విన్నా ఈ సంఘటన గురించే చర్చించుకోవడం కనిపిస్తుంది. బడి మానేసి పనులకు.. గ్రామానికి చెందిన కర్రె కొండన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొండన్నకు పెళ్లి కాగా చెందిన రెండో కుమారుడు రమేష్(18) ఉన్నాడు. ఈయన తల్లి గత కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన ఎంకన్న, ముణెమ్మ దంపతులకు మొత్తం నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమా ర్తె. మృతి చెందిన నరేష్(17) రెండోవాడు. నరేష్ ధరూ రు ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ బీసీ హాస్టల్లో ఉండేవాడు. ఏడో తరగతి వరకు చదివిన నరేష్ కుటుం బ ఆర్థిక పరిస్థితులతో బడిమానేసి పనులకు వెళ్లాడు. చదువు అలాగే కొనసాగినా ఇలా పనులకు వెళ్లి మృత్యువాత పడేవాడు కాదని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు. ఈ రెండు కుటుంబాల రో దనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఓ తండ్రి.. ఇద్దరు కుమారులు
గద్వాల క్రైం: ఓ తండ్రి.. ఇద్దరు కుమారులు.. ఇదేదో కొత్త సినిమా పేరు అనుకుంటున్నారా.. కాదండి బాబు.. వీరు ముగ్గురు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చోరీలకు పాల్పడిన దొంగలు.. బుద్దిగా చదువుకోవాలని చెప్పాల్సిన కన్నతండ్రే.. తన ఇద్దరు కుమారులను దొంగతనాల వైపు దారిమళ్లించాడు. మరో వ్యక్తితో కలిసి ఎవరూ లేని ఇళ్లనే వారికి ఉపాధి బాటలుగా మార్చుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు చోరీలు చేసి చివరకు దొంగిలించిన ఓ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులకు చిక్కి జైలో ఊచలు లెక్కించాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సోమవారం పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. కిరాణ దుకాణంలో.. గద్వాల పట్టణ శివారులోని దౌదర్పల్లి కాలనీకి చెందిన తెలుగు తిమ్మప్ప తమ కుమారులైన జయంత్(18), చిన్న కుమారుడు(12)తోపాటు మల్దకల్ మండలం, పావనంపల్లి గ్రామానికి చెందిన తెలుగు శ్రీనివాస్‌లు ముఠాగా ఏర్పడి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడ్డారు. గత నెల 23వ తేదీన గద్వాలలోని వెంకటరమణకాలనీలో మల్లప్ప అనే వ్యక్తి తన ఇంటి వద్దనే ఓ కిరాణం ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కిరాణం సరుకుల కోసం మల్లప్ప పట్టణంలోని ఓ షాపునకు వెళ్లాడు.. కిరాణంలో మల్లప్ప భార్య మాత్రమే ఉండడం గమనించిన నిందితులు తిమ్మప్ప తన చిన్న కుమారుడికి రూ.5 ఇచ్చి కిరాణంలో మహిళతో మాట్లాడుతూ తినుబంఢారాలు తింటూ ఉండి.. మేము కూత వేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు జయంత్‌ను ఇంట్లోకి పంపించి బీరువాలో ఉన్న తులంన్నర బంగారు, 13 తులాల వెండి, సెల్‌ఫోన్‌ను అపహరించారు. సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా బాధితుల సెల్‌ఫోన్ నుంచి వివిధ వ్యక్తులకు ఫోన్ చేసినట్లు గుర్తించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సోమవారం ఉదయం దౌదర్పల్లి వద్ద వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ద్విచక్రవాహనాలు సైతం.. అయితే గత రెండేళ్ల క్రితం మన్యంకొండ, రాయిచూర్, మదనాపురం ప్రాంతాల్లో బస్టాండ్ల వద్ద నిలిపిన నాలుగు ద్విచక్రవాహనాలను సైతం అపహరించినట్లు విచారణలో పేర్కొన్నారు. వీరిపై వివిధ పోలీసు స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. చోరీ చేసిన సొమ్మును తక్కువ ధరకు విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవారు. దౌదర్‌పల్లిలో సైతం బీసన్న అనే వ్యక్తి ఇంట్లో వీరు చోరీకి పాల్పడ్డారు. ఎట్టకేలకు నిందితులను సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 ద్విచక్రవాహనాలు, 13 తులాల వెండి, తులంన్నర బంగారం స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ శ్రీనివాస్, సీసీ పుటేజీ సిబ్బంది చంద్రయ్య, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీ బతుకులు
-
ఏఎస్ఐ హసన్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, గద్వాల : మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న గద్వాల ఏఎస్ఐ హసన్‌పై సస్పెన్ష్ వేటు పడింది. ఏఆర్ ఏఎస్ఐ హసన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. ఏఎస్ఐ హసన్...ఓ మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న వీడియో బయటకు రావడంతో జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. జిల్లా సాయుధ రిజర్వు పోలీసు కార్యాలయంలో సిబ్బంది విశ్రాంతి గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా హోంగార్డ్‌తో ఏఎస్ఐ వ్యక్తిగత సేవలు చేయించుకున్నాడు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వెలుగుచూసింది. -
ఇద్దరు కలెక్టర్లు, ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
సాక్షి, మహబూబ్ననగర్: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో రూ.100 కోట్లు, గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీలో రూ.81 లక్షల మేర అవినీతి జరిగిందంటూ న్యాయవాది ప్రవీణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో గద్వాల్ పోలీస్ స్టేషన్లో తహసీల్దార్ ఫిర్యాదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గద్వాల కలెక్టర్ రంజిత్ కుమార్, ఎస్పీ విజయ్‌కుమార్, మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, దీనిని ఎందుకు జాప్యం చేస్తోందంటూ ఏసీబీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్‌ను ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. -
నిజాలు చెప్పిన మొగులయ్య!
గద్వాల క్రైం: రికార్డులలో లేని వ్యవసాయ భూములను ఎలా రెవెన్యూ పరిధిలోకి తేవాలి.. ఇందుకు సంబంధించి అధికారుల ఫోర్జరీ సంతకాలు.. స్టాంప్‌ల తయారీలో నిపుణుడైన వ్యక్తులను అన్వేషించి.. చివరికి నకిలీ పాసు పుస్తకాలను తయారు చేయించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని నిజాలు కక్కించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గద్వాల జిల్లా డీఎస్పీ బాలకోటి వెల్లడి ంచారు. కేటీదొడ్డి మండలం మల్లాపురం గ్రామానికి చెందిన మొగులయ్య రాయిచూర్ జిల్లా మోచివాడకు చెందిన రాజశేఖర్ వద్ద ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లో నకిలీ పాసు పుస్తకాలు, అధికారుల సంతకాలతో కూడిన రబ్బర్ స్టాంప్‌లను తయారు చేయించేవారు. ఇలా తయారు చేసిన నకిలీ పాసు పుస్తకాలను తాను ఏర్పాటు చేసుకున్న కొంతమంది దళారుల నుంచి వీటిని వివిధ వ్యక్తులకు అందించారు. కస్టడీలో భాగంగా మొగులయ్య నుంచి భూమి చట్టాలపై మీ ప్రశ్నలు.. మా సమాధానాలు, భూ రికార్డుల కరదీపిక, భూ సంబంధిత శాసనాలు అనే రెవెన్యూ చట్టాల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వాటిని అధ్యయనం చేసి వాటిలో ఉన్న లోసగుల ద్వారా ప్రభుత్వ భూములకు, వ్యవసాయ భూములు లేని వ్యక్తులకు నకిలీ పాసు పుస్తకాలు అందించేవారు. ఇక నకిలీ పాసు పుస్తకాలతో వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో రూ.వంద కోట్ల మేర రుణాలు పొందారు. మొగులయ్య సైతం రూ.30 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందినట్లు వివరించారు. అయితే నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంలో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసి.. వారి నుంచి 6,500 వేల నకిలీ పాసు బుక్‌లు, ఆర్ఓఆర్, పహాణీ తదితర వాటిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో.. కోర్టులో లొంగిపోయిన నకిలీ పాసు పుస్తకాల ప్రధాన సూత్రధారి మొగులయ్యను కోర్టు అనుమతి తీసుకుని కేటీదొడ్డి, గట్టు, ధరూరు, అయిజ, రాయిచూర్ తదితర ప్రాంతాల్లో విచారణ చేశారు. తాను రాయిచూర్ జిల్లా మోచివాడ ప్రింటింగ్ ప్రెస్ రాజశేఖర్, వసంతకుమార్ సాయంతో నకిలీ పాసు పుస్తకాలను తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలను రాయిచూర్‌కు పంపించి రాజశేఖర్‌ను అరెస్టు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. ఇక వివిధ మండలాల్లో సైతం విచారణ చేయగా పలువురు వ్యక్తుల వద్ద నకిలీ పాసు పుస్తకాలు ఉన్నట్లు తేలిందన్నారు. మొగులయ్య చెప్పిన వివరాల మేరకు ఇందులో ప్రముఖులు, రెవెన్యూ, బ్యాంకు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు ఉన్నట్లు సమాచా రం. త్వరలో అందరిని అరెస్ట్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రైలు కిందపడి ఇద్దరి దుర్మరణం
గద్వాల: రైలు కిందపడి మతిస్థిమితం లేని ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున గద్వాలలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వెంకంపేట గ్రామానికి చెందిన హరిజన సవారన్న(72) గత కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతుండేవాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు 5వ నంబరు కిలోమీటర్ రాయి వద్ద గుర్తుతెలియని రైలు కింద పడి మృతిచెందాడు. సవారన్నకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సవారన్న రైల్వే గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి విధిని అనుసరిస్తూ నిత్యం రైల్వేట్రాక్‌పై తిరుగుతుండేవాడని బంధువులు తెలిపారు. సవారన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మనస్తాపానికి గురై యువకుడు.. మహబూబ్‌నగర్ క్రైం: భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ రాఘవేందర్గౌడ్కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీకి చెందిన మురళి(33)కు నిర్మలతో పదేళ్ల కిందట పెళ్లయ్యింది. ఈ దంపతులకు ప్రస్తుతం ఓ కొడుకు ఉన్నాడు. అయితే మురళి డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని భార్య నిర్మలకు గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేకుంటే తల్లిగారి ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన మురళీ ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలం నుంచి రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ముస్తాక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అదిగో అలంపురం
తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల్ పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడం విశేషం. అన్ని క్షేత్రాలకు, ఆలయాలకు సంప్రదాయాలకు భిన్నంగా షణ్మతాలకు నిలయంగా అలంపురం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దక్షిణకాశీ, పర శురామ క్షేత్రం, భాస్కర క్షేత్రంగా భాసిల్లుతోంది. నవబ్రహ్మ ఆలయాలు ఇవి ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహాలు ఉండటం, వాటికి నిత్యం ఆగమ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించడం కూడా విశేషం. భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే వారణాశి, (కాశీ)ని సందర్శించిన ఫలితం లభిస్తుందని స్కాంద పురాణం చెప్తోంది. నవబ్రహ్మల ఆలయాలన్నీ శివాలయాలే. బ్రహ్మ ప్రతిష్ఠించిన కారణంగా ఆ పేరు వచ్చింది. ప్రధాన ఆలయంలో శ్రీ బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతామూర్తి. కాశీలో విశ్వేశ్వరుడు, అలంపూర్‌లో బాలబ్రహ్మేశ్వరుడు వెలసి ఉన్నారు. అక్కడ కాశీ... ఇక్కడ హేమలాపురం. అలంపురం పూర్వనామం హేమలాపురం. అయితే ఇది కాలక్రమేణా రూపాంతరం చెందుతూ హేమలాపురం, హతంపురం, యోగుళాపురం, జోగుళాపురం అని రూపాంతరం చెందుతూ ప్రస్తుతం అలంపురం క్షేత్రంగా వ్యవహారంలోకి వచ్చింది. కాశీలో ఉత్తరవాహిని గంగానది... అయితే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్రా నది. కాశీలో ఉన్నట్లే అలంపురంలో కూడా 64 స్నాన ఘట్టాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా జోగుళాంబ దేవి అలంపురంలో వెలసి ఉన్నారు. గోష్పాద ముద్రిత లింగం! సర్వసాధారణంగా లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. కానీ అలంపుర క్షేత్రంలో మాత్రం బాలబ్రహ్మేశ్వరుడు గోష్పాద ముద్రిత రసాత్మక లింగంగా వెలసి ఉన్నాడు. ఆవుపాదం మోపితే ఎలాంటి ఆకృతి ఉంటుందో అదే ఆకృతిలో ఇక్కడ విగ్రహం వెలసి ఉంటుంది. పూర్వం ఈ విగ్రహంలో అనేకమైన రసాలు వెలువడుతుండగా రస సిద్ధులు కొందరు ‘పరశువేది’ అనే మూలికసహాయంతో ఆ రసాలను మిళితం చేస్తూ ఈ విగ్రహంలో నుండి బంగారాన్ని తయారు చేశారు. తద్వారా ఆ బంగారంతో ప్రధాన ఆలయానికి శైవక్షేత్రాలకు తలమానికంగా ఉన్న శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంలో అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్దవటం వెలసి ఉన్నాయి. దాదాపు 14 వందల సంవత్సరాల క్రితం 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల వంశంలో రెండవ పులకేశి ఈ ఆలయాలను నిర్మించినట్టు ఇక్కడ లభించే శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. షణ్మతాలకు నిలయంగా ఇక్కడ సౌర, శాక్తేయ, కౌమార, గాణపత్య, ౖÔð వ, వైష్ణవ వైదికాలకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. బాలబ్రహ్మేశ్వరుడు పూర్వం బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించాడు. బ్రహ్మకారణం చేత పరమేశ్వరుడు వెలసినందుకు ఈ స్వామిని బ్రహ్మేశ్వరుడు అని, విగ్రహం చిన్నదిగా ఉన్నందున బాలబ్రహ్మేశ్వరుడు అని పిలుస్తారు. ఈ విగ్రహానికి ఆనుకుని విష్ణువుకు ప్రతిరూపమైన సాలగ్రామం వెలసింది. అందుకే శివాయ విష్ణు రూపాయ... శివరూపాయ విష్ణవే...అంటూ ఈ శైవæక్షేత్రంలో ధనుర్మాస పూజలు కూడా నిర్వహిస్తారు. పాప వినాశి తీర్థం! అలంపురానికి దక్షిణాన అరమైలు దూరంలో 24 ఆలయాల సముదాయమైన పాపనాశిని తీర్థం ఉన్నది. అది అష్టాదశ తీర్థాలలో ఎంతో ప్రాముఖ్యతగలది. మిగిలిన తీర్థాలు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. 24 ఆలయాల సముదాయం... ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతలో తులతూగుతోంది. ప్రధాన ఆలయానికి చుట్టూ చిన్న, చిన్న గుడులు నిర్మించారు. ద్రావిడ, వేసర సంప్రదాయాలకు చెందిన ఆలయాలుగా వీటిని గుర్తించారు. ఈ ఆలయానికి ఉత్తర, దక్షిణ మూలలలో చక్కని ఆలయాలు, మంటపాలు ఉన్నాయి. వాటిలో స్తంభాల పైన రామాయణ గాథ శిల్పాలు, క్షీరసాగర మథనం, అపూర్వ రమణీయతలను చాటుతున్నాయి. ఈ తీర్థం శ్రీశైలం ప్రాజెక్టు మునకలో పోయినందున అక్కడి నుండి కిలోమీటర్ దూరంలో ఈ పాప వినాశిని పునః నిర్మాణం చేశారు. ‘‘లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం‘‘ అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన స్తోత్రంలో ఈ ధ్యాన శ్లోకాన్ని పేర్కొన్నారు. పూర్వం దక్షప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యాగంలో అందరి ముందు శివనింద చేయడంతో అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్ని కల్పించుకుని తాను దేహత్యాగం చేసుకుంటుంది. ఈ విషయాన్ని పరివారగణం ద్వారా తెలుసుకున్న పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడై వచ్చి అక్కడి యాగాన్ని సమూలంగా నాశనం చేసి మరణించిన సతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన భుజ స్కందంపై వేసుకుని రుద్రతాండవం చేస్తాడు. పరమేశ్వరుడి కోపాగ్ని చల్లార్చేందుకు శ్రీ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 శకలాలుగా విభజిస్తారు. ఆ భాగాలు వేర్వేరు ప్రదేశాలలో పడగా ఆది శంకరాచార్యుల వారు వాటికి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. అవే నేడు 18 శక్తి పీఠాలుగా ఉద్భవించాయి. అందులో అలంపూర్‌లో దంతపంక్తి పైభాగం పడింది. అదే జోగుళాంబ శక్తిపీఠం. నవబ్రహ్మ ఆలయాలు ప్రధాన ఆలయ ఆవరణలోనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందులో బాల, కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, పద్మ, సర్గ బ్రహ్మేశ్వర ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల మీద అష్ట దిక్పాలకులు, శివ, విష్ణు అవతారాలు, నటరాజు, పురాణ కథా శిల్పాలు, ముగ్ధ మనోహరంగా భావ గాంభీర్యం చెడకుండా సృష్టించబడ్డాయి. ఈ శిల్ప సౌందర్యం దేశ విదేశ విద్వాంసులు నుంచి ప్రశంసలు పొందింది. గరుడ, గంధర్వ, కిన్నెర కింపురుషాది మూర్తులు చూపరులకు రమణీయంగా నిలిచాయి. ఇక్కడి శిల్పాల పైన మానవ మిథునాలు, పంచతంత్ర కావ్య కథా శిల్పాలు ఆదిత్యహృదయం, రామాయణ, మహాభారత శిల్పాలు కనువిందు చేస్తాయి. ఈ దేవాలయాల మీద శ్రీమార , నయన, ప్రియన్, శ్రీ కంఠాచార్యన్ తదితర శిల్పాచార్యుల పేర్లు నేటికి కనబడుతాయి. సమీపంలో... యోగనారసింహస్వామి ఆలయం ఉంది. దీనిని ప్రహ్లాద రాయలు నిర్మించారు. లక్ష్మీదేవి, గణపతి, ఆళ్వారులు, అనంత పద్మనాభస్వామి, ఆంజనేయస్వామి వెలసి ఉన్నారు. 14వ శతాబ్దంలో నిర్మించిన సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. – దిండిగల్ ఆనంద్‌శర్మ, సాక్షి అలంపూర్